
యాదగిరిగుట్టలోని హనుమాన్ వీధిలో 1962కు ముందు నుంచే గణేష్ ఉత్సవాలు : యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్‌కు వెళ్లే దారిలో వైకుంఠద్వారం సమీపంలో ఉన్న హనుమాన్ వీధిలో కాలనీవాసులు 63ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కాలనీలో ఉండే ప్రజలంతా కమిటీ ఏర్పాటు చేసుకొని నవరాత్రులను వైభవంగా జరిపిస్తూ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నారు.
కాలనీ అంతా ఏకమై..
యాదగిరిగుట్ట పట్టణంలోని హనుమాన్ వీధిలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద మొదట్లో ఐదారు కుటుంబాలు మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించేవారు. అప్పట్లో సుమారు 3 ఫీట్ల వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ తొమ్మిది రోజుల పాటు యాదగిరిగుట్ట ఆలయ అర్చకులతో పూజలు నిర్వహించేవారు. ప్రస్తుతం కాలనీ అంతా ఏకమై ఒకే చోట మండపాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: దేశంలోనే రిచెస్ట్ గణపతిగా రికార్డు, భారీ బీమా
ప్రత్యేక కమిటీగా ఏర్పడి పూజలు జరిపిస్తాం
నా చిన్ననాటి నుంచే హనుమాన్ ఆలయం వద్ద వినాయక మండపం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మా కాలనీ ప్రజలంతా కమిటీగా ఏర్పడి పూజలు జరిపిస్తాం. మా పెద్దలు ఏ విధంగానైతే పూజల బాధ్యత మా పై పెట్టారో.. అలాగే మా పిల్లలకు నేర్పిస్తున్నాం. – శ్రీధర్‌రెడ్డి, నిర్వాహకుడు
చదవండి: Vinayaka Chavithi 2025: గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన తీపి వంటకాలు