సీఎస్‌ పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగించండి | Extend the tenure of the CS for another 3 months | Sakshi
Sakshi News home page

సీఎస్‌ పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగించండి

Mar 10 2026 3:36 AM | Updated on Mar 10 2026 3:36 AM

Extend the tenure of the CS for another 3 months

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా, మరో 3 నెలలు పొడిగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీఓపీటీ)కి ప్రభుత్వం లేఖ రాసింది. వాస్తవానికి కె.రామకృష్ణారావు గతేడాది ఆగస్టు 31న పదవీవిరమణ చేయాల్సి ఉండగా, ఆయ న పదవి కాలాన్ని ఏడు నెలలు పొడిగించడాని కి అప్పట్లో కేంద్రం అనుమతిచ్చింది. 

తాజాగా రెండోసారి మరో 3 నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, కేంద్రం తీసుకోనున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కేంద్రం అనుమతిస్తే మరో 3 నెలల పాటు రామకృష్ణారావు సీఎస్‌గా కొనసాగుతారు. లేనిపక్షంలో సీనియారిటీ ప్రకారం ముందంజలో ఉన్న ఐఏఎస్‌ అధికారులు జయేశ్‌ రంజన్, వికాస్‌రాజ్‌లలో ఒకరిని కొత్త సీఎస్‌గా నియమించే అవకాశముంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement