అమెరికా భారత్ మధ్య సాంస్కృతిపరంగా, సామాజికంగా చాలా వ్యత్యాసం ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకంగా ఎంతలా ఆ వ్యత్సాసం ఉంటుదనేది తెలియదు. అయితే ఇటీవల భారత్‌లో గడిపి వెళ్లిన ఇద్దరు పిల్లలు తల్లి ఆ విభిన్నతను క్షుణ్ణంగా గమనించి మరీ నెట్టింట షేర్ చేసుకుంది. అవేంటో తెలిస్తే మాత్రం ఇంత తేడా ఉందా ఇరు దేశాల మధ్య అనిపిస్తుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
రెండున్నర నెలల పర్యటన కోసం కుటుంబంతో సహా భారత పర్యటన వచ్చిన ఇద్దరు పిల్లల తల్లి అన్నా హాకెన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. తనకు రెండు దేశాలు ఎంత భిన్నంగా ఉంటుందో తెలుసుగానీ, వాస్తవికంగా అదెలా అనేది స్పష్టంగా తెలియదని చెప్పుకొచ్చింది. కానీ ఈపర్యటనలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటూ ఆ ఇరుదేశాల వ్యత్యాస జాబితా గురించి వివరించింది. ఆమె గమనించి తొమ్మది తేడాలు ఏంటంటే..
హాంకింగ్: అమెరికాలో హాంకింగ్ అంటే వేరే అర్థం వస్తుంది, కానీ భారతదేశంలో, హాంకింగ్ అంటే, "హాయ్, నేను ఇక్కడ ఉన్నాను, చూడండి, ధన్యవాదాలు". అని అర్థం. మాటిమాటికి గట్టిగా అరుస్తు మాట్లాడతారని అర్థం.
ఆహారం: అమెరికాలో, కారం అంటే తేలికపాటి వేడి అని అర్థం. కానీ భారతదేశంలో, కారం అంటే కొన్ని జీర్ణ సమస్యలను కలిగిస్తుంది, ముఖ్యంగా విదేశీయులకు.
ప్రజలు: యూఎస్‌ఏ మనం ఉన్నట్లు ఎవ్వరూ గుర్తించరు, పైగా గమనించనట్లు నటిస్తారు. అదే భారత్‌లో అవతలి వాళ్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనే కుతుహలం ఎక్కువ.
చెత్త: USAలో చెత్త డబ్బాల్లో చెత్త ఉంటే భారతదేశం దీని గురించి స్పష్టంగా చెప్పలేము. అది ప్రాంతం బట్టి మారిపోతుంటుంది.
కార్లు: యూఎస్‌లో ట్రాఫిక్ చట్టాలను పాటిస్తారు. కానీ భారతదేశంలో బయట నుంచి వచ్చేవారికి అర్థంకానీ గందరగోళంగా కనిపిస్తుంది.
వాతావరణం: అమెరికా - శీతాకాలం, వసంతకాలం, వేసవి, చాలా ప్రదేశాలలో శరదృతువు; భారతదేశం: వేడి అది కూడా ఆశ్చర్యకరమైన రేంజ్‌లో అదనపు వేడి ఉంటుంది.
మతం: అమెరికా - ఎక్కువగా కాథలిక్ చర్చిలు, నిశ్శబ్ద సమావేశాలు; భారతదేశం: ప్రతిచోటా దేవాలయాలు, నగరాలను ఆక్రమించే పండుగలు.
స్థోమత: యూఎస్‌లో ప్రతీది ఖరీదైనది, కానీ భారత్‌లో పర్లేదు, నిర్వహించగలం.
కుటుంబం: అమెరికా - ఒకే కుటుంబ జీవనం; భారతదేశం - ఒకే చోట బహుళ తరాలు చూడొచ్చు.
ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు.."మా దేశానికి అపరిచిత వ్యక్తే అయినా..మీరు చాలా క్షుణ్ణంగా వ్యత్యాసాలను గమనించారు . చాలా గ్రేట్." అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.
(చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్‌కు..!)


