Live Updates
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం
తెలంగాణ గవర్నర్ ఏమన్నారంటే..
- అట్టహాసంగా తెలంగాణ రైజింగ్‌గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం
- గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
- రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
- విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
- 2047 నాటికి ట్రిలియన్ ఆర్థికాభివృద్ధి లక్ష్య సాధన నెరవేరాలి : గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
- అంతర్జాజాతీయ స్థాయిలో రెండ్రోజులపాటు జరగనున్న సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం
- తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్.
- ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.
- సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ ప్రతినిధులు.
- పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు.
- గ్లోబల్ సమ్మిట్‌లో 27 అంశాలపై సెషన్లు.
సమ్మిట్ వద్దకు చేరుకున్న గవర్నర్
- గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకున్న గవర్నర్ జిష్టుదేవ్ వర్మ.
- బీజేపీ తరఫున గ్లోబల్ సమ్మిట్ కు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
- విద్యాశాఖ స్టాల్‌ను పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ
- తెలంగాణ తల్లికి సీఎం రేవంత్, మంత్రుల నివాళులు
మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
- గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మంత్రి కోమటిరెడ్డి
- ప్రపంచమంతా గ్లోబల్ సమ్మిట్ వైపు చూస్తున్నారు
- మంత్రులందరం యూనిటీగా పని చేస్తున్నాం
- తెలంగాణలో ప్రతిపక్షమే లేదు
- తమ కుటుంబంలో ఒక్కొక్కరు పదివేల కోట్లు తిన్నారని కవిత ఆరోపిస్తోంది
- కేసీఆర్ క్యాబినెట్ మంత్రులపై కవిత చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి
కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం.
- మధ్యాహ్నం 1:30 గంటలకు సమ్మిట్ ప్రారంభం.
- ముఖ్య అతిథిగా హాజరవుతున్న గవర్నర్.
- గ్లోబల్ సమ్మిట్ వద్దకు చేరుకున్న మంత్రులు, హీరో నాగార్జున.
- సమ్మిట్ వద్ద స్లాళ్లను పరిశీలించిన సీఎం, భట్టి.
గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకున్న సీఎం
- గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకున్న సీఎం
- గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
- గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్థి.
మరిన్ని విశేషాలు
- తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలో ముద్రించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రతినిధులకు అందజేస్తారు.
- అతిథులను ఆకట్టుకునేలా 50 మీటర్ల స్వాగత ద్వారం,
- 3డీ టన్నెల్, ప్రారంభ వేదిక ముందు భాగంలో 85 మీటర్ల ఎల్‌ఈడీ తెర ఏర్పాటు
- ముఖ్య అతిథుల విశాంత్రి కోసం ప్రత్యేక గదులను సిద్ధం చేశారు.
- రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఒక 100 కేవీఏ, రెండు 160 కేవీఏ, రెండు 315 కేవీఏ సామర్థ్యంతో కూడిన ట్రాన్స్‌ఫార్మర్లు,
- మరో మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సిద్ధం చేశారు.
- ఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ నరసింహులు నేతృత్వంలో 150 మంది ఇంజనీర్ల బృందం విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తుంది.
The Telangana Rising Global Summit is ready for you. Come, Join the Rise. #TelanganaRising2047 #TelanganaRisingGlobalSummit pic.twitter.com/Yi8p5zQ2Bb
— TelanganaRisingGlobalSummit (@GlobalSummitTG) December 8, 2025
- తెలంగాణ ఆర్థిక ప్రగతి, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రభుత్వ లక్ష్యాలు ఎల్‌ఈడీ తెరపై ప్రదర్శితమవుతుంటాయి.
- ఇదే ప్రాంతంలో ఫొటో సెషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- వీఐపీలు, ప్రతినిధులు, జర్నలిస్టులు సహా వివిధ విభాగాల అధికారులకు మొత్తం పది వేల మందికి ఉచిత వైఫై సౌకర్యం కల్పించేలా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ సహాకారంతో 5 జీడేటా (10 జీబీపీఎస్ వేగం)తో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి.
- అత్యవసర వైద్య సేవల కోసం 10 పడకల ఆసుపత్రి, 108 సర్వీసులతో పాటు చికిత్సకు అవసరమైన వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు.
The wait is over! Telangana Rising Global Summit kicks off today. Step into the future of growth, innovation, and opportunity. Don’t miss it!#TelanganaRising2047#TelanganaRisingGlobalSummit pic.twitter.com/EWZwwUxQwu
— TelanganaRisingGlobalSummit (@GlobalSummitTG) December 8, 2025
- అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రాంగణానికి నాలుగు వైపులా నాలుగు ఫైర్ ఇంజన్లను నిలిపి ఉంచారు.
- అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని అందించనున్నారు.
- గ్లోబల్ సమ్మిట్ లోగోతో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తరు, ముత్యాలతో కూడిన నగలను ఇందులో పొందుపరిచారు.
- తెలంగాణకే ప్రత్యేక వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్‌ను కూడా అతిథులకు అందజేస్తారు.
- సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరి, తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల వంటి సాంస్కతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది.
- నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
- రెండు రోజుల పాటు అతిథులు, ప్రతినిధులకు హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ధ వంటకాలను రుచి చూపించనున్నారు.
రాష్ట్ర భవిష్యత్తుపై సీఎం రేవంత్ కీలక ప్రసంగం
- 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తి
- తరలిరానున్న 2 వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు
- రాష్ట్ర భవిష్యత్తుపై సీఎం రేవంత్ కీలక ప్రసంగం
- రేపు ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు
- నేడు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
- మధ్నాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం
- హాజరుకానున్న 44 దేశాల ప్రతినిధులు
- పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ రంగాల నిపుణులతో చర్చలు
- లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు
- రెండ్రోజుల సదస్సుకు భారీస్థాయిలో ఏర్పాట్లు


