సిద్ధిపేట: జిల్లాలోని నర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు(గురువారం, మార్చి 19వ తేదీ) ఇక్కడ ఏర్పాటు చేసిన రైతుమేళా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకుంది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ప్రధాన కార్యక్రమంగా ఈ రైతుమేళాను ఏర్రాటు చేయగా, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు. ఆ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
బీఆర్‌ఎస్ శ్రేణులను హరీష్‌రావు వారించగా, కాంగ్రెస్ కార్యకర్తలను మంత్రులు పొన్నం, తుమ్మలలు వారించారు. గొడవ చేస్తున్న వారిని బయటకు పంపించేయాలని పొన్నం సూచించారు.
రైతుమేళా ఉద్దేశ్యం
ఆధునిక వ్యవసాయ సాంకేతికత ప్రదర్శన
పంటల వైవిధ్యం (వరి నుండి ప్రత్యామ్నాయ పంటలకు మార్పు)
వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు ప్రదర్శన
హార్టికల్చర్, పశుసంవర్ధక, కోళ్లు, వెటర్నరీ సేవలు
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ (IFS) పై అవగాహన
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్
నిర్మాణ వ్యయం: రూ. 300 కోట్లు
ప్రయోజనం: రైతులకు ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిరమైన ఆదాయం
ప్రభుత్వ లక్ష్యం: పంటల వైవిధ్యం పెంచడం, ఎగుమతులు ప్రోత్సహించడం
రైతుమేళా రైతులకు కొత్త సాంకేతికతలు, పంటల మార్పు అవకాశాలు చూపించడానికి వేదిక.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 22వ తేదీన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు.


