
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక మీడియాకు లీకైంది. ఈ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ప్రాజెక్టులో విధాన, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని వెల్లడయ్యాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిపోర్టు తేల్చింది. వాప్కోస్ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టులోని కీలక విషయాలు
తుమ్మిడిహట్టిలో నీటి లభ్యతలేదని సమర్థించుకొని, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చారు.
నిజాయితీ, చిత్తశుద్ది చూపలేదు. టర్న్ కీ పద్దతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని, సీడ్ల్యూసీ సలహా ఇచ్చినా మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది
ప్రాజెక్ట్ అంచనాలు డీపీఆర్ కేబినెట్ ముందు పెట్టలేదు.
- ప్రాజెక్టు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ చేయలేదు.
- బ్యారేజీల నిర్మాణ ప్రాథమిక అనుమతులకు కేబినెట్ ఆమోదం లేదు.
- కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దే.
- కేసీఆర్ ఆదేశాల వల్లే మూడు బ్యారేజీల్లో సమస్యలు. నిపుణుల కమిటీ నివేదికను హరీష్‌రావు ఉద్దేశపూర్వకంగా పట్టించులేదు.
- ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త రాష్ట్ర స్థితిగతులను పట్టించుకోలేదు.
కేబినెట్‌లో చర్చ
కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైత్రులు చర్చించనున్నారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం వేసిన అధ్యాయనం కమిటీ షార్ట్ రిపోర్ట్ సిద్ధం చేయగా.. ఈ నివేదికపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
