గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ | Telangana Rising Global Summit 2025 Day 2 Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

గ్లోబల్ సమ్మిట్: తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

గ్లోబల్‌ సమ్మిట్‌.. గిన్నిస్‌ రికార్డు బద్ధలు

  • తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 
  • ముగింపు వేడుకలో ఆకట్టుకున్న భారీ డ్రోన్‌ షో 
  • తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలు వివరించే థీమ్‌లతో డ్రోన్‌ షో 
  • గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించేలా 3 వేల డ్రోన్‌లతో ప్రత్యేక ప్రదర్శన  
  • గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్ల ప్రదర్శనకు గిన్నిస్‌బుక్‌ రికార్డు 
  •  తాజాగా దానిని అధిగమించిన తెలంగాణ ప్రభుత్వ డ్రోన్‌ ప్రదర్శన 
  • సీఎం రేవంత్‌కు గిన్నిస్‌ బుక్‌ ధ్రువపత్రం అందజేసిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సభ్యులు
2025-12-09 21:25:58

గ్లోబల్ సమ్మిట్‌లో ప్రారంభమైన డ్రోన్ షో..

  • గ్లోబల్ సమ్మిట్‌లో ప్రారంభమైన డ్రోన్ షో..
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్రోన్‌ల వెలుగులు
  • గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో ప్రముఖ సంస్థల భారీ ఎంవోయూలు
  • అనుకున్నదానికంటే అధిక పెట్టుబడులు!
2025-12-09 20:46:47

తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌లో కీలక అంశాలివిగో..

  • తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం.
  • మూడు ప్రధాన స్తంభాలు: ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి.
  • మూడు ఉత్ప్రేరకాలు: సాంకేతికత–ఆవిష్కరణ, సమర్థవంతమైన ఫైనాన్స్, సుపరిపాలన.
  • రాష్ట్రాన్ని CURE–PURE–RARE మూడు ఆర్థిక జోన్‌లుగా విభజన.
  • CURE జోన్‌ను నెట్-జీరో సిటీగా, గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్‌గా అభివృద్ధి.
  • PURE జోన్‌ను తయారీ మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి.
  • RARE జోన్‌ను వ్యవసాయ–హరిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం.
  • 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక మైలురాయి సాధించడం.
  • 2047 నాటికి జాతీయ GDPలో 10% వాటా లక్ష్యం.
  • 4 లక్షల మంది ప్రజల అభిప్రాయాలతో రూపొందించిన దార్శనిక పత్రం.
  • NITI Aayog, ISB నిపుణుల సలహాలతో రూపొందించిన వ్యూహాలు.
  • భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ రీజువెనేషన్ వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులు.
  • రీజినల్ రింగ్ రోడ్, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల అభివృద్ధి.
  • డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత, సేవల వేగవంతం.
  • ప్రపంచ స్థాయి విద్య–పరిశోధన కేంద్రాలతో తెలంగాణను నాలెడ్జ్ హబ్‌గా నిర్మించడం.
  • మహిళలు, యువత, రైతులకు సమాన అవకాశాలతో సుస్థిర సంక్షేమం.
  • భారీ మౌలిక వసతుల కోసం ప్రత్యేక పెట్టుబడి నిధుల ఏర్పాటు.
  • పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రాధాన్యం.
  • తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ మరియు పర్యాటక అభివృద్ధి.
  • పాలనలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో “ప్రజల కోసం–ప్రజల చేత” అభివృద్ధి.
2025-12-09 20:46:47

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల

  • తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ
  • గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 వేదికగా విడుదల చేసిన సీఎం రేవంత్‌
  • పాల్గొన్న పారిశ్రామిక, సినీ, రాజకీయ ప్రముఖులు
  • తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రమఖులకు సన్మానం చేసిన సీఎం రేవంత్‌

 

2025-12-09 20:37:55

గ్లోబల్‌ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌ ప్రసంగం

  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా, మన్మోహన్‌ సింగ్‌లు ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు
  • 2047 నాటికి స్వాతంత్రం సాధించి వందేళ్లు పూర్తవుతుంది
  • వికసిత్‌ భారత్‌ విజన్‌తో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారు
  • 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకుని మేం ముందుకు వెళ్తున్నాం ‍
  • విజన్‌ డాక్యుమెంట్‌లో భాగం పంచుకున్నందుకు నిపుణులకు కృతజ్ఞతలు
  • 4 లక్షల మంది తెలంగాణ ప్రజలు ఆన్‌లైన్‌లో తమ సలహాలు అందించారు
  • స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పించేందుకు విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాం
  • 83 పేజీలతో విజన్‌ డాక్యుమెంట్‌ నాలుగు గోడల మధ్య రూపొందించింది కాదు
  • నిపుణుల్ని, ఆర్థిక వేత్తల్ని, ప్రజల్ని భాగస్వాముల్ని చేశాం
  • నీతి ఆయోగ్‌, ఐఎస్‌బీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగం అయ్యాయి
  • ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలతో కలిసి పెరిగాను.. పరిస్థితులేంటో మాకు తెలుసు
  • చైనా, జపాన్‌, సింగపూర్‌, కొరియా మాకు స్ఫూర్తి
  • పేదరిక నిర్మూలన, పేద ప్రజల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
  • ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ మాకు అత్యంత ప్రాధాన్యం
  • అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం.. లక్ష్యాన్ని సాధిస్తాం
2025-12-09 20:37:55

సినిమా హబ్‌గా హైదరాబాద్: చిరంజీవి

  • హైదరాబాద్ సినిమా హబ్‌గా చేయాలి.
  • గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.
  • విభిన్న రంగాల నిష్ణాతులు ఇక్కడ ఉన్నారు.
  • ఇంతమంది దిగ్గజాల మధ్య ఉండడం సంతోషం.
  • తెలంగాణలో లేని వనరులు ఏవి.
  • చిత్రపరిశ్రమ ప్రతినిధిగా నేను వచ్చా.
2025-12-09 20:06:30

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల ప్రవాహం

  • ఇప్పటి వరకూ రూ.5.7లక్షల కోట్ల పెట్టుబడులు.
  • తొలిరోజు రూ.2.43 లక్షల పెట్టుబడులు.
  • రెండోరోజు ఇప్పటివరకూ రూ. 2.96 లక్షలు.
  • భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న గ్లోబల్ సమ్మిట్ 
2025-12-09 20:02:46

విజన్‌ డాక్యుమెంట్‌.. ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రసంగం

  • సోనియా గాంధీ పుట్టినరోజు వేళ.. రాష్ట్రాభివృద్ధికి విజన్‌ డాక్యుమెంట్‌, గ్లోబల్‌సమ్మిట్‌ జరగడం సంతోషకరం
  • తెలంగాణ అభివృద్ధికి 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఓ దిక్సూచి
  • నిపుణులు, వ్యాపారవేత్తల సలహాలతో విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాం 
2025-12-09 19:16:11

గ్లోబల్‌ సమ్మిట్‌లో భారీ పెట్టుబడులు

  • రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ లో వివిధ కంపెనీలతో  5.75 లక్షల కోట్ల పెట్టుబడులు 
  • ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం
2025-12-09 19:16:11

విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ప్రముఖులు

  • తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం
  • హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు పారిశ్రామిక వేత్తలు, సీని ప్రముఖులు 
  • మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాలిఫోర్నియా ఎకనమిక్ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ GOI  
  • సినీ నటుడు చిరంజీవి, తదితరులు 
  • మంత్రులు, దేశ, విదేశాల ప్రముఖులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు.
2025-12-09 19:11:24

విజన్ డ్యాక్యుమెంట్ చూశాక టార్గెట్ మార్చా: ఆనంద్ మహీంద్రా

  • విజన్ డ్యాక్యుమెంట్ చూస్తే నిపుణులు, తెలంగాణ ప్రజలు కలిసి రూపొందించిన పత్రంలా ఉంది.
  • విజన్ డ్యాక్యుమెంట్ చూశాక టార్గెట్ పెద్దగా ఉండాలని నిర్ణయించుకున్నా.
  • యువత, మహిళలు అందరి అభివృద్ధి ఇందులో ఉంది.
  • స్ఫూర్తిదాయక డాక్యుమెంట్ రూపొందించినందుకు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు 
  • జహీరాబాద్‌లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ పరిశ్రమ మాకు గర్వకారణం 
  • నాలుగు దశాబ్ధాలుగా వ్యాపార వేత్తగా ఉన్న నాకు సీఎం రేవంత్ ఓ సమఉజ్జీగా అనిపించారు.
  • ఎంత ఏఐ ఉన్నా డిజిటల్ వచ్చినా హ్యుమన్ టచ్‌కు ఉన్న ప్రత్యేకత వేరు 
  • ఆ స్కిల్‌ను భర్తీ చేయడం ఎవరి వల్లా కాదు. 
2025-12-09 18:53:34

గ్లోబల్ సమ్మిట్‌లో పోలీసులు ఓవరాక్షన్

  • వైల్డ్ ప్రచారం చేయాలని కోరిన ప్రభుత్వం.
  • మీడియా కు పోలీసులు సహకరించాలని పోలీసులను అదేశించిన సీఎం.
  • సీఎం ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న పోలీసులు
  • సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులఇంటర్వ్యూలు చేయకుండా అడ్డగింపు.
  • పోలీసుల తీరుపై మీడియా అసంతృప్తి.
2025-12-09 18:40:09

గ్లోబల్ ఎంటర్టైన్‌మెంట్ హబ్‌గా హైదరాబాద్:మంత్రి కోమటిరెడ్డి

  • సృజనాత్మక శతాబ్దంలో  ప్రపంచ సాఫ్ట్ పవర్‌గా భారత్.
  • భారతీయ సినిమాలు, సంగీతం, డిజిటల్ కంటెంట్‌కి ప్రపంచంలో భారీ డిమాండ్.
  • గ్లోబల్ క్రియేటివ్ & ఎంటర్టైన్‌మెంట్ హబ్‌గా హైదరాబాద్ 
  • మీడియా–వినోద రంగ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ.
  • నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా భారీ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, రీయింబర్స్‌మెంట్‌లు.
  • సినిమా పరిశ్రమ కార్మికుల కోసం సమగ్ర సంక్షేమ పథకాలు.
  • అంతర్జాతీయ స్టూడియోలు,ఓటీటీ,గేమింగ్ కంపెనీలకు ఆహ్వానం.
  • భారత క్రియేటివ్ గేట్‌వేగా హైదరాబాద్‌.
  • ప్రపంచ క్రియేటివ్ గేట్‌వేగా భారత్.

     

2025-12-09 18:08:37

ఫ్యూచర్ సిటీలో 13లక్షల ఉద్యోగాలు:మంత్రి శ్రీధర్ బాబు

  • ఫ్యూచర్ సిటీ 13,500 ఎకరాల్లో జీరో కార్బన్ సిటిగా అభివృద్ధి కాబోతుంది.
  • మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగాలు.
  • 9లక్షల జనాభాకి ఆధునిక హౌసింగ్ సదుపాయాలు.
  • నగరం ఆరు ప్రత్యేక అర్బన్ డిస్ట్రిక్టులుగా రూపుదిద్దుకోనుంది.
  • ఏఐ,హెల్త్, ఎడ్యుకేషన్, డేటా, ఎంటర్‌టైన్‌మెంట్లకు ప్రత్యేక జోన్‌లు.
  • డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలు కేటాయించి త్వరలో నిర్మాణాలు ప్రారంభిస్తారు.
  • అర్బన్ ఫారెస్టులతో పచ్చదనం పండించే సస్టైనబుల్ సిటీగా అభివృద్ది.
  • రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏర్పాటు.
2025-12-09 17:58:09

స్క్రిప్ట్‌తో వస్తే సినిమాతో వెళ్లేలా ప్రోత్సాహం:సీఎం రేవంత్

  • సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం. 
  • సినీ ఇండస్ట్రీకి కావాల్సిన అన్నిసౌకర్యాలు కల్పిస్తామన్న సీఎం.
  • ప్యూచర్ సిటీలో స్కిల్స్ వర్సిటీ ఏర్పాటు చేశాం.
  • ప్యూచర్ సిటీలో స్టూడియోల ఏర్పాటుకు సహకారం.
  • స్క్రిప్ట్‌తో వస్తే సినిమాతో వెళ్లేలా ప్రోత్సహిస్తాం.
  • హాజరైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్‌రాజు, జెనీలియా, అక్కినేని అమల.
     
2025-12-09 17:40:31

సినిమా ఇండస్టీకి మద్దతు అవసరం: సినీ హీరో రాహుల్ రవీంద్ర

  • గ్లోబల్ సమ్మిట్ పానెల్ చర్చలో పాల్గొనడం ఎక్సైటెడ్‌గా ఉంది.
  • సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి చర్చలు అవసరం.
  • పానెల్ చర్చల ద్వారా నాకు మరింత నేర్చుకునే అవకాశం దక్కింది.
  • సినీ పరిశ్రమ అభివృద్ధి మరింతగా జరగాలని అందరం కోరుకుంటున్నాం.
  • ప్రభుత్వం సినీ పరిశ్రమ రెండు కలిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు.
  • సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వ మద్దతు అవసరం.
  • సినిమా తీయడం అంత ఈజీ కాదు.
  • గ్రామీణ నేపథ్యంలో ఉన్న వారిని సినిమా రంగంలో ప్రోత్సహించాలి.
2025-12-09 16:32:44

గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్

  • గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనటం సంతోషం గా ఉంది.
  • సమ్మిట్ నుంచి విద్యార్తిగా  కొత్త విషయాలు నేర్చుకుంటా.
  • ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అందరం కలిపి పనిచేయాలి.
  • కొత్త ఫిల్మ్ సిటీ రావడంతో సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది.
  • సినిమా పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. 
     
2025-12-09 16:26:29

ఆ భయాన్ని ఎలా అధిగమించాలి?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
  • తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ మన భవిష్యత్తుకు ప్రతిజ్ఞ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • రాబోయే 22 ఏళ్లలో 16 రెట్లు ఆర్థిక వృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • మూలధనం, ఆవిష్కరణ, ఉత్పాదకత… ఇదే తెలంగాణ ఆర్థిక సమీకరణం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఏఐ, డీప్‌టెక్, క్వాంటమ్ టెక్ రైతు వరకూ చేరాలి, ఉత్పాదకత పెంచే టెక్‌కి ప్రాధాన్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు… ఇప్పుడు ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్ అవసరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • CURE–PURE–RARE స్పేషియల్ స్ట్రాటజీతో అర్బన్–పెరి అర్బన్–రూరల్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఇన్నోవేషన్ ఖరీదైనది… రిస్క్ లేకుండా బ్రేక్‌థ్రూ‌లు రావు, రిస్క్‌ను పంచుకునే ‘క్యాటలిస్ట్’ అవుతుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఉత్పాదకత పెరిగితే ఉద్యోగాలు తగ్గుతాయని భయాన్ని ఎలా అధిగమించాలి?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • రైతుల సమస్యల వంటి ‘బోరింగ్ ప్రాబ్లమ్స్’ను పరిష్కరించే డీప్‌టెక్‌కి క్యాపిటల్‌ను ఎలా ఆకర్షించాలి?.. ప్యానెల్‌ను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం
2025-12-09 15:03:42

పెట్టుబడుల వెల్లువ

  • గ్లోబల్‌ సమ్మిట్‌లో పెట్టుబడుల వెల్లువ
  • రెండో రోజు సమ్మిట్‌లో 1,04,350 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం..
  • దీంతో ఇప్పటి వరకు 3లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ చేసుకున్న ప్రభుత్వం
2025-12-09 15:01:49

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పలు సంస్థల ప్రతినిధులు

  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఐఐఎఫ్ఏ (IIFA) ప్రతినిధులు, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు , atmosphere core india ప్రతినిధులు ,శ్రీ హవీషా హాస్పిటలిటీ,సారస్ ఇంఫ్రాస్ట్రక్చర్,పోలిన్ గ్రూప్,మల్టీవర్స్,కారవాన్ ప్రతినిధులు

  • హైదరాబాద్‌లో జిసిసిని ప్రారంభించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్.

  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కెఈఐ (KEI)గ్రూప్స్ ప్రతినిధులు..

  • క్రిస్టల్ లాగూన్స్ (యుఎస్ ఏ), గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ ప్రతినిధులు

  • సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి

  • సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన బయోవరం ఫార్మా గ్రూప్ ఛైర్మన్ వరప్రసాదరెడ్డి,సంస్థ ప్రతినిధులు.
  • ఫార్మా/ లైఫ్ సైన్సెస్ రంగంలో కంపెనీ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో MOU కుదుర్చుకున్న MSN గ్రూప్.
2025-12-09 13:20:31

గ్రౌండ్ లెవెల్‌లో ప్రోత్సహకాలను ప్రభుత్వాలు ఇస్తే మరింత అభివృద్ధి: పుల్లెల గోపీచంద్

సాక్షి టీవీతో ఇండియన్ బాడ్మింటన్ మాజీ ప్లేయర్ అండ్ చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్

  • ఇలాంటి సమ్మిట్ వల్ల చాలా ఉపయోగం ఉంది. 
  • క్రీడా అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సూచనలను పరిగణలోకి తీసుకోబోతుంది.
  • గ్రౌండ్ లెవెల్ లో ప్రోత్సహకాలను ప్రభుత్వాలు ఇస్తే మరింత క్రీడా అభివృద్ధి జరుగుతుంది.
  • భవిషత్ లో ప్రభుత్వాలు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.

 

2025-12-09 13:16:18

ఓ క్రీడాకారునిగా సంతోషంగా ఉంది: మంత్రి అజారుద్దిన్

సాక్షి టీవీతో మంత్రి అజారుద్దిన్

  • క్రీడాకారునిగా సంతోషంగా ఉంది.

  • రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధి కోసం అన్ని పాలసీలు తీసుకుంటుంది.

  • రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

  • ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ కోసం నేను సైతం వేచి చూస్తున్నా.

  • ప్రభుత్వం అమలు చేసే ప్రతిదీ క్రీడాకారుల అభివృద్ధి కోసం ఉంటుంది.

  • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పాలసీలు చాలా వచ్చాయి.

  • క్రీడాకారుల అభివృద్ధి కోసం మరిన్ని పాలసీలు అవసరం.

2025-12-09 13:16:18

మరింత ప్రోత్సహకాలు అవసరం: అంబటి రాయుడు

  • క్రీడా టాలెంట్ బయటకు రావాలంటే మరింత ప్రోత్సహకాలు అవసరం.
  • ఇలాంటి సమ్మిట్‌లు స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ఉపయోగపడుతాయి.
  • గ్రౌండ్ లెవల్ నుంచి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఉండాలి.
  • రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రీడా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి.
  • సాక్షి టీవీతో అంబటి రాయుడు.
2025-12-09 13:02:26

తెలంగాణ ప్రగతికి దిక్సూచి ఈ సమ్మిట్: మంత్రి తుమ్మల

తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసే ఒప్పందాలు చేసుకున్నాం.

ఆర్గానిక్ ఉత్పత్తికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

దావోస్ సమ్మిట్ కంటే తెలంగాణ సమ్మిట్ బావుందని విదేశీ ప్రతినిధులు చెప్తున్నారు.

బిఆర్ఎస్ వాల్లకు ఇంట్లో కూర్చుని ఏడవడం తప్ప మరోక ఆప్షన్ లేదు.

తెలంగాణ ప్రగతికి దిక్సూచి ఈ సమ్మిట్.

సాక్షి న్యూస్‌తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

2025-12-09 12:57:26

క్రీడా అభివృద్ధికి ఇలాంటి సమ్మిట్‌లు అవసరం: పీవీ సింధు

  • క్రీడాకారుల అభివృద్ధి అనేది చాలా అవసరం.
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా పాలసీలను అమలు చేయాలి.
  • మ్యాన్ పవర్ అనేది అవసరం.
  • క్రీడాకారులకు చోచెస్ అవసరం.
  • క్రీడా పరికరాలు పెద్ద ఎత్తులో అవసరం ఉంది.
  • క్రీడా అభివృద్ధికి ఇలాంటి సమ్మిట్‌లు అవసరం.
  • సాక్షి టీవీతో పీవీ సింధు

 

 

 

 

2025-12-09 12:53:04

సీఎం రేవంత్ సమక్షంలో MOUలు కుదుర్చుకుంటున్న పలు కంపెనీలు

  • ఫ్యూచర్ సిటీలో రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.

  • తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు

  • గ్లోబల్ సమ్మిట్ లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో బిజీ బిజీగా సీఎం

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణతో పెట్టుబడులకు MOU లు కుదుర్చుకుంటున్న పలు కంపెనీలు

  • ఎంవోయూలు కుదుర్చుకున్న సుమధుర గ్రూప్, TCCI తైవాన్ గ్రూప్

2025-12-09 12:48:54

నిన్న16 వేల కోట్ల పెట్టుబడుల ఎంఓయూ జరిగింది: మంత్రి వాకిట శ్రీహరి

  • నిన్న స్పోర్ట్స్ కు సంబంధించి 16 వేల కోట్ల పెట్టుబడుల ఎంఓయూ జరిగింది.
  • నేడు మరో 10 వేల కోట్ల ఎంఓయూ జరుగుతుంది.
  • ప్రతీ జిల్లా కేంద్రం లో ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందిస్తున్నాం.
  • 13 న ఉప్పల్ లో జరిగే ఫుట్ బాల్ గేమ్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది.
  • ప్రపంచ దిగ్గజ ఆటగాళ్ల ను హైదరాబాద్ తీసుకొస్తున్నాం.
  • ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికే పనికివస్తున్నాయి... కనీస ఆలోచన లేదు వాల్లకు
  • సాక్షి న్యూస్ తో మంత్రి వాకిట శ్రీహరి
2025-12-09 12:46:24

గ్లోబల్ సమ్మిట్ హల్స్‌లలో ప్రారంభం అయిన స్పెషల్ సెషన్స్

  • గ్లోబల్ సమ్మిట్ హల్స్‌లలో ప్రారంభం అయిన స్పెషల్ సెషన్స్
  • సెషన్స్ లలో పాల్గొన్న ఆయా శాఖల మంత్రులు
  • తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికలోని హాల్ 3 లో టెంపుల్ టూరిజం పై చర్చ
  • ఎకో టూరిజం అంశం మీద ప్రసంగించనున్న రాష్ట్ర మంత్రి  కొండా సురేఖ
  • హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు
2025-12-09 11:30:48

ప్రారంభమైన తెలంగాణ ఒలంపిక్ గోల్డ్ Quest

  • తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సుమ్మిట్ లో భాగంగా హాల్ 2లో ప్రారంభమైన తెలంగాణ ఒలంపిక్ గోల్డ్ Quest
  • పాల్గొన్న క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ శాఖ మంత్రి ఆజారోద్దీన్, చైర్మన్ శివసేన రెడ్డి
  • హాజరైన ప్రముఖ క్రీడాకారులు అనిల్ కుంబ్లే,పీవీ సింధు, పుల్లెల గోపి చంద్, జ్వాలా గుప్తా, బోరియా మజుందార్ తదితరులు

 

2025-12-09 11:27:37

మా పరిపాలనలో సోనియా గాంధీ స్పూర్తి ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

  • డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు మంచి రోజు
  • మా గుండెల్లో సోనియా గాంధీ ఉంటారు
  • మా పరిపాలనలో సోనియా గాంధీ స్పూర్తి ఉంటుంది
  • డిసెంబర్ 9 న తెలంగాణ ప్రజలు సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలి
  • ఇంతమంది మధ్యన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది
  • డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైంది
  • ఆరు దశాబ్దాల, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ అర్ధం చేసుకున్నారు
  • 2004 ఎన్నికల సమయంలో కరీంనగర్ గడ్డ నుండి సోనియా మాట ఇచ్చారు
  • ఎన్ని అవాంతరాలు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక పై నుంచి జిల్లాల కలెక్టరేట్లలోని తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాల్గొన్న మంత్రులు ,డెలిగేట్స్.
  • తెలంగాణ రాష్ట్ర గీతంతో మొదలైన సమ్మిట్.
  • ఎంసిఆర్ హెచ్ ఆర్ డి నుంచి హెలికాప్టర్‌లో ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు 
  • ప్రారంభమైన గ్లోబల్‌ సమ్మిట్‌ 
2025-12-09 10:41:52

గ్లోబల్ సమ్మిట్‌లో అంశాల వారీగా ఒప్పంధాలు: డిప్యూటీ సీఎం భట్టి

  • రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది.
  • గ్లోబల్ సమ్మిట్‌లో అంశాల వారీగా ఒప్పంధాలు జరుగుతున్నాయి.
  • కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు మా విజన్ చూసి ఓర్వలేక పోతున్నారు.
  • సాక్షి న్యూస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
  • పెట్టుబడులు రావడం నిరంతర పక్రియ.
  • వచ్చిన పెట్టుబడులు రియాలిటీ కి తీసుకురావడం మా ముందు ఉన్న టార్గెట్.
  • నిన్న రెండు లక్షల కోట్ల కు పైగా పెట్టుబడుల పై ఎంఓయూ జరిగింది.. ఈరోజు మరో రెండు లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూ జరుగుతుంది.
  • ప్రతిపక్షాలు విమర్శలు మాని సహకరించాలి.
  • విమర్శలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాలు ఉంటే ఎం.లాభం అని భట్టి విక్రమార్క అన్నారు.
2025-12-09 10:37:15

గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన గుత్తా జ్వాల

  • గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల హాజరైంది

     
2025-12-09 10:30:49

ఫ్యూచర్ సిటీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

  • ఎంసిఆర్ హెచ్ ఆర్ డి నుంచి హెలికాప్టర్‌లో ఫ్యూచర్ సిటీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
  • కాసేపట్లో గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభం
2025-12-09 10:18:08

సమ్మిట్‌కు హాజురైన పీవీ సింధు

  • గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం, ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు
  • ఇలాంటి సమ్మిట్‌లు అభివృద్ధికి దోహద పడుతాయి
  • స్పోర్ట్స్ లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా డెవలప్ అవుతుంది
  • ప్రపంచ స్పోర్ట్స్ కు హైదరాబాద్ కేంద్రం అయ్యే అవకాశం ఉందని పీవీ సింధు పేర్కొంది.

     
2025-12-09 09:59:06

సమ్మిట్‌కు ఇంధిరమ్మ చీర కట్టుకుని వచ్చిన కొండా సురేఖ

  • గ్లోబల్ సమ్మిట్‌కు ఇంధిరమ్మ చీర కట్టుకుని వచ్చిన మంత్రి కొండా సురేఖ
  • దేవాలయాల అభివృద్ధికి పీపీపి మోడల్ అనుసరిస్తాం.
  • ప్రైవేటు పెట్టుబడుల ద్వారా దేవాదాయ అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది.
  • నేతన్నల చీర గొప్పదనం గురించి తెలియజేసేందుకు ఇంధిరమ్మ చీర కట్టుకుని వచ్చా.
    సాక్షి న్యూస్ తో మంత్రి కొండా సురేఖ
2025-12-09 09:59:06

సమ్మిట్‌కు హాజురైన అనిల్‌ కుంబ్లే

  • సమ్మిట్‌కు హాజురైన మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే
  • కాసేపట్లో గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభం. 
2025-12-09 09:28:15

నేడు ఐటీ ,ఫిల్మ్ , ఫార్మా రంగ కంపెనీలతో ఎంవోయు

  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు వివిధ అంశాలపై జరగనున్న ప్యానెల్ డిస్కషన్స్
  • తొలిరోజు 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ
  • నేడు అజయ్ దేవగన్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు కు ఎంఓయూ చేసుకోనున్న ప్రభుత్వం.
  • నేడు ఐటీ ,ఫిల్మ్ , ఫార్మా రంగ కంపెనీ లతో ఎంవోయు చేసుకోనున్న ప్రభుత్వం.
  • సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాంక్యూమెంట్ ను విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.
  • 7 గంటలకు డ్రోన్ షో...తెలంగాణ అభివృద్ధి , సాంస్కృతిని డ్రోన్ షో లో చూపించనున్న ప్రభుత్వం.
2025-12-09 09:28:15

రెండవ రోజు కొనసాగనున్న గ్లోబల్ సమ్మిట్

  • రెండో రోజు తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి దాదాపు 20 సమావేశాల్లో పాల్గొంటారు.

  • ఎడ్యుకేషన్​, పవర్​, టూరిజం,  లైఫ్ సైన్స్,  ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, AI తో పాటు వివిధ రంగాల  పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.  పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

  • ఉదయం 9.30కు ఎంసీహెచ్​ఆర్​డీ నుంచి హెలికాప్టర్​లో సీఎం  ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు.

  • ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాలను గ్లోబల్​ సమ్మిట్​ వేదిక నుంచి వర్చువల్​గా ఆవిష్కరిస్తారు.

  • సాయంత్రం మహీంద్రా అండ్​ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.  గ్రీన్ వెహికిల్స్​, రూరల్ ఎంటర్‌ప్రైజ్ రంగాల్లో పెట్టుబడుల చర్చిస్తారు.

  • సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్​ విజన్​ డాక్యుమెంట్​ను ఆవిష్కరిస్తారు.

  • రాత్రి 7 గంటలకు డ్రోన్ షో. ఫైర్ వర్క్స్​తో Telangana is Rising – Come, Join the Rise  థీమ్‌ ప్రదర్శనతో ముగింపు వేడుక నిర్వహిస్తారు.

2025-12-09 09:24:34
Advertisement
 
Advertisement
Advertisement