బరువు తగ్గడం ఒక్కోక్కరికి ఒక్కో అనుభవం. కొందరికి ఆహారమే ప్రధానమైతే, మరికొందరికి వర్కౌట్లే కీలకంగా ఉంటాయి. అయితే శరీరానికి అనుగుణమైనది, నిపుణుల సలహాలు సూచనలతో ఆరోగ్యదాయకంగా అనుసరిస్తే సులభంగా బరువు తగ్గడమే కాకుండా అదుపులో ఉంటుందనిచెబుతోంది అనురీత్ కౌర్. తొందరగా ఫలితం కోసం వెంపర్లాడకుండా నిలకడతో చేస్తేనే అన్ని విధాల శ్రేయస్కరమని అంటోంది. మరి ఆమె అనుసరించిన వెయిట్‌లాస్ టెక్నిక్ ఏంటి..?, ఎంత వ్యవధిలో ఎన్ని కిలోలు తగ్గిందో సవివరంగా చూద్దామా..!
సహనంతో క్రమశిక్షతో వెయిట్‌లాస్ జర్నీకి సిద్ధమైతే సత్ఫలితాలు అందుకోగలరని అంటోంది అనురీత్ కౌర్. తాను 116 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని, జస్ట్‌రెండేళ్ల వ్యవధి 56 కేజీలు పైనే తగ్గి 60 కేజీలకు చేరుకున్నట్లు పేర్కొంది. కఠినమైన ఆహార నియమాల జోలికి పోలేకదని, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ని తన దినచర్యలో భాగం చేసుకుంటూ..నిలకడగా వర్కౌట్లు చేసినట్లు తెలిపింది. కండరాలను పెంచుకునేలా వ్యాయమాలు చేయడం నేర్చుకున్నట్లు పేర్కొంది.
కొవ్వు తగ్గాలంటే కేలరీల లోటు అవసరమని గుర్తించానని, అందుకనే కేలరీల లోటుతో తినేదాన్ని అని వెల్లడించింది. తక్కువ తిని ఎక్కువ బరువు తగ్గడం అనేది ఉండదని, సరైన పద్ధతిలో తింటే బరువు ఆటోమేటిగ్గా తగ్గుతామని అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.
మన భోజనం ఎలా ఉండాలంటే..
పరిమాణం, ఫైబర్, పోషకాలు కీలకం
కండరాలు మద్దతు కోసం, సంతృప్తిని కలిగించేలా ప్రోటీన్ ఉండాలి.
శరీరానికి శిక్షణ శక్తి కోసం మోతాదులో కార్బోహైడ్రేట్లు
వీటి తోపాటు అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగు మోతాదులో తీసుకోవాలి.
ముఖ్యంగా కొన్ని ఆహారాలు కేలరీలు తక్కువగా ఉన్నా..ఎక్కువ పరిమాణంలో తినేలా చేసి, సంతృప్తిని అందించేలా ఉంటాయి. అలాగే కొన్ని తక్కువ పరిమాణంలోనే ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని బేరీజు చూసుకుని తీసుకుంటే..బరువు తగ్గడం సులభం అని అంటోంది. అలాగే బరువు తగ్గడం అంటే కొవ్వు కరిగించుకోవడం అని తక్కువ భోజనంతో సరిపెట్టుకుంటారు. అది ముమ్మాటికి సరైనది కాదని అంటోంది.
ఇలా దీర్ఘకాలం తక్కువగా తింటే మహిళల్లో రుతు సంబంధిత సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తోంది. ఆమె సంతృప్తికరమైన సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే..సులభంగా బరువు తగ్గగలరని నమ్మకంగా చెబుతోంది అనురీత్. ఇక్కడ సరైనది తినడమే ప్రధానమని గ్రహించమని కోరుతోంది అనురీత్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి మరి..!.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అనుసరించే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహా మేరకు పాటించడం ఉత్తమం.
ఇదీ చదవండి: ఎలక్ట్రీషియన్ నుంచి మాస్టర్ చెఫ్ విజేత, రెస్టారెంట్ యజమాని రేంజ్‌కి..!)


