మహిళల సంఖ్య తగ్గిపోతోంది, బ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న గణాంకాలు గురించి విన్నాం. కానీ వీటన్నింటికి విరుద్ధంగా మహిళలు సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. అక్కడ మహిళల సంఖ్య ఎంతలా ఉందంటే..మొత్తం కార్యాలయాల్లో అంతా మహిళలే కనిపిస్తారు. కనీసం ప్లంబింగ్, వడ్రంగి పనులు వంటి వాటిల్లో కూడా మహిళలే ఉంటారు. అందుకు గల కారణం..?, ఫలితంగా మహిళలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే..
లాట్వియాలో గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది. అక్కడ పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్‌లో సగటు అంతరం కంటే మూడు రెట్లు ఎక్కువ. 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న పురుషులకు రెండింతలు మహిళలు ఉన్నారు. రోజువారి జీవితంలో పురుషుల కొరత చాలా ఘోరంగా ఉంటుందని వరల్డ్ అట్లాస్ పేర్కొంది. దాంతో అక్కడ మహిళ ఇంటి పనుల్లో సహాయం కోసం భర్తలను నియమించుకుంటున్నారట.
అంటే అద్దెకు భర్తలను తెచ్చకుంటున్నారు. ఆ మహిళలంతా ఆన్‌లైన్‌లో ఒక గంటకు భర్తలను బుక్ చేసుకుంటారట అక్కడ మహిళలు. వారు ప్లంబింగ్, వడ్రండి,టెలివిజన్ ఇన్‌స్టాలేషన్ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అంతేగాదు పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్ వంటి ఇతర పనులు కూడా చేస్తారట. చాలామంది ఈ సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట.
పురుషుల కొరతకు రీజన్
దీనికి పురుషుల తక్కువ ఆయుర్దాయమే కారణమని చెబుతున్నారు. అధిక ధూమపాన రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు లాట్వియా నిపుణులు. వరల్డ్ అట్లాస్ ప్రకారం లాట్వియన్ పురుషులలో 31% మంది ధూమపానం చేస్తున్నారట. అదీగాక వారిలో చాలామంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారట కూడా.
ఫలితంగా అద్దెకు భర్తల ట్రెండ్
ఇంతలా మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్‌వై పుకే మొగ్గు చూపుతున్నారట అక్కడ మహిళలు. ఇదేమీ కొత్తదికాదు ఎందుకంటే గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద తన భర్త జేమ్స్‌ను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
(చదవండి: అమెరికా-భారత్‌కి మధ్య ఇంత వ్యత్యాసమా..!)


