డిసెంబర్ 7, ఆదివారం సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. సాధారణంగా క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహర చతుర్థి ఎప్పుడనేదీ ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.
ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు. సూర్యాస్తమయం (Sunrise) అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి.
ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం (Fasting) చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం నాలుగుసార్లు పఠించి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఉపవాసం చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం పఠించినా ఫలితం ఉంటుంది.
చదవండి: దత్తజయంతి నాడు ఏమి చేయాలి?


