1,000 పేజీలతో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక | Kaleshwaram Commission Submitted Final Report To Telangana Govt Details | Sakshi
Sakshi News home page

1,000 పేజీలతో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక

Jul 31 2025 12:40 PM | Updated on Jul 31 2025 12:56 PM

Kaleshwaram Commission Submitted Final Report To Telangana Govt Details

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌ తెలంగాణ ప్రభుత్వానికి తన తుది నివేదిక సమర్పించింది. గురువారం బీఆర్‌కే భవన్‌కి వచ్చిన కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌.. షీల్డ్ కవర్‌లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్‌ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. 

కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్‌కు అందజేస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement