శ్రీపంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది. ఇవాళ(శుక్రవారం) గంగమ్మ ఒడికి గణేశుడు చేరారు. క్రేన్ నెంబర్ -4 దగ్గర నిమజ్జనం జరగ్గా.. భక్తులు బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. డీజేలు, డ్యాన్సులతో యువత సందడి చేశారు.


