కమిషన్ ఏర్పాటు కుట్రపూరితం | KCR and Harish argue in Telangana High Court on Ghosh Commission Kaleshwaram report | Sakshi
Sakshi News home page

కమిషన్ ఏర్పాటు కుట్రపూరితం

Feb 26 2026 5:36 AM | Updated on Feb 26 2026 5:36 AM

KCR and Harish argue in Telangana High Court on Ghosh Commission Kaleshwaram report

ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌ వాదనలు 

ఓ నిర్ణయాకొచ్చి , దానిపై విచారణ చేయడం చెల్లదు 

నివేదిక సమర్పించకముందే మీడియాకు వివరాలు 

కేసీఆర్‌ను దోషిగా చూపేందుకే కమిషన్‌ నియమించారు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నివేదిక చెల్లదని, కమిషన్‌ ఏర్పాటు చట్టవిరుద్ధమని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫున సీనియర్‌ న్యాయవాది ఆర్యామ సుందరం వాదించారు. ప్రతిపక్ష నేతలను ఇరికించాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా ప్రభుత్వం కమిషన్‌ను నియమించిందన్నారు. అనంతరం కేసీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. రెండున్నర గంటల వాదనల తర్వాత తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

మాజీ సీఎం కేసీఆర్,  హరీశ్‌రావు, మాజీ సీఎస్‌ శైలేంద్ర కుమార్‌ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై ఎలాంటి చర్యలొద్దంటూ గతంలో ఇచ్చి న మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది. జస్టిస్‌ ఘోష్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వా నికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్, ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్‌ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మా సనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వీ, పి.శ్రీరామ్, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు.  

బాధ్యులెవరో తేల్చాలని కమిషన్‌ ఎలా వేస్తారు? 
సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ప్రభు త్వం ముందే ఓ నిర్ణయానికి వచ్చి ంది. దానికి బాధ్యులెవరో తేల్చాలని కోరుతూ 2024, మార్చి 14న జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ను నియ మిస్తూ జీవో 6 జారీచేసింది. ఇది ఒక రకంగా తాము చెప్పిన విధంగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరడమే. ఇలా కమిషన్‌ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌ 1952లోని సెక్షన్‌ 8బీ, 8సీ ప్రకారం నోటీసులు జారీ చేయలేదు. సాక్షిగా పిలిచి దోషిగా చూపే ప్రయత్నం చేయడం అభ్యంతరకరం.

నివేదిక పేరిట తీర్పు చెప్పే అధికారం కమిషన్‌కు లేదు. 2025, జూలై 31న సర్కార్‌కు జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక సమ ర్పించింది. అంతకుముందే నివేదికలోని అంశాలు బహిర్గతం చేశారు. సీఎం, మంత్రులు.. హరీశ్‌ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారు. పవర్‌ పాయి ంట్‌ ప్రజెంటేషన్‌ పెట్టి మీడియాకు వివరాలు వెల్లడించడం, నిరాధార ఆరోపణలు చేయడం పరువుకు భంగం కలిగించడమే. ఏకపక్షంగా నివేదికలోని వివరాలను 60 పేజీలకు కుదించి మీడియాకు విడుదల చేశారు. చట్టప్రకారం, కేబినెట్‌ అనుమతితోనే అన్ని చర్యలు చేపట్టినందున సీబీఐ విచారణకు ఆదేశించినా ఎదుర్కొంనేందుకూ సిద్ధం’అని చెప్పారు.

రాజకీయ కక్షలో భాగంగానే.. 
‘కేంద్ర ప్రభుత్వ అధీనంలోని వ్యాప్‌కో అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించింది. హరీశ్‌పై సాక్షులెవరూ తప్పుడు ఆరోపణలు చేయలేదు. గత జూన్‌ 9న హాజరై కమిషన్‌ అడిగిన సమాచారం, కేబినెట్‌ తీర్మాన కాపీలన్నీ అందజేశారు. అయినా, సహేతుకమైన అవకాశం ఇవ్వకుండా ఆరోపణలు చేయడం చెల్లదు’అని సుందరం చెప్పారు. దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్‌ను దోషిగా చూపించాలని ఉద్దేశంతో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఏకపక్షంగా జీవో జారీ చేశారు’ అని చెప్పారు.  అనంతరం కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement