వింటర్ చైల్డ్, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..
కెరిస్టీన్ గుర్ట్నర్ అనే33 ఏళ్ల ఆస్ట్రియన్ మహిళ 39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్‌తో ఎత్తైన శిఖరం గ్రాస్‌గ్లాక్నర్‌ను అధిరోహించారు. థామస్ అనుభవజ్ఞుడైన గైడ్ కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హరికేన్-పవర్ విండ్స్ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టుకున్నాడు. దూర నుంచి ఒక హెడ్‌టార్చ్‌తప్ప ఇంకేమీ వెబ్ క్యామ్‌లో కనిపించలేదు.
మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా రెస్క్యూ బృందాలు గుర్ట్నర్‌ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్‌లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్‌ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్‌గా వ్యవహరించాలని ఇన్స్‌బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్‌బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్‌లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు. అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్‌కు అనేకమంది నివాళులర్పించారు. పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.


