breaking news
Kaleshwaram Commission
-
సీబీఐ చేతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: సీబీఐ చేతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటనపై ప్రాధాన్యత నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఈ నెల 1న సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ క్రమంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ రావడం చర్చాంశనీయంగా మారింది. -
కాళేశ్వరం తలనొప్పి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్‌రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్‌రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్‌కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు. జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు. అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కాళేశ్వరం సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు స్పల్ప ఊరట లభించింది. కాళేశ్వరం సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా.. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్‌రావు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సుందరం, శేషాద్రిలు తమ విజ్ఞప్తిని కోర్టుకు తెలియజేశారు. అయితే.. ఈ కేసును సీబీఐకి ఇవ్వనున్నట్లు అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ‘‘కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఆధారంగా సీబీఐకి సిఫార్సు చేశాం. మొత్తం దర్యాప్తు చేయాలని సీఐబీని కోరాం కమిషన్‌తో సంబంధం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ’’ అని ఏజీ అన్నారు. ఈ క్రమంలో సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను కోర్టుకు అందజేశారాయన.దీంతో కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే దసరా వెకేషన్ తర్వాత ఈ పిటిషన్లపై వాదనలు వింటామని పేర్కొంటూ.. అప్పటిదాకా ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఏజీకి స్పష్టం చేసింది. ఈ పిటిషన్ల తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ రాసింది. కాళేశ్వరంతో పాటు అంతరాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రేమయంపైనా విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని సైతం లేఖలో వెల్లడించింది. ఇంకా ఆ లేఖలో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని.. ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్డీఎస్ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. మరోవైపు రాష్ట్రానికి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈలోపు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు బ్రేకులు పడ్డట్లయ్యింది. -
రేవంత్.. కొండను తవ్వి ఎలుకను పట్టారా?: లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా? అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సీబీఐకి అప్పగించాలి. 22 నెలల తర్వాత రేవంత్‌కు కనువిప్పు కలిగింది. ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా?. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. నెహ్రు నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేశారు. కాలయాపన కొరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలి. లేదంటే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలి. కాంగ్రెస్ బీసీ బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఒక్కసారేమో ఆర్డినెన్సు అన్నారు. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అసలు న్యాయపరమైన చిక్కులకు మీరు తీసుకున్న చర్యలు ఏంటి?. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. బీసీల కొరకు సర్వే చేశారా? ముస్లిం కొరకు సర్వే చేశారా?. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాస్ అయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీజేపీ బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
హరీష్‌రావు పిటిషన్.. ప్రభుత్వాన్ని ఆదేశించలేమన్న హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను హరీష్‌రావు దాఖలు చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు.. లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ చేపడతామని ధర్మాసనం చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. -
‘‘మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్‌పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్‌ను కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన. -
చర్చ లేకుండానే బీసీ బిల్లుకు మండలి ఆమోదం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు చేరి ‘‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఆ ఆందోళనల నడుమే బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ 2025 బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. అయితే.. ఈ పరిణామంతో బీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. కాళేశ్వరం ప్రతులను చించేసి మండలి చైర్మన్ మీదకు విసిరేశారు. దీంతో.. మంత్రి పొన్నం బీఆర్ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఫ్యూడలిస్ట్ పార్టీ. బీసీల అంశం చర్చకు వస్తె.. ఇలా అడ్డుపడటం సరికాదు. బీసీల పట్ల వాళ్లకున్న గౌరవం, వైఖరి స్పష్టమవుతోంది. సమాజం వాళ్లను గమనిస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకండి. సర్వేలో కూడా పాల్గొనలేదు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలా అడ్డుకోవడం ఏం పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీ పార్టీకి బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఇలా అడ్డుకునే కుట్ర మాత్రం దౌర్భాగ్యం అని మంత్రి పొన్నం అన్నారు. సభలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్కు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో వాళ్ల బంధం తెగిపోయింది. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టిఆర్ఎస్కు తెలంగాణ మాట పలికే అర్హతను కోల్పోయింది అని అన్నారామె.అయినా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగడంతో.. చర్చ లేకుండానే పంచాయతీ చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. -
ఎర్రవల్లికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. కేసీఆర్‌తో కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్నారు. కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక, పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం. -
తెలంగాణకు మళ్లీ సీబీఐ.. ప్రభుత్వ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు నిర్ణయించింది. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రత్యేక ప్రొసీజర్‌ను తీసుకువచ్చారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకపై ఉన్న నిషేధ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాగా, 2022లో సీబీఐ రాకపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. -
కాళేశ్వరం నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే!
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని, అందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని తీసుకున్న నిర్ణయం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరిదేనని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఆయనదే. ప్రాజెక్టు అంకురార్పణ దశ నుంచి ప్రతి నిర్ణయాన్ని ఆయనే స్వయంగా తీసుకున్నారు.డీపీఆర్‌ల తయారీ వ్యాప్కోస్‌కు అప్పగింత, తుది డీపీఆర్ అందకముందే అంచనాలను తయారు చేసి ఆమోదించడం, బరాజ్‌లలో నీరు నిల్వ చేయాలని ఆదేశించడం, కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించేలా నిబంధనలు మార్చాలని ఆదేశించడం వెనక ఆయన నిర్ణయాలే ఉన్నాయి. మూడు బరాజ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు, నిర్మాణం, నిర్వహణలో నాటి సీఎం సూక్ష్మంగా భాగస్వాములయ్యారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ మార్చాలనే నిర్ణయం ఆయనదే.రాజకీయ కార్యనిర్వాహకుడిగా వ్యవహరించాల్సిన నాటి సీఎం.. పాలనాఅధికారిగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఆయనపై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ సర్కారుకు ఉంది’అని కమిషన్ సిఫారసు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఆదివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నివేదిక 665 పేజీలతో 3 సంపుటిలుగా ఉంది. నాటి ఆర్థిక మంత్రి (ఈటల) తన బాధ్యతలను ఆదమరిచి నాటి సీఎం కోరికలు తీర్చుకునేందుకు సహకరించారని తప్పుబట్టింది. నివేదికలోని ముఖ్యాంశాలుమంత్రివర్గ ఆమోదం లేకుండానే : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి 2016, మార్చి 1న మూడు జీవోలు (నెం.231, 232, 233) జారీ చేశారు. ఆ తర్వాతి దశలోనూ మంత్రివర్గం నుంచి ర్యాటిఫికేషన్ పొందలేదు. నాటి సీఎం(కేసీఆర్), మాజీ నీటిపారుదల మంత్రి (హరీశ్) మాత్రమే ఆమో దించారు. ప్రభుత్వ బిజి నెస్ రూల్స్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ పరిపాలనపర అనుమతుల జారీ చేశారు. ⇒ టర్న్ కీ విధానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని వ్యాప్కోస్ చేసిన సిఫారసులను కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కైఐపీసీఎల్) విస్మరించింది. ప్రాజెక్టు రూపకల్పన, మదింపు, ఆమోదించడం, నిధుల విడుదల, అమలు బాధ్యత, నిర్వహణ, పర్యవేక్షణ, మూల్యాంకనానికి కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేయగా, ఈ ప్రక్రియల్లో కేఐపీసీఎల్‌ను ప్రభుత్వం భాగస్వామ్యం చేయలేదు. కేవలం నిధుల సేకరణ, బ్యాంకులు, ఆర్థిక సంస్థ నుంచి రుణాల సమీకరణ, నిర్మాణ సంస్థలకు బిల్లుల చెల్లింపులకే కేఐపీసీఎల్‌ను సర్కారు పరిమితం చేసింది. ⇒ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు అనేక మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చారని నీటిపారు దల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. నాటి సీఎం అధ్యక్షతన నిపుణులతో నిర్వహించిన చాలా సమావేశాల్లో కట్టడాల రకం, వాటి సామర్థ్యం, లొకేషన్, ప్లాన్ అలైన్‌మెంట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి గూగు ల్ మ్యాప్‌లను విస్తృతంగా వినియోగించారు. ‘2015, ఫిబ్రవరి 4న మహారాష్ట్ర, ఏపీతో జరిగిన భేటీలో తమ్మిడిహెట్టి బరాజ్ ఎత్తు తగ్గించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. 2016, ఆగస్టు 23న జరిగిన భేటీలో.. మేడిగడ్డ బరాజ్ ఎత్తు పెంపుపై వాస్తవ ముంపు మేరకు అంత్రరాష్ట్ర బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయించారు. ⇒ 2016, మార్చి 1న మూడు బరాజ్‌ల నిర్మాణానికి జీవోలు జారీ అయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల నిర్మాణానికి హైపవర్ కమిటీ సిఫార్సు చేయలేదు. ⇒ తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ వద్ద బరాజ్‌ల నిర్మాణంతో లాభనష్టాలను నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం సరికాదని, ఆర్థికంగా ప్రయోజనకరం కాదని సూచించింది. ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద నిర్మాణం చేపట్టాలని ప్రత్యామ్నాయం చూపింది. ఈ నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోగా, కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఇది ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. ⇒ 2016, మార్చి 7న జీవో నంబర్ 655 ప్రకారం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌లకు ప్రతిపాదించలేదు. ⇒ 2015, ఏప్రిల్ 13న మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ వరకు డీపీఆర్ రూపొందించే బాధ్యతను వాప్కోస్కు అప్పగిస్తూ రూ.5.94కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేశారు. ఈ నోట్ ఫైల్‌ను నాటి సీఎం, నీటి పారుదల మంత్రి ఆమోదించారు. అదే ఏడాది జూన్ 3న దీన్ని కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే 2016 జనవరిలో అంచనాలను రూ.6.77 కోట్ల పెంచారు. ⇒ ఎల్లంపల్లి–మేడిగడ్డ మధ్య రెండు బరాజ్‌ల నిర్మాణానికి డీపీఆర్ తయారీ కోసం 2016 మార్చిలో రూ.12.96 కోట్లతో వ్యాప్కోస్‌కు పనులు అప్పగి స్తూ పరిపాలన అనుమతులిచ్చారు. వాప్కోస్ డీపీఆర్ సమర్పించిందా? లేదా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. ⇒ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, 3 విద్యుత్ కేంద్రాలకు సంబంధించి డీపీఆర్‌లోని కొంత భాగాన్ని జనవరి, 2016లో.. మార్చి 27న తుది డీపీఆర్ సమర్పించింది. ⇒ అనుమతులు జారీ చేసి తర్వాతి జూలై/ఆగస్టు నెలల్లో కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. 2017 ఫిబ్రవరిలో డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపించారు. ⇒ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు నీటిలభ్యతపై 2015 లో, కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత విషయంలో 2017లో సీడబ్ల్యూసీ రాసిన లేఖల్లో అంశాలు ఒకే లా ఉన్నాయి. 2015లో సీడబ్ల్యూసీ రాసిన లేఖ ఆధారంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాదని భావనకు వస్తే.. 2017లో రాసిన లేఖ ఆధారంగా మేడిగడ్డ బరాజ్ నిర్మాణం సైతం సాధ్యం కాదు. ⇒ 2018, మే 1 నాటికి సీడబ్ల్యూసీ కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక వ్యయాన్ని ఆమోదించకుండా అధ్యయనం జరుపుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2018, మార్చిలో ప్రాజెక్టు అంచనాలను రూ.30,623.72 కోట్ల నుంచి రూ.80,190.46 కోట్లకు పెంచేసింది. ⇒ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్‌తో అధ్యయనం జరిపించాల్సి ఉండగా, పనులు తు దిదశలో ఉన్నప్పుడు జరపాల్సిన అవసరం లేదని ఈ విభాగ డైరెక్టర్ 2018, మే 21న లేఖ రాశారు. ⇒ సీడబ్ల్యూసీ నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే, ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనకు దర ఖాస్తు చేసుకోకుండానే 2016, మార్చి 1న పరిపాలన అనుమతులు మంజూరు చేయడమే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ⇒ సవరించిన పరిపాలన అనుమతులపై సీఎం, మంత్రి ముందు నోట్‌ఫైల్ ఉంచడానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ 2018, మే 19న ఆమోదం తెలిపారు. అత్యవసర దృష్ట్యా ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. అదే నెల 27న కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ముందస్తు ఆమోదం లేకుండా అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడ్డారు.⇒ నిర్దేశిత గడువుతో పోల్చితే మేడగడ్డ నిర్మాణానికి 6 రెట్లు, అన్నారానికి 5 రెట్లు, సుందిళ్లకు 8 రెట్లు సమయం ఇచ్చారు. సైట్ అప్పగింత, డిజైన్ల కారణంగానే ఆలస్యం జరిగిందని కాంట్రాక్ట్ సంస్థల వాదనకు అధికారులు అంగీకారం తెలిపారు. ఒప్పందంలోని క్లాజ్ 26, 31లను అధికారులు ఉల్లంఘించారు. ఆలస్యమైనా ఎలాంటి జరిమానా విధించలేదు. 2017, మార్చి వరకు నిర్మాణ స్థలాన్ని అప్పగించలేదు. ⇒ ఫీల్డ్ అధ్యయనాలు, పరిశోధనలు చేపట్టకుండానే బ రాజ్‌ల డిజైన్లను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ త యారు చేసింది. డిజైన్ల తయారీకి ముందు కనీసం 3డీ, 2డీ మోడల్ స్టడీస్ కూడా నిర్వహించలేదు. ⇒ బరాజ్‌ల పేరుతో నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు/డ్యామ్స్‌గా నిర్మించారు. నీటిని మళ్లించేందుకు విని యోగించే బరాజ్‌లను నీటిని నిల్వ చేసే అవసరాలకు వాడినట్టు అధికారులు అంగీకరించారు. కాని వాటిని రిజర్వాయర్లు/డ్యామ్‌లుగా డిజైన్ చేయలేదు. ఈ కారణంతోనే అవి విఫలమయ్యాయి. ⇒ క్వాలిటీకి సంబంధించి కమిషన్‌కు సమర్పించిన రిజిస్టర్లు, పుస్తకాల్లో కొన్ని అదనంగా పేజీలు పిన్ చేయడం, కొన్ని టై చేయడం చేశారు. పేజీల సంఖ్య క్రమానుగుణంగానే లేదు. ⇒ 2019, ఆగస్టు 6న మేడిగడ్డ ‘కంప్లీషన్ సరి్టఫికెట్’ జారీ చేయమని ఏజెన్సీ కోరడం..సరి్టఫికెట్ అధికారులు జారీ చేయడం తప్పు. బాధ్యతాలోపం కా లాన్ని ఏజెన్సీ తప్పుగా ప్రస్తావించింది. ఒప్పందం ముగిసిపోయినట్టు ఎలాంటి సరి్టఫికెట్ జారీ కానందున మేడిగడ్డ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కానట్టే లెక్క. దీని కారణంగా లోపాలకు బాధ్యతాకాలం, ఆపరేషన్, నిర్వహణ కాలం నిర్ధారించలేదు. ⇒ అధికారులు, ఏజెన్సీలు ఒకరితో ఒకరు కుమ్మక్కై దురుద్దేశంతో చెడు మార్గంలో అక్రమ లబ్ధి పొందేందుకు పనిచేశారు. తద్వారా మేడిగడ్డ నిర్మాణానికి ప్రజాధనం భారీగా ఖర్చు చేశారు. ⇒ డీపీఆర్ తయారీని వాప్కోస్కు అప్పగిస్తూ జీవో జారీకి సంబంధించి నోట్‌ఫైల్‌పై నీటి పారుదల మంత్రి , ముఖ్యమంత్రి సంతకాలున్నాయి. జీవో జారీ చేసిన తర్వాత కేబినెట్ ఆమోదించింది. ⇒ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు పరిపాలన అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా, నోట్ ఫైల్‌పై వీరి సంతకాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థికమంత్రి సంతకం లేదు. ⇒ పరిపాలన అనుమతి (2016, మార్చి 1) తర్వాతే కేబినెట్ సబ్ కమిటీ (2016, మార్చి 15) ఏర్పాటైంది. 3సార్లు భేటీ అయ్యి నివేదిక అందజేసింది. -
చర్యలన్నీ అప్పుడే.. కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్, మున్సిపల్ బిల్లుల సందర్బంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు.. కాళేశ్వరం రిపోర్టుపై ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చర్చ జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం రిపోర్టుపై సాయంత్రం చర్చ జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హౌస్‌లో ఫ్లోర్ లీడర్లకు హార్డ్ కాపీ ఇచ్చాం. మెంబర్స్ అందరికీ సాఫ్ట్ కాపీనే ఇచ్చాం. సభలో సాయంత్రం చర్చ ఉంటుంది. ఎంత ఆలస్యం అయినా ఈ రోజు సభలో కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుంది. కేసీఆర్ తరఫున హరీష్ రావుకి కాపీ ఇచ్చాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటాం. కోర్టు విషయాలపై మాట్లాడను. సభలోనే అన్ని మాట్లాడతాం. చర్చ తర్వాతనే తదుపరి విచారణ ఏంటి దానిపై నిర్ణయం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
కాళేశ్వరం కమిషన్ నివేదిక.. సీఎం, అధికారులపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారు. ఈ సందర్బంగా కమిషన్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది.కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రకారం..‘ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగింది. మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగానే మూడు బ్యారేజీలలో భారీగా డామేజ్ జరిగింది. క్వాలిటీ కంట్రోల్ విషయంలో నిర్మాణ సంస్థలు ప్రభుత్వాన్ని ప్లేట్ చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజీ నిర్మాణాలకు బడ్జెట్ విడుదల అయింది. మూడు బ్యారేజీల ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణాన్ని మినిట్ టూ మినిట్ సీఎంకు ఫాలో అప్ చేశారు. మేడిగడ్డ నిర్మాణం కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడిగడ్డ నిర్మాణం జరిగింది. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇతర అంశాలపై క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకపోవడం నిబంధనలకు విరుద్ధమే అవుతుంది అని తెలిపింది.ఇదే సమయంలో అధికారులు తప్పిదాలను కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఎత్తి చూపింది. అధికారులు తప్పు చేసినట్లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు రిపోర్టులో పేర్కొంది. పలువురు చీఫ్ ఇంజనీర్లు కమిషన్ ముందు సరైన ఆధారాలు చూపించలేదని తెలిపింది. కమిషన్ రిపోర్టులో కేసీఆర్ పేరు కాకుండా చీప్ మినిస్టర్ పేరుతో రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు పెంచి ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు. అధికారులు జోషి హరిరామ్, మురళీధర్‌పై చర్యలు తీసుకోవాలి అని ఆరోపించింది. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. గన్‌పార్క్ వద్ద ఆందోళన
తెలంగాణలో కాళేశ్వరం కమిషన్‌పై రిపోర్టు నేపథ్యంలో సభలో వాడీవేడి చర్చ జరిగే..... -
ఎట్ల చేద్దాం? అటు ఎర్రవల్లి ఫాంహౌస్‌కి బీఆర్ఎస్ లీడర్లు.. ఇటు బీజేఎల్పీ కీలక భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు కీలక సమావేశం నిర్వహిస్తున్నాయి. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సెషన్‌ను నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే కాళేశ్వరం అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ చర్చకు దూరంగా ఉంటారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ తరుణంలోనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆయన కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తోంది.ఇక.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం నడుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నారు. అయితే మీటింగ్ మధ్యలో ఎమ్మెల్యేల ప్రయారిటీ అంశాన్ని కొందరు చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉందని.. రాష్ట్ర కమిటీలో తాము ఇచ్చిన పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యేలు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.కాళేశ్వరం కమిటీ నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ రేపటి నుంచి ప్రత్యేకంగా భేటీ కానుంది. శనివారం ఉదయం 10.30గం.లకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నివాళులర్పించిన అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆపై బీఏసీ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నా సమయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. వీలును బట్టి.. నాలుగు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికను కేసీఆర్, హరీష్‌రావు సవాల్ చేశారు. వేర్వేరుగా రెండు రిట్ పిటిషన్లను వారు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ విధంగా కావాలో కమిషన్ నివేదిక అదేవిధంగా ఇచ్చిందని.. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు కేసీఆర్, హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.కాగా, మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం. బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. -
ఆ 665 పేజీల నివేదిక ఇవ్వండి: సీఎస్‌తో హరీశ్ భేటీ
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. ఈ మేరకు నేడు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) సీఎస్‌తో సమావేశమయ్యారు హరీశ్. స్వల్ప సమయం పాట మాత్రమే సీఎస్‌తో భేటీ అయిన హరీశ్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే 665 పేజీల నివేదిక ఇచ్చిందో దాన్ని తమకు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంచితే, కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలంగాణ ప్రభుత్వం సృష్టం చేసిన సంగతి తెలిసిందే.‘ ఊరు, పేరు మార్చి అంచనాలు మించి కట్టిన ప్రాజెక్టు కూలిందని, కాశేళ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది దీనిలో భాగంగా ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే పరిశీలించాలనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఆ నివేదికను తీసుకుని అసలు కమిషన్ ఏం చెప్పింది అనే అంశాన్ని అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ భావనగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెబుతున్న బీఆర్ఎస్.. అది కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
-
‘కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెడుతున్నాం’
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీకి రాబోతుందని ఆయన తెలిపారు. తెలంగాణ కేబినెట్ అనంతరం సీఎం రేవంత్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ‘ ఊరు, పేరు మార్చి అంచనాలు మించి కట్టిన ప్రాజెక్టు కూలింది. కాశేళ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజాప్రతినిధులకు కమిషన్ నివేదిక ప్రతులను అందిస్తాం. స్వేచ్ఛగా అందరూ అభిప్రాయాలు చెప్పొచ్చు’ అని పేర్కొన్నారు.అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం కావడానికి సూక్ష్మంగా అప్పటి సీఎం కేసీఆరేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన విషయాలు అబద్ధాలు అనేది కమిషన్ రిపోర్ట్‌తో బయటపడింది. మూడు బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ సొంత, ఏకైక నిర్ణయం అంటూ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఈటెల రాజేందర్ సైతం కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పింది అవాస్తవం అనేది కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తేలింది. ఇది మా వ్యతిగత అభిప్రాయం కాదు...ఘోష్ కమిషన్ రిపోర్ట్ మాత్రమే’ అని ఆయన పేర్కొన్నారు. -
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం
-
కాళేశ్వరం నివేదికపై స్పందించిన కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందించారు. సోమవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ కీలక నేతలతో భేటీ అయిన ఆయన.. కమిషన్ నివేదికను, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ‘‘అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్. ఆ కమిషన్ నివేదిక ఊహించిందే. ఎందరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ వ్యవహారంలో కొంతమంది BRS నేతలను అరెస్ట్ చేయవచ్చు.. అంతమాత్రాన భయపడవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని.. .. కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలి. కాళేశ్వరంపై క్యాబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం’’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే.. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ప్రభుత్వం ఆ నివేదికను బయటపెట్టడం కంటే ముందే మీడియాకు లీకు కావడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ‘కాళేశ్వరం అవకతవకలు.. ఆయనదే పూర్తి బాధ్యత’ -
మీడియాకు లీకైన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
-
మీడియాకు లీకైన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్
-
‘కాళేశ్వరం అవకతవకలకు కేసీఆర్‌దే పూర్తి బాధ్యత’
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక మీడియాకు లీకైంది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ప్రాజెక్టులో విధాన, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని వెల్లడయ్యాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టు తేల్చింది. వాప్కోస్ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది.కాళేశ్వరం కమిషన్ రిపోర్టులోని కీలక విషయాలు తుమ్మిడిహట్టిలో నీటి లభ్యతలేదని సమర్థించుకొని, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చారు.నిజాయితీ, చిత్తశుద్ది చూపలేదు. టర్న్ కీ పద్దతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని, సీడ్ల్యూసీ సలహా ఇచ్చినా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారు.నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందిప్రాజెక్ట్ అంచనాలు డీపీఆర్ కేబినెట్ ముందు పెట్టలేదు. ప్రాజెక్టు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ చేయలేదు. బ్యారేజీల నిర్మాణ ప్రాథమిక అనుమతులకు కేబినెట్ ఆమోదం లేదు.కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దే. కేసీఆర్ ఆదేశాల వల్లే మూడు బ్యారేజీల్లో సమస్యలు. నిపుణుల కమిటీ నివేదికను హరీష్‌రావు ఉద్దేశపూర్వకంగా పట్టించులేదు.ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతులను పట్టించుకోలేదు. కేబినెట్లో చర్చకాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైత్రులు చర్చించనున్నారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం వేసిన అధ్యాయనం కమిటీ షార్ట్ రిపోర్ట్ సిద్ధం చేయగా.. ఈ నివేదికపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. -
రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం ఫైనల్ రిపోర్టు..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచించింది.ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైనా కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదికలో తెలిపింది. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదన్న కమిషన్.. ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నాలజీ వ్యవహారంలో లోటుపాట్లను కమిషన్ ప్రస్తావించింది. లోకేషన్ల విషయంలో కేసీఆర్ చొరవే ఎక్కువని కమిషన్ పేర్కొంది.రేపు(సోమవారం) కేబినెట్లో రిపోర్ట్‌పై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కేబినెట్ చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని పార్టీల ఆలోచన తెలుసుకునే పనిలో ప్రభుత్వం ఉంది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీ, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్‌ల పాత్ర కూడా ఉన్నట్టుగా వెల్లడించినట్లు సమాచారం.బరాజ్‌ల ప్లానింగ్, నిర్మాణం, పనుల పూర్తి, నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి జరిగిన అవకతవకల్లో కేసీఆర్ పాత్ర ఉందని వెల్లడించినట్లు సమాచారం. నాడు సీఎం హోదాలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో బరాజ్‌ల అంచనాల పెంపు (ప్రైస్ అడ్జస్ట్మెంట్), కాంట్రాక్టర్లతో ఒప్పందాల సవరణ, వారికి ఫైనాన్షియల్ గ్యారంటీల విడుదల విషయంలో అధికారులపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని నిర్ధారించినట్లు తెలిసింది.మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కాగా కమిషన్ 115 మంది సాక్షులను విచారించింది. జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. -
కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్.. లీగల్ ఒపీనియన్ వచ్చాకే అసెంబ్లీకి..!
హైదారాబాద్: ప్రభుత్వానికి చేరిన కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్‌ను లాకర్లో పెట్టారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చిన సీఎస్ రామకృష్ణారావు... ఈ తుది నివేదికను లాకర్లో పెట్టారు. ఈ తుది నివేదికపై ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్ రామకృష్ణారావులు కీలక అధికారులతో భేటీ అయ్యారు. కేబినెట్లో చర్చించే ముందు షీల్డ్ కవర్ ఓపెన్ చేయనుంది ప్రభుత్వం. ఈ నివేదికను కేబినెట్లో చర్చించిన తర్వాత లీగల్ ఒపీనియన్‌కు పంపనుంది ప్రభుత్వం. లీగల్ విషయాలపై అడ్వకేట్ జనరల్‌కి రిఫర్ చేయనుంది. దీనిపై లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కారు.కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశానికి సంబంధించి గురువారం బీఆర్కే భవన్‌కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. షీల్డ్ కవర్లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. -
1,000 పేజీలతో తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తన తుది నివేదిక సమర్పించింది. గురువారం బీఆర్కే భవన్‌కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. షీల్డ్ కవర్లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్‌కు అందజేస్తారని సమాచారం. -
నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై సుదీర్ఘ విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఒకటిరెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. జస్టిస్ చంద్రఘోష్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోగా, ఆయనకు విమానాశ్రయంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్, సీఈ విజయ్‌భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండగా, ఆలోపే ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు జస్టిస్ ఘోష్ ఏర్పాట్లు చేసుకున్నారు.నివేదికలోని అంశాలు బయటకి పొక్కకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 16 నెలలకు పైగా విచారణ నిర్వహించింది. -
Harish Rao: రెండోసారి కాళేశ్వరం విచారణకు..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్ ముందు మరోసారి హాజరు కానున్నారు. మళ్లీ విచారణకు రావాలంటూ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు సిద్ధమయ్యారు. అయితే..విచారణకు ముందు హరీష్‌రావు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాతే ఆయన బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. గత విచారణలో.. ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతులు ఉన్నాయని హరీష్‌రావు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో ఇచ్చిన వాంగ్మూలం, ప్రభుత్వం అందించిన కేబినెట్ నోట్స్ మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ మరోసారి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.మాజీ ENC అనిల్ కుమార్ హాజరు.. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుంగలు పూడ్చడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. కమిషన్‌కు తెలియకుండా బ్యారేజీల్లో గ్రౌంటింగ్ చేయడంతో అనిల్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. కేబినెట్ మినిట్స్ పరిశీలనక్యాబినెట్ రాటిఫికేషన్స్ పై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేబినెట్ ప్రొసీజర్ పై ఇరిగేషన్, ఫైనాన్స్ ఉన్నతాధికారులను అడిగిన కమిషన్.. కేబినేట్ నిర్ణయాల ప్రొజిజర్ ఎలా ఉంటుందనే వివరాలను GAD అధికారులను అడిగి తెలుసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 28 ప్యాకేజీల్లో కేబినెట్ ముందుకు ఎన్ని వచ్చాయనే విషయాన్ని అడిగిన జస్టిస్ పీసీ ఘోష.. ప్రాజెక్టు లొకేషన్లు, డిజైన్ల మార్పుకు సంబంధించిన ఫైల్స్ కేబినేట్ ముందుకు వచ్చాయా? విషయంపై కమిషన్ ఆరా తీశౠరు. అలాగే.. నిధుల మంజూరులో పారదర్శకత ఉందా లేదా అనే విషయం పైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. -
30 లోపు ఇస్తాం.. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిఫ్లై
సాక్షి, హైదరాబాద్: సీఎంవోకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ అంశాలు కావాలని కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిప్లై ఇచ్చింది. 30వ తేదీ లోపు ఆయా శాఖలు కమిషన్ అడిగిన సమాచారం ఇస్తాయని సీఎంవో తెలిపింది. కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు సీఎంవో పంపించగా.. ఎల్లుండి కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ లేఖపై సర్కార్ చర్చించనుంది.కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది.దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. -
Kaleshwaram Interrogation:: ఆ 50 నిమిషాలు ఏం జరిగింది?
-
Kaleshwaram Commission: బీఆర్కే భవన్ కు చేరుకున్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్
-
నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్
-
కమిషన్ విచారణకు కేసీఆర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా..‘కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ.. ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గద. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే!. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు!. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!’ అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే…మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే! బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని… pic.twitter.com/aYrdkAwGXQ— KTR (@KTRBRS) June 11, 2025 -
కేసీఆర్‌కు 18 ప్రశ్నలు.. కమిషన్‌కు కీలక డాక్యుమెంట్స్
కేసీఆర్ విచారణ అప్డేట్స్.. కేసీఆర్‌కు 18 ప్రశ్నలు.. కమిషన్‌కు కీలక డాక్యుమెంట్స్జీవో-45 నెంబర్‌తో కలిగిన జీవోను కమిషన్‌కు ఇచ్చిన కేసీఆర్.ఆపరేషన్స్ అండ్ మెంటినెన్స్ బుక్‌ను కమిషన్‌కు అందజేసిన కేసీఆర్.కేసీఆర్‌ను 18 ప్రశ్నలు అడిగిన కమిషన్.THE LIFE LINE OF KALESWARAM PPRJECT అనే పేరుతో ఉన్న డాక్యుమెంట్‌ను కమిషన్‌కు అందించిన కేసీఆర్కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కేసీఆర్‌ను ప్రశ్నించిన కమిషన్.నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్న కేసీఆర్.బ్యారేజీల్లో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్న.టెక్నికల్ అంశాల ఆధారంగా స్టోరేజ్ నిర్ణయం అధికారులు తీసుకున్నట్లు తెలిపిన కమిషన్.బ్యారేజీల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్ ప్రశ్న.టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజీల లొకేషన్స్ మార్పులు జరిగాయి.కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశాన్ని క్యాబినెట్ అనుమతి ఉందని తెలిపిన కేసీఆర్.ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, CWC లేఖలను కమిషన్‌కు తెలిపిన కేసీఆర్. ఫాంహౌస్‌కు బయలుదేరిన కేసీఆర్.. కాళేశ్వరం విషయంలో 115వ సాక్షిగా కేసీఆర్‌ను విచారించిన కమిషన్.తెలంగాణలో నీటి లభ్యత, వినియోగంపై కేసీఆర్ వివరించినట్టు సమాచారం.బీఆర్కే భవన్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.ముగిసిన కేసీఆర్ విచారణకాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు కమిషన్.. కేసీఆర్‌ను విచారించింది. కాళేశ్వరం నిర్మాణంపై ప్రశ్నలు అడిగిన కమిషన్పలు డాక్యుమెంట్లను కమిషన్‌కు అందజేసిన కేసీఆర్. కాసేపట్లో బీఆర్కే భవన్ నుంచి కేసీఆర్ బయటకు రానున్నారు. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ముందు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కమిషన్‌కు నివేదిక ఇచ్చిన కేసీఆర్.కమిషన్ విచారణలో పాల్గొన్న ఇద్దరు నోడల్ అధికారులు.మొత్తం నలుగురు అధికారుల సమక్షంలో సాగుతున్న కేసీఆర్ విచారణ.నోడల్ అధికారుల పేర్లు శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డివన్ టు వన్ విచారణ..కేసీఆర్‌ను వన్ టు వన్ విచారణ జరుపుతున్న పీసీ ఘోష్.అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ కోరిన కేసీఆర్ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించిన కమిషన్ చైర్మన్ ఘోష్. కేసీఆర్‌తో ప్రతిజ్ఞదేవుని పై ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తానని కేసీఆర్ తో ప్రతిజ్ఞ చేయించిన కమిషన్ చైర్మన్ ఘోష్.కమిషన్‌కు పలు డాక్యుమెంట్స్ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తతబీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్.పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట. 👉కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్..ఇవన్నీ సీఎం రేవంత్ డ్రామాలు: కేటీఆర్👉బీఆర్కే భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నాలుగేళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వంద కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక్క దాంట్లో చిన్న సమస్య వస్తే.. మొత్తం ప్రాజెక్ట్ వేస్ట్ అంటున్నారు. ఇరిగేషన్‌పై కేసీఆర్‌కు ఉన్న అవగాహన ఏ నాయకుడికి లేదు. ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం ఆడిస్తున్న డ్రామాలు ఇవి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం ప్రయత్నిస్తున్నారు. మేడిగడ్డలో కాంగ్రెస్ వాళ్లే కుట్ర చేసి ఉంటారు. సీఎం రేవంత్.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించడానికి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. 94వేల కోట్ల ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు. తన వెంటన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల ఫైల్‌ను కేసీఆర్ తీసుకెళ్లారు. కేసీఆర్ వెంటన తొమ్మిది లోపలికి వెళ్లారు. 👉బీఆర్కే భవన్ వద్దకు కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 👉నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బీఆర్కే భవన్ వద్ద హైటెన్షన్కమిషన్ కార్యాలయానికి కేసీఆర్‌తో పాటు మరో 9 మందికి మాత్రమే అనుమతి.మధుసూదనాచారి, హరీష్‌రావు, ప్రశాంత్ రెడ్డి, రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్, పద్మారావు, మహమూద్ అలీ, లక్ష్మారెడ్డికి అనుమతి.బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి.బీఆర్కే భవన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.రోప్‌తో బీఆర్ఎస్ కార్యకర్తలను కట్టడి చేస్తున్న పోలీసులు.బీఆర్కే భవన్ వద్ద పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం.జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ గులాబీ పార్టీ కార్యకర్తల నినాదాలు.. 👉ఎర్రవల్లి ఫాం హౌస్ నుండి బీఆర్కే భవన్ బయలుదేరిన కేసీఆర్, హరీష్ రావు, కవితకాళేశ్వరం పై కమిషన్ విచారణకు ఎర్రవెల్లి నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/s4rDIftNpe— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివి: హరీశ్‌రావుతెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివి.తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది.కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారు.ఇతరులు అధికారం వెంటబడితే.. ఆయన మన జీవితాలను మార్చారు. From achieving Telangana statehood to delivering transformative projects like Kaleshwaram, KCR’s commitment to the people has been unwavering.While others chase power, he changed lives.Congress conspiracy or enquiry commission can't erase his legacy.His sacrifices for…— Harish Rao Thanneeru (@BRSHarish) June 11, 2025 కోర్టు హాల్ సిద్ధం..కమిషన్ కార్యాలయంలో కోర్టు హాల్ సిద్ధం చేసిన అధికారులు.ఇన్ కెమెరా ఏర్పాట్లను సైతం సిద్ధంగా ఉంచిన కమిషన్ సిబ్బంది.కేసీఆర్ సమ్మతితో ఓపెన్ కోర్టు విచారణ లేదా ఇన్ కెమెరా విచారణ చేయనున్న కమిషన్ 👉బీఆర్కే భవన్ వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.👉దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు👉కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులనూ విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. కేసీఆర్ వస్తున్న క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్లో పోలీసులు ఆంక్షలు విధించారు.👉బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉదయం 11:30 గంటలకు బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ ముందు రోడ్డును అధికారులు మూసివేశారు. దాదాపు ఐదు వేల మందికిపైగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ట్యాంక్ బండ్ వైపు రోడ్లలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్‌కు వచ్చే వారిని గేట్ బయటే నిలిపివేస్తున్నారు. 👉ఇదిలా ఉండగా.. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తిచేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు మీడియా, కమిషన్‌లోని ఇంజినీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. నేడు కేసీఆర్ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా లేక కేవలం కమిషన్ అధికారుల వరకే పరిమితమై ఇన్‌కెమెరా విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. -
కేసీఆర్ విచారణలో కీలక మార్పులు!
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు (బుధవారం) కేసీఆర్‌ను నేరుగా విచారిస్తామని, అంగీకరించకపోతే ఇన్ కెమెరా విచారణ చేపడతామని కాళేశ్వరం కమీషన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, అంతకుందు కేసీఆర్‌ను ఓపెన్ కోర్ట్ కాకుండా ఇన్ కెమెరా విచారణ చేస్తే ఎలా ఉంటుందని కమిషన్ యోచించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఇన్ కెమెరా విచారణ? చేపట్టనుందని వార్తలు వచ్చాయి. బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కాకుండా ఇన్ కెమెరా ముందే కమిషన్ విచారణలో పాల్గొనే అవకాశం కేసీఆర్‌కు కలిగింది. కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారించింది. కేసీఆర్‌ను మాత్రం మాజీ సీఎం హోదాలో ఇన్ కెమెరా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించింది. కాగా, రేపు కమిషన్ ముందు 115 సాక్షిగా కమిషన్ ముందు కేసీఆర్ హాజరు అవుతారా? ఇన్ కెమెరాకు హాజరవుతురా? అనేది తెలియాల్సి ఉంది. -
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌కు హరీష్ రావు
-
Kaleshwaram Commission: 40 నిమిషాలు హరీశ్ రావును ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్
-
బీఆర్కే భవన్‌కు హరీష్‌రావు.. లీగల్ టీమ్‌తో పోలీసుల వాగ్వాదం!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలుదేరారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్కే భవన్‌కు భారీ కాన్వాయ్‌తో హరీష్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్‌కు హరీష్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లీగల్ టీమ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ లీగల్ టీమ్.. ఓపెన్ కోర్టులో కూర్చున్న సమయంలో పోలీసులు వారి వద్దకు వెళ్లి.. ఇక్కడ అనుమతి లేదని, బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా లీగల్ టీమ్ స్పందిస్తూ.. ఓపెన్ కోర్టులో ఎవరైనా ఉండవచ్చు.. రాకూడదని గెజిట్ ఇవ్వాలని పోలీసులకు తెలిపారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకుంది. అంతకుముందు హారీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తోంది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటుచేసినా, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను.గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఆలోచించవలసింది ఉద్దేశంతో కాదు, విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయ దుర్దేశంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తుంది. విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాలరాయద్దు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది. ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తిస్థాయిలో సమాధానం చెప్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో లేము కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను వారికి అందిస్తాం’ అని తెలిపారు. -
Etala: తలపై తుపాకీ పెట్టిన నేను చెప్పింది ఇదే..!
-
కాళేశ్వరానికి బాస్ కేసీఆరే.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా: ఈటల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తన విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆ నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నాను. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పని చేశా. రీ డిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో మేం ఉన్నాం. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు. ఆ తర్వాత 2015లో ఆ అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది....తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయి. మూడు బ్యారేజి CWC రిపోర్ట్, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభం అయ్యింది. అయితే..రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని నన్ను అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పాను... మా బతుకు నిబద్ధతో ఉంది. నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది. ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు. ప్రాజెక్ట్ రీ డిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. అందులో మేం(హరీష్, తుమ్మల పేర్లు) ఉన్నాం. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా. కొందరు బట్టకాల్చి మీదేసినంత మాత్రాన నాకేమీ కాదు.మూడు బ్యారేజీల వ్యయం రూ. 10వేల కోట్ల లూపే ఉండొచ్చు. ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను త్వరగా బయటపెట్టాలి. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలి. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిది. ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్...ఆయనే బాస్. కొన్ని వందలసార్లు తన మానస పుత్రిక అని చెప్పారు ’’ అని ఈటల మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.ఇదీ చదవండి: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు -
ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటల
-
కాళేశ్వరం కమిషన్: 40 నిమిషాలు.. ఈటలకు 19 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం ఆర్కే భవన్లో జరిగిన ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మొత్తం 40 నిమిషాల్లో 19 ప్రశ్నలను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈటలకు వేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన మంత్రి(ఆర్థిక శాఖ)గా పని చేసిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ఈటలపై కమిషన్ ఈ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. కమిషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన వ్యక్తి ఈటల రాజేందర్. తొలుత.. ఓపెన్ కోర్టులో ఈటల రాజేందర్‌తో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌లపైనే కమిషన్ ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు?: కాళేశ్వరం కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది: ఈటలకేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టాం: ఈటలకేంద్ర జలసంఘం, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం: ఈటలమహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించాం: ఈటలమూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు?: కాళేశ్వరం కమిషన్కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. తర్వాతే నిర్మాణం జరిగింది: ఈటలరీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు?: కాళేశ్వరం కమిషన్మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు: ఈటలహరీష్ రావు చైర్మన్‌గా.. సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాం: ఈటలఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగింది: ఈటలరీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా? : కాళేశ్వరం కమిషన్రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసింది: : ఈటలబ్యారేజీ నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారు?: కాళేశ్వరం కమిషన్టెక్నికల్ డిటైల్స్ మీద మాకు అవగాహన ఉండదు.. అంతా నిపుణులే చూసుకున్నారు: ఈటల నిర్మాణ వ్యయం ఎంత అయ్యింది?: కాళేశ్వరం కమిషన్తొలుత రూ. 63 వేల కోట్లతో అనుకున్నాం. తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఎంత ఖర్చు అయ్యిందో నాకు తెలియదు: ఈటలబ్యారేజీ నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా?: కాళేశ్వరం కమిషన్ఫైన్సాన్స్ ఖాశాఖకు అన్ని వివరాలు తెలియవు. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే తెలిసి ఉంటుంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి: ఈటల ఇలా మొత్తం 19 ప్రశ్నలు వేసింది. ‘‘నేనేం చేయలేదు. నాకేమీ తెలియదు. అంతా వాళ్లే చేశారు. వాళ్లకే అన్నీ తెలుసు’’ అని నాటి ఇరిగేషన్ శాఖను ప్రస్తావిస్తూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఆధారాలను ఈటల కమిషన్‌కు చూపించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పని చేసిన అధికారులను మాత్రమే ఇప్పటిదాకా విచారించింది జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్(kaleshwaram Commission). ఇక ఇప్పుడు రాజకీయ నేతల వంతు వచ్చింది. ఈ మేరకు.. ఈటలను తొలుత విచారించింది. మరోవైపు.. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకూ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 5వ తేదీన జరగాల్సిన కేసీఆర్ విచారణ ఆయన విజ్ఞప్తి మేరకు 11వ తేదీకి వాయిదా పడింది. జూన్ 9వ తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కానున్నారు.