breaking news
Telangana Government
-
సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో హైడ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంటోన్మెంట్‌లోని 40 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.కంటోన్మెంట్‌లోని వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్దేనని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌ను ఏకంగా 219 రోజుల ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది.ఇదే భూమికి సంబంధించి హైకోర్టు తీర్పును ఉల్లంఘించి, శాంత శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ సంస్థ భూమిలో హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్ ద్వారా స్టే పొందడం గమనార్హం. శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా, న్యాయవాదులు అల్లంకి రమేష్, మహమ్మద్ జీషన్, మమత ఆర్ వాదనలు వినిపించారు. ఇదీ చదవండి : కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు -
‘క్యూర్’ బిల్లు.. హైదరాబాద్ పాలనలో కీలక మార్పులే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం ప్రతిపాదించిన ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు– 2026’ (‘క్యూర్’ బిల్లు) కార్పొరేషన్లకు పాలన బాధ్యతలు అప్పగిస్తూనే.. కీలక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృత పర్యవేక్షణ, ఆదేశాలు, అధికార బదలాయింపు, సంస్థల పునర్వ్యవస్థీకరణ, అవసరమైతే నేరుగా బాధ్యత చేపట్టే అధికారాలను కలి్పస్తున్నట్లు ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.సీఎం చైర్మన్‌గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ క్యూర్ పాలనకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. విధాన దిశ, ప్రాధాన్యాలు, ప్రణాళికలు, వివిధ శాఖల సమన్వయంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కన్వీనర్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. కార్పొరేషన్ల కమిషనర్లు, సీపీలు, కలెక్టర్లు, విద్యుత్, జలమండలి, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా అధికారులు సభ్యులుగా ఉంటారు.నిరంతర వైఫల్యం, విధులు నిర్వర్తించలేకపోవడం, అధికార దుర్వినియోగం లేదా ఆర్థిక ముప్పు వంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కార్పొరేషన్లను రద్దు చేయవచ్చు. అయితే.. ముందుగా కారణాలు వెల్లడించి వివరణకు అవకాశం ఇవ్వాలి.మేయర్, డిప్యూటీ మేయర్‌పై చర్య విధుల్లో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, చట్టపరమైన ఆదేశాల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం వంటి సందర్భాల్లో ప్రభుత్వం మేయర్, డిప్యూటీ మేయర్‌ను తొలగించవచ్చు. అంతకు ముందు వివరణకు అవకాశం కల్పించాలి.కమిషనర్ నియామకంకమిషనర్ను ప్రభుత్వం నియమిస్తుంది. అయితే.. నిరంతర వైఫల్యం, కార్పొరేషన్ తీర్మానాల అమలులో నిర్లక్ష్యం వంటి కారణాలతో మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది తొలగించాలని ఓటు వేస్తే ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు.రికార్డులు కోరడం, తనిఖీలు చేయించడం, విధులు నిర్వర్తించాలని ఆదేశించడం, సంబంధిత తీర్మానాలను నిలిపివేయడం/రద్దు చేయడం, అవసరమైతే ప్రత్యామ్నాయ వ్యక్తిని నియమించడం, మేయర్ లేదా సభ్యులను సస్పెండ్ చేయడం వంటి అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి.ఆదేశాలు పాటించకపోతే నేరుగా జోక్యం ప్రభుత్వ ఆదేశాలను కార్పొరేషన్ లేదా సంబంధిత సంస్థ అమలు చేయకపోతే, వివరణకు అవకాశం ఇచి్చన అనంతరం ప్రభుత్వం ఆ పనిని తానే చేపట్టే అవకాశం ఉంటుంది.సర్కిళ్లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ వార్డులు, సర్కిళ్లు, జోన్ల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, విలీనం లేదా రద్దుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. వివిధ శాఖల పరిధులను కూడా వీటితో సమన్వయం చేయవచ్చు.ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వరదలు, భారీ వర్షాలు, ఇతర విపత్తుల నివారణ, సిద్ధత, స్పందన, పునరుద్ధరణ కోసం ప్రత్యేక క్యూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. నీటి చార్జీకి అదనంగా ప్రభుత్వం నిర్ణయించే రేట్ల ప్రకారం సివరేజీ చార్జీ విధించవచ్చు. అడ్వర్టయిజ్‌మెంట్స్ రెగ్యులేటరీ కమిటీ ద్వారా హోర్డింగులు, సైన్ బోర్డులు, ఇతర ప్రకటనల అనుమతులు, నియంత్రణ చేపట్టనున్నారు. పనుల బదలాయింపు ఒక కార్పొరేషన్ , అథారిటీ లేదా ఏజెన్సీకి ఉన్న బాధ్యత, అధికారం లేదా విధిని ప్రభుత్వం మరో సంస్థకు బదలాయించవచ్చు. అవసరమైతే సంయుక్తంగా నిర్వహించేలా కూడా చేయవచ్చు.ఇవి కూడా చదవండి: తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే! -
సీఎం ప్రజావాణికి 101 దరఖాస్తులు.. అత్యధికంగా రెవెన్యూ సమస్యలే!
సాక్షి, తెలంగాణ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన 254వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 101 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు.రెవెన్యూ శాఖకే 24 దరఖాస్తులు..అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 24 వచ్చాయి. మున్సిపల్ శాఖకు 16, బీసీ సంక్షేమ శాఖకు 13 దరఖాస్తులు అందగా.. ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతోంది.పది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు..అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పది మందికి సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద ఆర్థిక సాయం అందింది. ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది.ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.ఇవి కూడా చదవండి: ‘అందుకే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా’ -
మూసీ ప్రక్షాళనపై కొత్త ట్విస్ట్.. రేవంత్ సర్కార్‌కు ఎన్జీటీ నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు మరోసారి న్యాయపరమైన సవాల్ ఎదురైంది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణాది బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.మూసీ ప్రక్షాళన పేరుతో చేపడుతున్న పనులకు పర్యావరణ నిబంధనలు, అనుమతుల విషయంలో లోపాలున్నాయని అప్పీల్‌దారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ వారు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది.మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే.. కేవలం 20 కిలోమీటర్ల మేర మాత్రమే స్టడీ చేశారు. అలాగే ఈ రీజియన్‌లోనే మృగవాణి నేషనల్ పార్క్ ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సమీపంలో భారీ నిర్మాణాలు చేపట్టాలన్న నిర్ణయంతో పాటు వాణిజ్య సముదాయాల ఏర్పాటుపైనా రిటైర్డ్ ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నోటీసులుఅప్పీల్ను పరిశీలించిన చెన్నై ఎన్జీటీ బెంచ్.. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను ట్రిబ్యునల్ ముందు ఉంచాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే.. మూసీ ప్రాజెక్టుపై గతంలోనూ ఎన్జీటీలో న్యాయపరమైన వివాదం కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్‌ను ఎన్జీటీ కొట్టివేసింది. దీంతో ప్రాజెక్టుకు అప్పట్లో ఊరట లభించింది.వచ్చే నెల 16న విచారణతాజాగా రిటైర్డ్ ఇంజినీర్లు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను ఎన్జీటీ వచ్చే నెల 16కు వాయిదా వేసింది. దీంతో ఆ రోజు జరిగే విచారణలో పర్యావరణ అనుమతులపై అప్పీల్‌దారులు లేవనెత్తిన అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే వివరణలు కీలకం కానున్నాయి.మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నది ప్రక్షాళనతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, మురుగునీటి సమస్య పరిష్కారం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావం, అనుమతుల ప్రక్రియపై మొదటి నుంచీ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎన్జీటీలో దాఖలైన అప్పీల్‌తో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: స్కామ్ కోల్‌కతాలో.. సోదాలు హైదరాబాద్‌లో! -
స్మార్ట్ కార్డు.. తప్పులతడక
కరీంనగర్ 44వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన భూంపల్లి విజయ, జొన్నల సంధ్య, గన్ను రాజమణిలకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ అయ్యాయి. వీరి చౌకధరల దుకాణ నంబరు 2084150 కాగా, కార్డులపై మాత్రం 58వ డివిజన్లో చిరునామాగా, రేషన్‌షాప్ నంబరు 2084168గా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 2084168 నంబరు గల రేషన్‌షాప్ 58వ డివిజన్లో కాకుండా, 13వ డివిజన్లో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. 44వ డివిజన్లో దాదాపు 150 మందికి జారీ అయిన స్మార్ట్ కార్డులు ఇలానే ఉన్నాయి. ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు పంపిణీ చేసిన పట్టణాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.పోలంపల్లి ఆంజనేయులు క్యూఆర్ కోడ్.. హోలోగ్రామ్.. అత్యాధునిక భద్రతా ఫీచర్లు అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్‌కార్డులు లబ్ధిదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. కార్డుపై ఉన్న పేరు తప్ప మరే వివరమూ సరిపోలడం లేదు. అసలు ఆ కార్డు ఎవరిదో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఒక జిల్లాలో ఊరి పేరు మారితే.. మరో జిల్లాలో గ్రామ పంచాయతీ పేరు తారుమారైంది. ఇంకొకచోట హ్యాబిటేషన్ పేరు స్థానంలో మరో గ్రామం పేరు వచ్చి చేరింది. ఇంటిపేరు తారుమారైంది. మరోచోట పిన్‌కోడ్ మారింది.. మరికొన్ని చోట్ల రేషన్ దుకాణం నంబరే తప్పుగా ముద్రితమైంది. ఇంటి నంబర్, ఫోన్‌నంబర్ లేకపోవడంతో లబ్ధిదారుల ఇళ్లను వెతికి కార్డులు అందించడమే అధికారులకు సవాలుగా మారింది. ఈ స్మార్ట్ కార్డులను ముంబై కేంద్రంగా ఉన్న ఏజెన్సీల ద్వారా బల్క్ ప్రింటింగ్ చేయించగా, సాఫ్ట్వేర్ ఫార్మాటింగ్లో లోపాలు తలెత్తినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటి కార్డుల డేటా ధ్రువీకరణపై అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకుపైగా ఆహార భద్రతా కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టారు. వీటి ద్వారా సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇంత భారీస్థాయిలో కార్డుల ముద్రణ చేపట్టే ముందు కుటుంబ వివరాలు, గ్రామ పంచాయతీ, మండలం, వార్డు, పిన్‌కోడ్, రేషన్ దుకాణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. 15 వేల కార్డులకు ఒకే ఊరు! పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో వెలుగుచూసిన ఘటన స్మార్ట్ కార్డుల డేటా లోపాల తీవ్రతను చాటుతోంది. మండలంలోని 22 గ్రామాలకు చెందిన కార్డులపై ‘ఓదెల’అనే గ్రామం పేరే ముద్రితమైంది. హరిపురం గ్రామానికి చెందిన 423 కార్డుల పంపిణీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. పోస్టల్ పిన్కోడ్లోనూ తప్పులు గుర్తించారు. మండలంలో పంపిణీ చేయాల్సిన సుమారు 15 వేల కార్డుల్లో ఇదే సమస్య ఉన్నట్టు తేలడంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. – హరిపురం, రూపునారాయణపేట, శానగొండ, జీలకుంట గ్రామాలకు వచ్చిన కార్డుల్లో గ్రామం పేరు, పిన్‌కోడ్ తదితర వివరాలు తప్పుగా ముద్రించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ప్రస్తుతం స్మార్డ్ కార్డులు పంపిణీ చేస్తుండగా, కార్డులపై పిన్‌కోడ్ 505186కు బదులు 505185గా ఉంది. కరీంనగర్లో 24వేల కార్డులు వెనక్కి– కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మంకమ్మతోటకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్‌కు మంజూరైన కార్డులో కరీంనగర్ బదులు మహబూబ్‌గర్ జిల్లా, అక్కడి 1425022 రేషన్ షాపు కేటాయించారు. – పలు డివిజన్లలో లబ్ధిదారుల డివిజన్ స్థానంలో మరో డివిజన్ పేరు, కేటాయించిన రేషన్ దుకాణానికి బదులు మరో దుకాణం నంబర్ ముద్రితమైంది. చాలా చోట్ల అడ్రస్‌లు దొరక్క, ఆ లబ్దిదారు ఎవరో తెలియక కార్డులు డివిజన్ల వారీగా పేరుకుపోతున్నాయి. గతంలో అద్దె ఇంట్లో ఉండి ఇప్పుడు మారిన వారికి సంబంధించిన కార్డులన్నీ పక్కన పడేస్తున్నారు. కార్డులో ఫోన్‌నంబరు లేకపోవడంతో వారిని గుర్తించడం ఇబ్బందిగా ఉంది. దీంతో పంపిణీ కాకుండా 24వేల కార్డులు మిగిలిపోయాయి. ఇందులో దాదాపు 20 వేల కార్డులను రెవెన్యూ అధికారులకు తిరిగి అప్పగించాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో 3వేల కార్డుల్లో తప్పుల గుర్తింపు కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని రామేశ్వర్‌పల్లి గ్రామానికి బదులు రామ్‌రెడ్డి పల్లి గ్రామంగా 400 కార్డులు ప్రింట్ అయ్యాయి. ఇస్రోజివాడి గ్రామంలో 501 కుటుంబాలకుగాను 499 కార్డులు మంజూరు కాగా, ఉగ్రవాయి గ్రామంగా ప్రింట్ అయింది. చిన్న మల్లారెడ్డి గ్రామం పేరుకు బదులు చిన్న చేగురుగా 400 కార్డుల్లో ముద్రించారు. రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి బదులు మద్దికుంటగా 605 కార్డుల్లో ముద్రణ జరిగింది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో సుమారు 3,000 స్మార్ట్ రేషన్ కార్డుల్లో గ్రామాల పేర్లు తారుమారైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయా జిల్లాలో ఇలా... ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగులో 680 స్మార్ట్ రేషన్ కార్డులు ఉండగా.. ఏకంగా 358 కార్డుల్లో లబ్ధిదారులు నివసించే సిద్ధిక్‌నగర్‌కు బదులు గుబ్బగుర్తి పేరు ముద్రించారు. సిద్దిక్నగర్కు సంబంధించిన పిన్‌కోడ్ 507165కు బదులు 507305గా నమోదైంది. – బోనకల్ మండలంలోని లక్ష్మీపురం, తూటికుంట్ల ప్రాంతాల్లో కొందరు లబ్ధిదారుల ఇంటిపేర్లు సైతం తప్పుగా ముద్రితమయ్యాయి. మూడు మండలాల్లో ఇలాంటి తప్పులు గుర్తించామని, మరిన్ని వివరాలు సేకరించి సరిచేసిన కార్డులు తిరిగి ఇస్తామని ఖమ్మం జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్ తెలిపారు. – కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో అధికారిక కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 10 మంది లబ్ధిదారులకు కార్డులు ఇవ్వగా.. ఐదుగురి కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ముద్రితమైంది. నమూనాగా ఎంపిక చేసిన కార్డుల్లోనే సగం తప్పులు రావడం గమనార్హం. – మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతంలో 13వ రేషన్ దుకాణం పరిధిలోని 480 కార్డుల్లో ‘వరిగుంతం’కు బదులు ‘కుల్చారం’పేరు ముద్రించారు. దీంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలోని 4వ వార్డు కార్డుల్లో మున్సిపాలిటీ పేరుకు బదులు ‘వట్టూర్’గ్రామం పేరు రావడంతో అక్కడా పంపిణీ ఆపేశారు. కార్డులు వెనక్కి పంపించాం హరిపురం గ్రామ కార్డుల్లో కొన్ని తప్పులు ఉండడంతో, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం కార్డులను వాపస్ ఇచ్చాం. ఊర్లో 253 కార్డులు ఉన్నాయి. అంటిల్లోనూ ఉన్న తప్పులను సరిచేసి, సరైన వివరాలతో తిరిగి కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం. – విజయ నాగరాజుయాదవ్, సర్పంచ్, హరిపురం -
చలో హైదరాబాద్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ)తలపెట్టిన చలో హైదరాబాద్ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లిఖితపూర్వక హామీతో ఈనెల 10వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్, అనంతరం మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో టీజీఈజేఏసీ అత్యవసర సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన చలో హైదరాబాద్‌కు సర్వం సిద్ధం చేశామని, మహాధర్నా స్టేజీ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి అడ్వాన్స్‌లు కూడా చెల్లించామన్నారు. కానీ సీఎస్ లిఖిత పూర్వక హామీని విశ్వసించి జేఏసీ తలపెట్టిన కార్యక్రమాన్ని ఈనెల 18వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అడిగిన 18వ తేదీ గడువు అనంతరం ఈనెల 19న జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గత నెల 27 నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా సూచనలు చేశారన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీఎస్ సంజయ్‌జాజు సచివాలయంలో జేఏసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారన్నారు. అనంతరంనాలుగు అంశాలపై వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పీఆర్సీ నివేదిక ఇవ్వమని రెండవ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌కు సీఎస్ లేఖ రాశారని, అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనానికి పే రివిజన్ కమిషన్ నిపుణులు, అధికారులు, వివిధ సంఘాల సభ్యులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఉద్యోగుల ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మూడు డీఏలు ఇవ్వాలని సీఎస్‌ను కోరామని, ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు పెట్టామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈనెల 18వ తేదీ వరకు గడువు ఇవ్వాలని సీఎస్ కోరారన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హమీని పూర్తిగా విశ్వసించి ఛలో హైదరాబాద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఉద్యోగులకు 64 రకాల సమస్యలున్నప్పటికీ... ప్రధానంగా నాలుగింటిపైనే ఒత్తిడి చేస్తున్నామని, ఆర్థిక భారం లేని అంశాలను త్వరలో జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. గతనెల 27వ తేదీన క్షేత్రస్థాయిలో ధర్నాలు, ఈనెల 1న నిరసనలతో ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈనెల 10వ తేదీన మహా ధర్నా కోసం నాలుగు చోట్ల దరఖాస్తు చేశామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని, సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహణకు కోర్టు కూడా అనుమతించిందన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ, టీజీఓ ప్రధాన కార్యదర్శులు ముజీబ్ హుస్సేని, బి.శ్యామ్, జేఏసీ ప్రతినిధులు జి.సదానంద్‌గౌడ్, చావ రవి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులతో ఈనెల6న నాంపల్లిలో చేపట్టిన సంకల్పసభతో ప్రభుత్వం దిగొచ్చిందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సీఎస్ మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, బకాయిల పరిష్కారానికి ప్రతినెలా కనీసం రూ.2వేల కోట్లు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరగా..ఈ అంశలపై ఈ నెల18న స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
'కోహెడ'కు రూ.637.70 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి సమీపంలో కోహెడలో నిర్మించనున్న ప్రపంచస్థాయి సమగ్ర పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటమే లక్ష్యంగా దీన్ని నిర్మిస్తోంది. మార్కెట్ తొలి దశ పనులకు రూ.637.70 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో 178.16 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమగ్ర పండ్ల మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో భాగంగా ఆరు వేలం హాళ్లు, వాటికి అనుబంధంగా మీజనైన్ ఏసీ అంతస్తులు నిర్మించనున్నారు. వీటితోపాటు షెడ్–4, కర్బూజ తదితర పండ్ల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్, రైతుల కోసం కిసాన్ రిటైల్ మార్కెట్, వాహనాలు నేరుగా లోపలికి వెళ్లి సరుకులు తరలించే సదుపాయం, ప్రాంగణం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మార్కెట్ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక అనుమతులు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ పనుల పర్యవేక్షణ తదితర బాధ్యతలను ఆ శాఖ నిర్వహించనుంది. రైతులకు ఆధునిక సదుపాయాలు ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే పండ్ల ఉత్పత్తిదారులకు ఆధునిక మార్కెటింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్ల విక్రయాలు, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌కు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు. తద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలు పెరగడంతో పాటు మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కోహెడ సమగ్ర పండ్ల మార్కెట్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. -
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..
తెలంగాణ: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల వయోపరిమితి సడలింపునకు అదనంగా మరో మూడేళ్లు పెంచడంతో మొత్తం పదేళ్ల వరకు వయోపరిమితి సడలింపు అందుబాటులోకి వచ్చింది.తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే నియామకాలకు ఈ సడలింపు వర్తించనుంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లోని కానిస్టేబుల్ పోస్టులకు ఇది వర్తించనుంది. అలాగే, కానిస్టేబుల్‌తో సమాన హోదా కలిగిన ఇతర పోస్టులకు కూడా ఈ అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.దీంతో వయోపరిమితి కారణంగా ఇప్పటివరకు పోలీస్ ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు మరోసారి అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పోలీస్ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం ఊరటనివ్వగా, రాబోయే నియామకాల్లో అర్హత కలిగిన మరికొందరు అభ్యర్థులు పోటీ పడేందుకు అవకాశం ఏర్పడింది.అయితే ఈ అదనపు మూడేళ్ల సడలింపుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ సడలింపు చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన వయోపరిమితి నిబంధనలను ప్రత్యేకంగా పరిశీలించాలి.ఈ వయోపరిమితి పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2026న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఏడేళ్ల సడలింపునకు మరో మూడేళ్లు కలపడంతో మొత్తం పదేళ్ల వరకు సడలింపు లభించనుంది.దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్, సమాన హోదా పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చనుంది. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది.ఇవి కూడా చదవండి: ఇందిరమ్మ టవర్స్ డిపాజిట్ వాపస్ -
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల అరెస్ట్ పరిణామంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకంటే అరెస్టులు, అక్రమ నిర్బంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సవాల్ చేశారు. ‘మేము సిద్ధం.. మీరు సిద్ధమా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై జరిగిన ఘటనలో బాధ్యులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.హైకోర్టు నిన్న స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్‌రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్ పాలిటిక్స్’ను గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే - బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలానే…— KTR (@KTRBRS) September 8, 2026 ఇదీ చదవండి: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: సాక్షితో తాతా మధు -
ఆటో ఛార్జీలు పెరగనున్నాయా? తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణ: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆటో ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్, పర్మిట్ల సమస్యలు, బీమా వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఆటో కార్మికుల సమస్యలపై సుదీర్ఘ చర్చఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో ప్రస్తావించిన సమస్యలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు. సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేలా వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.2012 తర్వాత పెరగని ఆటో ఛార్జీలుఆటో ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2012 తర్వాత ఛార్జీలు పెరగలేదని, ప్రస్తుతం పెరిగిన నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఛార్జీలను నిర్ణయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఛార్జీలు ఎంత మేర పెంచాలన్న అంశాన్ని పరిశీలించిన అనంతరం కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ఛార్జీల పెంపును అమలు చేసే అవకాశం ఉంది.ఆర్టీసీ ఈవీ ఆటోలపై దుష్ప్రచారమేటీజీఎస్ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ ప్రత్యేక యాప్ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్‌ను తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయి. ఓలా, ఉబెర్, ర్యాపిడో తరహాలో పనిచేసే యాప్ రూపకల్పనపై ఇప్పటికే ఐటీ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డుఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకోనుంది. ఈ ప్రతిపాదనను కేబినెట్లో చర్చించిన అనంతరం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే దిశగా ముందుకు వెళ్లనున్నట్లు మంత్రులు తెలిపారు. బోర్డు ద్వారా ఆటో కార్మికుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.పెండింగ్ పర్మిట్లకు పరిష్కారంజీఓ ఎంఎస్ నంబర్ 263 కింద తిరస్కరించబడిన కేసులతో పాటు గడువు ముగిసిన పర్మిట్లకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న ఆటో రిక్షా పర్మిట్ల కోటాను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.అగ్రిగేటర్ పాలసీపై ప్రత్యేక అధ్యయనంఅగ్రిగేటర్ల ద్వారా వైట్ ప్లేట్ వాహనాల వినియోగంపై ఆటో సంఘాలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్రం ప్రకటించిన అగ్రిగేటర్ పాలసీలో ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించే అవకాశం ఉన్నందున దీనిపై రాష్ట్ర స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అగ్రిగేటర్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావాన్ని పరిశీలించనున్నారు.ఇతర జిల్లాల ఆటోలపై నిబంధనలు కఠినంఇతర జిల్లాలకు చెందిన ఆటోలు హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆటో సంఘాల ప్రతినిధులు కోరారు. దీనిపై రవాణా శాఖ స్పందిస్తూ నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నిబంధనల అమలులో నగరంలోని ఆటో కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు.సారథి పోర్టల్ సమస్యకు పరిష్కారంఆటో రిక్షా డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీ విషయంలో సారథి పోర్టల్‌లో స్పష్టత లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్నవారు ఆటో నడిపే విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి స్పష్టత కోరనున్నట్లు తెలిపారు.18,700 ఆటోలకు రూ.1.50 లక్షల సాయంహైదరాబాద్లో డీజిల్, పెట్రోల్ ఆటోల స్థానంలో పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు రెట్రోఫిట్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలోని సుమారు 18,700 ఆటోలకు ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సమన్వయంతో సుమారు రూ.200 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బీమా పాలసీఆటో డ్రైవర్ల ప్రమాదాలు, సహజ మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రత్యేక బీమా పథకాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ అంశంపై కార్మిక శాఖతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్లతో పాటు ఇతర వర్గాలకు కూడా రక్షణ కల్పించేలా ‘ఇందిరమ్మ పాలసీ’ తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు.సమస్యల పరిష్కారానికి శాఖల సమన్వయంఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ఆటో కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అడిషనల్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకట రమణతో పాటు కార్మిక శాఖ, పోలీస్, ట్రాఫిక్ శాఖల అధికారులు, వివిధ ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యువత ఉపాధికి గడ్కరీ పిలుపు.. తెలంగాణ ప్లేట్ ఫిరాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలకు కళ్లెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యానికి కారణమవుతోంది. ఒకవైపు యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు టూవీలర్లను కూడా ట్యాక్సీలుగా తిప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వా లని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పిలుపునిచ్చారు. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంతకాలం యాప్ ఆధారిత అగ్రిగేటర్ల అదీనంలో వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు ట్యాక్సీలుగా తిరుగుతున్నాయి. ఇప్పుడు అలా తిరిగేందుకు వీలు లేకుండా, పసుపు రంగు (ఎల్లో) నంబర్ ప్లేట్‌తో వాణిజ్య వాహనాలుగా నమోదు చేసుకుంటేనే ట్యాక్సీగా నడిపేందుకు అనుమతించేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. ఆటో వాలాల ఒత్తిడితోనే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. ఆటోవాలాల ఒత్తిడితో.. మీటర్లను అలంకారప్రాయంగా మార్చి ఎడాపెడా చార్జీలు డిమాండ్ చేస్తారనే ఆరోపణలు ఆటోవాలాలపై ఉన్నాయి. కాగా కొంతకాలంగా వీరు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. పుష్కరకాలంగా కొనసాగుతున్న పాత చార్జీలను పెంచాలన్న డిమాండ్‌తో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఇతర ఆర్థిక సహకారాల కోసం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై సానుకూలత వ్యక్తం చేసిన ప్రభుత్వం చార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రిట్రోఫిట్మెంట్ ద్వారా డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు ఏర్పాటు చేసుకుంటే రూ.లక్షన్నర ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రకటించింది. అయితే నగరంలో పెద్ద సంఖ్యలో తిరుగుతూ ప్రయాణికులకు చేరువైన బైక్ ట్యాక్సీలను నియంత్రించాలన్న డిమాండ్‌పై ఆటో యూనియన్లు పట్టుపట్టాయి. ఎల్లో నంబర్ ప్లేట్‌తో ఉండే వాణిజ్య వాహనాలనే ట్యాక్సీలుగా అనుమతించాలని, సాధారణంగా వైట్ ప్లేట్‌తో ఉండే బైక్‌లను ట్యాక్సీలుగా కొనసాగించరాదని కోరారు. ఈ డిమాండ్‌తో సమ్మె చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గడ్కరీ ఏమన్నారు.. ‘దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సరళమైన విధానాలతో వ్యవహరించాలి. సొంత ద్విచక్రవాహనాలను బైక్ ట్యాక్సీలుగా వినియోగించుకోవటం ద్వారా దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది కొత్తగా ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునే వీలుంది. ఇవి ప్రయాణికులకు తక్కువ చార్జీలకే అందుబాటులో ఉంటాయి. రవాణా అన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆ«దీనంలోని అంశం అయినందున, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’అని గడ్కరీ విజ్ఞప్తి చేశారు. బైక్ ట్యాక్సీలకు పెరుగుతున్న డిమాండ్ ప్రస్తుతం రాష్ట్రంలో 18,314 బైక్‌లను ట్యాక్సీలుగా వాడుతూ యువత ఉపాధి పొందుతోంది. నిజానికి రాష్ట్ర రవాణా శాఖ ఎల్లో ప్లేట్ నిబంధనను గతంలోనే పొందుపరిచింది. కానీ ఉబర్, ర్యాపిడో, ఓలా లాంటి యాప్ ఆధారిత అగ్రిగేటర్ల ద్వారా తెలుపు ప్లేట్‌తో కూడిన సాధారణ ద్విచక్రవాహనాలను కూడా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఒకరు, వేగంగా ప్రయాణించడానికి వీలైన ఈ ట్యాక్సీలకు నగరంలో మంచి డిమాండ్ ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆటోవాలాల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో ప్లేట్ నిబంధనను కఠినంగా అమలులోకి తెస్తే, ఈ బైక్ ట్యాక్సీలన్నీ దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడనుంది. ‘ఎల్లో’పెను భారం.. సాధారణ బైక్‌ను వాణిజ్య వాహనంగా మార్చుకోవాలంటే పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. కన్వర్షన్ చార్జీలు రూ.3 వేలతో ముగిసినా.. తర్వాత క్రమం తప్పకుండా పన్నులు, రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ రోడ్ ట్యాక్స్, త్రైమాసిక పన్ను, ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ ఫీజు, గ్రీన్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు.. ఇలా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇక ఒకసారి వాణిజ్య వాహనంగా మారిన తర్వాత దాన్ని సొంత వాహనంగా వినియోగించుకోవటం కూడా ఇబ్బందే. అది నిబంధనలకు విరుద్ధమైనందున దానికి పెనాల్టీ చెల్లించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా యువత బైక్ ట్యాక్సీలను విడిచిపెట్టే అవకాశం ఉంది. ప్రయాణికులకు చార్జీల పోటు నగరంలో క్యాబ్, ఆటోల చార్జీలు భారీగా ఉంటున్నాయి. యాప్ అల్గారిథమ్ రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని చార్జీలను పెంచి వడ్డిస్తోంది. వాటితో పోలిస్తే బైక్ ట్యాక్సీ చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది వీటిని వాడుతున్నారు. ఇక చిన్నచిన్న పార్శిళ్ల తరలింపునకు కూడా వీటిని వాడటం అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ బైక్ ట్యాక్సీలు దూరమైతే, ఆ మేరకు ప్రయాణికుల జేబుకు కూడా చిల్లు పడుతుంది. -
రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ రూ.70 వేల కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం హైపర్‌వాల్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కలిపి దేశంలోనే అతిపెద్ద భారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రం నిర్మాణాన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో టీసీఎస్ ఎండీ, సీఈవో కృతివాసన్– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఒక గిగావాట్ సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు సంస్థ 250 ఎకరాల భూమిని సేకరించింది. ఏఐలో ముందు వరుసలో: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో ఈస్థాయిలో భారీ పెట్టుబడి రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ. .‘నా కల నెరవేరింది. ఫ్యూచర్ సిటీలో రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుండటం గర్వకారణం. నేను టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్‌ను దావోస్‌లో కలిసి తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని కోరాను. అప్పుడు ఆయన నవ్వుతూ సరేనన్నారు. ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఈ డేటా సెంటర్ ద్వారా 7000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే టాటా సంస్థ తరపున రాష్ట్రంలో 85 వేల మంది ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు. కొత్తగా ఏడువేలతో అది 92 వేలకు చేరుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు నిర్మిస్తున్న మొత్తం 50 కి.మీ. రహదారికి భారతరత్న రతన్‌టాటా పేరు పెడుతున్నాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను నిలపాలన్న స్వప్నం సాకారం కావాలంటే ఫారŠూచ్యన్ 500 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి. 2047 నాటికి మూడు ట్రిలియన్ ఎకానమీని సాధించాలి. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి 5 శాతం జీడీపీని అందిస్తోంది. దానిని పది శాతానికి పెంచాలన్నది నా తాపత్రయం. ప్రపంచ ఏఐ విప్లవంలో హైదరాబాద్ ఇప్పుడు ముందు వరసలో నిలిచింది’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య విధానాల్లో భిన్నాభిప్రాయాల్లో ఉండవచ్చు కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి విషయంలో మాత్రం అలాంటివేమీ ఉండవని స్పష్టం చేశారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భావన ఉందని, ఇందులో ఇంజనీరింగ్ టెకీలకు తాను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేనని, కానీ బ్లూకాలర్ జాబ్స్ వాళ్లకు మాత్రం ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. మావి మాటలు కాదు...పెట్టుబడులు :శ్రీధర్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చెపప్పారు. తాము కేవలం మాటలు చెప్పడం లేదని. పెట్టుబడుల రాక నిజమని వ్యాఖ్యానించారు. టీసీఎస్ ఆతిథ్య, పర్యాటక, పరిశ్రమలు, సేవారంగం,అటవీ రంగాల్లో పెట్టుబుడులు పెడుతోందన్నారు. తెలంగాణవైపు దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నాయన్నారు. తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని టీసీఎస్ ఎండీ, సీఈవో కె.కృతివాసన్, చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ప్రతిపాదించిన పెట్టుబడులపై ఇస్తున్న సహకారానికి హైపర్‌వాల్ట్ ప్రెసిడెంట్ రాజన్న, సీఈఓ దీపేష్ కిరణ్ నందాలు కృతజ్ఞతలు తెలిపారు. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు. -
మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖకు తెలంగాణ ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవలే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించిన సర్కార్, తాజాగా ఆమెకు కల్పించిన భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పాటు ఆమెకు కేటాయించిన 4+4 గన్మెన్ల భద్రతను కూడా పూర్తిగా రద్దు చేసింది.కేబినెట్ నుంచి బర్తరఫ్‌తో పాటు భద్రతను కూడా తొలగించడంతో హనుమకొండలోని ఆమె నివాసం వద్ద ఉన్న పోలీస్ సెక్యూరిటీని అధికారులు వెంటనే వెనక్కి తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు కొండా సురేఖ అనుచరులు, మద్దతుదారుల్లో ఈ పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 👉ఇదీ చదవండి: ‘ఒక పదవి పోతే.. మరో పదవి వెతుక్కుంటూ వచ్చింది’ -
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
-
123 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర అవార్డులు.. సెప్టెంబర్ 5న ప్రదానం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డులు-2026కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన 123 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ గురువారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరాలను వెల్లడించింది.రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 5న ఎంపికైన అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేయనున్నారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, సాంకేతిక విద్య, విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.ఏ విభాగం నుంచి ఎంతమంది?మొత్తం 123 మంది అవార్డు గ్రహీతల్లో అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ నుంచి 52 మంది ఉన్నారు. వీరితో పాటు యూనివర్సిటీల నుంచి 28 మంది, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి 29 మంది ఎంపికయ్యారు.ఇంటర్మీడియట్ విద్య విభాగం నుంచి 11 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన ముగ్గురు అధ్యాపకులు కూడా రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. అనుబంధ కళాశాలల కేటగిరీలో ఒక ఫిజికల్ డైరెక్టర్, ఒక లైబ్రేరియన్ కూడా ఉన్నారు.ప్రతిభకు గుర్తింపుపాఠశాల విద్య విభాగంలో ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వివిధ జిల్లాల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించడం, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల అభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం.ముగ్గురికి ప్రత్యేక అవార్డులుఉపాధ్యాయ అవార్డులతో పాటు విద్యా పరిపాలనలో విశిష్ట సేవలు అందించిన ముగ్గురికి ప్రత్యేక పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. టెక్నికల్ ఎడ్యుకేషన్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ. శ్రీదేవసేనకు విద్యా పరిపాలనలో విశిష్ట సేవలకు అవార్డు లభించింది. సాంకేతిక, కాలేజియేట్ విద్య రంగాల్లో ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరుగుదలలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఎంపిక చేశారు.అలాగే తెలంగాణ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్‌ను అకడమిక్ లీడర్షిప్, పాఠశాల విద్య రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా విద్యా పరిపాలన అవార్డుకు ఎంపిక చేశారు.సెప్టెంబర్ 5న ఘనంగా ప్రదానంఎంపికైన అవార్డు గ్రహీతలకు సెప్టెంబర్ 5న జరిగే రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పురస్కారాలను అందజేయనున్నారు. అవార్డుల ప్రదానానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, కాలేజియేట్ విద్య విభాగాల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.చదవండి: ఎంపీటీసీ నుంచి మంత్రి.. బర్తరఫ్ వరకు -
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భాగంగా రక్షణ ఎక్స్పో–2026ను ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కర వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను రాజ్‌నాథ్‌కు సీఎం వివరించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారిద్దరూ చర్చించారు. డిఫెన్స్ ఎక్స్‌పోలో లైవ్ డెమోలు... ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్రత్యేక సదస్సుతోపాటు ఎయిర్ షో, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, భూఉపరితల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన లైవ్ డెమోలు డిఫెన్స్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌నాథ్‌కు వివరించారు. ఈ దృష్ట్యా డిఫెన్స్ ఎక్స్‌పోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని, ఆహూతులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఎయిర్ షో నిర్వహణకు గగనతల అనుమతుల మంజూరు చేయాలని.. యుద్ధ విమానాల భాగస్వామ్యంతోపాటు సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల ప్రదర్శనలు ఉండేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా మద్దతు అందించాలన్నారు. త్రివిధ దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థల డెమోలను ఈ ఎక్స్‌పోలో ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ శాఖ కోరినట్లుగా భూసేకరణ... ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ గురించి రాజ్‌నాథ్ సింగ్, రేవంత్‌రెడ్డి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించిందని రేవంత్ చెప్పారు. ఈ విమానాశ్రయం కోసం రక్షణ శాఖ మొత్తం 1,500 కోరిందని.. ఆ మేరకు మరో 750 ఎకరాల భూసేకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించనున్నట్లు రాజ్‌నాథ్‌కు సీఎం వివరించారు. విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలి... ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయన్ను పార్టీ ఎంపీలు, అధికారులతోపాటు వెళ్లి కలిశారు. మామూనూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను పూర్తి చేసి కేంద్రానికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్తోపాటు మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్ (ఎంఆర్వో) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్‌లో రన్‌వే విషయంలో తుది నిర్ణయానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో ఆహ్వానిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన అధికారులు సీఎంకు తెలియజేశారు. -
వారంలో కేబినెట్ విస్తరణ.. ఆ మంత్రులు ఔట్..!
-
‘మూసీ’ భూసేకరణ వేగవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మూసీ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో భూసేకరణ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ విధానం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. వీటిపై స్పష్టమైన విధానం రూపొందించాలని, భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్–2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లభించే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. భూసేకరణలో భాగమైన టీడీఆర్ అంశంపై ప్రతి వారం సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్కుకు విస్తృత ప్రచారం కల్పించి సందర్శకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు 55 కిలోమీటర్ల కారిడార్‌ను పునరుద్ధరించే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్టు ఎంఆర్డీసీఎల్ అధికారులు తెలిపారు. మూసీ పరిధిలోని ఎంఎఫ్ఎల్/బఫర్ జోన్లలో భూములను స్వచ్ఛందంగా అప్పగించే వారికి టీడీఆర్ అందించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మూసీ ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించి కొందరు యజమానులు టీడీఆర్‌కు బదులుగా నగదు, ఇళ్లు లేదా ఓపెన్ ప్లాట్లు కోరుతున్నట్టు సమాచారం. భూముల స్వభావం, హక్కులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దులను స్పష్టంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్ న్యాయ వివాదాలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించండి..
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలపై తెలంగాణ ఉద్యోగ జేఏసీ (టీఈజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు నోటీసులను సమర్పించింది. ఈనెల 27లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు, నిరసనలకు దిగుతామని ఇటీవల విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ ప్రతినిధులు ఆందోళనలకు సంబంధించిన నోటీసులు సమర్పించారు. వాటి పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. ఆందోళనలపై తగ్గేదే లేదు... ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఈసారి వెనక్కు తగ్గేది లేదని టీఈజేఏసీ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో జేఏసీ సైతం వెనక్కు తగ్గొద్దని, ప్రభుత్వంతో చర్చలు జరిపేది లేదని, సమస్యల పరిష్కారం అయినప్పుడే నిరసనలకు బ్రేక్ పడుతుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ముందుగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు, ఆ తర్వాత క్రమంగా ఆందోళనలను తీవ్రతరం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా కాకుండా ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయించిన టీఈజేఏసీ... ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమాలు ఇలా... –ఈ నెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక రోజు మహాధర్నా నిర్వహించనుంది. –ఈ నెల 27నుంచి పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించే వరకు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నారు. –టీఈజేఏసీ జిల్లాల్లో పర్యటించనుంది. ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు సంబంధించిన అంశాలతో సన్నాహక సదస్సులు నిర్వహించనుంది. –సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించింది. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్‌తో సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. –సెప్టెంబర్ 10న ఉద్యోగుల చలో హైదరాబాద్ నిర్వహించనుంది. అనంతరం ఉద్యోగులతో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. డిమాండ్లు ఇవీ... –ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను సమర్థవంతంగా అమలు చేయాలి. –ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. –పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అమలు చేయాలి. –ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను ఏకకాలంలో విడుదల చేయాలి. –ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తున్న రూ.2వేల ప్యాకేజీని బకాయిలు పూర్తయ్యే వరకు ప్రతినెలా కొనసాగించాలి. –సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. –ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించాలి. –317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి. 190 జీఓను విద్యాశాఖ, పోలీసుశాఖతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి. -
మంత్రి పదవి నుంచి కొండా సురేఖ అవుట్..?
-
'మిషన్ K-100' విజయవంతంగా 50 రోజులు పూర్తి
హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక 'మిషన్ K-100' విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. రాబోయే ఖరీఫ్ (2026-27) సీజన్ కంటే ముందే పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ తరలింపు, గోదాముల ఖాళీ చేయడం, నిధుల సమీకరణలో ఈ శాఖ కీలక విజయాలు సాధించింది. సివిల్ సప్లైస్ భవన్లో కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర (IPS) అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో, అన్ని జిల్లాల్లోని వారపు డెలివరీ రేట్లు, అధికారుల సన్నద్ధతని సమీక్షించారు.50 రోజుల్లో రికార్డు డెలివరీమిషన్ K-100 ప్రారంభించిన ఈ 50 రోజుల్లో, పౌర సరఫరాల శాఖ మొత్తం 11.17 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) సీఎంఆర్ డెలివరీ సాధించింది. ఇందులో మొదటి వారం నుంచి ఆరో వారం వరకు నిర్దేశించిన లక్ష్యాలకుగాను 8.34 LMT డెలివరీ చేశారు. అంటే వారపు లక్ష్యాలలో 74 శాతం అద్భుతమైన పురోగతిని సాధించారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్ల గతంలో పనిచేయని 340 మిల్లులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డెలివరీ చేయని మిల్లుల సంఖ్య 1,351 నుంచి 1,011కి తగ్గింది.నిధుల సమీకరణ - గోదాముల ఖాళీ:రాబోయే ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, కార్పొరేషన్ అవసరమైన నిధులను సమీకరించి తమ లక్ష్యంలో 75 శాతం సాధించింది. దీనికి తోడు రాబోయే సీజన్ కోసం గోదాముల్లో సరిపడా ఖాళీలు ఉంచేందుకు, మిగిలిపోయిన ధాన్యాన్ని దశలవారీగా వేలం వేసే ప్రక్రియ కూడా సాఫీగా సాగుతోంది.మిల్లర్లకు చివరి అవకాశం (G.O.Ms.No.9):ప్రస్తుత పనులకు ఆటంకం కలగకుండా పాత బకాయిలు రాబట్టడానికి, ప్రభుత్వం G.O.Ms.No.9 తీసుకొచ్చింది. దీని ద్వారా రబీ 2022-23లో వేలం వేసిన ధాన్యం బకాయిలను చెల్లించడానికి మిల్లర్లకు చివరి అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 31, 2026 నాటికి మూడు వాయిదాలలో ఈ బకాయిలు చెల్లించాలి. ఈ గడువు దాటితే వారిని 'డిఫాల్టర్'గా ప్రకటించి, 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీ కూడా వసూలు చేస్తామని పౌర సరఫరాల శాఖ తీవ్రంగా హెచ్చరించింది.డిఫాల్టర్లపై కఠిన చర్యలు - పీడీ యాక్ట్ ప్రయోగం:విజిలెన్స్ బృందాలు చురుగ్గా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ, బకాయిలు చెల్లించని వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు, రెవెన్యూ రికవరీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా డిఫాల్టర్ల ఆస్తులను జప్తు చేయడం, వారి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడం చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా తమ వద్దే ఉంచుకున్న వారిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ఇలాంటి మిల్లర్లకు భవిష్యత్తులో ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఈ కఠిన చర్యల వల్ల, ఆగస్టు 19, 2026 నాటికి వేలం వేసిన ధాన్యం రికవరీ ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ. 1,000.57 కోట్లు వసూలయ్యాయి. -
తెలంగాణలో టికెట్ ధరలు.. ఎగ్జిబిటర్ల తీవ్ర అభ్యంతరం..!
తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరణపై థియేటర్స్ యాజమాన్యం స్పందించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సినిమా టికెట్ ధరలను ఖరారు చేస్తూ విడుదల చేసిన జీఓను ఎగ్జిబిటర్లు ఖండించారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. పది రోజుల గడువు ఇచ్చి కోర్టును ఆశ్రయిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.మరోవైపు సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం రివ్యూ చేయాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేసింది. టికెట్ ధరల నిర్ణయంపై సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని కోరింది. జీవో నంబర్ 77ను మరోసారి పరిశీలించాలని విన్నవించిందియ సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్లలో కొత్త టికెట్ ధరలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసింది. ఈ విషయంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని కోరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను పరిశీలించాలని.. కొత్త విధానంతో టౌన్ థియేటర్లపై ప్రభావం ఉండొచ్చని ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయ వ్యక్తం చేసింది. సినిమా ప్రతినిధులతో కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని అభ్యర్థించింది. -
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యాలకు స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరల క్రమబద్ధీకరణపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాన్ ఏసీ, ఏసీ సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీఫ్లెక్స్‌లలో వసూలు చేయాల్సిన కనిష్ఠ (మినీమం), గరిష్ఠ (మాగ్జిమం) ధరలను ఈ కొత్త మార్గదర్శకాల్లో అధికారికంగా ఖరారు చేశారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం సవరించిన టికెట్ ధరల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి1.నాన్ ఏసీ థియేటర్లు కనిష్ఠ టికెట్ ధర: రూ. 50గరిష్ఠ టికెట్ ధర: రూ. 1002.ఏసీ థియేటర్లు కనిష్ఠ టికెట్ ధర: రూ. 100 గరిష్ఠ టికెట్ ధర:రూ. 2003.మల్టీఫ్లెక్స్‌లు కనిష్ఠ టికెట్ ధర:రూ. 200 గరిష్ఠ టికెట్ ధర: రూ. 300సామాన్యులకు కూడా సినిమాలు అందుబాటులో ఉండేలా ప్రతి థియేటర్లో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీ కింద సాధారణ ధరలకే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు రోజుకు గరిష్టంగా ఐదు ప్రదర్శనలు ఇచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. చిన్న సినిమాల మనుగడను కాపాడటానికి ప్రతి థియేటర్లో రోజుకు ఒక షోను తప్పనిసరిగా చిన్న చిత్రాలకే కేటాయించాల్సి ఉంటుంది. భారీ బడ్జెట్ (రూ. 100 కోట్లకు పైగా) చిత్రాలకు మొదటి 10 రోజుల పాటు తాత్కాలికంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు 'సూపర్ హై బడ్జెట్' హోదా కల్పించింది. ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖాతాలో జమ చేయాలనే సరికొత్త నిబంధనను కూడా ప్రభుత్వం విధిగా అమలు చేయనుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరల పరిమితులను ఉల్లంఘించి అధిక రేట్లకు టికెట్లు విక్రయిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. -
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరలను పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC)కి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు స్పష్టం చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు రాబడిపై వర్తించే 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి సంబంధిత చిత్రాల నిర్మాతలే వసూలు చేయాలి. అనంతరం వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాకు జమ చేయాలి. ఈ ఖాతాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు’, ‘పెద్ది’ చిత్రాలకు కూడా వర్తిస్తాయి.ఈ నాలుగు చిత్రాల నిర్మాతలకు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని వసూలు చేసి, ప్రభుత్వం సూచించిన ఖాతాలో జమ చేసే అధికారాన్ని కల్పించారు.ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా, వృద్ధి సినిమాస్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. సంబంధిత నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసి, టీజీఎఫ్డీసీ ద్వారా నిర్వహించే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాలని హోం శాఖ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత నిర్మాతలకు సూచించింది. -
చర్చల్లేవ్.. పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఇక చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వేచిచూశామని, ఇప్పుడు క్షేత్రస్థాయిలోని ఉద్యోగులంతా ఉద్యమించి సాధించుకుందామని ఒత్తిడి చేస్తున్నారన్నారు. అందుకే ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. మంగళవారం నాంపల్లిలో ని టీఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై చర్చించిన అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. అనంతరం మీడియాతో మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. వేచిచూసే పరిస్థితి లేదు... ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే మూడేళ్లు వేచి చూశామని జగదీశ్వర్ అన్నారు. ‘పీఆర్సీ ఫిట్మెంట్ కోసం మూడేళ్లు దాటి మరో నెల గడిచింది. గత జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగుల హామీలు అమలు చేస్తామని చెప్పారు. సీఎం ఆదేశించినా, డిప్యూటీ సీఎం చెప్పినా అవేవీ అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. ఓపిక నశించింది. ఇప్పుడు వేచి చూసే పరిస్థితి లేదు. కొట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని ఉద్యోగులు ఆవేదనతో చెబుతున్నారు. జేఏసీ చెప్పినా వినే పరిస్థితిలో ఉద్యోగులు లేరు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏమీ కోరడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో నిర్దేశించిన వాటినే అమలు చేయాలని కోరుతున్నాం. జేఏసీ కార్యాచరణ ప్రకటించి రద్దు చేసుకుంటుందనే అపోహ క్షేత్రస్థాయిలో ఉంది. ఈసారి అలా కాకుండా కొట్లాడతాం. అందుకోసం ఈనెల 27న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు మహాధర్నా నిర్వహిస్తాం. అదేవిధంగా పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుంటాయి. సెప్టెంబర్ 10న ఉద్యోగులతో చలో హైదరాబాద్ నిర్వహించి మహా ధర్నా జరుపుతాం’అని తెలిపారు. సమావేశంలో టీఈజేఏసీ నేతలు పి.దామోదర రెడ్డి, చావ రవి, వంగ రవీందర్ రెడ్డి, జి.సదానందం గౌడ్, ముజీబ్, బి.శ్యామ్, అనిల్ కుమార్, లింగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఉమాదేవి, కె రమే‹Ù, ఉపేందర్ రెడ్డి, బిక్షం గౌడ్, వెంకట్, గజేందర్, కస్తూరి వెంకట్, స్థితప్రజ్ఞ, విక్టర్, రామారావు, కృష్ణ యాదవ్, మోహన్ నారాయణ వివిధ జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. నెలకు రూ.2వేల కోట్లు ఇస్తేనే: ఏలూరి శ్రీనివాసరావు ‘ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి 64 డిమాండ్లతో వినతిపత్రం సమర్పించింది. కొన్ని హామీలు కార్యరూపం దాల్చినా అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ప్రధానంగా విద్య, ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖలకు సంబంధించిన అంశాలు అమలు కావడం లేదు. ఈహెచ్ఎస్ ప్రకటించినా వాటికి సంబంధించిన నిబంధనలు విడుదల కాలేదు. ఏయే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మూడున్నర పీఆర్సీలు కోల్పోయాం. పీఆర్సీ కమిటీ నివేదిక వెంటనే తెప్పించుకుని ఫిట్మెంట్ అమలు చేయాలి. రూ.6వేల కోట్లు విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి మరో రూ.8వేల కోట్ల వరకు బకాయిలున్నాయి. ప్రతినెలా సగటున 500మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దీంతో ప్రతినెలా రూ.2వేల కోట్లు చొప్పున విడుదల చేస్తే వచ్చే మార్చికల్లా బకాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ప్రధాన డిమాండ్లు ఇవీ...⇒ ఈహెచ్ఎస్ను సమర్థంగా అమలు చేయాలి. ⇒ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. ⇒ పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి ఫిట్మెంట్ అమలు చేయాలి ⇒ ఉద్యోగులకు రావాల్సిన 6 పెండింగ్ డీఏలను ఒకేసారి విడుదల చేయాలి ⇒ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2వేల కోట్లను కొనసాగించాలి ⇒ సీపీఎస్ రద్దు చేసి ఏపీఎస్ అమలు చేయాలి. ⇒ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించాలి⇒ 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి. 190 జీఓను విద్యాశాఖ, పోలీసుశాఖతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి. ⇒ సీఎం ఆదేశాలను అమలు చేయని ఉన్నతాధికారుల అలసత్వంపై చర్యలు తీసుకోవాలి -
పదేళ్లలో పేదల ఆస్పత్రులు కట్టలేదేం?
సాక్షి, హైదరాబాద్: ‘కూలిపోయే పరిస్థితిలో ఉన్న వందేళ్ల నాటి ఉస్మానియా ఆస్పత్రిని తిరిగి నిర్మించాలని పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఆలోచన చేయలేదు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లలో కొత్త ఆస్పత్రులకు టెంకాయ కొట్టి వాటి నిర్మాణం మర్చిపోయారు. వరంగల్‌లో పెద్ద మాటలు చెప్పి ఉన్న ఆసుపత్రిని కూల్చేశారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే వాళ్ల పార్టీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ (టిమ్స్ ఆస్పత్రి) కలియదిరిగారు. దీన్ని మేం కట్టాం.. రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నాడన్నారు. నువ్వు నిజంగా కడితే రిబ్బన్ కట్ చేయడానికి పదేళ్లలో సమయం దొరకలేదా? కేసీఆర్ నాకు సాయం చేసినా చేయకున్నా అలాంటి కొడుకును తెలంగాణకు ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. నీ (కేసీఆర్) కొడుకు అట్లనే ఉండాలి.. అబద్ధాలు చెప్పాలి. అప్పుడే నిజాలు ప్రజలకు అర్థమవుతాయి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 1,082 పడకల (సూపర్ స్పెషాలిటీ) డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడారు. మీ ఫాంహౌస్‌లు ఏమైనా ఆగాయా? ‘కేసీఆర్‌కు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్.. ఆయన కుమారుడికి జన్వాడలో వంద ఎకరాల్లో ఫాంహౌస్.. ఆయన చెల్లికి శంకర్‌పల్లిలో 50 ఎకరాల్లో, బావ మొయినాబాద్‌లో 20 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారు. అందులో ఏదైనా ఆగిందా? పేదల ఆస్పత్రులు ఏవైనా పూర్తి చేశారా? ఇంత కూడా ఆత్మపరిశీలన చేయకుండా సమాజం గమనిస్తుందని సిగ్గు పడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నారు. ఇకనైనా మీ బుద్ధి మారాలి. కరువు రావాలని అఘోర దీక్షలు, రైతులు చచ్చిపోవాలని చేతబడులు చేయించడం మానాలి. మీరు సంపాదించిన రూ. లక్ష కోట్లలో నియోజకవర్గానికి రూ. 10 కోట్లో లేదా రూ. 20 కోట్లో ఖర్చు చేస్తే.. నల్లమల, ఆదిలాబాద్ అడవుల్లో సేవలందిస్తే మీరు చేసిన పాపాలు తగ్గుతాయి’అని సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యం.. ప్రజాపాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధిని ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఇప్పటివరకు 16 వేల మంది వైద్య సిబ్బందిని నియమించామన్నారు. వైద్యంపై ఖర్చును సంక్షేమం, ఖర్చు కింద చూడటం లేదని.. భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడిగా చూస్తున్నామని తెలిపారు. ‘ప్రస్తుతం విద్య, వైద్యం అత్యంత ఖరీదైనవిగా మారాయి. పేదలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే ఆస్తులమ్మినా సరిపోక కిడ్నీలు అమ్ముకొనే పరిస్థితి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతో ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించాలని నిర్ణయించింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె, కిడ్నీ బాగుండాలి. ఇందులో భాగంగానే మర్రి చెన్నారెడ్డి పేరుమీద వైద్య సాయం అందుబాటులోకి తెచ్చాం’అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. 32 నెలల పాలనలో ఆరోగ్యశ్రీ కోసం రూ. 2,700 కోట్లు కేటాయించామని, సీఎంఆర్ఎఫ్ రూ. 2,526 కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో వైద్యం కోసం రూ. 21,800 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 10 వేల పడకలు అందుబాటులోకి.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యంతో ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గోషామహల్లో 2 వేల పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా.. 2027 డిసెంబర్ 9 నాటికి ఉస్మానియా ఆస్పత్రి, ఎల్బీ నగర్లో, అల్వాల్‌లో ఇలా ప్రతి ఆరు నెలలకో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. దీనివల్ల 10 వేల ఆసుపత్రి పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రులను నిమ్స్, ఎయిమ్స్‌తో పోటీ పడి సేవలందించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. రోగులకు ఉచిత భోజనం, రోగుల సహాయకులకు డార్మిటరీలు, ఇతర వసతులు కల్పిస్తామని వివరించారు. అదనంగా పనిచేసే వైద్యులకు ఇన్సెంటివ్‌లు ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులను అదనపు సమయం పనిచేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అలా పని చేసే వారికి ఇన్సెంటివ్‌లు ఇస్తామన్నారు. ప్రభుత్వ వైద్యుల నైపుణ్యాన్ని, నేర్పరితనాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరే పేషెంట్ల కోసం ఉపయోగించుకోవాలని.. ప్రభుత్వం ఇన్సెంటివ్‌లు ఇవ్వకపోవడం వల్ల వారు ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అందువల్ల ఉన్నతాధికారులు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కష్టం వస్తే తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ అన్న అండగా ఉన్నాడన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలని చెప్పారు. అంతకుముందు టిమ్స్ ఆస్పత్రిలో వార్డులు, ఓపీ, ఓటీలలో సహచర మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కలియతిరిగారు. సిబ్బందితో మాట్లాడారు. ఒక్కో వార్డును ఒక్కో మంత్రి, ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవం చేయించారు. సురక్షిత ఆహారం, నాణ్యమైన మందులే లక్ష్యంగా టీజీ సేఫ్, ఆరోగ్య దీపిక పాలిక్లినిక్‌లను ప్రారంభించారు. కోటి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో 2023 నుంచి రూ. 8,923 కోట్లను ఆస్పత్రుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ‘కానీ మేం చేసిన ప్రతి పని తామే చేశామని చెప్పుకొనే తప్పుడు సంస్కృతితో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునే ప్రతిపక్షం రాష్ట్రంలో తిరుగుతోంది’అని బట్టి విమర్శించారు. ప్రజారోగ్యం కోసం అక్టోబర్ నుంచి జులై వరకు యాక్సలరేటెడ్ పేమెంట్స్ చేయాలనే ఆలోచనతో రూ. 1,452 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజారోగ్యం కోసం ఖర్చు చేసింది రూ. 70 కోట్లు మాత్రమేనన్నారు. పేదల ఆరోగ్య రక్షణ మా ప్రభుత్వానిది: మంత్రి దామోదర పేదల ఆరోగ్య రక్షణ తమ ప్రభుత్వానిదేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ కింద రూ. కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు బలోపతం చేశామని తెలిపారు. గాందీ, పేట్లబురుజు ఆస్పత్రుల్లో ఉచితంగా ఐవీఎఫ్ సేవలు అందిస్తున్నామని.. రాబోయే పదేళ్లలో తలసేమియారహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని లక్ష్యంగా పెటుకున్నామని మంత్రి దామోదర తెలిపారు. మూడు టిమ్స్ ఆస్పత్రులతోపాటు నిమ్స్, ప్రతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 100 పడకలను ఇంటర్నేషనల్ బెడ్స్ వింగ్ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రొ.కోదండరాం, బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, టిమ్స్, నిమ్స్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు పెద్ద వైద్యం!
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లోని డా.మర్రిచెన్నారెడ్డి టిమ్స్ ఆస్పత్రి ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు ఈ ఆస్పత్రి ప్రారంభం వాయిదా పడిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నా రు. ఈ ఆస్పత్రిలో ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దారు. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలి సారిగా ప్రభుత్వ ఆస్పత్రి (టిమ్స్)లో ఏర్పాటు చేయడం విశేషం. ఫలితంగా రోగుల నుంచి సేకరించిన పరీక్షా నమూనాల ఫలితాలను ఒకటి, రెండు నిమిషాల వ్యవధిలో అందుబాటులోకి రానున్నాయి. కాగా, మంత్రి రాజనర్సింహ ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జకారియా, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ బ్లాక్‌లో ఏముంటుంది? ఆస్పత్రిని నాలుగు బ్లాకులుగా నిర్మించారు. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. డయాగ్నోస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ, 12 మైక్రోబయాలజీ, 10 బయోకెమిస్ట్రీ, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లాక్–ఏలో అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉంటాయి. బ్లాక్–బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు, బ్లాక్–సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు, బ్లాక్–డీలో పరిపాలన, విద్యా విభాగాలతో పాటు, ఆడిటోరియం ఉంటుంది. మొత్తం 1,080 పడకలు అందుబాటులోకి రానున్నాయి. నిమిషాల్లోనే రక్త నమూనాలు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ టిమ్స్ సనత్ నగర్ లో ఏర్పాటు చేశారు. సీల్డ్ ట్యూబ్‌లు, గాలి ఒత్తిడితో రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వినియోగ వస్తువులను వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌లు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1–2 నిమిషాల్లో ఈ విధానం ద్వారా తరలించవచ్చు.ఫలితంగా వేగవంతమైన చికిత్సలు అందుతాయి. ఆరు కీలక విభాగాల్లో .. టిమ్స్‌లో అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుంది. కిడ్నీ, కాలేయం, గుండె, బహుళ అవయవ మార్పిడి సేవలకు ఇక్కడ అవకాశం ఉంది. ఆధునిక కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు, లీనాక్ ఆధారిత రేడియోథెరపీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ బ్యాకప్‌తో 30 క్లినికల్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. 3 టెస్లా ఎంఆర్ఐ, 128 స్లైస్ సీటీ స్కానర్, అధునాతన మామోగ్రఫీ యూనిట్, ఐదు ఎక్స్‌రే యంత్రాలు ఏర్పాటు చేశారు. సహాయకుల కోసం ధర్మశాల రోగులతో వచ్చే సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో ధర్మశాలను నిర్మించారు. ఇందులో 200 మందికి వసతి కల్పించే సదుపాయం ఉంది. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీ, కేంద్ర వంటశాల, లాండ్రీ, వైద్య వాయువు పైప్‌లైన్ వ్యవస్థలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 200 మంది కూర్చునే ఆడిటోరియం కూడా ఉంది. పర్యావరణహిత నిర్మాణానికి టిమ్స్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. నీటి వినియోగాన్ని 75 శాతం వరకు తగ్గించే సాంకేతికతను అమలు చేశారు. మురుగునీరు, వ్యర్థ ద్రవాల శుద్ధికి ఎస్టీపీ, ఈటీపీలు ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సేకరించి మొక్కలు, పచ్చదనం కోసం వినియోగించే విధానం ఉంది. పర్యావరణహిత నిర్మాణం, ఇంధన సామర్థ్య వ్యవస్థల కారణంగా ప్రాజెక్టుకు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది. ఒకే మాస్టర్‌ప్లాన్‌తో నిర్మాణం సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం దశలవారీగా సాగుతుండగా.. టిమ్స్ సనత్‌నగర్‌ను ఒకే దశలో, ఒకే మాస్టర్‌ప్లాన్ కింద సంపూర్ణ సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా నిర్మించారు. ప్రభుత్వ వైద్యరంగంలో అత్యాధునిక మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా టిమ్స్ సనత్‌నగర్ నిలవనుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లభించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సామాన్యులకు ప్రభుత్వ వ్యవస్థలోనే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి ఇది కీలక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. -
తెలంగాణలో వృద్ధులకు ప్రభుత్వం షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ప్రభుత్వం షాక్ ఇవ్వనుందా?. వృద్దాప్య పెన్షన్లకు మంగళం పాడనుందా?. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ.. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ కోసం దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కాకపోవడంతో పలువురు వృద్ధులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్థిక భారం కారణంగానే వృద్ధుల దరఖాస్తులను పక్కన పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కొత్త పెన్షన్లపై ప్రకటన.. వృద్ధులకు మాత్రం నిరీక్షణకొత్త పెన్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, పైలేరియా బాధితులు, ఒంటరి మహిళల వంటి వర్గాల దరఖాస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మాత్రం వేగంగా నిర్ణయం తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆర్థిక భారం కారణంగానే ఆలస్యం?కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తే ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందనే కారణంతోనే వృద్ధాప్య పెన్షన్లను ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వయసు మీద పడిన తమకు ప్రతి నెలా వచ్చే పెన్షన్ ఆధారంగా జీవనం సాగుతోందని, కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని వృద్ధులు కోరుతున్నారు.ప్రభుత్వంపై విపక్షాల విమర్శలువృద్ధులకు అండగా ఉంటామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ల విషయంలో జాప్యం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం అర్హతల పరిశీలన, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని దశలవారీగా పెన్షన్ల ప్రక్రియ కొనసాగిస్తామని చెబుతోంది. -
ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ‘టీ-ఫైబర్’ ఇంటర్నెట్: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో డిజిటల్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.సచివాలయంలో మంగళవారం నిర్వహించిన 'టీ-ఫైబర్' ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలు ప్రకటించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సమావేశం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..నిర్దేశిత గడువులోగా (సెప్టెంబర్ 1) రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ప్రైవేట్ ఇంటర్నెట్ ఆపరేటర్లను ఉపయోగిస్తే, వారికి ఎలాంటి ప్రభుత్వ బిల్లులు చెల్లించబోమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం చలామణిలో ఉన్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను రాబోయే నెల రోజుల్లోగా పూర్తిగా టీ-ఫైబర్ పరిధిలోకి బదిలీ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ శాఖల మధ్య సమాచార మార్పిడి మరింత వేగవంతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ'కి కూడా పూర్తిస్థాయిలో నాణ్యమైన టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందేలా ఇప్పటి నుంచే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను నిర్దేశించారు. దీంతో పాటు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేరవేసే ఇంటింటికి ఇంటర్నెట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, అనుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని టీ-ఫైబర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
హైడ్రా భూములు అమ్మేద్దాం
హైడ్రా స్వాధీనం చేసుకున్న వాటిల్లో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ,హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలు ఉన్నాయి.సాక్షి, హైదరాబాద్: నిధుల కటకట నుంచి గట్టెక్కే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) స్వాదీనం చేసుకున్న ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చెరువులు, కుంటలు కాకుండా కేవలం ప్రభుత్వ భూములను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)లకు బదలాయించి, వాటి ద్వారా భూములను వేలం వేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగిందని, హైడ్రా భూములను అమ్మేందుకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆయా భూముల అమ్మకం ద్వారా భారీ మొత్తంలో వీలైనన్ని నిధులు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ వ్యూహంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి భూముల స్వాదీన ప్రక్రియలో భాగంగా హైడ్రా అనుసరించిన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అయినా హైడ్రా తన తీరును మార్చుకోలేదంటూ కోర్టు పలు ధిక్కరణ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టును కమిషనర్ రంగనాథ్‌ను ఆ పోస్టు నుంచి తప్పించి, మరొక అధికారిని ఆ స్థానంలో నియమించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా భూములను అమ్మాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. వేల ఎకరాలు..వేల కోట్ల విలువ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చెరువులు, కుంటలు కాకుండా ఇప్పటివరకు సుమారు 2,665 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వా«దీనం చేసుకుంది. వాటి విలువ కనిష్టంగా రూ.60 వేల కోట్ల నుంచి గరిష్టంగా రూ.90 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటిలో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలు.. ఇలా కోట్ల విలువైన భూములు ఉన్నాయి. వీటిల్లో నిరుపయోగంగా ఉన్న భూములు, న్యాయపరమైన చిక్కులు రాని భూములను అమ్మడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ భూముల వేలం విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని, అన్ని చిక్కులు తొలగిన తర్వాతే పార్శిళ్ల వారీగా (ఒక్కో విడతలో కొన్ని ఎకరాల భూములు) భూములు వేలానికి పెట్టాలని ఉప సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు, మూడు సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే హైడ్రా భూముల అమ్మకాలపై స్పష్టత రానుంది. మా వల్ల కాదన్న హెచ్ఎండీఏ! ఆర్థిక వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశాల్లో మరో ఆసక్తికరమైన చర్చ జరిగిందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు గాను భూముల అమ్మకాలే మార్గమనే భావనకు వచ్చిన కేబినెట్ సబ్ కమిటీ.. హెచ్ఎండీఏ, టీజీఐఐసీలకు నెలవారీ లక్ష్యాలు సైతం విధించినట్టు సమాచారం. చెరో వెయ్యి కోట్లు చొప్పున ఈ రెండు సంస్థలు నెలకు రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి సమకూర్చగలిగేలా భూముల వేలం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉప సంఘం సూచించినట్లు తెలిసింది. అయితే నెల వారీ టార్గెట్ విధించడం సరైంది కాదని, వేలం ప్రక్రియ నిర్వహణకు చాలా గడువు అవసరమవుతుందని, ఆ తర్వాత భూములు దక్కించుకున్న సంస్థలు డబ్బులు కట్టేందుకు తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుందని, కొన్ని డబ్బులు తాము ఇప్పటికే తెచ్చిన రుణాలకు చెల్లించాల్సి ఉందంటూ హెచ్ఎండీఏ అధికారులు చేతులెత్తేసినట్టు సమాచారం. అయినా వారి వివరణతో ఏకీభవించని ఉప సంఘం నిధుల సమీకరణపై వెంటనే సంక్షిప్త నివేదిక తయారు చేయాలని, ఈ నివేదికను సీఎం రేవంత్ సమక్షంలో పరిశీలించి నెలవారీ టార్గెట్లపై నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. -
త్వరలో టీవీ రంగానికి కూడా ప్రభుత్వ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇస్తుండగా.. త్వరలో టీవీ రంగానికి కూడా అవార్డులు ఇవ్వబోతున్నారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, టెలివిజన్ అవార్డు కమిటీతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండీ ముకుంద రెడ్డి, కమిటీ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా టెలివిజన్(టీవీ) అవార్డులపై చర్చ జరిగింది.మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 'టెలివిజన్(టీవీ), ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నిచ్చే రంగం. ఎక్కువ మంది మహిళలు,వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్, ప్రోగ్రామ్స్, చిల్డ్రన్ చిత్రాలు తీసే వారిని ప్రోత్సహిస్తాం. కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పి.వి నరసింహారావు పేరు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చిస్తాను''పి.వి నరసింహారావు.. బహుభాషా కోవిదుడు,తెలంగాణ ఠీవి. దేశాన్ని ఆర్ధికంగా నిలబెట్టిన గొప్ప మేధావి. అట్లాంటి పేరు పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. కమిటీ వీలైనంత త్వరగా గైడ్ లైన్స్, లోగో, అవార్డ్స్ పేరు లాంటివి తయారు చేసి ఇవ్వాలని సూచిస్తున్నాను. పేరయినా, లోగో అయినా తెలంగాణ ఆత్మని ప్రతిబింబించేలా ఉండాలి. మొట్టమొదటి సారి ఇవ్వబోయే ఈ అవార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. పూర్తి పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేయాలని కమిటీ చైర్మన్,సభ్యులకు సూచిస్తున్నాను. అవార్డుల వేదిక కూడా రెండు మూడు ఆప్షన్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశాలన్నీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. -
హైడ్రా ఎపిసోడ్లో ట్విస్ట్: రేవంత్ సర్కార్ ప్లాన్ ఏంటంటే..
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ని తప్పిస్తారా? వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా?.. అనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే ఈ విషయంలో తొందరపాటు వద్దని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. హైడ్రా చర్యలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా.. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నరలో ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం అసాధారణమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను గౌరవించడం చట్టబద్ధ పాలనకు కీలకమని పేర్కొంది. ప్రజా ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకూ లేదని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లడం గ్యారెంటీ అనే చర్చ మొదలైంది. అయితే కోర్టు ఆర్డర్ కాపీని అధికారికంగా అందుకుని పరిశీలించాకే తర్వాతే ముందుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ (ఏజీ)తో పాటు న్యాయ నిపుణుల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. అప్పీల్‌పై ప్రభుత్వ కసరత్తుహైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. సీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించి న్యాయపరమైన అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తిస్థాయిలో పరిశీలించి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.ప్రస్తుతం హైడ్రా కమిషనర్ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనను పదవి నుంచి తప్పించాలన్న ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ కావడంతో.. అప్పీల్ ఎవరు దాఖలు చేయాలి? ప్రభుత్వం తరఫున వెళ్లాలా? లేదంటే రంగనాథ్ వ్యక్తిగతంగా అప్పీల్ చేయాలా? అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.రంగనాథ్ వివరణ.. ‘కబ్జాదారులే కేసులు వేశారు’మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తనపై ఉన్న 63 ధిక్కరణ కేసులు భూకబ్జాదారులు వేసినవేనని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను రక్షించే క్రమంలోనే ఈ కేసులు ఎదుర్కొంటున్నానన్నారు. రెండేళ్లలో హైడ్రా ద్వారా మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు రక్షించామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తితోనే చేపట్టామని చెప్పారు. తనపై వచ్చిన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.హైడ్రా ఏర్పాటు అలా.. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)ను ఏర్పాటు చేసింది. కేబినెట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 99 ద్వారా హైడ్రాకు అధికారిక రూపం కల్పించారు. నగరంలో ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో హైడ్రాను రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక సంస్థగా భావిస్తోంది. ముఖ్యంగా చెరువులు, నాలాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం తన పాలనలో కీలక అజెండాగా తీసుకుంది.హైడ్రా భవిష్యత్‌పై ఉత్కంఠఇదిలా ఉండగా.. హైడ్రా పనితీరు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా సాధించిన ఫలితాలను ప్రభుత్వం వివరించనుంది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు అమలవుతాయా? లేదంటే ప్రభుత్వం అప్పీల్‌తో ముందుకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. డివిజన్ బెంచ్‌లో జరిగే విచారణే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనసాగింపుపై కీలకంగా మారనుంది. -
ఇక ఫ్యామిలీ రిజిస్టర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కుటుంబాల వివరాలన్నింటినీ ఎల్రక్టానిక్ పద్ధతిలో నమోదు చేయడం ద్వారా ‘ఫ్యామిలీ రిజిస్టర్’రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రభుత్వ సేవలు పొందే విషయంలో కుటుంబ వివరాలకు సంబంధించిన నమ్మకమైన రికార్డును చూపించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని, కుటుంబ వివరాల పరిశీలనలో ఏకరూపత, సులభంగా అందుబాటులో ఉండటం లక్ష్యంగా రికార్డును రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ను ఏర్పాటు చేయడంతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీకి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ జారీ చేసిన జీవో నం:172 ప్రకారం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. – పౌరసరఫరాల శాఖ ద్వారా తీసుకునే డేటాబేస్‌లోని రేషన్‌కార్డులో ఉన్న కుటుంబ సమాచారాన్ని రిజిస్టర్లో నమోదు చేస్తారు. –ఈ రిజిస్టర్ కానీ, సర్టిఫికెట్ కానీ దేనికీ అధీకృతం కాదు. కేవలం డేటాబేస్‌లో ఆ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు మాత్రమే ఉపయోపడుతుంది. దీని ద్వారా ఎలాంటి హక్కులూ దఖలు పడవు. ఆస్తులపై ఎలాంటి టైటిల్ రాదు. చట్టపరమైన వారసత్వాన్ని ధ్రువీకరించదు. ప్రభుత్వ పథకాల్లో లబి్ధకి ఉపయోగపడదు. –నిర్దేశించిన ఫీజును చెల్లించడం ద్వారా మీ సేవా కేంద్రం లేదా ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్లో కుటుంబ సభ్యుడు ఈ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. –ఆ కుటుంబ వివరాల్లో పేరున్న మేజర్ అయిన సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. –దరఖాస్తు చేసుకున్న రెండు పని దినాల్లో సంబంధిత సర్టిఫికెట్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. –రేషన్‌కార్డులో నమోదై ఉన్న చిరునామా ఆధారంగా సదరు తహశీల్దార్ ఈ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. మీసేవా కేంద్రం నుంచి తహశీల్దార్ లాగిన్లోకి నేరుగా దరఖాస్తు వెళుతుంది. –రేషన్‌కార్డులో నమోదై ఉన్న అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత తన డిజిటల్ సంతకంతో సంబంధిత తహశీల్దార్ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్‌పై ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఉంటుంది. మీ సేవా కేంద్రాల నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశముంటుంది. –ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ)ను ఏర్పాటు చేసే బాధ్యత ఎల్రక్టానిక్ సరీ్వస్ డెలివరీ (ఈఎస్డీ) కమిషనర్‌కు అప్పగించారు. రేషన్‌కార్డుల్లోని వివరాలను పౌరసరఫరాల శాఖ సహకారంతో తీసుకుంటారు. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ సేవ అమలును ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఫ్యామిలీ రిజిస్టర్లో నమోదు చేసే కుటుంబ వివరాలివే: 1) ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఆ కుటుంబ రేషన్‌కార్డు నంబర్) 2) కుటుంబ యజమాని పేరు 3) కుటుంబ సభ్యులందరి పేర్లు 4) యజమానితో కుటుంబ సభ్యుల బంధుత్వం 5) ప్రతి సభ్యుడి వయసు, పుట్టినరోజు 6) పురుషుడు/స్త్రీ/ఇతరులు 7) ప్రతి సభ్యుడి ఆధార్ కార్డు 8) ఇంటి నంబర్, వీధి, గ్రామం/వార్డు, గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ, మండలం, జిల్లాతో కూడిన కుటుంబ చిరునామా. ‘సర్’కూ ఇది ఉపయుక్తం సర్ 2026 ప్రక్రియలో భాగంగా ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్ల నుంచి స్వీకరించి.. ఆగస్టు 10వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ముసాయిదా జాబితాలో పేర్లు వచ్చిన వారి వివరాల్లో తేడాలు ఉంటే ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నోటీసులు జారీ చేసి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వో) విచారణకు పిలుస్తారు. విచారణకు హాజరైన వారు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. అందులో 10వ పత్రంగా ఈ ‘ఫ్యామిలీ రిజిష్టర్’సర్టిఫికెట్ కూడా ఉంది. ఏ పత్రాలు లేని వారికి ఇది ఉపయోగపడుతుంది. -
రూ.6 లక్షలకే రూ.60 లక్షల ఫ్లాట్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున పేదలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతంలోనే సొంతింటి కలను నెరవేర్చేందుకు నియోజకవర్గాన్ని యూనిట్‌గా ఎంపిక చేశామన్నారు. అక్కడే ఇందిరమ్మ టవర్స్ నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ ఇళ్ల కోసం స్థానికంగా అందుబాటులో ఉన్న మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీసేవ వాట్సాప్ నంబర్(8096958096), మీ సేవ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.60 లక్షల విలువ ఉండే ఒక ఫ్లాట్‌ను కేవలం రూ.6లక్షలకు మాత్రమే ఇస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, దరఖాస్తులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో రిజర్వేషన్లు పాటిస్తామని, అన్ని వర్గాలకు ఇళ్లు ఇచ్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తం ఇళ్లలో 50శాతం ఇళ్లు రిజర్వేషన్ల పద్దతిలోనే కేటాయిస్తామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. లబ్ధిదారుల మీద ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తోందని, ఇది విక్రయ ప్రక్రియ కాదని, ప్రభుత్వ ఆర్థిక సహకారం అని స్పష్టం చేశారు. లబ్ధిదారుడి వాటా అన్ని ప్రాంతాల్లో రూ.6 లక్షలు మాత్రమే అని అన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లలో యాజమాన్య హక్కుల రిజర్వేషన్‌కు సంబంధించి ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం చొప్పున మొత్తం 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. ఈ 50 శాతం రిజర్వేషన్లలో 30 శాతం మహిళలకే కేటాయిస్తున్నామని, మిగిలిన 50 శాతం వాటా జనరల్ కేటగిరీకి మంజూరు చేస్తామన్నారు. -
పరిహారంపై పన్నాగం!
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను అడ్డుపెట్టుకొని పరిహారం కొట్టేసేందుకు కొందరు అక్రమార్కులు స్కెచ్ వేశారు. బ్యాంకులో తనఖాలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు చెందిన భూములను అక్రమంగా తమ పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. సదరు ప్రైవేటు సంస్థ బ్యాంకులో తనఖా పెట్టిన భూములు ఆ సంస్థ పేరిట మ్యుటేషన్ కాకపోవడాన్ని అనువుగా మలుచుకున్నారు. దీంతో ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లో అడ్డదారిలో రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కిన అక్రమార్కులనే పట్టాదారులుగా పేర్కొన్నారు. దీంతో తమవి కాని భూములపై రూ. కోట్లలో పరిహారం కొట్టేసేందుకు భూసేకరణ నోటిఫి కేషన్‌ను అక్రమార్కులు అడ్డుపెట్టుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పరిహారం కొట్టేసేందుకే పారి శ్రామిక పార్కు ఏర్పాటు ప్రతిపాద నను తెర పైకి తెచ్చారని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ప్రయత్నాలకు అధికార పార్టీకి చెందిన బడా నేతలతోపాటు విపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడి సహకారం ఉందని సమాచారం. కేంద్రంలో రోజూ కత్తులు దూసు కునే పార్టీల ముఖ్య నేతలు పరిహారం కొట్టేసేందుకు కలసి కట్టుగా కుట్ర పన్నినట్లు ఆరోపణలు వస్తున్నా యి. ఈ ఉదంతానికి సంబంధించి ‘సాక్షి’ పరిశీలన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.ముందు కొన్నదొకరు.. వేలంలో కొన్నదొకరు ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం హత్తీఘాట్, రాంపూర్, గూడ, గిమ్మబి గ్రామాల్లో 2062.01 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హత్తీఘాట్ పరిధిలో 1,194.10 ఎకరాలు, గూడలో 259.23 ఎకరాల భూసేకరణకు మే 29న రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. హత్తీఘాట్లో 298 సర్వే నంబర్లు, గూడలో 83 సర్వే నంబర్ల పరిధిలోని భూమిని సేకరిస్తున్నట్లు యజమానుల పేర్లతో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే జీఎస్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థ బ్యాంకులో తనఖా పెట్టిన భూములు కూడా ఇందులో ఉన్నాయి. ఆదిలాబాద్‌కు చెందిన ఈ సంస్థ.. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని నాందేడ్‌లో స్థానికుల నుంచి 3,103.41 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. కాలక్రమంలో ఈ భూములను ఎస్బీఐ, యుకో, బ్యాంక్ ఆఫ్ మారిషస్ వంటి బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ. వందల కోట్లు రుణం తీసుకుంది. అయితే జీఎస్ బయోటెక్ రుణాలు చెల్లించకపోవడంతో ఎస్బీఐ నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. 2022 చివరి నాటికే తమకు రూ. 770 కోట్లకుపైగా రావాల్సి ఉందని ఎస్బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023 మార్చిలో హైదరాబాద్ ఎన్సీఎల్టీ దివాలా ప్రక్రియను ప్రారంభించినా అది ముందుకు సాగలేదు. దీంతో కంపెనీ ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్) 2024 సెప్టెంబర్‌లో ఆమోదం లభించింది. 2025 డిసెంబర్ 31న జరిగిన ఈ వేలంలో బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రూ. 40.20 కోట్లకు ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని భూములతోపాటు మరికొన్ని భూములను దక్కించుకుంది. ఈ మేరకు జీఎస్ బయోటెక్ లిక్విడేటర్ ఈ ఏడాది జనవరి 12న వేలంలో అత్యధిక బిడ్ వేసిన సంస్థకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) కూడా పంపించారు. బిడ్‌ను పొందిన బెంగళూరు సంస్థ.. ఆ భూములను తమ పేరిట రెవెన్యూ రికార్డుల్లో బదలాయింపు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఈ పని కాకపోవడంతో భూసేకరణ నోటిఫికేషన్లో సదరు భూములకు సంబంధించిన యజమానిగా ఈ సంస్థ పేరు లేదు. గతంలో జీఎస్ బయోటెక్ పేరిట మ్యుటేషన్ జరగకపోవడంతో ఆ సంస్థ పేరు కూడా లేదు. దీంతో పరిహారం దోపిడీకి తెరలేచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమంగా ఇతరుల పేరిట మార్చి..గతంలో భూములు అమ్మిన యజమానులతో కుమ్మక్కైన అక్రమార్కులు.. జీఎస్ బయోటెక్‌కు చెందిన 500 ఎకరాలకుపైగా భూములను వక్ర మార్గంలో ఇతరుల పేర్లకు మార్చి దోపిడీకి తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహాలో భూములు పొందిన జాబితాలో డెక్కన్ సిమెంట్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విపక్ష ఎమ్మెల్యే కుమారుడు, కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన అత్యంత కీలక నేతలు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పారిశ్రామిక పార్కు భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లోని సర్వే నంబర్లలోని వివరాలు కూడా అనుమానాలను బలపరిచేలా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువకు 3–4 రెట్లు అధికంగా పరిహారం వచ్చే అవకాశం ఉండటంతో రూ. కోట్లు కొట్టేసే ప్రణాళికల్లో భాగంగానే పారిశ్రామిక పార్కు ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఏరియల్ సర్వేలో అధికార పార్టీ నేతలతోపాటు విపక్ష ఎమ్మెల్యే కూడా పాల్గొనడాన్ని స్థానికులు ప్రస్తావిస్తున్నారు. సుమారు 500 ఎకరాలకు సంబంధించి జీఎస్ బయోటెక్ భూములను అక్రమార్కులు తమ పేరిట మార్చుకున్నట్లు సమాచారం.సర్వే నంబర్ 39లో ఎన్ని అక్రమాలో..!హత్తీఘాట్ సర్వే నంబర్ 39లోని 33.31 ఎకరాలను జీఎస్ బయోటెక్‌కు చెందిన సుమన్ అగర్వాల్ 2006 డిసెంబర్ 11న (డాక్యుమెంట్ నంబర్ 361/06) కొనుగోలు చేశారు. మరుసటి ఏడాది ఎస్‌బీహెచ్‌కు తనఖా (డాక్యుమెంట్ నంబరు 4790/07) పెట్టారు. అయితే ఇదే భూమిని తూడెం గణేశ్ అనే వ్యక్తి ఉగ్గె సత్యనారాయణ (డాక్యుమెంట్ 7068/2016)కు విక్రయించినట్లు రికార్డుల్లో ఉంది. తిరిగి అదే వ్యక్తి డెక్కన్ సిమెంట్స్‌కు 33.31 ఎకరాలు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లో డెక్కన్ సిమెంట్స్ పేరిట 30.31 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహాలో గూడ గ్రామంలోని 112/1/3 సర్వే నంబర్ భూములు కూడా విపక్ష ఎమ్మెల్యే కుమారుడు డెక్కన్ సిమెంట్స్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే సర్వే నంబర్లు 114, 115, 117తోపాటు పలు సర్వే నంబర్లకు సంబంధించి జరిగిన లావాదేవీలు, లిక్విడేటర్ వేలం వేసిన భూముల్లో సైతం ఇవే సర్వే నంబర్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై లోతైన విచారణ జరిపితే అక్రమాలు పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం ఉంది. -
ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా జి.చిన్నారెడ్డిని నియమించింది. కమిటీ కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఉంటారు. ఎల్‌నినో ప్రభావంపై కమిటీ అంచనా వేయనుంది. కరవు నివారణ చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది.మరోవైపు, శనివారం విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించిన వేళ ఎల్‌నినో సవాళ్లపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాభావంతో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, సాగు నీటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ పంపిణీలో ఏఐ వినియోగాన్ని విస్తరించాలని ఆదేశించారు. డీటీఆర్ మ్యాపింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. -
తెరిచి నెల.. యూనిఫాం ఓ కల!
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లనూ మెరుగు పరుస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పింది. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, పుస్తకాలు.. అన్నీ అందిస్తామని ప్రకటించింది. దుస్తుల రంగు కూడా ఆకర్షణీయంగా కన్పించేలా మార్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్ళించేందుకు చేపట్టిన బడిబాటలోనూ టీచర్లు ఇవే అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది లక్ష వరకూ అడ్మిషన్లు పెరిగాయి. కానీ స్కూళ్లు తెరిచి నెల రోజులు కావొస్తోంది. కానీ ఇంతవరకూ యూనిఫాం అందలేదు. పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదు. యూనిఫాం కోసం ఆగస్టు నెలాఖరు వరకూ ఓపిక పట్టాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. యూనిఫాం కూడా ఇవ్వకపోవడంతో పిల్లలు పాత దుస్తులే ధరించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎందుకీ ఆలస్యం?: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42,901 పాఠశాలలున్నాయి. ఇందులో 12,126 ప్రైవేటు స్కూళ్లు కాగా. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది వరకూ విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఏడాదికి రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. కాగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇదే క్రమంలో విద్యార్థులకు బ్రాండెడ్ (మన్నికైన) దుస్తులు అందించేందుకు రూ.678.78 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించింది. ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల యూనిఫాం, దుప్పట్లు, బెడ్షీట్లు ఇవ్వాలంటే మొత్తం 2.97 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం. గతంలో ఈ వ్రస్తాన్ని స్థానిక చేనేత కారి్మకుల సహకార సంఘం నుంచి కొనుగోలు చేసేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ఎక్కువ భాగం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. సహకార సంఘానికి 30 శాతం వస్త్రం కొనుగోలుకు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది. కాగా ప్రైవేటు సంస్థలకు టెండర్ డాక్యుమెంట్ తయారు చేయడం, టెండర్లు పిలవడం, వాటిని ఖరారు చేయడం, అనుమతుల ప్రక్రియ సాఫీగా సాగలేదు. కొంత ఆలస్యమైంది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ చెల్లింపులోనూ జాప్యం జరిగినట్టు కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయి. సహకార సంఘాలకు ముందస్తుగా చెల్లించకపోయినా వస్త్రం మాత్రం సమకూర్చేవి. యూనిఫాంకు 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం కాగా.. కార్పొరేట్ స్కూళ్ళ తరహాలో ఉండాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీలను ఎంచుకుంటే ఏతావాతా..వస్త్రం ఇవ్వడంలోనే జాప్యం చోటు చేసుకుంది. మిల్లుల నుంచి వాటిని తెప్పించడం మరింత ఆలస్యమైంది. వాస్తవానికి కావాల్సిన వస్త్రం కూడా పూర్తిస్థాయిలో అందలేదని సమాచారం. కాగా ఎంత వచ్చింది అనే వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. పొలం పనులు వదిలేసుకుని కుట్టడం ఎలా? వస్త్రం రావడం ఆలస్యం కావడం, వచ్చిన తర్వాత కుట్టడానికీ సమయం పట్టే అవకాశం ఉండటంతో యూనిఫాంల పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకోక తప్పదని అధికారులే అంటున్నారు. యూనిఫాం కుట్టే బాధ్యత ఎక్కడికక్కడ స్వయం సహాక సంఘాలకు అప్పగించారు. వాస్తవానికి ఈ ప్రక్రియ స్కూళ్ళు మొదలైన సమయంలో చేపడితే ఇప్పటికే యూనిఫాం కుట్టడం పూర్తయ్యేది. అలాకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులు మొదలయ్యాక వస్త్రం ఇచ్చారని సంఘాల మహిళలు చెబుతున్నారు. కటింగ్ కోసం మండల కేంద్రానికి వెళ్ళడం, కటింగ్ పూర్తయిన తర్వాత వాటిని కుట్టడంపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫాంలు కుట్టే సామర్థ్యం మహిళా సంఘాలకు ఉందని చెప్పినా, ఫలితాలు మాత్రం ఈ దిశగా లేవని అధికారులు అంటున్నారు. ‘యూనిఫాం కుట్టేందుకు ఒక్కోదానికి రూ.75 ఇస్తారు. పొలం పనులు వదిలేసుకుని దీనిపైనే ఎలా ఆధార పడతాం’ అని మహిళలు అంటున్నారు. ఒక్కొక్కరు రోజుకు 10 వరకు యూనిఫాంలు కుట్టే అవకాశం ఉండగా, 27 లక్షల విద్యార్థుల కోసం 54 లక్షల యూనిఫాంలు అవసరం. కాగా ఆగస్టు నెలాఖరు వరకూ యూనిఫాం అందించడం సాధ్యం కాకపోవచ్చని పాఠశాల విద్య అధికారులు భావిస్తున్నారు. పుస్తకాలకూ ఇబ్బందే కేజీబీవీలు, గురుకులాల్లో పుస్తకాల పంపిణీ సరిగానే జరిగింది. ఇదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ (విద్యకు సంబంధించిన సమాచార వ్యవస్థ) లెక్కల ప్రకారం పుస్తకాలు, నోట్బుక్లు ఇచ్చారు. అయితే బడిబాట వల్ల, ఇతర మార్గాల్లో కొత్తగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరిన వారికి మాత్రం ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా లక్షపైనే ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు చివరివరకూ కొత్త ప్రవేశాలకు సమయం ఉంది. ఇది ముగిసిన తర్వాతనే కొత్త వారి జాబితాను రాష్ట్ర కార్యాలయానికి పంపుతారు. అప్పుడు కొత్త పుస్తకాల ముద్రణకు టెండర్లు ఖరారు చేయాలి. దీంతో పాటు పేపర్ తెప్పించాలి. ఇప్పటికే పేపర్ సరఫరా చేసే సంస్థలకు రూ.150 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ముద్రించే కాంట్రాక్డు సంస్థలకూ రూ.కోట్లల్లోనే బకాయిలున్నాయి. ఇవి రాకుండా ముందుకెళ్ళేందుకు కాంట్రాక్టు సంస్థలు సుముఖంగా లేవని తెలుస్తోంది. దీనివల్ల పుస్తకాల పూర్తిస్థాయి పంపిణీలో కూడా తీవ్ర జాప్యమే చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. యూనిఫాం పంపిణీపై దృష్టి పెట్టాం.. యూడైస్ లెక్కల ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళల్లో 16 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేశాం. ఎక్కడా ఇబ్బంది లేదు. కొత్తగా చేరిన వారికీ అందిస్తాం. యూనిఫాం పంపిణీపై దృష్టి పెట్టాం. – డాక్టర్ నవీన్ నికొలస్ (పాఠశాల విద్య కమిషనర్) -
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఆడిట్
సాక్షి, హైదరాబాద్: ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపులు, వారికి అందాల్సిన ఆర్థిక లబ్ధి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెలల తరబడి వేతన చెల్లింపులు చేయకపోవడం, ఈఎస్ఐ, ఈపీఎఫ్ చందా చెల్లింపుల్లో జాప్యం తదితర అంశాల్లో నెలకొన్న అవకతవకలు, అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఉపక్రమించింది. ఈ అంశాలపై ‘సాక్షి’ప్రచురిస్తున్న వరుస కథనాలపై కదిలిన ప్రభుత్వ యంత్రాంగం ఈ దిశగా చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా కార్మిక శాఖ కార్యదర్శి డి.హరిచందన, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఈవీవీ నాగేశ్వరరావు, ఆడిట్ విభాగం సంచాలకులు ద్రాక్షామణి, జీఏడీ నామినేటెడ్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించిన ఏజెన్సీలపై ఈ కమిటీ ఆడిట్ నిర్వహిస్తుంది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నారు. వారి సంక్షేమం, చట్టబద్ధ హక్కులు, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ⇒ లేబర్ లైసెన్స్, కనీస వేతనాలు వంటి చట్టాలను ఏజెన్సీలు పాటిస్తున్నాయా అనే విషయాన్ని ఈ కమిటీ పరిశీలించాలి. ⇒ ఉద్యోగుల జీతాలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఆడిట్ నిర్వహించాలి. ⇒ ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, కనీస వేతనాల చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం అమలును పరిశీలిస్తారు. ⇒ ఉద్యోగులకు జీతాలు డీబీటీ పద్ధతిలో బ్యాంక్ ఖాతాల్లో సకాలంలో జమ అవుతున్నాయా లేదా చూడాలి. ⇒ హాజరు రిజిస్టర్లు, వేతన రిజిస్టర్లతోపాటు ఏజెన్సీల వాస్తవ కార్యకలాపాలను ధ్రువీకరించుకోవాలి. ప్రభుత్వ శాఖలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలును పరిశీలించాలి. ⇒ ఉద్యోగుల సంక్షేమానికి విఘాతం కలిగించే లోపాలు, అక్రమాలను గుర్తించి పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సూచనలు కమిటీ ఇవ్వాలి. భవిష్యత్తులో ఔట్సోర్సింగ్ నియామకాల కోసం మార్గదర్శకాలు రూపొందించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక విధానం, వేతనాలు, సేవా నిబంధనలను సమీక్షించాలి. ⇒ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని నమోదు చేసి కేంద్రీకృత పర్యవేక్షణ కోసం పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. ⇒ ఈ కమిటీకి ప్రభుత్వ శాఖలు పూర్తిగా సహకరించాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల వివరాలు, ఉద్యోగుల సంఖ్య, ఆధార్ ధ్రువీకరణ, ఈఎస్ఐ, పీఎఫ్ వివరాలు, జీతాల చెల్లింపు వివరాలు, జీతాలు చెల్లించిన విధానం, సమయపాలన తదితర వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలి. ఇందుకోసం ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి. ఈ కమిటీ 45 రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలి. ⇒ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
క్రమబద్ధీకరణ కిరికిరి!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన అనధికార లే ఔట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్’(ఎల్ఆర్ఎస్) అమలు ఆరేళ్లుగా కొలిక్కి రావడం లేదు. 2020లో ఆగస్టులో ఎల్ఆర్ఎస్ కింద అనధికార లే ఔట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోరుతూ 26 లక్షలకు పైగా దరఖాస్తులు అందినా ఇప్పటివరకు కేవలం 3.20 లక్షల దరఖాస్తులు మాత్రమే పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యాయి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ముందుకు సాగక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన ఫీజులో ఈ నెల 31 వరకు 25 శాతం రాయితీని ప్రకటించింది. అయితే రాయితీ గడువు ముగుస్తున్నా దరఖాస్తుదారుల నుంచి అంతంత మాత్రంగానే స్పందన కనిపిస్తోంది. రాయితీ ప్రకటనతో దరఖాస్తుదారులు భారీగా ముందుకు వచ్చి రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లిస్తారని, రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించినా రూ.80 కోట్ల మేర మాత్రమే వసూలైనట్లు సమాచారం. ఫీజు చెల్లింపులకు అంతంత మాత్రం స్పందన, భౌతిక తనిఖీలు, రికార్డుల పరిశీలన, సాంకేతిక సమస్యలు, వివాదాల కారణంగా దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. దరఖాస్తుల వెల్లువ.. చెల్లింపుల్లో వెనుకంజ అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణ పథకం 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ అయిన ప్లాట్లు, లే ఔట్లకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో రెగ్యులరైజేషన్ కోరుతూ 26.76 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 21.63 దరఖాస్తులను పరిశీలించి రెగ్యులరైజేషన్ కింద కట్టాల్సిన ఫీజు వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేశారు. ఇందులో కేవలం 7.20 లక్షల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. అయితే 3.20 లక్షల మందికి మాత్రమే తుది ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. అంటే ఈ దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయన్న మాట. ఇటు ప్రభుత్వ పరంగా, మరోవైపు దరఖాస్తుదారుల పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. దరఖాస్తులు లోపాల పుట్టగా ఉండటం, రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడాన్ని అధికారులు కారణంగా చూపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు, కోర్టు వివాదాలు, ఎఫ్టీఎల్ పరిధిలోని భూములను క్రమబద్ధీకరణకు కూడా దరఖాస్తులు అందినట్లు అధికారులు చెప్తున్నారు. తాము ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా క్షేత్ర స్తాయి తనిఖీలు జరగకపోవడం, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడంలో సాంకేతిక సమస్యలు, చెల్లించాల్సిన ఫీజుపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలతో తమ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు అనధికార లే ఔట్లలో కొన్నిచోట్ల కొత్త కాలనీలు ఏర్పాటు కాగా, చాలావరకు అభివృద్ధికి నోచుకోలేదు. పిచ్చి మొక్కలతో కొన్ని లే ఔట్లు చిట్టడవిని తలపిస్తున్నాయి. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారుల ప్లాట్లను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో వాటి హద్దులను గుర్తించడం సిబ్బందికి కష్టతరంగా మారింది. ప్లాట్లు పలుమార్లు చేతులు మారడం, యజమానులు చిరునామాలు మార్చడం, వలస వెళ్లడం వంటి కారణాలతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత కూడా అడ్డంకిగా మారింది. కొందరు దరఖాస్తుదారులు రెగ్యులరైజేషన్‌కు అవసరమైన సేల్ డీడ్, లే ఔట్ ప్లాన్ కాపీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, ఆధార్ కార్డు వంటి పత్రాల్లో కొన్నింటిని మాత్రమే అప్లోడ్ చేయడంతో రెగ్యులరైజేషన్ ముందుకు సాగడం లేదు. ఎల్ఆర్ఎస్ కొలిక్కి వస్తే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా ఆస్తి పన్ను రూపంలో ఆదాయం పెరిగే అవకాశముంది. మరోవైపు ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు, బ్యాంకు రుణాలు, నిర్మాణ అనుమతుల్లో వేగం పెరిగి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. రాయితీ గడువు పెంచే చాన్స్ లేదు! ఎల్ఆర్ఎస్ గడువు పెంచుతూ, 2020 నాటి నిబంధనలను సవరిస్తూ ఎల్ఆర్ఎస్ ఫీజు, చార్జీల చెల్లింపుపై 25 శాతం రాయితీ ఇచ్చేందుకు గత ఏప్రిల్ 29న ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.131 జారీ చేసింది. ఈ రాయితీ 2026 మే 1 నుంచి జూలై 31 వరకు అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తారని భావించినా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మరో 20 రోజుల్లో రాయితీ గడువు ముగుస్తున్నప్పటికీ తిరిగి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. రాయితీపై సందేశాలు పంపిస్తున్నాం.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవాల్సిందిగా దరఖాస్తుదారులకు సందేశాలు పంపిస్తున్నాం. దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సాంకేతిక, ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎస్.దేవేందర్‌రెడ్డి, డైరక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఫీజు చెల్లించినా అనుమతి రాలేదు మా గ్రామం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైంది. 2020లో ప్లాట్ రెగ్యులరైజేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం. ఇందుకు సంబంధించిన ఫీజును కూడా చెల్లించాం. ఇప్పటివరకు అనుమతులు రాలేదు. సమస్య ఏంటని అధికారులను అడిగితే.. విలీన గ్రామం కావడంతో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పూర్తి స్థాయిలో లేవని సమాధానం చెబుతున్నారు. కొన్ని డాక్యుమెంట్లు ఇటీవల ఇచ్చాం. అయినప్పటికీ పని పూర్తి కాలేదు. ఒక డిపార్ట్మెంట్ అధికారిని అడిగితే మరో డిపార్ట్మెంట్ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. – శేఖర్, దివిటిపల్లి, మహబూబ్‌నగర్ 4,500 మంది ఆచూకీ లేదు జనగామ మున్సిపాలిటీలో 18,065 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13,607 మందికి రెగ్యులరైజేషన్ సమాచారం పంపారు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తిచేసి 1,996 మందికి ప్రోసిడింగ్ ఇచ్చినా, 295 మంది మాత్రమే పూర్తి ఫీజు చెల్లించి సబ్ రిజి్రస్టా్టర్ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. ఇక సుమారు 4,500 మంది దరఖాస్తుదారుల అడ్రస్ దొరకడం లేదు. ప్లాట్లు చేతులు మారడం, మరణాలు, వలసలు వంటి కారణాలతో అందరికీ సమాచారం ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు చెప్తున్నారు. -
ఏం పండించాలో ప్రభుత్వమే చెప్పాలా?
ఇటీవల ఏడు సన్నరకాల వరి రకాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించింది. గతంలో 33 నోటిఫైడ్ రకాల వరికి ఈ ప్రోత్సాహకం ఉండగా, ఇప్పుడు బీపీటీ–5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ ఆర్–15048), కునారం సన్నాలు (కేఎన్ ఎం–1638), జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్–44 (సిద్ధి), కేఎన్ ఎం–7715 అనే ఏడు రకాలకే పరిమితం చేశారు. ఇందుకు ప్రభుత్వం చెప్పే కారణం ఏమిటంటే... ఈ రకాలకే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. మిల్లింగ్ సులభంగా ఉంటుంది. ప్రభుత్వ సేకరణ ప్రక్రియ, వ్యయం కూడా తగ్గుతుంది. ఈ కారణాలు పరిపాలనా పరంగా సరైనవే కావచ్చు. కానీ ఈ నిర్ణయం వ్యవసాయ భవిష్యత్తుపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అభివృద్ధి సంస్థలు రైతులకు పంటల వైవిధ్యం, రకాల వైవిధ్యం, తక్కువ నీరు వినియోగించే పంటలు, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సంప్రదాయ విత్తనాలను కాపాడాలని కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే మరోవైపు కేవలం ఏడు సన్న వరి రకాలకే బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు భిన్నమైన సంకేతం వెళుతోంది. రూ. 500 బోనస్ చిన్న మొత్తం కాదు. ఏ రకం విత్తనం వేయాలనే నిర్ణయాన్ని ఇది ప్రభా వితం చేస్తుంది. క్రమంగా రైతులు ఇతర రకాలను వదిలి బోనస్ ఉన్న రకాలవైపు వెళ్లే అవకాశం ఉంది.రైతులు ఒక వరి రకాన్ని కేవలం మార్కెట్ ధర చూసి మాత్రమే ఎన్నుకోరు. నేల స్వభావం, నీటి లభ్యత, పంట కాలం, చీడపీడల నిరోధకత, గింజ నాణ్యత, గడ్డి దిగుబడి, ఇంటి అవసరాలు, స్థానిక వాతావరణ పరిస్థితులు– ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక మండ లంలో బాగా పండే రకం, మరో మండలంలో అదే స్థాయిలో ఫలితం ఇవ్వకపోవచ్చు.తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే రకం ఎంటీయూ–1010. మంచి దిగుబడి, స్థిరమైన పనితీరు, వివిధ నేలల్లో అనుకూలత, తక్కువ ప్రమాదం కారణంగా వేలాది మంది రైతులు ఈ రకాన్ని ఇష్టపడి సాగుచేస్తున్నారు. కానీ ఈ రకం బోనస్ జాబితాలో లేదు. మరోవైపు బీపీటీ–5204 వంటి రకం మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇస్తుంది. కానీ ఎక్కువ కాలం, ఎక్కువ నీరు అవసరం. అగ్గితెగులు, దోమ పోటు వంటి చీడపీడలకు ఎక్కువగా గురవుతుంది.ప్రతి రకానికి దాని బలాలు, బలహీనతలు, ప్రాముఖ్యం ఉంటాయి. రాష్ట్రమంతా ఈ ఏడు రకాలపైనే ఆధారపడితే, విత్తనాలకు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగి, కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఇది విత్తన ధరలను పెంచి, రైతులను ప్రైవేట్ విత్తన కంపెనీలపై మరింతగా ఆధారపడేలా చేస్తుంది. పరిమిత రకాల వల్ల మిల్లు యజమానులకు కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియ సులువు కావచ్చు; కానీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులకూ, జీవ వైవిధ్యానికీ కలిగే ప్రయోజనాలు ఏమిటి?వైవిధ్యమే రైతుకు రక్షణవికారాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులతో చేసిన చర్చల్లో మరో వాస్తవం బయటపడింది. కొంతమంది రైతులు మార్కెట్ లేకపోవడంతో మంచి దిగుబడి ఇచ్చే రకాలను వదిలేశారు. మరికొందరు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండే గోదావరి ఇసుకలు, సిద్ధ సన్నాలు, కుళ్లకర్వంటి సాంప్రదాయ రకాలను ఇప్పటికీ సాగు చేస్తున్నారు. అవి తక్కువ నీటితో పండుతాయి. ఇంటి వినియోగానికి అనుకూలం. కొన్ని రకాలు ఎండలను, మరికొన్ని అధిక వర్షా లను తట్టు కుంటాయి.ఇప్పుడు వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతున్నాయి. వర్షపాతం అనిశ్చితంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమే రైతుకు రక్షణ. ఒకే రకాన్ని పెద్ద ఎత్తున సాగుచేస్తే ఒక చీడపీడ లేదా వ్యాధి వచ్చినప్పుడు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ వివిధ రకాలు సాగు చేస్తే ప్రమాదం తగ్గుతుంది. ఇదే వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయానికి పునాది. సంప్రదాయ రకాలు మన వ్యవసాయ వారసత్వం. అవి కేవలం గతానికి చెందినవి కావు. భవిష్యత్తుకు కూడా అవసరమైన జన్యు సంపద. ఇవి కనుమరుగైతే తిరిగి రైతుల పొలాల్లోకి తీసుకురావడం చాలా కష్టం.ఇక్కడ అసలు ప్రశ్న ఏడు రకాలు మంచివా? కాదా? అనేది కాదు. రైతుల ఎంపికను ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా కుదించడం సరైన విధానమా? అనేదే అసలు ప్రశ్న. కొన్ని రకాలకే బోనస్ ఇవ్వడం కాకుండా, స్థానిక పరిస్థితులకు అనువైన రకాలను సాగు చేసే రైతులను ప్రోత్సహించవచ్చు. నీటి వనరులను వర్షాధార పంటల రక్షణకు సంధానించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే రైతు సమూహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాతావరణ మార్పులు పెరుగుతున్న ఈ కాలంలో... రైతులు ఎంచుకుంటున్న రకాలు, పంటలను మన విధానాలు తగ్గించకూడదు. మరింత విస్తరించేలా ఉండాలి.- భాగ్యలక్ష్మి, వ్యాసకర్త, వాటర్‌షెడ్ సపోర్ట్ సర్విసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్వర్క్ (వాసన్) అసోసియేట్ డైరెక్టర్ -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి ఆకస్మిక బదిలీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ అధికారిణి జి. లక్ష్మీబాయిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ప్రస్తుత బాధ్యతల నుండి బదిలీ చేస్తూ, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న ఐఏఎస్,ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక స్థానచలనం జరిగినట్లు సచివాలయ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ బదిలీ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన అధికారిణి లక్ష్మీబాయి, మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి కావడం దీనికి ప్రధాన కారణం. -
వరంగల్ కమిషనరేట్‌కు తొలి మహిళా సీపీగా శ్వేత
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనర్‌గా ఎన్.శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (లాఅండ్ఆర్డర్)గా ఉన్న ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వరంగల్ సీపీగా పనిచేసిన సన్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. శ్వేత తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఎస్పీ, డీసీపీగా çపలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. వరంగల్ సీపీ బాధ్యతలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జోన్–4 డీఐజీగా కూడా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.తొలి మహిళ కమిషనర్..వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటివరకు అంతా పురుషులే సీపీగా నియమితులయ్యారు. శ్వేత వరంగల్ కమిషనరేట్‌కు నియమితులైన తొలి మహిళా పోలీస్ కమిషనర్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఈ) పూర్తి చేసిన ఆమె ఆ తరువాత సివిల్స్ రాశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె.. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత, నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ప్రతి డివిజన్లో ప్రత్యేకంగా ’షీ టీమ్స్’ ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు. మహిళలకు డ్రైవింగ్, ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇప్పించారు, హైదరాబాద్ ఉత్తర మండల డీసీపీగా పనిచేశారు. 2021లో సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా నియమితులై కమిషనరేట్‌కు తొలి మహిళా కమిషనర్‌గా సరికొత్త రికార్డు సృష్టించారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో, ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించే వినూత్న సర్వే విధానాలను ప్రవేశపెట్టడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 16 మాసాలకే సన్‌ప్రీత్ సింగ్ బదిలీఇప్పటివరకు పనిచేసిన సీపీ సన్‌ప్రీత్ సింగ్ సుమారు 16 మాసాల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. ఆయన 2025, మార్చి 8న ఆయన వరంగల్ కమిషనరేట్‌కు సీపీగా వచ్చారు. ఆయనకు శాంతిభద్రతల విషయంలో ఎక్కడా తగ్గలేదన్న పేరుంది. బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఒక్కరిద్దరు ప్రజాప్రతినిధుల లేఖల సిఫార్సులు పట్టించుకోలేదని, వారడిగిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. శాంతిభద్రతలు, నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యల విషయంలో ఎక్కడా రాజీపడలేదని ఆశాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఫోన్లో పరస్పరం గొడవ పడ్డారన్న ప్రచారం ఉంది.క్రైమ్స్ డీసీపీగా కిషన్ సింగ్... ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న వరంగల్ పోలీసు కమిషనరేట్ క్రైం డీసీపీగా డి.కిషన్ సింగ్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన టీజీ–ఐసీసీసీ టెక్నికల్ విభాగంలో నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు షాక్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ భారీ షాకిచ్చింది. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల బేసిక్ పే (ప్రాథమిక వేతనం), పెన్షన్ల నుంచి ప్రతి నెలా 1.5 శాతం కోత విధించాలని నిర్ణయించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఫండ్‌కు ఈ విరాళాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సరికొత్త నిబంధన జూన్ నెల నుంచి అధికారికంగా అమలు కానుంది. మే నెల వేతనాలు, పెన్షన్ల నుంచే ఈ ఈహెచ్ఎస్ చందా కటింగ్స్ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ హెల్త్ స్కీమ్ ట్రస్ట్‌ను బలోపేతం చేసేందుకు కేవలం ఉద్యోగులపైనే భారం వేయకుండా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి లేదా పెన్షనర్ తన ప్రాథమిక వేతనం నుంచి ఎంత మొత్తాన్ని అయితే చందాగా చెల్లిస్తారో, అంతే సమాన మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ హెల్త్ ట్రస్ట్‌కు జమ చేయనుంది.ఈ నిబంధనలో ఉద్యోగ దంపతులకు ప్రభుత్వం కొంత మినహాయింపు ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ, ఇద్దరి జీతాల నుంచి కాకుండా ఒకరి బేసిక్ పే నుంచి మాత్రమే 1.5% కోత విధిస్తారు.ఒకవేళ ఉద్యోగి–పెన్షనర్ దంపతులైనా సరే ఈ మినహాయింపు వర్తిస్తుంది. పొరపాటున ఇద్దరి జీతాల నుంచి డూప్లికేట్ డిడక్షన్ (రెండు సార్లు కటింగ్) జరిగితే, ఆ అదనపు మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ నిర్ణయంతో ఈహెచ్ఎస్ ట్రస్ట్‌కు భారీగా నిధులు సమకూరనున్నాయి. అయితే ఈ వేతనాల కోతపై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నుంచి ఎలాంటి స్పందన రానుందో చూడాలి. -
పైకప్పు.. తప్పదు అప్పు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల క్షేత్రస్థాయి తనిఖీకి ఇటీవల వెళ్లిన అధికారులు ఓ ఇంటి పైకప్పును చూసి అవాక్కయ్యారు. ఆ ఇల్లు 600 చదరపు అడుగుల గరిష్ట విస్తీర్ణానికే పరిమితమైనప్పటికీ పైకప్పు మాత్రం ఏకంగా 1,300 చ.అ. విస్తీర్ణంలో నిర్మితమైంది. అంత విశాలమైన పైకప్పు ఎందుకు నిర్మించారని లబ్ధిదారును ప్రశ్నించగా మేస్త్రీనే అలా కట్టాలన్నాడని చెప్పారు. మేస్త్రీలు పైకప్పు నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.250 నుంచి రూ.300 వరకు బిల్లు వేస్తున్నారు. ఈ లెక్కన కేవలం పైకప్పు నిర్మాణానికే ఏకంగా రూ. 3.25 లక్షలకుపైగా ఖర్చవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయం రూ. 5 లక్షల్లో 65 శాతం కేవలం పైకప్పునకే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇలా ఈ ఒక్క ఇల్లే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా మేస్త్రీలు తమ బిల్లులు పెంచుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆటలాడుకుంటున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇంటి పైకప్పుల విస్తీర్ణాన్ని పెంచేసి నిర్మిస్తున్నారు. ఇలాంటి ఇళ్ల సంఖ్య భారీగా ఉందని తేలడంతో ఇకపై ఎవరూ ఇళ్ల పైకప్పులను ఎడాపెడా పెంచకుండా నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గరిష్టంగా 750 చదరపు అడుగులు.. ఇందిరమ్మ ఇళ్ల పైకప్పును గరిష్టంగా 750 చదరపు అడుగులకు మించకుండా నిర్మించాలని ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటివరకు ఇంటి విస్తీర్ణం (ప్లింత్ ఏరియా) 400–600 చ.అ.ల మధ్య ఉండాలన్న నిబంధన ఉంది. కానీ పైకప్పు విషయంలో ఎలాంటి పరిమితి లేదు. ఇప్పుడు దానికి కూడా ప్రభుత్వం పరిమితి విధించింది. ఇక నుంచి 400 చ.అ. విస్తీర్ణంలో ఉండే ఇంటికి గరిష్టంగా 500 చ.అ.లు, 500–600 చ.అ. వరకు ఉండే ఇంటికి గరిష్టంగా 750 చ.అ. మేర మాత్రమే పైకప్పు ఉండాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పైకప్పు ఉంటే దాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంటిగా భావించి బిల్లుల చెల్లింపును నిలిపేయనున్నారు. ఈ మేరకు ఇంటి పైకప్పుపై పరిమితిని ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ప్రభుత్వం సూచనలు... మేస్త్రీలు తమ బిల్లులు పెంచుకోవడానికి పైకప్పులను అవసరం కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తూ కిటికీలపై రక్షణ, నీడ కోసమని, ఇంటి ముందు భాగంలో పోర్టికో కోసమని లబ్ధిదారులను తప్పుదారి పట్టిస్తున్నారు. అలా నిర్మించాలేమోనన్న అమాయకత్వంతో లబ్ధిదారులు కాదనడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వ్యయం పెరిగి వారి జేబు గుల్లవుతోంది. తాజాగా ప్రభుత్వం లబ్ధిదారులకు పలు సూచనలు చేసింది. కిటికీలపై వర్షం నీళ్లు రాకుండా, నీడ కోసం ఇంటి పైకప్పును పెంచుకోకుండా... అంతమేర సజ్జా నిర్మించుకోవాలని, ఇంటి ముందు పోర్టికోగా పైకప్పును విస్తరించకుండా... రేకుల లాంటి తాత్కాలిక మెటీరియల్‌తో అవసరమైన మేర నిర్మించుకోవాలని సూచించింది. అవగాహన కల్పించకపోవడంతోనే... ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం ఖరారు చేసిన విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుంటే అంతకుమించి ఖర్చు కాదన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఈ విషయంలో లబ్ధిదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయకపోవడంతో చాలా మంది గరిష్ట పరిమితి 600 చ.అ.కు మించి ఇళ్లను నిర్మించుకున్నారు. దీంతో వారికి బిల్లుల విడుదల ఇబ్బందిగా మారింది. ఇప్పటికీ చాలా మంది బిల్లులు అందక ఇంటి నిర్మాణాన్ని నిలిపేసుకున్నారు. ఇక ఇంటి విస్తీర్ణం ఎంత ఉండాలన్న విషయంలో పరిమితులున్నా పైకప్పు విషయంలో లేదు. దీంతో భవిష్యత్తులో అవసరమైతే ఇంటిని విస్తరించుకునే వెసులుబాటు కలుగుతుందన్న ఉద్దేశంతో లబ్ధిదారులు ఇళ్ల పైకప్పును ఎక్కువ పరిధిలో నిర్మించుకుంటున్నారు. ఇరుగుపొరుగు, బంధువులు, మేస్త్రీల మాటలు నమ్మి ఇలా చేస్తున్నారు. చివరకు ప్రభుత్వం ఇచ్చే బిల్లుల మొత్తం సరిపోక అప్పులు చేయాల్సి వస్తోంది. -
మెట్రో మళ్లీ 'మొదటి'కి..
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మొదటిదశ స్వాదీన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. రెండు నెలల క్రితమే ఎల్అండ్టీ నుంచి ఈ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రుణాలు బదిలీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో స్వాధీనం, విస్తరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సంప్రదింపులు జరిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్– ఐ వాల్యూయేషన్‌తోపాటు స్వా«దీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్–2 విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాపిటల్‌ను కన్సల్టెన్సీగా నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎస్బీఐ క్యాప్స్ అందజేసే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పేర్కొనడంతో టేకోవర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఫలితంగా మొదటి దశ టేకోవర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎస్బీఐ క్యాప్స్ సంస్థ మెట్రో మొదటిదశపై అంచనాలను రూపొందిస్తూనే రెండోదశ నిర్మాణ వ్యయాన్ని కూడా అంచనా వేయనుంది. దీంతో రెండో దశ డీపీఆర్‌లో కూడా మార్పులు అనివార్యమయ్యాయి. ఐడీబీఐ నివేదిక సంగతేంటీ... మెట్రో మొదటిదశ ప్రాజెక్టును ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి గత ఏప్రిల్ 29న టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. గత సెపె్టంబర్లో మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు ఎల్అండ్టీ ప్రకటించినప్పటి నుంచి దశలవారీగా అనేక పరిణామాలు జరిగాయి. మూడు కారిడార్లలోని 69 కి.మీ. మెట్రో మొదటి దశ ప్రాజెక్టుపై అంచనాలను రూపొందించేందుకు అప్పట్లో ఐడీబీఐ సంస్థను నియమించారు. అలాగే సాంకేతిక అంశాలపై అంచనాల బాధ్యతలను ఢిల్లీ మెట్రోరైల్‌కు అప్పగించారు. ఈ రెండు సంస్థలు అందజేసిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ముందుకెళ్లింది. రూ.1,461.47 కోట్ల ఎల్అండ్టీ ఈక్విటీని చెల్లించడంతోపాటు రూ.13,538.53 కోట్ల అప్పును రీఫైనాన్స్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలాఖరునాటికి చెల్లింపులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా కూడా ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ వ్యవహరిస్తుందని నిర్ణయించారు. కానీ ఐఆర్ఎఫ్సీ నుంచి రుణాలు అందకపోవడంతో జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు విజయవంతంగా ముగిసినట్లు సీఎం ప్రకటించారు. అయితే, ఐడీబీఐ స్థానంలో ప్రస్తుతం ఎస్బీఐ క్యాపిటల్‌ను కన్సల్టెన్సీగా నియమించడంతో టేకోవర్ ప్రక్రియ ముందుకెళ్తోందా, వెనకడుగు వేస్తోందా తెలియని అయోమయం నెలకొంది. ఇప్పటి వరకు ఇలా... రెండో దశ నిర్మాణానికి అనుమతులను ఇచ్చేందుకు మొదటి దశ ప్రాజెక్టును ఎలా నిర్వహిస్తారంటూ కేంద్రం పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు ఎల్అండ్టీ సంస్థ గత సెపె్టంబర్లో ప్రకటించింది. రెండోదశకు ఆటంకంగా ఉన్న మొదటిదశను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు దఫాలుగా జరిపిన చర్చలు, సంప్రదింపులు, ఐఆర్ఎఫ్సీతో కుదుర్చుకున్న ఒప్పందం అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 29న అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్)లిమిటెడ్, హెచ్ఎంఆర్ఎల్ సంస్థలు ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. రూ.13,600 కోట్ల రుణ సౌకర్యాన్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ వంటి రుణ అవసరాలకు వినియోగించాలని ఒప్పందం చేసుకున్నారు. మే ఆఖరుకల్లా రుణాల రీఫైనాన్సింగ్ పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటివరకూ ఈ ప్రక్రియ పట్టాలెక్కలేదు. మరోసారి అంచనాలు ఎందుకు? మెట్రో మొదటి దశ టేకోవర్‌పై మరోసారి అంచనాలను రూపొందించాలని నిర్ణయించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. రూ.30 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రూ.15వేల కోట్లకే టేకోర్ చేసినట్లు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ టేకోవర్ వల్ల మెట్రో ప్రాజెక్టు కోసం కేటాయించిన 269 ఎకరాల భూములు ప్రభుత్వపరం కానున్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో నిర్మించిన మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లలో సుమారు 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. మెట్రోకు కేటాయించిన ఆస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎల్అండ్టీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటివరకు ఎల్అండ్టీ సంస్థ కేవలం 4 లక్షల చదరపు అడుగులను మాత్రమే లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించింది. రాయదుర్గం వద్ద ఉన్న కొంత భూమిని మాత్రం ఓ ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో భూముల విలువ గణనీయంగా పెరిగిన దృష్ట్యా మెట్రో భూములను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం లభించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మెట్రో మొదటిదశ అంచనాలపై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్రం కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్బీఐ క్యాపిటల్ సంస్థను కన్సల్టెన్సీగా నియమించినట్లు తెలుస్తోంది. -
12 పత్రాలే అంతిమం కాదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్), 2026లో భాగంగా రాష్ట్రంలో నోటీసులు అందుకోనున్న వ్యక్తులు సమర్పించాల్సిన రుజువులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల జాబితానే పరిమితం కాదు..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర పత్రాలను సైతం రుజువుగా సమర్పించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సర్ కార్యక్రమానికి ముందస్తు సన్నద్ధతలో భాగంగా 2002, 2026 ఓటర్ల జాబితాలను అనుసంధానం (మ్యాపింగ్) చేయగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 89,88,175 మంది ఓటర్ల వివరాల్లో తార్కిక వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ‘సర్’షెడ్యూల్ ప్రకారం వ్యత్యాసాలు కలిగిన ఓటర్లందరికీ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య స్థానిక ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారన్నారు. సర్ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం తన కార్యాలయంలో సుదర్శన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏఏ ధ్రువీకరణ పత్రాలను రుజువుగా స్వీకరిస్తారని విలేకరులు ప్రశ్నించగా, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్వోలకు విచక్షణాధికారాలను కల్పించినట్టు వెల్లడించారు. 5 లక్షల డూప్లికేట్ ఓటర్ల తొలగింపు రాష్ట్రంలో 5 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించినట్టు సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒకే పేరు, ఇతర వివరాలతో వేర్వేరు చోట్లలో ఓటర్లు కలిగి ఉన్నట్టు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఈ ఓటర్లను గుర్తించామన్నారు. గడువు పొడిగింపు ఉండదు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు సంబంధించిన పాక్షిక వివరాలతో ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఒక వేళ ఇంటికి తాళం వేసి ఉన్నా, మూడు నాలుగు పర్యాయాలు ఆ ఇంటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. ఫారాలను పూరించి వచ్చే నెల 24లోగా సమర్పిస్తే 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు లభిస్తుందని స్పష్టం చేశారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి పేరు ముసాయిదా జాబితాలో గల్లంతు అవుతుందని, అలాంటి వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మళ్లీ ఫారం–6 సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారంతో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి అవసరం లేదన్నారు. 2002 ఓటర్ల జాబితా వివరాలు బీఎల్ఓల వద్ద ఉంటాయని, ఆ వివరాలను సైతం ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఆంగ్లంలోనే ఎన్యూమరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషలో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నామని సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆంగ్ల భాషలో ముద్రించిన ఫారాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 43.67 శాతం ఓటర్ల మ్యాపింగ్ జరగ్గా, ఆ తర్వాత హైదరాబాద్ 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతం మ్యాపింగ్ మాత్రమే జరిగిందన్నారు. మిగిలిన జిల్లాల్లో 80 శాతం వరకు మ్యాపింగ్ పూర్తయిందన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు, జాయింట్ సీఈఓ ఎం.సత్యవతి, అదనపు కార్యదర్శి శంకర్, సహాయ కార్యదర్శి ఏఎస్ చారి, డిప్యూటీ కలెక్టర్ బి.చెన్నయ్య పాల్గొన్నారు. -
రాజకీయ'దుర్గం'!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో భూముల వేలం వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మధ్య వివాదం అంశాన్ని ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలు వినియోగించుకుంటున్నాయన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టడాన్ని అడ్డుకున్న మాదిరిగానే రాయదుర్గంలోని భూముల బహిరంగ వేలాన్ని వివాదాస్పదం చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని రాష్ట్ర ప్రభుత్వం బలంగా భావిస్తోంది. ఎస్బీఐతో కటీఫ్! 2010లో భూ విక్రయంలో విధించిన నిబంధనలను పాటించకపోవడంతో భూ విక్రయాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐకి స్పష్టంచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ సేల్ డీడ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్తులు జారీచేయకపోవడంతో ఎస్బీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఆ భూ విక్రయాన్ని రద్దు చేయడంతోపాటు ఎస్బీఐకి ప్రత్యామ్నాయంగా నాలెడ్జి సిటీలో రూ.500 కోట్ల విలువైన రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వడానికి ప్రతిపాదించినా సరే... ఎస్బీఐ ముందుకు రాకుండా వేలానికి ఒక రోజు ముందు అంటే మే 27న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తిరస్కరణ లేఖ వేలం ముగిసిన మరుసటి రోజు టీజీఐఐసీకి అందినట్లు సమాచారం. వేలం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు కానీ, ప్రీబిడ్ సమావేశమప్పుడు గానీ స్పందించని ఎస్బీఐ ఆ మరుసటి రోజు హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే కోర్టుకు వెళ్లిందన్న అభిప్రాయంతో సర్కారు ఉంది. దీని వెనుక రాజకీయ ప్రోద్బలం (కుట్ర) ఉందనే అనుమానాన్ని ప్రభుత్వ ముఖ్యులు వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎస్బీఐతో కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎస్బీఐతో ఉన్న లావాదేవీలను ఉపసంహరించుకునే అవకాశాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఎస్బీఐతో జరిపే ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్ల వివరాల సేకరణలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది. కనీసం రూ.5వేల కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్లు ఎస్బీఐలో ఉన్నట్లు ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా డిపాజిట్లను ఉపసహరించుకునే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించగా, టీజీఐఐసీ దాదాపు 25 కోట్ల ఎఫ్డీలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అప్పట్లోనే ఎకరా రూ. 25 కోట్లపైనే... రాయదుర్గం రెవెన్యూ పరిధిలో 2006–07 నాటికే ఎకరం భూమి మార్కెట్ ధర రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు ఉందని ప్రభుత్వం చెబుతోంది. 2010 నాటికి రాయదుర్గం పరిధిలో ఎకరం రూ.40 కోట్లు పలికింది. 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నం. 83/1లో 5 ఎకరాల భూమిని కార్యాలయ నిర్మాణం, ఇతర కార్యకలాపాల కోసం ఎస్‌బీహెచ్‌కు రూ.13.30 కోట్లకు కేటాయించింది. బహిరంగ మార్కెట్ ప్రకారం చూస్తే దీని విలువ రూ.200 కోట్లు. ఎస్బీహెచ్ నిర్మించే కార్యాలయాలు.. ఇతర వాణిజ్య కార్యకలాపాలతో ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని నాటి ప్రభుత్వం భావించింది. అయినా ఏడాది తరువాత కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2012 సెపె్టంబర్లో ఎస్‌బీహెచ్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే 2016 మార్చి 30న, జూన్ 27న మరింత సమయం కావాలంటూ ఎస్బీహెచ్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు రాసింది. రద్దు చేయాలంటూ టీఎస్ఐఐసీ లేఖ ఎస్బీహెచ్.. ఎస్బీఐలో విలీనమయ్యాక టీఎస్ఐఐసీ 2019 మే 27న ఆ భూ కేటాయింపును రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. తమకు చివరి అవకాశం ఇవ్వాలంటూ ఎస్బీఐ 2020 జూలై 2న ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. 15 రోజుల్లోగా ప్రాజెక్టుకు సంబంధించి కాలపరిమితి సమర్పించాలని ఎస్బీఐకి తుది షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ఎస్బీఐ ఇచ్చిన సమాధానం 2020 సెప్టెంబర్ 1న ప్రభుత్వానికి అందింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్దేశించిన ప్రయోజనానికి ఆ భూమిని వినియోగించుకోని పక్షంలో దానిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2021 జనవరిలో కేటాయింపు రద్దు ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు 2021, జనవరి 22న ఎస్బీఐకి చేసిన భూ కేటాయింపును రద్దు చేసినట్లు అధికారవర్గాలు వివరించాయి. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖ రాయడంతోపాటు ఎస్బీఐ జూన్1న హైకోర్టులో రిట్పిటిషన్ను దాఖలు చేసింది, రద్దు చేసిన భూమికి ప్రత్యామ్నాయంగా ఉస్మాన్‌నగర్, గండిపేటలో భూమి ఇవ్వాలని టీజీఐఐసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈలోగా కాలపరిమితి పొడిగించే అంశాన్ని పునఃపరిశీలించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కోర్టు కేసు ఉపసంహరించుకుని ఉస్మాన్‌నగర్‌లో భూకేటాయింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఎస్బీఐకి సూచించింది. అయినా స్పందించకపోవడంతో 2024 ఆగస్టు 21న కేటాయింపుతోపాటు సేల్ డీడ్ రద్దు చేయాలని ప్రభుత్వానికి టీజీఐఐసీ లేఖ రాసింది. రద్దు పునరుద్దరణను తిరస్కరించామని, ప్రత్యామ్నాయ స్థలాల కోసం ముందుకు రావాలని 2024 ఆగస్టు 21న ఎస్బీఐని మరోసారి కోరింది. అప్పుడు కోర్టుకు వెళ్లగా.. 4 వారాల్లో ఎస్బీఐ ప్రతిపాదనను పరిశీలించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతిపాదనలతో ముందుకు రావాలని 2026 మే 4న రావాలని టీజీఐఐసీ కోరింది. ఆ సమావేశంలో నాలెడ్జి సిటీలో 2.5 ఎకరాల భూమి ఇవ్వడానికి టీజీఐఐసీ ప్రతిపాదించింది. ప్రత్యామ్నాయ భూమి తీసుకోవడానికి ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసింది. దీనితో మే 6న వేలం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి హెడ్‌ఆఫీసుతో మాట్లాడినట్లు ఎస్బీఐ అధికారులు తెలిపారు. మే 18న ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. ఆ మరుసటి రోజునే ఎస్బీఐ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. కానీ విచారణకు రాలేదు. మే 20న ఎస్బీఐ ప్రతిపాదనను ప్రభుత్వం మరోసారి తిరస్కరించింది. ఎస్బీఐ చైర్మన్ కారణం? మొదట్లో ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసి ఆ తరువాత ప్రభుత్వంపై బురద చల్లేవిధంగా కోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది., ఇందులో రాజకీయ హస్తం ఉందని భావిస్తోంది, తెలుగు వ్యక్తి ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి మహబూబ్‌నగర్ జిల్లా పెద్త పోతులపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానిక రాజకీయాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది, 16 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయని ఎస్బీఐ ఇప్పుడు అదే స్థలం కావాలంటూ కోరడం వెనుక రాజకీయాలే కారణమని భావిస్తోంది, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2.50 ఎకరాల్లో ఎస్బీఐ నిర్మాణాలు చేపట్టవచ్చని ఆ భూములు కేటాయించినా సకాలంలో పనులు చేపట్టకపోతే వాటిని కూడా రద్దు చేసే అధికారం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
-
పెన్షను..పేదల్లో టెన్షను!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త చేయూత పింఛన్ల కోసం పేదలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మీకులు..ఇలా అనేక కేటగిరీలకు చెందినవారు పింఛన్ల కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కరుణిస్తుందన్న ఆశతో కార్యాల యాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లు కలిపి.. దాదా పు నాలుగేళ్లుగా చేయూత కోసం నిరీక్షిస్తున్నా రు. సుమారు 20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా కాగా..వీటి పరి ష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖ లాలు కన్పించక పోవడంతో పింఛన్ల అంశం అంతుచిక్కని వ్యవహారంగా మారింది. పెంపు సరే.. మంజూరేదీ? కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.4 వేల నుంచి), వృద్ధులు, వితంతువులు, ఇతర కేటగిరీల పింఛను రూ.4 వేలకు (ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల నుంచి) పెంచుతామని హామీ ఇచ్చింది. 2026–27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు.. కొత్తగా వివిధ కేటగిరీలకు చెందిన 2 లక్షల మంది అర్హులకు చేయూత పింఛన్లు (ఎలాంటి పెంపుదల లేకుండా) మంజూరు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రథమ ప్రాధాన్యత కింద వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వృద్ధులకు కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దరఖాస్తుల స్వీకరణే..స్రూ్కటినీ లేదు మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో వివిధ కేటగిరీల వారి నుంచి దరఖాస్తులైతే తీసుకుంటున్నారు కానీ వాటి పరిశీలనే (స్క్రూటినీ) పూర్తి చేయడం లేదు. దరఖాస్తులను స్క్రూటినీ చేయాలనే ఆదేశాలు కూడా సంబంధిత అధికారులకు అందలేదు. అసలు ఎప్పటినుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఉన్నతాధికారులు..అప్పుడే అర్హుల జాబితాను సిద్ధం చేసి పంపవద్దంటూ జిల్లా, మండల అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ముందుగా ఆయా కేటగిరీల కింద అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అర్హులను గుర్తించాక పరిశీలనకు క్షేత్రస్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి పింఛన్‌దారుడు అర్హుడనే నివేదిక అందాక డేటా ఎంట్రీ చేసి ఆమోదం తెలుపుతారు. కానీ ఈ ప్రక్రియలో ఎలాంటి ముందడుగూ పడటం లేదని ఎక్కడికక్కడే మూలుగుతున్న దరఖాస్తులు స్పష్టం చేస్తున్నాయి. అయితే మొత్తంగా 20 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే.. రెండులక్షలు మాత్రమే కొత్త పింఛన్లు ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితిని, ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలా అన్న సందిగ్ధంలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న ఆశావహుల సంఖ్య రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద చేయూత పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 41,48,071గా ఉంది. వాస్తవానికి 2023 డిసెంబర్ చివరినాటికి వివిధ కేటగిరీల పింఛ¯న్దారుల సంఖ్య 43,55,649 కాగా.. అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకు వివిధ కేటగిరీల కింద పింఛను పొందే వారి మరణాలు, అనర్హతలు, ఇతర కారణాలతో 3.5 లక్షల పించన్లు తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 2 లక్షల మందికి పాత మొత్తంతోనే పింఛన్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో వీటిని కోరుకుంటున్న పేదల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రజా పాలనలో లక్షల్లో దరఖాస్తులు కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లుగా ప్రజాపాలన, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా, ఇతర రూపాల్లో..పింఛన్ల కోసం 19 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వీటిలో అత్యధికంగా అంటే దాదాపు 12 లక్షల దాకా వృద్ధాప్య, 4 లక్షల దాకా వితంతు, 3 లక్షల దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 70 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వీటన్నింటినీ చేయూత పింఛన్ల మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోస్తే ఎంతమంది అర్హులనేది తేలుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే బడ్జెట్ కొరత, సాంకేతిక కారణాల వల్ల కొత్త పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోందని అంటున్నారు. వారం వారం తిరుగుతూనే ఉన్నా.. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని ఐదేళ్లు అయింది. గత ప్రభుత్వంలో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నా. వారం వారం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అయినా ఇప్పటివరకు రాలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. – చంద్రకళ, మరికల్, నారాయణపేట నాలుగేళ్లలో మూడుసార్లు దరఖాస్తు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో నాకు ఒక కాలు పూర్తిగా తీసేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సదరం సర్టిఫికెట్ తీసుకున్నా. నాలుగేళ్లలో మూడుసార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రతీసారి ఎంక్వయిరీ చేసి వదిలేస్తున్నారు. ఇప్పటివరకు నాకు పెన్షన్ అందలేదు. – మీర్జా ఇస్మాయిల్, దివ్యాంగుడు, సుభాష్‌నగర్ (కరీంనగర్) -
కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా, రా ష్ట్రంలో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు చేపట్టకుండా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కుట్రపూరితంగా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘ఒప్పందం ప్రకారం తొలి దశ ప్రాజెక్టు స్వాదీనానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి అవసరమైన రుణం విడుదలకు జూన్ 15 చివరి రోజు. బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఈ రోజు కిషన్‌రెడ్డి రుణం విడుదల చేయిస్తడా? చేయించడా? చివరకు రిజర్వ్ బ్యాంకు నుంచీ గ్యారెంటీ తెచ్చి ఇచ్చాం. ఇక ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. రుణం ఆపడానికి కారణం ఏమిటో చెప్పండి. రుణం విడుదల చేయించడానికి మీరు మాట్లాడతరా? మాట్లాడరా? రెండో విడత మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు 50 శాతం నిధుల వాటాతో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు వస్తదా? రాదా? ముందుకు రాకపోతే రాష్ట్రమే పూర్తి వ్యయంతో కట్టుకోవడానికి కేంద్రం ఎన్ఓసీ ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్, వైజాగ్‌కు కూడా మెట్రో ఇచ్చారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఇవ్వడం లేదంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్వోసీ ఇస్తే మీ వాటా అవసరం లేదు.. ‘మెట్రో తొలి దశ ప్రాజెక్టు స్వా«దీనానికి అవసరమైన రుణం కోసం ఐఆర్ఎఫ్సీని ఒప్పించి అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. మే 30 నాటికే అప్పు విడుదల కావాలి. జూన్ 1 నుంచి మెట్రోను పూర్తిగా ఎల్అండ్టీ నుంచి స్వా«దీనం చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వం పెట్టుబడి వాటాగా రూ.1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ.84 కోట్ల పేపర్ ఫీజు కట్టింది. ఐఆర్ఎఫ్సీ రూ.13,600 కోట్ల రుణం విడుదల చేయాల్సి ఉండగా, కరెక్టుగా ఈ సమయంలోనే (గతనెల 20న) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, 21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన కిషన్‌రెడ్డి.. ఇంత సులువుగా మీరు రేవంత్‌రెడ్డికి అప్పులు ఇస్తే తెలంగాణలో బీజేపీ ఉండాలా? మూసివేయాలా? అని తిరకాసు పెట్టడంతో రుణం విడుదల చేయకుండా కేంద్రం పీటముడి వేసుకుని కూర్చుంది.’ అని సీఎం ఆరోపించారు. ‘రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్వోసీ ఇస్తే ఐఆర్ఎఫ్సీ నుంచి 4 శాతం వడ్డీతో మళ్లీ రూ.40 వేల కోట్ల రుణం తెచ్చుకుంటాం. మీ 50 శాతం నిధుల వాటా అవసరం లేదు..’ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు ‘ఎవరితో సంబంధం లేకుండా రేవంత్‌రెడ్డి 122 కి.మీ.ల మెట్రో కట్టుకుంటే మోదీ, కిషన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం గురించిన చర్చ ఉండదు. అప్పుడు రాజకీయంగా నష్టం వస్తుందనే ఆలోచనతో ఎక్కడికక్కడ ఛిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ఖట్టర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు కిషన్‌రెడ్డి నన్నెందుకు తీసుకునిపోడు? వరంగల్ ఎయిర్‌పోర్టు కొలిక్కి వచ్చాక కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడిని కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు? అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు?..’ అని సీఎం నిలదీశారు. కేసీఆర్ వల్ల రూ.7 వేల కోట్ల నష్టం ‘నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009లో మెట్రో రైలు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వైఎస్ అకాల మరణం తర్వాత నాటి సీఎం రోశయ్య రూ.15 వేల కోట్లతో 70 కి.మీ.ల కారిడార్‌తో 2017లోగా మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేయడానికి ఎల్అండ్టీ సంస్థతో పీపీపీ విధానంలో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. అయితే 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక చారిత్రిక కట్టడాల పేరుతో మూడు మార్గాల్లో అలైన్మెంట్ మార్చాలని ఎడతెగని పేచీ పెట్టడంతో పనులు ఆలస్యమై 2020కి కానీ పూర్తి కాలేదు. మూడేళ్ల జాప్యంతో వ్యయం రూ.22వేల కోట్లకు పెరిగింది. షరతులపై షరతులు పెట్టిన కేంద్రం మెట్రో రైలు రెండో దశకు అనుమతి, నిధులివ్వాలని మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని, కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే, ఆర్థిక శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశా. ఎల్అండ్టీని భాగస్వామిని చేస్తేనే అనుమతిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ షరుతు పెడితే ఎల్అండ్టీ తిరస్కరించింది. గత ప్రభుత్వం పనులు స్తంభింపజేయడంతో రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. ఎల్అండ్టీతో ఒప్పందం చేసుకోవాలంటూ కేంద్రం మరోసారి మెలిక పెట్టగా, ఆ సంస్థ మళ్లీ తిరస్కరించింది. దీంతో ఎల్అండ్టీ నుంచి మెట్రో రైలు కొనుగోలే ఏకైక ప్రత్యామ్నాయం అని కేంద్రం చెప్పింది. ఇందుకు ఎల్అండ్టీని ఒప్పించి, మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చించి ఆమోదించాం..’ అని సీఎం వివరించారు. నేను అండగా ఉంటా కేసీఆర్‌ను భయపెట్టు ‘రెండో దశ విస్తరణకు 50శాతం నిధుల వాటా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుందని కిషన్‌రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవముంటే కాగితం చూపించాలి. తెలంగాణ తరఫున కేంద్ర కేబినెట్ ర్యాంకు మంత్రివి నువ్వు ఒక్కడివే. మంత్రివర్గం భేటీలో పీఎం మోదీతో నువ్వే మాట్లాడాలి. కేసీఆర్‌కు భయపడి, లొంగిపోయి కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. నేను నీకు అండగా నిలబడతా కేసీఆర్‌ను భయపెట్టు. కిషన్‌రెడ్డికి అంత తెలివి లేదు. ఆయన వెనుక కేటీఆర్ ఉన్నాడు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ అపరిచితుడి వేషం వేసుకుని అందరినీ బెదిరించినట్టు.. ‘నీ సంగతి చూస్తా ’అని రామచందర్‌రావు నన్ను బెదిరిస్తుండు. నేను భడేభాయ్(మోదీ)ను కూడా కలిసా. కింద(రాష్ట్రంలో) సమస్యలుంటాయి..అవి ఏందో చూడు అన్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు చాలా మందిని కలిసి వచ్చిన. వారితో జరిగిన చర్చను బయటపెట్టడం అనైతికమని కొన్ని విషయాలు చెప్పుకోదలుచుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. కేంద్రం ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది.. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రాజీనామా చేయాలని కిషన్‌రెడ్డి చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ‘మూడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీల్లో ఏదీ మోదీ అమలు చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ (వికలాంగ ప్రభుత్వం). ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది. స్పష్టమైన మెజారిటీ లేదు. నాకు పూర్తి మెజారిటీ ఉంది. ఎవరిపై ఆధారపడలేదు. నన్ను రిజైన్ చేయమని అడిగే నైతిక హక్కు వారికి లేదు. అయినా మోదీ చేస్తే నేనూ రాజీనామా చేయడానికి సిద్ధం..’ అని సీఎం స్పష్టం చేశారు. -
తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు
-
తెలంగాణలో 'పెద్ది' టికెట్ ధరల పెంపు.. ఒక్కో టికెట్ ఎంతంటే?
మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీఫ్లెక్స్‌లలో రూ.125 పెంచుకునేందుకు అనుమతిలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా జూన్ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకి అనుమతిచ్చింది. స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర గరిష్ఠంగా రూ.600 వరకూ ఉండవచ్చని పేర్కొంది. ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతున్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సూపర్ హిట్ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ కానుందని ఇప్పటికే ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనున్న విషమం తెలిసిందే.ఇక “పెద్ది” సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. అదే మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరిలోని 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట ఈ సినిమాలో ఉందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. ఆ పాటను సినిమాలో రీమిక్స్ చేయలేదు. ఒక సన్నివేశంలో రేడియోలో వినిపించేలా ప్లాన్ చేశాం. కానీ ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉండటంతో దాన్ని మ్యూట్ చేసేశామని బుచ్చిబాబు తెలిపారు. -
మైనింగ్ స్కాం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మైనింగ్ కుంభకోణాల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజులు, అనుమతులు, తవ్వకాల ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వెయిరీకి ఆదేశించింది. ఈ క్రమంలో విజిలెన్స్ సంస్థ సమగ్ర పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో ఇకపై సీఐడీ ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపనుంది. సంబంధిత అధికారులు, అప్పటి నిర్ణయాధికారులు, లీజుదారుల పాత్రపై విచారణ కొనసాగనుంది. అవసరమైతే కీలక పత్రాలు, ఫైళ్లు, అనుమతి రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై వరుసగా దర్యాప్తు ఆదేశాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇది మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
లొంగిపోండి.. అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగిలిన ముగ్గురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ సీవీ ఆనంద్ భరోసా ఇచ్చారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జోడె రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగ్తులు లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సలైదా, ఆయన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్లత అలియాస్ పూనం మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో జనజీవనస్రవంతిలో కలిశారు. ఇద్దరి పేరిట ఉన్న రివార్డు మొత్తానికి సంబంధించి మొత్తం రూ.45 లక్షలకు రెండు డీడీలను డీజీపీ వారికి అందించారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ పోలీసుల వద్దకు వచ్చినా నరహరి అనారోగ్య కారణాల రీత్యా మంగళవారం లొంగుబాటు చూపారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల డీజీ మహేశ్ భగవత్, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, ఎస్ఐబీ ఇంచార్జి కార్తీకేయలతో కలిసి డీజీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. గణపతి విదేశాల్లో ఉన్నారన్నది అవాస్తవం మావోయిస్టు అగ్రనేత గణపతి విదేశాల్లో ఉన్నట్టు వస్తున్న వార్తలు వాస్తవం కాదని, గణపతికి ఎక్కడ ఉన్నారన్న దానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ దేశంలోనే ఏదో ఒక చోట గణపతి ఉండొచ్చని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామన్నారు. తిరిగి మావోయిస్టు భావజాలం వైపు మళ్లకుండా వారికి నచ్చిన పనిలో మెళకువలు నేర్పేలా ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్లుగా స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు అందుతున్న పునరావాస కార్యక్రమాల గురించి స్వయంగా తెలుసుకుంటానని, త్వరలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మావోయిస్టుల సమస్యపై గత అనుభవాల దృష్ట్యా ఎస్ఐబీ, గ్రేహౌండ్స్‌ను ఇంకా కొనసాగిస్తామని, అయితే సిబ్బంది కొంత తగ్గొచ్చని తెలిపారు. లొంగిపోయినవారి గురించి స్థానిక పోలీసుల నుంచి జిల్లాల ఎస్పీలు, సీపీల వరకు గమనిస్తూనే ఉంటారని, ప్రతి నెల, రెండు నెలలు, ఆరు నెలలకు ఒకసారి పునరావాసంపై రిపోర్టులు తీసుకుంటామని వెల్లడించారు. పరిస్థితులు అనుకూలంగా లేకనే లొంగుబాటు : నరహరి దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నష్టాలను చవిచూసిందని, ఈ సమయంలో సాయుధ పోరాటమనే దారి ప్రస్తుతం కష్టాల మయంగా కనిపించడం..అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పునరావాస పథకంలోని అనుకూలత కారణంగా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు పసునూరి నరహరి తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఆర్ఎస్యూలో చేరారు. 1982లో పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. తుపాకులు, రాకెట్లు, రాకెట్ ప్రేరేపిత గ్రెనేడ్ల తయారీలో నరహరికి అపారమైన నైపుణ్యం ఉంది. నరహరి భార్య మేదరి దానమ్మది ఏపీలోని గుంటూరు, ఆమె 1986 నుంచి ఉద్యమంలోకి వచ్చారు. -
ఫ్యూచర్ సిటీ 11 జోన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీని విద్య, వైద్యం, వినోదం, నివాస, వాణిజ్య, పారిశ్రామిక, తయారీ.. ఇలా ప్రత్యేక జోన్లుగా విభజిస్తూ బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యంఇస్తూ నెట్ జీరో సిటీగా రూపుదిద్దుకోనున్న ఈ ఫ్యూచర్ సిటీలో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 11 జోన్లుగా అభివృద్ధి చేయనున్న ఈ ఫోర్త్ సిటీలో 13,610 ఎకరాల్లో అన్ని రంగాలకు భూ కేటాయింపులు చేశారు. అత్యధికంగా 4 వేల ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్‌కు కేటాయించగా.. నివాస సముదాయాలకు 2,477 ఎకరాలను కేటాయించారు. 762 చ.కి.మీ... హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో గ్రేటర్లో నాల్గో నగరం ఆవశ్యకత ఏర్పడిందని, దీన్ని పట్టణ, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం ఏడు మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ను ఏర్పాటు చేశారు. 762 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ ఎఫ్‌సీడీఏలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ఇందులో 15 వేల ఎకరాలు అభయారణ్యం ఉండగా.. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. జూన్ 2న కార్యాలయం ప్రారంభం రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2న ఎఫ్‌సీడీఏ కార్యాలయం ప్రారం¿ోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మీర్ఖాన్పేటలో ఎఫ్‌సీడీఏ కార్యాలయం కోసం ప్రభుత్వం 7.29 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జీ+1 అంతస్తుల్లో, 16,393 చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. ఇందులో కాన్ఫరె¯న్స్ హాల్, ఎక్స్పీరియన్స్ సెంటర్ వంటి ప్రత్యేక గదులుంటాయి. -
మెట్రోకు రూ.13,600 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ నగర రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి విడతను తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో టేకోవర్ చేసుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు బలోపేతానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్సీ) ద్వారా రూ. 13,600 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్‌ను ప్రభుత్వం పొందింది. సోమవారం ఢిల్లీలో ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్, హెచ్ఎమ్ఆర్ఎల్ ప్రతినిధుల మధ్య ఈ మేరకు రుణ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఐఆర్ఎఫ్సీ సీఎండీ, సీఈఓ మనోజ్ కుమార్ దూబే, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌లో సుస్థిరమైన, ప్రజానుకూల రవాణా వ్యవస్థను నిర్మించేందుకు ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎస్ రామకృష్ణారావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ వైదొలగనుంది. అధికారులు, సాంకేతిక నిపుణుల సహాయ సహకారాలు మాత్రం కొంతకాలంపాటు కొనసాగుతాయి. ప్రభుత్వమే వారికి జీతాలను చెల్లిస్తుంది. అలాగే ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లోగోను కూడా మార్చనున్నారు. రెండో దశ మెట్రో రైల్ నిర్మాణం కూడా చేపట్టనున్న దృష్ట్యా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని మెట్రోరైల్ బ్రాండ్‌కు తగినవిధంగా పేరు, లోగో, తదితర అంశాల్లో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ప్రభుత్వ ఆస్తిగా మెట్రో...: ఎల్ అండ్ టీ మెట్రో రైల్లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్ ప్రక్రియ అమలులోకి వచ్చింది. దీంతో 69.2 కి.మీ. పొడవు, 57 స్టేషన్లతో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న హైదరాబాద్ మెట్రో మొదటి దశ ఇకపై పూర్తిస్థాయిలో ప్రభుత్వ వ్యూహాత్మక ప్రజారవాణా ఆస్తిగా మారింది. ఒప్పందం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు – అధిక వడ్డీతో కూడిన పాత రుణాల స్థానంలో తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రీఫైనాన్సింగ్ లభించడం వల్ల మెట్రో ప్రాజెక్టుకు భారీ ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. – తాజాగా సమకూరిన రూ. 13,600 కోట్ల నిధులను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్‌కు వినియోగించి ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ కల్పిస్తారు. – ఈ రుణం 20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల సౌలభ్యంతో రూపొందడం వల్ల ప్రభుత్వంపై తక్షణ భారం పడదు. – ఈ లావాదేవీకి రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపు గ్యారంటీతోపాటు ఆర్బీఐ మద్దతు గల డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన రక్షణ వ్యవస్థలు మద్దతుగా నిలిచాయి. – ప్రస్తుత రుణ భారం తగ్గడంతో భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలు, కొత్త కారిడార్ల నిర్మాణం, చివరి మైలు అనుసంధాన పనులను వేగవంతం చేయడానికి మార్గం సుగమమైంది. -
'ఐటీఐ'నా.. జాబ్ రెడీ
‘నమస్తే సార్..అర్జెంట్‌గా ఫిట్టర్ కావాలి. నెలకు రూ.20 వేలు ఇస్తాం. సార్ ఎలక్ట్రీషియన్ ఉంటే కాస్త పంపండి..ఐటీఐ పూర్తి చేస్తే చాలు. మెకానిక్ కోసం చూస్తున్నాం సర్.. చాలా రోజుల నుంచి అడుగుతున్నాం.’ ఇవీ ప్రతిరోజూ ఐటీఐల ప్రిన్సిపాల్స్‌కు కంపెనీల విన్నపాలు. ఒకప్పుడు చదువు మధ్య లో మానేసినవారు, ఇంటర్ ఫెయిలైన వారు ఐటీఐ చేసేవారు. ఇప్పుడు సీన్ తారుమారైంది. ఇండ్రస్టియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ) నుంచి సర్టిఫికెట్ అందుకోగానే అభ్యర్థులకు జాబ్ రెడీగా ఉంటోంది. సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారితో పోలిస్తే ఐటీఐ స్టూడెంట్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐల అభివృద్ధికి పూనుకోవడం, సామాజిక మాధ్యమాలు, మెరుగైన వేతనంతో ఆఫర్లు వెల్లువెత్తుతుండడం.. వెరసి సాంకేతిక శిక్షణ వైపు యువత మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడూ ఖాళీలే.. ఐటీఐ అభ్యర్థుల కోసం ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. వైజాగ్, వరంగల్, తిరుపతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ఢిల్లీలోనూ ఉద్యోగ అవకాశాలు రెడీగా ఉంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఒక్క హైదరాబాద్ నగరంలోనే 2,000 మంది ఐటీఐ అభ్యర్థుల కోసం జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. 2026 ఆగస్టులో 18,000 మంది తమ కోర్సు పూర్తి చేసుకోనున్నారు. వీరిలో ఇప్పటికే సుమారు 5,000 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా పలు కంపెనీలకు ఎంపిక కావడం విశేషం. అంతర్జాతీయంగా రూ.లక్షల్లో వేతనాలు.. ఐటీఐ అభ్యర్థులకు అంతర్జాతీయంగా అధిక వేతనంతో ఉద్యోగ ఆఫర్లు పెరుగుతున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు తెలంగాణ ఓవరీŠస్స్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) పూర్తి సహకారం అందిస్తోంది. ఇజ్రాయెల్, యూరప్, జీసీసీ దేశాలు, ఆస్ట్రేలియాలో కనీస ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంటే చాలు. ట్రేడ్‌ను బట్టి నెల వేతనం జర్మనీలో రూ.2.7 లక్షలు, యూరప్ దేశాల్లో రూ.1.7 లక్షలు, జీసీసీ దేశాల్లో రూ.1.30 లక్షలు ఉంది. నిర్మాణ రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ఇజ్రాయెల్ నెలకు రూ.2.5 లక్షల వేతనం ఆఫర్ చేస్తోంది. తెలంగాణ కార్మిక శాఖ ఈ ఏడాది నుంచే ఎంపిక చేసిన ఐటీఐలలో జర్మన్ భాషను ప్రవేశపెడుతోంది. క్రమంగా ఫ్రెంచ్, జపనీస్‌తోపాటు ఇతర భాషలను పరిచయం చేయనున్నారు. అమ్మాయిలు అతి తక్కువ ఐటీఐ వైపు చూస్తున్న అమ్మాయిల సంఖ్య 1–2 శాతం మించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఫాక్స్‌కాన్ కేవలం మహిళలనే నియమించుకుంటోంది. ఏటా ఈ కంపెనీ 1,000 మందికి జాబ్స్ ఇస్తోంది. కొత్త ఉత్పత్తుల తయారీ తోడైతే ఈ సంఖ్య 5,000 దాటుతుందని అంచనా. ఏటా ఐటీసీ 1,000 మంది, ష్నైడర్ ఎలక్ట్రిక్ 500 మంది మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఐటీఐ పూర్తి చేస్తే మెరుగైన వేతనం ఉంటుందన్నది అధికారుల మాట. – టాటా సహకారంతో 65 ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. మరో 54 కేంద్రాలు ఒకట్రెండేళ్లలో ఏటీసీలుగా మారనున్నాయి. – ప్రస్తుతం 32 రకాల ట్రేడ్స్ ఉన్నాయి. ఏఐ, సోలార్, రోబోటిక్స్, ఏరో నాటికల్, సెమీ కండక్టర్ వంటి 10 ట్రేడ్స్ కొత్తగా రానున్నాయి. ఉపకార వేతనంతో.. మరింత మందిని ఐటీఐల వైపు ఆకర్శించేందుకు నెలకు రూ.2,000 ఉపకార వేతనం ఇవ్వనున్నాం. తద్వారా అయినా అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాం. జపాన్‌లో కేర్ గివర్స్ జాబ్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక పారిశ్రామికవర్గాలతో చర్చించి మార్కెట్ డిమాండ్‌ను బట్టి కొత్త కోర్సులను డిజైన్ చేస్తున్నాం. నైపుణ్యం ఉంటే లక్షల రూపాయల వేతనంతో విదేశీ అవకాశాలనూ విద్యార్థులు చేజిక్కించుకోవచ్చు. – ఏ.కాంతి వెస్లీ, డైరెక్టర్, ఉపాధి, శిక్షణ శాఖ. సరఫరా చేయలేం మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా మానవ వనరులను సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అభ్యర్థుల కోసం ఈ కంపెనీలన్నీ ఆగస్ట్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శిక్షణలో ఉన్న 18,000 మందికి ప్లేస్మెంట్ ఖాయం. బహుశా ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఇన్ని అవకాశాలు లేవు. వయో పరిమితి లేకపోవడం, జాతీయ స్థాయి సర్టిఫికెట్ కావడంతో డిగ్రీలున్నవారూ ఐటీఐల్లో చేరుతున్నారు. – కె.శ్యామ్ సుందర్, ప్రిన్సిపల్, ఐటీఐ, హకీంపేట. -
సీఎం ప్రజావాణిలో 396 దరఖాస్తులు
సాక్షి,ఆదిలాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన 224వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 396 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 163, రెవెన్యూ శాఖకు సంబంధించి 47, ఇందిరమ్మ ఇండ్ల కోసం 113, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 72 దరఖాస్తులు అందాయి.సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సమన్వయ మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులు తో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించనున్నారు.ప్రత్యేకంగా మే 29న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వెత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది.మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలకు బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి అవకాశాలను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని చెప్పారు. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, నాయకత్వ వికాసానికి దోహదపడేలా రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.కాగా, ప్రజా పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా సంఘాలను కీలక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ వారోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. (చదవండి: కేన్స్ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..! ఏకంగా 300 గంటలు..) -
కాంటా వేయరు 'లోడ్ ఎత్తరు'!
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెలరోజులు దాటింది. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 14 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 600 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి బస్తాల్లో నింపి కుట్టిపెట్టారు. కానీ ఐదు రోజులుగా లారీలు రాకపోవడంతో ఆ ధాన్యం అక్కడే అలాగే ఉంది. ఈ కేంద్రంలో 15 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. కానీ లారీలు రాక కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతి కాకపోవడంతో రెండు రోజులుగా కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు తెరిచామని, భారీగా ధాన్యం సేకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెల దాటినా కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని, కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ధాన్యం తీసుకోవడం లేదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని కాంటా వేయడం, కాంటా వేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగా లేదని, హమాలీల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. రైతుల ఆందోళనకు తగినట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్‌లు ధాన్యం రాశులతో నిండిపోయి కన్పిస్తున్నాయి. అకాల వర్షాలు కురుస్తుండటంతో, తమ పంట ఎక్కడ తడిసి ముద్దవుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్ వంటి చాలా జిల్లాల్లో రాశులు పోసిన ధాన్యం తడిచిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ధాన్యం తడవకుండా తగిన సంఖ్యలో టార్పాలిన్లు సరఫరా చేయడంలో పౌరసరఫరాల సంస్థ విఫలమవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. మక్కలు, జొన్నల కొనుగోళ్ల పరిస్థితీ ఇదేనని రైతులు వాపోతున్నారు. లక్ష్యంలో మూడో వంతే..! ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 8,500 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లోని మండలాల్లో పేరుకు కొనుగోలు కేంద్రాలే తప్ప, అక్కడ కొనుగోళ్లు సాగడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. అంటే లక్ష్యంలో మూడో వంతు మాత్రమే పూర్తయ్యిందన్నమాట. జూన్ నెల సమీపిస్తుండటంతో ఖరీఫ్ పనులు మొదలయ్యే సమయం ఆసన్నమైనా, ఇంకా రబీ పంట కొనుగోళ్లే పూర్తి కాకపోవడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి 15 రోజులకు పైగా రైతులు నిరీక్షిస్తున్న పరిస్థితి చాలా జిల్లాల్లో ఉంది. మంగళవారంముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఇంకా కదిలిన దాఖలాలు కన్పించడం లేదు. అన్నీ సమస్యలే.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయడమే ఒక ప్రహసనమైతే, వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం మరో పెద్ద యుద్ధంలా మారింది. లారీలు రాక రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒకవేళ మిల్లుకు ధాన్యం చేరినా, అక్కడ మిల్లర్లు పెట్టే ఆంక్షలతో రైతులు బిక్క ముఖం వేస్తున్నారు. తరుగు, తాలు, తేమ శాతం పేరుతో యధావిధిగానే కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగానే రైతుతో లావాదేవీలు ముగియాల్సి ఉండగా, మిల్లులకు వెళ్లిన తరువాత తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో తరుగు పేరిట నాలుగైదు కిలోల ధాన్యాన్ని తరుగుగా తీసే విధానం ఇంకా కొనసాగుతోందని పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన మల్లయ్య అనే రైతు తెలిపారు. ధాన్యం ఎత్తుకోవడానికి, దించుకోవడానికి సవాలక్ష సాకులు చెబుతూ లారీలను రోజుల తరబడి నిలిపివేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మక్కల సేకరణలో మార్క్‌ఫెడ్ విఫలం! వరి రైతుల పరిస్థితి ఇలా ఉంటే, మొక్కజొన్న (మక్కలు) పండించిన రైతుల గోస వర్ణనాతీతం. రాష్ట్రంలో రబీలో పెరిగిన మక్కజొన్న సాగు నేపథ్యంలో ఈసారి సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. అయితే మక్కల కొనుగోళ్లలో మార్క్‌ఫెడ్ అపసోపాలు పడుతోంది. ఒక్కసారిగా భారీ ఎత్తున మార్కెట్‌కు వచ్చిన మక్కలను కొనుగోలు చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటివరకు మార్క్‌ఫెడ్ ఎండీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని ఇటీవలే తప్పించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను నియమించింది. అయితే కొన్ని జిల్లాల్లో పాతుకుపోయిన మార్క్‌ఫెడ్ మేనేజర్లు కొనుగోళ్లు చేయలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసుల్లో కూర్చొని అవినీతి కార్యకలాపాలు సాగించేందుకు అలవాటు పడిన అధికారులు మక్కల కొనుగోళ్లు చేయలేకపోతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మక్కలు కొనడానికి కనీసం గోనె సంచులు సమకూర్చుకోలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెబుతున్నారు. మార్క్‌ఫెడ్ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.97 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, అతికష్టంమ్మీద 1.83 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 8.56 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. చాలా చోట్ల సంచులు లేక కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నాగర్‌కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కొత్తగూడెం ప్రాంతాల్లో కొనుగోళ్ల కోసం రైతులు మార్కెట్ యార్డులు, పీఏసీఎస్‌లలో ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంది. తగిన సంఖ్యలో గోదాములు లేకపోవడం కూడా సమస్యగా మారింది. ప్రైవేటుకు అమ్ముకుంటున్నాను.. 70 క్వింటాళ్ల మక్కలు రూ.1,750 చొప్పున ప్రైవేటుగా అమ్ముకున్నా. ఇంకా 50 కింటాళ్లు ఉన్నాయి. వాటిని కూడా ప్రైవేట్‌గానే అమ్ముతా. ప్రభుత్వానికి అమ్మాలంటే చాలారోజుల సమయం పడుతుంది. ఇంటిదగ్గర గొర్లు, పశువులు ఉన్నాయి. వాటి వెంబడి వెళ్లేవారు ఎవరూ లేరు. అందుకే ప్రైవేటుకు అమ్ముకుంటున్నా. – మల్లేష్, దేశీటికాల, నాగర్ కర్నూల్. మొక్కజొన్న ఎప్పుడు కొంటారో చెప్పడం లేదు.. నేను నాగర్‌కర్నూల్ మార్కెట్‌యార్డ్‌కు మొక్కజొన్న పంటను తీసుకొచ్చి నెల రోజులు దాటింది. సుమారు 200 క్వింటాళ్ల పంటను అమ్ముకునేందుకు రోజూ మార్కెట్ యార్డుకు వస్తున్నాను. కానీ ఫలితం లేదు. కనీసం ఎప్పుడు కొనుగోలు చేస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు. – సిక్కొండ రాములు, మంతటి, నాగర్ కర్నూల్ మండలం -
ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం దిశగా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఉచిత సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనపైన దక్షిణమధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ రైల్వేబోర్డు ఆమోదిస్తే తప్ప తాము ఈ సదుపాయాన్ని కల్పించలేమని, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేబోర్డు మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు. రైల్వే బోర్డుకు సమాచారం లేదు! ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 75 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. 35 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేరకు తగ్గవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణాత్మకంగానే ఉన్నప్పటికీ రైల్వేబోర్డుకు ఇంకా సమాచారం అందజేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేసినా రైల్వేబోర్డు పరిశీలించి నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం పట్టవచ్చు. పైగా ఎంవోయూ కూడా కుదుర్చుకోవలసి ఉంటుంది. జూన్ 2 లోపు ఇదంతా సాధ్యం కాకపోవచ్చుననిపిస్తోంది..’అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పైగా ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్రం నుంచి రావలసిన రూ.460 కోట్లకు పైగా బకాయీలపైనా స్పష్టత రావలసి ఉందని ఆయన అన్నారు. రెండోదశ నిధులే ఇవ్వలేదు..! హైదరాబాద్‌లో లోకల్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున భరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో ఇదే ఒప్పందం ఆధారంగా రెండోదశను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం తన వాటా నిధులను పూర్తిగా చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే సొంతంగా పూర్తి చేయవలసి వచ్చింది. ప్రస్తుతం ఘటకేసర్ నుంచి రాయగిరి వరకు చేపట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులను కూడా దక్షిణ మధ్య రైల్వే సొంత నిధులతో చేపట్టింది. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెరపైకి తేవడంతో..ఇప్పటివరకు రెండో దశ నిధులను చెల్లించకపోవడాన్ని రైల్వే అధికారులు ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. సమయ పాలన మెరుగుపరచాలి ఎంఎంటీఎస్ రైళ్లలో సమయ పాలన మెరుగుపడి, సర్వీసులు పెంచితేనే ప్రయాణికులకు ఉచిత సదుపాయం సద్వినియోగమవుతుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ (హుమ్టా) అధికారులు భావిస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున అందుబాటులో ఉండాలని, అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీబస్ కనెక్టివిటీ కల్పించాలని సూచిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్ సేవలను సమన్వయం చేయడంపై సంస్థ ప్రణాళికలను రూపొందించింది. -
ఇస్తే 'మ్యాచింగ్' అభివృద్ధి స్వింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను నిధుల లేమి సమస్య వెంటాడుతోంది. తాజాగా మే 1 నాటికి విడుదల కావాల్సిన రూ. 2,979 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్లు అందకపోవడం, నిధులు పెండింగ్‌లో ఉండటం వల్ల గ్రామాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని వాపోతున్నారు. గ్రామాల్లో మురుగునీటి కాల్వలు, వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులు, శ్మశానవాటికల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి పనులకు అంతరాయం ఏర్పడుతోందని, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.కేంద్రం ఇస్తున్నా...‘మ్యాచింగ్’ లేదు.. కేంద్రం విడుదల చేసిన నిధులు సకాలంలో గ్రామ స్థాయికి చేరడం, గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించడానికి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు సకాలంలో విడుదల చేయడం అత్యంత అవశ్యం కాగా.. ఈ విషయంలో రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు క్షేత్రస్థాయి పరిస్థితులు తేట తెల్లం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రధాన బకాయిలను చెల్లించినప్పటికీ, రాష్ట్రం మాత్రం నామమాత్రంగానే నిధు లు విడుదల చేసింది. 2026 సంవత్సరం ప్రారంభం నాటికి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయించలేదనే విమర్శలు ఉన్నాయి. పంచాయతీలకు రూ.3,991 కోట్లు విడుదల కావాల్సి ఉంటే కేవలం రూ.1,011 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేంద్రం ఇటీవల 2026–27 సంవత్సరానికి రూ.619 కోట్లకు పైగా విడుదల చేసినప్పటికీ, గ్రామీణ స్థానిక సంస్థలు నిధుల కొరతను ఎదుర్కొంటుండటం గమనార్హం. కేంద్రం 15వ ఆర్థిక సంఘం టైడ్, అన్‌టైడ్ గ్రాంట్లను విడతల వారీగా విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా 2026 ఫిబ్రవరిలో రూ.387.53 కోట్లు, ఏప్రిల్‌లో మరో రూ.619.85 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ గ్రాంట్లకు సమాన నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 2026 నివేదికల ప్రకారం.. కేంద్రం రూ.1,900.45 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా (మ్యాచింగ్ గ్రాంట్) కింద కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దాదాపు రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం (రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) నిధులు) పంచాయతీలకు రూ.1,011 కోట్లు మాత్రమే మ్యాచింగ్ గ్రాంట్ల కింద ఇచ్చింది. 2024–25లో ఎస్ఎఫ్సీ నిధులు రూ.611 కోట్లు, 2025–26లో ఇప్పటివరకు రూ.400 కోట్లు మాత్రమే (మొత్తం కలిపి రూ.1,011కోట్లు) మాత్రమే విడుదల చేసింది. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇంకా రూ.2,979 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాత భారీగా కేంద్ర నిధులు గత రెండున్నరేళ్లుగా (ముఖ్యంగా 2024–2026 మధ్య) తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పంచాయతీ ఎన్నికలు జరగని కారణాల వల్ల నిలిచిపోయినప్పటికీ, 2025 డిసెంబర్ చివరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీలు బాధ్యతలు స్వీకరించాక (డిసెంబర్ 22, 2025) రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సమరి్పంచడంతో నిధుల విడుదల వేగవంతమైంది. మొత్తం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో తెలంగాణకు సుమారు రూ.9,000 కోట్లకు పైగా నిధులు కేటాయించగా, అందులో ఎక్కువ భాగం విడుదలయ్యాయి. అయితే ఈ నిధుల విడుదల జరిగినప్పటికీ.. 2026 మార్చి 31 లోగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) నిర్వహణలో జాప్యం కారణంగా, సుమారు రూ.550 కోట్ల కేంద్ర నిధులు రాష్ట్రానికి రాకుండా ఆగిపోయాయని, ఇప్పుడు వాటిని రాష్ట్రం తిరిగి రాబట్టుకోలేకపోతోందని అధికార వర్గాల సమాచారం. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం కూడా పంచాయతీల బకాయిలు పూర్తిగా చెల్లించకుండా కేవలం 2023– 2024 సంవత్సరానికి విడుదల చేయడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్ఎఫ్సీ నిధులు కానీ, మ్యాచింగ్ గ్రాంట్ కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. – పాలకొండ ప్రణీల్ చందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం -
వయోపరిమితి ఐదేళ్లు పెంపు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వం పదేళ్లపాటు వయోపరిమితి సడలింపును ఇవ్వగా... ప్రస్తుతం ఆ ఉత్తర్వుల కాలపరిమితి తీరింది. దీంతో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాకే కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈసారి వయోపరిమితి పెంపును ఐదేళ్ల పాటు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యోగ నియామక ప్రకటనల జారీలో తీవ్ర జాప్యం నెలకొనడం... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్–1 ఉద్యోగ నియామకాలకు దాదాపు పదేళ్లపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి రావడంతో ప్రభుత్వం అప్పట్లో పదేళ్లపాటు వయోపరిమితిని సడలించింది. దీంతో సాధారణ వయసు 34 సంవత్సరాలు కాగా... వయోపరిమితి సడలింపుతో 44 ఏళ్ల వయసు వరకు ఉద్యోగ అర్హత పరీక్షలు రాసే అవకాశం కలిగింది. తాజాగా ఐదేళ్లు మాత్రమే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లకే పరిమితం కానుంది. జీఏడీ వద్ద పెంపు అంశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గతేడాది ప్రభుత్వం జాబ్ కేలండర్ ఇచ్చినప్పటికీ... ఉద్యోగ ప్రకటనలు మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం వయోపరిమితిపై స్పష్టత లేకపోవడంతో కొత్త నియామక ప్రకటనలు వెలువడటం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఆర్థిక శాఖ వద్ద ఉంది. గ్రూప్–1 కేటగిరీలోనే దాదాపు 160 ఖాళీలున్నట్లు సమాచారం. ఇతర కేటగిరీల్లో భారీగా ఖాళీలున్నాయి. వయోపరిమితి సడలింపు ఉత్తర్వులు వెలువడితే నూతన నియామకాలకు మార్గం సుగమం కానుంది. వయోపరిమితి సడలింపు అంశం ప్రస్తుతం సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశం తర్వాత దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. పదేళ్లు పెంచాలని విజ్ఞప్తి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని పదేళ్లు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌తోపాటు పలువురు నిరుద్యోగులు భేటీ అయ్యి వినతిపత్రాన్ని సమర్పించారు. ఉద్యమ కాలంలో పదేళ్లపాటు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాల కాలంలో సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి, అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై భట్టి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం వయోపరిమితిపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
891.38 ఎకరాల భూమి సర్కార్కే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)కు బాలానగర్‌లో అప్పగించిన 891.38 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోకుండా 2008 నాటి పారిశ్రామిక, ఆర్థిక పునర్విర్మాణ మండలి (బీఐఎఫ్ఆర్) ఇచ్చిన ఉత్తర్వును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2008లోనే ప్రభుత్వం భూమిని అధికారికంగా స్వాధీనం చేసుకున్నందున, బీఐఎఫ్ఆర్ ఉత్తర్వులో హేతుబద్ధత లోపించిందని చెప్పింది. నాటి ఉత్తర్వు అమలులో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూడ్చలేని నష్టాన్ని చవిచూస్తుందని అభిప్రాయపడింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే ఈ భూమిని టీజీఐఐసీకి అప్పగించడం కూడా జరిగిందని గుర్తు చేసింది. తదుపరి విచారణ జూన్ 22కు వాయిదా వేసింది. ఈ వివాదం 90వ దశకంలో మొదలైంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వినియోగం కోసం ఆ భూమిని సేకరించి, ఒక ఫార్మాస్యూటికల్ ప్లాంట్‌ను స్థాపించడానికి ఐడీపీఎల్‌కు బదిలీ చేసింది. ఆ భూమిని కేవలం పారిశ్రామిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలనే నిర్దిష్ట ఒప్పందం కింద అప్పగించారు. అయితే, ఐడీపీఎల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, తన పరిపాలనా భవనాలను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించింది. వివాదం బీఐఎఫ్ఆర్కు చేరడంతో.. భూ స్వాధీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, కంపెనీపై బలవంతపు చర్యలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. మూడో పక్షానికి లీజుకివ్వడం కుదరదు.. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట ప్రజాప్రయోజనం కోసం బదిలీ చేసిన భూమిని ఒక సాధారణ ప్రైవేట్ అమ్మకంలా పరిగణించకూడదన్నారు. ఒప్పందం ప్రకారం పరిశ్రమల స్థాపన కోసమే ఈ భూమిని వినియోగించుకోవాలి తప్ప.. మూడో పక్షానికి లీజుకు, సబ్ లీజుకు ఇచ్చి తద్వారా ఆదాయ వనరుగా మార్చుకోకూడదన్నారు. ఐడీపీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2008లో ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్లో తీవ్ర జాప్యం జరిగిందని, పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. 2008 నుంచి చట్టపరమైన పరిస్థితులు గణనీయంగా మారాయన్నారు. బీఐఎఫ్ఆర్ను రద్దు చేశారని, కేసును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు సక్రమంగా బదిలీ చేశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల కోసం లీజుకు ఇవ్వడాన్ని కూడా సమర్థించలేమన్నారు. నాటి ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
ముందుకు సాగని హిల్ట్ పీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐదారు దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడలను ‘బహుళ వినియోగ జోన్లు’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ‘హిల్ట్ పాలసీ’ముందుకు సాగడం లేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్ఓ) రేట్ల కంటే బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపాక్ట్ డెవలప్మెంట్ ఫీజు ఎక్కువగా ఉండటంతో పాటు ఇతర కారణాలతో పరిశ్రమల యజమానులు హిల్ట్ పీపై ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశాజనకంగా లేకపోవడం, ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు పరిశ్రమల తరలింపులో ఇబ్బందులు తదితరాలు కూడా ఈ పాలసీ అమలుకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడల యజమానులతో టీజీఐఐసీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తోంది. మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం–2025 (హిల్ట్ పీ)ని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆమోదించి జీఓ నంబర్ 27 విడుదల చేసింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల దృష్ట్యా పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించడం, బాలానగర్, కాటేదాన్, కూకట్పల్లి సహా మొత్తం 22 పారిశ్రామికవాడల్లోని 9,292 ఎకరాలను మల్టీ యూజ్ జోన్లుగా మార్పిడి చేయాలన్నదే ఈ పాలసీ లక్ష్యం. దీని ద్వారా పారిశ్రామికవాడలను.. అపార్ట్మెంట్లు, సమీకృత టౌన్íÙప్లు, ఆఫీసులు, హోటళ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, క్రీడా కేంద్రాలు, కల్చరల్ సెంటర్లు తదితరాల కోసం వినియోగించేలా వెసులుబాటు కల్పిస్తారు. సవాలక్ష సందేహాలు ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా అథారిటీ (ఐలా)ల ఆధ్వర్యంలో టీజీఐఐసీ నిర్వహిస్తున్న సమావేశాల్లో పరిశ్రమల యజమానులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో పాటు తమ డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిశ్రమలను మూసివేసి హిల్ట్ పాలసీ కింద దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది విముఖత చూపుతున్నారు. మల్టీ యూజ్ జోన్‌గా మార్చుకునేందుకు టీజీఐఐసీకి చెల్లించాల్సిన డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు ఎక్కువగా ఉందని కొందరు చెప్తున్నారు. పరిశ్రమలను ఉన్న ఫళంగా మూసి వేసి ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించడం సాధ్యం కాదని అంటున్నారు. ఓఆర్ఆర్ వెలుపల భూమి కొనుగోలు, కొత్త పరిశ్రమ ఏర్పాటు అంత సులభతరం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పరిశ్రమల తరలింపులో ఎదురయ్యే సవాళ్లు అన్నింటిలోనూ ప్రభుత్వ సహకారం ఇవ్వాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల తరలింపుతో తమ వ్యాపారం దెబ్బతినడంతో పాటు ఆధారపడిన వారు ఉపాధి కూడా కోల్పోతారనే వాదన కూడా కొందరు వినిపిస్తున్నారు. ఈ ఫీజు ఎస్ఆర్ఓ కంటే తక్కువగా ఉండాలని కొందరు పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. పరిశ్రమల మూతకు వెనుకంజ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి నిరాశాజనకంగా ఉండటంతో హిల్ట్ పాలసీ కింద దరఖాస్తు చేసుకునేందుకు పరిశ్రమల యజమానులు విముఖత చూపుతున్నారు. నడిచే పరిశ్రమ స్థానంలో మల్టీ యూజ్ జోన్ ఏర్పాటు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు లాభదాయకం అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదైనా ఒక పారిశ్రామిక వాడలోని అన్ని పరిశ్రమలు ఏకకాలంలో తరలివెళ్తేనే మల్టీ యూజ్ జోన్‌గా మార్చడం సాధ్యమవుతుంది. అందుకే పరిశ్రమల యజమానులతో టీజీఐఐసీ సంప్రదింపులు జరుపుతోంది. వాస్తవానికి ఆరు నెలల్లోగా పాలసీ అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. మే నెలాఖరుకు ఆరు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయి మార్గదర్శకాలపై స్పష్టత లేకుండా పోయింది. పరిశ్రమల యజమానుల డిమాండ్లు, రాయితీలు, ఫీజు తగ్గింపు వంటి విన్నపాలపై స్పష్టత ఇస్తూ పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వెలువరిస్తే పాలసీ ముందుకు సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆ ఒక్కటీ అడక్కు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి రూపొందించిన నివేదికను 4 సంపుటాలుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జనాభా దామాషా ప్రకారం సమాజంలోని అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో వాటా లభిస్తోందా? అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయిన కులాలు ఏవి? వంటి కీలక అంశాలు ఇందులో బహిర్గతమవుతాయని చాలామంది ఎదురు చూశారు. సర్వే ప్రారంభించడానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సైతం పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కానీ మిగిలిన అన్ని అంశాలకు సంబంధించిన గణాంకాలను ఈ నివేదికలో పొందు పరిచిన ప్రభుత్వం కీలకమైన రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన సమాచారం బహిర్గత పరచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 56 రకాల ప్రశ్నలకు సమాచారం సేకరించినా.. సర్వేలో భాగంగా 56 రకాల ప్రశ్నలకు సమాధానాలను ప్రభుత్వం ప్రజల నుంచి సేకరించింది. రాష్ట్రంలోని 3.55 కోట్ల జనాభా సర్వేలో పాల్గొని ప్రభుత్వం కోరిన వివరాలను అందించింది. మొత్తం 242 కులాలు, ఉపకులాల వారితో పాటు ఏ కులానికి చెందనివారు కూడా వీరిలో ఉన్నారు. దాదాపుగా 4 శాతం మంది తాము ఏ కులానికి చెందని వారిగా పేర్కొనగా, మిగిలిన వారు తమ కులం, ఉపకులం వివరాలు ఇచ్చారు. – 46వ ప్రశ్న కింద కుటుంబంలోని వ్యక్తుల రాజకీయ నేపథ్యానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. కుటుంబంలో ప్రజా ప్రతినిధిగా పనిచేసినవారు ఉన్నారా? ప్రస్తుతం/గతంలో ప్రజాప్రతినిధిగా సభ్యత్వం పొందారా? ప్రస్తుతం/గతంలో మంత్రి, మండలి చైర్మన్, స్పీకర్, తదితర ఆఫీస్ బేరర్ పదవుల్లో పనిచేశారా? ఎన్ని దఫాలు పనిచేశారు? ప్రజాప్రతినిధిగా మొత్తం ఎన్నేళ్లు పనిచేశారు? వంటి వివరాలను నమోదు చేశారు. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే 242 కులాలు, ఉప కులాల్లో రాజకీయ ప్రాతినిధ్యం కలిగి ఉన్న కులాలు, ఉప కులాలు ఏవి? వాటి జనాభాతో పోల్చితే ప్రాతినిధ్య నిష్పత్తి ఎంత? ఏ కులాలు, ఉప కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి? వంటి అంశాలపై స్పష్టత వచ్చేది. ప్రధానంగా రాజ్యాధికారాన్ని అందుకోలేకపోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప కులాలు ఏవో తెలిసిపోయేది. – నివేదిక రెండో సంపుటిలో రాజకీయ ప్రాతినిధ్యంపై సంక్షిప్త సమాచారాన్ని మాత్రం పొందుపరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గ్రామ, మండల స్థాయి ఎన్నికలు, బహిరంగ సభలు, ఫిర్యాదుల వేదికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మండల స్థాయి కమిటీలు, కుల సంఘాలు, సంక్షేమ కమిటీలు, కుల సంఘాలు వంటి రాజకీయ కార్యకలాపాల్లో ఈ వర్గాలు ప్రాతినిధ్యం కలిగి ఉన్నట్టు నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంత రాజకీయాల్లో మాత్రం ఓసీలు, ఓబీసీల్లోని ఉన్నతవర్గాలు పట్టణ స్థానిక సంస్థలతో పాటు పార్టీ నాయకత్వ పదవుల్లో అధిక ఉనికి కలిగి ఉన్నాయని పేర్కొంది. ఆ సమాచారం ఉపయోగించలేదు? కులాలు, ఉప కులాల వారీగా రాజకీయ నేపథ్యానికి సంబంధించి సర్వేలో సేకరించిన సమాచారాన్ని నివేదిక తయారీలో వినియోగించలేదని ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారవర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు సర్వేలో ఇందుకు సంబంధించిన సరైన సమాచారం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైనట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారంలో అడిగిన ప్రశ్నలు కులాల వారీగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని అంచనా వేయడానికి సరిపోలేదని స్పష్టం చేశారు. అయితే అస్పష్టత, గందరగోళాన్ని నివారించడానికే ఈ గణాంకాలను నివేదికలో బహిర్గతం పర్చలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వే నివేదిక తయారీలో పాల్గొన్న స్వతంత్ర నిపుణుల బృందంలోని సభ్యుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా కులాల వారీ రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవచ్చని, ఉప కులాల ప్రాతినిధ్యం తెలుసుకోవడం సాధ్యం కాదని అన్నారు. రాజకీయ పారీ్టలే తమ పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల్లో ఉపకులాల వారీగా ఇస్తున్న ప్రాతినిధ్యాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుందని చెప్పారు. -
ఆర్టీసీ @ ఎలక్ట్రిక్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకుంటున్న ఆర్టీసీ, ఇక సొంతంగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలో 3 వేల లోపు సంఖ్యలో మాత్రమే ఆర్టీసీ బస్సులున్నాయి. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవు. నగర జనాభా ప్రకారం దాదాపు 6 వేల బస్సులు అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న బస్సుల సంఖ్యను కనీసం 5 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పీఎం ఈ–డ్రైవ్ కింద కేంద్ర ప్రభుత్వం నగరానికి 2,300 బస్సులు మంజూరు చేసింది. ప్రస్తుతమున్న ఎలక్ట్రిక్ బస్సులతో కలుపుకొంటే మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 3 వేలకు చేరుకుంటుంది. దీంతో మరో 2 వేల బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2030 నాటికి అందుబాటులోకి కొన్ని సొంత బస్సులు విజన్ 2047 కోసం ఆర్టీసీ కూడా ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందులో 2027 నాటికి గ్రేటర్ నగరం (ఔటర్ రింగురోడ్డు లోపల)లో ఆర్టీసీకి డీజిల్ బస్సులు ఉండకూడదన్నది లక్ష్యం. అంటే వచ్చే ఏడాది నాటికి నగరంలో అన్నీ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉంటాయి. పీఎం ఈ–డ్రైవ్ కింద వచ్చే ఏడాది చివరి నాటికి అన్ని బస్సులు అందుతాయి. దీంతో అప్పటికి డీజిల్ బస్సులన్నింటిని ఔటర్ వెలుపలి డిపోలకు బదిలీ చేస్తారు. ఇక 2030 నాటికి జనాభా దామాషా ప్రకారం బస్సులను సమకూర్చుకోవాలన్నది రెండో లక్ష్యం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకం కింద గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో బస్సులను సమకూర్చుకుంటుండగా, అవి జనాభా దామాషా పద్ధతిలో కావాల్సిన సంఖ్యలో ఉండవు. దీంతో అదనంగా 2 వేల బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలన్నది ఆ లక్ష్యంలో భాగం. వేయి వరకు మినీ బస్సులు: ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులన్నీ 9 మీటర్ల కంటే పొడవైన పెద్ద బస్సులు. ఇంత పరిమాణంలో బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలకు తిరగలేవు. పాత నగరంలోని రోడ్లపై మరీ కష్టం. దీంతో ఆయా ప్రాంతాల్లో తిరిగే విధంగా మినీ ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీనికి తోడు, ఆర్టీసీ బస్సులను మెట్రో రైలు సర్వీసులతో అనుసంధానించబోతున్నారు. మెట్రో రెండు దశ కూడా రాబోతున్నందున ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫార్ములాను అమలులోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కాలనీలను మెట్రో స్టేషన్లతో అనుసంధానించాలి. అంటే కాలనీల్లో బస్సెక్కి మెట్రో స్టేషన్ వరకు వెళ్లేలా, మెట్రో రైలు దిగి బస్సెక్కి కాలనీల వరకు చేరేలా ఈ అనుసంధానం ఉంటుంది. మినీ బస్సులను ఇందుకు కూడా వాడాలన్నది ప్లాన్. వెరసి ఈ రెండు అవసరాలకు వేయి వరకు మినీ బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు ప్రాజెక్టు లోన్‌తో అనుసంధానం ఎలక్ట్రిక్ బస్సులు ఖరీదైనవి కావటంతో ఇంతకాలం ఆర్టీసీ సొంతంగా కొనటం కంటే అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవటం మెరుగైన విధానంగా భావిస్తోంది. భవిష్యత్‌లో మన దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలు తయారు కాబోతున్నందున ఎలక్ట్రిక్ బస్సుల ధరలు కూడా తగ్గనున్నాయి. దీనికి తోడు, మెట్రో రైలు విస్తరణకు ప్రభుత్వం భారీగా రుణాలు పొందబోతోంది. మెట్రో రైలు ప్రాజెక్టులో ఆర్టీసీ బస్సులకు కూడా భాగస్వామ్యం ఉండనున్నందున, మెట్రో ప్రాజెక్టు కోసం తీసుకునే రుణంలో కొంత మొత్తాన్ని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కూడా వాడనున్నారు. ఉద్యోగాలకు భరోసా... ప్రస్తుతం జీసీసీ పద్ధతిలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నందున, డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది ప్రైవేటు సంస్థలే సమకూరుస్తాయి. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ వైపు నుంచి ఉంటారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బందిని నగరం వెలుపలికి బదిలీ చేయనున్నారు. కొంతమందిని ఇతర అవసరాలకు వాడుకోనున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. భవిష్యత్‌లో ఆర్టీసీ సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటున్నందున, వెలుపలికి వెళ్లే సిబ్బంది తిరిగి నగరానికి వస్తారన్న భరోసాను ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తోంది. -
గిగ్ వర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త
కార్మికుల దినోత్సవం సందర్భంగా.. గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గిగ్ సెక్టార్లో ఉద్యోగ భద్రత కోసం తెచ్చిన తెలంగాణ ఫ్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్) బిల్లు 2026 చట్టరూపం దాల్చింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే 1న తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే చట్టానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌పై స్పష్టతకు మరో రెండు వారాల టైం పట్టొచ్చు. తాజా పరిణామంతో గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్ అసోషియేషన్లు రేవంత్ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఒక అంచనా ప్రకారం.. తెలంగాణలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు.. ఇలా సుమారు ఐదు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వాళ్లందరికీ పని భద్రత(గిగ్ వర్కర్లను రిజిస్టర్ చేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు), ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపు ఇలా సమగ్ర రక్షణ కల్పిస్తుంది. అయితే.. ఈ చట్టంలో కొన్ని అంశాలపై ప్లాట్‌ఫారమ్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించడం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధనలతో పాటు ఇక మీదట సరైన కారణం లేకుండా వర్కర్లను పనిలో నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం చెబుతోంది. అలాగే గిగ్ వర్కర్లను కూడా గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలకు కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. దేశంలో గిగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన రెండో రాష్ట్రం తెలంగాణ నిలవనుంది. గతంలో రాజస్థాన్ గిగ్ వర్కర్ల కోసం ఈ తరహా చట్టం(రాజస్థాన్ ఫ్లాట్‌ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (Registration and Welfare) యాక్ట్ 2023 తెచ్చింది. ఈ చట్టానికి అదే ఏడాది జులైలో శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినా.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఆ చట్టం అమల్లోకి రాకపోవడంతో అక్కడ లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. -
గోనె సంచులు రాక.. గోదాములు లేక
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా మక్కలను విక్రయించడం పెద్ద సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం మక్కలకు కనీస మద్దతు ధర రూ.2,400 నిర్ణయించగా, బహిరంగ మార్కెట్లో రూ.1,700 మించి రావడం లేదని రైతాంగం ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఒత్తిళ్లు, రైతు సంఘాల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోళ్ల బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. అయితే మార్క్‌ఫెడ్‌కు జిల్లాల్లో పూర్తి స్థాయి యంత్రాంగం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, విక్రయించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్ –ప్యాక్స్) పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల మేనేజర్లు ఇప్పుడు ప్యాక్స్ ద్వారా మక్కల కొనుగోళ్లు చేయించేందుకు ప్రయతి్నస్తున్నా, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొనుగోళ్లు సాగడం లేదు. రికార్డు స్థాయిలో సాగు రాష్ట్రంలో యాసంగిలో మక్కల సాధారణ సాగు వి స్తీర్ణం 4 లక్షల ఎకరాలుగా ఉంటే ఈసారి ఏకంగా 16.25 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున 43.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల ప్రైవేటు విక్రయాలు, సొంత అవసరాలు పోగా 15 లక్షల మెట్రిక్ టన్ను ల మక్కలను విక్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కజొన్న ఉత్పత్తి కావడంతో వాటిని ఎలా విక్రయించాలో తెలియని స్థితిలో మార్క్‌ఫెడ్ కొట్టుమిట్టాడుతోంది. అన్నీ సమస్యలే... మక్కల కొనుగోళ్లకు అవసరమైన గోనె సంచులను మార్క్‌ఫెడ్ ముందుగానే సమకూర్చుకోవాలి. ఒకసారి వాడిన (సెకండ్ హ్యాండ్) గోనె సంచులను మక్కల కొనుగోళ్లకు వినియోగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచి, ఒక్కో గోనెసంచికి రూ.22 చొప్పున కాంట్రాక్టులు అప్పగించినా, కాంట్రాక్టర్లు సమయానికి గోనెసంచులు అందించడం లేదు. దీంతో భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, వరంగల్ వంటి చోట్ల రైతులే గన్నీ బ్యాగులను సమకూర్చుకొని మక్కలను విక్రయించేందుకు ప్యాక్స్ సెంటర్లకు వస్తున్నారు. ప్యాక్స్ నిర్వాహకులు కూడా గోనెసంచులతో వచ్చిన రైతుల మక్కలనే కాంటా వేస్తున్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి జిల్లా మేనేజర్లు, కాంట్రాక్టర్లు, గోనెసంచులు సమకూర్చే ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపి అవసరమైన చోటకు గన్నీ బ్యాగులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. మక్కలను సంచుల్లో నింపి, తూకం వేసి, లారీల్లో గోదాములకు తరలించేందుకు అవసరమైన హమాలీల సమస్య కూడా అన్ని జిల్లాల్లో ఎదుర్కొంటున్నారు. మరోవైపు సేకరించిన మక్కలను నిల్వ చేయడం ఇప్పుడు మార్క్‌ఫెడ్‌కు ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన గోదాములన్నీ ఇప్పటికే బియ్యం, ఇతర నిల్వలతో నిండి ఉన్నాయి. తాజాగా రబీ పంట మిల్లింగ్‌కు వస్తుండడంతో కొత్త బియ్యం నిల్వలకే గోదాములు సరిపోని పరిస్థితి ఉంది. పత్తి నిల్వకు సంబంధించిన గోడౌన్లు ఖాళీగా ఉన్నా, ఖరీఫ్‌లో సాగయ్యే పత్తి పంట సెపె్టంబర్ నాటికి మళ్లీ గోదాముల్లోకి వచ్చి చేరనుంది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్‌లోగా మక్కల నిల్వలను ఖాళీ చేస్తామని హామీ ఇస్తే తప్ప గోదాములు ఇవ్వలేమని చెబుతున్నట్టు సమాచారం. 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు మక్కల కొనుగోళ్లకు ఇప్పటి వరకు 246 ప్యాక్స్ సెంటర్లను ఎంపిక చేశారు. 74వేలకు పైగా రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించారు. నల్లగొండ, నారాయణపేట, భువనగిరి, మల్కాజిగిరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భూపాలపల్లి వంటి చోట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
‘రీయింబర్స్మెంట్’లో కీలక మార్పు
సాక్షి, హైదరాబాద్: పోస్టు మెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని జమ చేస్తున్న ప్రభుత్వం.. ఇకపై ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్(ఏపీబీఎస్) ద్వారా నేరుగా విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో ఫీజు మొత్తాన్ని బదిలీ చేయనుంది. వాస్తవానికి 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర డీబీటీ పద్ధతిలోనే ఫీజును చెల్లిస్తుండగా..తాజాగా ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు కూడా డీబీటీ పద్ధతిలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు (జీఓఎంఎస్ నం.7) జారీ చేశారు. కొత్త విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు వైఎస్ భరోసా.. పేదరికం కారణంగా విద్యార్ధులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ చేసేలా అప్పట్లో అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. తద్వారా కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ నిబంధన విధించారు. అంతేకాకుండా ఫీజుల విషయంలో కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయని భావించారు. విద్యార్థి ఖాతాలోనే వేయాలన్న కేంద్రం కాలక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించాలని, విద్యార్థి ఖాతాలోనే ఫీజును జమ చేయాలని సూచించింది. అప్పుడే తమ వాటా నిధులు వాటా విడుదల చేస్తామనే మెలిక పెట్టింది. కానీ గత ప్రభుత్వం ఈ నిబంధనకు ఒప్పుకోలేదు. దీంతో దాదాపు 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటాను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తొలుత ఎస్సీ విద్యార్థులకు డీబీటీ పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని నేరుగా విద్యార్థులకే ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.ప్రతి కాలేజీలో ప్రత్యేక నోడల్ అధికారి – విద్యార్థుల ప్రోగ్రెస్ ట్రాకింగ్ కోసం ఈపాస్‌లో ప్రత్యేక మాడ్యూల్ రూపొందించాలి. – స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం ప్రతి కాలేజీలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. – ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. – ఆన్లైన్ దరఖాస్తు తర్వాత విద్యార్థులు హార్డ్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుదమెంట్లు డిజిటల్‌గా అప్లోడ్ చేయాలి. బకాయిల చెల్లింపు పాత విధానంలోనే.. – జిల్లా సంక్షేమ అధికారి డిజిటల్ వెరిఫికేషన్ తర్వాత స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. – డీబీటీ అమలు కారణంగా అడ్మిషన్ సమయంలో కాలేజీలు ఫీజులు డిమాండ్ చేయకూడదు. విద్యార్థి డీబీటీ పద్ధతిలో వచ్చిన డబ్బుతో ఫీజు చెల్లించాలి. – ఈ మార్గదర్శకాలు 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి వర్తిస్తాయి. – 2025–26 వరకు ఉన్న బకాయిలు పాత విధానంలోనే చెల్లిస్తారు. – సంబంధిత సంక్షేమ శాఖల కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈపాస్, ఐఎఫ్ఎంఐఎస్, పీఎఫ్ఎంఎస్ వ్యవస్థల్లో అవసరమైన మార్పులు చేయాలి. ఫీజుల చెల్లింపుపై అస్పష్టత ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల్లో మార్పులతో ఇకపై విద్యార్ధి తాను చదువుతున్న కోర్సు ఫీజును నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. డీబీటీ పద్ధతిలో విద్యార్ధి ఖాతాకు ఫీజు మొత్తం జమ అయిన తర్వాత.. ఆ మొత్తాన్ని కాలేజీలో చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. అయితే ఫీజు డబ్బులను ప్రభుత్వం ఎప్పటిలోగా విద్యార్ధి ఖాతాకు జమ చేస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు. వాస్తవానికి కోర్సు ప్రారంభ సమయంలోనే కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు అందిన తర్వాత చెల్లిస్తానంటే యాజమాన్యం అనుమతించే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజా మార్పులు విద్యార్ధిని గురి చేస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేటిక్ రెన్యువల్.. ⇒ ఆధార్ లింక్ చేసిన విద్యార్థి బ్యాంక్ ఖాతాకే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏ పీబీఎస్ ద్వారా డీబీటీ పద్ధతిలో జమ చేయాలి. ⇒ దరఖాస్తు సమయంలో ఆధార్ వివరాలు ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించాలి. ఏదైనా లోపం ఉంటే విద్యార్థి సరిచేయాలి. ⇒ ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేస్టేషన్ కోసం బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా మాత్రమే సమర్పించాలి. ⇒ బ్యాంక్ ఖాతా వివరాలు ఎన్పీసీఐ ద్వారా ధ్రువీకరించాలి. లోపాలుంటే వెంటనే సరిచేయాలి. ⇒ కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు మీసేవ ద్వారా ఆధార్‌తో లింక్ చేయాలి. ⇒ రెన్యువల్ అప్లికేషన్లు ఆటోమేటిక్‌గా కొనసాగుతాయి. కాలేజీలు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపాలి. -
Big Update: ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
-
ఇక సర్కారీ మెట్రో.. పూర్తయిన ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) లిమిటెడ్ అధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) తెలంగాణ ప్రభుత్వం స్వాదీనంలోకి వచ్చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో సర్కారీ మెట్రోగా మారింది. హెచ్ఎంఆర్ఎల్ ఫేజ్–1ను స్వాధీనం చేసుకోవాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం.. ఎల్అండ్టీతో కొద్దిరోజులుగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్టీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈమేరకు ఎల్అండ్టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్)తో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్అండ్టీ తరఫున డీకే సేన్, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీ హామీతో ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్పై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును (ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి) తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందించింది. ఎల్అండ్టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎల్అండ్టీ చైర్మన్, ఎండీ ఎస్ఎన్. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ప్రయాణికులకు అనుకూలంగా.. ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ సంస్థ 2017, నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కి.మీ. నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్– ఐను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్– ఐను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోవడంతో ఫేజ్–1, ప్రతిపాదిత ఫేజ్–2 నెట్వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్‌లోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధారపడదగిన, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.1000కోట్ల బకాయిలను విడుదల చేసింది. 2025 అక్టోబర్ వరకు రిటైర్డ్ ఉద్యోగల జీపీఎఫ్ బకాయిలను ఆర్థిక శాఖ చెల్లించింది.గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ మార్చి 2026 వరకు ప్రతి నెలా చెల్లింపులు చేసింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచి నెలవారీ కేటాయింపును రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు రూ.1000 కోట్లు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో పూర్తిగా తీర్చింది. దీని వల్ల పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించింది.ఉద్యోగుల ఆరోగ్య అవసరాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య బిల్లులు ఒక్కరోజు ఆలస్యం లేకుండా, అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ చర్యలతో ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఊరట లభించింది. -
ఆర్టీసీ విలీనానికి ఏపీ నమూనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల వారి జీతాల్లో పెరుగుదల నమోదు కానుంది. అయితే, ఈ మార్పు డిపో మేనేజర్ స్థాయి నుంచే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం అక్కడ చోటుచేసుకున్న మార్పులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా క్లిష్టమైనది. దీనికి సంబంధించిన కసరత్తుకు భారీగా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, ఏపీలో విలీన ప్రక్రియ జరిగినందున, అక్కడి ప్రక్రియనే అనుసరిస్తే జాప్యం జరగదు. గతంలో ఉమ్మడి ఆర్టీసీలో భాగమైనందున, రెండు ఆర్టీసీల్లో పెద్ద తేడా లేదు. దీంతో ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం ఏపీ మోడల్‌నే అనుసరించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో విలీనం జరిగినప్పుడు ఆర్టీ సీలోని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల కేడర్‌లో ఫిక్స్ చేస్తారు. ఆర్టీసీ పోస్టుకు సరిసమానమైన ప్రభుత్వ పోస్టుల్లో కలిపేస్తారు. సరిసమాన పోస్టు లేనప్పుడు కాస్త అటూ ఇటూగా ఉన్న కేడర్‌తో అనుసంధానిస్తారు. ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత, పెద్ద పోస్టు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)దే. ఈ పోస్టును అదనపు కమిషనర్ కేడర్‌గా మార్చారు. రీజినల్ మేనేజర్ పోస్టును జాయింట్ కమిషనర్ స్థాయిగా, డివిజినల్ మేనేజర్ (డిప్యూటీ మేనేజర్) పోస్టును డిప్యూటీ కమిషనర్ స్థాయిగా, డిపో మేనేజర్ పోస్టును అసిస్టెంట్ కమిషనర్ స్థాయిగా ఖరారు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నుంచి ఆ పైస్థాయి పోస్టులకు గెజిటెడ్ హోదా కల్పించారు. ప్రభుత్వంలో డ్రైవర్ పోస్టు ఉన్నందున ఆర్టీసీ డ్రైవర్‌ను డ్రైవర్ స్థాయిగానే పరిగణిస్తున్నారు. కానీ, ప్రభుత్వంలో కండక్టర్ పోస్టు లేనందున, కండక్టర్ పోస్టును జూనియర్ అసిస్టెంట్ స్థాయిగా గుర్తించారు. పెద్ద అధికారుల జీతాల్లో తగ్గుదల... కానీ.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ఫిక్స్ చేసిన తర్వాత ఆ స్థాయి స్కేల్ వర్తింపజేస్తారు. దీంతో ప్రభుత్వ స్కేల్‌కు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. కానీ, ఆర్టీసీలోని ఈడీ, ఆర్ఎం, డీవీఎం, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (సీఎంఈ), చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం), చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం), విజిలెన్స్ డైరెక్టర్, డిప్యూటీ మెకానికల్ ఇంజినీర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్, విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి వరకు జీతాలు ప్రస్తుతం ప్రభుత్వంలోని సమానమైన స్థాయి పోస్టుల కంటే ఎక్కువ ఉన్నాయి. దీంతో ఈ పోస్టుల జీతాల పెరుగుదల ఉండదు. ఆ తర్వాత ఉన్న డిపో మేనేజర్ పోస్టు నుంచి జీతాల పెరుగుదల నమోదవుతుంది. తక్కువ స్కేల్‌తో ఉన్న ఆర్టీసీ పోస్టుల జీతాలను ప్రభుత్వ స్కేల్‌కు సమానంగా పెంచుతున్నప్పుడు, ఎక్కువ జీతాలున్న పోస్టులను ప్రభుత్వ స్కేల్‌కు సమానం చేయాలంటే తగ్గించాల్సి ఉంటుంది. కానీ, ఏపీలో అలా తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టుగా స్థిరీకరించారు. తదుపరి పీఆర్సీలతో ప్రభుత్వ కేడర్ స్కేల్ పెరిగి ఆర్టీసీ అధికారుల జీతాల కంటే ఎక్కువైనప్పుడే పెంచుతారు. అప్పటి వరకు కేవలం ఇంక్రిమెంట్లను మాత్రమే జత చేస్తారు. పే స్కేల్ ఇలా... ⇒ ఏపీఎస్ఆర్టీసీ విలీన సమయంలో డిపో మేనేజర్ వేతనం రూ.57,000–రూ.1,42,500గా ఉంది. దాన్ని రూ.57,100–రూ.1,47,760గా మార్చారు. ⇒ గ్రేడ్–1 డ్రైవర్ ప్రారంభ జీతం రూ.25,480 నుంచి రూ.29,980కు, గ్రేడ్–2 డ్రైవర్ ప్రారంభ జీతం రూ.21,390 నుంచి రూ.27,500కు, గ్రేడ్–1 కండక్టర్ ప్రారంభ జీతం రూ.21,670 నుంచి రూ.28,280కు, గ్రేడ్2 కండక్టర్ ప్రారంభ జీతం రూ.19,580 నుంచి రూ. 25,220కి పెరిగింది. గ్రేడ్2 మెకానిక్ ప్రారంభ జీతం రూ.20,300 నుంచి రూ.25,220కి పెరిగింది. ⇒ ప్రభుత్వ అధికారులతో పోలిస్తే ఆర్టీసీ ఉన్నతాధికారుల గ్రాట్యుటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ అధికారుల గ్రాట్యుటీపై సీలింగ్ ఉంది. ఉన్నతాధికారుల గ్రాట్యుటీ దాదాపు రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువగానే తగ్గుదల నమోదు కావాల్సి ఉంటుంది. దీంతో దాన్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రతిపాదించనున్నారు. ⇒ ప్రస్తుతం ఆర్టీసీలో గ్రేడ్ పే విధానం ఉంది. జీతానికి అదనంగా వారి పోస్టు స్థాయిని బట్టి ఈ మొత్తం జోడిస్తున్నారు. ఇది అసిస్టెంట్ డిపో మేనేజర్ స్థాయి నుంచి మొదలవుతుంది. ప్రభుత్వంలో గ్రేడ్ పే విధానం లేనందున దీన్ని తొలగిస్తారు. -
ఎకరా కనిష్టంగా రూ.6 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు భూముల ప్రభుత్వ విలువల సవరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో సవరించిన భూముల విలువలను అమల్లోకి తేవాలని ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తాజా ఆదేశాల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈసారి భూముల విలువల సవరణను సానుకూలతను బట్టి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో విలువల సవరణకు ఉన్న డిమాండ్ ఆధారంగా కొత్త విలువలను నిర్ధారించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి యంత్రాంగానికి సూచనలిచ్చింది. ఈమేరకు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని థర్డ్ పార్టీ రూపొందించిన అంచనాలతో పోలుస్తున్న ఉన్నతాధికారులు సవరించిన విలువల నిర్ధారణలో తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఉదారంగా... ఉన్నఫళంగా కాకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న చర్చ ప్రకారం ఈసారి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను ఉదారంగానే పెంచనున్నట్టు తెలుస్తోంది. మైదాన ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యవసాయ భూమి ఎకరం కనిష్ట విలువ రూ.3 లక్షలుండగా, దాన్ని 100 శాతం పెంచి రూ.6 లక్షలుగా నిర్ధారించనున్నారు. వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువల పెంపు విషయంలో బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్లను పరిగణనలోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న భూమి రేటులో 50–60 శాతంగా విలువను సవరించాలని నిర్ణయించారు. అయితే, బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి విలువ రూ.20 లక్షలుంటే అందులో 50–60 శాతం అంటే ప్రభుత్వ విలువను కనీసం రూ.10–12 లక్షల వరకు నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ, ఉదారంగా పెంచాల్సిన పరిస్థితుల్లోనూ ఉన్నఫళంగా ఎక్కువ పెంచకుండా, ప్రస్తుతం ఉన్న విలువలకు గరిష్టంగా 100 శాతం మించకుండా సవరించిన విలువలు నిర్ధారించనున్నారు. అంటే బహిరంగ మార్కెట్లో రూ.20 లక్షలున్న ఎకరం భూమి ప్రభుత్వ విలువను గరిష్టంగా ప్రస్తుతమున్న విలువ కంటే 100 శాతం అదనంగా నిర్ధారించనున్నారు. బహిరంగ మార్కెట్లో 50–60 శాతం, ప్రస్తుత విలువ కంటే 100 శాతంలో ఏది తక్కువ ఉంటే దాన్ని నిర్ధారించనున్నారు. కొన్నిచోట్ల 100 శాతం కంటే అనివార్యంగా పెంచాల్సి ఉంటే అందుకు గల కారణాలను ప్రత్యేకంగా ప్రస్తావించి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఓపెన్ ప్లాట్ల విలువలు కూడా భారీగానే సవరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చదరపు గజానికి ఉన్న విలువలో 30–50 శాతం వరకు విలువలు సవరించనున్నారు. 39 చోట్ల భారీగానే.. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల విలువలనూ భారీగానే పెంచనున్నారు. ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఎక్కువగా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో అవకాశాన్ని బట్టి కొత్త విలువలను నిర్ధారించనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో సహా రాష్ట్రంలో ప్రస్తుతం అపార్ట్మెంట్ విలువ చదరపు అడుగు రూ.1,300 ఉండగా, దాన్ని రూ.1,600కు పెంచనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో రూ.2 వేల నుంచి రూ.9,800 వరకు అడుగు విలువ ఉండగా, దాన్ని కనీసం రూ.3వేల నుంచి రూ.12వేల వరకు పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏటా రూ. 3వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా ఈసారి రాష్ట్రంలో భూముల ప్రభుత్వ విలువలను సవరించనున్నట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి వారంలో సాధ్యమేనా? రాష్ట్రంలో సవరించిన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలను మే నెల మొదటి వారం నుంచి అమల్లోకి తేవాలని కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన ఆదేశాల అమలు సాధ్యమవుతుందా అనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి, సవరించిన తుది విలువల నిర్ధారణ జరిగిన తర్వాత మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లాల్లో ఏర్పాటు చేసిన కమిటీల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు సబ్‌కమిటీ ఇచ్చిన ఆదేశాలు రెవెన్యూ మంత్రి దృష్టిలో ఉన్నాయా, లేదా అన్న సందేహాలు కూడా ఆ శాఖలో వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖ కమిషనర్ ఎన్నికల విధుల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో ఉండగా, ఆయన మే 5న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భూముల ప్రభుత్వ విలువల సవరణపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకున్నా, ఆమలుకు మాత్రం మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. -
RTC విలీనానికి ఓకే.. 11% పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్
-
ప్రభుత్వంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం. నేటి ఉదయం నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
-
ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. శనివారం ఉదయం షిఫ్ట్ నుంచే బస్సులు నెమ్మదిగా రోడ్డెక్కడం ప్రారంభించాయి. ఆర్టీసీ జేఏసీ సంఘాలతో నిన్న రాత్రి దాకా మంత్రుల సబ్ కమిటీ భేటీ జరిపింది. కీలకమైన మూడు డిమాండ్లు సహా అన్నింటికీ ప్రభుత్వం అంగీకరించింది. ఆ చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు.తొలుత 32 డిమాండ్లపై ఆర్టీసీ సంఘాల నేతలు సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అనంతరం మంత్రుల సబ్ కమిటీతో భేటీ అయ్యి చర్చించారు. కొన్నింటిపై సులువుగానే సమ్మతి రాగా, ప్రధాన డిమాండ్లపై మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021, 2025 వేతన సవరణలు, ఆర్టీసీలో కార్మీక సంఘాల పునరుద్ధరణ.. ఈ మూడు డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఏకంగా 13 గంటలపాటు చర్చలు జరిగాయి. కొద్దిసేపు మంత్రులు, కార్మిక సంఘాల నేతలు విడివిడిగా వాళ్లలో వాళ్లే చర్చించుకున్నారు. ప్రధాన డిమాండ్లపై సయోధ్య కుదరకపోవటం, వేతన సవరణ ఫిట్మెంట్ శాతం మీద ఏకాభిప్రాయం రాకపోవటంతో చర్చల్లో అర్ధరాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడొంతులు పూర్తయిన... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించారు. 2021 వేతన సవరణకు సంబంధించి ఏడు శాతంతో మొదలై చివరకు 10 శాతం మేరకు మంత్రులు ప్రతిపాదించిన ఫిట్‌మెంట్‌కు కార్మీక సంఘాల నేతలు సమ్మతించారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. మిగతా డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారని మంత్రులు పేర్కొనటంతో కార్మిక సంఘాల సమ్మె విరమణకు అంగీకరించాయి. చివరకు రాత్రి 12.30కు సయోధ్య కుదరటంతో సమ్మె విరమణ ప్రకటన చేశారు. దీంతో మూడు రోజులపాటు బస్సుల్లేక అవస్థలు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఊరట లభించినట్లైంది. -
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య కాదు.. రాష్ట్ర ప్రభుత్వ హత్య
-
ముగిసిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ అంతిమయాత్ర
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మెను మరో రూపంలో ముందుకు తీసుకెళ్లాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తున్నట్లు సమాచారం. -
కలకలం.. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్రమత్తమైన తోటి కార్మికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని సమాచారం. -
కేసీఆర్, హరీశ్‌పై చర్యలొద్దు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. కమిషన్ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ఆక్షేపించింది. నిరర్ధకమైన ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలొద్దని స్పష్టం చేసింది. కమిషన్ విచారణలో నిర్ధారిత విధానాలు, నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్‌కు భారీ ఊరట లభించినట్టయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ పూర్తి చేసిన కమిషన్ గతేడాది జూన్ 31న నివేదిక సమర్పించింది. అయితే జస్టిస్ ఘోష్ నివేదిక మేరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు నెలల పాటు అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీ¯న్ ధర్మాసనం మార్చి 12న తీర్పు రిజర్వు చేసింది. బుధవారం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు ప్రస్తావిస్తూ తీర్పు వెలువరించింది. 1952 చట్ట ప్రకారమే..: ప్రభుత్వం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తున్నారు కానీ 1952 చట్ట ప్రకారమే దానిని ఏర్పాటు చేశాం. ఇందులో ‘న్యాయ విచారణ’ అనే పదాన్ని వాడటంలో ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ లేదు. కమిషన్ విధులను కూడా ఆ చట్టం పరిధిలోనే నిర్వర్తించింది. కమిషన్ సమర్పించే నివేదికకు చట్టబద్ధత ఉండదు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టవద్దని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీనికి అత్యంత ప్రజా ప్రాముఖ్యత ఉంది. విచారణ అత్యవసరం. విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉంది.. 1952 నాటి చట్టం కింద ఒక స్వతంత్ర విచారణ కమిషన్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో జరిగిన లోపాలు, విధి నిర్వహణలో పొరపాట్లు, నిర్లక్ష్యం, అవకతవకలపై విచారణ జరిపే హక్కు ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. కమిషన్ ఏర్పాటు చట్ట ఉల్లంఘన కాదు.. చట్టంలోని సెక్షన్ 3 (4) ప్రకారం.. కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఆరు నెలల్లోపు, ఆ నివేదికను, దానిపై తీసుకున్న చర్యల వివరణాత్మక పత్రాన్ని శాసనసభ ముందు ఉంచాలి. టీటీ ఆంటోనీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలు ఏవీ ఈ కమిషన్ నివేదికకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. చట్టానికి అనుగుణంగా తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానాలు తమ సొంత నిర్ణయాలను తీసుకోవాలి. కమిషన్ ఏర్పాటు 1952 నాటి చట్ట పరిధిని అతిక్రమించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడం కాదు. నిర్లక్ష్యమే కారణమన్న ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటు పరిశీలనకు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఏర్పాటయ్యింది. బరాజ్ ప్రణాళిక, రూపకల్పన, నాణ్యతా నియంత్రణ, నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలతో పిల్లర్లు కుంగిపోయాయని అథారిటీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాన్ని నిండుగా ఉంచవద్దని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కింద మేడిగడ్డకు ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఒకే రకమైన రూపకల్పన, పద్ధతుల్లో నిర్మించారని, అవి కూడా వైఫల్యాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. డ్యామ్ నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని తెలిపింది. కార్య నిర్వాహకుల పక్షాన కొన్ని లోపాలు, తప్పులు జరిగినట్లు ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసింది..’ అని వివరించారు. కమిషన్ తీరు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధం: పిటిషనర్లు కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ‘1952 నాటి చట్టంలోని సెక్షన్లు 8బీ, 8సీ కింద కల్పించిన చట్టబద్ధమైన రక్షణలను పాటించకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ అంశాలున్నాయి. ఏకపక్షంగా, ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతో ప్రేరేపించినట్లు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం పిటిషనర్లు తమ వాదనలు సమర్థించుకునేందుకుు, కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వీలుగా ఎటువంటి సమన్లు లేదా నోటీసులు జారీ చేయలేదు. అలాగే పిటిషనర్లకు వ్యతిరేకంగా పేర్కొన్న అంశాలకు ఆధారమైన ఎటువంటి పత్రాలు వారికి అందించలేదు..’ అని వారు కోర్టుకు తెలిపారు. వాదనలకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి: హైకోర్టు ‘ఒక వ్యక్తిపై ప్రతికూల వ్యాఖ్యలు చేసే ముందు వారి వాదనలకు అవకాశం ఇవ్వడం కమిషన్‌కు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహజ న్యాయ సూత్రాలను పాటించడంలో విఫలమైతే, ఆ చర్యతో పాటు దాని పర్యవసానాలు కూడా చెల్లవు. సాక్ష్యాల సమర్పణకు అవకాశం ఇవ్వాలి.. సెక్షన్ 8బీ కమిషన్‌పై ఒక బాధ్యతను విధిస్తుంది. ఏదైనా వ్యక్తి ప్రవర్తనపై విచారణ జరపడం అవసరమని కమిషన్ భావించినా, లేదా ఆ విచారణతో వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడినా. సదరు వ్యక్తికి విచారణ సందర్భంగా తన వాదన వినిపించుకోవడానికి, సాక్ష్యాలను సమర్పించడానికి ఒక సహేతుకమైన అవకాశాన్ని కల్పించాలి. వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతికూల నివేదిక అయినా ఇచ్చే ముందే, విచారణ ప్రక్రియలో న్యాయబద్ధత పాటించబడేలా చూసేందుకు ఉద్దేశించిన ’ఆడి ఆల్టెరమ్ పార్టెమ్’ సూత్రంలో ఇదొక ముఖ్యమైన భాగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక పౌరుని జీవించే హక్కులో ఒక అంశమైన పరువు హక్కు.. ఒక అధికారి నిర్ణయంతో ప్రభావితమయ్యే అవకాశం ఉండి, దానికి సివిల్ పర్యవసానాలు కూడా ఉండవచ్చు అనుకుంటే, అటువంటి వ్యక్తికి 1952 చట్టంలోని సెక్షన్ 8బి కింద తప్పనిసరిగా నోటీసు పొందే హక్కు ఉంటుంది. సాక్ష్యాలను సమన్లలో ప్రస్తావించలేదు.. కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు పిటిషనర్ల ప్రవర్తనపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇవి నిస్సందేహంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పిటిషనర్లకు వ్యతిరేకంగా నివేదికలో ప్రస్తావించడానికి కమిషన్ ముందున్న సాక్ష్యాలలో ఏ ఒక్కదానినీ వారికి ఇచ్చిన సమన్లలో ప్రస్తావించలేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కమిషన్ అనుసరించిన విధానం సహజ న్యాయ సూత్రాలకు, సెక్షన్లు 8బీ, 8సీలో పొందుపరిచిన చట్టపరమైన రక్షణలకు విరుద్ధంగా ఉంది. నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవు.. ప్రజా ఖజానా నుంచి గణనీయమైన వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో లోపాలు, నిర్లక్ష్యం, పొరపాట్లు, తప్పులను గుర్తించడమే కాకుండా, అలాంటి లోపాలను సరిదిద్దడానికి, అవి పునరావృతం కాకుండా నిరోధించడానికి వీలు కల్పించే వాస్తవ నిర్ధారణలను అందించడం కమిషన్ ఏర్పాటు ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇటువంటి వాస్తవ నిర్ధారణ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులకు శిక్షలు విధించడం, చర్యలు తీసుకోవడం సాధ్యం కాదు. సివిల్, క్రిమినల్ సాక్ష్యంగా నివేదికలు అంగీకరించబడవు. ఇదే సమయంలో కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు..’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు సాధారణ బదిలీల షెడ్యూల్, ఈ బదిలీల్లో పాటించాల్సిన విధివిధానాలను పేర్కొంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం జారీ చేసిన జీవో ఎంఎస్. నం: 38 ప్రకారం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31వరకు బదిలీలు నిర్వహించాలి. మూడేళ్ల పాటు ఒకేచోట (స్టేషన్) పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలి. భార్యాభర్తల విషయంలో ఈ నిబంధనకు సడలింపు ఉంటుంది. డిసెంబర్ 31, 2025 నాటికి ఒకే స్టేషన్లో నాలు గేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. అయితే 2027, మే 31 నాటికి ఉద్యోగ విరమణ చేసే వారిని నాలుగేళ్ల సర్వీసు పూర్తయినా బదిలీలు చేయవద్దని, సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా ఒకే కేడర్‌లో 40 శాతానికి మించకుండా బదిలీలు చేపట్టాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బదిలీలకు మార్గదర్శకాలు.. ⇒ తమ తమ శాఖల పరిధిలోని ప్రతి ఉద్యోగి ఎక్కడ, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడనే వివరాలను కేటగిరీ, కేడర్ వారీగా ఆయా శాఖలు ప్రకటించాలి. ⇒ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవడానికంటే ముందే ఆయా శాఖల్లోని స్పష్టమైన ఖాళీలను వెల్లడించాలి. ⇒ ఖచ్చితంగా బదిలీ కావాల్సిన ఉద్యోగుల జాబితాను కూడా ముందే ప్రకటించాలి. ఒక్కో ఉద్యోగి నుంచి ఐదు ఆప్షన్లు తీసుకోవచ్చు. ఆప్షన్ల ప్రొఫార్మాను శాఖల వారీ అవసరాలను బట్టి మార్పులు చేసుకోవచ్చు. ⇒ బదిలీల ప్రక్రియ అనంతరం కష్టతరమైన ప్రాంతాల్లోనూ కనీస సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కష్టతరమైన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వకపోతే లాటరీ పద్ధతి ద్వారా ఆ ప్రాంతాలకు సిబ్బందిని కేటాయించాలి. ⇒ అన్ని బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా పారదర్శక విధానంలో జరగాలి. ఆన్లైన్లో కూడా కౌన్సెలింగ్ చేయొచ్చు. అన్ని దశల వివరాలను ఆన్‌లైన్‌తో పాటు ఆఫీసు నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచాలి. ముఖ్య నిబంధనలివి.. ⇒ రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించాలి. ⇒ రెండో స్థాయి నుంచి అత్యున్నత స్థాయిల్లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారుల విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న సొంత జిల్లా నిబంధనను తప్పనిసరిగా పాటించాలి. ⇒ జనగణన సంబంధిత ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఉద్యోగులకు నిబంధనలు వర్తించవు. ⇒ జూన్, 1, 2026 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. ⇒ పోలీసుల బదిలీల కోసం ఆ శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలు తయారు చేసుకోవాలి. ⇒ ఆదాయార్జిత శాఖలు (పన్నుల శాఖ, ఎక్సైజ్, స్టాంపులు–రిజి్రస్టేషన్లు, రవాణా, అటవీ శాఖలు) ఇప్పటికే తమ తమ శాఖల పరిధిలో అమలవుతోన్న నిబంధనల ఆధారంగా బదిలీలు చేపట్టాలి. అవసరమైన చోట మార్పులు చేసుకోవచ్చు. ⇒ టీచర్లు, లెక్చరర్ల బదిలీల కోసం విద్యా శాఖ ప్రత్యేక సవివర మార్గదర్శకాలను రూపొందించుకోవాలి. ⇒ ఉద్యోగ సంఘాల నేతల బదిలీల విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ⇒ ఫోకల్ నుంచి నాన్ ఫోకల్‌కు, నాన్‌ఫోకల్ నుంచి ఫోకల్ స్టేషన్లకు బదిలీలు జరగాలి. ఫోకల్, నాన్ ఫోకల్ స్టేషన్లను సంబంధిత శాఖ గుర్తిస్తుంది. ⇒ ఒకే స్టేషన్‌ను ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఎంచుకున్న పక్షంలో శాఖా పరమైన, న్యాయపరమైన అభియోగాలు లేని భార్యాభర్తలు (ఇద్దరిలో ఒకరికి మాత్రమే వర్తింపు), వచ్చే ఏడాది మే 31నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులు, 70 శాతం అంగవైకల్యం ఉన్నవారు, మానసిక వైక్యలమున్న పిల్లలున్నవారు, వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్ ఉన్నవారు, కష్టమైతరమైన ప్రాంతాల్లో ఎక్కువ సర్వీసు చేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలి. (ఈ ఉత్తర్వులు జారీ అయిన మూడోరోజు నుంచి సదరు ఉద్యోగి ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి రిలీవ్ అయినట్టుగా పరిగణిస్తారు.) రెండేళ్లు పూర్తయిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి: జేఏసీ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడం వల్ల కొంత ఊరట లభించిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ తెలిపారు. అయితే ప్రస్తుత మార్గదర్శకాలలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. మూడు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులకే బదిలీలకు అవకాశం కల్పించారని, దీనిని రెండేళ్లకు కుదించాలని కోరారు. దీనివల్ల మరింత మంది ఉద్యోగుల బదిలీలకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియను కనీసం రెండు నెలల పాటు పొడిగించాలని సూచించారు. అర్హత కలిగిన అందరికీ బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో జరిగిన చర్చ లు విఫలం కావటంతో ఆర్టీసీ కారి్మక సంఘాలు సమ్మె ప్రారంభించాయి. బుధవారం తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి బస్సులను స్తంభింపజేయాలని నిర్ణయించాయి. మరోవైపు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు ప్రారంభించింది. రవాణా శాఖ సహాయంతో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్రత్యామ్నాయ చర్యలు పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చేందుకు సమయం కావాల్సి ఉన్నందున, సమ్మె తొలిరోజైన బుధవారం ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. నాలుగు వారాల గడువుకు ససేమిరా... బుధవారం తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి సమ్మెకు వెళ్తున్నామని ఆరీ్టసీలో ఓ జేఏసీ వారం క్రితమే ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం చర్చలకు సిద్ధం కాలేదు. మంగళవారం సాయంత్రం హడావుడిగా నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కారి్మక సంఘాలతో చర్చించాలని ఆదేశించింది. రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కూడిన కమిటీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సచివాలయంలో కారి్మక సంఘాలతో చర్చలు ప్రారంభించింది. సంఘాల వారీగా దాదాపు మూడు గంటలపాటు వారి డిమాండ్లపై అభిప్రాయాలు సేకరించిన అనంతరం, వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి కొంత సమయం కావాలని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇందుకు నాలుగు వారాల సమయం అవసరమవుతుందని, గడువు నాటికి ప్రభుత్వం నుంచి స్పందన ఉంటుందన్నారు. దీనికి కార్మిక సంఘాలు అంగీకరించలేదు. సమ్మె నోటీసు ఇచి్చన థామస్‌రెడ్డి, ఈదురు వెంకన్నతో కూడిన జేఏసీ ప్రతినిధులు వెంటనే సమావేశ మందిరం నుంచి వెలుపలికి వచ్చి, చర్చలు విఫలమయ్యాయని, యథావిధిగా సమ్మె ప్రారంభమవుతుందని ప్రకటించారు. అశ్వత్థామరెడ్డి, నరేందర్‌తో కూడిన రెండో జేఏసీ నేతలు కాసేపు అంతర్గతంగా చర్చించుకుని, చివరకు తాము కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. రెండు జేఏసీల్లో లేని మిగతా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో అన్ని సంఘాలు బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మె ప్రాంభిస్తున్నట్టు రాత్రి పదింటికి ప్రకటించాయి. ప్రభుత్వమే సమ్మెకు వెళ్లేలా చేసింది: థామస్‌రెడ్డి, ఈదురు వెంకన్న ‘సమ్మె డిమాండ్లలో ఉంచిన 32 అంశాలు చాలాకాలంగా కొనసాగుతూ వస్తున్నవే. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందింస్తుందని చెప్పటంతో వేచి చూశాం. కానీ, ఆయన కూడా స్పష్టమైన హామీకి ముందుకు రాకపోవటంతో విధిలేని పరిస్థితిలో సమ్మెకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం కూడా స్పందించలేదు. సమ్మెకు కొన్ని గంటల ముందు ఆదరాబాదరాగా అధికారుల కమిటీ వేసి ప్రభుత్వం కాలయాపన ప్రయత్నం చేసింది. మా డిమాండ్లపై ఎలాంటి హామీ ఇవ్వకుండా నాలుగు వారాల గడువు కావాలని కోరటం దారుణం. సమ్మె చేస్తే చేస్కోండి అన్న తరహాలో సంస్థ వ్యవహరిస్తోంది. మేం చాలా సమయం ఇచ్చినా స్పందించకుండా ప్రభుత్వమే తమను సమ్మెకు వెళ్లేలా చేసింది. కారి్మకులంతా సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఎంత బెదిరింపులకు దిగినా సమ్మె ఆగదు, కొనసాగుతుంది. ‘ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి కొన్ని ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తే మేం పునరాలోచిస్తాం’ అని రెండో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, నరేందర్ తదితరులు తెలిపారు. వేగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు... డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె విషయంలో గట్టిగా ఉన్నప్పటికీ, మెకానిక్ సిబ్బంది కొంత ఊగిసలాటలో ఉన్నారు. దీంతో శ్రామిక్‌లు, మెకానిక్‌లలో ఎక్కువ మంది విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల నుంచి ఎనిమిది వేల మందిని తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు ఆర్టీసీ సమకూర్చుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,100 అద్దె బస్సులు యథావిధిగా తిరగనున్నాయి. మరో 500 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కుతాయి. తాత్కాలిక సిబ్బంది సహకారంతో మరో 2 వేల బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెరసి సగానికిపైగా బస్సులను తిప్పటం ద్వారా ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో 35 లక్షల మంది ప్రయాణించగా, ఈ పథకం ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 60 లక్షలను మించింది. ఇందులో 43 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. గతంలో సమ్మె జరిగినప్పుడు ఆ 35 లక్షల మందికే ఇబ్బంది కలగగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు కానుంది. మళ్లీ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరగనుంది. దీంతో వాటి చార్జీ కూడా పెరగనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడ్డుకునేందుకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ప్రయత్నిస్తున్నారు. -
బడ్జెట్ లెక్క... ఏంటీ తికమక?
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరానికి (2025–26)గాను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన బడ్జెట్ అంచనాలు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కలకు పొంతన కుదరలేదు. రాష్ట్ర ప్రభుత్వ రాబడులతోపాటు ఖర్చులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తదితర అంశాల్లో ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వం చూపిన అంకెలు, కాగ్ నివేదికలో పేర్కొన్న మొత్తాలను పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అయితే అంతర్గత సర్దుబా ట్లు, లెక్కలు తయారు చేసినప్పుడు సమయాభావం తదితర కారణాల వల్ల ఈ వ్యత్యాసం సహజమేనని అంటున్న ఆర్థిక నిపుణులు.. అసహజ వ్య త్యాసం ఉండటం మాత్రం అరుదైన విషయమని అంటున్నారు. దీనికి ఆర్థిక శాఖ అధికారులే సమాధానం చెప్పాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఆదాయం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వరకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సవరించిన బడ్జెట్ అంచనాలు, కాగ్ నివేదికలకు మధ్య అనేక అంశాల్లో వ్యత్యాసం కనిపించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి పన్ను రాబడుల కింద రూ. 1.34 లక్షల కోట్లుకుపైగా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే ఫిబ్రవరి మాసాంతానికే పన్ను రాబడులు రూ. 1.39 లక్షల కోట్ల మేరకు వచ్చినట్లు ‘కాగ్’నివేదికలో పేర్కొంది. అంటే ఒక నెల మిగిలి ఉండగానే రూ. 5 వేల కోట్లు ఎక్కువగా పన్ను రాబడులు వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఇక మార్చిలో పన్ను ఆదాయం మరో రూ. 12 వేల కోట్లకుపైగా వస్తుందని అంచనా వేస్తే ప్రభుత్వ లెక్కలకు, కాగ్ అంకెలకు మధ్య పన్ను రాబడుల విషయంలో సుమారు రూ. 17 వేల కోట్ల మేర వ్యత్యాసం వస్తోంది. అప్పుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2025–26 సవరించిన అంచనాల ప్రకారం ఏడాది మొత్తం మీద రూ. 77,545.92 కోట్ల మేర అప్పులు తీసుకున్నట్లు ప్రభుత్వం చూపింది. కానీ ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికే రూ. 77,111 కోట్ల మేర ప్రభుత్వం రుణాలు సమీకరించినట్లు వెల్లడించింది. అయితే మార్చిలో తీసుకొనే అప్పుల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటే ఆ మేరకు అప్పులు తగ్గే అవకాశముంది కానీ.. ఏ మేరకు చెల్లింపులు జరిగి ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘కాగ్’లెక్కల్లో వచ్చిన తేడా మేరకు కనీసం రూ. 6 వేల కోట్లయినా అప్పుల కంటే చెల్లింపులు ఒక్క నెలలోనే చేయడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏడాది మొత్తం మీద రూ. 29,471 కోట్లు వచ్చాయని ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో పేర్కొంటే ‘కాగ్’లెక్కల్లో మాత్రం ఫిబ్రవరి నాటికి రూ. 18,788 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అంటే మార్చి నెలలోనే సుమారు రూ. 9 వేల కోట్లు కేంద్రం నుంచి ఉంటాయా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక గ్రాంట్–ఇన్–ఎయిడ్ విషయానికి వస్తే ఏడాది మొత్తంలో రూ. 11,161 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే ఫిబ్రవరి నాటికి రూ. 6,140 కోట్లు మాత్రమే వచ్చాయని ‘కాగ్’వెల్లడించింది. ఈ లెక్కన మార్చి నెలలో కేంద్రం నుంచి మరో రూ. 5 వేల కోట్లు రావాలన్నమాట. అయితే ప్రభుత్వ అంచనాలు, ‘కాగ్’లెక్కల్లో తేడాలు సహజమేనని.. లెక్కలు తీసుకొనే నాటికి అందుబాటులో కొన్ని వివరాలు లేకపోవచ్చని.. చెల్లింపులు, సర్దుబాట్ల కారణంగా కూడా కొంత తేడా వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ మేరకు తేడా రావడం మాత్రం పరిశీలించాల్సిన అంశమని అంటున్నారు. అంకెల గారడీ కోసం అంచనాలను రూపొందించకుండా వాస్తవిక దృక్పథంతో వెళ్తేనే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వారు సూచిస్తున్నారు. ఏమిటీ నివేదికలు? వాస్తవానికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలతోపాటు ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక రూపొందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ పంపే వివరాల ప్రకారమే ఈ నివేదికలు తయారవుతాయి. అలాగే ఏటా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అంతకుముందు ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలు, సవరించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఈ సవరించిన అంచనాలను ఏడాది మొత్తానికి (బడ్జెట్ పెట్టే మార్చి నెల రాబడులు, వ్యయాల అంచనాలను లెక్కగట్టి) ప్రతిపాదిస్తుంది. ఇదే తరహాలో గత నెల 20న 2025–26 సవరించిన అంచనాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 28 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను తెలియజేస్తూ శనివారం ‘కాగ్’వెబ్సైట్లో ఓ నివేదిక పెట్టింది. ఈ రెండింటి మధ్య రాబడులు, ఖర్చులు, కేంద్ర నిధుల విషయంలో తేడాలు ఉండటం గమనార్హం. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ(Dearness Allowance)ను 2.1 శాతం పెంచుతూ శుక్రవారం ప్రకటన చేసింది. పెరిగిన అలవెన్స్ ఈ ఏడాది జనవరి నుంచే వర్తించనున్నట్లు తెలిపింది.ఇంతకు ముందు 50.7% డీఏ ఉండగా.. తాజా పెంపుతో అది 52.8 శాతానికి చేరింది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా డీఏను ప్రభుత్వం చెల్లించనుంది. కిందటి ఏడాది జూలైలో కూడా డీఏను 2.1 శాతం పెంచిన సంగతి తెలిసిందే.డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ పనులు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రి అప్‌గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏను ప్రకటించడం సంతోషమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారాయన. -
రేపే.. ‘పైలట్’ అప్పు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు తీసుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా బాండ్లను తనఖా పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడో తేదీన బహిరంగ మార్కెట్లో రుణం తీసుకోనుంది. ఆర్బీఐ తొలిసారి ప్రవేశపెడుతోన్న బీఐఎస్ అనే పైలట్ పద్ధతిలో ఈ అప్పును తీసుకోనుండడం గమనార్హం. ఈనెల ఏడో తేదీన దేశంలోని 4 రాష్ట్రాలకు రూ. 15,500 కోట్లను ఆర్బీఐ రుణాల రూపంలో సమకూర్చనుంది. అందులో 16–20 సంవత్సరాల కాల పరిమితితో రూ.2 వేల కోట్లు, 25 కంటే ఎక్కువ సంవత్సరాల కాల పరిమితితో రూ.1,900 కోట్లు రుణం తీసుకునేందుకు తెలంగాణకు అనుమతి లభించింది. ఈ మేరకు తొలి మూడు నెలల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో ఇప్పించే రుణాల షెడ్యూల్‌ను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ ఏడో తేదీన రూ.3,900 కోట్లతోపాటు అదే నెల 21వ తేదీన మరో రూ.2 వేల కోట్లను రుణం తీసుకోవడం ద్వారా తొలి మాసంలోనే రూ.6 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకోనుంది. ఇక, మే, జూన్ నెలల్లో కూడా రెండు దఫాల్లో రూ.5,250 కోట్ల చొప్పున మొత్తం రూ.16,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాల కింద తీసుకోనుంది. తొమ్మిదింటిలో మనం కూడా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి ఆర్బీఐ పైలట్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రామాణాత్మక జారీ వ్యూహం (బీఐఎస్) పద్ధతిలో దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో రుణాలు ఇప్పించనుంది. ఇందులో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. బాండ్లను తనఖా పెట్టుకోవడం ద్వారా అప్పులిచ్చే పెట్టుబడిదారులకు ఈ తొమ్మిది రాష్ట్రాలపై మరింత నమ్మకం కలిగేలా ప్రణాళిక రూపొందించింది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, ఈ రుణాల చెల్లింపులకు నిర్ణీత గడువు (మెచ్యూరిటీ బకెట్)ను నిర్ధారించడం ద్వారా దీర్ఘకాలంలో రాష్ట్రాలకు భారంగా మారకుండా చూడడమే దీని ఉద్దేశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు పెట్టుబడిదారులకు వెంటనే రిటర్న్‌లు వచ్చే విధంగా ఆయా రాష్ట్రాలు చెల్లింపుల షెడ్యూల్‌ను ఈ పద్ధతిలో నిర్ణయించనున్నందున అప్పులిచ్చే వారికి కూడా వెసులుబాటు ఉండేలా ఆర్బీఐ ఈ పద్ధతిని ఎంచుకుందని అంటున్నారు. -
అప్పీల్‌కు అవకాశమేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది అవుతున్నా ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆ చట్టంలో పేర్కొన్న విధంగా అప్పీల్ వ్యవస్థ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే అవకాశమే లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. మొదటి అప్పిలేట్ అథారిటీ అయిన ఆర్డీవో నుంచి జిల్లా కలెక్టర్, తర్వాత సీసీఎల్ఏ వరకు అప్పీల్ చేసుకునే మాడ్యూల్ భూభారతి పోర్టల్‌లో పనిచేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పొరపాటునో, గ్రహపాటునో కింది స్థాయి అధికారులు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నా, తగిన డాక్యుమెంట్లు లభించక తిరస్కరణకు గురైన దరఖాస్తులకు మళ్లీ డాక్యుమెంట్లు సమర్పించి పరిష్కరించుకోవాలనుకున్నా అవకాశం ఉండడం లేదు. అప్పీల్ కోసం సంబంధిత కార్యాలయాల వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. ఆన్లైన్లో అవకాశమివ్వలేదని, తామేమీ చేయలేమని అధికారులు చెçపుతుండడంతో చేసేదేమీ లేక రైతులు వెనుదిరగాల్సి వస్తోంది. అయితే, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కనీసం ఆ మాడ్యూల్ వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భూభారతి పోర్టల్‌లో వచ్చే అన్ని సమస్యలకూ ఏకకాలంలో పరిష్కారం చూపే అవకాశం లేకపోయినా కనీసం అప్పీల్ చేసే అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతాంగం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాదాబైనామాలదీ ఇదే పరిస్థితి.. భూముల విషయంలో సాధారణంగా వచ్చే సమస్యలకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా అప్పీల్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ముఖ్యంగా సాదాబైనామాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, అమ్మినవారు కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనను తొలుత విధించడంతో చాలా దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యాయి. నోటీసుల గడువు ముగిసినా అఫిడవిట్ ఇచ్చేందుకు అమ్మినవారు ముందుకు రావడం లేదన్న కారణంతో చాలా దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం 9 లక్షలకు పైగా దరఖాస్తుల్లో దాదాపు 30 శాతం వరకు అనేక కారణాలతో తిరస్కరించగా, వాటిలో ఎక్కువగా అఫిడవిట్ విషయంలోనే తిరస్కారానికి గురయ్యాయి. ఇప్పుడు అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే తేల్చింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో గతంలో అమ్మిన వారు అఫిడవిట్ ఇవ్వలేదనే నిబంధనతో తిరస్కరించిన దరఖాస్తులపై కలెక్టర్లకు అప్పీల్ చేసుకునే వెసులుబాటును భూభారతి చట్టం కల్పిస్తోంది. కానీ, పోర్టల్‌లో మాత్రం అప్పీల్ మాడ్యూల్ పనిచేయకపోవడంతో దాదాపు 2 లక్షలకు పైగా దరఖాస్తుదారులు ఈ అప్పీల్ వ్యవస్థ కోసం నిరీక్షించాల్సి వస్తోందని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. అప్పీల్ వ్యవస్థను ఆన్లైన్లో ఏర్పాటు చేస్తేనే సాధారణ దరఖాస్తులతో పాటు సాదాబైనామాలకు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని వారంటున్నారు. -
మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) కీలక తీర్పునిచ్చింది. మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిన ఎన్జీటీ.. ప్రక్షాళనపై పటోళ్ల కార్తీక్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.గాంధీ సరోవర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ పేర్కొన్నగా.. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారన్నది ప్రభుత్వం వాదన. విచారణ జరిపిన ఎన్జీటీ.. పిటిషన్లో సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేసును ట్రిబ్యునల్ డిస్మిస్ చేయడంతో మూసీ ప్రక్షాళన పనులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ తీర్పుతో ప్రభుత్వానికి లీగల్ రిలీఫ్ లభించింది. -
అత్యవసర ఖర్చులకూ దిక్కులేదు
సాక్షి, హైదరాబాద్: ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగి అత్యవసర ఖర్చులకూ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి మొత్తం 123 రోజులపాటు చేబదులు (ఓవర్ డ్రాఫ్ట్) రుణాలను తీసుకుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ప్రతిరోజూ రాష్ట్ర ఖజానాలో కనీసం రూ.1.38 కోట్ల నిధుల నిల్వ ఉండాలని ఆర్బీఐ నిర్దేశించగా, 2024–25లో ఏకంగా 123 రోజులపాటు అంతకంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మొత్తం రూ.37,457 కోట్లను చేబదులుగా ఆర్బీఐ నుంచి తీసుకుంది. 2024–25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘అకౌంట్స్ ఎట్ ఎ గ్లాన్స్’ పేరుతో కాగ్ రూపొందించిన నివేదికను సోమవారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యవసర ఖర్చులకూ ఖజానాలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా చేబదులు తీసుకోవచ్చు. ఆదాయం సమకూరగానే ఆర్బీఐకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014–15లో 62 రోజులు మాత్రమే చేబదులు తీసుకోగా, 2022–23లో అత్యధికంగా 328 రోజులపాటు తీసుకున్నారు. 2024–25లో 123 రోజులకి చేబదులు రుణాలు తగ్గడం గమనార్హం. 363 రోజులూ రుణాలే... రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి 2024–25లో ఆర్బీఐ నుంచి ప్రభుత్వం 298 రోజులపాటు రూ.64,188 కోట్ల వేస్ అండ్ మీన్స్ రుణాలను తీసుకోగా, 363 రోజులపాటు రూ.27,730 కోట్ల ప్రత్యేక రుణాలను తీసుకుంది. ఈ తాత్కాలిక రుణాలను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉండగా, రూ.5842 కోట్లను గడువులోగా చెల్లించడంలో విఫలమైంది. రాష్ట్రం 2024–25లో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటు, రూ.48,922 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా, ఆదాయం (రుణాలు మినహాయించి), వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. రూ.46,370 కోట్ల అప్పులను సమీకరించడం ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం అధిగమించింది. ఆ సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.1,67,804 కోట్ల ఆదాయం రాగా, అందులో 45 శాతాన్ని జీతభత్యాల రూపంలో తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులకే ప్రభుత్వం వెచ్చించాల్సి వచ్చింది. జీతాలకు రూ.30,277 కోట్లు, వడ్డీల చెల్లింపులకు రూ.27,803 కోట్లు, పెన్షన్ల చెల్లింపులకు రూ.16,942 కోట్లను ఖర్చు చేసింది. ఏటేటా పెరుగుతున్న అప్పులు రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయి. 2020–21లో రూ.2,78,018 కోట్లు ఉన్న ప్రభుత్వ అప్పులు 2024–25 నాటికి రూ.4,47,493 కోట్లకు ఎగబాకాయి. ఇక ప్రభుత్వ పూచీకత్తు అప్పులు 2020–21లో రూ.1,05,007 కోట్లు ఉండగా, 2024–25 నాటికి రూ.2,41,528 కోట్లకు చేరాయి. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన అప్పుల మొత్తం సైతం రూ.3.83 లక్షల కోట్ల నుంచి రూ.6.89 లక్షల కోట్లకు పెరిగింది. -
భర్తీ చేస్తున్నా.. ఖాళీలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన వైద్య అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆ ప్రభావం ప్రజారోగ్యం, వైద్యవిద్యపై పడుతోంది. రాష్ట్రంలో పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ఏర్పాటైన ఆస్పత్రులకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకం జరుపుతూ వస్తోంది. రాష్ట్రంలోని వైద్య అవసరాలకు ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్, ప్రాథమిక ఆరోగ్యం (డీహెచ్), టీవీవీపీ, డీఎంఈల ద్వారా జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు, మాతా శిశు కేంద్రాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీ తదితర కేంద్రాల నిర్వహణ ఉంటుంది. ఈ నాలుగు శాఖల పరిధిలోని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలలో 51,455 వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పటికీ 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం శాసనమండలి వేదికగా వెల్లడించింది. వాటిలో 7,170 పోస్టుల నియామక ప్రక్రియ పురోగతిలో ఉండగా, మరో 6,759 పోస్టులు ఖాళీగా ఉంటాయని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం ఆమోదిత పోస్టుల్లో దాదాపు మూడో వంతు ఖాళీగా ఉండటం వల్ల ఆస్పత్రుల సేవలు, వైద్యవిద్య రెండూ తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులు, నర్సులు, ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే పలుమార్లు నోటిఫికేషన్లు జారీ చేసింది. తద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నియంత్రణలోని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మాతా శిశు కేంద్రాలలోని మొత్తం 2,651 ఖాళీలలో 145 మంది వైద్యులు, 351 మంది నర్సుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. త్వరలోనే ఈ ఖాళీలు నిండుతాయి. అయితే పారా మెడికల్ సిబ్బంది పోస్టుల్లో 2,651 ఖాళీలు ఉంటే వాటిలో 2,016 వరకు మాత్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 635 ఖాళీలు ఉండగా, వాటి నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద 7,769 పోస్టులకు గాను 1,367 ఖాళీలు ఉండగా, వాటిలో 31 మంది నర్సులు, 160 మంది పారా మెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ సాగుతోంది. ఇంకా 315 మంది వైద్యులు, 304 మంది నర్సులు, 557 మంది పారా మెడికల్ సిబ్బంది భర్తీ కావలసి ఉంది. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆస్పత్రులలో 9,554 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే... 3,706 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఇటీవలే 1,658 మంది వైద్యుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి కావచ్చింది. మరో 721 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 682 నర్సుల నియామక ప్రక్రియ సాగుతుండగా, 347 పోస్టులు భర్తీ కావలసి ఉంది. అలాగే పారామెడికల్ సిబ్బంది 298 ఖాళీలకు గాను 185 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డీఎంఈ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్‌లో ఏకంగా 20,585 పోస్టులకు గాను 6,205 ఖాళీలు ఉన్నాయి. అంటే సుమారు 40శాతం పోస్టులు ఖాళీగా ఉండడం వైద్య విద్య నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతోంది. అయితే డీఎంఈ పరిధిలో 607 మంది వైద్యులు, 1,545 మంది నర్సులు, 286 మంది పారా మెడికల్ సిబ్బందితో కూడిన 2,438 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్చలు చేపట్టగా, ఇంకా 3,767 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. అందులో అత్యధికంగా 2,179 వైద్య విద్య బోధించే వివిధ స్థాయిల ప్రొఫెసర్ పోస్టులు ఉండడం గమనార్హం. వైద్యుల పోస్టుల్లోనే భారీగా ఖాళీలు ఈ నాలుగు శాఖల్లో కలిపి 14,633 ఆమోదిత డాక్టర్/ ప్రొఫెసర్ పోస్టుల్లో ప్రస్తుతం 9,008 మాత్రమే భర్తీ కాగా, 5,625 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న నియామకాలు పూర్తైనా ఇంకా 3,200 పైగా పోస్టులు ఖాళీగా మిగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా టీచింగ్ హాస్పిటల్స్‌లో రెండు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉండడం తృతీయ స్థాయి వైద్యం, వైద్యుల శిక్షణపై ప్రభావం చూపుతోందని హెల్త్‌కేర్ రిఫారŠమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టీవీవీపీ పరిధిలోని జిల్లా ఆస్పత్రుల్లో అనేక చోట్ల సగానికన్నా తక్కువ సిబ్బందితోనే నడుస్తున్నాయి. దీని వల్ల గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో రోగులకు సమయానికి చికిత్స అందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డాక్టర్లు తయారవుతున్నా.... ఇంకో వైపు రాష్ట్రంలో పెరిగిన వైద్య కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో వైద్యులు వైద్యం కోసం సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఏటా సుమారు 9,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తున్నారు. 2,500 నుంచి 3,000 మంది పీజీ వైద్యులు సిద్ధమవుతున్నారు. అయితే నియామకాల్లో ఆలస్యం, అసంఘటిత విధానం కారణంగా వీరిలో చాలా మంది నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ఇది ఒక వైపు ఖాళీలు పెరగడం, మరోవైపు యువ వైద్యులకు అవకాశాలు లేకపోవడం అనే విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తోంది. -
ఉద్యోగుల జీతంలో కోత.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు తల్లిదండ్రులకు అందజేసే బిల్లును కేబినెట్ ఆమోదించింది.తెలంగాణ కేబినెట్ నిర్ణయంపై సీనియర్ ఐపీఎస్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికే స్ఫూర్తిదాయకమని, వృద్ధ తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే భరోసా అని ఎక్స్ వేదికగా కొనియాడారు.‘చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.‘దురదృష్టవశాత్తు ఆప్యాయతను పంచాల్సిన చేతులే ఈరోజు కన్నవారిని రోడ్డు పాలు చేస్తున్న సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు.వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే ఒక హెచ్చరిక. అమ్మనాన్నల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక భరోసా.ఈ బిల్లు మన దేశానికి స్పూర్తిదాయకం. యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి. కన్నవారే ప్రత్యక్ష దైవాలనే సత్యాన్ని విస్మరిస్తున్న నేటి తరానికి ఈ నిర్ణయం ఒక గొప్ప పాఠం. వృద్ధాప్యంలో వారు కోరుకునేది విలాసాలు కాదు, కేవలం తమ బిడ్డల ప్రేమని, తోడుని మాత్రమే. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ, వారి కళ్లలో ఆనందాన్ని నింపేలా ఈ సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులను గౌరవిద్దాం.. వారి ఆశీస్సులే శ్రీరామరక్ష!’ అని పేర్కొన్నారు. చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం… pic.twitter.com/jV2LQNRSnx— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 24, 2026 -
ఉద్యోగులకు కొత్త రూల్స్.. తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్!
-
తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త ఆదేశాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు చేస్తూ టీడీఆర్ (Transferable Development Rights) వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయి.తెలంగాణలో నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ - 2012'కు కీలక సవరణలు చేస్తూ G.O.Ms.No.95ను విడుదల చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ పేరుతో వెలువడిన ఈ జీవోలో టీడీఆర్ వినియోగం, హై-రైజ్ భవనాల గుర్తింపు, సెట్‌బ్యాక్ సడలింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.కొత్త ఆదేశాలు ఇలా.. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై-రైజ్‌గా గుర్తింపు( పారిశ్రామిక భవనాల్లో ఉండే చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ రూములు, వాటర్ ట్యాంకులు, ఇతర నిర్మాణ ఫీచర్లను ఈ ఎత్తు లెక్కలోకి తీసుకోరు).750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో TDR ద్వారా ఎత్తు పెంపు అనుమతి.నాన్ హై-రైజ్ భవనాలకు సెట్‌బ్యాక్ సడలింపు అవకాశం.హై-రైజ్ భవనాల్లో 10% వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి.మాస్టర్ ప్లాన్ రోడ్లు మారితే TDR లేదా ఛార్జీలు చెల్లించే ఎంపిక.2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అనుమతి.40 ఫీట్ల రోడ్డుపై 3 అంతస్తులు అదనంగా నిర్మాణం.60 ఫీట్ల రోడ్డుపై 4 అంతస్తులు అదనంగా అనుమతి80 ఫీట్ల రోడ్డుపై 5 అంతస్తులు వరకు అవకాశం.10 నుంచి 20 అంతస్తుల హై-రైజ్‌లో 3% TDR తప్పనిసరి20 అంతస్తులపై భవనాలకు 5% TDR తప్పనిసరిబిల్డింగ్ పర్మిషన్ సమయంలో 50% TDR సమర్పణOC (Occupancy Certificate) ముందు మిగతా 50% సమర్పణ తప్పనిసరి -
తెలంగాణ పోలీస్ బాస్ ఎవరంటే?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనుండటంతో, కొత్త డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. ఆ జాబితాలో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నట్లు సమాచారం. డీజీపీ ఎంపికలో సాధారణంగా అధికారుల అనుభవం, సేవా రికార్డు, రాష్ట్రానికి చేసిన కృషి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సీవీ ఆనంద్కి నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రభాకర్ ఆప్టే వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్య మిశ్రా కూడా తన సేవా కాలంలో అనేక ముఖ్యమైన పదవులను చేపట్టారు. ఈ ముగ్గురిలో ఎవరు కొత్తగా తెలంగాణ పోలీస్ వ్యవస్థకు నాయకత్వం వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.శివధర్ రెడ్డి పదవీ విరమణతో, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో కొత్త నాయకత్వం అవసరం ఏర్పడింది. కొత్త డీజీపీ నియామకం రాష్ట్రంలో చట్టం, శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఈ ముగ్గురు అధికారులలో ఎవరు డీజీపీ? అనేది త్వరలో స్పష్టత రానుంది. -
త్రిముఖ కోణం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి. ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమంతో పాటు విజన్–2034 (ఒక ట్రిలియన్ ఎకానమీ) లక్ష్య సాధన దిశగా 2026–27 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు సర్కారు తుదిరూపు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలను విశదీకరిస్తూ ఆయా ప్రణాళికల అమలుకు తగినట్టుగా అంచనాలను రూపొందించినట్లు సమాచారం. బడ్జెట్‌ను శుక్రవారం సభలో ప్రవేశపెట్టనుండగా.. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లాబీల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీగా కేటాయింపులు, కొత్త పథకాల ప్రకటన, తుది అంచనాల ఖరారుపై కసరత్తు జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలోని ఆయన చాంబర్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు, పథకాలు, కేటాయింపులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పలుసూచనలు చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకు 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఆర్థిక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. పాత వాటితో పాటు కొత్తగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా ఆరు పథకాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా కిట్స్ పేరుతో సంక్షేమ హాస్టళ్ల నుంచి ఇంటిగ్రేటెడ్ గురుకులాల వరకు అన్ని స్థాయిల్లో చదువుకునే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి అవసరమయ్యే అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందజేసే పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్ల పంపిణీ, పాడి రైతుకు సబ్సిడీపై పశువుల పంపిణీ ఆరు పథకాల్లో భాగంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద మహిళలు, రైతులు, యువత, చిన్నారుల సంక్షేమం, వైద్యరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారత ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. -
Updates : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్మూసి అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సంతృప్తికరంగా లేనందున BRS వాకౌట్మూసి- డీపీఆర్ లేదు అని ప్రకటన చేశారు -మంత్రి డీపీఆర్ రెడీగా ఉన్నదని ప్రకటించారు.మూసిపై డీపీఆర్ ఉంటే అసెంబ్లీలో టేబుల్ చేయాలి.ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?మూసి అభివృద్ధిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు - కేటీఆర్లక్షన్నర కోట్ల దోపిడీకి మేము దూరం - మూసి అభివృద్ధికి కాదు.మొక్కజొన్న రైతుకు మద్దతుగా హరీష్ 8 లక్షల ఎకరాల్లో మొక్కలు రైతులు పండించారు.మద్దతు ధర లేక రైతులు నష్ట పోతున్నారు వర్షాల కారణంగా రైతులు నష్ట పోతున్నారు 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందిపంటల బీమా అమలు చేయడం లేదు వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు..వెంటనే ఇవ్వాలి 2400 మద్దతు ధర..500 బోనస్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతమొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేపట్టిన నిరసనఅసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్ ఈ సమయంలో తోపులాట జరిగి మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్‌పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి మొక్క జొన్నకు 500 బోనస్ ప్రకటించాలి మొక్క జొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన -
ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై గంగా–జమునా తెహజీబ్ వర్ధిల్లుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే రాష్ట్ర అభివృద్ధికి అసలైన ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో మతపరమైన విభజనలకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ అశాంతి నెలకొన్నా, మన రాష్ట్రంలో మాత్రం మత సామరస్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మైనారిటీలకు పెద్దపీట మైనారిటీల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయంగా, పరిపాలనలో పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడిన మహమ్మద్ అజహరుద్దీన్‌ను మైనారిటీ శాఖ మంత్రిగా నియమించుకున్నామని, అదనంగా 8 మంది మైనారిటీ నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత షబ్బీర్ అలీ సేవలను గుర్తిస్తూ ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నామని తెలిపారు. ఆ 4 శాతం రిజర్వేషన్ల వల్లే వేలాది మంది ముస్లిం యువకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన క్రికెటర్ సిరాజ్, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌లను డీఎస్పీలుగా నియమించడమే కాకుండా, వారికి భారీగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచామని పేర్కొన్నారు. సేవా భావానికి ప్రతీక రంజాన్ రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదు.. అది క్రమశిక్షణ, ఆత్మశుద్ధి మానవతా విలువలను గుర్తు చేసే పవిత్ర మాసం అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక నెల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ, తోటి వారికి సహాయం చేయడమే ఈ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో మైనారిటీలకు సింహభాగం దక్కేలా చూస్తున్నామని, తెలంగాణ అభివద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని, మీ దువా (ప్రార్థనలు) రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజహరుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వేలాది మంది మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. -
పేదలకు శత్రువులం కాదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ పథకం అమలులో ఏవైనా లోపాలుంటే సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని, అసలు పథకమే వద్దంటే మాత్రం వినే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు శత్రువు కాదని, వారిని నిరాశ్రయులను చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలం ఉంటే.. అక్కడే ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి ఆస్తులూ గుంజుకునేందుకు కాదని అన్నారు. పేదలతో శత్రుత్వం పెంచుకుంటే మళ్లీ ఎవరైనా అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి అని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. దాదాపు 115 సంవత్సరాల కిందట అప్పటి నిజాం నవాబు ఎంతో దూరదృష్టితో చేసిన మంచి పనుల్లో కనీసం మనం పది శాతం కూడా చేయకుండా ఈ నగరాన్ని అలాగే వదిలేద్దామా? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ‘మూసీ ఇన్వైట్’పేరుతో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తర్వాత ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పర్యావరణవేత్తలు, మేధావులు, పలు సంస్థల కన్సల్టెంట్లను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటూ అసత్యాలు ‘ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేధావులు దానిని సమర్థించేలా మాట్లాడాలి. కొన్ని రాజకీయ పార్టీలు కడుపులో కుళ్లు, మాటల్లో విషం, చూపుల్లో పగతో వ్యవహరిస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపేలా వ్యవహరిస్తున్నాయి. అక్రమ సంపాదనతో ప్రతీనెలా రూ.5 కోట్లు వ్యయం చేస్తూ సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటున్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహానికి రూ.75 కోట్లు మాత్రమే.. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారు. నిజానికి గాంధీ విగ్రహానికి అయ్యే వ్యయం రూ.75 కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టు మొత్తం 55 కిలోమీటర్లు కాగా.. తొలిదశలో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధికి అయ్యే వ్యయం కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే. మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపై లేదా? మన చరిత్రను తిరిగి రాసుకునే అవకాశాన్ని మనం వదులుకుందామా? దేవతలు యజ్ఞాలు చేసినపుడు రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. సుబాహు, మారీచుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం ఆగిందా? లోకకళ్యాణం కోసం చేసే పనులకు సహకరించక పోయినా పరవాలేదు. కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. నది చుట్టూనే నాగరికత అభివృద్ధి: ‘మానవ నాగరికత నది చుట్టూనే అభివృద్ధి చెందింది. 1908 మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తిన తర్వాత.. నగరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పటి నిజాం ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను నిర్మించారు. ప్రస్తుతం వందేళ్లు దాటినా ఆ రిజర్వాయర్లు నగర ప్రజలతో పాటు, వలసలు వచ్చిన లక్షలాది మంది దాహార్తి తీరుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎకనామిక్ జోన్‌గా తీర్చిదిద్దారు. పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదుం. అలాంటి నగరాన్ని కాపాడుకోవడం మనకర్తవ్యం. 1994 నుంచి ఇప్పటివరకు పరిపాలనలో విధా న నిర్ణయాల్లో వెనుకబడటం ఎప్పుడూ లేదు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు? వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? మూసీ పునరుజ్జీవం జరిగితే కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి మంచి పేరు వస్తుందని, ఇక వాళ్లకు అధికారం కలగా మిగిలిపోతుందనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేసిన వారే చరిత్రలో గుర్తుంటారు..’అని అన్నారు. సంగమంలో మహాత్ముడి అస్తికలు..: ‘మూసా, ఈసా నదుల సంగమం వద్ద ఆనాడు మహాత్మాగాంధీ అస్థికలు కలిపారు. అంతటి చరిత్ర బాపూఘాట్‌కు ఉంది. కానీ బాపూఘాట్‌ను ఎవరైనా సందర్శిస్తున్నారా? ఎందుకది మరుగున పడిపోయింది? ప్రస్తుతం ఈ నదులు పూర్తిగా కాలుష్యంతో విషతుల్యంగా మారాయి. ఈ నీరుతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. విషతుల్యమైన నీరు కారణంగా మహిళలు గర్భవతులు కూడా కావడం లేదు. ఇది కేవలం మూసీ పునరుజ్జీవనం మాత్రమే కాదు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడం. అందులో భాగంగానే నల్ల చెరువు, బతుకమ్మ కుంట బమృక్ ఉద్దౌలా వంటి చెరువులను పునరుద్ధరించాం. అడ్డుకుంటున్న వాళ్లు అక్కడ ఉండగలరా? ఇవాళ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్నవారు మూసీ పరీవాహకంలో నివసించగలరా? వాళ్లు ఉంటానంటే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హౌస్ ఇస్తా. మూడు నెలలు అక్కడ ఉండగలరా? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించొద్దా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొద్దా? పర్యాటక అభివృద్ధి జరగొద్దా? నైట్ ఎకానమీ అభివృద్ధి చెందొద్దా? అభివృద్ధిని అడ్డుకుని ఇంకా వెనక్కి రాతి యుగాల వైపు వెళ్ళిపోదామా? ఓఆర్ఆర్ నిర్మాణం జరిగినపుడు కూడా కొందరు భూములు కోల్పోయారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవనంతో రాష్ట్రం గ్రోత్ ఇంజన్‌గా మారుతుంది. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెప్పండి. దానిని అమలు చేద్దాం. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇరవయ్యేళ్లు ఇబ్బందుల్లేకుండా..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర భూములు, ఆస్తుల క్రయవిక్రయ లావాదేవీల కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేళ్ల కాలంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య (భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు) నాలుగు రెట్లు పెరిగిన నేపథ్యంలో వచ్చే 20 ఏళ్ల కాలానికి తగిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పోర్టల్‌ను నిర్వహిస్తున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతోనే మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించాలని సర్కారు భావిస్తోంది. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు వచ్చే బడ్జెట్లో కేటాయించనున్నారు. దాదాపు రూ.10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తుండగా, ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఏకీకృత పోర్టల్ తరహాలోనే..! ప్రస్తుతం రాష్ట్రంలో భూముల వివరాలు, సర్వే, రిజిస్ట్రేషన్ల వివరాలు వేర్వేరు డొమైన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మొత్తం డేటా, ఇతర సమాచారాలను సమీకృతం చేస్తూ ఏకీకృత పోర్టల్ తీసుకురావాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా ఏకీకృత పోర్టల్ తరహాలోనే స్టాంపుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రానున్న ఇరవై ఏళ్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు, రోజువారీ కార్యకలాపాలను నియంత్రించే సర్వర్లతో సహా ఇతర అంశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోర్టల్‌కు కొత్త సొబగులు అద్దనున్నారు. ఈ బాధ్యతలు తీసుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఎప్పటికప్పుడు ఇందుకు అవసరమైన సమాచారం తీసుకుంటూ, ఎన్ఐసీతో సమన్వయం చేసుకుంటూ 2047 వరకు ఉపయోగపడేలా సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరో ఆరు నెలల్లోపు ఈ ప్రకియ పూర్తవుతుందని, 20 ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహించే క్రయ విక్రయ లావాదేవీలకు ఎలాంటి అవాంతరాలు లేని కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. -
గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది!
సాక్షి, హైదరాబాద్: అత్యంత భక్తి ప్రపత్తులతో ఆచరించే గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. ఆది పుష్కరాల తర్వాత నిర్వహించే అంత్య పుష్కరాలు 2028 జూలై 13 నుంచి 24 వరకు జరుగుతాయి. ఈ మేరకు పండితులు తేదీలు ఖరారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం పుష్కరాల నిర్వహణ ప్రణాళిక ఖరారుపై నిర్వహించిన సమావేశంలో ఈ తేదీలను అధికారికంగా ప్రకటించింది. కుంభమేళాకు చేసే ఏర్పాట్ల తరహాలోనే ఏర్పాట్లు ఉండాలని నిర్ణయించారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాల అనుభవాలను గమనంలో ఉంచుకొని ప్రణాళిక ఖరారు చేయాలని నిర్ణయించారు. వచ్చే పుష్కరాల్లో దాదాపు 8 కోట్ల మంది స్నానాలు ఆచరించే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఉప సంఘం సమవేశంలో అంచనా వేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిటీ ఆదేశించింది. భారీ సంఖ్యలో పుణ్యస్నానాలకు వస్తారని భావిస్తున్నందున, వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పుష్కర ఏర్పాట్లు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు 96 ప్రాంతాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో స్నాన ఘట్టాలు, సులభంగా చేరుకునేలా మెరుగైన రోడ్లు నిర్మించాలని ఆదేశించింది. వానాకాలంలో పనులకు ఇబ్బందులుంటాయని, ఈలోపే పనులు మొదలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఈ నెల చివరి నాటికి డీపీఆర్‌లను పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యమైన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని సూచించగా, రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన 9 ప్రాంతాలను తొలి విడత పనులకు అధికారులు ఎంపిక చేశారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తున్నట్టు కమిటీ పేర్కొంది. -
సీఎస్ పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా, మరో 3 నెలలు పొడిగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీఓపీటీ)కి ప్రభుత్వం లేఖ రాసింది. వాస్తవానికి కె.రామకృష్ణారావు గతేడాది ఆగస్టు 31న పదవీవిరమణ చేయాల్సి ఉండగా, ఆయ న పదవి కాలాన్ని ఏడు నెలలు పొడిగించడాని కి అప్పట్లో కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా రెండోసారి మరో 3 నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, కేంద్రం తీసుకోనున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కేంద్రం అనుమతిస్తే మరో 3 నెలల పాటు రామకృష్ణారావు సీఎస్‌గా కొనసాగుతారు. లేనిపక్షంలో సీనియారిటీ ప్రకారం ముందంజలో ఉన్న ఐఏఎస్ అధికారులు జయేశ్ రంజన్, వికాస్‌రాజ్‌లలో ఒకరిని కొత్త సీఎస్‌గా నియమించే అవకాశముంది. -
అతివలకే అందలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్‌హెచ్‌జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్‌తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్ టాలెంట్‌ను గ్లోబల్ టాలెంట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... ‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌కు అడ్డుపడుతున్నారు.. 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ నిర్మించిన వారు హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్‌ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్ జోన్ ఉంది. అందుకే ఆ అపార్ట్మెంట్ నివాసితులను పిలిచి మాట్లాడాం. వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్‌జోన్‌లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త ‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తాం’అని సీఎం వివరించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. -
గణపతీ.. లొంగిపోండి
సాక్షి, హైదరాబాద్: ‘గణపతి.. ఆయుధాలు అప్పగించి లొంగిపోండి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచించారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాం«దీజీ మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని.. ఎవరి ప్రాణానికీ నష్టం జరగొద్దన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని చెప్పారు. మావోయిస్టు పారీ్టలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోయారు. 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్‌కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలోనే భారీ లొంగుబాటు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఆయుధాలు విడిచి లొంగిపోయే మావోయిస్టుల రక్షణ, ఆరోగ్య భద్రత, ఇతర పునరావాసం విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులంతా బయటికి వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారన్నది సమాచారం తమ వద్ద లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కుటుంబ సభ్యలతో శాంతియుత జీవితం గడుపుతారా అనేది వారి ఇష్టమని సీఎం పేర్కొన్నారు. మంత్రి సీతక్క సహా ఎందరో మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్ పారీ్టలో చేరాలనుకుంటే గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. చర్చలే పరిష్కారం.. ‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. ప్రపంచానికి శాంతిమార్గాన్ని చూపారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. తెలంగాణ గడ్డపై హింస కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతియుత మార్గాన్నే అనుసరిస్తోంది. మావోయిస్టుల్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారికి సీఎంగా పిలుపునిస్తున్నా. అందరూ జనజీవన స్రవంతిలోకి రండి. తెలంగాణ ప్రభుత్వం మీతో చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లొంగిపోయేవారు ఆత్మగౌరవంతో బతికేలా సహకరిస్తాం.. ‘ఇటీవల లొంగిపోయిన దేవ్‌జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి సహా అందరూ నన్ను కలిసి ఎన్నో అంశాలపై మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులతోపాటు అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులతో చర్చించి సీపీఎం మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయిలోని అంశాలను పరిష్కరిస్తామని.. నక్సలిజం జాతీయ సమస్య కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని వారికి చెప్పాను. రివార్డుల మొత్తం పెంపు, ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయింపు, వైద్య సాయం కోసం లొంగిపోయిన మావోయిస్టులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సానుకూలంగా ఉన్నాం. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తాం. రివార్డుల మొత్తాన్ని పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం. పునరావాసం మెరుగ్గా అందించే అంశంపై సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో అధ్యయం చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం. చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. లొంగిపోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వారి సొంత గ్రామాల్లో స్థలాలు ఇస్తాం. భూములు అందుబాటులో లేనందున వ్యవసాయ భూమి కేటాయింపులో మాత్రం ఇప్పుడే మాట ఇవ్వలేను. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానం కొనసాగించేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.. ‘లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు కల్పన, నివాస స్థలం, ఇళ్ల కేటాయింపు అంశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మాజీ మావోయిస్టు నాయకుల ప్రతిపాదనలను ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ మేరకు ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత నుంచి 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 250కిపైగా ఆయుధాలు స్వాధీనం చేశారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు’అని రేవంత్ అన్నారు. -
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్ అవార్డుకు సహజనటుడు కమల్ హాసన్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్‌ఫ్రెండ్)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్ ఐ మ్యాక్స్ యజమాని రమేష్‌ప్రసాద్‌కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్‌లో ప్రదానం చేయనున్నారు. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. -
గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావు లతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. -
దేవాదుల 100 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 38 నుంచి 100 టీఎంసీలకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఈ మేరకు వచ్చిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. దేవాదుల సామర్థ్యం పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. తొలుత 50 టీఎంసీలు: గోదావరి ఎత్తిపోతలు పథకం పేరుతో 1995–2000 మధ్య దేవాదుల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. గోదావరి నుంచి జూన్–నవంబర్ మధ్యకాలంలో 150 రోజుల పాటు 50 టీఎంసీలు తరలించి 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలని అప్పట్లో యోచించారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం జరపడానికి 2001లో జీవో జారీ చేశారు. అయితే తొలి దశ కింద 5.18 టీఎంసీలు తరలించి 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2003లో, రెండో దశ కింద 7.25 టీఎంసీలను తరలించి 1.93 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2005లో, మూడో దశ కింద 25.75 టీఎంసీలను తరలించి 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2007లో పరిపాలనపరమైన అనుమతులు జారీ అయ్యాయి. మొత్తం మూడు దశల్లో 38.16 టీఎంసీలను తరలించి 5,56,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్ ప్రభుత్వం 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కింద ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 2005లోనే ప్రాజెక్టుకి పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. మూడు దశలు కలిపి మొత్తం రూ.6,016 కోట్ల వ్యయం అంచనాలతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతులు (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) 2007లో అనుమతులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2015లో దేవాదుల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 నుంచి 60 టీఎంసీలకు పొడిగించింది. కానీ సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 38.16 టీఎంసీలకే పరిమితమయ్యింది. మూడు దశల కింద హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం! ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2005–06లో రూ.6,016 కోట్లుగా ఉండగా.. 2016–17 నాటికి రూ.13,445 కోట్లకు చేరింది. తాజాగా రూ.18,400 కోట్లకు చేరింది. దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించాల్సి ఉంది. అంచనాల పెంపుతో పాటు, తాజాగా ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండు ప్రతిపాదనలపై తదుపరి కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణ! ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలకు పెంచితే ఏడాదిలో 300 రోజుల పాటు నీళ్లను తరలించి దేవాదుల ఆయకట్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణకు వీలుంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.14,359 కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. అయితే భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. మరో రూ.4 వేల కోట్లు అవసరం మొత్తం 34,089 ఎకరాలకు గాను 31,953 ఎకరాలు సేకరించారు. మరో 2,136 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు కింద దాదాపు 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 3.38 లక్షల ఎకరాలకే సాగునీరు అందిస్తున్నారు. మిగతా 2,136 ఎకరాలు సేకరిస్తే మిగిలిన 2.23 లక్షల ఎకరాలకు కూడా నీరందుతుంది. ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేస్తే భూసేకరణ పూర్తికానుంది. పెరిగిన అంచనాల ప్రకారం భూసేకరణతో సహా మిగులు పనుల పూర్తికి మరో రూ.4 వేల కోట్లు అవసరం కానున్నాయి. మొత్తం మీద వచ్చే 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి 2.23 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
కాళేశ్వరాన్ని వదిలేయం వాడుకలోకి తెస్తాం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం మహా అద్భుతం అన్నారని.. తాము వచ్చినప్పటి నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదని చెప్పారు. అయినా దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. ఒక్క కాళేశ్వరం పైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం మిగతా ప్రాజెక్టులను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న మాట వాస్తవమే అయినా, వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును అలాగే వదిలేయలేమని చెప్పారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా నిపుణుల కమిటీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వాడుకలోకి తెస్తామని ప్రకటించారు. ఆదివారం ఉమ్మడి వరంగల్‌లో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో కలిసి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఇంటెక్వెల్ వద్ద మోటార్లను సందర్శించిన ఆయన.. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివామని చెబుతున్న జ్ఞానవంతులు ఆనాడు 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రెండు మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. భూసేకరణే అసలు సమస్య... ప్రాజెక్టులు పూర్తి చేయడానికి భూసేకరణే అసలు సమస్యగా మారిందని, ఫలితంగా ప్రాజెక్టుల అంచనాలు కూడా పెరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లు పాలించిన వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేంది కాదన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని, దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం జూన్ 2లోపు రూ.600 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు 2001లో రూ.6,000 కోట్ల అంచనాతో ప్రారంభమై ప్రస్తుతం రూ.18,500 కోట్లకు పెరిగిందని, ఆ మేరకు బడ్జెట్‌లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మార్చిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో దేవాదులపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక నెలలోపు దేవాదుల పంపులను మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబుకు సహకరించలే.. తెలంగాణ నీటి హక్కులను కాపాడుతూ అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గత ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని చెప్పారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలు కాకుండా సూచనలు ఇస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. ‘అధికారం, పదవులు వారసత్వంగా రావు.. ప్రజలే నిర్ణయిస్తారు.. పదవులు ఎవరి సొత్తు కాదు.. ప్రజల ఆశీస్సులతోనే పదవులు వస్తాయి’అని రేవంత్‌రెడ్డి అన్నారు. 2034 వరకు మరో పదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వెన్నం సోదరులకు సీఎం పరామర్శ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం రాఘవేందర్‌రెడ్డి మృతిచెందగా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం వెన్నం సోదరులను పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రెడ్యాల గ్రామానికి చేరుకున్న రేవంత్‌రెడ్డి.. రాఘవేందర్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు రాష్ట్ర సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయకాంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మహానగరం.. 3 కార్పొరేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ముఖచిత్రం మారింది. ఇటీవలే 150 వార్డుల నుంచి 300 వార్డులకు విస్తరించిన జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీ క్యూర్) వరకు (ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం) విస్తరించి ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులతో ఉన్న జీహెచ్ఎంసీని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా విభజించింది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఏయే జోన్లు వస్తాయో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ చట్టం మేరకు ఏర్పాటుచేసిన ఈ కార్పొరేషన్లు వేటికవే ప్రత్యేక సంస్థ హోదాతో పనిచేస్తాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ జీవో (నంబర్ 55) విడుదల చేశారు. గెజిట్ నోటిఫికేషన్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు లక్ష్యంగా విభజన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. జయేశ్‌రంజన్‌కు పర్యవేక్షణ బాధ్యతలు ఈ మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు స్పెషలాఫీసర్‌గా జయేశ్‌రంజన్‌ను నియమించారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులో ఐదు కార్పొరేషన్లకు ఉమ్మడిగా ఒక చీఫ్ కమిషనర్ ఉండటం గమనార్హం. కాగా బుధవారం తెల్లవారేసరికే కార్పొరేషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకాల జీవోలు కనిపించడంతో 8 గంటలకు అటూఇటూగా సంబంధిత అధికారులు బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్‌రంజన్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తులో మేయర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. తార్నాకలో ఏర్పాటైన మల్కాజిగిరి కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, న్యాక్‌లోని సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో జి.సృజన కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. పరిధి మారడంతో ఆర్వీ కర్ణన్ సైతం మరోమారు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా తన చాంబర్లోనే బాధ్యతలు స్వీకరించారు. వీరితోపాటు ఆయా కార్యాలయాల్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులు బాధ్యతలు స్వీకరించగా, బదిలీ అయిన సిబ్బంది విధుల్లో చేరారు. కాగా సీఎస్ రామకృష్ణారావును ఆర్వీ కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు వెబ్సైట్లు..త్వరలో టీ క్యూర్ యాప్ మూడు కార్పొరేషన్లకు వేర్వేరుగా వెబ్సైట్లను సైతం రూపొందించారు. ప్రజా ఫిర్యాదుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న‘మై జీహెచ్ఎంసీ యాప్’స్థానే ‘టీ క్యూర్’యాప్ అందుబాటులోకి రానుంది. వికేంద్రీకరణతో ప్రజలకు మేలు అధికార వికేంద్రీకరణ, ప్రజలకు సత్వర సేవలు లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా తొలుత మండల వ్యవస్థ ప్రవేశపెట్టారు. అనంతర కాలంలో ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారు. చిన్న పంచాయతీలనూ ప్రజలు ఆమోదించారు. వికేంద్రీకరణ ప్రజలకు సౌలభ్యంగా, సౌకర్యంగా ఉంటుంది. – జయేష్‌రంజన్, స్పెషలాఫీసర్ మూడు కార్పొరేషన్లు ఇలా.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: ఐటీ కారిడార్‌ను కలుపుతూ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్: మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: జీహెచ్ఎంసీ పేరును కొనసాగిస్తూ ..సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో లేని మిగతా ఆరు జోన్లు (శంషాబాద్, రాజేంద్రనగర్, చారి్మనార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్). -
నేడే మున్సి‘పోల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరి«ధిలోని 8,191 పోలింగ్ కేంద్రాల్లో 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 2,981 వార్డులు, డివిజన్లకు గాను 12,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆప్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచారు. కాగా మున్సిపాలిటీల్లో 12 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇద్దరు కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. సిబ్బంది రెడీ.. బుధవారం పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రితో సహా మంగళవారం సాయంత్రానికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 123 పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులతో తరలివెళ్లారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను ముందే ఎంపిక చేసిన 137 స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్రపరుస్తారు. నిరంతర పర్యవేక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు తొలిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తద్వారా పోలింగ్ కేంద్రాల లోపలా, వెలుపలా పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించనున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిఘాను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ‘టీ పోల్’లో తెలుసుకోండి.. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘టీ పోల్ మొబైల్ ఆండ్రాయిడ్ యాప్’లో ఓటర్లు తమ ఫోటో ఓటరు గుర్తింపు కార్డు నంబరు (ఎపిక్) సహాయంతో ఓటరు స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు. టీ పోల్ యాప్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోని ఓటర్ పోర్టల్ నుంచి కూడా ఓటరు స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోలింగ్ ప్రక్రియపై ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరు 9240021456ను ఏర్పాటు చేసింది. కాగా ఈ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి వేతనంతో కూడిన సెలవు వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘హోమ్ ఓటింగ్‘కు అవకాశం ఇవ్వాలి గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కేంద్ర ఎన్నికల కమిషన్ 80 సంవత్సరాలు పైబడిన వారు కానీ, వయసుతో నిమిత్తం లేకుండా తీవ్రంగా జబ్బు పడి మంచంలో ఉండి పోలింగ్ బూత్‌కు రాలేని పరిస్థితి ఉన్న వారు కానీ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా హోమ్ ఓటింగ్ ప్రొవిజన్‌ను ప్రవేశ పెట్టింది. తద్వారా ఆయా ఓటర్ల ఇళ్లకు పోలింగ్ అధికారులు స్వయంగా వెళ్లి ఓటు వేయించుకుని వచ్చే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అటువంటి ప్రొవిజన్ లేదని రిటరి్నంగ్ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టాలి. – ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ బండారు రామ్మోహన్రావు. -
గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ ప్రభుత్వం, టీజీపీఎస్సీకి బారీ ఊరట లభించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం కొట్టేసింది. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది. పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాల్లేవు. గ్రూప్-1 నియామకాలు సక్రమమే అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ ధర్మాసనం తుది తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తం 563 మంది అభ్యర్థులు ఇప్పటికే అప్పాయింట్మెంట్ లెటర్లు అందుకున్న సంగతి తెలిసిందే. తాజా తీర్పుతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించినట్లైంది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట్ శివనగర్‌కు చెందిన కె.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేశారు. అలాగే..గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి బెంచ్ తేల్చి చెప్పింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు సెలక్ట్ అయిన అభ్యర్థులు మళ్లీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో.. ఈ పిటిషన్లంటినీ కలిపి విచారణ జరిపింది సీజే నేతృత్వంలోని ధ్విససభ్య ధర్మాసనం. వాదనలు ఇలా..టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరీక్షలు జరిగాయన్నారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత చేయించారని తెలిపారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు హాల్‌టికెట్లను వేర్వేరుగా జారీ చేసిందని చెప్పారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందని ఎలాంటి ఆరోపణలు లేవని వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల్లో అర్హత సాధించలేనివారు కోర్టును ఆశ్రయించారన్నారు. రెండు హాల్‌టికెట్లు ఉంటాయని పరీక్షలకు ముందే వెల్లడించినా అప్పుడు అభ్యంతరం చెప్పకుండా, ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయడం చెల్లదన్నారు.ఇదిలా ఉంటే.. జనవరి 22నే తీర్పు వెల్లడి కావాల్సి ఉన్నా తీర్పు కాపీ రెడీ కాలేదని చెబుతూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇవాళ్టికి వాయిదా గమనార్హం. తీర్పుపై సీఎం రేవంత్ హర్షంగ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘గ్రూప్ -1 నియామకాల పై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించాం. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు నా అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. గ్రూప్ -1 నియామకాల పై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని… ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా… వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించాం. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు నా…— Revanth Reddy (@revanth_anumula) February 5, 2026 -
సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులు గీత దాటొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ విమర్శలకు సంబంధించి ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధివిధానాలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసమే హైకోర్టు ఆ నిబంధనలు పెట్టిందని.. వాటిని పోలీసులు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అసలేం జరిగింది? సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల పోస్టుల ఆధారంగా యాంత్రికంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించరాదని సూచించింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పాటించాల్సిన మార్గదర్శకాలను తీర్పులో పొందుపరిచింది. అయితే ఈ మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీం ధర్మాసనం ముందు వాడీవేడిగా వాదనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛకు మార్గదర్శకాలు అడ్డంకిగా ఉన్నాయి: లూథ్రా విచారణ ప్రారంభం కాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు మెరిట్స్‌పై తాము వాదించడం లేదని.. కానీ హైకోర్టు విధించిన కొన్ని షరతులు ఇబ్బందికరంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘హైకోర్టు తీర్పులోని పేరా 29లో ఇచ్చిన మార్గదర్శకాలపై మాకు అభ్యంతరం ఉంది. ముఖ్యంగా గైడ్లైన్ నంబర్ 7, 8 పోలీసుల దర్యాప్తు స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగాలు లేదా సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఇది ప్రాసిక్యూషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ప్రాసిక్యూషన్ వేరు, దర్యాప్తు వేరు కదా?. కానీ గైడ్లైన్ నంబర్ 4, 7 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫిర్యాదులు నిరాధారమని తేలితే కేసు క్లోజ్ చేయాలని చెబుతున్నారు. అది కేవలం సాక్ష్యాధారాల లేమి వల్లే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా క్లోజ్ చేయొచ్చు కదా?’అని అన్నారు. తప్పేంటి?: సుప్రీం ధర్మాసనందీనిపై జస్టిస్ పార్దివాలా జోక్యం చేసుకుంటూ ‘అసలు హైకోర్టు గైడ్‌లైన్స్ ఇవ్వడంలో తప్పేముంది? పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి, యాంత్రికంగా కేసులు పెట్టకుండా ఉండటానికి ఆ మాత్రం జాగ్రత్తలు అవసరం లేదా? ఒక హైకోర్టు జ్యుడీíÙయల్ ఆర్డర్ ద్వారా కొన్ని మార్గదర్శకాలు ఇస్తే సంబంధిత అధికారులు వాటిని పాటించాల్సిందే. మార్గదర్శకాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. చాలా కోర్టులు ఇలాంటి మార్గదర్శకాల కోసమే ఎదురుచూస్తున్నాయి కూడా. హైకోర్టు కేవలం విస్తృతమైన మార్గదర్శకాలనే జారీ చేసింది. వాటిని పాటించండి’అని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. పోలీసులకు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవీ.. ముందస్తు పరిశీలన: సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ముందుగా ప్రాథమిక విచారణ జరపాలి. న్యాయ సలహా: రాజకీయ విమర్శలు, సున్నితమైన అంశాలకు సంబంధించిన పోస్టుల విషయంలో కేసు నమోదు చేసే ముందు తప్పనిసరిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవాలి. నిరాధారమైతే రద్దు: విచారణలో ఫిర్యాదు నిరాధారమైనదిగా లేదా దురుద్దేశపూర్వకమైనదిగా తేలితే వెంటనే కేసు మూసేయాలి. -
రాష్ట్రానికి నిర్మలమ్మ నిరాశే మిగిల్చారు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. దేశ వ్యాప్తంగా ప్రకటించిన ఏడు రైల్వే కారిడార్లు ( మూడు హైదరాబాద్ మీదుగా) మినహా ఈసారి బడ్టెట్‌లో కూడా తెలంగాణ ప్రస్తావన కనిపించలేదు. విజన్–2047కు అనుగుణంగా రీజినల్ రింగురోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన వరకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఏ కార్యక్రమానికీ నిధులు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ తెలంగాణకు ఎలాంటి ఊరట దక్కలేదు. కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అమలు చేసే పథకాల్లో భాగంగానే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలి తప్ప ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాయం అడిగినా చేయలేదు ఈసారి కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అంశాల్లో కేంద్ర సహకారాన్ని ఆశించింది. ముఖ్యంగా 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధులు వస్తాయని, 2014 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలకు మోక్షం కలుగుతుందని, విభజన హామీల్లో కొన్నింటికైనా ఈసారి కేటాయింపులు ఉంటాయని రాష్ట్రం భావించింది. అయితే తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.1.65 లక్షల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇందుకోసం పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర పెద్దలు కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తోడు రాష్ట్ర ఎంపీలు, తమ శాఖలకు నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్థికమంత్రి, ప్రధాన మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ విజ్ఞప్తులేవీ కేంద్రం పట్టించుకోలేదు. రీజినల్ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టు విస్తరణ, హైదరాబాద్‌లో సీవరేజి మాస్టర్ ప్లాన్, వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రేడియల్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్, రీక్రియేషన్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు, తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాలకు తోడు రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదలన్నింటినీ కేంద్ర బడ్జెట్ బుట్టదాఖలు చేసింది. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సహకారం ఉంటుందని ఆశించినా, అది కూడా దక్కలేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లాంటి సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమాలకు కూడా ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. మిర్చిబోర్డు, స్కిల్ వర్సిటీ లాంటి ఊసు కూడా లేకుండానే పార్లమెంటు ముందుకొచ్చిన కేంద్ర వార్షిక బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశలో ముంచెత్తింది. ఈ బడ్జెట్ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చొరవ తీసుకుంటే ప్రయోజనం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొన్ని పథకాలు, కార్యక్రమాల విషయంలో తెలంగాణ చొరవ తీసుకుంటే... కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్రం కొంతమేర ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైస్పీడ్ రైల్ కారిడార్లకు అనుసంధానంగా రోడ్డు కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయవచ్చని అంటున్నారు. డాటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సహకారం, ఇతర దేశాల నుంచి పెట్టుబడుల సమీకరణ, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం తదితర అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాలు, కేంద్రం అందించే సాయం బట్టి కొంత ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఇక, ఆదాయ పన్ను విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడం, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల విషయంలోనూ విధానాల్లో ఎలాంటి మార్పు ప్రకటించకపోవడంతో వేతన జీవులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఈ బడ్జెట్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతుండడం గమనార్హం. స్వల్పంగా పెరిగిన పన్నుల్లో వాటా కేంద్ర పన్నుల్లో వాటా ఈసారి బడ్జెట్లో స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి గతంలో ఉన్న 41 శాతం పన్నుల్లో వాటాను ఈసారి 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 42.5 శాతానికి పెంచారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటా కూడా గత ఏడాది కంటే కొంచెం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 2.102 శాతంగా ఉన్న పన్నుల్లో వాటా ఈసారి 2.174 శాతానికి పెరగడం గమనార్హం. ఈ మేరకు రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింది రూ. 33,181 కోట్లు వస్తాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రతి నెలా సగటున రూ.2,370 కోట్ల చొప్పున మొత్తం 14 విడతల్లో ఈ మొత్తం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే, పన్నుల్లో వాటి ఈసారి రూ.4వేల కోట్ల వరకు పెరిగింది. గత బడ్జెట్లో రూ.29,280 కోట్లు రాగా, ఈసారి అది రూ.33వేల కోట్లకు పెరగడం ఒక్కటే తెలంగాణకు ఈసారి కేంద్ర బడ్జెట్లో దక్కిన ఊరట అని చెప్పుకోవచ్చు. -
కేంద్ర బడ్జెట్ పైనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆశలు
-
లక్ష కోట్లు టార్గెట్..! కేంద్ర బడ్జెట్ పైనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆశలు
-
ఏపీ కోటా నిండుకుంది!
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే 661 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోగా, ఆ రాష్ట్ర వాటా కింద ఇంకా 2.45 టీఎంసీల జలాలే మిగిలి ఉన్నాయని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రస్తుతం రోజుకి 1.5 టీఎంసీల చొప్పున కృష్ణా జలాలను ఏపీ తరలించుకుంటుండగా, ఇదే వినియోగం కొనసాగితే రెండు రోజుల్లో ఆ రాష్ట్ర వాటా నీళ్లు మిగలకుండా అయిపోతాయని తెలిపింది. కాబట్టి ఆ తర్వాత నీళ్లు తీసుకోకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమ రాష్ట్ర హక్కుగా లభించాల్సిన వాటా జలాలను పూర్తిగా తామే వాడుకుంటామని, ఇందుకుగాను ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో మిగిలిన నిల్వలకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయంపై చర్చించడానికి సత్వరమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) మహమ్మద్ అంజాద్ హుస్సేన్ గురువారం మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల వారీగా ఇరు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలను ఆ లేఖలో తెలంగాణ పొందుపరిచింది. ఏడాదిలో మూడో లేఖ ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో అపరిష్కృతంగా ఉండడంతో రెండు రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలని 2015లో తాత్కాలిక సర్దుబాటు పేరుతో కేటాయింపులు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి బుధవారం నాటికి 833 టీఎంసీల జలాలను వాడుకోగా, ఏపీ 661.42 టీఎంసీలు (79.33 శాతం), తెలంగాణ 172.37 టీఎంసీలు (20.67శాతం) వాడుకున్నట్టు లేఖలో తెలంగాణ స్పష్టం చేసింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయంలో కనీస నిల్వ మట్టానికి ఎగువన 183.01 టీఎంసీల నీటి లభ్యతగా ఉండగా, అందులో తెలంగాణ వాటా 180.55 టీఎంసీలు ఉంటే, ఏపీ వాటా 2.45 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయని తేల్చి చెప్పింది. ఏపీ వాటాకు మించి కృష్ణా జలాలను వినియోగించుకుంటోందని ఫిర్యాదు చేస్తూ తెలంగాణ లేఖ రాయడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. కట్టడి చేయమంటే వాడకం పెంచిన ఏపీ.. ఏపీ వాడకం పోగా ఆ రాష్ట్ర కోటా కింద 20 టీఎంసీల కృష్ణా జలాలే మిగిలి ఉన్నాయని, ప్రస్తుత సంవత్సరంలో అంతకు మించి నీళ్లు తీసుకోకుండా ఆ రాష్ట్రాన్ని కట్టడి చేయాలని ఈ నెల 17న తాము రాసిన లేఖను కృష్ణా బోర్డు తగిన చర్యల కోసం ఏపీకి పంపించగా, ఆ రాష్ట్రం ఆశ్చర్యకర రీతిలో వినియోగాన్ని మరింత ఉధృతం చేసిందని తెలంగాణ ఆరోపించింది. నాగార్జునసాగర్ కుడికాల్వతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ద్వారా భారీగా నీళ్లను తరలించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా శ్రీశైలం జలాశయం 875.50 అడుగుల వద్ద నుంచి నీళ్లు తీసుకునేందుకు అవకాశం ఉన్నా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కాల్వకు నీటి తరలింపును ఈ నెల 26 నుంచి ప్రారంభించిందని అభ్యంతరం తెలిపింది. -
20న షెడ్యూల్?.. కీలక ఘట్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్: మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని పురపాలక శాఖ పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో పురపాలక శాఖ డైరెక్టర్ సమక్షంలో 121 మునిసిపల్ చైర్మన్, 10 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్స్టేషన్ల వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రచురించారు. తాజాగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. డ్రా పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 50 శాతం మునిసిపల్ చైర్మన్, మేయర్ పదవులు కేటాయించారు. నగరాలు, పట్టణాల వారీగా ఏ కేటగిరీకి ఏది రిజర్వు చేశారనే వివరాలను వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వివాదాలకు తావులేకుండా డ్రా పద్ధతిలో కేటగిరీల వారీగా మహిళా రిజర్వుడు స్థానాలను నిర్ణయించారు. రొటేషన్ పద్ధతిలో మునిసిపల్ చైర్మన్, మునిసిపల్ వార్డులు, మేయర్, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజర్వేషన్లు నిర్ణయించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఖరారు చేసిన రిజర్వుడు స్థానాల వివరాలతో గజిట్లు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. ఇవే వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మునిసిపల్ శాఖ కార్యదర్శి పంపించారు. వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తారని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. నేడు కేబినెట్ భేటీలో షెడ్యూల్‌పై చర్చ ఆదివారం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించే అవకాశముంది. కేబినెట్ ఆమోదంతో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం కానుంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనల వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో మేయర్ పదవి రాష్ట్రంలోని పది మేయర్ స్థానాలకు గాను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహా మరో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లను అన్ రిజర్వుడు (జనరల్) కేటగిరీకి రిజర్వు చేశారు. ఈ కేటగిరీలో కేవలం గ్రేటర్ వరంగల్ ముసినిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మినహా మిగతా నాలుగు కార్పొరేషన్లు..జీహెచ్ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండను జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వు చేశారు. బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు కాగా మంచిర్యాల, కరీంనగర్ బీసీ జనరల్, మహబూబ్‌నగర్‌ను బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఒక్కో మేయర్ పదవిని కేటాయించారు. కొత్తగూడెంను ఎస్టీ జనరల్, రామగుండంను ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. 300 డివిజన్లతో కూడిన జీహెచ్ఎంసీ మేయర్ పదవి ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వు అయ్యిందని, అయితే భవిష్యత్తులో జీహెచ్ఎంసీని ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారో తమకు ఇప్పటివరకు సమాచారం లేదని శ్రీదేవి చెప్పారు. ఇదిలా ఉంటే మునిసిపాలిటీల్లో బీసీలకు 38 మునిసిపల్ చైర్మన్ పదవులు రిజర్వు కాగా ఇందులో బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 19 చొప్పున కేటాయించారు. జనరల్ కోటాలో 61 కేటాయించగా అందులో జనరల్‌లో 30, జనరల్ మహిళలకు 31 మునిసిపల్ చైర్పర్సన్ స్థానాలను రిజర్వ్ చేశారు. ఎస్టీలకు 5 మునిసిపాలిటీలు కేటాయిస్తే... మహిళలకు రెండు, ఎస్టీ జనరల్‌కు మూడింటిని రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో మొత్తం 17 మునిసిపాలిటీలను కేటాయిస్తే.. 9 ఎస్సీ జనరల్, 8 ఎస్సీ మహిళలకు కేటాయించారు. -
తుగ్లక్ సర్కార్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తైనా ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. నాటి వైఎస్సార్ హయాం నుంచి బీఆర్ఎస్ పాలన దాకా ఏనాడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరగలేదని.. కానీ, ఇప్పుడు రేవంత్ ఆ పని చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. శనివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సికింద్రాబాద్ బచావో యాత్ర జరగాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు సమాచారం అందించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘తుగ్లక్ పేరు పుస్తకాల్లో చదువుకున్నాం.. ఇప్పుడు చూస్తున్నాం. TS నుంచి TG గా మారిస్తే ఎవరికి లాభం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చివేశారు. తెలంగాణ తల్లిని రూపుమాపి.. కాంగ్రెస్ తల్లిని ప్రతిష్టించారు. కాకతీయ కళాతోరణం తీసివేస్తున్నారు. అపసవ్య దిశలో పాలన సాగుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య విడదీయలేని బంధం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీయాలనుకోవడం మంచిది కాదు. వైఎస్ఆర్ ఆనాడు ఎంసీహెచ్‌ను విస్తరించినా.. హైదరాబాద్ అస్థిత్వాన్ని ముట్టుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2016లో జిల్లాలు ఎర్పాటు అయ్యి పాలన సెట్ అవుతున్న సందర్భంలో జిల్లాలను తొలగించాలని అనుకోవడం తుగ్లక్ చర్యే. తుగ్లక్ సర్కార్‌కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం. సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని బీఆర్ఎస్ గౌరవిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక జిల్లాగా ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. ఆరు గ్యారెంటీలు అటకెక్కించారు. జంట నగరాల్లో ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టారా?. కనీసం.. ఒక్క రోడ్డు వేయలేదు. రేవంత్‌కు తెలిసింది ఒక్కటే.. విధ్వంసం. శాంతి ర్యాలీనీ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య. మా పార్టీకి చెందిన 8 వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అనేది రేవంత్ గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే.. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు. -
బీసీల వాటా 31.4%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగావార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి బుధవారం జీవో నంబర్ 14 జారీ చేశారు. మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వుడు స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4 శాతం, కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ మహిళలకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు మేయర్ పదవులు దక్కనున్నాయి. -
త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. తొలుత మండలాల హేతుబద్ధీకరణ ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. సగటు మధ్య తరగతి ఉద్యోగి సంసారంలా.. ‘రాష్ట్ర ప్రభుత్వంలో 10.5 లక్షల మంది ఉద్యోగుల సైన్యం ఉంది. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల కలయికే ప్రభుత్వం. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికీ వస్తుంది. ఆ రోజున తనకు అందాల్సిన ఆర్థిక లబ్ధి తీసుకోవడం అతని హక్కు. కానీ గత ప్రభుత్వం చేతకాక వయో పరిమితిని పెంచింది. అందువల్ల ఆ సమయంలో జరగాల్సిన రిటైర్మెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఉద్యోగులకు గత ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర బకాయి పెట్టింది. అలాగే కాంట్రాక్టర్ల బిల్లులకు రూ.42 వేల కోట్లు..ఇలా అన్నీ కలిపి రూ.1.11 లక్షల కోట్లు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి అప్పులు సంక్రమించాయి. ప్రస్తుతం క్రమ పద్ధతిలో పొదుపు చేస్తూ సగటు మధ్యతరగతి ఉద్యోగి సంసారం మాదిరి రెండేళ్లుగా శ్రమిస్తూ ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నాం. గతంలో ఉద్యోగులకు ఏ రోజున జీతాలు వచ్చాయి.. ఇప్పటి పరిస్థితి ఏమిటో సమీక్షించుకోవాలి. ఉద్యోగులకు పెద్దన్నగా ఓ తీపి కబురు ఉద్యోగులకు పెద్దన్న మాదిరిగా ఇక్కడికి వచ్చా. తీపి కబురు చెప్పకుండా ఉండడం సబబు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చా. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు రూపొందిస్తున్నాం. రూ.1.02 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఉద్యోగులు పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయం విషయంలో మరింత కృషి చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత వేగంగా గాడిన పడుతుంది. ఉద్యోగ సంఘ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ముందుగా హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యాలయం నిర్మించుకోవాలి. ఉద్యోగ సంఘం ఎంత నిధి ఇస్తుందో.. అదే స్థాయిలో ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది..’ అని సీఎం చెప్పారు. టీజీవో అధ్యక్ష కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, బి.శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఏలూరు.. సచివాలయంలో విలేకరులకు తెలిపారు. పెండింగ్ బిల్లుల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.700 కోట్లను ఏప్రిల్ నుంచి రూ.1,500 కోట్లకు పెంచుతామని చెప్పారన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సీఎం, మంత్రులకు టీజీవో తరఫున ధన్యవాదాలు తెలిపారు. -
రాష్ట్రాన్ని అప్పులపాలు చేయబోం: భట్టి
గోదావరిఖని/ములుగు: గత పాలకుల మాదిరిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయనీయబోమని, అన్నిరంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లి 2047నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గానికి 3,500 మంది లబి్ధదారులను ఎంపిక చేశామన్నారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌కు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం లభించిందని స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ వస్తామని, పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తానని చెప్పారు.సింగరేణి పరిరక్షణకు కృషి సింగరేణి సంస్థ అభివృద్ధి, పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భట్టివిక్రమార్క అన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజావసరాల కోసం నిత్యం తపిస్తున్న నాయకుడు రాజ్‌ఠాకూర్ అని ప్రశంసించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన యాత్రలో నా వెంట నడిచిన రాజ్‌ఠాకూర్‌కు ఆనాడే ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖ, ప్రిన్సిపల్ ఎనర్జీసెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు. రెండుమూడు రోజుల్లో మేడారం పనులు పూర్తి సమ్మక్క–సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మేడారం జాతర నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో ఆదివారం మధ్యాహ్నం 3:26 గంటలకు మేడారం చేరుకున్నారు. కాన్వాయిలో ఆర్టీసీ పాయింట్, జంపన్న వాగు వద్దకు చేరుకొని వాహనంలో నుంచే పనులు పర్యవేక్షించారు. 3:50 గంటలకు హరిత హోటల్‌కు చేరుకొని అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రుల పర్యవేక్షణలో మేడారంలో అభివృద్ధి పనులు పూర్తికావొచ్చాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లోగా మిగిలిన పనులు కూడా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశ అనంతరం గద్దెల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. -
తెలంగాణలోనూ చిరంజీవి సినిమా టికెట్ ధరల పెంపు
ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రానికి తెలంగాణలో టికెట్ ధరలు పెంచినందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కి పెంపు ఉంటుందా లేదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'రాజాసాబ్'లానే దీనిపై కూడా ఎవరైనా న్యాయవాది పిటిషన్ వేసే అవకాశముంది. కాకపోతే ఈ రెండు రోజుల కోర్టు సెలవులు కాబట్టి సోమవారం నాడు ఇలాంటిది ఏమైనా ఉండే అవకాశముంది.'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ సంగీతమందించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్')ఏపీలో జారీ చేసిన జీవో విషయానికొస్తే ముందు రోజు వేసే స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరని జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయి.ఆపై తొలి పదిరోజులపాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది. -
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
పురం.. సత్వరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారు, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని.. జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్ 195–ఎ ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. రాణీ కుముదిని ఈ నెల 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని ‘టి పోల్’యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన రిటరి్నంగ్ అధికారులు, సహాయ రిటరి్నంగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను వెంటనే నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. పోలింగ్ కోసం అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. నేడు రాజకీయ పార్టీలతో భేటీ ఇప్పటికే జిల్లా స్థాయిలో రాజకీయ పక్షాలతో ఈ నెల 5న సమావేశాలు నిర్వహించగా, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇదిలావుంటే ఈ నెల 16 నాటికి ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లపై స్పష్టత రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ఎస్ఈసీ దృష్టి పెట్టనుంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా కొత్త పాలకమండళ్లు! మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నెల మూడోవారంలోగా షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖరుకు కొత్త పాలక మండళ్లకు పురపాలన బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ మంగళవారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ పురపాలికల చట్ట సవరణ’బిల్లును ఆమోదించారు. గతంలో నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ 48 డివిజన్లుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. -
డే-4.. కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో.. తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు–2026ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చతో పాటు ఆమోదం తెలపనుంది సభ. పాల్వాయి హరీష్, బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్.. డీఆర్డీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారుఅధికారుల అవినీతి పై నేను ఎక్కని గడుప లేదుఅన్ని స్థాయిల్లో అధికారులకు అవినీతి పై ఫిర్యాదు చేసాంప్రభుత్వం డీఆర్డీఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అలాగే.. తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికలను రిలీజ్ చేయనుంది. 2015-16 నుంచి 2018-19 వరకు ఆడిట్ నివేదికలు టేబుల్ చేయనుంది ప్రభుత్వం. దీంతో పాటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్టన్) పాలసీపై షార్ట్ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. -
సచివాలయ ఉద్యోగులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో తెలంగాణ సెక్రటేరియట్లో ఉద్యోగుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం కొత్త ఐడి కార్డులను ప్రవేశపెట్టింది. గత కొద్ది నెలలుగా సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో నకిలీ ఉద్యోగులను అరికట్టేందుకు కొత్త ఐడీ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. కార్డులపై సెక్రటేరియట్ భవనం,తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిరూపాలను ముద్రించింది. అదనంగా క్యూ ఆర్ కోడ్, ఇంటర్నల్ చిప్, ఎంప్లాయి నెంబర్, ఫోటో వంటి వివరాలను చేర్చింది. రెగ్యులర్ ఉద్యోగులు 1300 మంది, క్లాస్-4 ఉద్యోగులు 300 మంది.. మొత్తం 1600 మందికి ఈ కొత్త ఐడి కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే ఉద్యోగుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఐడి కార్డుల ద్వారా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసింది. మార్ఫింగ్ లేదా నకిలీ కార్డులు తయారు చేసే అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల గుర్తింపును సాంకేతిక ఆధారాలతో నిర్ధారించే ప్రయత్నం జరుగుతోంది. -
డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: అక్రిడేషన్ల విషయంలో జీవో 252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో.. వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలంటూ టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్టీ నేతలు మంగళవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని, జీవో 252ను సవరించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే.. స్పోర్ట్స్, కల్చరల్, ఫీచర్ ప్రతినిధులకు అక్రిడేషన్ కార్లు ఇవ్వాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రిపోర్టర్లతో పాటు డెస్క్ జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలు పడొద్దు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తా. ఆ అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తా. జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా జీవో 252ను వివరిస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ఫెడరేషన్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అక్రిడిటేషన్ల జీవో నెంబర్ 252పై పలువురు జర్నలిస్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం.. ఫీల్డ్ రిపోర్టర్లకు ‘అక్రిడిటేషన్ కార్డు’, డెస్క్ జర్నలిస్టులకు కేవలం ‘మీడియా కార్డు’ జారీ చేయాలని నిర్ణయించింది. ఒకే వృత్తిలో ఉన్న వారిని రిపోర్టర్లు, డెస్క్ అని రెండు వర్గాలుగా విభజించడం జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడమేనని ఇటు జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక.. మీడియా కార్డు వల్ల రైల్వే, బస్సు పాస్ రాయితీలు, టోల్ గేట్ మినహాయింపులు వంటి కనీస ప్రయోజనాలు కూడా అందే అవకాశం లేదని డెస్క్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్నట్లుగానే డెస్క్ జర్నలిస్టులకు కూడా పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జీవో వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని యూనియన్లు అంటున్నాయి. ఈ క్రమంలో.. జీవో విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులో పోరాటానికి సిద్ధమయ్యాయి. -
తెలంగాణలో మద్యం అమ్మకాలు.. స్పెషల్ జీవో రిలీజ్
సాక్షి, హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 సందర్భంగా.. రేపు అర్ధరాత్రి 12 దాకా మద్యం అమ్మకాల నిర్వహణకు వైన్స్ దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. అలాగే.. బార్లు, క్లబ్‌లతో పాటుగా ఈవెంట్లు నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నవారికి అర్ధరాత్రి 1.గం. దాకా మద్యం అమ్మకానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలకు ఇదివరకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడంతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ నేతృత్వంలో ఇవాళ, రేపు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల పాత ఏడాదికి వీడ్కోలు.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఈవెంట్లు సిద్దమైయాయి.ఈ క్రమంలో రాజధాని శివారు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. ఈఏడాది కూడా కోట్ల రూపాయల దందా సాగుతుందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది. అయితే.. ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు చేయకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తగిన ఏర్పాటు చేస్తోంది. మరోవైపు.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల శాఖ అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. రోడ్లపై ద్విచక్ర వాహనాలతో హంగామా చేస్తే కేసు నమోదు తప్పదని పేర్కొంది. -
‘సంక్షేమం’లో సర్కారోళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అనర్హులకు చేరుతున్నాయా? వేల సంఖ్యలో సంపన్నులు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా? అందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల వెల్లడైన నివేదికలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం సేకరించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్ వివరాలు.. ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల లబ్ధిదారుల వివరాలతో సరిపోలినట్లు తేలింది. 800 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమ పథకాలను కూడా తీసుకుంటున్నారని నామమాత్రపు సర్వేలో వెల్లడైన నేపథ్యంలో అన్ని సంక్షేమ పథకాలపై నిశిత పరిశీలన జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సామాజిక పింఛన్లతోపాటు ఇతర అన్ని సంక్షేమ పథకాలపై ఆడిట్ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. నాలుగు చోట్ల.. నిశిత ఆడిట్ వివిధ వర్గాల పేదలు, నిర్దేశిత కేటగిరీలకు చెందిన నిజమైన లబ్ధిదారులకు దక్కాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు పలువురు ప్రభుత్వ అధికారులు మొదలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇంటికి చేరుతున్నాయి. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి జీతాలు, అలవెన్స్‌లు పొందుతున్న 478 మంది రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు పొందుతున్న 338 మంది సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఈవిధంగా పలు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్న వారిలో అధిక మొత్తాల్లో వేతనాలు, అలవెన్స్‌లు పొందుతున్న అధికారులు, ఉద్యోగులతోపాటు లగ్జరీ కార్లు, మూడంతస్తుల భవనాలు, పెట్రోల్ బంక్‌ల యజమానులు కూడా ఉండటం ఆశ్చర్యం గొలుపుతోంది. అదికూడా కేవలం కరీంనగర్, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్లు, ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామం, వనపర్తి జిల్లా ఆత్మకూరులో ప్రభుత్వపరంగా నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’లోనే ఇంతమంది అనర్హులు సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్నట్టు తేలింది. మరింత లోతుగా పరిశీలన చేస్తే... ప్రధానంగా సామాజిక పెన్షన్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అవకతవకలు మచ్చుకు కొన్ని బయటపడ్డాయి. మొత్తంగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డేటాను వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల డేటాతో లింక్ చేసి ఆధార్ సమాచారాన్ని ‘క్రాస్ వెరిఫై’ చేసినప్పుడు... 37 వేల మందికిపైగా ఉద్యోగులు (రెగ్యులర్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఇతరులు కలిపి) ప్రయోజనం పొందుతున్నట్టుగా వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగుల (కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సహా) ఆధార్ వివరాలను వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాబేస్‌తో సరిచూసినప్పుడు ఈ ఉద్యోగుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల నిర్వహించిన ‘పైలెట్ ఆడిట్’ కేవలం ఉపరితలాన్ని మాత్రం స్పృశించినట్టుగా కొంత సమాచారం మాత్రమే బయటకు వచ్చిందని, మరింత లోతుగా పరిశీలన జరిపితే ఇతర పథకాల ద్వారా కూడా పలువురు ఉద్యోగులు ప్రయోజనాలు పొందే విషయం వెలికితీసే అవకాశం ఉందని అంటున్నారు. అక్రమంగా ‘చేయూత’ ఆధార్ కార్డుల పరిశీలన అనంతరం చేయూత పథకం సామాజిక పింఛన్ లబ్ధి పొందుతున్న ఉద్యోగుల వివరాలను కేటగిరీల వారీగా ప్రభుత్వానికి పంపారు. ఈ పథకంలో అంగన్ వాడీ హెల్పర్లు (1521), టీచర్లు (487), ఏఎన్ఎం (100), అర్చకులు (178), ఆర్టిజన్ (167), ఆశావర్కర్లు (1,280), కుక్‌లు (3,667), ఆయాలు (33), కండక్టర్లు (42), కాంట్రాక్టు టీచర్లు (35), డాటా ఎంట్రీ ఆపరేటర్లు (98), డ్రైవర్లు (68), ఫీల్డ్ అసిస్టెంట్లు (84), హోంగార్డులు (110), జూనియర్ లెక్చరర్లు (30), కామాటి (61), మౌజాం, ఇమాంలు (514), మల్టీపర్పస్ వర్కర్లు (2,263), అటెండర్లు (289), పబ్లిక్ హెల్త్ మేనేజర్లు (629), శానిటరీ సిబ్బంది (1145), పీజీటీలు (47), ఎస్జీటీ, టీజీటీలు (71), సెక్యూరిటీ గార్డులు (119), స్వీపర్లు (288), వీవోఏ (645), వీఆర్ఏ (164), వాచ్మెన్ (90) మంది కూడా ఉన్నారు. అలాగే, చాలా తక్కువ సంఖ్యలో వొకేషనల్ టీచర్లు, స్టాఫ్ నర్సులు, స్పెషల్‌పోలీస్ అధికారులు, స్పెషల్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ (సెకండ్ క్లాస్), లెక్చరర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఆరోగ్య మిత్రలు కూడా ఉన్నారని వెల్లడైంది. వీరిలో ఎవరికి ఇవ్వాలి? ఇలా పథకాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది ఆదాయ పరిమితికి లోబడి సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపికైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా పథకాలను పొందేందుకు అవసరమైన మేరకు వారి వేతనం లేని కారణంగా వీరు లబ్ధి పొందేందుకు అర్హులేననే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, దినసరి కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, అర్చకులు, ఆర్జిజన్లు, కుక్‌లు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, మౌజం, ఇమాంలు, వీఏవో, వీఆర్వోలు, ఎస్పీవోలు, పార్ట్‌టైం ఉద్యోగుల విషయంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరింది. గ్రాంట్ఇన్ ఎయిడ్ రెగ్యులర్, మినిమమ్ టైమ్ స్కేల్, రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, టైంస్కేల్ పొందుతున్న ఇతర కేటగిరీల ఉద్యోగులకు మాత్రం ఆయా పథకాలను వెంటనే నిలిపివేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసరా పింఛన్లపై సోషల్ ఆడిట్ నిర్వహణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించగా, మిగిలిన సంక్షేమ పథకాలపైనా ఆడిట్ నిర్వహించే దిశలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ వివిధ పథకాలు పొందుతున్న వారు.. ఉల్లంఘనలు ఇలా... ⇒ నెలకు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్న అధికారులు, ఉద్యోగుల తల్లిదండ్రుల్లో కొందరు చేయూత పింఛన్లు పొందుతున్నారు. ⇒ కార్లు, ట్రాక్టర్లు, సొంతిళ్లు ఉన్నవారూ ప్రయోజనాలు అందుకుంటున్నారు. ⇒ డిజేబిలిటీ పింఛన్లు... వైకల్యం లేకపోయినా కొందరికి అందుతున్నాయి. ⇒ 50 ఏళ్లు దాటని వారు కూడా వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. -
జీహెచ్ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు విస్తరించడంతో పాటు, జోన్లు సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, 30 సర్కిల్స్‌ను 60కు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది.జీహెచ్ఎంసీ వార్డుల డీ లిమిటేషన్‌పై కూడా ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులు ఖరారు చేశారు. ఈ నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు, పదిరోజుల పాటు ప్రజల అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సమయంలో 6 వేలకు పైగా అభ్యంతరాలు అందాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఈరోజు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నిర్ణయంతో GHMC పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఉండటం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
కమీషన్‌కే ఏటా రూ.600 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై కాసుల వర్షం కురుస్తోంది. నిర్దేశించిన విధులను నిర్వర్తించడంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శ్రమిస్తుంటే..వారికి అరకొరగా వచ్చే వేతనం నుంచి కమీషన్ల కింద ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే సొమ్ముతో ఏజెన్సీలు జేబులు నింపుకుంటున్నాయి. కేవలం కమీషన్ పేరిట రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు నెలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.600 కోట్ల మేర సంపాదిస్తుండటం గమనార్హం. కాగా తమ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కోతలు, వేతన చెల్లింపుల్లో జాప్యంతో జమ అయ్యే వడ్డీ, ఇతరత్రా రూపాల్లో అందిన కాడికి దండుకుంటున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఏజెన్సీల ఇష్టానుసార నిర్ణయాలతో వారికి వేతనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. రావాల్సిన మొత్తం కంటే తక్కువగా ముట్టజెపుతుండటంతో, పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉండటంపై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పరిపాలన సజావుగా సాగాలనే పేరిట.. పరిపాలనను సజావుగా కొనసాగించేందుకు, ఉద్యోగ ఖాళీలతో ఏర్పడే సమస్యను అధిగమించేందుకు ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఉద్యోగులను నేరుగా నియమించుకోకుండా.. ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసుకుని వాటి ద్వారా అర్హత కలిగిన వ్యక్తులను వివిధ శాఖల్లోకి తీసుకుంటోంది. ప్రభుత్వానికి అవసరమైన సర్వీసులను నేరుగా వారి నుంచి పొందుతున్నప్పటికీ.. వేతనాలను మాత్రం ఏజెన్సీల ఖాతాకు విడుదల చేస్తుండటం ఇక్కడ గమనించవలసిన విషయం. అలా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ఏజెన్సీ ప్రతినిధులు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో ఏజెన్సీ కమీషన్‌తో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్, జీఎస్టీ కోతపెట్టి వేతనాలు చెల్లిస్తారు. దీంతో వేతన పట్టికలో కన్పించే మొత్తం, వాస్తవంగా చేతికందే వేతనంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. శాశ్వత ఉద్యోగులతో దాదాపు సమానంగా.. రాష్ట్ర ప్రభుత్వంలోని 31 శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రజలకు సర్వీసులు అందిస్తున్న శాఖల్లోనే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అత్యధికంగా ఉండటం గమనార్హం. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం..పలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు 5,21,692 మంది కాగా... ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారు 4,93,820 మంది ఉన్నారు. అయితే ఇటీవల ఆర్థిక శాఖ ఆధార్ వివరాలు సేకరించగా.. కేవలం 2,74,844 మంది వివరాలు మాత్రమే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్లోడ్ అయ్యాయి. ఆధార్‌లో పేర్లు తప్పుగా నమోదు కావగడం లాంటి కారణాలతో మిగిలిన ఉద్యోగుల వివరాలు అప్లోడ్ కాలేదు. దీంతో ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎంట్రీ చేయనున్నారు. బేసిక్ కంటే తక్కువగా అందుతున్న వేతనం శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో వేతనాలను ఖరారు చేస్తే... ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి మాత్రం మూడు రకాల స్కేళ్లలో వేతనాలు అందిస్తున్నారు. జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసే వారిని మూడు కేటగిరీలుగా నిర్దేశించి వేతనాలు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి బేసిక్ వేతనం రూ.15,600గా నిర్ణయిస్తే...ఈపీఎఫ్ రూ.2,028, ఈఎస్ఐ రూ.507, జీఎస్టీ రూ.3,377, ఏజెన్సీ కమీషన్ రూ.624గా పేర్కొంటున్నారు. ఇవన్నీ కలిపితే ఉద్యోగి మొత్తం వేతనం రూ.22136 కాగా.. ఇందులో నిర్దేశించిన కేటగిరీల (ఈపీఎఫ్, ఈఎస్ఐ) కింద కోత పెడుతున్నారు. మరోవైపు డిడక్షన్ (ఇది కూడా కోతే) కింద దాదాపు రూ.2 వేలు కోత పడుతోంది. చివరకు ఉద్యోగికి రూ.13,611 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఆ ఉద్యోగి బేసిక్ వేతనం కంటే తక్కువగా చేతికందుతోందన్నమాట. ప్రస్తుతం ప్రైవేటు సంస్థల్లో ఎంట్రీ స్థాయిలోనే రూ.20 వేల చొప్పున వేతనాలు అందుతుండగా... ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారికి అత్యంత తక్కువగా వేతనాలు అందుతుండడం గమనార్హం. ఉద్యోగి కష్టం ఏజెన్సీ పాలు.. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టం చివరకు ఏజెన్సీలపాలవుతోందనే విమర్శలున్నాయి. ఒక ఉద్యోగి సగటు వేతనం నుంచి అధికారికంగా దాదాపు 4 శాతం నేరుగా ఏజెన్సీకి వెళుతోంది. ప్రభుత్వం సకాలంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు వేతనాల నిధులు బ్యాంకుల్లో జమ చేస్తున్నప్పటికీ.. ఏజెన్సీలు వాటిని వెంటవెంటనే ఉద్యోగులకు విడుదల చేయడం లేదు. తద్వారా బ్యాంకులో జమ అయిన నిధులకు సంబంధించిన వడ్డీతో ఏజెన్సీలు లబ్ధి పొందుతున్నాయి. మరికొన్ని ఏజెన్సీలు గైర్హాజరు, ఇతరత్రా కారణాలను చూపుతూ ప్రభుత్వానికి, అధికారులకు తెలియకుండా వేతనాల్లో కోతలు పెడుతున్నాయి. వాస్తవానికి ఏజెన్సీల విధానంపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఆ కార్పొరేషన్ ద్వారానే ఉద్యోగుల ఎంపిక చేపట్టడంతో 4 శాతం కమీషన్ నిధులు కూడా నేరుగా ఉద్యోగికే అందుతున్నాయి. పైపెచ్చు ఎలాంటి అనధికారిక కోతలకు తావుండటం లేదు. ఈ విధానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు పక్కాగా అమలు చేస్తుండటం గమనార్హం. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ శాఖల్లో ఏజెన్సీల ద్వారా ఉద్యోగుల ఎంపిక విధానంలో మార్పులు చేయాలి. ప్రభుత్వం నేరుగా నియమించుకోవడమో, లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నియమించుకోవడమో చేయాలి. దీనివల్ల ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ఈ ప్రక్రియలో కార్మిక ఉపాధి కల్పన, ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్‌లకు బాధ్యత అప్పగించాలి. మరోవైపు ఏజెన్సీలకు కమీషన్ ఇవ్వాల్సిన అవసరమూ ఉండదు. దీంతో ఉద్యోగులకు కొంచెం ఎక్కువ వేతనం అందుతుంది. కోతలకూ తావులేకుండా వేతనం అందడం వల్ల వారి జీవన పరిస్థితులు మెరుగు పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయాలి. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం ఒక పాలసీని తెచ్చిన ప్రభుత్వం.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలి. – పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం -
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను ఇక మీదట ప్రభుత్వ భవనాల్లో కొనసాగాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్ భవనాల అద్దె చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది2026 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ భవనాల్లోనే పని చేయాలని అన్ని శాఖలకు, యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, వర్సిటీలను వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని పేర్కొంది. డిసెంబర్ 31లోపు ప్రభుత్వ భవనాలకు షిఫ్ట్ అవ్వాలని.. అన్ని శాఖలు ప్రభుత్వ స్థలాల గుర్తింపు పూర్తిచేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాధిపతులే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని.. ఆ అద్దెలు వాళ్లే చెల్లించాల్సి వస్తుందని సర్కార్ హెచ్చరించింది. -
300 ఎకరాలు రూ. 8,000 కోట్లు!
శాసనసభకు కూతవేటు దూరంలోని హౌసింగ్ బోర్డు స్థలంలో వెలిసిన పెట్రోల్ బంకు.. దాని లీజు గడువు ముగిసి 20 ఏళ్లు అవుతోంది. కానీ ఖాళీ చేయట్లేదు. పోనీ లీజు అద్దె చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు. నామమాత్రపు చిల్లర డబ్బులు అడపాదడపా చెల్లిస్తూ దాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు. రూ.కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా అనుభవిస్తూ ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెడుతున్నారు.విజయనగర్ కాలనీ సమీపంలోని ఫంక్షన్ హాల్ అది. ఓ రాజకీయ నాయకుడి గుప్పిట్లో చిక్కుకుంది. దశాబ్దాల క్రితం హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకొని దర్జాగా ఆ నేత వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ లీజు అద్దె మాత్రం చెల్లించట్లేదు. ఖాళీ చేయాలని కోరితే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. అత్యంత విలువైన ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డు భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకొనే వీల్లేక.. లీజు రూపంలో ఆదాయం పొందలేక తెలంగాణ గృహనిర్మాణ మండలి కునారిల్లుపోతోంది. ఈ తరుణంలో అలాంటి భూములను ప్రస్తుతం వాటిని అనుభవిస్తున్న వారికి మార్కెట్ ధరకు అమ్మాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. బహిరంగ వేలం ద్వారా మరింత ఎక్కువ మొత్తాన్ని ఇంకా ఎక్కువకు విక్రయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. త్వరలో కేబినెట్ ముందు ఈ మేరకు ప్రతిపాదించి అందుకు ఆమోదం పొందేందుకు గృహనిర్మాణ శాఖ చర్యలు ప్రారంభించింది. రూ. 8 వేల కోట్ల వరకు ఆదాయం... హైదరాబాద్‌లోని కోకాపేట పరిసరాల్లోని భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా ఇటీవల పలుమార్లు వేలం వేయగా రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోవడం తెలిసిందే. అలాగే మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇళ్లను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలోని భూములు, అసంపూర్తి బహుళ అంతస్తుల భవన సముదాయాలను కూడా విక్రయిస్తోంది. ఇదే తరహాలో తెలంగాణ గృహనిర్మాణ మండలి భూములను కూడా విక్రయించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు మండలి అధికారులు ప్రభుత్వానికి వివరాలు సమరి్పంచారు. ఏయే భూముల్ని విక్రయించే అవకాశం ఉందో లెక్కలు తేల్చారు. వివిధ పద్ధతుల్లో లీజుల్లో ఉన్న ఈ భూములను విక్రయించడం ద్వారా సుమారు రూ. 8 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని గృహనిర్మాణ శాఖ అంచనా వేస్తోంది. లీజు భూములతోనే చిక్కు... గృహ నిర్మాణ మండలి వాణిజ్య అవసరాలకు భూములను లీజుకు ఇచ్చింది. కొన్నింటిని ప్రార్థనా స్థలాలకు, కబరిస్తాన్లకు ఇవ్వగా మరికొన్నింటిని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు అప్పగించింది. వాటి నుంచి నెలవారీగా రూ. 40 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉండగా నామమాత్రంగా చిల్లర పైసలు మాత్రమే వసూలవుతున్నాయి. లీజు ధరలను గతంలో సవరించినా ఆ మొత్తాన్ని చెల్లించేందుకు లీజుదారులు ముందుకు రావట్లేదు. లీజు గడువు పూర్తయిన వారు వాటిని ఖాళీ చేయట్లేదు. గతంలో చదరపు అడుగుకు రూ. 7 నామమాత్రపు లీజు ధర ఉండగా దాన్ని ఓసారి సవరించి రూ. 30కి పెంచారు. కానీ అందులో మూడో వంతు కూడా చెల్లించేందుకు లీజుదారులు ముందుకు రావట్లేదు. రూ. 10 చొప్పున అడపాదడపా చెల్లించి ఆయా స్థలాలను ఖాళీ చేయకుండా అ«దీనంలో ఉంచుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి 115 ఆస్తులు ఉండగా వాటి మొత్తం విస్తీర్ణం దాదాపు 256 ఎకరాలుగా ఉంది. వాటిల్లో ధార్మిక, కబరిస్తాన్ స్థలాలు పోను మిగతా వాటిని లీజుదారులకు విక్రయించడం లేదా బహిరం™గ వేలం ద్వారా విక్రయించడం తక్షణ అవసరమని గృహనిర్మాణ శాఖ తాజాగా నిర్ణయించింది. ఇలా విక్రయించడం ద్వారా సబ్ రిజిస్ట్రార్ ధర ప్రకారమైతే రూ. 2,450 కోట్లు, మార్కెట్ ధర ప్రకారమైతే రూ. 7,400 కోట్లు పొందొచ్చని అంచనాకొచ్చింది. వాణిజ్య సముదాయాల్లోని దుకాణాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పక్కన మిగిలి ఉన్న చిన్నచిన్న స్థలాల విక్రయం ద్వారా మరో రూ. 600 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తోంది. దుకాణాల విక్రయం... హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రంలో సొంత జాగాలో గృహనిర్మాణ మండలి కాంప్లెక్సులు నిర్మించింది. నాంపల్లి, బాగ్‌లింగంపల్లి, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, ఎస్ఆర్ నగర్, బషీర్‌బాగ్, ఫతేమైదాన్, విద్యానగర్, సంతోశ్‌నగర్ తదితర చోట్ల ఉన్నాయి. వాటిల్లో 201 దుకాణాలను అద్దెకిచ్చారు. గతంలో ఓసారి 14 దుకాణాలను వాటి నిర్వాహకులకే విక్రయించగా మిగతావి ఉన్నాయి. ఐదేళ్లకోసారి అద్దెలను సవరించి 50 శాతం మేర పెంచాలనే ఒప్పందం ఉన్నా దుకాణాల నిర్వాహకులు దాన్ని పట్టించుకోకపోగా అద్దె చెల్లించకుండా, దుకాణాలు ఖాళీ చేయకుండా మొండికేస్తున్నారు. దుకాణదారుల నుంచి అద్దె వసూలు కష్టంగా మారిన నేపథ్యంలో వాటిని గంపగుత్తగా విక్రయించాలని నిర్ణయించారు.ఇంటి పక్క స్థలాల విక్రయం... కేపీహెచ్‌బీ లాంటి హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఇప్పటికీ అక్కడక్కడా చిన్నచిన్న ప్లాట్లు మిగిలిపోయాయి. వాటి నుంచి బోర్డుకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వాటి పక్కనే ఉన్న ఇళ్ల వారికి వాటిని విక్రయించాలని ఇప్పుడు నిర్ణయించారు. ఇలాంటివి దాదాపు 400 బిట్లు ఉన్నాయి. సగటున ఒక్కోటి 35 గజాల మేర ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ ధర ప్రకారం వాటిని విక్రయించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సైనికులకు... విజయనగర్ కాలనీలో హౌసింగ్ బోర్డుకు దాదాపు 40కిపైగా ఆస్తులున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కుటుంబాలకు అప్పట్లో ఒక్కోటి వెయ్యి గజాల (గరిష్టంగా) వరకు ఉన్న ప్లాట్లను కేటాయించారు. అవన్నీ లీజు రూపంలో ఇచ్చినవే. కానీ వాటి నుంచి లీజులు వసూలు కావట్లేదు. ఈలోగా కొందరు వాటిని ఇతరులకు విక్రయించడంతో ప్రస్తుతం ఆ ప్లాట్లు కొన్న వారి వారుసుల చేతుల్లో ఉన్నాయి. వాటి మార్కెట్ ధర నిర్ణయించి విక్రయించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో గజం ధర రూ. లక్షకుపైగా ఉన్నప్పటికీ ఆ భూములను కబ్జాలో ఉంచుకున్న వారు కేవలం గజం రూ. 5 వేలు చొప్పున నిర్ణయించి తమకు విక్రయించాలని గృహనిర్మాణ మండలికి విన్నవించారు. రూ. 350 కోట్లకుపైగా విలువైన భూములను కేవలం రూ. 10 కోట్లకే కొట్టేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ, మార్కెట్ ధర నిర్ధారించి విక్రయిస్తామని గృహనిర్మాణ మండలి పేర్కొంటోంది. ఇలా మొత్తంగా అన్ని కలిపితే 300 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. హౌసింగ్ బోర్డు లీజు స్థలాలు, షాపుల క్రమబద్ధీకరణహౌసింగ్ బోర్డుకు చెందిన అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. హౌసింగ్ బోర్డు భూములపై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇవ్వగా వాటిలో ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అద్దె బకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. లీజు ఒప్పందం పునరుద్ధరించుకోని సంస్థలకు లేఖలు రాసి వాటి క్రమబదీ్ధకరణకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బోర్డుకు 301 కమర్షియల్ షాపులు ఉండగా 2007లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 14 మంది షాపులు కొనగా మిగిలిన 287 షాపులకుగాను ప్రస్తుతం 62 షాపులు ఖాళీగా ఉన్నాయన్నారు. బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ఏటా 10 శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండగా ఈ నిబంధన అమలు కాకపోవడంతో షాపు యజమానుల నుంచి బోర్డుకు రూ. కోట్లు రావలసి ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షాపు లు నిర్వహిస్తున్నవారు వాటిని కొనేందుకు ముందుకొస్తే మార్కెట్ ధరకు విక్రయించడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. షాపు నిర్వహణకు అనువుగా లేని స్థలాలను వేలంలో విక్రయించాలన్నారు. అలాగే బోర్డు గతంలో కేటాయించిన ఇళ్ల పక్కనే ఉన్న 100 గజాల్లోపు స్థలాలను ఆ ఇంటి యజమానికి ఆసక్తి ఉంటే విక్రయించాలని సూచించారు. గతంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజి్రస్టేషన్ చేసుకోని వారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని చెప్పారు. మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ, 100 గజాల్లోపు స్థలాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల వివరాలు, రిజి్రస్టేషన్ చేసుకొని పక్కనే ఉన్న 100 గజాలలోపు స్థలాన్ని అడుగుతున్న వారి వివరాలు తదితర అంశాలపై పూర్తిస్ధాయి నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. వాటన్నింటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి 'టాలీవుడ్' కన్ఫ్యూజన్.. పరిష్కారమే లేదా?
టికెట్ రేట్ల పెంపు అనేది తెలంగాణలో పెద్ద జోక్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి రెండుసార్లు జరిగితే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ పదేపదే జరగడం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ విషయంలో ఎందుకింత కన్ఫ్యూజన్ అనే సందేహం వస్తోంది. అసలు ప్రస్తుతం ఏం జరుగుతోంది? దీనికి పరిష్కారం లేదా?టాలీవుడ్లో టికెట్ రేట్ల పెంపు చాన్నాళ్లుగా ఉన్నదే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. రీసెంట్ టైంలో జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. గతేడాది డిసెంబరులో 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం మీకు తెలిసే ఉంటుంది. ఇది జరిగిన వెంటనే ఇకపై తెలంగాణలో ప్రీమియర్స్‌కి అనుమతి ఇవ్వబోం, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోం అని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు.కొన్నాళ్ల పాటు ప్రభుత్వం.. టికెట్ రేట్ల విషయంలో చెప్పిన మాటపై నిలబడింది. తర్వాతే మెల్లమెల్లగా సడలింపులు మొదలయ్యాయి. కొన్నాళ్ల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ విషయమై ఒకరు హైకోర్టుని ఆశ్రయించగా.. ప్రభుత్వంపై మొట్టికాయలు పడ్డాయి. సరే ఇకనైనా పాటిస్తారేమో అనుకుంటే.. తాజాగా 'అఖండ 2' విషయంలో ఏకంగా హైకోర్ట్ ఆదేశాల్నే ధిక్కరించారు.ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ ధరల్ని పూర్తిగా తగ్గించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నిర్మాతలు వీటిని పాటించలేదు. ఇదే విషయమై మరో పిటిషన్ వేయగా హైకోర్టు.. చిత్రబృందాన్ని ప్రశ్నించించింది. హైకోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నిర్మాతలు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించగా కాస్త ఊరట లభించింది.'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు గురించి తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా అధికారులు జీవో జారీ చేశారని, ఇకపై దర్శకనిర్మాతలు ఎవరూ తమ దగ్గరకు రావొద్దని అన్నారు. అయితే మంత్రికే తెలియకుండా జీవో జారీ చేసే అవకాశముందా? అనేది ఇక్కడ అర్థం కాని విషయం! ఇలా ప్రతిసారి 'టాలీవుడ్' విషయంలో తెలంగాణ ప్రభుత్వం కన్ఫ్యూజన్ అవుతూనే ఉంది.సరే 'అఖండ 2' విషయంలో జరిగిందేదో జరిగిపోయిందని అనుకుందాం. రాబోయేది సంక్రాంతి సీజన్. చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి మంత్రి కోమటిరెట్టి వెంకటరెడ్డి చెప్పినట్లు ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకుండా ఉంటారేమో చూడాలి? లేదంటే మళ్లీ జీవో జారీ చేసి హైకోర్టుతో చెప్పించుకుంటారా అనేది చూడాలి?ఏదేమైనా టికెట్ రేట్ల పెంపు విషయమై ఇండస్ట్రీ, ప్రభుత్వం ఒకచోట కూర్చుని ఓ క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. లేదంటే ప్రతిసారి ఇలా గందరగోళపడటమే అవుతుంది. టికెట్ రేట్ల పెంపు ఏమో గానీ ప్రేక్షకుడు క్రమక్రమంగా తెలుగు సినిమాకు దూరమవుతూనే ఉన్నాడు. థియేటర్లకు వచ్చి చూసే వాళ్లు రోజురోజుకీ తగ్గిపోతున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదే నిజం. దర్శకనిర్మాతలు హీరోలకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో? -
వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలుపుదాం
సాక్షి, హైదరాబాద్: వారసత్వ అధ్యయనాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్ ఆర్డీ)లో జరిగిన ‘దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై న్యూ మిస్ మ్యాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్లో ఆయన ప్రసంగించారు. వారసత్వ ఆధారిత పరిశోధనకు తెలంగాణ ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో మన రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ హబ్‌గా తీర్చిదిద్ద డంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందన్నారు. దక్షిణ భారతదేశానికి అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉందని, శాతవాహనులు, ఇక్ష్వాకులు తమ వాణిజ్య నెట్‌వర్క్‌లను నాణేల ద్వారా విస్తరించగా, కాకతీయుల నుంచి విజయన గర సామ్రాజ్యపు వైభవం వరకు మన ప్రాంతపు నాణేలు ఆవిష్కరణ, కళాత్మకత, రాజ్యపాలనకు ప్ర తీకగా నిలిచాయని చెప్పారు. ఈ సదస్సు స్వతహా గానే చరిత్రాత్మకమైనదని, వారసత్వ శాఖ ఇంతకు ముందు పురావస్తు, మ్యూజి యంల శాఖ 114 ఏళ్ల ప్రయాణంలో తొలిసారిగా నాణేలపై మాత్రమే జాతీయ సదస్సును నిర్వహించడం అభినందనీయ మన్నారు. ఈ సదస్సు రెండురోజులు జరిగే కార్యక్ర మంగా మాత్రమే కాకుండా, కొత్త ఆలోచనలను రగిలించే వేదిక కావాలన్నారు. న్యూ మిస్ మ్యా టిక్స్, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో నిలవాలని భట్టి ఆకాంక్షించారు. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు జరిమానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది. రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. వారం లోపు చెల్లించాలని స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. జంట జలాశయాల సమీపంలో నిర్మాణాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.చివరి అవకాశం ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి 2 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా వేసింది. -
వీరన్న కుటుంబాన్ని ఆదుకునేదెవరు?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు భరోసా ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఖమ్మం రైతు బానోతు వీరన్న ఉదంతంపై తాజాగా ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న బలవన్మరణం చెందడం అత్యంత బాధాకరం. పండించిన పంటకు ధర రాక.. అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అంటూ పురుగుల మందు తాగుతూ వీరన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు ఓ నిదర్శనం.వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి అంటూ హరీష్‌రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఏ మున్సిపాలిటీ.. ఏ జోన్లోకి?
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగరపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమవుతుండటంతో సదరు మున్సిపల్ కార్యాలయాలిక జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలుగా రూపాంతరం చెందనున్నాయి. అక్కడి పురపాలక కమిషనర్లు.. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సదరు కార్యాలయా లు జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నాయి. ఆర్డినెన్స్, జీవోల ద్వారా ప్రభుత్వం విలీనం ప్రకటించగానే పురపాలికలు సర్కిళ్లుగా మారి దగ్గర్లోని సంబంధిత జోన్ల (కార్యాలయాల) పరిధిలోకి రానున్నాయి.ఆయా పుర/నగర పాలక సంస్థలు.. జీహెచ్ఎంసీ సర్కిళ్లుగా దిగువ జోన్ల పరిధిలోకి రానున్నాయి. ఎల్బీనగర్ జోన్: ఆదిబట్ల, మీర్పేట్, బడంగ్‌పేట, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, పీర్జాదిగూడ, పోచారం, ఘట్కేసర్, బోడుప్పల్. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్) సికింద్రాబాద్ జోన్: తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: ముషీరాబాద్, అంబర్పేట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట) కూకట్పల్లి జోన్: కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్, దుండిగల్, నిజాంపేట్, బొల్లారం. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: మూసాపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్) చార్మినార్ జోన్: బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్పల్లి, తుక్కుగూడ. (ప్రస్తుతమున్న సర్కిళ్లు: మలక్‌పేట్, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, చారి్మనార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్) శేరిలింగంపల్లి జోన్: అమీన్పూర్, తెల్లాపూర్,మణికొండ, నార్సింగి (ప్రస్తుతమున్న సర్కిళ్లు: యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్చెరు) ఆయా జోన్లపరిధిలో ప్రస్తుతమున్న సర్కిళ్ల సంఖ్య, విస్తీర్ణం వంటి వాటితోపాటు అంతిమంగా సదరు ప్రాంతాల్లో ఆయా పారీ్టల బలాబలాల వ ంటివి ప్రాధాన్యం వహించగలవని తెలుస్తోంది. విలీనానికి సంబంధించి గత నాలుగురోజులుగా కసరత్తు చేస్తున్న సీజీజీ, జీహెచ్ఎంసీ అధికారులు ఆయా సర్కిళ్లు, జోన్లు, వార్డుల మ్యాపుల పరిశీలనలు చేస్తున్నారు. సంబంధిత ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. మణికొండ ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశమున్నా.. ఇప్పటికే ఖైరతాబాద్ జోన్ ఎంతో పెద్దిదిగా ఉంది. శేరిలింగంపల్లి జోన్లో ప్రస్తుతం తక్కువ సర్కిళ్లున్నాయి. (ఖైరతాబాద్ జోన్ పరిధిలోని ప్రస్తుత సర్కిళ్లు: మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్). -
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025: నేటి నుంచి సీఎం సమీక్షా సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి సమీక్షా సమావేశాలు జరుగనున్నాయి. ప్రతి రోజు వేర్వేరు అంశాలపై అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.నవంబర్ 25 – సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సంబంధిత విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొని సమ్మిట్ నిర్వహణ, కీలక కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.నవంబర్ 26న లాజిస్టిక్స్, ఇతర ఏర్పాట్ల గురించి సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొంటారు. సమ్మిట్‌కు వచ్చే దేశీయ, విదేశీ ప్రతినిధుల రవాణా, నివాసం, భద్రత వంటి లాజిస్టిక్స్ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.నవంబర్ 27న జరగనున్న సమావేశానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. సమ్మిట్ వేదిక, రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్, అతిథి సదుపాయాలు మొదలైన మౌలిక వసతులపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు.నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు సీఎం, మంత్రి వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి పాల్గొని విద్యాసంస్థల భాగస్వామ్యం, యువజన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. దాంతో పాటు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పాల్గొని పర్యాటక ప్రోత్సాహక ప్రణాళికలను పరిశీలించనున్నారు.నవంబర్ 29న సాయంత్రం 4 గంటలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి పాల్గొనబోతున్నారు. రైతులకు కొత్త అవకాశాలు, సమ్మిట్‌లో అగ్రి–ఇన్నోవేషన్ సెషన్లపై చర్చించనున్నారు.సాయంత్రం 6 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్ పాల్గొని సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నారు.నవంబర్ 30న సీఎంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ టూరిజం అవకాశాలు, గ్లోబల్ హెల్త్ సెషన్లపై సమగ్ర సమీక్ష జరుగుతుంది. -
కొత్త డిస్కమ్‌పై తెలంగాణ సర్కార్ యూటర్న్!
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుపై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. నిర్దిష్ట అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పంపిణీ సంస్థలు ఇంధన శాఖకు తెలిపాయి. దీంతో ఇంధన శాఖ ప్రభుత్వానికి ఈ మేరకు నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు అదనంగా కొత్త డిస్కమ్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది.సంక్షేమ పథకాలైన వ్యవసాయ ఉచిత విద్యుత్, గృహజ్యోతి కనెక్షన్లను దీని పరిధిలోకి తేవాలని భావించింది. వాస్తవానికి డిస్కమ్ అనేది కొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. సంక్షేమ పథకాల కింద ఇచ్చే ఉచితాలు, తదితరాలు అన్ని డిస్కమ్‌ల పరిధిలోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటి కోసం ప్రత్యేకంగా డిస్కమ్ ఎలా అనే అంశంపై అధికారులు గందరగోళానికి గురయ్యారు. పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాత దీనిపై స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చారు.పాత డిస్కమ్‌ల రుణాలకు నిబంధనల అడ్డంకిడిస్కమ్ ఏర్పాటు ద్వారా రుణాలు పొందే ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కమ్‌లు అన్ని విధాల పూర్తిస్థాయిలో ఆర్థిక రుణాలు పొందాయి. ఇవే డిస్కమ్‌లు అవసరాల రీత్యా తిరిగి రుణాలు పొందడానికి కొన్ని నిబంధనలు (ఎఫ్ఆర్బీఎం) అడ్డంకిగా మారుతున్నాయి. రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 96,596 ఎంయూలు విద్యుత్ వినియోగం ఉంది. ఇది 2030 నాటికి 1.22 లక్షల ఎంయూలకు చేరే వీలుందని అంచనా వేస్తున్నారు.2033–24 నాటికి 1.30 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అయ్యే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌ను చేరుకోవడానికి విద్యుత్ సంస్థల సామర్థ్యం గణనీయంగా పెరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 440 కేవీ సబ్ స్టేషన్లు 9, 220 కేవీ సబ్స్టేషన్లు 34, 132 కేవీ సబ్ స్టేషన్లు 75 ఏర్పాటు చేయాలని డిస్కమ్‌లు భావించాయి.ఇందుకోసం ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు కలిపి రూ.32 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే కొత్త డిస్కమ్ ఏర్పాటే మార్గమనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. పీఎఫ్సీ, ఇతర ఆర్థిక సంస్థలు కొత్త డిస్కమ్‌లకు రుణాలు ఇచ్చే వీలుందని కన్సల్టెన్సీ సంస్థలు సలహాలిచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే ప్రత్యేక అవసరాల కోసం రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని రుణ సంస్థలు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు సమాచారం. -
అగ్రనేతలతో సహా లొంగిపోనున్న 37 మంది మావోయిస్టులు
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల లొంగుబాటు.. అగ్రనేతల ఎన్కౌంటర్లతో కకావికలం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ(నవంబర్ 22, శనివారం) భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. వీళ్లలో ముఖ్యనేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది దాకా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్తో మావోయిజం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని.. అభివృద్ధిలో భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌తో పాటు కీలక సభ్యులు రమేష్, అప్పాసి నారాయణ, ఎర్రాలు లొంగిపోతారని తెలుస్తోంది. వీళ్లిద్దరితో పాటు 20 మంది దాకా డివిజన్ ఏరియా కమిటీ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. అజాద్ 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదిలో.. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందారు. పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోయారు. ఇక.. అనారోగ్య కారణాలతో చంద్రన్న, బండి ప్రకాశ్ ఆయుధాలు వీడారు. మరో నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నాం డీజీపీ శివధర్‌రెడ్డి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.ప్రజాప్రతినిధులు బయట తిరగొద్దు!అల్లూరి: మారుడుమిల్లి ఎన్కౌంటర్ల నేపథ్యంతో రేపు ఏజెన్సీ బంద్, నిరసనలకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రంపచోడవరం వ్యాప్తంగా ఆంక్షలు విధించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులను ఏజెన్సీల్లో పర్యటించొద్దని.. వీళైతే మైదానాల్లోకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మరణించారు. -
ఓవర్ లోడ్ పట్టదా.. తీరు మారదా?
నవంబర్ 3: పరిమితికి మించిన కంకర లోడ్‌తో దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సు మీదకు దూసుకెళ్లడంతో 19 మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రవాణాశాఖ నవంబర్ 4 నుంచి 17 వరకు అంటే కేవలం 14 రోజుల వ్యవధిలో చేపట్టిన తనిఖీల్లో ఏకంగా 556 ట్రక్కులు ఓవర్‌లోడ్‌తో పట్టుబడటం గమనార్హం.సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించిన లోడుతో రోడ్డెక్కే వాహనాలను నియంత్రించాల్సిన బాధ్యత రవాణా శాఖది. కానీ, పరిమితికి మించి లోడ్ నింపి రోడ్డెక్కిస్తున్నది స్వయంగా మరో ప్రభుత్వ విభాగమే. అదే గనుల శాఖ. ఇసుక రీచ్‌లు, క్రషర్లలో ట్రక్కుల్లోకి పరిమితికి మించిన లోడు నింపుతున్నారు. ఆ లారీలకు అధికారికంగా ట్రాన్సిట్ పాస్‌లు జారీ చేస్తోంది స్వయంగా గనుల శాఖ అధికారులే. రాయల్టీ చెల్లిస్తే చాలు ఇసుక, కంకర తరలించేందుకు అనుమతిస్తున్నారు. కానీ, ట్రక్కుల్లో ఎంత కంకర తరలిస్తున్నారో తమకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విచిత్రమేంటంటే, ట్రక్కుల లోడు పరిమితితో సంబంధం లేకుండా అధిక లోడును నింపితే, ఆ లోడు ఎంతుందో కూడా ట్రాన్సిట్ పాస్‌లో పేర్కొంటున్నారు. అంటే, లారీ సామర్థ్యానికి మించి లోడును తరలించేందుకు అనుమతించినట్టు ఆ ట్రాన్సిట్ పాస్ జారీ ద్వారా గనుల శాఖ అంగీకరిస్తోంది. కానీ, అధిక లోడును నియంత్రించే బాధ్యత తమది కాదని, దాన్ని నియంత్రించాల్సింది రవాణాశాఖనే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక్కడే ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేక ఓవర్ లోడుతో ట్రక్కులు రోడ్డెక్కి అధిక వేగంతో దూసుకుపోతూ ఎప్పుడు ఎవరి ప్రాణాలను బలిగొంటాయో తెలియని భయానక వాతావరణం నెలకొంది. క్రషర్ల ఎదుట నిత్యం రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే, లోపలి నుంచి రోడ్డు మీదకు వచ్చే ట్రక్కుల్లో మూడొంతులు ఓవర్ లోడ్‌తో వస్తున్నవే దొరుకుతాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేవెళ్ల సమీపంలో జరిగిన ప్రమాదానికి ఓవర్‌లోడుతో దూసుకొచ్చిన ట్రక్కే కారణం కావటంతో, ఓవర్‌లోడ్ వాహనాలను రవాణా శాఖ పట్టించుకోవటం లేదని రాష్ట్రం మొత్తం దుమ్మెత్తి పోసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రవాణాశాఖ, ఆ మరుసటి రోజు నుంచే విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. 556 ట్రక్కుల్లో ఓవర్ లోడ్ ఉందని తేలింది. దీంతో వాటిల్లో మరీ ఎక్కువ లోడ్ ఉన్న 488 ట్రక్కులను సీజ్ చేసి రూ.85 లక్షల మొత్తాన్ని పెనాల్టీగా వసూలు చేశారు. ఇసుక రీచ్‌లు, క్రషర్లలో ట్రక్కుల్లోకి లోడ్ ఎక్కించేప్పుడే ట్రక్కుల సామర్థ్యానికి తగ్గట్టుగానే నింపితే ఈ సమస్యే రాదని, గనుల శాఖ దాన్ని పట్టించుకోకుండా ఆదాయాన్ని పొందటంపైనే దృష్టి సారించి పరిమితికి మించిన లోడుతో లారీలను రోడ్డెక్కిస్తోందని తాజాగా రవాణా శాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ సవాళ్ల సంగతేంటి...? ⇒ ప్రస్తుతం రవాణాశాఖలో వాహనాలను తనిఖీ చేసేందుకు ఎంవీఐలు, ఏఎంవీఐలు కేవలం 330 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలను ఇంత తక్కువ మంది తనిఖీ చేయటం సాధ్యం కాదు. ⇒ వేల కి.మీ. నిడివితో ఉన్న రోడ్లను మీద ఎన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసినా ఏదో ఓ చోట ఓవర్‌లోడ్ వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ⇒ ప్రతి రీచ్, క్రషర్ వద్ద తనిఖీలు చేస్తే సింహభాగం ట్రక్కులు అక్కడే దొరికి అవి రోడ్డెక్కటమే కుదరదు. ⇒ ట్రక్కులను పట్టుకున్న సందర్భాల్లో వాటిల్లోని లోడ్ ఎంతుందో గుర్తించాలంటే వే బ్రిడ్జి (బరువు తూచే వ్యవస్థ) అవసరం. అవి ఎక్కడో ఒకటి ఉండటంతో ఓవర్ లోడును వెంటనే గుర్తించటం కష్టంగా మారింది. ⇒ తనిఖీలో దొరికిన ఓవర్‌లోడ్ ట్రక్కులను సీజ్ చేయాలంటే, వాటిని ఎక్కడ ఉంచాలో అర్థం కాని దుస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్టాండ్లు, పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఇప్పటికే వీటితో నిండిపోయాయి. దీంతో సీజ్ చేయటం కష్టంగా మారింది. -
పర్యాటకులకు ప్రపంచ స్థాయి వసతి.. ‘తెలంగాణ టూరిజం హోమ్ స్టే’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం ‘తెలంగాణ టూరిజం హోమ్ స్టే’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రపంచ స్థాయి సేవలు, పరిశుభ్రమైన వసతి, కుటుంబ వాతావరణంలో స్థానిక సంప్రదాయాల అనుభవం లాంటి ఈ మూడు లక్ష్యాలతో ముందుకు వస్తున్న ఈ పథకం ద్వారా జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు , పర్యాటక గమ్యస్థానాల్లో వసతిని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణలోని సంప్రదాయ జీవన విధానాన్ని దగ్గరగా చూడటానికి, స్థానిక వంటకాల అద్భుత రుచిని ఆస్వాదించేందుకు ఈ హోమ్ స్టేలు ఉపయోగపడనున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ దీనిని ప్రమాణితమైన, భద్రత కలిగిన, సౌకర్యవంతమైన వసతి వ్యవస్థగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.హోమ్ స్టే కోసం వర్గీకరణ, పునర్వర్గీకరణ రుసుములుహోమ్ స్టేలు వెండి (Silver), బంగారం (Gold) వంటి రెండు వర్గాల్లో వర్గీకరించబడతాయి. వర్గీకరణ,పునర్వర్గీకరణ కోసం దరఖాస్తు రుసుములు:డిమాండ్ డ్రాప్ట్‌ను "కమిషనర్ / డైరెక్టర్ ఆఫ్ టూరిజం, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్" పేరుపై చెల్లించాల్సి ఉంటుంది. -
‘మీరాలం’ మిలమిల
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని మీరాలం చెరువును మిలమిలలాడే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారీ అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మీరాలం ట్యాంక్‌పై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బెంగళూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44) వద్ద శాస్త్రిపురం నుంచి చింతల్మెట్ వరకు ఐకానిక్ బ్రిడ్జ్‌ను నిర్మించనున్నారు. 2.5 కిలో మీటర్ల మేర నాలుగు లైన్ల మేర ఈ బ్రిడ్జి ఉంటుంది. వంతెన నిర్మాణ పనులను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ బిడ్డింగ్ దక్కించుకుంది. రూ.319 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్‌ను నిరి్మంచనున్నారు. ఈ మేరకు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో చేపట్టనున్న ఈ బ్రిడ్జ్ టెండర్‌కు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఆమోదించింది. గార్డెన్ ఆఫ్ బే తరహాలో.. మీరాలం ట్యాంక్‌పైన నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్‌ను సింగపూర్‌లోని గార్డెన్స్ ఆఫ్ బే తరహాలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వంతెన సందర్శకులకు భద్రతతో పాటు దృశ్యపరంగా ఆకర్షణీయంగా నిర్మించనున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు పక్కనే ఉన్న రెండు దీవులను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో బర్డ్ ప్యారడైజ్, వాటర్‌ఫాల్స్, అనువైన కన్వెన్షన్ సెంటర్లు, అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, యాంపీ థియేటర్లతో ఈ దీవులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. మీరాలం ట్యాంక్‌లో ఒకటి 5 ఎకరాలు, మరోటి 2.5 ఎకరాల విస్తీర్ణంలో రెండు దీవులు ఉన్నాయి. గతంలో ఇందులో రాష్ట్ర పర్యాటక శాఖ బోట్లను సైతం నడిపేది. మీరాలం ట్యాంక్‌ను నెహ్రూ జులాజికల్ పార్క్‌తో అనుసంధానించి..జూ గుండా మీరాలం ట్యాంక్‌కు మళ్లీ బోట్లను నడపాలని, దీవులను అభివృద్ధి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదీ మీరాలం చరిత్ర జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించక ముందు భాగ్యనగరవాసుల దాహార్తిని మీరాలం ట్యాంక్ రిజర్వాయర్ తీర్చేది. హైదరాబాద్ రాష్ట్ర మూడో నిజాం అసఫ్ జాహీ–2 హయాంలో అప్పటి హైదరాబాద్ పాలకుడు (1804–1808) మీర్ ఆలం బహదూర్ పేరును ఈ రిజర్వాయర్‌కు పెట్టారు. 1804 జులై 20న మీర్ ఆలం రిజర్వాయర్ నిర్మాణానికి పునాది వేశారు. దాదాపు రెండేళ్లలో 1806 జూన్ 8న నిర్మాణం పూర్తయింది. ఐకానిక్ బ్రిడ్జి ఇలా.. పొడవు: 2.5 కిలో మీటర్లు వెడల్పు: 16.5 మీటర్లు (నాలుగు లైన్లు) ఎక్కడి నుంచి ఎక్కడికి: బెంగళూరు జాతీయ రహ దారి వద్ద శాస్త్రిపురం నుంచి చింతల్మెట్ వరకు.. ఎవరికి ప్రయోజనం: ఈ వంతెనతో దక్షిణ హైదరాబాద్ వైపు ప్రయాణం సులువవుతుంది. సుమారు లక్ష మంది ప్రయాణికులకు ఈ వంతెన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎంఆర్డీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రాష్ట్రమంతటా భూముల సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సర్వే శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నియమించిన 3,500 మందికిపైగా లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇప్పటికే ఆ శాఖలో పనిచేస్తున్న సర్వేయర్లతో ఈ సర్వేను చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకుగాను రాష్ట్రంలోని అన్ని గ్రామీణ జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయాలని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి అక్టోబర్ మూడో వారంలోనే ఉత్తర్వులు వెళ్లాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే గ్రామాలను ఎంపిక చేసే కసరత్తు ప్రారంభించారు. అయితే, కలెక్టర్లు తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల జాబితాలో మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించిన మేరకు 200లోపు ఎకరాలున్న గ్రామాలు, సర్వే సమస్యలు తక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామాల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలలోనే సర్వేను పైలట్ పద్ధతిలో ప్రారంభిస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. హద్దుల నిర్ధారణ... భూదార్ జారీ భూముల సర్వేలో భాగంగా ప్రతి భూకమతానికి హద్దులు నిర్ణయించనున్నారు. డీజీపీఎస్ ద్వారా సేకరిచిన డాటాను క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూభారతి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, ఇందుకోసం సర్వే సిబ్బందిని వినియోగించుకోవాలని రెవెన్యూ శాఖ చెప్పింది. సర్వే అనంతరం ప్రతి భూకమతం హద్దులు నిర్ణయించడంతోపాటు ఆ కమతాలకు ఆధార్ తరహాలో భూదార్ కార్డులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న సర్వే అనంతర ఫలితాలను బట్టి రాష్ట్రమంతటా సర్వే నిర్వహిస్తామని అంటున్నారు. -
‘విద్యానిధి’ కఠినతరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత ఎక్కువ మొత్తంలో రాయితీ అందిస్తున్న పథకం ఓవర్సీస్ విద్యానిధి పథకం. దీనికింద ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల ఆధారంగా లబ్ధిదారులను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది. తాజాగా ఈ పథకం కింద కోటాను ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా గతేడాది వరకు 1100 మంది విద్యార్థులకు సాయం అందిస్తుండగా... తాజాగా కోటా పెంపుతో లబ్ధిదారుల సంఖ్య 1900కు పెరిగింది. దీంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అర్హుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సంక్షేమ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ప్రతి కేటగిరీలో మెరిట్ కీలకం విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించేందుకు బ్యాచ్‌లర్ డిగ్రీలో మెరుగైన మార్కులు, ఐఈఎల్టీఎస్/ టోఫెల్ పరీక్షలో మెరిట్ సాధిస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు పరిగణించి అర్హత కల్పించేవి. బీసీ సంక్షేమ శాఖలో మాత్రం పోటీ తీవ్రంగా ఉండటంతో మరింత లోతుగా మెరిట్‌ను పరిశీలించి అర్హతలు ఖరారు చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని సంక్షేమ శాఖలకు పోటీ తీవ్రం కానుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో 1:3 చొప్పున దరఖాస్తులు ఉంటే... బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1:20 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మూడు సంక్షేమ శాఖల పరిధిలో కోటాను భారీగా పెంచింది. తాజాగా సంక్షేమ శాఖలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా... క్షేత్రస్థాయి నుంచి స్పందన భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వడపోతకు సంక్షేమ శాఖలు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి. అభ్యర్థులను అన్ని కేటగిరీల్లోనూ మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ముందుగా అభ్యర్థి సాధించిన డిగ్రీ మార్కులను విశ్లేషిస్తారు. ఆ తర్వాత జీఆర్ఈ/జీమ్యాట్‌లో మార్కులను మెరిట్ ఆధారంగా పరిశీలిస్తారు. అనంతరం ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల్లోనూ మెరిట్ ఆధారంగా వడపోస్తారు. ఇందుకు సంబంధించి నిబంధనలను సంక్షేమ శాఖలు త్వరలో సవరించనున్నట్లు తెలుస్తోంది. -
ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ చెప్పలేకపోయారు
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుక్కి సీటు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. తాజాగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు శనివారం హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సంచలన ఆరోపణలే చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కేసీఆర్ కట్టిన భవనాల్లో వాళ్ల పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే వృద్ధి రేటు పడిపోయింది. రేవంత్‌కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు ఉండటం రేవంత్‌కు ఇష్టం లేదు. అందుకే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లి కూర్చుంటున్నారు. ఈ రెండేళ్లలో ఏం చేశారో రేవంత్ నిన్న చెప్పలేకపోయారు. 2004-2014 కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడుగుతున్నారు. పీజేఆర్ కొడుక్కి టికెట్ ఇవ్వని రేవంత్‌కు.. ఆయన పేరు తీసే నైతికత లేదు. పీజేఆర్‌ను మానసికంగా వేధించి చనిపోయేలా చేసిందే కూడా కాంగ్రెస్ పార్టీనే అని హరీష్‌రావు ఆరోపించారు. .. రేవంత్ రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధం. ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగితే ఎందుకు బయటకు రాలేదు?. భట్టి ఢిల్లీ వెళితే తెలంగాణ భవన్ లో ఉండరు. గురుగ్రామ్‌లోని అత్తగారి ఇంట్లో ఉంటారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే భట్టి ఇంట్లో జరిగిన ఐటీ రైడ్స్ బయటకు రాలేదు. భట్టి ఇంట్లో హార్డ్ డిస్క్ లు కూడా ఐటీ అధికారులు తీసుకెళ్ళారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి బయట ఉన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉంది. రేవంత్ ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయి అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
‘గ్యారంటీ’ల బండ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ‘గ్యారంటీ’ల గండం పట్టుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు చేస్తున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా గ్యారంటీలు ఇవ్వటంతో పరిస్థితి విషమించింది. అధికారిక అప్పులకు తోడు లెక్కల్లోకి రాని ఈ ‘గ్యారంటీ’ అప్పులు కొండలా పేరుకుపోయాయి. గ్యారంటీ అప్పుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది. ఇది చాలా ప్రమాదకరమైన ఆర్థిక నిర్వహణ అని హెచ్చరించింది. గ్యారంటీ అప్పులు జీఎస్డీపీలో ఏకంగా 15.1 శాతానికి చేరాయని వెల్లడించింది. నిధులన్నీ సంక్షేమం, సబ్సిడీలకే పోతున్నాయని.. భవిష్యత్తుకు కీలకమైన విద్య, వైద్య రంగాలను గాలికి వదిలేశారని తూర్పారబట్టింది. బడ్జెట్ అంచనాలు ఏకంగా 21 శాతం గల్లంతవుతుండటం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది. అప్పుల ఊబిలోకి రాష్ట్రం.. ‘స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్’నివేదిక తెలంగాణ రాష్ట్ర ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇచ్చిన గ్యారెంటీలు జీఎస్డీపీలో 15.1 శాతానికి చేరగా, ఇందులో సింహభాగం (37%) నీటిపారుదల రంగానికే ఉండటం గమనార్హం. దేశంలో మరే రాష్ట్రం ఇంతటి భారీ గ్యారెంటీలను ఇవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ గ్యారెంటీలకు తోడు, 2025 మార్చి నాటికి అధికారిక అప్పులు సైతం జీఎస్డీపీలో 26 శాతానికి చేరాయి. ఇది ఎఫ్ఆర్బీఎం కమిటీ నిర్దేశించిన 20% పరిమితి కంటే చాలా ఎక్కువ. రాష్ట్రం బడ్జెట్ వెలుపల చేసే అప్పులు కూడా కొనసాగుతున్నాయి. 2024–25లో ఇవి రూ.2,697 కోట్లుగా ఉన్నాయి. కాగితాలపై కోటలు.. వాస్తవాలకు బీటలు పీఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 2015–23 మధ్య కాలంలో బడ్జెట్లో వేసిన అంచనాలకు, వాస్తవంగా వచ్చిన ఆదాయానికి మధ్య ఏకంగా 21% వ్యత్యాసం (లోటు) కనిపించింది. దేశంలో అత్యంత దారుణమైన పనితీరులో ఇది ఒకటి అని నివేదిక పేర్కొంది. కాగితాలపై కోటలు కట్టడం, తీరా ఆదాయం రాకపోవడంతో.. చివరకు అభివృద్ధి పనులకు భారీగా కోత పెట్టాల్సి వస్తోంది. ఇదే కాలంలో రాష్ట్రం తన మూలధన వ్యయంలో 12% కోత విధించింది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో బలంగా ఉంది. మొత్తం ఆదాయంలో 77% సొంత వనరుల (63% సొంత పన్నులు, 14% పన్నేతర ఆదాయం) నుంచే వస్తోంది. జీఎస్డీపీలో సొంత పన్నుల వాటా 8.1%గా ఉంది. ఆదాయం ఇలా బలంగా ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రణాళిక మాత్రం దారుణంగా విఫలమవుతోంది. విద్య, వైద్యానికి మంగళం: రాష్ట్ర ఖజానాలో సంక్షేమం, సబ్సిడీలకు పెద్ద పీట వేస్తున్న క్రమంలో కీలకమైన మౌలిక రంగాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. రెవెన్యూ ఆదాయంలో 14% సబ్సిడీలకే పోతోంది. ఇందులో సింహభాగం 76% కరెంట్ సబ్సిడీలకే వెళ్తుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమానికి బడ్జెట్లో 12.4% వాటా ఇచ్చి దేశంలో రెండో స్థానంలో నిలిచారు. కానీ, భవిష్యత్ తరాలను నిర్మించే కీలక రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజారోగ్యంపై తెలంగాణ తన బడ్జెట్లో 4.8% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది దేశంలోనే అత్యల్పం. విద్యారంగానికి చేసిన కేటాయింపులు 9.0% మాత్రమే. ఇది కూడా దేశంలోనే అత్యంత తక్కువ కావడం గమనార్హం. మౌలిక వసతులైన రోడ్లు, వంతెనల కోసం ఖర్చు చేస్తున్నది 1.9% మాత్రమే. సొంత ఆదాయం బలంగా ఉన్నా ఆ డబ్బంతా సబ్సిడీలకే పోతుండటం, మరోవైపు గ్యారెంటీల పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం రాష్ట్రాన్ని ప్రమాదపు అంచున నిలబెట్టిందని నివేదిక హెచ్చరించింది. కీలకమైన విద్య, వైద్యం కుంటుపడటంతో రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని నివేదిక పేర్కొంది. -
ఒప్పుకోవడమా? ఒత్తిడి పెంచడమా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను దారికి తేవాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఎలాగైనా బకాయిలు రాబట్టుకోవాలనే యోచనలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా ప్రైవేట్ కాలేజీలన్నీ మూతపడ్డాయి. కాలేజీల వద్ద సిబ్బంది ఆందోళనలు కొనసాగాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలో జరుగుతున్న ఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రైవేట్ కాలేజీలు నిర్వహించలేదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం (ఫతి) పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటోంది. ఇంకో వైపు పరిస్థితిపై అధికార యంత్రాంగం చర్చోపచర్చలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫతి నేతలకు ఫోన్లు వెళ్లాయి. ‘ముందు కాలేజీలు తెరవండి..సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’అనే సందేశాలు ఫతి నేతలకు వచ్చాయి. దీపావళిలోగా ఇస్తామన్న రూ.900 కోట్లు ఇవ్వాలని, మిగిలిన బకాయిలు ఎప్పుడిస్తారో జీఓ ద్వారా తెలియజేయాలన్నది యాజమాన్యాల డిమాండ్. ఉన్నతాధికారుల మంతనాలు సీఎస్ రామకృష్ణారావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా, దేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బంద్‌లో ఏఏ కాలేజీలు పాల్గొన్నాయో ఆరా తీశారు. ఫతిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలు సేకరించారు. అంతకు ముందు ఫతికి చెందిన ఇద్దరు నేతలతో డిప్యూటీ సీఎం ఫోన్ ద్వారా రహస్య మంతనాలు జరిపినట్టు తెలిసింది. బంద్‌కు దూరంగా ఉండే కాలేజీల పట్ల భవిష్యత్‌లో సానుకూలంగా ఉంటామనే సంకేతాలు పంపినట్టు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఫతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..అధికారులు క్షేత్రస్థాయిలో కాలేజీల వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ఏ కాలేజీలో ఎలాంటి అవకతవకలున్నాయనే నివేదిక రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. ముదురుతున్న ఆందోళన ఈ నెల 8వ తేదీన దాదాపు 30 వేల మంది కాలేజీల సిబ్బందితో, 11వ తేదీన లక్షకుపైగా విద్యార్థులతో సభ నిర్వహిస్తామని ఫతి ప్రకటించింది. ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితి హింసాత్మకంగా మారే అవకాశం లేకపోలేదని నిఘా వర్గాలు అంటున్నాయి. ఫతిలో కొంతమంది ప్రభుత్వ అనుకూల ధోరణి ఉన్నా, ఎక్కువ మంది వ్యతిరేక ధోరణితో ఉన్నారు. వీరికి కొన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉందనేది నిఘా వర్గాల సమాచారం. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది, విద్యార్థులను రాజధానికి తరలిస్తే అవాంఛనీయ ఘటనలు జరగొచ్చని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రదర్శనలకు అనుమతి నిరాకరించినా, ఆందోళన మరోరూపం దాల్చే వీలుందనే అనుమానం పోలీసు వర్గాల నుంచి వస్తోంది. దీన్ని వాయిదా వేయించేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఫతి మాత్రం తమ సత్తా చూపించుకోవడానికి ఇది వేదికగా భావిస్తోంది. రీ ఎంబర్స్‌మెంట్‌పై కమిటీ ఫీజు రీయింబర్స్మెంట్ హేతుబద్ధీకరణ, ఉన్నతవిద్య బలోపేతానికి ప్రభుత్వం కమిటీ వేసింది. గత నెల 28వ తేదీనే ఇందుకు సంబంధించిన జీఓ వచ్చినా, మంగళవారం దీన్ని హడావిడిగా వెలుగులోకి తెచ్చింది. సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక, విద్య, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ శాఖల కార్యదర్శులతోపాటు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఎస్సీ డెవలప్మెంట్ విభాగం కమిషనర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాంను సభ్యులుగా చేర్చారు. ఫతి నుంచి ఎన్.రమేశ్‌బాబు, కేఎస్.రవికుమార్, డాక్టర్ కే.రామదాస్‌కు సభ్యులుగా చోటు కల్పించారు. ట్రస్ట్ బ్యాంకు ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వహణ, హేతుబద్ధీకరణ, ఫీజు రీయింబర్స్మెంట్ విధానం, ఉన్నతవిద్యలో నాణ్యత పెంపుపై ఈ కమిటీ చర్చించి మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది.


