ఆకాశమంతా సంక్రాంతి | Kites in Sankranti 2026 | Sakshi
Sakshi News home page

ఆకాశమంతా సంక్రాంతి

Jan 12 2026 12:28 PM | Updated on Jan 12 2026 12:42 PM

Kites in Sankranti 2026

తెలుగు వారు ఏడాది మొత్తం వేచి చూసే పండగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండగ వస్తోంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అతివలు ముంగిట్లో అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగురవేయడానికి ఇష్టపడుతుంటారు. 

ఈ సమయంలో గాలిపటాలు ఎగురవేయడం అనేది కేవలం  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం అయిన విషయం కాదు. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో గాలిపటం ఎగురేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్‌లో ఉత్తరాయణ సమయంలో ఆకాశంలో రంగు రంగుల గాలిపటాలు సందడి చేస్తాయి. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎలా మేడలపై, మైదానంలో,పోలాల్లోంచి పతంగులు ఎగుర వేస్తారు. మహారాష్ట్ర ప్రజలు కూడా సముద్ర తీరాల్లో ఎగిసే కెరటాల మధ్య గాలిపటాల ΄ోటీలు పెట్టుకుంటారు.

రాజస్థాన్‌ ఓల్డ్‌ సిటీలో ఉన్న మేడలపై యువతీ యువకులు అక్కడి ఘేవర్‌ పేనీలు, నువ్వుల లడ్డూలను ఆస్వాదిస్తూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు.

⇒  ఉత్తర ప్రదేశ్‌లో ప్రతీ గల్లీలో పతంగుల పోటీ జరుగుతుంది. 

కలకత్తాలో గ్రూపులుగా ఏర్పడి గాలిపటాలు ఎగరేయడానికి ఇష్టపడగా, కర్ణాటక, తమిళనాడులో బీచుల్లో గాలిపటాలను ఎగరేయడానికి ఇష్టపడతారు.

అన్ని రాష్ట్రాల్లో పండగ స్పూర్తి గాలిపటాలు ఎగరవేయడంలోనే కనిపిస్తోంది. ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనే ఆశయానికి సంక్రాంతి ఒక వేదికగా నిలుస్తుంది. ఈ సందేశాన్ని ఆకాశం సాక్షిగా చాటే మార్గంగా గాలిపటం నిలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement