
ఆది దంపతులకు మానసపుత్రుడు, ఓంకార స్వరూపుడు, విఘ్నాలను శమింపజేసే విఘ్నేశ్వరుడు, సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వదేవతా లక్షణసమన్వితుడు, స్వల్పకాలంలో ముక్తినిచ్చే మోక్షప్రదాత–మన గణపయ్య. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిపూజ తప్పనిసరి. తలచిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాలి.దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ఆరంభంలో ఈ జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడే.
అందుకే ఆయన్ని వేదం ‘‘జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం’’ అని స్తుతించింది. జపహోమాది క్రియలలో గణపతిపూజే ప్రథమ కర్తవ్యం.. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా’’ అనే ప్రార్థన అందుకే. ఇవాల్టి టిప్ ఆఫ్ దిడే లో భాగంగా విఘ్ననాయకుడికి ఎంతోప్రీతి పాత్రమైన వంటకాల గురించి తెలుసుకుందాం.
రవ్వలడ్డు
కావలసినవి : బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు,
జీడిపప్పు – తగినన్ని, కిస్‌మిస్ – తగినన్ని, ఏలకుల పొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు.
తయారీ: రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్‌మిస్ వేయించుకోవాలి. పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. రవ్వ, జీడిపప్పు, కిస్‌మిస్, ఏలకుల పొడి పాకంలో కలుపుకుంటే తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ.
చిట్టి ముత్యాల లడ్డు
కావలసిన పదార్థాలు : శనగపిండి – 2 కప్పులు, యాలకల పొడి – 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార – 2 1/2 కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు, రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంత
తయారీ: శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్ మరియు ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని ΄ాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి యాలకల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండి
తీపి ఉండ్రాళ్ళు
కావలసినవి : బియ్యంపిండి : 1 కప్పు, నీళ్ళు : 1 కప్పు, నెయ్యి : 2 గరిటెలువంట సోడా : చిటికెడు, ఉప్పు : చిటికెడు
ఉండ్రాళ్ళలో నింపడానికి పచ్చి కొబ్బరి కోరు : 1 కప్పు, కొబ్బరి పొడి : 1/2 కప్పు, వేయించిన గసాలు : 1 గరిటెడు, యాలకుల పొడి : 1/2 చెంచా
తయారుచేసే విధానం : కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్‌లో వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి. ఉప్పు, నెయ్యి వేసి మరి గిన తరువాత బియ్యం పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపు తుండాలి. తక్కువ మంటపైన పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి తగు మాత్రం తీసుకుని చేతిలో వెడల్పుగా చేసుకుని మధ్యలో కొబ్బరి ΄ాకాన్ని ఉంచి మూసివేసి, గుండ్రంగా చుట్టాలి. లేదా మీకిష్టమైన ఆకృతుల్లో చేసి వీటిని తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్‌లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
మోదక్‌లడ్డు
కావలసినవి: గోధుమపిండి – అరకప్పు, బొంబాయి రవ్వ–1 కప్పు, పంచదార – 1 కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు, నీళ్ళు – 2 టీ స్పూన్లు, జీడిపప్పు – గుప్పెడు, కిస్‌మిస్ – గుప్పెడు, ఏలకుల΄పొడి – అర టీ స్పూను
తయారి: పంచదారలో నీళ్ళు కలిపి మధ్యస్థంగా పాకం పట్టుకోవాలి. గోధుమపిండి, బొంబాయిరవ్వలో తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నెయ్యివేడిచేసి బూందీ ప్లేట్‌లో గోధుమపిండి మిశ్రమాన్ని పోసి బూందీ చేసుకోవాలి. నెయ్యివడకట్టి బూందీని పాకంలో వేసుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌ని నెయ్యిలో వేయించి ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. యాలకుల΄÷డి కలిపి కావలసిన సైజుల్లో లడ్డు కట్టుకోవాలి.
రవ్వ పూర్ణాలు
కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ – 2 కప్పులు, యాలకల పొడి – 1 టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ – 1/4 కప్పులు, పంచదార – 2 1/2 కప్పులు, నెయ్యి – 1/2 కప్పు, మైదాపిండి – 1 1/2 కప్పు, బియ్యంపిండి – 1/4 కప్పు
తయారు చేసే విధానం : బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార యాలకలపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా కార్న్‌ఫ్లోర్, బియ్యంపిండి కొద్దిగా నీరు΄ోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి.