చీరలకు సహజ రంగులను అందించే నది..! | A village in Madhya Pradesh Baghini River to naturally dye fabrics | Sakshi
Sakshi News home page

Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్‌ మాయజాలం

Dec 8 2025 1:27 PM | Updated on Dec 8 2025 2:10 PM

A village in Madhya Pradesh Baghini River to naturally dye fabrics

చీరలకు రంగులు అద్దడం అంటే కచ్చితంగా రసాయనాలు ఉపయోగించాల్సిందే. ముఖ్యంగా చేనేత వస్త్రాలు, రకరకాల ప్రింట్‌ ఫ్యాబ్రిక్‌ చీరలైన అద్దిన రంగు నిలబడాలంటే..కచ్చితంగా రసాయనాలు జోడించాల్సిందే. అయితే  ఈ గ్రామ ప్రజలు అందుకు విరుద్ధం. వాళ్లు చీరలకు నదిలోని నీటి సాయంతోనే రంగులు శాశ్వతంగా ఉండేలా చేస్తారు. చీరలకు అద్దే రంగులను సైతం పర్యావరణహితంగానే ఉపయోగిస్తారు. ఎక్కడా.. రసాయనాలు వాడరు. కేవలం నది నీటితో తడపగానే..ఈ చీరకు అద్దిన రంగు శాశ్వతంగా నిలిచిపోతుంది. అదెలా సాధ్యం..ఆ కళాకారుల చేతుల్లో దాగున్న మ్యాజిక్‌ ఏంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.

మధ్యప్రదేశ్‌లోని బాఘి అనే గ్రామం పర్యావరణహిత సాంస్కృతిక చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రవహించే బాఘి నది రసాయనాలు వాడకుండా చీరలకు సహజరంగుని అందిస్తోంది. ఈగ్రామం బాఘి ప్రింట్‌ చీరలు, డ్రెస్‌లకు ఫేమస్‌. అక్కడ ఉండే స్థానికులంతా చేతి కళాకారులే. వారంతా ఈ పనే చేస్తుంటారు. ఎక్కడైన రసాయనాలు  కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తే..వీళ్లు ప్రకృతి వరంలా ప్రసాదించిన బాఘి నది నీటితోనే శాశ్వత రంగుని అద్దుతారు. ఆ నది సాయంతోనే అక్కడి గ్రామస్తులు ఈ అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. 

ఎందువల్ల ఇలా అంటే..
బాఘిని నది నీటిలో అధిక ఖనిజ పదార్థాం అయిన ఐరన్‌ కంటెంట్‌ ఎక్కువ. ఫలితంగా రంగు వేసే ప్రక్రియలో ఇది సహజ ఉత్ప్రేరకం లేదా మోర్డెంట్‌గా పనిచేస్తుంది. ఫలితంగా సింథటిక్ రసాయనాలు లేకుండా రంగులు దీర్ఘకాలంపాటు మన్నికగా ఉంటాయి. 

నదికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
దాదాపు 400 సంవత్సరాల క్రితం పంజాబ్‌లోని సింధ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని బాగ్ అనే గ్రామానికి వలస వచ్చిన ఖత్రిస్ సమాజం బాఘ్‌ ప్రింట్స్ ముద్రణను ప్రారంభించిందని చెబుతారు. నది చుట్టూ ఉన్న దట్టమైన అడవులు, పులుల (‘బాగ్’) కారణంగా దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు గ్రామస్తులు. 

ఎలా చేస్తారంటే..
ఈ సహజ ప్రక్రియ ఖారాతో ప్రారంభమవుతుంది. అంటే నది రాళ్లపై బట్టను కడిగి స్టార్చ్‌ని తొలగిస్తారు. తర్వాత బట్టను ఐరన్‌ అధికంగా ఉంటే బాఘిని నదిలో ముంచి రంగు కోసం సిద్ధం చేస్తారు. ఈ బాఘిప్రింట్లలో అత్యంత ప్రసిద్ధి భాగం హ్యాండ్-బ్లాక్ ప్రింటింగ్.

రంగులద్దడం కోసం చింతపండు, దానిమ్మ తొక్క, ఇనుప తుప్పు, ఆకుల నుంచి సేకరించిన సహజ రంగులను వినియోగిస్తారు. చివర్లో ఆ వస్త్రాన్ని నదిలో అనేకసార్లు కడుగుతారు. అలా చేయడం వల్ల రంగు అవశేషాలు పో..రసాయన ఫిక్సర్లు లేకుండా రంగులు ప్రకాశవంతంగా, మన్నికగా ఉంటాయి.

(చదవండి: అందమైన అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement