
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు. భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతి నిమజ్జనం ఘనంగా జరిగింది. ట్యాంక్ బంక్‌లో క్రేన్-4 వద్ద మహాగణపతి నిమజ్జనం అయ్యింది. ఈ నిమజ్జనం సందర్భంగా మహాగణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ఇక, శనివారం ఉదయం ఏడు గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో నిమజ్జనం జరిగింది.