breaking news
Khairatabad ganesh nimajjanam
-
ప్యారడైజ్ పాట.. దానం ఆట!
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం నుంచే వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడ బందోబస్తులో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో కలిసి ప్యారడైజ్ సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. నాగేందర్ డ్యాన్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకోగా వందలాది మంది యువకులు ఆయనకు జతకలిసి స్టెప్పులేశారు. Former Khairatabad MLA Danam Nagender joined the celebrations and danced along with police personnel for Aaya Sher song from The Paradise movie during the Bada Ganesh procession in Hyderabad. #DanamNagender #Khairatabad #Hyderabad #Telangana #GaneshChaturthi #TheParadise pic.twitter.com/NuIklmTG4t— Sudhakar Udumula (@sudhakarudumula) September 25, 2026 -
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)
-
బడా గణేష్ నిమజ్జనానికి ఆలస్యం.. ఎందుకంటే ?
-
ట్యాంక్‌బండ్‌పై జనసంద్రం.. కనువిందు చేస్తున్న నిమజ్జన దృశ్యాలు
-
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఎక్స్ క్లూజివ్ డ్రోన్ దృశ్యాలు
-
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. కనువిందు చేసే దృశ్యాలు
-
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణేశుడు
గణేశ్ నవరాత్రి వేడుకలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యారు. భారీ ఊరేగింపులతో భాగ్యనగరం భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా మారింది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆలస్యమైంది.ట్యాంక్‌బండ్‌పై బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తిశోభాయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులుక్రేన్ నెం 12 దగ్గరు బాలాపూర్ గణేశుడి నిమజ్జనంఈ ఏడాది రూ. 39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూట్యాంక్బండ్ దగ్గర కోలాటాలు, డప్పు నృత్యాలతో సందడిఎంజే మార్కెట్ దగ్గర సందడి వాతావరణంట్యాంక్బండ్కు తరలివెళ్తున్న గణనాథులుగంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణేశుడుహుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం క్రేన్ నెంబర్ -4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం బైబై గణేశా అంటూ భక్తుల వీడ్కోలుమారుమోగిన గణపతి బప్పా మోరియా నినాదాలుభక్తులతో కిక్కిరిసిన ట్యాంక్‌బండ్ పరిసరాలుడీజేలు, డ్యాన్సులతో యువత సందడి ట్యాంక్ బండ్ మీద కోలాహలంమరికాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంభారీగా తరలి వచ్చిన భక్తజనంగణపయ్య వీడ్కోలు పలుకుతూ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తుల చిందులుహుషారుగా స్టెప్పులు కలిపిన పోలీసు సిబ్బందిఆలస్యంగా మొదలైనప్పటికీ.. పోలీసుల చొరవతోనే త్వరగతిన ముగిసిన శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడుముగిసిన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రహుస్సేన్ సాగర్ క్రేన్ వద్దకు చేరిన మహాగణపతిమొదలైన వెల్డింగ్ పనులుఅనుకున్న టైం కంటే గంట ముందుగానే పూర్తి కానున్న నిమజ్జనం!సచివాలయం చేరుకున్న గణేశుడుసెక్రటేరియెట్ వద్ద ఖైరతాబాద్ గణేశుడి సందడిభక్తుల కోలాహలం.. గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమోగుతున్న ప్రాంతంబడా గణేశుడితో సెల్ఫీల కోసం ఎగబడుతున్న జనంపక్కకు తప్పుకోవాలంటూ పోలీసుల విజ్ఞప్తికాసేపట్లో ట్యాంక్‌బండ్‌పైకి చేరుకోనున్న గణపయ్యఇప్పటికే ఆలస్యం కావడంతో త్వరగతిన నిమజ్జనం పూర్తి చేయాలనే ఆలోచన జెట్ స్పీడ్‌గా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రక్రేన్ హీటెక్కడంతో 3గంటల ఆలస్యంగా ప్రారంభమైన ఖైరతాబాద్ శోభాయాత్రతెలుగు తల్లి ఫ్లై ఓవర్ దాటి.. సచివాలయం రోడ్డుకు చేరిన బడా గణేశుడుభక్తుల కోలాహలం నడుమ ఎక్కడా ఆగకుండా ముందుకు సాగుతున్న శోభాయాత్రకాసేపట్లో ట్యాంక్ బండ్‌కు మహాగణపతిఒంటి గంటలోపే ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకునే చాన్స్భయమే కానీ బాధ్యతగా చేస్తాం: ఆల్తాఫ్బడా గణేశుడి నిమజ్జనం కోసం ప్రత్యేక క్రేన్సాక్షి న్యూస్‌తో ముచ్చటించిన క్రేన్ యజమాని ఆల్తాఫ్గత 5 ఏళ్లుగా ఖైరతాబాద్ బడా గణేశుడ్ని నిమజ్జనం చేస్తున్నాం: ఆల్తాఫ్తొలి ఏడాది(2021లో) చాలా భయపడ్డాం: ఆల్తాఫ్కానీ ఆ తర్వాత వచ్చిన అనుభవంతో ఈజీగా నిమజ్జనం చేస్తున్నాం: ఆల్తాఫ్ఈసారి మరింత అడ్వాన్స్ టెక్నాలజీ క్రేన్ ఏర్పాటు చేశాం: ఆల్తాఫ్నిమజ్జనం చేయడానికి మాకు 10 నిమిషాలు పడుతుంది: ఆల్తాఫ్వెల్డింగ్ ,ఇతర పనుల వల్ల ఆలస్యం అవుతుంటుంది: ఆల్తాఫ్అంత భారీ స్థాయి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలంటే మాకు భయమే! కానీ భాధ్యత తొ చేస్తాం: ఆల్తాఫ్టెలిఫోన్ భవన్ వద్దకు బడా గణేశుడుఎక్కడా ఆగకుండా ముందుకు సాగుతున్న ఖైరతాబాద్ గణేశుడుటెలిఫోన్ భవన్ దాటి ముందుకు సాగుతున్న శోభాయాత్రసెక్రటేరియెట్ ముందు నుంచి నిమజ్జన ప్రాంతానికి తరలింపుట్యాంక్బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం !విగ్రహం చేరుకున్నాక.. వెల్డింగ్ పనుల కోసం గంట సమయం పట్టే చాన్స్ కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్రఎక్కడా ఆగకుండా ముందుకు సాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతిభారీగా తరలి వచ్చిన జనంభవనాల నుంచి పూలు జల్లుతున్న భక్తులుభక్తులు ముందుకు రాకుండా చూసుకుంటున్న నిర్వాహకులుడ్రోన్ల ద్వారా పరిస్థితుల్ని గమనిస్తున్న పోలీసులుశోభాయాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపురాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియెట్.. ఇలా ముందుకు సాగి ట్యాంక్ బండ్ చేరుకోనున్న బడా గణేశుడుక్రేన్ నెంబర్ 4 దగ్గరే నిమజ్జనం?!మధ్యాహ్నాం 2 గంటలకల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తున్న అధికారులు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభంఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం3గంటలు ఆలస్యంగా ప్రారంభమైన శోభాయాత్ర విగ్రహం ముందు వైపు రాకుండా రెండంచెల రోప్పార్టీభక్తులను ముందు వైపునకు అనుమతించని పోలీసులుఎక్కడా ఆపకుండా బడా గణేశుడ్ని తరలించేలా ప్లాన్క్రేన్ నెంబర్ 5 వద్ద జరగనున్న నిమజ్జనంబడా గణేశుడి చెంత దానం సందడిఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సందర్భంగా దానం నాగేందర్ సందడిపార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానంను అనర్హుడిగా ప్రకటించిన కోర్టులుత్వరలో ఉప ఎన్నిక.. పోటీ చేస్తానని స్పష్టం చేసిన దానంఇవాళ ఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద హుషారుగా చిందులేసిన దానం బడా గణేశుడి కోసం రంగంలోకి అధికారులుఇంకా ప్రారంభం కాని ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ఆలస్యం!గత రాత్రి భారీ క్రేన్‌లో సాంకేతికత లోపంఈ ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కావాల్సిన శోభాయాత్రఇంకా ప్రారంభం కాని శోభాయాత్రబడా గణేశుడి శోభాయాత్ర, నిమజ్జనం వీక్షించేందుకు భారీగా చేరుకుంటున్న జనంభారీగా జనం వస్తే నిమజ్జనం ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశంసాయంత్రం కల్లా నిమజ్జనం జరిగే చాన్స్నిర్వాహకులతో మాట్లాడిన అధికారులు ఎక్కడా ఆగకుండా ముందుకు వెళ్లాలని సూచనవీలైనంత త్వరగా శోభాయాత్ర పూర్తి చేసేలా ప్రణాళిక1గం. కల్లా క్రేన్ నెంబర్ 5 వద్దకు చేరుకునేలా ప్లాన్అక్కడ గంటసేపు వెల్డింగ్ పనులు కొనసాగే చాన్స్ఆ తర్వాత కొనసాగనున్న నిమజ్జన ప్రక్రియఅన్ని సజావుగా సాగితే.. మధ్యాహ్నాం 2 కల్లా పూర్తి కానున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మరింత ఆలస్యంగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రఉదయం 6గం.కే ప్రారంభం కావాల్సిన శోభాయాత్రబడా గణేశ్‌ను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ క్రేన్‌లో సాంకేతిక లోపంఅనుకున్న సమయానికంటే ఇప్పటికే రెండు గంటల ఆలస్యంశోభాయాత్ర ప్రారంభానికి మరో గంట పట్టే అవకాశంఇప్పటికే భారీగా చేరుకున్న భక్తులుఖైరతాబాద్ పురవీధుల్లో భక్తులు పెరిగితే.. శోభాయాత్ర మరింత ఆలస్యం అయ్యే అవకాశంమహాగణపతి శోభాయాత్ర.. పోలీసుల హెచ్చరికడ్రోన్ల వినియోగం పై పోలీసుల ఆంక్షలుఖైరతాబాద్ గణనాథుడిని శోభాయాత్ర, నిమజ్జనం.. పోలీసుల అలర్ట్శోభాయాత్ర, నిమజ్జనం చిత్రీకరించేందుకు భారీగా వచ్చిన ప్రైవేట్ డ్రోన్లు, యూట్యూబర్లుడ్రోన్లు వాడితే కేసులు పెడుతామంటూ పోలీసుల హెచ్చరిక ప్రకటనలు నిమజ్జనం ఆలస్యం కానివ్వం: సీపీ సజ్జనార్కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్రవాహనపూజ, మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సజ్జనార్హైడ్రాలిక్ క్రేన్ సమస్య వల్ల ప్రక్రియ కాస్త ఆలస్యమైందన్న నగర కమిషనర్అనుకున్న సమయానికి మహాగణపతి నిమర్జనం పూర్తి చేస్తామని ప్రకటన ఖైరతాబాద్ గణేశుడిపై ఉత్కంఠ69 అడుగుల మహాగణపతిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లుటస్కర్పైకి చేరిన తర్వాతే శోభాయాత్రకు వేగంభారీ విగ్రహం కావడంతో ప్రతి అడుగులోనూ అప్రమత్తతక్రేన్ రిపేర్‌తో ఆలస్యం.. సమయం పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న ఉత్కంఠ12 గంటల్లోపే నిమజ్జనం పూర్తి చేయడమే లక్ష్యంహుస్సేన్సాగర్లో భారీ విగ్రహం కోసం ప్రత్యేక నిమజ్జన పాయింట్క్రేన్ నెంబర్ 4తో చేపట్టనున్న నిమజ్జన ప్రక్రియమహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు ట్యాంక్‌బండ్‌పై భారీగా భక్తులుఆలస్యమైనా.. గడువులోపే బడా గణేశుడి నిమజ్జనం పూర్తవుతుందా?కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర పూర్తైన వెల్డింగ్ పనులుకాసేపట్లో వాహన పూజపూజ తర్వాత మహాగణపతికి హారతిఅనుకున్న సమయం కంటే ఆలస్యంగా శోభాయాత్రఖైరతాబాద్ వద్ద భారీగా బందోబస్తు.. 523 మంది పోలీసు సిబ్బంది మోహరింపుశోభాయాత్ర సాగే మార్గంలో, నిమజ్జనం జరిగే ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఆలస్యంగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం?ఆలస్యంగా ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకిందటి ఏడాది.. ఆరు గంటలకే మొదలైన ఊరేగింపుభారీ క్రేన్ రిపేర్‌తో ఈ ఏడాది ఆలస్యం12గంటల లోపే నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయంఅనుకున్న టైంలోపే పూర్తవుతుందా? అనే ఉత్కంఠబడా గణేశుడు మునిగేందుకు హుస్సేన్ సాగర్‌లో 25 లోతు వరకు పూడిక తీసి వేతనిమజ్జన ప్రక్రియ కోసం 30 అడుగుల వెడల్పుతో ప్రత్యేక ప్రాంతం ఏర్పాటు టస్కర్ పైకి ఖైరతాబాద్ గణనాథుడిని పెడుతున్న సిబ్బందిశోభాయాత్ర వాహనం పైకి ఖైరతాబాద్ గణనాథుడిని చేరుస్తున్న సిబ్బందిశోభయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ బడా గణేష్ఈ ఏడాది శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి అవతారంలో దర్శనం ఇచ్చిన గణనాధుడు69 అడుగుల ఎత్తుతో ఐదు ముఖాలు, ఐదు తలలపై కిరీటాలతో దర్శనం విగ్రహానికి కుడివైపున 15 అడుగుల సోమనాథ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళికా మాత ప్రతిమలను ఏర్పాటుఈ ఏడాది కూడా పర్యావరణ హిత గణనాథుడిగా దర్శనం ఖైరతాబాద్ గణనాథుడిని తీర్చిదిద్దిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు గుజరాత్‌కు చెందిన సుమారు 150 మంది కళాకారులుదాదాపు 80 రోజుల పాటు శ్రమించి రూపుదిద్దుకున్న విగ్రహంఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ ఆలస్యం మండపం నుండి ఇంకా టస్కర్ మీదికి వెళ్లని గణనాథుడు రాత్రి హీట్ ఎక్కువై భారీ క్రేన్ రిపేర్పోయిన ఏడాది ఈపాటికే టస్కర్ మీద గణనాథుడు సిద్ధం అయితే శోభాయాత్ర త్వరగా చేస్తామంటున్న పోలీసులుట్యాంక్ బండ్ చుట్టూ డీజేల హోరుజంట నగరాల్లో ఘనంగా ప్రశాంతంగా కొనసాగుతున్న గణేశుడి నిమజ్జనం ట్యాంక్ బండ్ వద్ద కోలాహలంహుస్సేన్ సాగర్, చెరువుల్లో కొనసాగుతున్న ప్రక్రియతెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు చేరుకుంటున్న గణనాథుడుప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులుహైదరాబాద్, రంగారెడ్డి ‘క్యూర్’ పరిధిలో స్కూళ్లకు సెలవుమంచి నీటి వసతి, వైద్య ఇతరత్ర హెల్ప్ లైన్ల ఏర్పాటుఎంఎంటీఎస్ రైలు సర్వీసులపై దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక దృష్టిఅర్ధరాత్రి ఒంటిగంట దాకా నడవనున్న మెట్రోప్రత్యేక బస్సులు నడుపుతున్న టీజీఎస్ఆర్టీసీ -
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రంగం సిద్ధం.
-
వేడుకకు వేళాయే...రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర (ఫొటోలు)
-
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి.. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిఘా
సాక్షి,హైదరాబాద్: నగరంలో వైభవంగా జరుగుతున్న వినాయక ఉత్సవాల ముగింపు వేడుకలకు, ఈ నెల 25న శుక్రవారం జరగనున్న మహానిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. మూడో రోజు నుంచే ప్రారంభమైన విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే నగరంలో ప్రశాంతంగా సాగుతుండగా, చివరి రోజు బాలాపూర్ గణేశ్ నుంచి జరిగే తుది శోభాయాత్రను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవంతంగా పూర్తిచేసేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, పొరుగు జిల్లాల నుంచి పోటెత్తే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ బందోబస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సమగ్ర ముందస్తు కసరత్తు.. శాఖల సమన్వయం, ఉత్సవాల నిర్వహణ కోసం మూడు నెలల ముందు నుంచే పకడ్బందీ కసరత్తు చేశారు. ధూల్‌పేట్, లక్ష్మీదేవిగూడ విగ్రహ తయారీదారులతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, అగ్నిమాపక, హైడ్రా తదితర ప్రభుత్వ విభాగాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పలుమార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో 14,929 మండపాలకు అనుమతులు మంజూరు చేసి, జియో ట్యాగింగ్ చేశారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన 32,878 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.అత్యాధునిక సాంకేతికతతో నిఘా శోభాయాత్రను క్షణక్షణం పర్యవేక్షించేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించారు. ఊరేగింపు సాగే మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించగా, 24 డ్రోన్లు, దాదాపు 100 హైరైజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు.20 వేల మందితో పహారా.. కేంద్ర బలగాల మోహరింపు శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ కమిషనరేట్ నుంచి దాదాపు 20 వేల మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 8,142 మంది సిబ్బందితోపాటు 4 రాపిడ్ యాక్షన్ ఫోర్స్(RAF) కంపెనీలు, 2 సీఆర్పీఎఫ్ కంపెనీలు, 53 బీడీ టీంలను మోహరించారు.నిబంధనలు కఠినతరం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్దాలు చేసే పరికరాలు, బాణసంచా కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే పరికరాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం 26 షీ-టీమ్స్ బృందాలు విధుల్లో ఉంటాయి. ఆపదలో ఉంటే డయల్ 112 లేదా షీ-టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555ను సంప్రదించాలని సూచించారు.సీపీ సజ్జనార్ విజ్ఞప్తి నగర ప్రజలంతా సంయమనం పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ వీసీ సజ్జనార్ కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, పుకార్లు సృష్టించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ విశిష్ట సంస్కృతి అయిన ‘గంగా-జమునా తెహజీబ్’ను కాపాడుకుంటూ పోలీసులకు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
దర్శనానికి మరికొద్ది గంటలే.. ఖైరతాబాద్‌కు పోటెత్తిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి మరికొద్ది గంటలే మిగిలాయి. నేడు అర్ధరాత్రితో భక్తులకు దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో.. చివరి రోజు గణనాథుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఈసారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరాడు. ఇప్పటివరకు( సెప్టెంబర్ 22, మంగళవారం దాకా) 18 లక్షల మందికిపైగా దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజైన మంగళవారం కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి నేడు ఆఖరి రోజు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చివరి రోజు కావడంతో లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.రేపటి నుంచి నిమజ్జన ఏర్పాట్లుఅర్ధరాత్రితో దర్శనం ముగిసిన తర్వాత బుధవారం ఉదయం నుంచి మహాగణపతి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. భారీ విగ్రహాన్ని తరలించే మార్గం, క్రేన్, వాహనాలు, భద్రత తదితర అంశాలపై అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.ఎల్లుండి నిమజ్జనంఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఎల్లుండి జరగనుంది. నిమజ్జనాన్ని పురస్కరించుకుని పోలీసులు, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే.. మధ్యాహ్నాం కల్లా మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన బైంసా గణేశుడి శోభాయాత్ర -
ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు)
-
కన్నుల పండుగగా మహాగణపతి నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు. భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతి నిమజ్జనం ఘనంగా జరిగింది. ట్యాంక్ బంక్‌లో క్రేన్-4 వద్ద మహాగణపతి నిమజ్జనం అయ్యింది. ఈ నిమజ్జనం సందర్భంగా మహాగణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ఇక, శనివారం ఉదయం ఏడు గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో నిమజ్జనం జరిగింది. -
ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్రలో కిక్కిరిసిన జనం (ఫొటోలు)
-
భారీ గజమాలతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. భారీగా భక్తుల రద్దీ (ఫొటోలు)
-
Hyd: గణేష్ నిమజ్జన కోలాహలం
ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం లైవ్ అప్డేట్స్.. -
Watch: గంగమ్మ ఒడికి మహా గణపయ్య
హైదరాబాద్, సాక్షి: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వేలమంది భక్తుల ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు గణపతినాథుడు. అనుకున్న టైం కంటే ముందే శోభాయాత్ర మొదలుకాగా.. అంతే త్వరగతిన ట్యాంక్‌బండ్‌కి విగ్రహాన్ని చేర్చేందుకు పోలీసులు యత్నించారు. అయితే మధ్యలో అరగంటపాటు శోభా యాత్ర నిలిచిపోయింది. తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నిమజ్జనంలో పాల్గొని అరుదైన ఫీట్ సాధించారు.స్పెషల్ క్రేన్‌తో70 అడుగుల ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కోసం సూపర్ క్రేన్‌ను శంషాబాద్ నుంచి తెప్పించారు. దాదాపు 350 టన్నుల బరువుల్ని మోయగలిగే ఆ క్రేన్ సాయంతోనే నిమజ్జనాన్ని ఎలాంటి అవాంతరం లేకుండా పూర్తి చేశారు.జనసంద్రంగా ఎన్టీఆర్ మార్గ్అనుకున్న టైం కంటే అరగంట ముందే ఖైరతాబాద్ గణేషుడు కదిలాడు. రెండంచెల రోప్ వ్యవస్థతో త్వరగతిన తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మహా గణపతి నిమజ్జన నేపథ్యంలో.. ఎన్టీఆర్ మార్గ్‌లో మిగతా విగ్రహాలను ఆపేశారు. అందుకు భక్త జనం కూడా సపోర్ట్ చేశారు. ఒకానొక టైంలో త్వరగానే నిమజ్జనం పూర్తవుతుంది భావించారంతా. అయితే సచివాలయం వద్ద అరగంట సేపు విగ్రహాం ఆగిపోయింది. దీంతో అనుకున్న టైంకే విగ్రహ నిమజ్జనం పూర్తైంది. ఇంకోవైపు వాతావరణం చల్లబడడంతో జనం ఒక్కసారిగా ఎక్కువగా వచ్చారు.స్వల్ప లాఠీ ఛార్జ్ఖైరతాబాద్ విగ్రహా నిమజ్జనం అనంతరం.. భారీగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న గణపయ్యలకు పోలీసులు అనుమతించారు. దీంతో ఒక్కసారిగా రద్దీ నెలకొంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు అక్కడి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కిన యువతకు పోలీసులు సూచించారు. అయినా వాళ్లు వినకపోవడంతో స్వల్ప లాఠీ ఛార్జి చేశారు.సీఎం రేవంత్ పర్యవేక్షణమునుపెన్నడూ లేని విధంగా గణేష్ నిమజ్జనానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర మహా గణపతి నిమజ్జన ఏర్పాట్లతో పాటు మిగతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. క్రేన్ల డ్రైవర్లతో పాటు ఇతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, షిఫ్ట్‌లవారీగా పని చేయించుకోవాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిమజ్జనం పూర్తయ్యే చూడాలని అధికారుల్ని ఆదేశించారు. Khairtabad #badaganesh ji Shobayatra slowly moving towards telugu thalli flyover #ganeshnimmajjnam #ganeshimmersion2024#GanpatiBappaMorya pic.twitter.com/vSuVZHeorS— Hyderabad City Police (@hydcitypolice) September 17, 2024 ఈసారి సరికొత్త రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ లంబోదరుడుఈసారి కోటి రూ.10 లక్షల ఆదాయంహుండీ ద్వారా రూ.70 లక్షలుప్రకటనలు, హోర్డింగ్‌లతో మరో రూ.40 లక్షలు తొలిసారిగా ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు గత పదిరోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు కమిటీ వెల్లడిరికార్డు స్థాయిలో భక్తుల దర్శనంఏటా పెరుగుతున్న భక్తుల తాకిడిసెప్టెంబర్ 6వ తేదీన మహాగణపతి ఆగమన వేడుక11 రోజులపాటు నిర్విఘ్నంగా సాగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలుమహాగణపతిని దర్శించుకున్న లక్షల మంది భక్తులు, సందర్శకులు 70 అడుగుల మహా గణపతిభాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో.. దేశవ్యాప్తంగానూ ఖైరతాబాద్ గణేషుడికి గుర్తింపుఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తిఅందుకే ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహంశిల్పి చిన్న స్వామి రాజేందర్ గణేషుడికి ఒకటిన్నర రోజుల్లో అలంకరణ.. 200 మంది కార్మికుల శ్రమశ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా కొలువుదీరిన విష్నేషుడుఈ ఏడాది శ్రీ సప్త ముఖ మహాశక్తి గణపతి గా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి.కుడి వైపు శ్రీ నివాస కళ్యాణం ఎడమ వైపు పార్వతి కళ్యాణం..భారీ విగ్రహం కింద వైపు అయోధ్య బాలరాముడి విగ్రహం ఏర్పాటు..పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం ఏర్పాటు..ఈఏడాది కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్ బరువు సుమారు 40 నుంచి 50 టన్నులుపెద్ద ఎత్తున ఐరన్, పిచూ.. మట్టి వినియోగం.. -
Khairatabad Ganesh 2023 Photos: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
Khairatabad Ganesh 2023: ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తజన సందోహం (ఫోటోలు)
-
కోలాహలంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం
-
మహాగణపతి నిమజ్జనం 11.30 లోపే..
ఖైరతాబాద్: ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ రామ్మోహన్‌లు వెల్లడించారు. ఈ సంవత్సరం నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని సాగర్‌లో పూర్తిగా నిమజ్జనం అయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. అలాగే ఉదయం 11.30 కల్లా మహాగణపతి నిమజ్జన ఘట్టం పూర్తవుతుందన్నారు. సోమవారం వీరు ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫారుకీ, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి ఖైరతాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 65 సంవత్సరాల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్అండ్బి, వాటర్‌వర్క్స్, ఇంజనీరింగ్, హెల్త్, జీహెచ్ఎంసీ, విద్యుత్ తదితర శాఖల సాయంతో ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. సెన్సేషన్ థియేటర్, ఖైరతాబాద్ రైల్వేగేటు, మింట్ కాంపౌండ్ రోడ్లను వినాయక చవితి లోపు ఆధునీకరించాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని వైపులా ఎల్ఈడీ విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వినతి మేరకు ఉత్సవాల 9 రోజులు మహాగణపతి ప్రాంగంలో కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటుచేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌కు, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. పూర్తిగా నిమజ్జనం చేస్తాం.... ప్రతీ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయిన నాలుగైదు రోజుల తర్వాత కూడా నీటిలో సగం తేలుతూ కనిపిస్తుందని, ఈ సంవత్సరం అలా కాకుండా ప్రత్యేకంగా నిపుణుల పర్యవేక్షణలో మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేవిధంగా చూస్తామని తెలిపారు. ఇందుకు సాగర్‌లో నిమజ్జనం గావించే ప్రాంతాల్లో లోతైన ప్రాంతాన్ని గుర్తించామని మంత్రి వెల్లడించారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీజీపీ, సీపీ ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే ఉంటుందని, విద్యుత్ సరఫరా విషయంలో అధికారులు అలర్ట్‌గా ఉంటారన్నారు. మహాగణపతి నిమజ్జనం 11.30 లోపే పూర్తి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు లక్షలాది మందికి ఆసక్తి ఉంటుందని..అందుకే ఈ సంవత్సరం కూడా నిమజ్జనాన్ని ఉదయం 11.30 లోపే పూర్తిచేస్తామని, ఇందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ అంగీకరించాయని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీ సాయంతో మహాగణపతి నిమజ్జనం పూర్తిగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాగణపతి ప్రాంగణంలోని రోడ్లన్నీ వైట్ టాపింగ్ రోడ్లుగా ఆధునీకరిస్తామని తెలిపారు. గత సంవత్సరం 33 వేల వినాయక విగ్రహాలు ఉంటే ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశముందన్నారు. ఈ సంవత్సరం నిమజ్జనంకోసం ఇప్పటికే 33 చెరువుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, 29 వినాయక పాండ్స్ కూడా పూర్తిచేసినట్లు మేయర్ తెలిపారు. పర్యవేక్షక పర్యటనలో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, డి.ఐ నర్సింలు, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ డీఎంసీ గీతారాధిక, ఎఎంఓహెచ్ భార్గవర్ నారాయణ, జీహెచ్ఎంసీ ఎఈ శరత్‌బాబు, ఈఈ నర్సింగ్‌రావు, డీఈ విజయకుమార్, ఖైరతాబాద్ ఎమ్మార్వో కృష్ణకుమార్, విద్యుత్ ఎఈ నర్సింహ్మస్వామి, డీఈ వెకంటయ్య, ఏడీఈ రమేష్, ఏఈ గంగారాం, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్, భాగ్యనగర్ గణేష్ ఉత్సివ కమిటీ నాయకులు భగవంతరావు, స్థానిక నాయకులు మహేందర్‌బాబు, చందు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
'అర్థరాత్రిలోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం'
హైదరాబాద్: వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అనురాగ శర్మ పేర్కొన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనుకున్న టైంలోనే పూర్తి చేశామని చెప్పారు. బాలాపూర్ గణేష్ శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అర్థరాత్రి లోపు బాలాపూర్ గణనాథుడిని నిమజ్జనం చేస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా, వినాయక నిమజ్జనాలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్ సర్వేలో నాయిని వెంట డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరిగింది. 6 గంటల్లో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం రికార్డు సమయంలో పూర్తి అయింది. బాలాపూర్ గణేష్ శోభాయత్ర ఇంకా కొనసాగుతోంది. చార్మినర్ మీదుగా బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర ఎమ్జే మార్కెట్ వైపుగా కొనసాగుతోంది. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రూ. 14.65 లక్షలు పలికింది. గతంలో కంటే రూ. 4.33 లక్షలు ఎక్కువ పలికింది. వేలం పాటలో బడంగ్‌పేట గణేష్ లడ్డూ రూ. 5.21 లక్షలు పలికింది. -
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
-
నిమజ్జనోత్సాహం, మహాగణపతి నిమజ్జనం


