మ్యాన్యుఫాక్చరింగ్‌ పవర్‌గా తెలంగాణ | CM Revanth Reddy Meet Adobe CEO Discuss On Telangana Rising 2047 vision | Sakshi
Sakshi News home page

మ్యాన్యుఫాక్చరింగ్‌ పవర్‌గా తెలంగాణ

Feb 26 2026 5:09 AM | Updated on Feb 26 2026 5:09 AM

CM Revanth Reddy Meet Adobe CEO Discuss On Telangana Rising 2047 vision

రాష్ట్రాభివృద్ధికి  మీ సహకారం కావాలి 

అడోబ్‌ సీఈఓతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని మ్యాన్యుఫాక్చరింగ్‌ పవర్‌గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. అడోబ్‌ సీఈఓ, తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌ బోర్డు సభ్యులు శంతను నారాయణ్‌ బుధవారం సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఆర్థిక వ్యవస్థపై ఏఐ టెక్నాలజీ విప్లవ ప్రభావం, రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్‌తో సీఎం చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సీఎం కోరారు. గ్లోబల్‌ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను సీఎంకు శంతను నారాయణ్‌ వివరించారు. గ్లోబల్‌ మ్యాన్యుఫాక్చరింగ్, గ్రీన్‌ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్‌ అండ్‌ రిస్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలను తెలిపారు. 

సీఎం రేవంత్‌ చండీయాగం !
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా యాగం జరిగినట్టు తెలుస్తోంది. కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌ జూబ్లీహి­ల్స్‌లోని ఆయన నివాసంలో నిర్వహించిన చండీయాగం బుధవారం ముగిసి­నట్టు సమాచారం. అయితే, ఈ యాగం నిర్వహణ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే రేవంత్‌రెడ్డి యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement