breaking news
Telangana Rising 2047
-
తెలంగాణ రైజింగ్ విజన్ ఆచరణ సాధ్యమేనా?
‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్ నేల విడిచి సాము చేస్తోందా? లక్ష్యాలు ఘనంగానే పెట్టుకున్నా.. ఆచరణలో సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పది వ్యూహాలు... మూడు మూల స్థంభాలున్న ఈ విజన్ డాక్యుమెంట్లో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు కీలకం. భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు అదనంగా మరికొంత చేర్చి సుమారు 30 వేల ఎకరాలు సిద్ధం చేశారు. శ్రీశైలం-నాగార్జున సాగర్ రహదారుల మధ్య ప్రాంతంలోని ఊళ్లలో ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన్యత ఇవ్వడం కోసం ఫ్యూచర్ సిటీలోనే పెట్టుబడుల సదస్సు కూడా నిర్వహించారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు, స్కిల్ యూనివర్శిటీ, ఏఐ యూనివర్శిటీలు ఈ సిటీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం సొంత రియల్ఎస్టేట్ ప్రయోజనాల కోసం రేవంత్ బృందం ఫ్యూచర్ సిటీని రంగంలోకి తీసుకు వచ్చిందని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించినభూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని వివిధ పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ ఒక్క ప్రాజెక్టుతోనే హైదరాబాద్ న్యూయార్క్ లేదా డల్లాస్ వంటి అంతర్జాతీయ నగరాల స్థాయికి చేరుకుంటుందని భ్రమపెట్టడం అంత మంచిది కాదు. అయితే హైదరాబాద్ పరిసరాల్లోని మరో 27 మున్సిపాల్టీలను, గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం తలపెట్టిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి మరింత ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది. గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులలో మూసీ పునరుద్ధరణ కూడా ఒకటి. గ్లోబల్ సమ్మిట్ ప్రచార ప్రకటనలో ఒక గ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించారు.అందులో నగరంలోని వివిధ నిర్మాణాలు అద్బుతంగా కనిపిస్తాయి. మూసీ ప్రాజెక్టు ఊహాచిత్రం కూడా ఉంటుంది. కాని వేల కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవన్ని క్లియర్ అయితే పరిశుభ్రమైన వాతావరణం, నది పూర్తిగా క్షాళన జరిగితే హైదరాబాద్ కు నిజంగానే ఒక హారంగా ఇది ఉంటుంది. డ్రై పోర్టు, దాన్నుంచి కృష్ణపట్నం వరకు 12 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే, బెంగుళూరు, అమరావతి మీదుగా చెన్నైకి హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కావాలని ఈ విజన్ డాక్యుమెంట్ లక్షించింది. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం ఓడరేవు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కూడా ఈ ప్రతిపాదనలలో ఉంది. దాదాపు పదేళ్ల క్రితం ముంబై నుంచి అహ్మదాబాద్ కు బుల్లెట్ రైలు నడపడం కోసం ఒక కారిడార్ నిర్మిస్తున్నారు. అది ఇంకా పూర్తి కాలేదు. అయినా దేశవ్యాప్తంగా ఈ బుల్లెట్ రైళ్ల డిమాండ్ ఉంది. కొన్ని రాష్ట్రాలు అయితే వచ్చే రెండు, మూడేళ్లలోనే బుల్లెట్ రైళ్లు వచ్చేస్తాయన్నట్లు ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయి.దేశం అంతటా ఇవి ఏర్పాటు కావాలంటే లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. వచ్చే దశాబ్దాలలో సాంకేతిక పరిజ్ఞానం ఇంకా బాగా మెరుగైతే, అప్పుడు వేగంగా ఈ బుల్లెట్ రైళ్లు సాకారం అవుతాయేమో తెలియదు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రాంతంలో మాన్యుఫ్యాక్చర్ రంగాన్ని అభివృద్ది చేయాలని ఈ విజన్ లో తెలిపారు. వీటికి అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తారు. రీజినల్ రింగ్ రైల్వే, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్స్, గ్రీన్ ఎనర్జీ హబ్స్ వంటివాటిని కూడా ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఇవన్ని చూస్తే హైదరాబాద్ కేంద్రంగానే ఈ విజన్ డాక్యుమెంట్ అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హైదరాబాద్ మరింత విస్తరిస్తే ప్రభుత్వ పాలన ఎంత సమర్థంగా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం. అయితే మూడు జోన్ల రాష్ట్రంగా మార్చాలని యోచిస్తున్నారు.ఈ గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు ఎంత వ్యయం అవుతుందన్న దానిపై అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరో వైపు 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది మరో లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం డాలర్ విలువ 90 రూపాయలు ఉంది. వచ్చే ఇరవై,పాతికేళ్లలో ఇది ఏ స్థాయికి పెరుగుతుందో ఊహించలేం. ఈ రకంగా చూస్తే ఈ లక్ష్యం సాధన అంత తేలిక కాదు. కాకపోతే రాష్ట్రాలు ప్రచారం కోసం ఈ అంకెలను చెబుతున్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం సులభతర విధానాలు, డిజిటల్ పాలన, నాలెడ్జ్ హబ్, పెట్టుబడిదారుల ప్రత్యేక నిధి, వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్దరణ, వచ్చే వందేళ్ల వరకు హైదరాబాద్ కు నీటి కరువు లేకుండా చూడడం వంటి వ్యూహాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థికాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ది, సుస్థిర అభివీద్ది అనేవాటిని మూల స్తంభాలుగా చేసుకుని పనిచేస్తామని తెలిపారు.ఇవన్ని చదవడానికి బాగానే ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూస్తే ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశంలో కొత్తగా నిర్మించిన వాటిలో సుమారు నలభై ఎయిర్ పోర్టులకు డిమాండ్ లేదని వార్తలు సూచిస్తున్నాయి. అయినా హైదరాబాద్ చుట్టూరా కొత్తగా ఈ ఎయిర్ పోర్టులు ఎప్పటికి వస్తాయో, అవి ఎంతవరకు బాగా నడుస్తాయో తేలడానికి చాలా సమయం పట్టవచ్చు. ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పు, 2047 నాటికి ఎంత మొత్తం అవుతుంది? లేదా ఎంత రుణం తీర్చగలుగుతారు? ఆర్థిక వనరులు ఎలా మెరుగు అవుతాయి? మొదలైనవాటిపై అంచనాలు వేయకుండా ఎన్ని విజన్ డాక్యుమెంట్లు రాసుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ అంటూ భారీ హడావుడి చేశారు. అతిశయోక్తులతో అంకెల గారడి చేశారు.కాని వాటిలో ఒక్క లక్ష్యం అయినా నెరవేరిందని చెప్పలేని పరిస్థితి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, ఎప్పటికప్పుడు కొత్త, కొత్త ఆలోచనల మధ్య ఈ విజన్ డాక్యుమెంట్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం కూడా పెద్దగా ఉండకపోవచ్చు.ఏది ఏమైనా పాలకులకు ప్రచారానికి, ఆశల పందిరి వేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రస్తుతానికి ఈ విజన్ డాక్యుమెంట్లు పనికి రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఐటీ, రక్షణ, ఫార్మా రంగాల్లో కలిసి పనిచేద్దాం
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోపాటు రక్షణ, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఐటీ, రక్షణ, ఔషధ రంగాల్లో పెట్టుబ డులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపడంతోపాటు అక్కడి ప్రముఖ లోహ, కార్ల తయారీ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.భట్టి విక్రమార్క, మంత్రి డి.శ్రీధర్‌బాబుతో శుక్రవారం ప్రజాభవన్ లో జర్మనీ పార్లమెంటరీ బృందం భేటీ అయ్యింది. జర్మనీ, భారత్ నడుమ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహబంధం భవిష్యత్‌లో మరింత పటిష్టంగా ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం అన్నారు. ‘ఐటీ రంగానికి హబ్‌గా పేరొందిన హైదరాబాద్ జర్మనీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్స్ వర్సిటీలో జర్మన్ భాషా విభాగం ఏర్పాటు ద్వారా జర్మనీలో ఉద్యోగ, అవకాశాలు మెరుగవుతాయి’అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం: శ్రీధర్బాబుసైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దూరదృష్టితో ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ‘సైబర్ సెక్యూరిటీ రంగంలో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా రెండు ఫ్లోర్లు కేటాయించాం. జిల్లాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేయడంతో ఆర్థిక నేరాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి’అని మంత్రి వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ డాక్యుమెంట్‌ను జర్మనీ పార్లమెంటు బృందానికి భట్టి, శ్రీధర్‌బాబు అందజేశారు. సైబర్ సెక్యూరిటీ, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు సంబంధించి తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నట్టు జర్మనీ పార్లమెంటు బృందం ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణలో జర్మనీ పెట్టుబ డులు, బోష్ వంటి ప్రసిద్ధ కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు తెలంగాణలో కొదవలేదని జర్మనీ పార్లమెంట్ ప్రతినిధి బృందం కితాబునిచ్చింది. జర్మన్ పార్లమెంట్లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ ప్రతినిధి జోసెఫ్ ఓస్టర్ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. భేటీలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిత్తల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, ప్రణాళిక శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు. -
ఉపాధి కోర్సులు కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి ఆవశ్యకత మరోమారు తేటతెల్లమైంది. చదువు పూర్తి కాగానే ఉపాధి కల్పించే కోర్సులను అందుబాటులోకి తేవాలని ప్రజలు బలంగా కోరుతున్నట్టు వెల్లడైంది. తెలంగాణ రైజింగ్–2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 40 శాతానికి పైగా సత్వర ఉపాధి కోర్సులు కావాలని, ఈ దిశగా ప్రభుత్వ విధానాలను రూపొందించాలని అడగడం గమనార్హం. తెలంగాణను మూడు మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వాములను చేసింది. ఆన్లైన్ ద్వారా సిటిజన్ సర్వే నిర్వహించి ప్రజలు ఏ కోణంలో అభివృద్ధిని కోరుకుంటున్నారనే సమాచారం తీసుకుంది. ప్రజల అభిప్రాయాలను విజన్ డాక్యుమెంట్లోనూ పొందుపర్చింది. » సిటిజన్ సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువ శాతం మంది మొదటి ప్రాధాన్యం కింద ఉపాధి కల్పనా కోర్సుల గురించే ప్రస్తావించారు. ళీ ఆ తర్వాత ఎక్కువమంది చిన్న వ్యాపారాలకు మద్దతు లభించే విధానాలను ప్రభుత్వం రూపొందించాలని కోరారు. » వ్యవసాయ రంగ ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని కోరినవారు మూడో స్థానంలో ఉండడం గమనార్హం. » తమ నివాసాలకు సమీపంలో ఆస్పత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరినవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ళీ 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి కావాలంటే పారదర్శక పాలన జరగాలని కోరిన వారు నాలుగోవంతు కూడా లేరు. ళీ మహిళల భద్రత గురించి ఈ సర్వేలో పాలుపంచుకున్న వారు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ళీ ఆరోగ్య బీమా గురించి ప్రస్తావించిన వారు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ప్రజాభిప్రాయమే భవిష్యత్‌కు బలం ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా పాల్గొన్నారని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో సర్వే జరిగిన తీరు, ప్రజల అభిప్రాయాలను కూడా పేర్కొంది. ఈ సర్వేలో మహిళలు, విద్యార్థులు, కారి్మకులు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు పాల్గొన్నారు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది యువత తమ అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా 2047 విజన్‌కు బలం చేకూర్చారని డాక్యుమెంట్లో ప్రభుత్వం వెల్లడించింది. ప్రజారోగ్యం కోణంలో ప్రజలు అడిగినవి ఆస్పత్రులు, మొబైల్ వ్యాన్లు, తక్కువ ఖర్చుకు వైద్య ప రీక్షలు, టెలీ మెడిసిన్, స్వచ్ఛమైన నీరు–పారిశుధ్యం, వ్యా ధుల నియంత్రణ, ఆరోగ్య బీమా సౌకర్యం, మానసిక ఆరోగ్యం, పోషకాహారం, తక్కువ ఖర్చుతో మానసిక వైద్యం. ఆర్థిక వృద్ధి కోణంలో... సత్వర ఉపాధిని కల్పించే కోర్సులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, చిన్న వ్యాపారాలకు మద్దతు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మార్కెట్ మార్గదర్శకత్వం, పర్యాటక అభివృద్ధి, స్థానిక చేతి వృత్తులకు ప్రోత్సాహం. స్థానికాభివృద్ధి, అవకాశాలపై.... సమీపంలో ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటు, స్థానికంగా ఉద్యోగాలు, పారదర్శక పాలన, మహిళాభద్రత, వారికి మంచి అవకాశాలు కల్పించడం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం. -
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. డే2 స్పెషల్ ఎట్రాక్షన్స్ ఇవిగో (ఫొటోలు)
-
పేదరికం ఏంటో నాకు తెలుసు.. అందుకే ఈ తపన: సీఎం రేవంత్
సాక్షి, ఫ్యూచర్‌సిటీ: సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన తమ ప్రభుత్వ లక్ష్యం అని.. విద్య మీద ఖర్చు చేసేది వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్ పేటలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉంది. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానిది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చాం2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసింది. ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారు.... ఇప్పుడు మేం ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత. పేదలలో నిరుపేదలకు సహాయం చేయడం మా ప్రాధాన్యత. సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన మా లక్ష్యం. ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేసేది వ్యయం కాదు పెట్టుబడి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ, స్కిల్ లేదు. దాన్ని మేం నెలకొల్పుతాం. 140 కోట్ల జనాభాలో ఎంతమంది మెడల్స్ వస్తున్నాయి?. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ నుండి గోల్డ్ మెడల్స్ తెచ్చేలా కృషి చేస్తాంపేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష. కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిది.. కానీ నాకు పేదరికం ఏంటో తెలుసు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకుని వచ్చా. నాకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉంది. పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన.... విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇది మేం ఖర్చుగా భావించడంలేదు. ఇది తెలంగాణ భవిష్యత్‌కు పెట్టుబడిగా భావిస్తున్నాం. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోందిఅందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’’ అని రేవంత్ ప్రసంగించారు. -
Global Summit: నేను చిరంజీవిగా ఇక్కడకు రాలేదు
సాక్షి, ఫ్యూచర్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు.. చెప్పిన కొన్నిరోజులకే ఎందరో ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మంగళవారం సాయంత్రం ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. వేదిక పై ఒక్కో రంగం నుంచి ఒక్కరు ఉన్నారు. నన్ను వేదికపై ఉంచడం సినిమా పరిశ్రమ కు ఇచ్చిన గౌరవం గా భావిస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ అంటే ఎంతో గౌరవం. నేను చిరంజీవిగా రాలేదు. సినిమా ఇండస్ట్రీ తరుపున వచ్చా. సీఎం రేవంత్‌రెడ్డి ‘బ్రెయిన్ చైల్డ్’ చూడాలని సమిట్‌కు వచ్చా. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన మొదట్లోనే హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా చేయాలని ఆయన మాతో అన్నారు. చెప్పినట్లుగానే.. సీఎం ప్రాక్టికల్‌గా ముందుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు. చెప్పిన కొన్ని రోజులకే ఎందరో ప్రముఖులను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ సమిట్ చూసిన తర్వాత.. సీఎం అనుకున్నది సాధిస్తారనే విశ్వాసం వచ్చింది. వినోద రంగం పరంగా ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా కృషి చేస్తామని నమ్మకంగా చెప్పారు. మా సలహాలతో ముందుకు వెళ్తాం అన్నారు. అన్నట్లుగానే చేసి చూపిస్తున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వ్యసనాలకు అలవాటు పడ్డ యువతను వినోదం వైపు మల్లించాలి. చదువే ప్రమాణికం కాదు , డిగ్రీ లేని వారు కూడా జాతీయ స్థాయి సినిమా లు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలంటూ ఇండస్ట్రీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు.. నేను దీనిపై ఆలోచన చేస్తున్నా... ఇండస్ట్రీ కూడా చేయాలి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కి నా సపోర్ట్ ఉంటుంది’’ అని చిరంజీవి అన్నారు. -
గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ డే-2 అప్డేట్స్ -
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. డే1 హైలైట్స్
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్‌లో జోష్ నెలకొంది.. -
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి, హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తిగా భద్రతా వలయంలో వెళ్లింది. ఫ్యూచర్ సిటీ వేదికగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025’ నేడు ఆవిష్కృతం కాబోతోంది. దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.మరోవైపు.. మీర్ఖాన్పేటలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు వచ్చే మార్గాల్లో సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఈమేరకు ఆయా మార్గాల్లో అతిథులు, ప్రముఖుల వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పలు రహదారుల మళ్లింపులు, క్లోజ్‌లు ఉంటాయి. సాధారణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.హైదరాబాద్– శ్రీశైలం మార్గంలో..ప్రధానంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్‌హెచ్–765)లో వీడియోకాన్ జంక్షన్ నుంచి తుక్కుగూడ, నెహ్రూ ఔటర్ రోటరీ (ఎగ్జిట్ నంబరు–14), హర్షాగూడ, మహేశ్వరం గేట్, కొత్తూర్ క్రాస్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కొత్తూర్ క్రాస్ రోడ్స్ నుంచి పెద్ద గోల్కొండ, ఔటర్ ఎగ్జిట్–15 మధ్య ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. కాబట్టి వాహనదారులు పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఔటర్ నుంచి ఎన్‌హెచ్–765 మీదుగా వచ్చే భారీ వాహనాలు తుక్కుగూడ ఔటర్ (ఎగ్జిట్ నంబరు–14) వద్ద కాకుండా పెద్ద గోల్కొండ, ఓఆర్ఆర్ (ఎగ్జిట్–15) వద్ద మళ్లింపులు తీసుకోవాలని తెలిపారు.స్కాన్ చేసి.. పార్కింగ్ చేయ్.. భారత్ ఫ్యూచర్ సిటీ వద్ద ఏడు ప్రాంతాల్లో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు. కోడ్‌ను స్కాన్ చేస్తే పార్కింగ్ ప్రాంతం రహదారి మార్గాన్ని సూచిస్తుంది. రోడ్లకు ఇరువైపులా అనధికారికంగా వాహనాలను పార్కింగ్ చేయకూడదు. విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తుశంషాబాద్లో భద్రత..గ్లోబల్ సమ్మిట్‌కు అతిథుల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట బందోబస్తును సిద్ధం చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్, లాంజ్ ఏర్పాటు చేశారు. ఆర్జీఐఏ ఔట్‌పోస్టు ఇన్స్పెక్టర్ కనకయ్య ఆధ్వర్యంలో 24 గంటల పాటు అన్ని పాయింట్ల వద్ద బందోబస్తు కొనసాగుతోంది. అతిథుల కోసం ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. సిటీ ముస్తాబు..మహా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైంది. సమ్మిట్‌కు హాజరయ్యే దేశ, విదేశాల ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, తెలంగాణ సాంస్కృతిక ఆకర్షణల, రంగురంగుల జెండాలు మేళవింపుతో నగరం స్వాగతం పలకనుంది. చారిత్రక కట్టడాలు, పర్యటక ప్రదేశాలు, చెరువులు, ప్రధాన రహదారులు. కూడళ్లు తదితర అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, కటౌట్లు, ఫ్లెక్సీలు, హైటెక్ ప్రొజెక్టర్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో నగరం తళతళా మెరిసిపోతోంది. ప్రధానంగా అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనం.. ఇలా నగరమంతటా ప్రత్యేక లైటింగ్‌తో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నారు. -
ప్రధాన రహదారులకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు!
హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. ెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద రావిర్యాలను నుంచి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు.రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే “టాటా ఇంటర్చేంజ్” అని పేరు పెట్టారు.ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది.మరిన్ని ప్రధాన రహదారులకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని “గూగుల్ స్ట్రీట్” అని ప్రకటించేందుకు ప్రతిపాదనతో పాటు మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి:రూ. 11 లక్షల కోట్లు ఇస్తే.. రూ. 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు? -
పరిశ్రమలే కీలకం.. డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: సంపన్న, సమానత్వ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’విజన్ డాక్యుమెంట్లో పరిశ్రమల శాఖకు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో పరిశ్రమలు, ఐటీ రంగాలు కీలక పాత్ర పోషించేలా డాక్యుమెంటుకు రూపకల్పన జరుగుతోంది. మేధో వలసను అరికట్టడంతో పాటు ఆవిష్కరణలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష సాంకేతికత, ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్ స్టార్టప్‌లు, టూరిజం, సూక్ష్మ చిన్న పరిశ్రమలు, ఎగుమతులు తదితరాల ద్వారా లక్ష్యాన్ని సాధించేలా కసరత్తు జరుగుతోంది. ఐటీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అంతర్జాతీయ స్థాయి నిపుణులు, సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ డాక్యుమెంటు రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. త్వరలో ఈ డాక్యుమెంటుకు తుదిరూపు ఇచ్చేందుకు డ్రాఫ్టింగ్ బృందాలు పనిచేస్తున్నాయి. వెన్నెముకగా మూడు కారిడార్లు హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– విజయవాడ పారిశ్రామిక కారిడార్లు, చిన్న తరహా పారిశ్రామిక పట్టణాలు, మెగా పారిశ్రామిక పార్కులు, సెమీ కండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలను బలోపేతం చేసేలా విజన్ డాక్యుమెంటులో పొందుపరుస్తున్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు పారిశ్రామిక ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచేందుకు అనువైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎంఎస్ఎంఈలు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు పెంచేలా కసరత్తు జరుగుతోంది. డీప్ టెక్, ఫిన్‌టెక్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్తలో ఐటీ, పారిశ్రామిక రంగాలను భాగస్వామ్యం కల్పించేలా విజన్ డాక్యుమెంట్‌కు రూపకల్పన జరుగుతోంది. తెలంగాణ భవిష్యత్తుకు మూల స్తంభాలను రంగాల వారీగా పేర్కొంటున్నారు. తెలంగాణ అభివృద్ధిలో మూల స్తంభాలు ఐటీ రంగం: ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, కృత్రిమ మేథస్సు, క్వాంటం కంప్యూటింగ్, డిజిటల్ పరిపాలన, వీఎల్ఎస్ఐ, రోబోటిక్స్, హార్డ్‌వేర్, ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ వాతావరణం. పరిశ్రమలు, తయారీ రంగం: ఔషధ, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలు, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, అడ్వాన్సుడ్ మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ మొబిలిటీ, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, ఫ్యాషన్, గనులు, ఖనిజాలు -
ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలు,సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామ ని చెప్పారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు ‘ఒకవైపు కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు చెల్లిస్తూనే, సంక్షోభంలో ఉన్న రాష్టాన్ని గాడిన పెట్టాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం రావాలని 2009లో ఒక పెద్దాయన ఎంపీగా వలస వచ్చారు. తెలంగాణ వస్తే తమ కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని.. తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆయనకు అవకాశం కలి్పంచారు. కానీ తెలంగాణకు మొట్టమొదటి సీఎం అయిన ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు. సాగునీటి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా సంగబండలో బండ పగులకొట్టడానికి రూ.12 కోట్లు ఇవ్వలేదు. మనకు సాగు, తాగునీరు కోసం ఆయన ఏనాడూ తాపత్రయ పడలేదు..’ అని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. దండుకట్టి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి.. ‘ప్రస్తుతం పాలమూరు ప్రజలు వారి బిడ్డను ఆశీర్వదించి సీఎం చేయడంతో మంత్రుల సహకారంతో కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల్లో భూములు కోల్పోయిన వారికి సహాయ, పునరావాసాన్ని (ఆర్అండ్ఆర్) నూటికి నూరు శాతం మంజూరు చేసి అమలు చేస్తాం. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీఓ కోసం గొంతెత్తి మాట్లాడినా అప్పట్లో మన బాధను ఎవరూ వినలేదు. ఇప్పడు కూడా కుట్రలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నిస్తే ..కేసులు వేసి ఏడాదిన్నరగా నిలిపి వేయించారు. కానీ మంత్రి శ్రీహరి రైతులతో మాట్లాడి 96 శాతం రైతులను ఒప్పించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం మంజూరు చేశాం. ఈ ప్రాజెక్టు కోసం దండుకట్టి. గుంపు కట్టి రెండేళ్లలో పూర్తి చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు గడువులోగా పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగించండి. రాతింబ్రవళ్లు పని చేయించుకోండి. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించే వారిని స్పర్పంచ్లుగా ఎన్నుకోవాలి ‘మీరు ఒక్క ఓటు వేస్తే ఇన్ని సమస్యలు తీరాయి. 2023లో ఊరు గెలిచాం. ఇప్పుడు రచ్చ గెలవాలి. ఇంకా పదేళ్లు ఉంటే అన్నీ చేయొచ్చు. ప్రభుత్వం కాళ్ల కింద కట్టె పెట్టే వారిని సర్పంచ్‌గా చేస్తే ఊరు దెబ్బతింటది. గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఎవరి మాటలో నమ్మి ఓట్లు వేస్తే గోస పడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలి. మన సమస్య తెలిసి పరిష్కరించే వారిని ఎన్నుకోవాలి..’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సభకు ముందు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి వనపర్తి జిల్లా ఆత్మకూర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మంత్రి వాకిటి భావోద్వేగం సీఎం బహిరంగ సభలో మంత్రి వాకిటి శ్రీహరి భావోద్వేగానికి గురయ్యారు. సభలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచి్చనా బాధలేదు. నన్ను వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసినా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మక్తల్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి అడుగులు వేయించిన సీఎం రేవంత్‌రెడ్డి వచి్చన సమయంలో పెద్ద మనసుతో ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. కానీ మీ ప్రవర్తనతో మనసు గాయపడింది..’ అంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో ఎప్పుడైనా రెండేళ్లలో రూ.1,000 కోట్లు వచ్చాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తప్పు మరోసారి చేయకండి..’ అని కోరారు. -
తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఈ జిల్లాలకు సీఎం రేవంత్
తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ముందుకువెళ్తుందని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి తయారు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ రోడ్డు మ్యాప్‌ను ప్రజల ముందు ఉంచబోతున్నామన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ పేరుతో డిసెంబర్ 1 నుంచి ఆరవ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారిగా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ , డిసెంబర్ 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, డిసెంబర్ 3న వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ , 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట , 6న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ ఉత్సవాలకు హాజరవుతారన్నారు.రాష్ట్రానికి ఐకానిక్ గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిసెంబర్ 8,9 న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 9న త్రీ మిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడానికి భవిష్యత్‌లో తీసుకోబోయే నిర్ణయాలతో పాటు ఎలాంటి అభివృద్ధి చేస్తామో దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని విడుదల చేసి సమాజం ముందు ఉంచుతామన్నారు.


