breaking news
sankranthi festival
-
వచ్చే సంక్రాంతిపై కన్నేసిన సీనియర్లు.. తోడుగా మరో ముగ్గురు?
ఈసారి సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు వస్తే అందులో మూడు హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'.. ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని నిర్మాతలు ప్రకటించుకున్నారు. తెలుగులో మాత్రమే తీసిన ఓ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో వచ్చే పండగకి ఇప్పటినుంచే కర్చీఫులు వేసేస్తున్నారు. తెలుగు సీనియర్ హీరోలు నలుగురు రాబోతున్నట్లు హింట్స్ ఇచ్చేస్తున్నారు.అధికారికంగా చూసుకుంటే నాగార్జున.. సినిమాతో పాటు డేట్ కూడా ప్రకటించేశారు. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు మూడో పార్ట్ వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 15న థియేటర్లలోకి రాబోతుందని అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి భాగం 2016లో రాగా అద్భుతమైన హిట్ అయింది. 2022లో వచ్చిన రెండో పార్ట్ కూడా సక్సెస్ అందుకుంది. 2027 సంక్రాంతికి ఇప్పుడు మూడో భాగం రానుంది.ఈసారి చిరంజీవితో బ్లాక్‌బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో వస్తానని ఇదివరకే చెప్పేశాడు. అయితే అది వెంకటేశ్‌తోనే ఉండబోతోందని టాక్. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తాడని మాట్లాడుకుంటున్నారు. వెంకీ-ఫహాద్ తోడళ్లులుగా కనిపించబోతున్నారని టాక్. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అనిల్-వెంకకి మరో హిట్ పక్కా.ఈసారి పండగకు వచ్చి హిట్ కొట్టిన చిరంజీవి.. వచ్చే సంక్రాంతికి కూడా రావాలని అనుకుంటున్నారట. 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాబీ దర్శకత్వంలో మరోసారి చిరు పనిచేయబోతున్నారు. ఇదివరకే ప్రకటన వచ్చింది. కూతురి సెంటిమెంట్ నేపథ్యంగా సాగే యాక్షన్ స్టోరీ ఇదని తెలుస్తోంది. దీన్ని పండగకే టార్గెట్ చేసుకుని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.మరోవైపు బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తొలుత పీరియాడికల్ స్టోరీ అనుకున్నారు. కానీ బడ్జెట్ సమస్యల వల్ల దాన్ని పక్కనబెట్టేసి ఓ యాక్షన్ మూవీ తీయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుని కూడా వచ్చే సంక్రాంతి బరిలో దింపాలని అనుకుంటున్నారట. ముంబై బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తోంది.గతంలో చిరు-బాలకృష్ణ, వెంకీ-నాగ్, నాగ్-చిరు.. సంక్రాంతికి పోటీపడిన సందర్భాలు ఉన్నాయి గానీ నలుగురు ఒకేసారి రాలేదు. కానీ వచ్చే సంక్రాంతి మాత్రం ఈ షాకింగ్ పోటీకి వేదిక కానుందని అంటున్నారు.వీళ్లతో పాటు పవన్ కల్యాణ్-సురేందర్ రెడ్డి, శర్వానంద్-శ్రీనువైట్ల, తేజ సజ్జా 'జాంబీ రెడ్డి 2' సినిమాలని కూడా ఈ పండగకే థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి వీళ్ళలో ఫైనల్ అయ్యేది ఎవరో చూడాలి? -
‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు. -
టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని రుజువైంది అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారని కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా వేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. 16,600 కోట్ల రుణాలను బ్యాంకులు తగ్గించేశాయి. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన 7000 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. డ్వాక్రా మహిళలను ఏ విధంగా చంద్రబాబు మోసం చేశారో నాబార్డ్ నివేదికలు తెలియజేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో వైఎస్ జగన్ రుణమాఫీ చేశారు. జగన్ హయాంలో సున్నా వడ్డీ రుణాలు మంజూరు అయ్యేవి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయి. కూటమి పాలనలో అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చారు.కూటమి నేతలు సంక్రాంతి.. సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగాయి. రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బట్టలు విప్పి రికార్డింగ్ డ్యాన్సులు చేయాలన్న వారిని ఎందుకు నడి రోడ్డుపై నడిపించలేదు?. క్యాసినోలు, పేకాటలు ఆడిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు. నడిరోడ్డుపై ఎందుకు నడిపించలేదు?. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కోడిని కోస్తే తప్పు అన్నారు.. ఏకంగా రికార్డింగ్ డాన్సులే పెట్టారు
-
రికార్డు క్రియేట్ చేసిన సంక్రాంతి లిక్కర్ సేల్.. టాప్ లో తిరుపతి
-
ఆంధ్రప్రదేశ్‌లో ఏరులై పారిన మద్యం... సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్‌కు పండుగ
-
AP: మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
కేవీపల్లె/పీలేరు రూరల్: అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం బండవడ్డిపల్లెలో సంక్రాంతి పండుగ కోసం వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మద్యం తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బండవడ్డిపల్లెకు చెందిన నరసింహులు కుమారుడు ఆవులకుంట మణికుమార్ (32) చెన్నైలో, గోవిందు కుమారుడు వేముల పుష్పరాజ్ (28) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు వీరు స్వగ్రామానికి వచ్చారు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువులైన శ్రావణ్, వేణు, శివమణి, అభిõÙక్లతో కలసి శనివారం గ్రామ సమీపంలోని గుట్ట ప్రాంతంలో కూర్చుని మద్యం తాగారు. ఈ క్రమంలో మణికుమార్, పుష్పరాజ్‌లు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం గరి్నమిట్ట పీహెచ్‌సీకి తరలించారు.ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు అక్కడ నుంచి పీలేరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మణికుమార్ మృతి చెందాడు. పుష్పరాజ్‌ను పీలేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని వారు సూచించారు. అక్కడి నుంచి పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పుష్పరాజ్ మృతి చెందాడు. వారు మద్యం తాగిన ప్రాంతాన్ని కలకడ సీఐ లక్ష్మన్న, కేవీపల్లె, కలకడ ఎస్ఐలు వెంకట శివకుమార్, రామాంజులు, పీలేరు ఎక్సైజ్ సీఐ సుబ్బారెడ్డిలు క్షుణ్ణంగా పరిశీలించారు.మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా, పండుగ సంబరాలకు స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా మృతి చెందడంతో బండవడ్డిపల్లెలో విషాదం నెలకొంది. మృతుడు మణికుమార్‌కు భార్య నాగశివరాణి తోపాటు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఎంబీఏ చదివిన పుష్పరాజ్ గత ప్రభుత్వంలో గ్రామ వలంటీరుగా పనిచేశాడు. తండ్రి గోవిందు కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుష్పరాజ్ మృతితో తల్లి సరోజ జీవనాధారం కోల్పోయింది. మద్యం టిన్లు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు.. అతిగా మద్యం తాగడం వల్లే కేవీపల్లె మండలం బండవడ్డిపల్లెలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారని అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం పీలేరులోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మణికుమార్, పుష్పరాజ్‌ల సమీప బంధువులైన శ్రావణ్, శివమణి, వేణుగోపాల్, అభిషేక్‌లతో కలసి గరి్నమిట్టలోని మద్యం దుకాణం నుంచి బడ్వైజర్ టిన్ బీర్లు 19 కొనుగోలు చేశారని తెలిపారు. బండవడ్డిపల్లె సమీపంలోని గుట్టలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తాగారన్నారు.తిరిగి ఇంటికి వచ్చే సమయంలో వారిద్దరూ అస్వస్థతకు గురై మృతి చెందారని చెప్పారు. మణికుమార్ తండ్రి ఆవులకుంట నరసింహులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేశామన్నారు. పీలేరు ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారు తాగిన బీరు ఖాళీ టిన్నులు, మిగిలిన ఆహార పోట్లాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు.ఆ మద్యం అసలైనదేనా? యువకులు రెండు, మూడు బీర్లు తాగడం మామూలేనని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బండవడ్డిపల్లె ఘటనలో ఆరుగురు కలిసి 19 టిన్ బీర్లు (ఒక్కో టిన్ 500 ఎంఎల్) తాగారని, అంటే ఒక్కొక్కరు రెండు బీర్లు (బాటిల్) తాగారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వారు తాగింది నకిలీ మద్యం కావొచ్చని గ్రామస్తులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నాలుగైదు మద్యం/బీరు బాటిళ్లలో ఒకటి నకిలీదని ఇప్పటికే బట్టబయలైంది. ఆధారాలతో సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్రాలే ఇందుకు నిదర్శనం.అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం, పాలకొల్లు, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బయట పడటం తెలిసిందే. ఇవన్నీ కూడా అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో కొనసాగాయి. బయట పడనివి ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం/బీరు సరఫరా అవుతోంది.తయారీ, పంపిణీ, విక్రయదారులంతా వాళ్లే కావడంతో అడిగే వారు లేరు. ప్రభుత్వ పెద్దలు లాభాల్లో నీకింత–నాకింత అంటూ వాటాలు పంచుకుంటూ పై నుంచి భరోసా ఇస్తుండటంతో ఈ దందా వ్యవస్థీకృతమైంది. అందువల్లే నకిలీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న, అనారోగ్యం పాలవుతున్న జనం సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో బండివడ్డిపల్లె ఘటనలో దర్యాప్తు ఎంత వరకు పారదర్శకంగా జరుగుతుందనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఫుడ్ మీదకో నెపం తోసేసి దోషులను తప్పించరని గ్యారంటీ ఏమిటని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీకి దండగ.. టీఎస్ ఆర్టీసీకి పండుగ!
సాక్షి, అమరావతి: పండుగ ముసుగులో ఓవైపు టీడీపీ నేతలు కోడిపందేలు, కేసినోలు, గుండాట, కోత ముక్కలాట ఆడిస్తూ పండుగ నాలుగు రోజులు రూ.వేల కోట్లు దండుకున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయకుండా ప్రైవేటు ట్రావెల్స్‌కు పెద్దపీట వేసింది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తుంటే పట్టించుకోకుండా యాజమాన్యాల నుంచి రూ.వందల కోట్లు దండుకుని అవినీతికి కొత్తదారులు తెరిచింది. ఇలా దేన్నీ వదిలిపెట్టకుండా అందినకాడికి టీడీపీ నేతలు దోచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించింది. మరోవైపు సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ముఖం చాటేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దోపిడీకి కొమ్ము కాసింది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ మాత్రం సంక్రాంతి సీజన్‌ను సది్వనియోగం చేసుకోవడం గమనార్హం. టీఎస్ ఆర్టీసీ 6 వేల సర్విసులు సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే బయలుదేరుతారు. అందువల్లే హైదరాబాద్ నుంచి ఏపీలో వివిధ ప్రాంతాలకు బస్సు సర్విసులు నడపటంపై నిర్వాహకులు దృష్టి సారిస్తారు. ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విస్మయపరిచింది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు 2 వేలకుపైగా స్పెషల్ బస్ సర్విసులను తిప్పిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది మాత్రం కేవలం 200 సర్విసులకే పరిమితం చేసినట్లు ప్రకటించడం గమనార్హం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక నేత ఒకరు ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాతో కుమ్మక్కు కావడమే దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్లో టికెట్ రేట్లను ఏకంగా ఐదారు రెట్లు అదనంగా పెంచేసి ఏకంగా రూ.2 వేల కోట్ల దోపిడీకి ప్రైవేటు ట్రావెల్స్ పన్నాగం పన్నింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేత ఒకరు వత్తాసు పలికారు.ఆయనకు భారీగా ముడుపులు ముట్టజెప్పడమే దీనికి కారణం. దాంతో ఈ ఏడాది ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులకు భారీగా కోత పెట్టింది. కేవలం 200 స్పెషల్ సర్వీసులతో చేతులు దులుపుకొంది. దీనిపై తీవ్ర విమర్శలు రేగడంతో ఏటా మాదిరిగానే హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు సర్విసులను నిర్వహిస్తామని తూతూమంత్రంగా ప్రకటన చేసి పక్కకు తప్పుకుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు ఎన్ని సర్విసులు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. తద్వారా ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాకు టీడీపీ కూటమి ప్రభుత్వం వత్తాసు పలికింది. మరోవైపు సంక్రాంతి సీజన్‌ను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకుంటూ టీఎస్ ఆర్టీసీ ఏపీకి పెద్ద ఎత్తున బస్సు సర్విసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు టీఎస్ ఆర్టీసీ ఏకంగా 6,430 సంక్రాంతి స్పెషల్ సర్విసులను తిప్పడం గమనార్హం. -
అమాత్యా.. ఛీఛీ ఇవేం పాడు పనులు?
సాక్షి టాస్క్‌ఫోర్స్: సంక్రాంతి సంబరాల పేరిట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా చేసిన డ్యాన్స్‌లు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏఎస్ఎన్ కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరిట మ్యూజికల్ నైట్లు, రికారి్డంగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుల్లితెర, జబర్దస్త్‌లో మహిళా క్యారెక్టర్లు వేసే నటులతో కలిసి మంత్రి సుభాష్ పండగ మూడు రోజులూ బహిరంగంగా చిందులు వేశారు.ఆయనతో పాటు ఆయన తండ్రి వాసంశెట్టి సత్య కూడా డ్యాన్సులు వేయడం కొసమెరుపు. అయితే బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా రికారి్డంగ్ డ్యాన్సులు వేయడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటువంటి మంత్రుల వల్ల రాష్ట్రం పరువు పోతోందని తప్పు పడుతున్నారు. ఇది సరిపోదన్నట్టు తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్లపై మంత్రి స్పందించిన తీరు మరిన్ని విమర్శలకు దారి తీసింది. ‘‘నేను మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా నేను నేనుగానే ఉంటాను. ఇలానే ఉంటాను’’ అంటూ వింత ధోరణిలో సమర్థించుకోవడం గమనార్హం. -
మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగ డ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
-
మార్చి రిలీజ్‌లపై సందేహాలు.. ఏవి వస్తాయి? ఏవి వాయిదా?
సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్‌లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. అందువల్ల మార్చిలో రిలీజ్ అవ్వడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమాకు ఇంకా ముప్పై రోజుల షూట్ మిగిలి ఉంది. సంక్రాంతి తర్వాత నాన్‌స్టాప్‌గా షూట్ చేసినా, రిలీజ్‌కు కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ టైమ్ ఒక్క నెలలో పూర్తవడం కష్టమే. కానీ ఇటీవల రిలీజ్ చేసిన రామ్ చరణ్ పోస్టర్లలో మాత్ర మార్చి నెల రిలీజ్ అంటూ ప్రకటించారు. చూడాలి ఆ టైమ్‌కు పెద్ది రిలీజ్ అవుతుంతో లేదో. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించిన దురంధర్ 2 మాత్రం బాలీవుడ్ స్టైల్లో డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కువగా వాయిదా లేకుండా వస్తుందని అంచనా. అయితే మార్చి నెల ఎగ్జామ్స్ సీజన్. దాంతో ఆ టైమ్‌లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే సందేహం ఉంది. దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా 2027 మార్చికి ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ కూడా అదే టైమ్‌లో వస్తుందని టాక్ ఉంది. కానీ అధికారిక డేట్ మాత్రం ఇంకా రాలేదు. సంక్రాంతి రిలీజ్‌ల మాదిరిగానే ప్రీ సమ్మర్ రిలీజ్లు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ ఉన్నా, పెద్ద సినిమాలు వేసవి హాలిడేలకు దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్‌లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మార్చి 2026లో ప్రకటించిన సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2027 మార్చి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాలతో హాట్‌గా మారనుంది. -
మూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్లు దోచుకున్న కూటమి నేతలు
-
Sharwanand : చెప్పి మరీ కొట్టా పొగరుతో, గర్వంతో మాట్లాడట్లేదు..!
-
KSR Show: సంక్రాంతి అంటే కమ్మవారి పండుగ అంట...
-
దారి తప్పిన పండగ.. ఇదేం పద్దతి బాబు
-
ఈ అరాచకాలు చూడలేక చాగంటి గారు రాజీనామా?
-
సంక్రాంతి కమ్మవారి పండగ? KSR రియాక్షన్
-
నాటుకోడికి కనుమ గిరాకీ
విశాఖపట్నం: కనుమ పండగ నాటుకోడికి గిరాకీ తెచ్చింది. సాధారణ రోజుల్లో బ్రాయిలర్ కోడి మాంసం తిని విసిగిపోయిన జనం.. శుక్రవారం కనుమ రోజున నాటు కోళ్ల సంతకు పరుగులు తీశారు. దీంతో అక్కడ కోళ్లకు గిరాకీ పెరిగింది. జాతీయరహదారి పక్కన డెయిరీఫారం వద్ద నిత్యం నాటుకోళ్ల బజారు జరుగుతుంది. ఇక్కడకు తగరపువలస, ఆనందపురం, శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతాల నుంచి నాటుకోళ్లను వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కొన్నేళ్లగా సంక్రాంతి సందర్భంగా కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో నాటు కోడి కిలో రూ.600 ఉండే ధర ఇప్పుడు రూ.800కు పెరిగిపోయింది. ఇది కేవలం లైవ్ ధర. డ్రస్డ్ నాటుకోడి మాంసమైతే మటన్ ధర కంటే ఎక్కువేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా కొనుగోలుదార్లు వెనక్కి తగ్గకుండా నాటుకోడివైపే మొగ్గు చూపారు. ఇక్కడ కనుమ రోజున 700కు పైగా కోళ్ల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు తెలిపారు. బ్రాయిలర్ కోడి మాంసం కూడా కిలో రూ.300 దాటడం కూడా నాటుకోళ్ల గిరాకీకి కారణమని చెప్తున్నారు. -
సంక్రాంతి అంటే జూదం, అశ్లీల నృత్యాలుగా మార్చేశారు
-
బరుల వద్దే క్యాసినోలు..
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కోర్టు తీర్పులను లెక్క చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన నేతలు బరులు పంచుకుని విచ్చలవిడి జూద క్రీడలకు తెర తీశారు. ఇప్పటికే ఊరూరా బెల్టు షాపులు, కుటీర పరిశ్రమలా మద్యం తయారీ, సహజ వనరుల దోపిడీతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. సంక్రాంతి పండుగనూ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ముడుపులు తీసుకుని కోడి పందేల బరుల వద్ద క్యాసినోలు, జూద క్రీడలకు పచ్చజెండా ఊపారు. దీంతో మూడు రోజుల్లో రూ.వేల కోట్లు చేతులు మారాయి! టీడీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల తరహాలో జూదాల జాతర సాగుతోంది. అన్ని బరుల వద్దా పేకాట, గుండాట, కోతముక్క నంబర్ల ఆటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.బరుల వద్దే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు రూ.5 వేల కోట్ల మేర పందేలు జరిగినట్లు అంచనా. పెద అమిరం వద్ద బరిలో క్యాసినో ఏర్పాటు చేసి గోవా నుంచి క్లబ్ డ్యాన్సర్లను ప్రత్యేక అతిథుల కోసం రప్పించినట్లు తెలిసింది. ఇంత విచ్చలవిడిగా జూద క్రీడలు సాగుతుంటే సంక్రాంతి సంబరాలు అంటూ ఎల్లో మీడియా మభ్యపుచ్చేందుకు యత్నించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. ఎప్పటి మాదిరిగానే అత్యధిక బరులు పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం కాగా ఆ తర్వాత తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటయ్యాయి. భీమవరం, ఉండి, దెందులూరు, రావులపాలెంలో బరులు గోవా, శ్రీలంక క్యాసినోలను తలదన్నేలా ఏర్పాటయ్యాయి. గన్నవరం, నూజివీడు మధ్య మీర్జాపురం, బిళ్లనపల్లి గ్రామాల సమీపంలో ఏర్పాటైన పందేల బరి హైలైట్‌గా నిలిచింది. అక్కడికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు రావడంతో ప్రత్యేకంగా వీవీఐపీ గ్లాస్ గ్యాలరీలు ఏర్పాటు చేసి క్యారవాన్లు, బౌన్సర్లను రంగంలోకి దించారు. ఏసీ గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, రాత్రయితే ఫ్లడ్ లైట్లతో పందేల బరులు ఎగ్జిబిషన్లను తలపిస్తున్నాయి. ఈ గ్యాలరీల్లో ప్రవేశం రుసుం కింద రూ.2 వేలు చొప్పున వసూలు చేశారు. అతిథులకు సకల మర్యాదలు చేస్తున్నారు. స్థానిక వంటలు రుచి చూపించేందుకు వంట మాస్టర్లను రప్పించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో బరులను దగ్గరుండి పర్యవేక్షించారు. గురు, శుక్రవారం కోడి పందేలను వీక్షించారు. హోంమంత్రి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న పాయకరావుపేటతోపాటు యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల్లో కోడి పందేలు భారీగా జరిగాయి. రాజమహేంద్రవరం రమేష్ జాక్‌పాట్..! రెండు రోజుల్లో రూ.2.50 కోట్లు.. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా రూ.1.53 కోట్ల భారీ పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్ సేతువ జాతి పుంజు, రాజమహేంద్రవరంవాసి రమేష్ డేగ జాతి కోడి పుంజుల మధ్య పందెం జరగ్గా డేగ జాతి పుంజు గెలిచింది. దీంతో రమేష్ పందెంలో రూ.1.53 కోట్లు నెగ్గారు. శుక్రవారం కనుమ రోజు నిర్వహించిన మరో పందెంలో రమేష్ రూ.90 లక్షలు గెలుచుకోవడం విశేషం. ఇన్నోవా కారు, బుల్లెట్లు.. రావులపాలెంలో పందెంలో గెలుపొందిన గ్రూపు రాయల్ ఎన్ఫీల్డ్ను సొంతం చేసుకుంది. ఏడు పోటీలకు ఆ గ్రూపు 6 పందేలలో గెలిచింది. మురమళ్లలో ఇన్నోవా కారు, బుల్లెట్ ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఏలూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో స్థానిక ప్రజాప్రతినిధి ఏర్పాటు చేసిన బరిలో సర్వ హంగులు కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరం బరి వద్ద బిరియానీ పాయింట్లు, కోడి పకోడి సెంటర్లు, ఆహార పదార్థాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా రూ.5 వేల కోట్ల జూదం..! చిన్న బరుల్లో పందేలు రూ.వేల నుంచి మొదలై రూ.లక్షల వరకూ వెళుతున్నాయి. పెద్ద బరుల్లో రూ.లక్షల్లో మొదలై రూ.కోట్లకు చేరుకుంటున్నాయి. భీమవరం, ఉండి ప్రాంతాల్లోని 14 పెద్ద బరుల్లో రూ.వందల కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా రూ.200 కోట్ల వరకూ పందేలు జరిగి ఉంటాయని చెబుతున్నారు. ఒక్కో బరిలో రోజుకు 25 నుంచి 30 వరకు ప్రధాన పందేలు జరగ్గా, కనీస పందెం రూ.50 లక్షల నుంచి మొదలై రూ.కోటి వరకూ వెళ్లాయి. తాడేపల్లిగూడెం బెల్ట్‌లోనే రూ.250 కోట్ల మేర పందేలు జరిగినట్లు చెబుతున్నారు. 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు పందేలు జరిగినట్లు అంచనా. భీమవరంలో భలే గిరాకీ.. భోగి పండుగ రోజు మొదలైన పందేలు సంక్రాంతి రోజు పతాక స్థాయికి చేరి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడా బాబులతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర చోట్ల నుంచి జూదరులు తరలివచ్చారు. దీంతో హోటళ్లు, వాహనాల అద్దెలు, తాత్కాలిక వసతులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భీమవరంలోని పెద్ద హోటళ్లలో రూమ్ కోసం ఒక రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బౌన్సర్లు.. ‘జబర్దస్త్’ వినోదం⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుండాట, పేకాట, కోతాట, క్యాసినోల నిర్వాహకులు పగలు రాత్రి తేడా లేకుండా జూదాలు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు బరి నుంచి బయటకు రాకుండా సకల సదుపాయాలు కల్పించారు. ఈసారి మినీ ఏటీఎంలు వెలిశాయి. జబర్దస్త్ నటులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద మాడుగుల హల్వా, సంగం డెయిరీ అవుట్ లెట్, ఐస్ బర్గ్ లాంటి ఐస్‌క్రీం స్టాల్స్ కనిపించాయి. పెద అమిరం బరి వద్ద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, సినీ ప్రముఖులు పందేలు తిలకించారు. ⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తుతోంది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో భారీగా పందేలు నిర్వహించారు. కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, గంటి హరీష్ మాధుర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, సినీ నటి హేమ తదితరులు పందేలను వీక్షించారు. తూర్పు గోదావరి జిల్లాలో కడియం – వీరవరం రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో క్యాసినో నిర్వహించారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బరుల వద్ద భారీ పందేలు జరిగాయి. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో బరి వద్ద రేగిన వివాదం కేతనకొండలో రెండు సామాజిక వర్గాల మద్య ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ⇒ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి శిబిరంలో టీడీపీ నేతలు ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి పేకాట, క్యాసినో నిర్వహించారు. రూ.10 వేలు కట్టిన వారిని మాత్రమే ఎంట్రీ బ్యాండ్‌తో లోపలికి అనుమతించారు. పెనమలూరు నియోజకవర్గం ఆకునూరు, ఉప్పులూరు గ్రామాల్లో క్యాసినో తరహా జూద క్రీడలు సాగాయి. ఎంట్రీ టికెట్ రూ.లక్ష చొప్పున బరుల నిర్వాహకులు వసూలు చేశారు. కాకినాడ జిల్లాలో బరులకు వెళ్లే దారిలో రెండు కి.మీ. మేర ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి సెల్ఫోన్లతో వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. ⇒ పిఠాపురం మండలం కందరాడలో జనసేన నేత ఆధ్వర్యంలో సినీ సెట్టింగ్ మాదిరిగా ఏర్పాట్లు చేసి కోడిపందేలు, గుండాట నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కోడిపందేల విజేతలకు రెండు కార్లు, ఒక బైక్ బహుమతిగా అందించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీగా పందేలు జరిగాయి. పూతలపట్టు మండలం బండపల్లిలో పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నట్లు ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రూ.12.26 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రణస్థలం మండల పరిధిలో కోడి పందేలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సోదరుల కనుసన్నల్లో పందేలు సాగాయి. అచ్యుతాపురం మండలంలో బెల్టు షాపులకు వేలం నిర్వహించారు. సబ్బవరం మండలం అమృతపురం, మొగలిపురం గ్రామాల్లో టీడీపీ, జనసేన కూటమి నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలో కోడిపందేలు, గుండాట నిర్వహించారు. టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ స్వగ్రామమైన మొగలిపురంలో పందేల వద్ద గొడవ జరిగింది. సుజాతనగర్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఓ నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకుని రాత్రంతా విద్యుత్ స్తంభాలకు కట్టేశారు. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.అధికార పార్టీ కనుసన్నల్లోనే.. కోడి పందాల బరులన్నీ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఏర్పాటయ్యాయి. వారి సూచనల మేరకే పోలీసులు బరులకు అనుమతి ఇచి్చనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ముందే ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ముడుపుల బేరం కుదుర్చుకున్నాక పోలీసు అధికారుల వద్దకు వెళుతున్నారు. అక్కడ కూడా లంచాలు ఇచ్చాక తూతూమంత్రంగా కేసులు పెట్టేందుకు కొంతమందిని నిర్వాహకులే పోలీసులకు అప్పగిస్తున్నారు. వారిని పోలీసులు ముందే బైండోవర్ చేసి కొన్నిచోట్ల దాడి చేసి అరెస్టు చేసినట్లు చూపుతున్నారు. ఇందుకోసం స్టేషన్‌కి రూ.10 నుంచి రూ.15 లక్షలు ఇచి్చనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -
Rachamallu: రమ్మీ, గుండాట, రికార్డింగ్ డాన్సులు ఏపీని గోవాగా మార్చేశారు
-
సంక్రాంతి స్పెషల్ 'కోస' మాంసం
-
అనకాపల్లి బెల్లం ఎందుకు అంత స్పెషల్
-
ప్రభాస్‌ను రెబల్ స్టార్ గా మార్చిన సంక్రాంతి..
-
బన్నీ VS మహేష్ సంక్రాంతి వార్
-
సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)
-
కుమారుడితో తొలి సంక్రాంతి.. వరుణ్‌తేజ్ దంపతుల పోస్ట్ వైరల్
టాలీవుడ్ దంపతులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ముద్దుల కుమారుడితో తొలి సంక్రాంతి వేడుక జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. వాయుతో ఫస్ట్ పండుగ కావడం మరింత స్పెషల్‌గా ఉందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మెగా హీరో వరుణ్ తేజ్ రెండేళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ 10న ఈ జంటకు బాబు పుట్టాడు. ఆ తర్వాత బారశాల వేడుక కూడా నిర్వహించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడి పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.కాగా.. నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
భర్తతో తొలి సంక్రాంతి వేడుక.. ఫోటో షేర్ చేసిన సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ డైరక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వీరి వివాహా వేడుక జరిగింది. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు.తాజాగా సమంత సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి ఈ పండుగను జరుపుకుంది. సంక్రాంతి వైబ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సామ్ జంటకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ జంట సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. -
అదే ఫాలో అయ్యాడు..! బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు
-
ఆషిక రంగనాథ్ సంక్రాంతి వైబ్స్.. పతంగులు ఎగరేసిన అనసూయ..!
సంక్రాంతి వైబ్‌లో హీరోయిన్ సాక్షి అగర్వాల్..సంక్రాంతి స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో ఆషిక రంగనాథ్..లంగా ఓణిలో మన్మధుడు హీరోయిన్ అన్షు హోయలు..పతంగులు ఎగరేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ..హ్యాపీ పొంగల్ అంటోన్న అనిఖా సురేంద్రన్..సంక్రాంతి ఫెస్టివ్ మూడ్‌లో భాగ్యశ్రీ బోర్సే View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) -
విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తుల దుర్మరణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. ఓ వ్యాన్, ట్రాక్టర్ ట్రాలీ ఢీ కొని ఐదుగురు మృతి చెందగా, మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురం నుంచి తిరిగి వస్తున్న భక్తులపై విషాదాన్ని మోపింది. పోలీసుల వివరాల మేరకు.. భోపాల్ జిల్లా బెరాసియా ప్రాంతంలో వ్యాన్, ట్రాక్టర్ ట్రాలీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన మకర సంక్రాంతి సందర్భంగా నర్మదాపురం నుంచి తిరిగి వస్తున్న భక్తులపై విషాదాన్ని మోపింది.ఈ ప్రమాద సమయంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు సిరోజ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మరో పది మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని హమీదియా ఆసుపత్రి, భోపాల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే బెరాసియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. ఇన్చార్జ్ విజేంద్ర సేన్ ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. ఈ ప్రమాదం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తుల ఆనందాన్ని విషాదంగా మార్చింది. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, వాహనాల అధిక వేగం, రాత్రి సమయంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి అంశాలు ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు పెంచితే ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. #WATCH | Bhopal, Madhya Pradesh: 5 people were killed, and 12 others were injured in a collision between a tractor-trolley and a pickup vehicle.Berasia SDM Ashutosh Sharma says, "The collision between the tractor-trolley and the pickup took place in front of Vidya Vihar. 5… pic.twitter.com/dOjK9WZedv— ANI (@ANI) January 15, 2026 -
YS జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
-
బొత్స ఇంటి వద్ద భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో విడదల రజిని
-
Special Program: సంక్రాంతి సంప్రదాయాల... భీమవరం పిండివంటలు
-
భోగి మంటల్లో ఏం వేయాలి.. ఏం వేయకూడదో తెలుసా?
భోగి మంటలు.. పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించే సంకేతం. కేవలం సంప్రదాయం కాదు, ఆధ్యాత్మిక, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు సంకేతం. కానీ ఈ పవిత్ర ఆచారాన్ని కాలుష్య వేడుకగా మార్చే దృశ్యాలు ఈ ఉదయం కనిపిస్తున్నాయి. నిజానికి.. భోగి మంటల్లో ఏం కాల్చాలి.. ఏం కాల్చకూడదు అనేది మీకు తెలుసా?.. భోగి మంటల్లో వేయవలసినవి.. ఆవు పేడతో చేసిన పిడకలు.. ఇవి కాల్చినప్పుడు గాలి శుద్ధి అవుతుంది, క్రిములు నశిస్తాయి. ఎండిన ఆకులు, చెట్ల నుండి రాలిన కొమ్మలు.. సహజ సిద్ధమైనవి కావడంతో కాలుష్యం తక్కువ. పనికిరాని చెక్క వస్తువులు (పెయింట్ లేనివి).. పాతదాన్ని విడనాడి కొత్తదాన్ని ఆహ్వానించే సంకేతం. పాత నూలు దుస్తులు.. పాత ఆలోచనలను, వస్తువులను విడిచిపెట్టే ఆచారం. కొన్ని ధాన్యాలు, నెయ్యి.. హోమంలా భావించి వేయడం వల్ల గాలి పరిమళభరితం అవుతుంది.భోగి మంటల్లో వేయకూడనివి.. ప్లాస్టిక్ వస్తువులు.. ఇవి విష వాయువులు విడుదలై ఆరోగ్యానికి హాని చేస్తాయి. రబ్బరు, టైర్లు.. కాల్చితే ఊపిరితిత్తుల సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. పెట్రోల్, కెమికల్స్.. అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. పెయింట్ చేసిన చెక్కలు.. విషపూరిత వాయువులు విడుదలవుతాయి.భోగి మంటలు కేవలం సంప్రదాయం కాదు.. ఆధ్యాత్మిక, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు సంకేతం. కాబట్టి సహజ సిద్ధమైన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. పర్యావరణానికి హాని చేయని వస్తువులను మాత్రమే వేయడం మన బాధ్యత. ఇలా చేస్తే భోగి మంటలు నిజమైన శుభాన్ని, ఆరోగ్యాన్ని, పర్యావరణ రక్షణను అందిస్తాయి. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి,గుంటూరు: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
సంక్రాంతి ఘుమ ఘుమలు
నేతి అరిసెలు.. కొబ్బరి బూరెలు.. కజ్జికాయలు.. కరకరలాడే చక్రాలు.. చక్కలు, బూందీ లడ్డూలు, బెల్లం గవ్వలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే పిండి వంటకాలెన్నో.. ఎన్నోన్నో.. తెలుగునాట పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి వేడుకల్లో పిండి వంటలది ప్రథమ స్థానం. అందులోనూ అరిసెలది అందెవేసిన చెయ్యి. సంక్రాంతికి సమ్‌థింగ్ స్పెషల్ వంటకమూ ఇదే.. తెలుగింటి ముంగిట మరో 24 గంటల్లో సంక్రాంతి సందడి ప్రారంభం కానుండడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేతి అరిసెల సువాసనలు వీధులను చుట్టేస్తున్నాయి. గ్రామాలలో చుట్టుపక్కల నివాసాల వారు, బంధుమిత్రులంతా ఒక చోటకు చేరి కలిసికట్టుగా సంక్రాంతి వంటకాల తయారీలో నిమగ్నమై కనిపిస్తున్నారు. -
పెద్ద పండగొచ్చింది
అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, ఇంటి ముందు అంత ఎత్తున ఎగసే భోగి మంటలు. బొమ్మల కొలువులు, పేరంటాలు... సంక్రాంతి సందడి వర్ణనాతీతం. ఇంటింటా భారీ పిండి వంటలు, పండగ నాడు అవన్నీ పంచటాలు అబ్బో ఊపిరి సలపనంత సందడి. ఇక ఊరంతా ముగ్గుల తివాచీలే. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి పంచుకుంటున్న జ్ఞాపకాలు.పండుగలు ఎన్ని ఉన్నా సంక్రాంతి పండుగ ప్రత్యేకతే వేరు. పెద్ద పండుగ సంక్రాంతి. అప్పట్లో అంటే 60 ఏళ్ల కిందట సంక్రాంతి వస్తుంది అంటే అందరికీ సంబరం. ఆ రోజుల్లో అందరివీ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు. సంక్రాంతి అంటే పంట ఇంటికి వచ్చే సమయం. ఆ రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేతికి వచ్చిన పంట ఏ వర్షం వల్లనో నాశనం అయిపోవటం లేదు కాబట్టి అందరికీ వారు పడ్డ కష్టానికి శ్రమ చేతికి అందే సమయం. అందరి చేతిలోనూ డబ్బులు ఆడే ఆ సమయంలో బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు వచ్చేసేవాళ్ళు. ఏదో ఒక ఊరిలో బస చేసి రెండు మూడు గ్రామాలు చుట్టపెట్టుకునేవాళ్ళు. ఒక రోజు రెండు రోజులు కాదు సుమారు నెలరోజులు వారి సంచారం ఉండేది. ప్రతి వీధిలో తెల్లవారుజాము నుంచి ముగ్గుల సందడి. ఊరి మొత్తం తివాచీ పరిచారా అన్నట్లు ప్రతి ఇంటి ముందు ముగ్గులే. వాటికి మరింత సొబగు నద్దుతూ గొబ్బిళ్ళు.పెద్ద పండగకు పిల్లా పెద్దా అందరూ కొత్త బట్టలు కుట్టించుకోవడం ఆనవాయితీ. పల్లెటూర్లలో పదిమంది ఉన్న ఉమ్మడి కుటుంబాల వారి కొత్త బట్టల సరదా ప్రత్యేకంగా ఉండేది. అలవాటుగా బట్టలు కుట్టే దర్జీ మిషన్ తీసుకుని వచ్చి వీళ్ళ వరండాలో తిష్ట వేసేవాడు. అక్కడే బట్టలు కుట్టటం. అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, వాళ్లకు భోగి పండగ రోజున నూనె అంటి స్నానం చేయించే ఇంటి పని వాళ్ళు. ఇంటి ముందు అంత ఎత్తున ఎగసే భోగి మంటలు. భోగి పండ్లు, బొమ్మల కొలువులు, పేరంటాలు. ఆ సందడి వర్ణనాతీతం. ఇంటింటా భారీ ఎత్తున తయారు చేసే పిండి వంటలు, సంక్రాంతి పండగ నాడు అవన్నీ పనివారికి పంచటాలు... అబ్బో ఊపిరి సలపనంత సందడి. మిగిలిన అన్ని పండుగల కంటే సంక్రాంతికి మరొక ప్రత్యేకత కనుమ. పశువుల పండగ. ఏడాది పొడుగునా తమకు వ్యవసాయంలో సాయం చేసిన పశువులకు కృతజ్ఞతగా జరిపే పండుగ. పశువులను చెరువుకు తీసుకువెళ్లి శుభ్రంగా కడిగి తీసుకువచ్చి పసుపు కుంకాలతో, గులాం రంగులతో మెడ పట్టెడలు కొమ్ములకు మువ్వలు కట్టి అలంకరించి ఎంతో ప్రేమతో చేసేవారు పశువుల పండుగ. కాలక్రమేణ కొంత మార్పు వచ్చినా ఈనాటికి ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నది సంక్రాంతి. ఈ నాటి పద్ధతి ప్రకారం గుండుసూది మొదలుకొని కారు వరకు, అన్ని వస్తువుల మీద సంక్రాంతి సేల్. ఆకర్షణీయమైన ఆఫర్లు. ఎవరి ఇంటి ముందు వారు ముగ్గు వేసుకోవటంతో సరిపెట్టకుండా ఎంతోమంది ప్రముఖులు పెద్దపెద్ద మైదానాలలో భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించి ఘనంగా బహుమతులు అందజేస్తున్నారు. ప్రతి ఊళ్లోనూ ప్రతి కూడలిలోనూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి భోగి మంటలు. గాలిపటాలతో ఆకాశం కొత్త అందాలు సంతరించుకుంటోంది. సంప్రదాయ వంటకాలు రకరకాలు ఇక్కడ తయారై తాజాగా అమెరికా దేశంలో ఉన్న తెలుగువారి కోసం ఆకాశమార్గాన ఎగిరి పోతున్నాయి. గొప్ప వారి కోసం ప్రత్యేకంగా జరిగే కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పండగకు ముందే భాగ్యనగరం నుంచి సగం మంది సొంత ఊర్లకు ప్రయాణం కట్టడంతో పంతంగి టోల్ గేట్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ సంక్రాంతి పండగలో ఒక భాగం అయిపోయింది. అప్పట్లో చదువులు ఇంత భారంగా ఉండేవి కాదు కాబట్టి సంక్రాంతి పండుగకు బోలెడన్ని సెలవులు ఇచ్చే వాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. కాని నగరంలో ఇప్పటికీ కాలనీలలో గంగిరెద్దు వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్ని లావాదేవీలు ఫోన్ ద్వారానే కాబట్టి గంగిరెద్దు మొహాన స్కానర్ తగిలించి తీసుకువస్తున్నారు. ఏళ్లు గడిచినా, తరాలు మారినా సంక్రాంతి పండుగ వైభవం మాత్రం తగ్గలేదు. ఈనాటికీ పెద్ద పండుగ సంక్రాంతి.ఇక సంక్రాంతి పండుగ విషయంలో నాకు మాత్రమే సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటాను.అప్పుడు నేను సెకండ్ ఫామ్ అంటే ఇప్పటి ఏడవ తరగతి చదువుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా వ్యాసం రాయమన్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మొదటి నుంచి నాకు కొంచెం అత్యుత్సాహం. మామూలుగా గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు అన్నీ రాసిన తరువాత ఏదైనా కొత్తగా రాయాలి అనిపించింది. ‘సంక్రాంతికి శంకరుడు సంక్రమణమున ప్రవేశించును’ అని రాశాను. మా తెలుగు టీచర్ గారు వేరే మతస్తులు. నేను రాసిన విషయం ఆవిడకి తెలియక మరి కొంతమంది టీచర్లని అడిగారుట. అందరూ ఏమో మాకు తెలియదు అని అన్నారుట. చివరికి అందరూ కలిసి సూర్యుడు మేషరాశి అందు ప్రవేశిస్తాడుగానీ శంకరుడు సంక్రమణమున ప్రవేశించటం ఎవరము ఎక్కడా వినలేదు అని నన్ను పిలిచి నిలదీసి అడిగారు. నేను తలవంచుకుని మెలికలు తిరిగిపోతూ ఉంటే అప్పుడు వాళ్లకు అర్థమైంది అది కేవలం నా అతి తెలివి అని. చక్కగా అక్షింతలు వేసి పంపించారు. మరొక సంక్రాంతి వచ్చింది మన జీవితాల్లోకి. పండగనాడు చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా గడపండి. కాస్త మనసు అదుపు చేసుకుని పండగ నాడైనా సెల్‌ఫోన్ పక్కన పెట్టి, టీవీకి దూరంగా అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకొని ఆత్మీయత పెంచుకుంటే అదే అసలైన పండగ... పదిమందితో జరుపుకునేదే పండగ. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకొని ఆ మధురమైన అనుభూతులతో వచ్చే పండగ కోసం ఎదురుచూడటం జీవితానికి సార్ధకత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. -
పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇటు వీధులన్నీ రంగురంగుల వెలుగులతో, అటు ఆన్లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో కళకళలాడుతుంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రత్యేక ఈవెంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. దాంతో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఆఫర్ల వెల్లువలో పడి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలో వివరించే చిట్కాలు చూద్దాం.ముందస్తు ప్రణాళికసేల్ ప్రారంభం కావడానికి ముందే మీకు కావాల్సిన వస్తువులను ‘విష్‌లిస్ట్’లో చేర్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ధర తగ్గినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, ఎంత వరకు ఖర్చు చేయాలనే దానిపై ఒక బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసరమైన కొనుగోళ్లను నివారించవచ్చు.ధరల పరిశీలనఒక సైట్లో తక్కువ ధర కనిపిస్తోందని వెంటనే కొనేయకండి. వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల్లో ధరలను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్లైన్లో కొన్ని టూల్స్ లేదా వెబ్సైట్లను ఉపయోగించి, గత కొన్ని నెలల్లో ఆ వస్తువు అత్యల్ప ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ‘భారీ డిస్కౌంట్’ అని చూపించేవి నిజానికి సాధారణ ధరలకంటే తక్కువ ఏమీ ఉండకపోవచ్చు.బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్పండుగ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% నుంచి 15% వరకు తగ్గింపును ఇస్తుంటాయి. మీ దగ్గర ఆ బ్యాంక్ కార్డు లేకపోతే, స్నేహితులు లేదా బంధువుల కార్డులను ఉపయోగించి డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనంగా కొంత మొత్తం క్యాష్‌బ్యాక్ ద్వారా వాలెట్‌లోకి వస్తుంది.నో-కాస్ట్ ఈఎంఐఖరీదైన వస్తువులు (ల్యాప్టాప్స్, ఫ్రిజ్‌లు, ఫోన్లు) కొనేటప్పుడు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే, దీనిపై ఉండే ప్రాసెసింగ్ ఫీజును గమనించడం మర్చిపోవద్దు.ఎక్స్ఛేంజ్ ఆఫర్లుమీ పాత వస్తువులను మార్పిడి చేయడం ద్వారా కొత్త వస్తువు ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పండుగ సమయాల్లో ఎక్స్ఛేంజ్ వాల్యూపై అదనపు బోనస్ కూడా లభిస్తుంది. వస్తువును ఇచ్చే ముందు అది పని చేసే స్థితిలో ఉందో లేదో సరిచూసుకోండి.సైబర్ భద్రత అత్యంత ముఖ్యంషాపింగ్ హడావిడిలో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. కేవలం అధికారిక వెబ్సైట్లు లేదా యాప్స్ ద్వారానే షాపింగ్ చేయండి. వాట్సాప్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్‌ల్లో వచ్చే ‘భారీ బహుమతులు’, ‘లింక్‌లపై క్లిక్ చేయండి’ వంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపులు చేసేటప్పుడు సురక్షితమైన గేట్వేలను మాత్రమే వాడండి.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ ప్రకటన చేశారు. డీఏ ఫైల్ మీద సంతకం చేసి వచ్చా. రేపో మాపో డీఏ జీవో వస్తుంది’అని తెలిపారు. పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03శాతం డీఆర్‌ను 33.67శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు వర్తించనుంది. 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి ఇది ప్రత్యక్ష లాభం కలిగిస్తుంది.2018కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. 2015 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 68.628శాతం నుంచి 73.344శాతానికి పెరిగింది. 2016 పే స్కేల్స్ పెన్షనర్లకు డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెంపు జరిగింది. UGC/AICTE 2006 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 221శాతం నుంచి 230శాతానికి పెరిగింది. ఈ పెంపు విద్యా రంగానికి చెందిన పెన్షనర్లకు గణనీయమైన లాభం కలిగించనుంది.పెరిగిన డీఆర్ 2023 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు పెరిగిన డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ బకాయిలు మొత్తం 30 నెలవారీ వాయిదాల్లో చెల్లించబడతాయి. 2026 జనవరి నెల పెన్షన్‌తో పెరిగిన డీఆర్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2026లో పెన్షన్ మరియు డీఆర్ చెల్లింపులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఈ పెంపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్స్ పొందుతున్న వారికి వర్తించదు. కేవలం పెన్షన్ పొందుతున్న వారికి మాత్రమే ఈ లాభం అందుతుంది.జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటనతెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ‘జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అందుకే జిల్లాల పునర్విభజన కోసం ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిపి, సభ్యుల సలహాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ అంశంపై అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముందుగా మండలాల రేషనలైజేషన్, తర్వాత రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్, ఆ తర్వాతే జిల్లాల పునర్విభజన జరుగుతుంది’ అని తెలిపారు. -
Ambati : మా ఇద్దరికీ ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టింది అందుకే..
-
ఆకాశమంతా సంక్రాంతి
తెలుగు వారు ఏడాది మొత్తం వేచి చూసే పండగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండగ వస్తోంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అతివలు ముంగిట్లో అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగురవేయడానికి ఇష్టపడుతుంటారు. ఈ సమయంలో గాలిపటాలు ఎగురవేయడం అనేది కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం అయిన విషయం కాదు. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో గాలిపటం ఎగురేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్లో ఉత్తరాయణ సమయంలో ఆకాశంలో రంగు రంగుల గాలిపటాలు సందడి చేస్తాయి. ⇒ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎలా మేడలపై, మైదానంలో,పోలాల్లోంచి పతంగులు ఎగుర వేస్తారు. మహారాష్ట్ర ప్రజలు కూడా సముద్ర తీరాల్లో ఎగిసే కెరటాల మధ్య గాలిపటాల ΄ోటీలు పెట్టుకుంటారు.⇒ రాజస్థాన్ ఓల్డ్ సిటీలో ఉన్న మేడలపై యువతీ యువకులు అక్కడి ఘేవర్ పేనీలు, నువ్వుల లడ్డూలను ఆస్వాదిస్తూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు.⇒ ఉత్తర ప్రదేశ్‌లో ప్రతీ గల్లీలో పతంగుల పోటీ జరుగుతుంది. ⇒ కలకత్తాలో గ్రూపులుగా ఏర్పడి గాలిపటాలు ఎగరేయడానికి ఇష్టపడగా, కర్ణాటక, తమిళనాడులో బీచుల్లో గాలిపటాలను ఎగరేయడానికి ఇష్టపడతారు.అన్ని రాష్ట్రాల్లో పండగ స్పూర్తి గాలిపటాలు ఎగరవేయడంలోనే కనిపిస్తోంది. ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనే ఆశయానికి సంక్రాంతి ఒక వేదికగా నిలుస్తుంది. ఈ సందేశాన్ని ఆకాశం సాక్షిగా చాటే మార్గంగా గాలిపటం నిలుస్తోంది. -
సంక్రాంతి స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 12 సినిమాలు
మరోవారం వచ్చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి హడావుడే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లు థియేటర్లలోకి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా వచ్చేసింది. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. వీటితో పాటు పలు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దండోరా, కాలంకావల్, గుర్రం పాపిరెడ్డి, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి రేపుతుండగా.. స్ట్రేంజర్ థింగ్స్ 5 మేకింగ్ వీడియో, తస్కరీ సిరీస్‌లు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ అందుబాటులోకి రానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 12 నుంచి 18వ వరకు)అమెజాన్ ప్రైమ్బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 12దండోరా (తెలుగు మూవీ) - జనవరి 14నెట్ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ 5 (మేకింగ్ వీడియో) - జనవరి 12తస్కరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 14సెవెన్ డయల్స్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 15ద రిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16హాట్స్టార్ఇండస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12డౌన్ టౌన్ అబ్బే: ద గ్రాండ్ ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12సోనీ లివ్కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16జీ5గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16ఆపిల్ టీవీ ప్లస్హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16 -
పండగ లీవ్ కోసం పాట్లు పడ్తున్న రాజేష్
-
సంక్రాంతి కిక్కు.. జీవో రాకముందే మద్యం ధరల పెంపు
-
పండుగను ఆస్వాదిద్దాం
అదే పండగ. కాని తీరు మారింది. గతంలో నలుగురూ కూడి ఆస్వాదన చేసేవారు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదనలో జ్ఞాపకం మిగులుతుంది. ఎంజాయ్మెంట్ క్షణికం. పండుగ చేసుకోవడం సులభమైంది. పెరట్లో పూచే బంతిపూల చెట్ల వరుస నేడు కుండీలు చేరాయి. గ్లోబల్ మార్పుల్లో సంక్రాంతిని కొత్తగా చూడాలి... అంటున్నారు ప్రసిద్ధ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వచ్చిన ప్రతి సంక్రాంతి పండగ నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు మా గిరిజన ప్రాంతపు పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో పంటతో పాటు తోటల నుంచి తాజా చిక్కుడు కాయలు, ఏజన్సీ ముళ్ళ వంకాయలూ, పచ్చి మిరపకాయలు ఇళ్ళకు గుట్టగా వచ్చి పడేవి. తియ్య గుమ్మడి పళ్లు సరేసరి. ‘కొసరి నూరిన పచ్చి పసుపు పూత మొగాన గుమ్మడి పూ దుమారమ్ము నద్ది పండ రేగడి బండి నార కన్పండువై ΄÷లుచు మిర్యపు పండు బొట్టు పెట్టి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వీధి‘ అని రాసేడు ఆనాడెప్పుడో కవి. దేశంలో ఇప్పుడు పంట ఉత్పత్తి పెరిగింది. ఎరువులు, పురుగుల మందులు మనవి కాదనుకుంటే దిగుబడి పెరిగింది. బజార్ల నిండా బంతి పూలు, చేమంతి పూలు విరగబడి ఉంటున్నాయి. ఈ ఏడాది చలి కూడా బావుంది. పుష్యమాసానికి తగినట్టు ఉంది. పాత, పాత సంక్రాంతి రోజులను గుర్తుకు తెచ్చింది. మా గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఇంత గ్లోబల్ నాగరికత వల్ల కమ్ముకొన్న ΄÷గ అంతటిలోనూ ధనుర్మాసమంతా వీథి వీథినా వాకిళ్లలో ముగ్గులు పెడుతూనే ఉన్నారు.మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు సంక్రాంతి సంప్రదాయ వేడుకలకు గ్లోబల్ మెరుపుల మధ్య పరాకు పడినట్టయేరు. ఎనభయిల్లో మా రాజవొమ్మంగికి టూరింగ్ టాకీస్ వచ్చినప్పుడు జనం సంక్రాంతి పండగని పక్కన పెట్టి విగబడి సినిమాకి పోయేవారు. ఆ రోజుల్లో పండగ తాలూకు అన్ని సంబరాలూ తగ్గేయి. గ్లోబల్ నాగరికత అలా పండుగను వెనక్కు నెట్టింది. కానీ తిరిగి దేశమంతా మళ్లీ కొత్తదారుల్లో పండుగను వెతుక్కుంటోంది. నా చిన్నప్పుడు మా పెరట్లో పశువుల శాల ఉండేది. అక్కడి ఆవు పేడ తీసుకెళ్లి మా వెదురు కంచె అవతల ఉన్న చింత చెట్టు మాను మీద గిరిజన పిల్లలతో కలిసి పిడకలు వేసేదాన్ని. ఆ చింత చెట్టు మాను దాని చుట్టూ ముగ్గురు చేతులు చాపి కౌగిలించుకుంటే పట్టే అంత పెద్దగా ఉండేది. బహుశా ఒక 300 ఏళ్ల వయసు అయి ఉంటుంది దానిది. భోగి పండగ నాటికి ఆ పిడకలన్నీ గుచ్చి భోగిమంటలో వేయటానికి. ఇది ఒక వారం రోజుల కార్యక్రమం. ఇప్పుడు అమెజాన్ నుంచి డైరెక్ట్‌గా ఆవుపేడ, పిడకలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రజలకి ఆ సంప్రదాయం కావాలి, ఎలా దొరికినా సరే. దాంట్లో ఉన్నది అందమా, పుణ్యమా, పురుషార్ధమా అన్నది వేరే విషయం. మేము చదువులకి పట్టణానికి వచ్చినప్పుడు సంక్రాంతి పండక్కి మా పల్లెటూళ్ళకి తరలి వెళ్లే వాళ్ళం. ఎక్కడెక్కడ చుట్టాలూ, బంధువులూ ఇళ్లలో కలిసి పండగ చేసుకునేవారు. ఇవాళ మనిషి రోజులో ఎక్కువ గంటలు సెల్‌ఫోన్‌తో జీవిస్తున్నాడు. కానీ సెల్‌ఫోన్ ద్వారా కూడా చేస్తున్నది సమూహానికి దగ్గర అయ్యే ప్రయత్నమేనేమో. అందులో ఉన్న వాట్సాప్ నిండా ఎన్ని గ్రూపులు ఉంటాయో చెప్పలేం. బయట గ్రూపులే కాక కుటుంబాల గ్రూపులని, కుటుంబాల్లో కజి¯Œ ్స గ్రూపులని, ఒక ఊరి బంధువుల గ్రూపులని రకరకాలు. ఇలా ఒకరినొకరు కలుపుకుంటూ మళ్లీ తిరిగి ఈ పండగలకి ఎక్కడో చోట అందరూ కలవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కలుస్తూ ఉంటున్నారు. పల్లటూర్లు, రిసార్ట్లు నిండి పోతున్నాయి.తిరిగి అవే అరిసెలు, అవే బొబ్బట్లు, అవే చక్రాలు, అవే పిండి వంటలు. పూర్వం వండుకుని తినేవారు. ఇప్పుడు చేయించుకుని తింటున్నారు. సాంకేతికంగా వస్తున్నటువంటి పెనుమార్పులు చూసినప్పుడు, ఇవి మానవ జీవితంలో తీసుకొస్తున్న సౌకర్యాలను గాని, అలజడులను గాని గమనిస్తున్నప్పుడు మన పాత సరదాలన్నీ వెనక్కి పోయాయా అనే విచారం కలుగుతుంది. కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే మనుషులు మళ్ళీ తిరిగి కష్టపడకుండా ఇంకా సులువుగా పండగలను ఎంజాయ్ చేయడానికి సర్వవిధాలా సంసిద్ధులవుతూనే ఉన్నారు. ఇది నగరాలకు కూడా మినహాయింపు కాదు. అసలు జీవితంలో తిండినేనా, అనుబంధాన్నేనా పూర్వం ఆస్వాదించే వారు. ఇప్పుడు ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదన వేరు ఎంజాయ్ వేరు. నేను ఎప్పుడో చె΄్పాను– ఈ ఎంజాయ్మెంట్ అన్నది కూడా గ్లోబలైజేషన్ తాలూకు జార్గాన్ అని. ఎంజాయ్మెంట్ క్షణికం. ఆస్వాదనలో జ్ఞాపకం, కొనసాగింపు ఉంటాయి.సంక్రాంతి పండుగ అంటే మూడు నెలల ముందు నుంచి రైలు టికెట్లు దొరక్కపోవడం, బస్సులు కిటికిటలాడుతూ ఉండటం ఇప్పటికీ ఆ పండగ తాలూకు అట్టహాసాన్ని చెప్తూనే ఉన్నాయి. పల్లెటూర్ల నుంచి, ΄÷లాల నుంచి తోటల నుంచి దూరంగా వచ్చేసిన నేను కూడా సంక్రాంతి పండగ ముందు నాలుగు బంతిపూల కుండీలు, నాలుగు చామంతి పూల కుండీలు కొనుక్కుని ప్రతి ఏడాది బాల్కనీలో పెట్టుకుని కవులను తలుచుకుంటూ ఉంటాను. ‘బంతి పువ్వులకు చామంతులకు నెయ్యమును గూర్చి కబరీభరమ్ము చక్కన కుదిర్చి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వైపు’వాడ్రేవు వీరలక్ష్మీ దేవి రచయిత్రి, సాహితీ విమర్శకులు -
లిక్కర్ సిండికేట్‌కు సంక్రాంతి కిక్కు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోతో మాకేం సంబంధం లేదు.. ప్రభుత్వమే మాది.. మా దోపిడీని ఆపేదెవర్రా.. అన్నట్లుంది రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ బరితెగింపు. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు (జీవో) విడుదల కాకముందే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేసి, మూడు రోజులుగా అనధికారికంగా దోపిడీకి తెగబడుతున్నారు. అందుకు ఎక్సైజ్ అధికారులు అడ్డుకోకుండా చూస్తామని చెప్పి.. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు సంక్రాంతి సీజన్ వేళ మద్యం దుకాణాల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ఈ నెల 8న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. ఒక్కో బాటిల్‌పై రూ.10 పెంపునకు నిర్ణయించింది. కాగా, అందుకు అనుమతినిస్తూ అధికారికంగా జీవో ఇంకా విడుదల కాలేదు. అంటే మద్యం ధరల పెంపు అధికారికంగా ఇంకా అమలులోకి రాలేదు. కానీ ఈ అధికారిక ప్రక్రియతో తమకు సంబంధం లేదంటూ మద్యం సిండికేట్ బరితెగించింది. ఈ నెల 9 నుంచే మద్యం ధరలు పెంచేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో ధరల పెరుగుదల అనధికారికంగా అమలులోకి వచ్చేసింది. ‘ముఖ్య’ ప్రజా ప్రతినిధి దన్ను ఉండటంతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూడటం మినహా ఏమీ చేయలేక పోతోంది.సంక్రాంతి స్పెషల్ బాటిల్‌పై రూ.10 అదనం అంటే ఏముందీలే అనుకోవద్దు. ఎందుకంటే రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాలు, 540 బార్లు ఉన్నాయి. వాటిలో నెలకు 6 లక్షల కేసుల వరకు మద్యం విక్రయిస్తున్నారు. రోజుకు దాదాపు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అనధికారికంగా బాటిల్‌పై రూ.10 పెంపుదలతో రోజుకు రూ.5 కోట్లు చొప్పున అనధికారికంగా కొల్లగొడుతున్నారు. ఇలా మూడు రోజులుగా రూ.15 కోట్ల వరకు దందా సాగించారు. ఇక సంక్రాంతి సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు మద్యం సిండికేట్.. బెల్ట్ దుకాణాల్లో మరో రూ.5 అదనంగా పెంచింది. అందుకోసమే ఏకంగా 75 వేల వరకు బెల్ట్ దుకాణాలను బరితెగించి మరీ ఏర్పాటు చేసింది. మద్యం ధర పెంపు జీవో వచ్చిన తర్వాత కూడా అధికారిక పెంపుదల రూ.10తోపాటు అనధికారికంగా మరో రూ.10 పెంపుదలకు సిండికేట్ ఇప్పటికే నిర్ణయించింది. వెరసి ఒక్కో బాటిల్‌పై రూ.15 అదనపు దోపిడీ ఇకపై కూడా వర్తించనుందన్నది సుస్పష్టం. కూటమి ప్రజాప్రతినిధులకు మామూళ్లుమద్యం సిండికేట్ డిమాండ్‌ను తమ ప్రభుత్వం ఆమోదించి ధరలు పెంచింది కాబట్టి.. తమకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో సిండికేట్.. ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.50 వేలు, ఒక్కో బార్ నుంచి రూ.2 లక్షలు చొప్పున వసూలు చేసి కూటమి ప్రజా ప్రతినిధులకు ముట్టజెబుతోంది. ఆ ప్రకారం రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాల నుంచి రూ.18.18 కోట్లు, బార్ల నుంచి రూ.10.80 కోట్లు కూటమి ప్రజా ప్రతినిధులు వసూలు చేశారు. మద్యం దుకాణాల నుంచి సంక్రాంతి మామూళ్ల వసూళ్ల ప్రక్రియను కూటమి ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. -
సంక్రాంతి వేడుకల్లో చై-శోభిత.. భోజనం వడ్డిస్తూ..
టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఈసారి సంక్రాంతిని కాస్త ముందుగానే జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకకు హాజరైన వీరిద్దరూ అక్కడ ఉన్నవారికి ఆప్యాయంగా భోజనం వడ్డించారు. అనంతరం అక్కడి వారితో ఫోటోలు కూడా దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సినిమాకాగా చై- శోభితలది ప్రేమ పెళ్లి. కొంతకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన చైకి 'తండేల్'తో పెద్ద హిట్ లభించింది. రూ.100 కోట్లు రాబట్టిన తొలి సినిమాగా అతడి కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం చై 'వృషకర్మ' సినిమా చేస్తున్నాడు. శోభిత సంగతేంటి?'విరూపాక్ష' వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. శోభిత విషయానికి వస్తే.. ఇటీవలే తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది. 'చీకటిలో' అనే థ్రిల్లర్ సినిమాతో జనవరి 23న ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం థియేటర్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. #EverGreen Couple #Yuvasamrat @chay_akkineni sir @sobhitaD Madam 😍💞 at Annapurna Studios Sankranthi Pongal Festival Celebrations ✨🥳#ANRLivesOn #NagaChaitanya #SobhitaDhulipala #Vrushakarma pic.twitter.com/Hse8fBVw7p— En Uyir Chaitu (@Kalyan7781) January 10, 2026 చదవండి: నీ బర్త్‌డే నాకెంతో స్పెషల్.. పుట్టినందుకు థాంక్స్: అల్లు అర్జున్ -
రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/సూర్యాపేట టౌన్ : నగరం నుంచి పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో పోటెత్తాయి.ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, అమీర్‌పేట, సాగర్ రింగ్ రోడ్డు, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి శనివారం ప్రయాణికులు భారీ ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులతోపాటు మరో 300 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిటీ బస్సులను సైతం దూర ప్రాంతాలకు నడుపుతున్నారు. శనివారం 75 సిటీ బస్సులను విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట తదితర ప్రాంతాలకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో విజయవాడ, వరంగల్, కర్నూలు రహదారులు వాహనాలతో పోటెత్తాయి. రైళ్లలో కిక్కిరిసిన జనరల్ బోగీలు... సాధారణ రైళ్లతోపాటు వివిధ మార్గాల్లో సుమారు 60 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా అన్ని రైళ్లలోనూ బెర్తులు బుక్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు జనరల్ బోగీల్లో తరలి వెళ్లారు. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి శనివారం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరారు. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిత్యం సుమారు 1.85 లక్షల మంది ప్రయాణం చేస్తారు. శనివారం సుమారు 2.20 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా, లింగంపల్లి, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. జాతీయ రహదారిపై రద్దీ పండుగ నేపథ్యంలో ప్రజానీకం సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. ఈ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు విజయవాడ వైపు 55వేల వాహనాలు వెళ్లాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద మొత్తం 16టోల్‌బూత్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ వైపునకు 12బూత్‌లు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో నాలుగు బూత్‌ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. అయితే, అదనంగా కేటాయించిన టోల్‌బూత్‌లకు ఫాస్టాగ్ స్కానింగ్ చేసే అవకాశం ఉండదు. స్కానింగ్ వ్యవస్థ వెనుక భాగంలో ఉండడంతో విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలకు ఆటోమెటిక్ స్కానింగ్‌కు అవకాశం లేదు. దీంతో ఆ నాలుగు బూత్‌ల వద్ద హ్యాండ్ మిషన్ ద్వారా స్కానింగ్ చేస్తున్నారు. ఇందుకుగాను అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రద్దీని తట్టుకునేలా సిబ్బంది హ్యాండ్ గన్లతో సిద్ధంగా ఉంటూ స్కాన్ చేస్తున్నారు. -
దారి దోపిడీకి ‘పచ్చ’జెండా!
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ‘దారి’ దోపిడీకి చంద్రబాబు సర్కారు డూడూ బసవన్న తరహాలో తలాడిస్తోంది. ప్రభుత్వ కీలక నేతకు రూ.వంద కోట్ల ముడుపుల మూట ముట్టజెప్పేందుకు పక్కా డీల్ కుదరడంతో అడ్డగోలు దందాకు సర్కారు పచ్చ జెండా ఊపింది. దీనికోసం ఆర్టీసీ స్పెషల్ సర్వీసుల్లోనూ భారీగా కోత విధించింది. ప్రయాణికులు అనివార్యంగా ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధార పడాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా కోటి మంది ప్రయాణికులను దోచుకునేందుకు పథక రచన చేసింది. రూ. కోట్లు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ప్రయాణ వ్యవహారాలు చూసే కీలక మంత్రి మాఫియాకు అండగా నిలిచినట్టు సమాచారం. సంక్రాంతి అంటే ఆంధ్రనాట పెద్ద పండగ. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు, విద్యార్థులు సొంత ఊళ్లకు తరలివస్తారు. బంధు మిత్రులతో పండగ మూడు నాలుగు రోజులూ ఆనందంగా గడిపి తిరిగి కార్యస్థానాలకు వెళ్తారు. ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వస్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సులో వచ్చే వారిని మినహాయిస్తే దాదాపు 40 లక్షల మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. కాగా, ఈ ఏడాది ఆర్టీసీ సర్సీసుల్లో భారీ కోత విధించడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 50 నుంచి 60 లక్షల మంది ప్రయాణించక తప్పదని స్పష్టమవుతోంది. ఏటా సంక్రాంతికి వచ్చి వెళ్లే వారిలో 40 శాతం మంది హైదరాబాద్‌వాసులే ఉంటారు. అందుకే టీడీపీ సిండికేట్ హైదరాబాద్ బస్ సర్వీసులను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. ఆర్టీసీ సర్వీసులను కుదించేలా పావులు కదిపింది.ఆర్టీసీ దొంగాటఏటా సంక్రాంతి స్పెషల్ బస్సు సర్వీసుల వివరాలను ఆర్టీసీ ఎండీ విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వెల్లడించేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వ కీలక నేతతో డీల్ కుదరడంతో సంక్రాంతి స్పెషల్ బస్సులపై కేవలం చిన్న నోట్ విడుదల చేసి ఆర్టీసీ చేతులు దులిపేసుకుంది. అందులో హైదరాబాద్ నుంచి కేవలం 240 సర్వీసులే నిర్వహిస్తామని వెల్లడించడం గమనార్హం. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్టీసీ కనికట్టు చేసేందుకు యత్నించింది. హైదరాబాద్‌నుంచి ఏటా మాదిరిగానే సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుపుతామని మరో చిన్న ప్రకటన మొక్కుబడిగా ఇచ్చింది. కానీ మొదటి ప్రకటనలో పేర్కొన్నట్టుగా వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి స్పెషల్ బస్ సర్వీసుల పట్టిక ఇవ్వక పోవడం గమనార్హం. అంటే టీడీపీ ట్రావెల్స్ సిండికేట్ దోపిడీకి వత్తాసు పలుకుతున్నట్టేనని ఆర్టీసీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.గతంలో హైదరాబాద్ నుంచి 2,500 సర్వీసులుకొన్నేళ్లుగా ఏటా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి ఆర్టీసీ 2,500 బస్ సర్వీసులు నడిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి ముందు ఐదు రోజులపాటు రోజుకు 2,500 బస్ సర్వీసులు.. సంక్రాంతి తర్వాత తిరుగు ప్రయాణాల కోసం మూడు రోజులపాటు రోజుకు 2 వేల బస్ సర్వీసులు నిర్వహిస్తూ వచ్చింది. గత ఏడాది కూడా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌కు 2,100 బస్ సర్వీసులు నడిపారు. అయితే ఈసారి టీడీపీ సిండికేట్ అక్కడే దెబ్బ కొట్టింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ 240 బస్ సర్వీసులను మాత్రమే నడుపుతామని తొలుత ప్రకటించింది. ఇక హైదరాబాద్ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బెంగళూరు నుంచి కూడా కేవలం 102 బస్ సర్వీసులు, చెన్నై నుంచి కేవలం 15 బస్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలోని 28 జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల మధ్య కేవలం 3,500 బస్ సర్వీసులనే నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించడం మాఫియాతో ప్రభుత్వం డీల్ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. మూడు నాలుగు రెట్ల చార్జీల బాదుడుప్రభుత్వంతో డీల్ కుదరడంతో టీడీపీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా భారీ దోపిడీకి తెగబడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్ చేసేసింది. తద్వారా కృత్రిమ కొరత సృష్టించి ప్రయాణికులను హడలెత్తించింది. ఆ వెంటనే టికెట్ల రేట్లను ఐదు రెట్లు పెంచేసింది. ఆర్టీసీ బస్సుల కోతతో హీనపక్షంగా 50 లక్షల మంది ప్రైవేటు బస్సులపై ఆధార పడతారని అనుకున్నా.. రానుపోను అంటే కోటి మంది దోపిడీకి ప్రైవేటు మాఫియా పథక రచన చేసింది. ఇందుకోసం ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్‌కు దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వంలో కీలక నేతకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. గతేడాది సంక్రాంతి సీజన్లోనే ఆయనకు రూ.50 కోట్ల వరకు ముట్టజెప్పినట్టు ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ప్రయాణికులు రెట్టింపు కావడంతో ముడుపుల మూట కూడా రెట్టింపు చేసినట్టు సమాచారం. -
సీఐకి 10 లక్షల రూపాయలు లంచం ఇచ్చిన టీడీపీ నాయకులు
-
సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్స్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగకు ముందు, తర్వాత రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది.ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రైళ్లలో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేశారు.In order to clear the extra rush of passengers, it is decided to arrange to run #SpecialTrains during #Sankranti festival between Hyderabad andSirpur Kaghaznagar & Hyderabad and Vijayawada with the dates as under: pic.twitter.com/JzzDcDAbZ5— South Central Railway (@SCRailwayIndia) January 10, 2026కాగా, తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ మీదుగా ఇప్పటికే 150 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. -
Sankranti Celebrations: పల్లె బాట పట్టిన హైదరాబాద్ వాసులు
-
ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)
-
ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
-
సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
-
ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!
సంక్రాంతి పండుగ వచ్చేసింది. నగరాల్లో ఉండేవారంతా దాదాపు ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలుపై 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ..రైల్‌వన్ యాప్ (RailOne) ద్వారా బుక్ చేసుకున్న అన్రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ మీద 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపు మోడ్‌లను ఉపయోగించి RailOne యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్రిజర్వ్డ్ టిక్కెట్లపై మాత్రమే తగ్గింపు పొందవచ్చు.రైల్‌వన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా➤గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఈ సూపర్ యాప్ ‘Railone’ను డౌన్లోడ్ చేయాలి.➤యాప్ వినియోగదారుల లొకేషన్‌ను డిఫాల్డ్‌గా రీడ్ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి.➤యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత లాగిన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, గెస్ట్ అనే ఆప్షన్లు వస్తాయి.➤కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేస్తే.. రైల్ కనెక్ట్, యూటీఎస్ అని రెండు ఆప్షన్లు డిస్ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్ కనెక్ట్ యాప్‌లో లాగిన్ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్ కావొచ్చు. లేదంటే ➤కొత్తంగా వివరాలు ఎంటర్ చేసి సైనప్ చేయాల్సి ఉంటుంది.➤సైనప్ కోసం మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయాల్సి.➤మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్, యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.➤ఓటీపీ, ఎంపిన్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్ వెరిఫికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ లేదా డివైజ్ లాగిన్ వివరాలు ఇవ్వాలి.మూడు శాతం డిస్కౌంట్ కోసం..👉🏻ఇప్పటికే మీరు ఇన్స్టాల్ చేసుకున్న RailOne యాప్.. లాగిన్ అవ్వాలి. 👉🏻ప్రాథమిక వివరాలు (పేరు, ఇతర వివరాలు) నమోదు చేసుకోవాలి.👉🏻అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కోసం ఎంపికను సెలక్ట్ చేసుకుని.. ప్రయాణ తేదీని, మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారా ఆ స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 👉🏻డిజిటల్ మోడ్ (యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్) ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీకు డిస్కౌంట్ లభిస్తుంది.👉🏻చెల్లింపు పూర్తయిన తరువాత.. టికెట్ యాప్‌లోనే జనరేట్ అవుతుంది. ప్రయాణ సమయంలో టికెట్ తనిఖీల కోసం దాన్ని మీ ఫోన్లో చూపించవచ్చు.రైల్‌వన్ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. -
అడ్డగోలు దోపిడీ.. సంక్రాంతికి ట్రావెల్స్ టికెట్ బాంబు
-
TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ ఏడాది సంక్రాంతికి పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది.హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది.2003లో జీవో ప్రకారం ఛార్జీల పెంపు.. ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 రేట్ల వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 రేట్ల వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్‌గా ఉన్నప్పటి నుండి అమలు చేస్తుంది. టీజిఎస్ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి ప్రతి ప్రధాన పండుగకు దీన్ని అమలు చేస్తుంది.ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం..ఈ సంక్రాంతి పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 రేట్లు వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది. -
సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్ అంటే టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకం అని చెప్పాచ్చు. అందుకే పెద్దా... చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలు సంక్రాంతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ కారణంగానే స్టార్ హీరోలు, యువ కథానాయకులు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా మంచి పోటీ నెలకొంటుంది.పైగా సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంటిల్లిపాదీ సరదాగా సినిమాలకు వెళుతుంటారు. అందుకే ఈ సమయంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు మంచి కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటూ ఉంటాయి. ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్‌గా మారింది. ఈ సంక్రాంతి రేసులో నిలిచిన కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.భార్యా భర్తల నేపథ్యంలో... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకుడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, హీరో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా కేథరిన్ కీలక పాత్ర చేశారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతికి విడుదల లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతుందట. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి కలిశారా? లేదా అనే నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూ పోందినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ తో ఈ చిత్రాన్ని రూ పోందించారట అనిల్ రావిపూడి. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ట్రేడ్ వర్గాల్లో మంచి జోష్ నెలకొంది. అదే విధంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకు సరైన వినోదాలను అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ‘‘శశీ.. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావ్? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా అందరూ చూస్తున్నారు ప్లీజ్’, ‘నా వాట్సప్ నంబరు కొంచెం అన్‌బ్లాక్ చేయవా ప్లీజ్’, ‘మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని... మరీ ముఖ్యంగా అత్తగార్ని, మావగార్ని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై వస్తుంది’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే విధంగా ‘చూడ్డానికి మాంచి ఫ్యామిలీ మేన్‌లా ఉన్నావ్... ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?’ అని చిరంజీవి అంటే... ‘మాస్కే బాస్‌లా ఉన్నావ్... నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి’ అంటూ వెంకటేశ్ చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది. భార్య... భర్త... ఓ ప్రేయసి రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాలు అందించేందుకు సిద్ధమమ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.డింపుల్ హయతితో ఏడడుగులు వేసిన రవితేజ (రామసత్యనారాయణ) స్పెయిన్ వెళతాడు. అక్కడ ఆషికా రంగనాథ్‌తో ప్రేమలో పడతాడు. ఈ విషయం రామసత్యనారాయణ భార్యకి తెలిసిందా? రామసత్యనారాయణకి అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆషికా రంగనాథ్ ఏం చేశారు? ఈ ముక్కోణపు కుటుంబ ప్రేమకథా చిత్రం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నది ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుందట. సున్నితమైన అంశాలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించి, తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్త, ఓ ప్రేయసి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను... బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో.అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌లో ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్‌ని నేడు గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్‌తో ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని మేకర్స్ తెలిపారు. నానమ్మమనవడి కథ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది.‘ది రాజాసాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో తాతయ్య పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నానమ్మ క్యారెక్టర్‌ను జరీనా వాహబ్ చేశారు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కినప్పటికీ కథ మొత్తం ప్రధానంగా నానమ్మమనవడిపైనే సాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.‘‘ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అందరితోనవ్వులు పూయిస్తుంది. మా సినిమా ఏ ఒక్కర్ని కూడా నిరాశపరచదు’’ అంటూ డైరెక్టర్ మారుతి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె అద్భుతమైన నటి. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్న్స్ మర్చిపోయి నానమ్మ సీన్న్స్ చూస్తుండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్ అయిపోయాను.‘ది రాజా సాబ్’లో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నానమ్మమనవడి కథ’’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడటాన్ని బట్టి చూస్తే... ఇది తప్పకుండా నానమ్మమనవడి కథ అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు. ‘‘మా సంస్థ (పీపుల్స్ మీడియా) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని టీజీ విశ్వప్రసాద్ ఇటీవల తెలిపారు. నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ హీరో శర్వానంద్ ఎలాంటి తిప్పలు పడ్డారు? అన్నది తెలియాలంటే ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల వరకూ ఆగాల్సిందే. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజ వరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016), ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి, విజయాలు అందుకున్న శర్వానంద్ మరోసారి ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త ప్రేమించుకుంటారు. అయితే మనస్పర్థల వల్ల ఆ ప్రేమకు ఫుల్స్టాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో సాక్షీ వైద్యతో ప్రేమలో పడతారు శర్వానంద్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. అదే ఆఫీసులో టీమ్ లీడర్‌గా తన మాజీ ప్రేయసి సంయుక్త జాయిన్ అవుతారు.ఓ వైపు మాజీ ప్రేయసి... మరోవైపు ప్రజెంట్ గర్ల్‌ఫ్రెండ్. వీరిద్దరి మధ్య శర్వానంద్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు రామ్ అబ్బరాజు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘శర్వానంద్ నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెప్పాచ్చు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’తో మరో సంక్రాంతి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రాజుగారి పెళ్లి... ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (2023) సినిమా తర్వాత బైక్ యాక్సిడెంట్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు నవీన్.రెండేళ్లకు పైగా విరామం అనంతరం ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నవీన్ పోలిశెట్టి భార్యా భర్తలుగా నటించారు. ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూ పోందింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా పలు వేదికలపై ఈ పాటకు నవీన్, మీనాక్షి కలిసి వేసిన డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ పాటతో నవీన్ పోలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరో విశేషం. ‘‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈ 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అంటూ నవీన్ పోలిశెట్టి ఇటీవల ఓ వేడుకలో మాట్లాడారు.జన నాయగన్తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’. (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, మమితా బైజు కీలకపాత్రల్లో నటించారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయకుడు’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అంటే... ఇదే ఆయన ఆఖరి సినిమా అన్నమాట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. కుటుంబ కథా చిత్రాంగా రూపొందిన ఈ మూవీలో విజయ్ కుమార్తెగా మమితా బైజు నటించారు. ఈ సినిమా తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా రూపొందినట్లు తమిళ చిత్ర పరిశ్రమ టాక్. తెలుగులో శ్రీలీల చేసినపాత్రని తమిళంలో మమితా బైజు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనపాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. – డేరంగుల జగన్ మోహన్ -
సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ HD స్టిల్స్
-
విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
7 సినిమాలు.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. నిర్మాతల ధైర్యం ఏంటి?
టాలీవుడ్‌కి సంక్రాంతి అతి పెద్ద సీజన్. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్ సినిమాలతో కలిసి) రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఈ ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. ఓ సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. ఆ విషయం సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్ అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొత్తం ఏడు సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్‌కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగ ఓ రాజు’, శర్వానంద్ నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఇక డబ్బింగ్ సినిమాలు జననాయక్, పరాశక్తి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. మొత్తంగా ఈ చిత్రాల బడ్జెట్ మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్‌తో సంబంధం లేకుండా ప్రభాస్, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి. హిట్ టాక్ వస్తే.. ఆ రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్‌కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలివే‘ది రాజా సాబ్’ (జనవరి 9)జననాయకుడు(జనవరి 9)పరాశక్తి(జనవరి 10)మన శంకర్ వరప్రసాద్ గారు(జనవరి 12)భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)అనగనగ ఓరాజు(జనవరి 14)నారి నారి నడుమ మురారి(జనవరి 14) -
సంక్రాంతికి సినిమాల సందడి.. ప్రతి ఏటా అదే సమస్య..!
సంక్రాంతి సినిమాల సందడికి అంతా సిద్ధమైంది. పొంగల్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్. సంక్రాంతికి వచ్చే చిత్రాలు ఏడాది ముందే కర్ఛీఫ్ వేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ పండుగకు స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే పెద్ద హీరోల మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ పోటీని తట్టుకోవడం కష్టం. టాలీవుడ్లో మన సినిమాల మధ్యే విపరీతమైన పోటీ ఉంటుంది. డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.సినిమా రిలీజ్ డేట్స్ కోసమే పోటీ ఉండే సంక్రాంతి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం విడుదల తేదీల కోసమే ఇంత పోటీ ఉంటే థియేటర్ల సంగతేంటి? అన్ని చిత్రాలకు సమానంగా స్క్రీన్స్ దొరుకుతాయా? ఈ విషయంలో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. మన టాలీవుడ్ సినిమాల డేట్స్, థియేటర్స్ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి ఈ సమయంలో డబ్బింగ్ చిత్రాలు సైతం క్యూలో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి పరశక్తి, జన నాయగణ్ లాంటి స్టార్స్ సైతం పొంగల్ బరిలో ఉన్నారు. ఇక్కడే మన తెలుగు ఆడియన్స్‌తో పాటు నెటిజన్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.సంక్రాంతికి థియేటర్ల కొరత..ఈ ఏడాది సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి. వాటిలో ప్రభాస్ ది రాజాసాబ్ జనవరి 9న రానుంది. ఆ తర్వాత జనవరి 10న డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా , మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇంత పోటీ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా రావడం థియేటర్ల సమస్యకు కారణమవుతోంది.డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు?సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడంపై టాలీవుడ్ సినీ ప్రియులు మండిపడుతున్నారు. పరాశక్తి, జననాయగణ్ చిత్రాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నస్తున్నారు. మన చిత్రాలకు కోలీవుడ్‌లో పెద్దగా ఆదరించరని అంటున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు ప్రేక్షకుల్లో అంతగా ఆదరణ ఉండదని అన్నారు. ఈ విషయంపై టాలీవుడ్ సినీ పెద్దలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బిగ్ కాంపీటీషన్ ఉండే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజ్‌పై మరోసారి ఆలోచిస్తే మంచిదని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. లేదంటే ఈ థియేటర్ల సమస్య ప్రతి ఏటా రిపీట్ అవుతూనే ఉంటుంది. సంక్రాంతికి కాకుండా ఓ వారం రోజుల తర్వాత డబ్బింగ్ చిత్రాలు వస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘సంక్రాంతికి ఊరెళ్తున్నారా’.. ఇలా చేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే!
సాక్షి,హైదరాబాద్: కొత్త ఏడాది రాకతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణ నెలకొంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. పండుగకు కావాల్సిన కొత్తబట్టలు, బంగారం, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా వేదికలపై తమ ఊరిలో సంక్రాంతి పండుగ సంబరాలపై షార్ట్స్,సెల్ఫీలతో పాటు ఇతర వివరాల్ని షేర్ చేస్తూ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. అయితే, అలా చేయొద్దని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండక్కి ఊరెళ్తె మూడో కంటికి కనపడకూడదని సూచిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఊర్లకు వెళ్లే అవకాశం ఉండటంతో దొంగలు ఈ సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాట్ల గురించి ఆయన మాట్లాడారు.సీసీ కెమెరాలుసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలను అమర్చారు. వీటి సహాయంతో అనేక నేరాలను ఛేదించాం. ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.ఇళ్ల భద్రతా చర్యలు ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో ఒక గదిలో లైటు వేసి ఉంచడం, తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, ఇంటి ముందు చెత్త, దినపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోవాలని, లేకపోతే దొంగలు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.వాహనాల భద్రత విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో లేదా కార్లలో ఉంచకూడదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలని, బయట రోడ్లపై పార్క్ చేయకూడదు. వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ కూడా వేయండి. ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు వాటిని వెంట తీసుకెళ్లాలి. ప్రయాణ సమయంలో బ్యాగుల్లో నగలు, డబ్బు పెట్టుకున్నప్పుడు వాటిని దగ్గరలో ఉంచుకోవాలి. బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరించే అవకాశం ఉంది.టెక్నాలజీ ఆధారిత భద్రత ఇళ్లలో టైమర్‌తో కూడిన లైట్లు, మోషన్ సెన్సర్ లైట్లు అమర్చుకోండి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉంది. డీవీఆర్‌లను ఇంటి లోపల రహస్య ప్రదేశంలో అమర్చుకోవాలి. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీస్ స్టేషన్ నంబర్లు, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాచ్మెన్లను నియమించుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలిసోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త ప్రజలు సోషల్ మీడియాలో తమ ప్రయాణ వివరాలను షేర్ చేయకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలి. దీంతో వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేయగలం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులతో సమన్వయం చేస్తే చోరీలను నియంత్రించడం సులభమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి వెంటనే 100 డయల్, సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
అద్భుతమైన కంటెంట్‌తో 'ఓ అందాల రాక్షసి' స్టోరీ
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాను. కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా వస్తుంది. ఈ మూవీలో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ ఇలా చాలా మంది అద్భుతమైన పాత్రల్ని పోషించారు. మంచి కంటెంట్‌తో రాబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్‌కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు కథను, మాటల్ని రాశాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా ఇందులో మ్యాజిక్ చేశారు. కృతి వర్మ హిందీలో చాలా ఫేమస్. విహాన్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు. -
సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ.. మరింత ముందుకొచ్చిన పరాశక్తి..!
సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందుగానే కర్చీఫ్ వేయాల్సిందే. పొంగల్ బాక్సాఫీస్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే స్టార్స్ అంతా సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల డేట్స్ ఖరారయ్యాయి. వీటిలో ది రాజాసాబ్ జనవరి 9న, మనశంకరవరప్రసాద్ గారు జనవరి 12న, భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నాయి.వీటికి తోడు కోలీవుడ్ సినిమాలు సైతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన పరాశక్తి కూడా పొంగల్‌కే రానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. జనవరి 14న విడుదల చేస్తామని ఫిక్సయ్యారు. అయితే తాజాగా రిలీజ్ తేదీ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 10న టాలీవుడ్ సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో ఆ రోజే పరాశక్తి విడుదల కానుందని ప్రకటించారు. దీంతో ది రాజాసాబ్ రిలీజైన మరుసటి రోజే పరాశక్తి థియేటర్లకు రానుంది. విపరీతమైన పోటీ ఉన్న పొంగల్ బాక్సాఫీస్ వద్ద పరాశక్తికి థియేటర్లు ఎంతవరకు దొరుకుతాయో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న దళపతి విజయ్ జన నాయగన్ జనవరి 9న విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.Coming to you, earlier than expected 🔥#Parasakthi - in theatres worldwide from January 10th, 2026 ✊Get ready for a ride through history🚂#ParasakthiFromPongal#ParasakthiFromJan10@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @DawnPicturesOff… pic.twitter.com/OAPRBFsluh— Red Giant Movies (@RedGiantMovies_) December 22, 2025 -
పల్లెంత తుళ్లింత కావాలిలె!
ఆలమూరు/బిక్కవోలు: తెలుగు సంస్కృతికి, సనాతన సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతి పండగకు పల్లె సీమలు ముస్తాబవుతున్నాయి. మార్గశిర కృష్ణ పక్ష ద్వాదశి, మూల కార్తీ రోజైన మంగళవారం మ«ధ్యాహ్నం 1.23 గంటలకు సూర్యుడు «ధనురాశిలో ప్రవేశించడంతో శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభమయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధనుర్మాసాన్ని నెల పట్టుట లేదా నెలగంట అంటారు. జనవరి 14న జరిగే భోగి పండగ వరకూ నెల రోజుల పాటు ఈ ధనుర్మాసం ఉంటుంది. విష్ణాలయాల్లో ధనుర్మాస పూజలు చేసేందుకు దేవదాయశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. కోనసీమ జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న విష్ణాలయాల్లోని దేవతామూర్తులు ప్రతి రోజూ పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనివ్వనున్నారు. సంప్రదాయ కళల కోలాహలం సంక్రాంతి ధనుర్మాసం ప్రారంభం కావడంతో సంప్రదాయ కళల కోలాహలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. తెల్లవారుజామున ఇంటి ముంగిట ఆడపడుచుల రంగు రంగుల హరివిల్లులు, హరిదాసు కీర్తనలతో మేలుకొలుపు, సంప్రదాయ పిండివంటలతో లోగిళ్లు కళకళలాడనున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు, కోడి, ఎడ్ల పందేలను నిర్వహించేందుకు పల్లెలు సమాయత్తం అవుతున్నాయి. భోగి పండగను పురస్కరించుకుని చిన్నారులు ఆవు పేడను సేకరించి భోగి పిడకలను తయారు చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఏడాదికోసారి వచ్చే కొమ్మదాసులు, గంగిరెద్దుల వారు, కోయదాసులు వంటి కళాకారులు గ్రామాల్లో సందడి చేయనున్నారు. సంప్రదాయ కళలుగా భావిస్తున్న కోడిపందేలను పోలీసుల కళ్లు గప్పి ఏవిధంగా నిర్వహించాలనే ఆలోచనలో పందెం రాయుళ్లు ఉన్నారు. ఇప్పటికే పందెం కోళ్లను జీడిపప్పు, బాదం పప్పు వంటి పౌష్టికాహారంతో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. పాకశాలలుగా పల్లె లోగిళ్లు సంక్రాంతి నెల ప్రారంభం కావడంతో గ్రామాల్లోని లోగిళ్లు పిండివంటల తయారు చేస్తూ పాకశాలలుగా మారనున్నాయి. ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లు, దేశ విదేశాల నుంచి వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులకు తెలుగు సంప్రదాయ వంటకాలైన సున్నుండలు, గజ్జికాయలు, జంతికలు, గవ్వలు, పోకుండలు తయారు చేసేందుకు మహిళలు సమాయత్తమవుతున్నారు. రైతులకు పంట చేతికందడంతో సంక్రాంతిని మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతికి నూతన వ్రస్తాలు కొనుగోలు చేయడంతో పాటు తమ లోగిళ్లను సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమవ్వనున్నారు. ఇతర దేశాల్లో కాని, రాష్ట్రాల్లో కాని నివసించే తెలుగు ప్రజలు స్వగ్రామానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే విమానం, రైలు, బస్ టికెట్లు బుక్ అయిపోయాయి. పోటాపోటీగా ప్రభల ఉత్సవాలు సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కోనసీమలోని సుమారు 15 మండలాల్లో ప్రభల తీర్థ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏకాదశ రుద్రులుగా భావించే ప్రభల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రభల ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రభలను పండగ మూడురోజుల పాటు ఊరేగించి పొలిమేరలు దాటిస్తే ఆ గ్రామానికి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే గ్రామాలు, పట్టణాల్లో పోటీ పడి ప్రభల ఉత్సవాలను జరుపుతున్నారు. బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, బ్యాండుమేళాలు వంటివి ఏర్పాటు చేసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గొబ్బెమ్మకు పూజలు పండగ నెల ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఇంటి ముందు ఉదయాన్నే కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి వాటి మధ్యన గొబ్బెమ్మను పెట్టి పూజిస్తారు. తెలుగు సంప్రదాయం ప్రకారం గొబ్బెమ్మలను గోదాదేవి, లక్ష్మీ దేవి, గౌరీ మాతగా భావిస్తారు. గోవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచి గుమ్మడి, తంగేడు, గురుగు పూలు, పసుపు కుంకుమ సమర్పించి పూజిస్తారు. ధనుర్మాసం పొడవునా గొబ్బెమ్మను పూజించడం ఆనవాయితీ. -
సంక్రాంతి కోట్లాటకు 'పుంజు'కుంటున్నాయ్
ద్వారకాతిరుమల/బుట్టాయగూడెం: సంక్రాంతి పందేలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఈత, బలవర్ధక ఆహారం, ప్రత్యేక శిక్షణతో శిబిరాల్లో నువ్వా నేనా.. అన్నట్టు తలపడుతున్నాయి. పెద్ద పండగకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి.. ఇలా పలు జాతుల పుంజులు ‘కోట్లా’టకు రెడీ అవుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట, కొమ్మర, మలసాని కుంట, ద్వారకాతిరుమల, దొరసానిపాడు, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెం ప్రాంతాల్లో పుంజుల శిబిరాలు ఉన్నాయి. మెలకువలతో శిక్షణ: పందెం పుంజుల్లో పలు రకాల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా డేగ, కాకి, పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ, రసంగి, నెమలి బరుల్లో తలపడుతుంటాయి. లక్షలాది రూ పాయలు చేతులు మారే పందేల్లో ఆషామాషీ కోళ్లు తలపడవు. వాటికి శక్తి, సామర్థ్యం ఎంతో అవసరం. అందుకే పందెం పుంజుకు బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక తరీ్ఫదు ఇవ్వడంలో భాగంగా మెలకువలు నేరి్పస్తున్నారు. పోరాడే సత్తా ఉన్న పుంజులను ఎంపిక చేసి మరీ వాటికి శిక్షణ ఇస్తున్నారు. ఆహా ఏమి భోగం: బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా, తాటి బెల్లం నువ్వుల నూనె ఉండలు వంటి బలవర్ధక ఆహారాన్ని వుంజులకు అందిస్తున్నారు. వీటి పెంపకం రాజభోగాన్ని తలపిస్తుంది. ఉదయం 6 గంటలకు పందెం రాయుళ్లు వాటిని చెరువుల్లోను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో ఈదిస్తున్నారు. అలాగే మూలికలు, ఆకులతో మరిగించిన నీటిని వాటికి పోతపోస్తున్నారు. ఆ తర్వాత వాకింగ్ చేయించి కొద్దిసేపు ఎండలో కడుతున్నారు. 9 గంటలకు అల్పాహారంగా బాదంపప్పు, జీడిపప్పు, మటన్ కైమా పెడుతున్నారు. తాటి బెల్లాన్ని నువ్వుల నూనెతో కలిపి ఉండలుగా చేసి వాటికి తినిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చోళ్లు, గంట్లు, వడ్లుతో కూడిన మేతను పెడుతున్నారు. వాటికి ఎండ తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో, చెట్ల కింద ఏర్పాటు చేసిన గాబుల్లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటలకు పొయ్యిపై అట్లపెనం ఉంచి, దా నిపై జల్లిన వేడి నీటిని పుంజుల దేహంపై పూస్తున్నారు. ఆ తర్వాత రెవిటాల్ పంటి బలవర్దక మందులు వేస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో పుంజుకు రూ.100 వరకు ఖర్చు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఒక్కో పుంజును రూ.10 వేల నుంచి రూ.లక్షకు పైగా విక్రయిస్తున్నారు. శిక్షకులకు డిమాండ్ కోడి పుంజులకు శిక్షణ ఇచ్చే వారికి డిమాండ్ ఏర్పడింది. పుంజులకు శిక్షణ ఇచ్చే వారి ఎంపిక లోనూ పందెంరాయుళ్లు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శిక్షకులను తీసుకొచ్చి, పుంజులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. కత్తులు నూరుతూ.. పందేల్లో పుంజులకు కత్తులు కట్టే వారి హవా మామూలుగా ఉండదు. బరిని బట్టి వారు ధరను నిర్ణయిస్తారు. అస్లీ పందేలు మి నహా మిగిలిన అన్ని పందేలు కత్తిలేనిదే జరగవు. అందుకే కత్తులు కట్టేవారు ఇప్పటినుంచే కత్తులను నూరేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపు మాదే.. ఏటా పందేలు జరగనివ్వమని బీరాలు పలికే పోలీసులు చివరకు రాజకీయ నా యకుల సిఫార్సులతో పండుగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం పరిపాటిగా వస్తోంది. పందేల నిర్వహణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ బాసులు పండుగ ముందు నెల రోజుల నుంచి చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇదంతా ఏటా జరిగే తంతేనని, పండుగ రోజుల్లో పందేలు మామూలే అని పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తూ.. పుంజులను బలంగా తయారు చేస్తున్నారు. -
అటు ప్రభాస్..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!
టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్‌దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి.. ఇలా కూడా రిలీజ్ చేస్తారా?
సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందే కర్ఛీప్ వేసేయాల్సిందే. లేదంటే చివరికీ వచ్చేసరికి పోటీ మరింత పెరిగిపోతుంది. అలా ఇప్పటికే వచ్చే ఏడాది రిలీజయ్యే పొంగల్ సినిమాలు చాలా వరకు డేట్స్ ప్రకటించారు. వాటిలో మనశంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి అఫీషియల్ తేదీలు వెల్లడించారు.తాజాగా మరో టాలీవుడ్ హీరో సంక్రాంతి పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు, శర్వానంద్ హీరోగా వస్తోన్న నారీ నారీ నడుమ మురారి రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుందని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. అయితే ఈ సినిమా సాయంత్రం ఐదు గంటల 49 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇదే ఆడియన్స్‌కు కాస్తా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్ డే మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇలా సాయంత్రం వేళ మూవీని విడుదల చేసి కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన ఈవినింగ్ ఫస్ట్ షోతో నారీ నారీ నడుమ మురారి షురూ కానుంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 37వ చిత్రంగా నిలవనుంది. This Sankranthi is set to deliver a HATTRICK BLOCKBUSTER for our Charming Star @ImSharwanand! 🌟The celebration begins with #NariNariNadumaMurari, hitting theatres January 14th, 2026 from 5:49 PM onwards! 🤩🎋@AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju… pic.twitter.com/akIyawyACH— AK Entertainments (@AKentsOfficial) December 9, 2025 -
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా పాట రిలీజ్ (ఫొటోలు)
-
పొంగల్ పోరులో ఏడు చిత్రాలు .. లిస్ట్ పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే అతిపెద్ద సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉండే సీజన్ ఇది. అందుకే స్టార్ హీరోలలో చాలా మంది తమ సినిమా ఒకటి సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ పండక్కీ తెలుగులో మొత్తంగా ఆరేడు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వచ్చే సంక్రాంతి సీజన్‌పై కొన్ని సినిమాలు కర్చీఫులు వేశాయి. అయితే వాటిల్లో ఏది రిలీజ్ కానుంది? ఏ సినిమా వెనక్కి తగ్గనుంది అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..మన శంకర వర ప్రసాద్ గారురాజాసాబ్భర్త మహాశయులకు విజ్ఞప్తిఅనగనగా ఒక రాజునారీ నారీ నడుమ మురారీజననాయగన్పరాశక్తి‘రాజాసాబ్’పై క్లారిటీ వచ్చేదిఈ సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో ఉన్న సినిమాలో తొలుత రిలీజ్ డేట్ ప్రకటించిన పెద్ద సినిమా ది రాజాసాబ్(The Raja Saab). మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి..వాయిదా వేయడంతో మరోసారి కూడా ఈ సినిమా వెనక్కి తగ్గిందనే రూమర్స్ వచ్చాయి. దీంతో పలు చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే తాము తప్పుకోవడం లేదని ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా స్టార్ చేయడంతో కొన్ని సినిమాలు బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయి.రాజుగారు రావడం లేదా?సంక్రాంతి పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతూ వచ్చిన నవీన్ పొలిశెట్టి..అందరికంటే ముందుగానే తప్పుకునే అవకాశం ఉంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) వచ్చే ఏడాది జనవరి 14న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. బాక్సాఫీస్ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో నిర్మాత నాగవంశీ వెనక్కీ తగ్గాడట. అన్ని కుదిరితే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడట.ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) చిత్రం కూడా ఈ సంక్రాంతికి వచ్చేలా లేదు. డిసెంబర్లో ఆయన బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం కూడా వెనక్కి తగ్గేలా ఉంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కూడా కచ్చితంగా పొంగల్ పోరులోకి రాబోతుంది.చిరు క్లారిటీ ఇస్తే.. డేట్ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతి పండగకి పక్కా రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకొని మరి ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన అనిల్ రావిపూడి.. ఈసారి చిరంజీవి మూవీతో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తే కానీ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై క్లారిటీ రాలేదు. ఒక వేళ చిరు సినిమా వాయిదా పడితే..కచ్చితంగా చిన్న సినిమాలన్నీ బరిలోకి దిగుతాయి. అయితే ఆ అవకాశం అయితే దాదాపు లేనట్లే. వీటితో పాటు ఈ పొంగల్ పోరులో తమిళ్ నుంచి రెండు భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ఒకటి..విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్వకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు శివకార్తికేయన్-సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి పండక్కే రాబోతుంది. జవవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ పొంగల్ పోరులో ఎన్ని చిత్రాలు ఉంటాయనేది డిసెంబర్ మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
'ఇక్కడ నన్ను దొబ్బెస్తున్నారండి'.. చిరంజీవి సాంగ్‌పై బుల్లిరాజు అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్ మరో హిట్‌కు రెడీ అయిపోయారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. దసరా కానుకగా సందర్భంగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.అయితే ప్రోమో రిలీజ్ తర్వాత మీసాల పిల్ల ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అలరించిన బుల్లిరాజు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి అలరించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో అనిల్ రావిపూడితో బుల్లిరాజు చేసిన కామెడీ నవ్వులు తెప్పిస్తోంది. మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని అందరూ నన్ను దొబ్బేస్తున్నారండి అంటూ బుల్లి రాజు భీమ్స్ సిసిరోలియోను అడిగాడు. వెళ్లి డైరెక్ట్‌గా డైరెక్టర్‌ను అడుగు అంటూ బుల్లిరాజు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి- బుల్లిరాజు మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు తెప్పిస్తోంది.ఈ చిత్రంలోని మీసాల పిల్ల లిరికల్ వీడియో ఫుల్ సాంగ్ అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియే సంగీతమందించారు. కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు.From fans, audiences to Bulli Raju, everyone is all excited to the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 💥#MeesaalaPilla Lyrical Video on Monday, 13th October ❤️🔥— https://t.co/EHn4RGd1j5A #Bheemsceciroleo Musical 🎵#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE😎… pic.twitter.com/S2sY6uDEjy— Shine Screens (@Shine_Screens) October 10, 2025 -
సంక్రాంతి రేస్ లో ఇన్ని సినిమాలా..!
-
'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ (ఫొటోలు)
-
సంక్రాంతి బరిలో...
సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచారు రవితేజ. ఆయన హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనుంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు వేడుకతో గురువారం ప్రారంభమైంది.ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్‌ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని, రవితేజ కెరీర్‌లోని ఈ 76వ సినిమాను వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అలాగే ఫ్లయిట్లో రవితేజ స్టైలిష్‌గా కూర్చుని, ఒక చేతిలో ‘సీ ఇట్ సే ఇన్ స్పానిష్’ పుస్తకం పట్టుకున్నపోస్టర్ని విడుదల చేశారు. ‘‘రవితేజగారి సిగ్నేచర్ స్టైల్, ఎనర్జీ ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
సంక్రాంతికి కర్చీఫ్ వేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన!
టాలీవుడ్లో సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆ పండుగ వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఉంటుంది. ఏడాది ముందు నుంచే పొంగల్‌కు చిత్రాలు రిలీజ్ చేయాలని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ప్రధాన ఈ పండగకు స్టార్ హీరోల మధ్యే పోటీ ఉంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఊహించని విధంగా నవీన్ పోలిశెట్టి బరిలో నిలిచాడు.వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే చిరంజీవి విశ్వంభర బెర్త్ ఖాయం చేసుకోగా.. అనగనగా ఒక రాజు మూవీతో నవీన్ సైతం పోటీలోకి వచ్చేశాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారి తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని టీమ్ ఇటీవల ప్రకటించింది.తాజాగా మరో స్టార్ హీరో సంక్రాంతికి సై అంటున్నారు. మాస్ మహారాజా రవితేజ పొంగల్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయన కెరీర్లో నటిస్తోన్న 76వ చిత్రాన్ని ఇవాళ ప్రకటించారు. ఈ సినిమాకు తిరుమల కిశోర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని ఎస్ఎల్వీ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. దీంతో పొంగల్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. Be seated and fasten your seat belts for MASS MAHARAAJ @RaviTeja_offl's Entertaining Ride with #RT76 🔥 🛫A @DirKishoreOffl's bonafide entertainer 💥Produced by @sudhakarcheruk5 under @SLVCinemasOffl ❤️🔥In Cinemas Sankranthi 2026 ✈️Begins with Pooja Ceremony & Muhurtam… pic.twitter.com/I75xIVip4A— SLV Cinemas (@SLVCinemasOffl) June 5, 2025 -
సంక్రాంతి బరిలో టాలీవుడ్ యంగ్ హీరో చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రోజు. ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తర్వాత నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రీ వెడ్డింగ్ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. The Star Entertainer @NaveenPolishety is back with a hilarious family entertainer this Sankranthi 😎#AnaganagaOkaRaju is blasting into theatres - January 14th, 2026 ❤️🔥ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నాము….#AOROnJan14th 💫 #NaveenPolishetty4… pic.twitter.com/bsi37OZK77— Sithara Entertainments (@SitharaEnts) May 26, 2025 -
నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు
అమెరికా(USA)లో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నార్త్ కరోలినా రాష్ట్రం(North Carolina ) లోని కారీలో సాయి మందిరంతో పాటు షార్లెట్లోని శ్రీ సాయి గురుదేవ్ దత్త మందిరంలో రంగోలీ పోటీలు జనవరి 19 ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నాట్స్ కాన్సస్ విభాగం ఈ రంగోలి పోటీలను నిర్వహించింది. నార్త్ కరోలినా లోని తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. తమ సృజనాత్మకతను ప్రదర్శించి.. తెలుగు సంప్రదాయలను ప్రతిబింబించే ఎన్నో ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో అత్యుత్తమంగా ఉన్న నాలుగింటిని ఎంపిక చేసి.. వాటిని వేసిన మహిళలకు నాట్స్ బహుమతులు పంపిణి చేసింది. నాట్స్ కాన్సస్ మహిళా నాయకత్వం ఈ రంగోలి పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాట్స్ అభినందించింది. రంగోలి పోటీలను చక్కగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: డల్లాస్‌లో "శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్" తరుపున రక్తదానం విజయవంతం) -
ఫ్లాప్స్, ట్రోలింగ్‌తో డిప్రెషన్లో.. ఇప్పుడు వరుస హిట్స్‌తో దూకుడు (ఫోటోలు)
-
ఏపీకి గోవా కల్చర్..
-
టాక్సీవాలా బ్యూటీ 'ప్రియాంక జవాల్కర్' సంక్రాంతి వైబ్ (ఫోటోలు)
-
అల్లుడికి 250 రకాల వంటకాలతో విందు
-
మద్యం, జూదం, కాసుల వేట
సాక్షి, అమరావతి: ఇసుక నుంచి మద్యం దాకా కాసుల వేటకు అలవాటు పడిన టీడీపీ కూటమి నేతలు కోడి పందేలను వదల్లేదు. సంప్రదాయం ముసుగులో మూడు రోజులపాటు సాగించిన జూదక్రీడలో సంపాదనే లక్ష్యంగా బరి తెగించారు. మునుపెన్నడూ లేని విధంగా ఊరూవాడా కోడి పందాలు, పేకాట, గుండాటలను యథేచ్ఛగా నిర్వహించారు.వైఎస్సార్సీపీ హయాంలో సంప్రదాయాన్ని గౌరవిస్తూ మూడు రోజులపాటు షరతులతో కోడి పందేల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పచ్చ ముఠాలు ఎల్లో మీడియాలో నానా రభస సృష్టించాయి. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ.. అమ్మ ఒడి సొమ్ము ఆవిరైపోయిందని.. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కున్నారంటూ దుష్ప్రచారాలకు తెగబడ్డ కూటమి నేతలు ఈ ఏడాది కోడి పందేలకు రాజకీయ రంగు పులిమి ఆదాయ మార్గంగా మార్చేశారు. రాష్ట్రాన్ని క్యాసినో అడ్డాగా మార్చేశారు. పలుచోట్ల కోడి పందేలను కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రులు స్వయంగా ప్రారంభించడంతోపాటు వారి ఫొటోలతో బరుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. చట్టాన్ని ఉల్లంఘించి.. జూదానికి జై కత్తులు కట్టి కోడి పందేలను నిర్వహించకూడదని చట్టాలు చెబుతుండగా కూటమి ప్రజా ప్రతినిధులు వాటిని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో రూ.కోటికిపైగా ఖర్చు చేసి మినీ స్టేడియంలా తీర్చిదిద్దిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మూడు రోజుల పాటు జూదాల జాతర నడిపించారు. ఏలూరు జిల్లాలో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్, కాకినాడలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం టీడీపీ ఇన్చార్జీ వర్మ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పులివెందులలో బీటెక్ రవి కోడి పందేలను ప్రారంభించడంతోపాటు దగ్గరుండి పర్యవేక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో యథేచ్ఛగా పందేలు వేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కూటమి నేతల కనుసన్నల్లోనే పందేలు జరిగాయి. తాడిగడపలోని వక్ఫ్ భూమిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో దేవాలయాలకు అతి సమీపంలో, రాయచోటిలో క్రషర్ స్థలాన్ని ఆక్రమించి మరీ కోడి పందేలు వేసినా పోలీసులు కన్నెత్తి చూడలేదు. సీజ్ ద గ్యాంబ్లింగ్.. అనలేరా? తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా జనసేన నేతలు కోడి పందేలకు ప్రత్యేక బరులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. భీమవరానికి సమీపంలోని తాడేరులో సంక్రాంతి సంబరాల పేరుతో ఏర్పాట్లు చేసుకున్న జనసేన స్థానిక నేతలు కోడి పందేలు, రాత్రి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. తాడిగడపలో బరికి ఆనుకుని ఉన్న జాతీయ రహదారిపై అనధికారింగా టోల్ వసూళ్లకు దిగారు. కాకినాడలో సీజ్ ద షిప్ అని వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ జూద క్రీడలపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వసూళ్ల దందా.. మూడు రోజుల్లో ఏకంగా రూ.5 వేల కోట్లు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారినట్టు అంచనా. ప్రతి పందేనికి ఒడ్డిన మొత్తంలో 10 శాతం కేవుల్ (కమిషన్) వసూలు చేశారు. అంటే పది నిమిషాల్లో తేలిపోయే కోడి పందెంలో బెట్టింగ్ రూ.కోటి గెలిస్తే అందులో రూ.10 లక్షలు నిర్వాహకులకు చెల్లించాలి. అనధికారికంగా మద్యం బెల్ట్‌షాపు మూడు రోజులు ఏర్పాటు చేసుకోవాలంటే బరి స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు నిర్వాహకులకు కప్పం కట్టారు. ఫలితంగా బెల్ట్‌షాపుల విక్రయాలతో మద్యం ఏరులై పారింది. గుండాట, పేకాట, కోతాట పెట్టాలంటే రోజుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.లక్షకుపైగా రుసుం వసూలు చేశారు. కోడి పకోడి, బిర్యానీ, సిగరెట్, వాటర్, కూల్‌డ్రింక్స్ స్టాల్స్ పెట్టుకోవాలంటే రోజుకు రూ.5 వేల నుంచి రూ.25 వేలు చెల్లించాల్సి వచ్చింది. మోటార్ సైకిల్‌కు రూ.50, కార్కు రూ.200 వసూలు చేశారు. విజయవాడ రూరల్ మండలం పాములకాల్వ సమీపంలో బుధవారం రాత్రి పొద్దుపోయాక కోడిపందాలు నిర్వహించడంతో అక్కడకు వెళ్లిన వన్‌టౌన్ ఎస్సై హరిప్రసాద్‌పై నిర్వాహకులు తిరగబడటం కూటమి నేతల అరాచకాలకు పరాకాష్ట. -
హీరోయిన్ మీనా పొంగల్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు.. ఫోటోలు
-
కోడి పందేల కంట్రోలింగ్‌కు లేడీ బౌన్సర్స్
-
Keerthy Suresh: భర్త ఆంటోనితో కీర్తి మొదటి సంక్రాంతి.. స్పెషల్ గెస్ట్‌గా విజయ్ (ఫోటోలు)
-
తుపాకి రాముడుతో.. సరదా సంక్రాంతి
-
గారెలు, పులిహోరతో కడుపు నిండిపోయిందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
-
క్లీంకారతో రామ్ చరణ్.. ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ సంక్రాంతి సెలబ్రేషన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగను సినీతారలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోలంతా తమ ఫ్యామిలీతో కలిసి పొంగల్ వేడుకలు చేసుకున్నారు. ఈ పండుగ వేళ రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లీంకారతో దిగిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. హ్యాపీ సంక్రాంతి అంటూ షేర్ చేసింది.మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సంక్రాతి సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బన్నీతో కలిసి పిల్లలు అయాన్, అర్హతో పండుగ రోజు దిగిన ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ సంక్రాంతి-2025 అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.సంక్రాంతి సినిమాల సందడి..గేమ్ ఛేంజర్‌కు మిక్స్డ్ టాక్..రామ్ చరణ్-శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు.డాకు మహారాజ్‌కు పాజిటివ్ రెస్పాన్స్..నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌కు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది డాకు మహారాజ్. ఈ మూవీ ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం..అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన మరో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దిల్ నిర్మించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
సంక్రాంతి స్పెషల్.. పండుగ రోజే ఓటీటీకి వచ్చేసిన కొత్త సినిమా!
సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలే కాదు.. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. కోడి పందేలతో పాటు సినిమాలు కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పటికే థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా ఇప్పటికే థియేటర్లకు క్యూ కడుతున్నారు.మరి ఫ్యామిలీతో ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు వీక్షించాలనుకునే వారికి ఓటీటీలు రెడీ బోలెడు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు మీకిష్టమైన చిత్రాలు చూసేయొచ్చు. అలాంటి వారికోసమే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీకి వచ్చేసింది తెలుగు సినిమా. అదేంటో మీరు ఓ లుక్కేయండి.సంక్రాంతి పండుగ రోజున ఓ తెలుగు చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టేస్తోంది. యంగ్ హీరో తిరువీర్ నటించిన చిత్రం మోక్ష పటం. ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టింది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రానికి రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, శాంతి రావ్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేశ్వర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ కథను అందించారు. నేస్తమా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు కమ్రాన్ సంగీతమందించారు. A mysterious bag changes Gayatri's life forever. Will it bring fortune or trouble? Watch #Mokshapatam now!▶️https://t.co/xnqpEPAm3H#MokshapatamOnAha #Trailer #Comedy #Crime @iamThiruveeR @ShantiRaoDqd @pooja_kiran @JeniferEmmanu11 @hithisistarun @ursguruofficial @syedkamran… pic.twitter.com/LBiE7fjgqx— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
-
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్.. ప్రధాని మోదీతో కలిసి జ్యోతి ప్రజ్వలన
సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ పండుగ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా పాల్గొన్నారు. విశ్వంభరలో చిరంజీవి..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించనున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్ కూడా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్ చూస్తే అర్థమవుతోంది. విశ్వంభర బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. #WATCH | Prime Minister Narendra Modi participates in #Pongal celebrations at the residence of Union Minister G Kishan Reddy, in Delhi. Ace badminton player PV Sindhu and actor Chiranjeevi also attend the celebrations here.(Video: DD News) pic.twitter.com/T7yj7LpeIG— ANI (@ANI) January 13, 2025 -
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్‌తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్‌ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్‌తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్‌కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్‌కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్‌గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్‌లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్‌గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్‌హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్‌తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్‌లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్‌కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్‌తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్‌లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్‌ఫుల్‌గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్‌తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్‌గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్‌లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్‌బాస్4’తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్‌స్టాప్‌గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి -
కిషన్‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు.. హాజరైన ప్రధాని
సాక్షి,న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం(జనవరి13) సాయంత్రం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని తొలుత తులసి చెట్టుకు పూజ చేశారు.అనంతరం గంగిరెద్దులకు అరటిపళ్ళు తినిపించి,నూతన వస్త్రాలు బహుకరించారు. భోగి రోజు కావడంతో భోగి మంట వేశారు. ఈ సంబరాలకు ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.అంతకుముందు సినీ నటుడు చిరంజీవి,ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు,బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి సంక్రాంతి వేడుకలకు ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ గాయని సునీత గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. -
విజయవాడలో సంక్రాంతి వేడుకలు
-
కోడిపందాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
-
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
-
రోజా ఇంట ఘనంగా భోగి పండుగ సంబరాలు
-
పల్లెల్లో భోగి పండగ సందడి
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
-
కోడి పందేల్లో కూటమి నేతల బరితెగింపు
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పందెంలను ప్రారంభిస్తున్నారు. ఇక, పందెం రాయుళ్లు.. కోడి పుంజులతో బరులకు చేరుకుంటున్నారు.తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పందెం బరుల దగ్గర ఎల్ఈడీ తెరలు సైతం దర్శనమిస్తున్నాయి. పెందెంలా నిర్వహణ కోసం భారీ ఏర్పాటు. మరోవైపు.. స్థానికంగా జరుగున్న కోడి పందెంలను చూసేందుకు ప్రజలు భారీగా బరుల వద్దకు చేరుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. కోడి పందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.నిషేధం బేఖాతరు.. కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9(1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు..
సాక్షి, హైదరాబాద్/తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండుగ వేడుక సంబరాల్లో ప్రజలు పాల్గొన్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సంబరాలు చేసుకున్నారు. ప్రజలు భోగి శుభాకాంక్షలు తెలిపారు.నగరిలో మాజీ మంత్రి రోజా ఇంటి వద్ద భోగి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ కుటుంబ సభ్యులతో సందడి చేశారు. అటు విశాఖ నగరంలో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకుంటున్నారు.విజయవాడలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. బీసెంట్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తెలుగు వారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు . వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకున్నారు. కానీ, ఈరోజు ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ప్రజలంతా ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతికి ప్రజలకు నిరాశ, నిస్పృహలను మిగిల్చింది. ఎన్నికల ముందు కూటమి అనేక హామీలిచ్చింది. ఇప్పుడు కరెంట్, నిత్యవసర ధరల పెంచేసి ప్రజలపై భారం మోపిందన్నారు. ఇటు తెలంగాణలో సహా భోగి పండుగ వేడుకల్లో ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామునే భోగీ మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు.. నగరవాసులంతా పల్లెలకు తరలి వెళ్లడంతో గ్రామాల్లో వేడుకలు మరింత ఘనంగా జరుగుతున్నాయి. -
పీక్స్‌కు చేరిన కోడి పందేల సందడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్రాంతి వేళ కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సర్వహంగులతో సిద్ధమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఏ రోజున ఎక్కడెక్కడ పందేలు జరుగుతాయనే షెడ్యూల్స్ ప్రకటిస్తున్నారు. పలానా చోట పలానా బరి సిద్ధమవుతోందని.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఎంత మొత్తంలో పందేలు వేయొచ్చనే వివరాలతో కూడిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కోడిపందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. బిగ్ డే మ్యాచ్‌లట.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.మరోవైపు బడా కోడి పందేంరాయుళ్లు నలుగురు పేర్లతో 13వ తేదీ గణపవరం, 14వ తేదీ శింగవరం, 15వ తేదీ సీసలిలో బిగ్డే మ్యాచ్‌లంటూ షెడ్యూల్ ప్రకటించడం వంటివి రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదే తరహాలో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని స్థానిక పందెంరాయుళ్లు బరులు, ఇతర వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున పందేలకు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నిషేధం బేఖాతరు.. కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9 (1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు. -
ఘుమఘుమల సంక్రాంతి
సత్తుపల్లిటౌన్: తెలుగురాష్ట్రాల ప్రజలకు ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. అయితే, సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు, గంగిరెద్దులతో పాటు పిండి వంటలూ గుర్తుకొస్తాయి. నోరూరించే పిండి వంటల కోసం చిన్నాపెద్ద ఎదురుచూస్తుంటారు. ఖరీఫ్ పంటల డబ్బు చేతికి వచ్చేవేళ పండుగ సందడి మొదలవుతుంది. వారం ముందు నుంచే ఇంటింటా పిండి వంటలు చేస్తూ మహిళలు, యువతులు బిజీబీజీ అయ్యారు. అరిసెలు, గారెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు, బూందీ లడ్డు, గవ్వలు, సున్నుండలు, చక్రాలు, కారపుపూస ఇలా రకరకాల పిండి వంటల తయారీతో వీధులు ఘుమఘుమలాడుతున్నాయి. ఆధునిక యువతకు వారి అమ్మలు దగ్గరుండి పిండి వంటలు తయారు చేయటం నేర్పిస్తున్నారు. ఇరుగుపొరుగు వారితో కలిసి.. సంక్రాంతి పండుగకు వారం, పదిరోజుల ముందు నుంచే పల్లె, పట్టణంలోని ఇళ్లల్లో పిండి వంటల తయారీ మొదలవుతుంది. వీటిని ఒక్కరే చేయటం సాధ్యం కాదు కాబట్టి ఆడపడుచులంతా ఇరుగుపొరుగు బంధువుల సాయంతో పిండి వంటలు చేస్తారు. ఒకరోజు పక్కింట్లో.. మరోరోజు ఎదురింట్లో కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు తయారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది సమష్టి జీవన విధానానికి తార్కాణంగా నిలుస్తోంది.సంబురంగా చేసుకుంటాం.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరం ఒకచోట కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు చేసుకుంటాం. వీధిలో ఒకరి తర్వాత ఒకరు ఇళ్లకు వెళ్లి పిండి వంటలు చేస్తాం. రకరకాల పిండి వంటలు చేసుకోవటం ఈ పండుగ ప్రత్యేకం. – తోట జానకి, సత్తుపల్లి ఇది అరిసెల పండుగ ఏటా సంక్రాంతి పండుగకి అరిసెలు ఎక్కువగా చేస్తుంటాం. పంటలు చేతికి వస్తాయి కాబట్టి అన్ని రకాల వంటలు చేసుకునే వీలు ఉంటుంది. ఈ పిండి వంటలలో పోషకాలు ఉంటాయి. లడ్డూలు, చక్రాలు వంటివి చేసుకుంటాం. – సుబ్బలక్ష్మా, సత్తుపల్లి -
కృష్ణుడి ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేషన్స్
-
పందెం కోళ్లకూ కోచింగ్ సెంటర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కోచింగ్ సెంటర్లున్నాయి. డీఎస్సీ, గ్రూప్స్ ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు చూశాం. మనుషులకే కాదు.. కోళ్లకు కూడా కోచింగ్ సెంటర్లున్నాయి. ఇదేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండీ.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలు లేకుండా సంక్రాంతి పండగే జరగదు కదా. పందెం గెలవాలంటే కోళ్లకూ శిక్షణ ఉండాలి. వాటికీ శరీర దారుఢ్యం, వేగంగా కదిలి శత్రువుపై దాడి చేసి మట్టుపెట్టే సామర్ధ్యం ఉండాలి కదా. అందుకే ఈ కోళ్ల కోచింగ్ సెంటర్లు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలకు మాత్రమే ఇవి ప్రత్యేకం. వీటికి మూడు నెలలు మంచి గిరాకీ ఉంటుంది. దసరాకు మొదలయ్యే శిక్షణ సంక్రాంతికి మూడు రోజుల ముందు ముగిస్తారు.శిక్షణ ఇలా..» రోజూ గాబు (చుట్టూ తెరకట్టి లోపలఉంచుతారు)లో ఉన్న కోళ్లను తెల్లవారుజామునే బయటకు తీసుకువస్తారు. ఉదయం ఆరు గంటల లోపు మౌత్ వాటర్ బ్రీతింగ్ (నోటిలో నీరు పోసి బయటకు వదలడం) చేస్తారు. ముందు రోజు రాత్రి మట్టిలో నోటితో పొడవడంతో మట్టి చేరి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ వాటర్ బ్రీతింగ్ చేస్తారు.» శీతాకాలం కావడంతో రోగాలు రాకుండా నిత్యం ఏలూరుకు చెందిన వెటర్నరీ వైద్యుడు ప్రహర్ష ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు.» మూడు నెలల శిక్షణలో ఆరేడుసార్లు ప్రతి పందెం కోడికి స్టీమ్‌బాత్ చేయిస్తారు. సంక్రాంతికి సున్నిపిండితో పిల్లలకు నలుగు పెట్టి స్నానంచేసే మాదిరిగా ఇది ఉంటుంది. వేప, జాజి, కుంకుడు తదితర ఆరు రకాల ఆకులతో నీళ్లను బాగా మరిగించి పందెం కోడి తట్టుకునే ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటితో స్నానం చేయిస్తారు. తరువాత ఎండ తగిలేలా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఆరుబయటే ఉంచుతారు.» కోడి కాళ్లు సాగడానికి పెద్ద డ్రమ్ముల్లో నీటిని పోసి కనీసం గంట పాటు ఈత కొట్టిస్తారు.» మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చోళ్లు, గంట్లు, ధాన్యం మిశ్రమాన్ని పెడతారు. దీనివల్ల పందెం కోడి రెండు, మూడు అడుగులు సునాయాసంగా పైకి ఎగురుతుంది. కోడి ఎగిరే ఎత్తునుబట్టి ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది.» పందెంకోడి బరిలోకి దిగినప్పుడు మూడున్నర కిలోకు మించి బరువు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతకు మించి బరువు ఉంటే పందెంలో పైకి ఎగరలేక దెబ్బ తగిలిన వెంటనే కిందకు పడిపోయి ఓడిపోతుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం బాదం, పిస్తా, ఎండు కర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేక ఆహారం పెడతారు.»పందేనికి మూడు వారాలు ముందు నుంచి రాత్రి ఆహారం మార్చేస్తారు. అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌తో పాటు మసాలా దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి) సమపాళ్లలో కలిపిన నాస్తా (లడ్డూలు) రోజుకు రెండు ఆహారంగా ఇస్తారు. డ్రైఫ్రూట్స్‌తో స్వీట్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యం దెబ్బతింటుందని వేడి చేసే మసాలాలను సమపాళ్లలో కలిపి పెడతారు.మాస్టర్ ట్రైనర్లతో శిక్షణఈ కోచింగ్ సెంటర్లు గోదావరి జిల్లాల్లో పదుల సంఖ్యలోనే ఉన్నాయి. పందెం కోళ్లు పెంచే వారు సొంతంగా నిర్వహించేవి కొన్ని, బయట పందేల రాయుళ్ల నుంచి వచ్చే కోళ్ల కోసం నిర్వహిస్తున్నవి మరి కొన్ని. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు అనే చిన్న పల్లెటూళ్లో ఇలాంటి పందెం కోళ్ల కోచింగ్ సెంటర్ పుష్కరకాలంగా నడుస్తోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న కోడి బరిలో దిగిందంటే సత్తా చాటాల్సిందే. అంతటి కఠోర శిక్షణ ఇస్తారు. ఇక్కడ దాదాపు 140 పందెం కోళ్లు శిక్షణలో ఉన్నాయి. సెంటర్ నిర్వాహకుడు కోటిపల్లి శ్రీను పర్యవేక్షణలో నలుగురు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి కోడికి మూడు నెలల శిక్షణ కోసం రూ.30 వేలు తక్కువ కాకుండా ఖర్చు చేస్తారు.పందెం కొట్టాలంటే శిక్షణ తప్పదుశిక్షణ లేకుండా ఏ పందెం కోడినీ బరిలోకి దింపరు. బరిలోకి దిగేందుకు మూడు నెలల ముందే శిక్షణ మొదలవుతుంది. తినే తిండి నుంచి వాతావరణంలో మార్పులు గమనిస్తుండాలి. కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటాం. ఇక్కడ శిక్షణకు అయ్యే డబ్బు కోసం చూడం. ఖర్చుకు వెనుకాడకుండా పందెం కొడిని అన్ని రకాల శిక్షణతో మెరికల్లా తయారు చేస్తాం. మా సెంటర్లో దాదాపు 140 కోళ్లకు శిక్షణ ఇస్తున్నాం. – కోటిపల్లి శ్రీను, మాస్టర్ ట్రైనర్, ఉండూరు, సామర్లకోట, కాకినాడ జిల్లా -
నేలకు చుక్కలు
ఒకప్పటి రోజుల్లో ఇంటి ఇల్లాలు ΄పొద్దున్నే లేవగానే చేసే పని,,, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడం. వెసులుబాటును బట్టి, సందర్భాన్ని బట్టీ చిన్న ముగ్గెయ్యాలో... పెద్ద ముగ్గెయ్యాలో... చుక్కల ముగ్గు పెట్టాలో, గీతల ముగ్గు వెయ్యాలో ముందే అనుకునేవారు. ఇక సంక్రాంతి నెల వచ్చిందంటే పోటా పోటీలుగా ముగ్గులు వేసేవారు. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా పెట్టేవాళ్లు. ముగ్గుల మీద కార్టూన్లు కూడా బాగానే పడేవి. ఇక ముగ్గులోకి దించటం, ముగ్గు΄పొయ్యటం లాంటి జాతీయాలు, ముత్యాల ముగ్గు లాంటి సినిమాల సంగతి సరేసరి. ముగ్గులు ఒకప్పుడు శుభాశుభ సంకేతాలుగా పనిచేసేవి. పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు రోజూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటిలోకి అడుగుపెట్టేవారు కాదు. వారే కాదు యాచకులు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్లేవారు కాదు! ఎందుకంటే, ఇంటి వాకిట్లో ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. ధనుర్మాసంలో ప్రతి ఇంటిముందు తెల్లవారుఝామున ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించడం ఆచారం. ఎందుకంటే గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం.గొబ్బియల్లో... గొబ్బియల్లోముగ్గులకు ఎంత ప్రాధాన్యముందో, ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లు లేదా గొబ్బెమ్మలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు తెలుగువాళ్లు. ఎందుకంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గుమధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని విశ్వాసం. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. శ్రీ కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో,, అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు.– డి.వి.ఆర్. భాస్కర్ -
సారి..నన్ను వదిలేయండి: Dil Raju
-
విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
-
సంబరాల సంక్రాంతి అంటూ అందంగా ముస్తాబైన అన్షు అమ్మడు
-
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ దిగిపోగా రేపు డాకు మహారాజ్ ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు గేమ్ ఛేంజర్, ఇటు సంక్రాంతికి వస్తున్నాం.. ఈ రెండు సినిమాలకు దిల్ రాజే నిర్మాత. అందుకే క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ల కోసం అటూ ఇటు పరుగులు తీస్తున్నారు.నిజమాబాద్‌లో ఈవెంట్ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తన సొంత జిల్లా నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈసారి స్పీచ్ మామూలుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలని యాంకర్ శ్రీముఖి కోరడం.. ఇప్పుడు చూడు, నా తడాఖా చూపిస్తా అన్న రేంజ్లో దిల్ రాజు రెచ్చిపోవడం జరిగాయి. ఈ క్రమంలోనే స్టేజీపై హుషారుగా మాట్లాడాడు.దిల్ రాజు హుషారైన స్పీచ్స్టేజీపై ఉన్న హీరో వెంకటేశ్‌ను చూస్తూ.. సర్, మా నిజామాబాద్‌ల తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవల్ ఉంటుంది. మా వోళ్లకు (తెలంగాణ ప్రజలకు) సినిమా అంటే అంత ఆసక్తి ఉండదు. అదే ఆంధ్రకు వెళ్తే సినిమాకు స్పెషల్ వైబ్ ఇస్తారు. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు అని స్పీచ్ దంచుకుపోయాడు. ఆయన స్పీచ్‌కు అక్కడున్నవారు చప్పట్లు కొట్టినా సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. తెలంగాణవాసి అయ్యుండి మన ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడతాడా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై దిల్ రాజు (Dil Raju) స్పందించాడు.(చదవండి: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట)దావత్ గురించి మాట్లాడా..మొన్నీ మధ్య నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. నిజామాబాద్ పట్టణంలో పెద్దగా సినిమా ఈవెంట్లు జరగవు. అప్పట్లో ఫిదా సక్సెస్ మీట్ చేశాం.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది చేశాం. నిజామాబాద్వాసిగా ఆ జిల్లాతో నాకున్న అనుబంధం అలాంటిది! అందుకే అక్కడ ఈ మూవీ ఈవెంట్ చేశాం. అప్పుడు నేను మన కల్చర్‌లో ఉండే దావత్ గురించి మాట్లాడాను. తెల్ల కల్లు, మటన్ గురించి మాట్లాడాను. నా మాటలతో తెలంగాణవాళ్లను అవమానించానని, తెలంగాణను హేళన చేశానని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.క్షమించండినా ఉద్దేశమేంటో అదే స్పీచ్‌లో చెప్పాను. మన కల్చర్, దావత్ నేను మిస్ అవుతున్నాను.. సంక్రాంతికి నా రెండు సినిమాలు రిలీజయ్యాక తెలంగాణ దావత్ చేసుకోవాలనుందని చెప్పాను. మన విధానాలను నేను అభిమానిస్తాను. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే క్షమించండి అని చెప్పుకొచ్చాడు.ఎలా అనుకున్నారు?నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో ఫిదా సినిమా షూటింగ్ చేశాం. మనం కుటుంబానికి ఎంత విలువిస్తాం, మన కల్చర్ ఏంటనేది ఆ మూవీలో చూపించాం. ఫిదా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయిందో తెలుసు. అలాగే బలగం చిత్రాన్ని కూడా అందరూ గుండెకు హత్తుకున్నారు. తెలంగాణవాసిగా మన రాష్ట్రాన్ని అభిమానించే నేను హేళన చేస్తానని ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. మీ మనో భావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. రాజకీయాల్లోకి లాగకండిఎఫ్డీసీ చైర్మన్‌గా సినిమాకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ హైదరాబాద్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఉంచుతాను. తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. నన్ను రాజకీయాల్లోకి లాగకండి. ఎఫ్డీసీ సినిమాకు సంబంధించిందే కానీ రాజకీయాలకు సంబంధించినది కాదు. ఎఫ్డీసీ, నేను సినిమాలకే ఉపయోగపడతాం. అవసరంలేని విషయాల్లో నన్ను లాగొద్దని కోరుతున్నాను అన్నాడు. #DilRaju garu has spoken out about the Nizamabad incident, offering his sincere apologies to anyone who may have been hurt. He has requested not to associate him with politics in any way. pic.twitter.com/X9W3grU8O0— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025 చదవండి: ప్రభాస్ పెళ్లి ఎవరితో.. రివీల్ చేసిన రామ్ చరణ్ -
పల్లెకు జనం.. భాగ్యనగరం ఖాళీ
-
పల్లెబాట పట్టిన నగర వాసులు
-
పండక్కి ఇంటికి పోవాలంటే బస్సు ఆడనే ఎక్కాలే
-
పిఠాపురం పవన్ కల్యాణ్ సభలో వీర మహిళ లక్ష్మీకి తీవ్ర అవమానం
-
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు
-
కోలీవుడ్‌లో గేమ్ చేంజ్
సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాలు కనీసం మూడు నాలుగైనా ఉండాలి. అప్పుడే సినీ లవర్స్‌కి అసలైన పండగ. కానీ ఈ పొంగల్‌కి తమిళ తెరపై ఒకే ఒక్క స్టార్ హీరో కనిపించనున్నారు. అది కూడా తెలుగు స్టార్ రామ్‌చరణ్. ‘గేమ్ చేంజర్’ తమిళంలో డబ్ అయి, విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో అజిత్ ‘విడాముయర్చి’ పొంగల్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తంగా తమిళంలో ఆరేడు స్ట్రయిట్ చిత్రాలు పొంగల్‌కి రానున్నాయి. అవి కూడా మీడియమ్ కంటే ఓ మెట్టు ఎక్కువ ఉన్న హీరోలు, ఓ మెట్టు తక్కువ ఉన్న హీరోలవే. హీరోల రేంజ్ పక్కన పెడితే... ఒకవేళ కథాబలం ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకుంటే మీడియమ్ రేంజ్ సినిమా పెద్ద రేంజ్ అయిపోతుంది. మరి... పొంగల్పోటీలో వసూళ్లు కొల్లగొట్టే సినిమా ఏది? అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఇక ఈ పొంగల్‌కి తెరపైకి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో తమిళ ఇండస్ట్రీకి పొంగల్ కూడా అంతే ముఖ్యం. వరుస సెలవులను క్యాష్ చేసుకునే వీలు ఉన్న సీజన్ కాబట్టి భారీ చిత్రాల విడుదలను ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటిలానే ఈసారి తెలుగులో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి సందడికి రెడీ అయ్యాయి. యంగ్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కూడా ఈ పండగకి రానుంది. అయితే అటు తమిళంలో మాత్రం మీడియమ్ రేంజ్ హీరోల చిత్రాలే విడుదల కానున్నాయి. ఆ మాట కొస్తే... గతేడాది కూడా కోలీవుడ్ పరిస్థితి ఇదే. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మినహా మిగతావన్నీ ఓ మోస్తరు చిత్రాలే.ఈసారి అజిత్ ‘విడాముయర్చి’ రావాల్సింది కానీ సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో ఇక పొంగల్‌కి పెరియ పడమ్ ఇల్లే (సంక్రాంతికి పెద్ద సినిమా లేదు) అన్నట్లు అయింది. సో... ఉన్నదంతా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. అనువాద రూపంలో తమిళ తెరపై ‘గేమ్ చేంజర్’ కనిపించనుంది. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడం, తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం కావడం, సక్సెస్ఫుల్ ప్రోడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’పై తమిళనాడులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సో... ఒక స్టార్ డైరెక్టర్–స్టార్ హీరో–స్టార్ ప్రోడ్యూసర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో కోలీవుడ్ పొంగల్ బాక్సాఫీస్ దగ్గర ఆట అంతా ‘గేమ్ చేంజర్’దే అని చె΄÷్పచ్చు. వేరే పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ చిత్రానికే ఎక్కువ థియేటర్లు లభించాయి. ‘గేమ్ చేంజర్’కి ఇదో మంచి అవకాశం.10న 3 సినిమాలు ఈ నెల 10న తెలుగులోనూ, అనువాద రూపంలో తమిళ్, హిందీ భాషల్లోనూ ‘గేమ్ చేంజర్’ విడుదల కానుంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ దాదాపు రూ.450 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. శంకర్ అంటే దాదాపు లార్జ్ స్కేల్ సినిమానే అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గేమ్ చేంజర్’తోపాటు 10న తమిళంలో విడుదల కానున్న వాటిలో విలక్షణ నటుడు బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన ‘వణంగాన్’, మలయాళ నటుడు షానే నిగమ్ తమిళ తెరకు హీరోగా పరిచయం అవుతున్న ‘మద్రాస్క్కారన్’ చిత్రాలు ఉన్నాయి. నిజానికి ‘వణంగాన్’ని సూర్య హీరోగా ప్లాన్ చేశారు బాల.అయితే కొన్ని కారణాల వల్ల అరుణ్ విజయ్‌తో ఈ చిత్రం చేశారు. ఒకవేళ సూర్యతో చేసి ఉంటే... పొంగల్ రేస్‌లో తమిళంలో ఓ స్టార్ ఉండి ఉండేవారు. ఇక ‘మద్రాస్ క్కారన్’ విషయానికొస్తే... గతేడాది ‘రంగోలి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాలీ మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ యంగ్ హీరో షానే నిగమ్ నటించారు. 11 ఏళ్ల తర్వాత 12న ఇక పొంగల్ రేస్‌లోని తమిళ చిత్రాల్లో చెప్పుకోదగ్గ మాస్ హీరో అంటే విశాల్. ‘మద గజ రాజా’ చిత్రంతో ఈ 12న రానున్నారు విశాల్. ఈ సినిమా 2013లో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరికి 11 ఏళ్ల తర్వాత ఈ 12న విడుదల కానుంది. సుందర్.సి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.పొంగల్ రోజున... పండగ రోజున ఆకాశ్ మురళి అనే నూతన హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ‘ఇదయం’ (హృదయం) ఫేమ్ మురళి రెండో కుమారుడే ఆకాశ్ మురళి. ఆల్రెడీ పెద్ద కుమారుడు అథర్వ హీరోగా (తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’లో నటించారు) సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ చిత్రాలతో మంచి మాస్ స్టయిలిష్ దర్శకుడు అనిపించుకున్న విష్ణువర్ధన్ నూతన హీరో ఆకాశ్ మురళితో తీసిన ‘నేసి΄్పాయా’ 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్గా నటించారు.ఇక పండగ రోజున సీనియర్ హీరో ‘జయం రవి’ ప్రేమించడానికి సమయం లేదంటూ ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు) చిత్రం ఈ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కృతికా ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించారు.ఇలా పొంగల్ రేసులో తమిళంలో ఐదు చిత్రాలు నిలవగా, వాటిలో విశాల్, ‘జయం’ రవి పేరున్న హీరోలు కాగా... వీరి తర్వాత అరుణ్ విజయ్ కొంచెం చెప్పుకోదగ్గ హీరో కాగా... మిగతా ఇద్దరిలో యువ హీరోలు ఆకాశ్ మురళి, షానే నిగమ్ ఉన్నారు. ఈ ఐదు చిత్రాలే కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సో... ఎలా చూసుకున్నా పొంగల్‌కి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మరి... వసూళ్ల పరంగా ఈ సినిమా ప్రభావం ఇతర చిత్రాలపై ఏ మేరకు ఉంటుంది? పొంగల్పోటీలో బాక్సాఫీస్ హిట్ ఏ సినిమాకి దక్కుతుంది? అనేది మరో వారంలో తెలిసిపోతుంది. గేమ్ చేంజర్‌తో రీ ఎంటర్ కావడం హ్యాపీ ‘సందడే సందడి’తో నిర్మాతగా తెలుగులో ఆదిత్యా రామ్ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ చిత్రాలు నిర్మించారాయన. ‘ఏక్ నిరంజన్’ (2009) తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించలేదు. చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కాగా ‘గేమ్ చేంజర్’ని తమిళంలో విడుదల చేస్తున్నారు ఆదిత్యా రామ్. ‘‘చాలా కాలం తర్వాత ఒక గ్రాండ్ స్కేల్ సినిమాతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళనాడులో దాదాపు నాలుగువందల స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ ఈ వీకెండ్‌కి పెద్ద సినిమా అవుతుంది. ‘దిల్’ రాజుగారి సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఆదిత్యా రామ్. – డి.జి.భవాని‘విడాముయర్చి’ రాకపోవడం నిరుత్సాహమే ‘‘పొంగల్ చాలా పెద్ద పండగ. పైగా ఇది పెద్ద వీకెండ్. పెద్ద హీరోల సినిమాలు రాకపోతే అస్సలు పండగలానే అనిపించదు. తమిళనాడులోని థియేటర్ ఓనర్స్ అందరూ అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’ కోసం ఎదురు చూశారు. హఠాత్తుగా ఈ సినిమా వాయిదా పడటంతో అందరూ నిరుత్సాహపడ్డారు’’ అంటూ తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. -
సంక్రాంతి సంబరాల్లో మోహన్ బాబు (ఫొటోలు)
-
ముగ్గుల పండుగ : ఏ ముగ్గు వేయాలా అని ఆలోచిస్తున్నారా? (ఫొటోలు)
-
పుష్ప ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించే న్యూస్.. సంక్రాంతికి రీ లోడ్..!
అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.పుష్ప రీ లోడెడ్..తాజాగా పుష్ప-2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతోన్న పుష్ప-2 మూవీకి అదనంగా మరో 20 నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేయనున్నారు. ఈ అప్డేట్ వర్షన్ సంక్రాంతి కానుకగా ఈనెల 11 నుంచి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 రీ లోడెడ్ పేరుతో మరిన్నీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫైరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పొంగల్‌కు మరోసారి పుష్ప-2 లేటేస్ట్ వర్షన్ చూసి ఎంజాయ్ చేయండి.పుష్ప టీమ్ తన ట్వీట్లో రాస్తూ..' "పుష్ప2: ది రూల్’ 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో రీలోడెడ్ వెర్షన్ సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి మూవీ ప్రదర్శితమయ్యే థియేటర్స్‌లో చూడవచ్చు. వైల్డ్ ఫైర్ ఇప్పుడు మరింత ఫైరీగా" అని పోస్ట్ చేశారు.ఆ రికార్డ్ కోసమేనా..అయితే ఇప్పటికే వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న పుష్ప-2 చిత్రానికి 20 నిమిషాల సీన్స్ అదనంగా జోడించడం చూస్తే ఆ క్రేజీ రికార్డ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ఈ ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధమైంది.ఇప్పటికే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన బాహుబలి, బాహుబలి-2, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల ఆల్ టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. కేవలం పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ నటించిన దంగల్ మాత్రమే ఉంది. దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో నిలిచింది.తాజాగా మరో 20 నిమిషాల నిడివి గల సీన్స్ యాడ్స్ చేయడం దంగల్ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకే మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ రావడం ఈ సినిమాకు మరో ప్లస్ కానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 వసూళ్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పుష్పరాజ్.. దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.పెరగనున్న రన్‌టైమ్..ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్స్గా పుష్ప-2 రన్ టైమ్ మరింత పెరగనుంది. ఈ నిడివికి అదనంగా మరో 20 నిమిషాలతో కలిపి 3 గంటల 40 నిమిషాలకు పైగా ఉండనుంది. #Pushpa2TheRule RELOADED VERSION with 20 minutes of added footage will play in cinemas from 11th January 💥💥The WILDFIRE gets extra FIERY 🔥#Pushpa2Reloaded ❤️🔥#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp… pic.twitter.com/ek3gRsOaVi— Pushpa (@PushpaMovie) January 7, 2025 -
Sankranti: ఆతిథ్యంలో గోదారోళ్లది అందెవేసిన చెయ్యి
సాక్షి, భీమవరం: సినిమా షూటింగ్ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) వచ్చిన ప్రముఖ సినీనటుడు వీరమాచనేని జగపతిబాబు ఇక్కడి ఆతిథ్యం గురించి పోస్టు చేసిన వీడియో చాలానే వైరల్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నన్నాళ్లూ ఓ అభిమాని ప్రతిరోజూ రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తనకు విందు భోజనం పంపారని చెప్పుకొచ్చారు. వాటిని చూపిస్తూ ‘బకాసురుడిలా తింటాను.. కుంభకర్ణుడిలా పడుకుంటా’నంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు గోదావరి జిల్లాల(Godavari Districts) ఆతిథ్యాన్ని ఎన్నో వేదికలపై గుర్తుచేసుకున్న సందర్భాలెన్నో.. ఆయ్.. అండి.. రండీభాషలో ‘ఆయ్..’ అనే యాస ఉన్నా.. మాటనిండా మమకారమే దాగి ఉంటుంది. దారి చెప్పమంటే నేరుగా ఇంటికే తీసుకెళ్లేంత మర్యాద ఉంటుంది. తిండి పెట్టి చంపేస్తారన్నది నానుడైతే.. పెట్టుపోతలతో మైమరచిపోయేలా చేయడం వీరి నైజం. అడుగడుగునా వెటకారమే అనిపించినా.. అణువణువునా ఆప్యాయతే కనిపిస్తుంది. అరమరికలు లేని వ్యక్తిత్వాలు.. అబ్బురపరిచే సంప్రదాయాలు.. గోదావరి వాసుల పడికట్లు. అందుకే.. గోదారోళ్ల పిల్లను చేసుకోవడానికి ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. గోదారోళ్ల ఆతిథ్యం చూడాలంటే వారి ఇంటి అమ్మాయిని వివాహమాడాల్సిందే. పెళ్లిచూపులు లగాయితు అప్పగింతల వరకు అడుగడుగునా వారి అతిథి మర్యాదలు, సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి.సంక్రాంతి వస్తోందంటేసంక్రాంతి(Sankranti Festival) వస్తోందంటే గోదావరి మర్యాదలే గుర్తొస్తాయి. ఎక్కడెక్కడో ఉన్న బంధువులను పండక్కి వారం ముందే రమ్మని పిలిచి.. ఉన్నన్ని రోజులూ వారికి ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు గుమ్మం వద్దే చెంబులతో చేతికి నీళ్లందించి కాళ్లు కడుక్కోమని మర్యాదలు చేస్తారు. చేతులు తుడుచుకోవడానికి భుజాలపై తుండు (టవల్) అందిస్తారు. ప్రయాణం బాగా సాగిందా అంటూ మనసు నిండా అభిమానంతో స్వాగతం పలుకుతారు. కోడి పందేలు, జాతరలు, సినిమాలు, పల్లె అందాలను తిప్పి చూపిస్తుంటారు. సరదా పడాలే గానీ తాటికల్లు రుచి చూపిస్తారు. ఉన్నన్ని రోజులూ నచ్చిన వంటకాలను వండి వారుస్తుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే అరిటాకులో విందు భోజనం చేస్తుంటారు.అత్తల హడావుడి అంతాఇంతా కాదుకొత్త అల్లుడు మొదటిసారిగా పండుగకు ఇంటికి వచ్చే అల్లుళ్ల కోసం పల్లెల్లో అత్తలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు, పోకుండలు, గోరుమిటీలు వంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. తలుపు చాటున నిల్చుని అల్లుడు గారికి అవి పెట్టు.. ఇవి పెట్టు అంటూ కూతురికి చెబుతూ అత్తలు సంబరపడిపోయే దృశ్యాలు అనేకం. తామేమీ తక్కువ కాదన్నట్టు కొంటె మరదళ్లు గాజులతో గారెలు.. గోళీలతో పొంగడాలు.. ఘాటైన మిరపకాయలతో బజ్జీలు చేసి బావలను ఆట పట్టించడం ఇక్కడ షరా మామూలే.వియ్యపురాలా.. నీవొచ్చెవేళకొందరు అల్లుడితో పాటు వియ్యపురాలిని సైతం ఇంటికి ఆహ్వానించి కానుకలు, కొత్త దుస్తులు అందిస్తారు. వియ్యపురాలు సైతం వస్తూవస్తూ ఇంటిల్లిపాదికీ కొత్త దుస్తులు తెచ్చి ఇవ్వడం ఇక్కడి ఆచారం. తద్వారా ఇరు కుటుంబాల మధ్య బంధాలు బలపడతాయని గోదారోళ్ల నమ్మకం. పండుగలు ముగిసి స్వస్థలాలకు తిరిగి వెళ్లే బంధువులకు ఇంటిలో చేసిన పిండివంటలను ప్యాక్ చేసి ఇస్తారు. బరువెక్కిన గుండెలతో వీధి చివరి దాకా వచ్చి వీడ్కోలు చెబుతూ వచ్చే ఏడాది ముందుగానే రావాలంటూ మాట తీసుకుని మరీ సాగనంపడం గోదారోళ్ల ప్రత్యేకత.కొత్త అల్లుడికి గుర్తుండిపోయేలా..సంక్రాంతి వస్తోందంటే కొత్తగా పెళ్లయిన ఇళ్లల్లో సందడికి అంతే ఉండదు. తమ స్తోమతకు తగ్గట్టుగా అల్లుడికి తొలి పండుగ కలకాలం గుర్తుండిపోయేలా అత్తింటి వారు మర్యాదలు చేస్తారు. వినూత్న రీతిలో అల్లుడికి స్వాగతం పలుకుతారు. విందులో ఎన్నెన్నో (కొందరైతే వందకు పైగా) వంటకాలను వడ్డించి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. గత ఏడాది భీమవరానికి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబం తమ అల్లుడికి ఏకంగా 173 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరో కుటుంబం వారు తమకు కాబోయే అల్లుడికి వంద రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. పండక్కి మొదటిసారి వస్తున్న అల్లుడిని భీమవరానికి చెందిన అత్తింటివారు డోలు, సన్నాయి మేళంతో ఎడ్ల బండిపై ఊరేగిస్తూ ఇంటికి ఆహ్వానించారు. భారతదేశం మ్యాప్‌పై దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన 29 వంటకాలతో అల్లుడికి విందు ఏర్పాటు చేసి అబ్బురపరిచారు. -
Sankranti 2025 : సులువుగా చేసుకునే పిండి వంటలు మీకోసమే!
భారతదేశం అంతటా మకర సంక్రాంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగువారు ఎంతో పవిత్రంగా భావించే అతి ముఖ్యమైన పండుగ. భోగి, సంక్రాంతి, కనుక, ముక్కనుమ ఇలా ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి వస్తోందంటే బోలడెన్ని పిండి వంటలు చేయాలి. చుట్టాలు, బంధువులు ముఖ్యంగా కొత్త అల్లుళ్లకి మర్యాదల సందడి ఎక్కువగా ఉంటుంది. మరి సంక్రాంతికి ఈజీగా చేసుకునే కొన్ని వంటకాల్ని చూద్దాం. పూర్ణం బూరెలుకావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులుమినప్పప్పు - కప్పుకొత్త బియ్యం - 2 కప్పులుబెల్లం తురుము - 2 కప్పులునెయ్యి - అర కప్పునూనె -సరిపడతయారి: మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత జారుగా కాకుండా, మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారాక మందపాటి గిన్నెలో ఉడికించిన శనగపప్పుతోపాటు తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. బెల్లం పాకం వచ్చి, ఈ మిశ్రమం ఉండ చేసుకునే విధంగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఆ తరువాత కడాయిలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. ఇపుడు ముందే చేసిపెట్టిన ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. వేడివేడిగా బూరెల్లో నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటాయి. నువ్వుల బొబ్బట్లు, బెల్లంతోకావల్సిన పదార్తాలు : తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - సరిపడినంతతయారి: మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి చపాతీ పిండిలాగా మృదువుగా కలుపుకోవాలి. ఆ తరువాత దీనిని కొద్దిసేపు తడిబట్ట కప్పి ఉంచాలి. ఈలోపు బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రుచికి, సువాసన కోసం యాలకులకు కూడా కలపాలి.ఇపుడు కలిపి ఉంచుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, చపాలీగా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇదీ చదవండి : ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు పాకం గారెలుకావల్సినవి: మినప్పప్పు -అర కిలో, బెల్లం అర కిలో, కొద్దిగా నీళ్లు, నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - రుచికి సరిపడాతయారి: పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి.గోధుమరవ్వ హల్వాకావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పుపాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పుయాలకుల పొడి - చిటికెడుజీడిపప్పు పలుకులు - 10కిస్మిస్ - 10పంచదార - 2 కప్పులునెయ్యి - 4 పెద్ద చెంచాలుకుంకుమపువ్వు - కొద్దిగాతయారీ: మందపాటి గిన్నెలో నెయ్యి కొద్దిగా వేసి వేడిచేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు మరో గిన్నెలో చిక్కని పాలు, నీళ్లు కలిపి బాగా మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. ఇదీ చదవండి : HMPV : మళ్లీ మాస్క్ వచ్చేసింది.. నిర్లక్ష్యం వద్దు! -
ఆంధ్ర దంగల్‌కు సై అంటున్న.. తెలంగాణ కోళ్లు! ఇంట్రస్టింగ్ విషయాలు
సంక్రాంతి పండుగలో డూడూ బసవన్నలు, రంగవల్లులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటలు ఎంత ప్రాధాన్యత కలిగినవో.. కోడి పందేలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.. గట్టిగా చెప్పాలంటే.. సంక్రాంతి సందడిలో కోడిపందేలే కీలంకంగా మారాయి కూడా.. ఆంధ్రలో సంక్రాంతికి కోడిపందేలకు మహిళలు సైతం వెళ్లి పందేలు కాస్తారంటే ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి ఆంధ్రా సంక్రాంతి కోడి పందేలకు నగరం నుంచి పందెం రాయుళ్లతో పాటు కోళ్లు కూడా వెళుతున్నాయి.. అంతే కాదు పందేల్లో ప్రత్యర్థి కోళ్లను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సారి పందేల బరిలోకి దిగేందుకు పాతబస్తీలోని కోళ్లు కాలుదువ్వుతున్నాయి. పాతబస్తీలో పందెపు కోళ్ల పెంపకంతోపాటు వాటికి బరిలో పడే విధంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. దీంతో ఇక్కడ పెంచుతున్న కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి నేపథ్యంలో దీనిపైనే ప్రత్యేక కథనం..– సాక్షి, సిటీబ్యూరోసంక్రాంతి కోడి పందేలకు ఇప్పటికే సర్వం సిద్ధమవుతోంది. బరిలో నిలిచే కోళ్లను ఇప్పటికే పందెంరాయుళ్లు జల్లెడపట్టేశారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఒక్కో కోడి ధర పదివేల నుంచి లక్ష రూపాయల వరకూ పలుకుతోంది. జాతి, రంగును బట్టి కూడా ధరలను నిర్ణయిస్తారు. బరిలో దిగితే చావో రేవో తేల్చుకునేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. కొన్ని రకాల జాతి పుంజులైతే రూ.70 వేల నుంచి లక్ష వరకూ పలుకుతాయి.. అత్యంత ఖరీదుగా ఉండేవి సీతువ జాతి కోడి పుంజులు. ఆ తరువాతి స్థానాల్లో పర్ల, పచ్చకాకి, డేగ, కాకిపుంజు, పెట్టమారు రకాలున్నాయి. మెనూ చాలా ముఖ్యం.. అట్లపెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ చేస్తారు. చికెన్, ఎండు చేప ముక్కలు ధాన్యంలో కలిపి ఇస్తారు. ఇవేకాకుండా జీడి పప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, మేకపాలు, వీటితోపాటు బలవర్ధకమైన పోషకాలు ఉండే ఆహారం తినిపిస్తారు. గంట్లు, చోళ్ళు, బియ్యం, రాగులు మినప, శనగపప్పు, గోధుమ మిశ్రమాన్ని రోజూ తినిపిస్తారు. దీంతో పాటు మధ్యాహ్నం మటన్ కీమా, సాయంత్రం స్నాక్స్‌గా జొన్నలు, కోడిగుడ్లు పెడతారు. ప్రతి మూడు గంటలకూ ఓ సారి జీడిపప్పు, బాదం పిస్తా మిశ్రమాన్ని వడ్డిస్తారు. పుంజులకు బలమైన ఆహారం ఇస్తూనే కఠినమైన వ్యాయామం శిక్షణ ఇస్తారు. ఎంపికే కీలకం... కోడిపుంజు ఎంపిక నుంచి దానికి ఇచ్చే ఆహారం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కోడిపందెం కోసం అన్ని రకాల జాతులూ పనికిరావు. ప్రత్యేకంగా సూచించిన వాటినే కోడిపందేలకు ఉపయోగిస్తారు. వీటిలో డేగా, నల్లకాకి, తెల్లపర్ల, నెమలి కాకి, కాకిడేగ, కత్తిరాయి, జుమర్, నూరీ, కగర్, డుమర్, యాకూద్, కాకిడేగ, అబ్రాస్, పచ్చ కాకి, సీతువా, అసీల్ ప్రధానమైనవి. సాధారణ కోడిపుంజుల కంటే పందెంకోళ్లు భిన్నంగా ఉంటాయి. 24 గంటలు వాటిపై ప్రత్యేక నిఘా పెడతారు. పోటీకి ప్రత్యేక శిక్షణ.. ప్రత్యర్థి దెబ్బలు తట్టుకుని సత్తా చాటేలా కోడి పుంజులకు తర్ఫీదు ఇస్తున్నారు. కోడి బలిష్టంగా తయారు కావడానికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. పిల్లగా ఉన్నప్పటి నుంచే పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రోజువారీ మెనూ, కసరత్తు, మాసాజ్తో వాటిని కుస్తీకి సిద్ధం చేస్తారు. నాలుగు నెలల శిక్షణా కాలాన్ని విభజించి పోటీకి తీర్చిదిద్దుతారు. ఉదయాన్నే వాటికి మౌత్ వాష్ చేయిస్తారు. ట్రైనర్ నోటిలో నీళ్లు పోసుకుని కోళ్ల ముఖంపై స్ప్రే చేస్తాడు. ఈ ప్రక్రియను కల్లె కొట్టడం అంటారు. పుంజు కండరాలు బిగుతుగా ఉండేందుకు వాకింగ్ చేయిస్తారు. వేడి నీళ్లు, స్పెషల్ షాంపూతో కోడికి స్నానం చేయిస్తారు. రెండు గంటల సమయం తర్వాత మళ్లీ శిక్షణ మొదలవుతుంది. మరో పుంజును బరిలో దించడం ద్వారా పోటీకి రెచ్చగొట్టేలా ట్రిక్స్ ఉపయోగిస్తారు. తద్వారా రెండు పుంజులూ పోటాపోటీగా పోరాడేలా చేస్తారు. ఈ పోటీ తర్వాత పుంజులకు మసాజ్ సెషన్ ఉంటుంది. అంతేకాదు.. తిన్నది ఒంటబట్టేవిధంగా కసరత్తులు ఉంటాయి. చెరువులో ఈత కొట్టిస్తారు. పందెం కోడి నిర్వహణకు నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకూ ఖర్చు అవుతుంది భారీ డిమాండ్ ఉంది.. గత కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రాంతానికి మా కోళ్లు పెందేలకు తీసుకెళుతున్నారు. దీంతో భారీ డిమాండ్ ఏర్పడింది. అప్పటి నుంచి మేము పందెం కోళ్లను పెంచుతున్నాం.. వాటికి ప్రత్యేక ఆహారంతో పాటు, శిక్షణ కూడా ఇస్తాం. కోడి బ్రీడ్, జీవనశైలిని బట్టి వాటి ఆహారం, శిక్షణ ఉంటుంది. ఇప్పటికే పలువురు మా కోళ్లను కొనుగోలు చేశారు. ఆల్ బొగ్దాది అండ్ స్కోర్ ఆసీల్ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ నిర్వహిస్తున్నాము. దీని ద్వారా కోళ్లు కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. – హబీబ్ జైన్, పందెం కోళ్ల ఫామ్ యజమాని . -
సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!
సంక్రాంతి వస్తోందంటే వాకిట రంగవల్లులు, తెల్లవారు జామున హరిదాసులు, తెల్లవారిన తర్వాత గొబ్బియల్లో పాటలు, మధ్యాహ్నానికి పతంగులు గాల్లో ఎగురుతాయి. ఇవన్నీ పండుగ రాకను సూచించే ఉల్లాసాలు. సంక్రాంతి పండుగకు ఇంతే ఉల్లాసంగా ఉత్సవాలు కూడా జరుపుకుంటాం. సంక్రాంతి పండుగకు మనదేశంలో, గుజరాత్లో జరిగే పతంగుల ఉత్సవం అంటే విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఉరకలు వేస్తూ వస్తారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ వేడుకలకు నవంబర్ నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. నగరం డిసెంబర్ నాటికే పూర్తి స్థాయిలో ముస్తాబవుతుంది.తోకలేని గాలిపటాలుఅహ్మదాబాద్లో ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2025’ను ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. కేవాడియా, రాజ్‌కోట్, వడోదరా, శివరాజ్ పూర్, ధోర్డో, సూరత్‌లలో కూడా వేడుకలు నిర్వహిస్తారు. గాలిపటం అంటే తోక ప్రధానం, కానీ తోకలేని గాలిపటాలు కూడా ఈ వేడుకల్లో కనిపిస్తాయి. నక్షత్ర పతంగులు, చేపలు, పులుల ఆకారంలో ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లతో రూపొందిన గాలిపటాలను చూడవచ్చు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఈ ఫెస్టివల్‌కి వస్తారు. అహ్మదాబాద్, కచ్, సూరత్, సాఉతారా, రాజ్‌కోట్, పోర్బందర్, గాంధీధామ్, అమ్రేలి, భావ్‌నగర్‌లలో గతంలో నిర్వహించిన ఫెస్టివల్లో పాల్గొన్న గాలిపటాల ఫొటో గ్యాలరీ స్టాల్ కూడా ఉంటుంది. ఏకకాలంలో ఐదు వందల పతంగులు గాల్లో ఎగురుతుంటే చూడడానికి రెండు కళ్లు చాలవనే మాట చాలా చిన్నది. అహ్మదాబాద్ లో1989 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ముందు ఒకటి రెండు రోజుల నుంచి తర్వాత మరో రోజు వరకు మొత్తం నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కి పతంగి తయారీదారులు ప్రత్యేకంగా నెల రోజుల ముందు నుంచే చేరుకుంటారు. మలేషియా, ఇండోనేషియా, యూఎస్, జ΄ాన్, చైనా, ఇటలీ వంటి అనేక దేశాల నుంచి పతంగులు చేసే నిపుణులు, పతంగులను ఎగురవేసే ఉత్సాహవంతులు నగరానికి చేరుకుంటారు. ప్రత్యేకమైన పతంగులను తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేడుకలో పాల్గొంటాయి.కాంతులీనే పతంగులురంగురంగుల పతంగులను పగలంతా ఎగురవేస్తారు. వెలుగులు విరజిమ్మే తెల్లటి పతంగులను రాత్రి పూట ఎగురవేస్తారు. అవి ఆకాశంలో చంద్రుడికి పోటీగా విహరిస్తుంటాయి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ని సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నప్పటికీ ఇందులో మతపరమైన ధార్మిక నియమాలేవీ ఉండవు. వేడుకలో అన్ని మతాల వాళ్లూ సంతోషంగా పాల్గొంటారు. బంధువులు, స్నేహితులు కుటుంబాలతోపాటుగా కలిసి వేడుకలకు హాజరవుతుంటారు. ఇది ఊరంతా కలిసి నిర్వహించుకునే వేడుకన్నమాట. రంజాన్ సమయంలో చార్మినార్ నైట్ బజార్లాగ అహ్మదాబాద్ నగరంలోని పతంగిబజార్ డిసెంబర్ మూడోవారం నుంచి జనవరి రెండు వారాల వరకు మొత్తం నెలరోజుల పాటు రోజూ 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఎన్నివేల పతంగులు అమ్ముడవుతాయో లెక్క అందదు. మాంజాకు గాజు పొడి అద్దే దుష్టసంప్రదాయాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేటట్లు గట్టి నిఘా కూడా ఉంటుంది.పెద్దల కేరింతలుమన తెలుగువాళ్లు సంక్రాంతికి ప్రతి ఇంట్లో పతంగులు ఎగురవేస్తారు. హైదరాబాద్ ఆకాశం కూడా పతంగులతో కనువిందు చేస్తుంది. కానీ ఇక్కడ పిల్లలు పతంగులతో ఆనందిస్తుంటే పెద్దవాళ్లు పిల్లలను చూసి ఆనందిస్తుంటారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పెద్దవాళ్లు చిన్న పిల్లలైపోతారు. పరుగులు తీస్తూ మాంజాను జాడిస్తూ పతంగి పైకి ఎగిరే కొద్దీ కెవ్వున కేరింతలు కొడుతూ ఉంటే వాళ్లను చూసి పిల్లలు చప్పట్లు కొడుతూ ఈ వేడుకను ఎంజాయ్ చేస్తారు. (చదవండి: -
మురిపించే ముగ్గులు..రత్నాల రంగవల్లులు (ఫొటోలు)
-
లైకాపై అజిత్ ఫ్యాన్స్ ఆగ్రహం
-
సంక్రాంతికే భరోసా!
ఏమిటీ సెల్ఫ్ డిక్లరేషన్?‘అయ్యా.. ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నంబర్ 1లో ఎకరం పొలం ఉంది. నా ఇంటి ఆవరణతో కలిపి 100వ సర్వే నంబర్లో మరో ఎకరం చెలక ఉంది. ఇంటి జాగా 2 గుంటలు పోను మొత్తం ఎకరా 38 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను. దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి’ రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన ‘సెల్ఫ్ డిక్లరేషన్ ’ నమూనా ఇది. సాక్షి, హైదరాబాద్: ‘రైతుభరోసా’ అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో ‘రైతు భరోసా’ను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పథకం మార్గదర్శకాలపై చర్చించింది. తాజాగా రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు అందేది. ఇలాఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమిని లెక్కగట్టనున్నారు. అలాగే వ్యవసాయాధికారి ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను సరిపోల్చుకున్న తర్వాతే పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయడంతో పాటు తాను ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నాననే విషయాన్ని ప్రకటించేలా చూడటం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లకుండా రైతు సాగు చేసిన భూమికే కచ్చితంగా పెట్టుబడి సాయం అందుతుందని భావిస్తోంది. సాగు విస్తీర్ణంలో కచ్చితత్వం కోసమే అంటున్న సర్కారు రైతు అందించే సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల ఒక గ్రామంలో ఉన్న పట్టా భూమి ఎంత? అందులో సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలియడమే కాకుండా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు కూడా కచ్చితంగా తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్లో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణం లెక్కల్లో కచ్చితత్వం ఉండడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఈ యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు కాగా, రైతులు ఏకంగా 79.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఇందులో వరి 63.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 7.18 లక్షల ఎకరాల్లో సాగవుతుందంటూ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఇప్పుడు రైతు భరోసాకు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన వల్ల ఈ పంటలకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం ఉందని, అలాగే ఏ పంటల లోటు ఎంత ఉందో తెలుసుకుని తదనుగుణంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందుతుందనే నిబంధన వల్ల..గతంలో పునాసలో మాత్రమే సాగు చేసే రైతు యాసంగిలో కూడా తప్పకుండా ఏదో ఒక పంట పండించేందుకు ఆసక్తి చూపుతారని, తద్వారా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఎంత పెద్ద రైతుకైనా భరోసా ఖాయం! రైతు భరోసా కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిని ఎంతకు పరిమితం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 2 లేదా 3వ తేదీన ఉపసంఘం మరోసారి సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అనే అంశాన్ని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఎంత పెద్ద రైతైనా నిరీ్ణత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాలు పైనున్న భూ యజమానికి పెట్టుబడి సాయం అందని విషయం విదితమే. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉప సంఘం 3వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేస్తే 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. -
#SankranthiMuggulu : మనసుదోచే సంక్రాంతి ముగ్గులు (ఫొటోలు)
-
ఊరికి బంధువులొస్తున్నారు
హరిలో రంగ హరి.. అంటూ హరిదాసులు.. అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు.. అంటూ డూడూబసవన్నలు.. అంబ పలుకు.. జగదంబ పలుకు అంటూ.. జంగమదేవరలు.. ఓ లప్పో.. లచి్చమప్పో.. అంటూ.. కొమ్మదాసుల విన్యాసాలతో పెద్ద పండుగను నెల రోజుల ముందే వెంటేసుకొస్తారు.. సంక్రాంతికి అందరి ఇళ్లకు బంధువులు పండుగకు మూడు, నాలుగు రోజుల ముందు వస్తే.. ‘ఊరికి బంధువులు’ మాత్రం నెలగంట మోగిన వెంటనే ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతూ సందడి చేస్తారు.. సంప్రదాయ కళలకు పట్టం గడుతూ.. తృణమో పణమో ఆనందంగా తీసుకుని అందరూ చల్లగా ఉండాలని దీవిస్తూ ధనుర్మాసంలో ఊరూవాడా తిరుగుతుంటారు. సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. సాక్షి, భీమవరం: సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. దీనిని ధనుస్సంక్రమణమని, నెల పట్టడం అని పల్లె నానుడి. ఈనెల 16న (సోమవారం) నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. జనవరిలో మకర సంక్రమణం వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెలరోజుల పాటు ఉదయాన్నే హరినామ సంకీర్తలు పాడుతూ హరిదాసులు, డూడూ బసవన్నలతో విన్యాసాలు చేయిస్తూ గంగిరెడ్ల వారు, పప్పుదాకలో పడిపోతున్నానంటూ కొమ్మదాసులు, అంబ పలుకు జగదంబ పలుకంటూ బుడబుక్కల వాళ్లు, శంఖం ఊదుతూ జంగం దేవరలు, ఏడాదికో మారంటూ పిట్టల దొరలు, భట్రాజులు, సోదెమ్మలు, పగటి వేషగాళ్లు, కనికట్టు చేసేవాళ్లు, గారడీ చేసేవాళ్లు వరుసగా క్యూ కడుతుంటారు.ఆయా జాతుల వారు ఊళ్లను పంచుకుని తమతమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తమ కళలను ప్రదర్శించి వినోదాన్ని పంచి యజమానులు ఇచ్చిన మొత్తాన్ని తీసుకువెళుతుంటారు. పల్లె జీవనానికి ఈ సంప్రదాయ కళలకు ఎంతో అనుబంధం ఉందని పెద్దలు చెబుతుంటారు. మారుతున్న కాలంలో ఆదరణ తగ్గి ఉపాధి కోసం జిల్లాలోని చాలా మంది కళాకారులు వేరే వృత్తుల్లో స్థిరపడగా, కొందరు మాత్రం తమ తాతల కాలం నుంచి వస్తున్న విద్యను ప్రదర్శిస్తూ సంప్రదాయ కళలను కాపాడుకుంటూ వస్తున్నారు. సోమవారం నుంచి ఊరూరు తిరిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొమ్మదాసుఓ లప్పో.. లచి్చమప్పో.. అక్కో రాఖీ పండక్కొచి్చనప్పుడు నీకు షాపింగ్మాల్లోంచి కాస్ట్లీ చీరతెత్తానప్పా.. మాయగారు ఆనందంగా ఉండాల. వారానికి 3 సినిమాలకు వెలతుండాల.. నీ కుటుంబమంతా బాగా ఉండాల అంటూ కొమ్మదాసులు మాటల గారడీ చేస్తూ ఆకట్టుకుంటారు. పూర్వం చెట్లు ఎక్కి హడావుడి చేసేవారు. ఇప్పుడు భుజాన కొమ్మేసుకుని తిరుగుతున్నారు. గంగిరెడ్లు..అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ యజమానికి చెప్పే ఆదేశాలకు తలాడిస్తూ గంగిరెడ్లు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. గంగిరెద్దులు బసవన్నల రూపంలో ఇంటి ముందుకొస్తేనే పండుగ మొదలవుతుంది. గంగిరెడ్ల వారు పీపీలు ఊదుతూ పాటలు పాడుతుంటే గంగిరెద్దుల గజ్జల చప్పుడు మధ్య తమ ఇంటికి లక్ష్మీ కళ వస్తుందని నమ్మకం.హరిదాసులు : శ్రీమద్రమా రమణ గోవిందో హరి.. అంటూ తెలవారకుండానే నుదుటన తిరునామం, నెత్తిన అక్షయపాత్ర, చేతిలో చిడతలు, భుజాన తంబూర, పట్టుధోవతి పంచెకట్టు, మెడలో మాల, కాళ్లకు గజ్జలతో హరిదాసులు వీదివీధి తిరుగుతూ హరినామ సంకీర్తనలు ఆలపించడం అనాదిగా వస్తున్న ఆచారం. వారు నడయాడిన గ్రామం పాడిç³ంటలతో సుభిక్షంగా ఉంటుందని, హరిదాసు అక్షయపాత్రలో పోసే కాసి బియ్యం తమ ఇంటిని సిరిసంపదలతో నింపుతాయని పల్లె ప్రజలు భావిస్తారు. పండుగ నెల పట్టారంటే ప్రతిరోజూ ఉదయాన్నే ప్లేటులో బియ్యంతో మహిళలు హరిదాసు రాకకోసం పల్లెల్లో ఇంటి ముంగిట వేచి ఉంటారు. -
YS Jagan: పూర్తిగా సమయాన్ని కార్యకర్తలకే కేటాయిస్తాను
-
ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్‌కు థ్యాంక్స్.' అని అన్నారు.కాగా.. ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. నా 3 కోరికలలో ఒకటి ఈ సినిమాలో తీరింది - Actress #MeenakshiChaudhary#Venkatesh #AnilRavipudi @SVC_official #SankranthikiVasthunam #TeluguFilmNagar pic.twitter.com/aL1Bx7JERI— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2024 -
సంక్రాంతి బరిలో వెంకీమామ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంటకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నా.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ENTERTAINMENT LOADED 😎FUN READY TO FIRE 🔥The Blockbuster combo of Victory @VenkyMama and Hit Machine Director @AnilRavipudi is all set for a VICTORIOUS HATTRICK this Sankranthi 💥💥💥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/m0isUz0FdA— Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2024 -
నా సినిమా అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తాయి: నిర్మాత నాగవంశీ
నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.అయితే ఇవాళ జరిగిన టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు బ్లాక్స్ వేరే లెవల్లో ఉంటాయని అన్నారు. ఇంటర్వెల్ సీన్ బాలయ్య సీన్ మామాలుగా ఉండదని..టీజర్ కొన్ని ముక్కలు మాత్రమే కట్ చేసి చూపించామని నాగవంశీ వెల్లడించారు.(ఇది చదవండి: బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్)ఆ తర్వాత సంక్రాంతి రేస్, నాగవంశీ సినిమాల విడుదల డేట్స్‌పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ఏడాది గుంటూరు కారం, అలాగే లక్కీ భాస్కర్ సినిమా విడుదల సమయంలో మీకు పోటీగా ఏదైనా సింపతి కార్డ్ సినిమా వస్తోందా? అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? దీనిపై మీరేమంటారని నాగవంశీని అడిగారు.దీనికి ఆయన స్పందిస్తూ..' ఈ ప్రశ్న అడిగిన మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా సినిమా టైమ్‌లోనే ఇలాంటి బాంబులు పేలుస్తున్నారు. అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తున్నాయి. ఇకనుంచి నేను కూడా ఏదైనా కష్టాలు వెతుక్కోవాలి. వచ్చే సంక్రాంతికి మేము కూడా సింపతీ కార్డ్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి' అంటూ సరదాగానే మాట్లాడారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారంతో పాటు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. హనమాన్, నాసామిరంగ, సైంధవ్ చిత్రాలు సందడి చేశాయి. ఈ పోటీలో హనుమాన్ హిట్‌గా నిలిచింది. ఇటీవల దీపావళీ సందర్భంగా లక్కీ భాస్కర్‌తో కిరణ్ అబ్బవరం క మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.Memu Kooda Ee Sankranthiki edho Oka Sympathy Card tho Raavali.- #NagaVamsi Mass at #DaakuMaharaj title teaser eventpic.twitter.com/NsTps1FrRp— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 15, 2024 -
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్ బాక్సాఫీస్ పోటీకి సై అంటున్నాయి.అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్‌తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Context 😤pic.twitter.com/PBTuhvgD3W— Cinderella🦋 (@GlamGirl_Geetha) November 6, 2024 U had one success man, one! Daniki 25 yrs ga ace filmography unna Mahesh meedha satireUnless you come up with a sequel for Hanuman, aa collections thechkolev and yk why @tejasajja123 Inka Rana gurinchi enduku, shelved project adhi— Jimhalpert (@satvikdhfm) November 5, 2024 Dear @tejasajja123 ,Need apology to superstar @urstrulyMahesh garu and his fans You and rana degrade comments about 2024 sankranthi films , in this sankranthi one of my beloved superstar film also there you know also,Please try to understand this situation.Thanks and…— Sagar MB (@dhfmbabu4005) November 5, 2024 -
అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యేనా?
సంక్రాంతి.. టాలీవుడ్‌కి పెద్ద పండగ. కరోనా సమయంలో కూడా సంక్రాంతికి రిలీజైన సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే మన దర్శక-నిర్మాతలు ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. ఈ సారి కూడా నాలుగైదు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే కొందరు సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించారు. మరికొన్ని సినిమాలు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ ‘బాక్సాఫీస్’ ఆటలో ఈ సారి అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యేలా కనిపిస్తున్నాడు. అల్లుడు రామ్ చరణ్‌కి పోటీగా తన సినిమాను బరిలోకి దించి ‘బాక్సాఫీస్’ ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ జాప్యం, ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సంక్రాంతికి వస్తున్నాం అటూ దసరా రోజు ప్రకటన చేశారు. ఈ చిత్రం కంటే ముందే మరో మూడు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించాయి. అందులో ఒకటి చిరంజీవి ‘విశ్వంభర’. రెండోది అనిల్ రావిపూడి-వెంకటేశ్ మూవీ. మూడోది నందమూరి బాలకృష్ణ-బాబీ సినిమా. (చదవండి: అఖండగా బాలయ్య మరోసారి.. అధికారిక ప్రకటన)అయితే అనూహ్యంగా చిరంజీవి వెనక్కి తగ్గి.. కొడుకు సినిమాను బరిలోకి నిలిపాడు. ఈ మూడు సినిమాల మధ్యే గట్టిపోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. తాజాగా మరో సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుంది. అదే అక్కినేని నాగచైతన్య ‘తండేల్’. ‘లవ్‌స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.(చదవండి: బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!)వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ మూడోవారంలో రిలీజ్ చేయాలని భావించారట. అప్పటిలోపు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే పరిస్థితి లేదని చందు చెప్పేశాడట. వీలైనంతవరకు ట్రై చేద్దామని..కుదరకపోతే రిలీజ్‌ను వాయిదా వేయక తప్పదని ముందే చెప్పారట. ఒకవేళ డిసెంబర్ మూడో వారంలోపు విడుదల చేసే అవకాశం లేనట్లేయితే.. ఎక్కువ రోజులో హోల్డ్ చేయకుండా సంక్రాంతి పండక్కే రావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ అన్నదానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
సంక్రాంతి బరిలో మరో టాలీవుడ్ సినిమా!
సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. ఈ మూవీ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.కాగా.. మహేంద్రగిరి వారాహి సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు ఇటీవల వెల్లడించారు. ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని బ్రహ్మానందం చేయబోతున్నారని దర్శకుడు సంతోష్ తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.కాగా.. వచ్చే ఏడాది-2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా.. వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
సంక్రాంతి.. రామవ్వ నోటి నుండి మొదటిసారి!
రామవ్వ నోటి నుండి మొదటిసారి ఆ పేరు విన్నంతనే శంకరంలో ఏదో అలజడి మొదలయ్యింది. ఆ ఒక్క పేరు అతడిలో రేకెత్తించిన కలవరం బహుశా ఏ అమ్మాయి పేరూ కలిగించి ఉండదు. శంకరం ఇంతకు ముందు ఆ అమ్మాయిని చూడకపోయినా ఆ పేరు చాలా ఆత్మీయంగా అనిపించింది. రామవ్వ నెలకు రెండు మూడు పేర్లను కొడుకుతో ప్రస్తావిస్తూనే ఉంది. ‘కానీ.. చూద్దాం’ అని ఆమె మాటను తోసిపుచ్చుతున్నాడే తప్ప ఆమె వెదుకుతున్న పెళ్ళికూతుళ్ళ సంగతిని తలకెక్కించుకోలేదు. ఉబలాటానికైనా వారిని చూసిరావడానికి వెళ్ళలేదు. కానీ సంక్రాంతి విషయంలో ఎందుకో అలా ఉండటం అతనికి అసాధ్యంగా అనిపించింది.చిత్తడి నేలలో పడ్డ బీజం మొలకెత్తినట్లు అతని మనసులో పడిన సంక్రాంతి అనే పేరు పాతుకుపోయి ఇక ఉండబట్టలేక ‘అమ్మా.. నేను ఆ అమ్మాయిని చూసివస్తాను’ అన్నప్పుడు రామవ్వ ముఖం వికసించింది. ‘సంతోషం బిడ్డా.. ఈ సంబంధం కలిసిరానీ’ అని తన ఆనందాన్ని ప్రకటించింది. దాంతో మరింత ఉత్సాహాన్ని పొందిన శంకరం తనకు వీలుగా ఉన్న ఒక తేదీని ఎన్నుకుని ఆ రోజు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అయినా కుతూహలం చంపుకోలేక సామాజిక మాధ్యమాల్లో ఆమె గురించిన సమాచారానికై వెదికాడు. ఏమీ దొరకక నిరాశ చెందాడు. ఇంతలో శంకరం ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రామవ్వను పిలిచాడు. ఆమె అతనితో రావడానికి ఒప్పుకోని కారణంగా తనొక్కడే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కారులో కూర్చుని అమ్మవైపు చూశాడు. ఆమె ముఖంలో సంతోషాన్ని నింపుకుని వాకిట్లో నిలబడి ఉంది. ఆమెను కదిలిస్తే ఆనందాశ్రువులు చిప్పిల్లేలా ఉన్నాయి ఆమె కళ్లు. వెళ్ళివస్తానని కనుకొనల నుండి సైగ చేశాడు. అలాగే కానీ అని ఆమె తలవూపాక శంకరం బయలుదేరాడు.తుమకూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే సంక్రాంతి ఊరైన నిడసాలకు శంకరం వెళ్ళాల్సి ఉంది. ఆ ఊరేమీ అతనికి అపరిచితమైనది కాదు. అలా అని అంతగా పరిచితమైనది కూడా కాదు. రామవ్వ పుట్టిన హిత్తలపుర పక్కనే ఉన్న ఊరు. పుట్టిన ఊరులోనే తెలిసినతడిని పెండ్లి చేసుకున్న రామవ్వ, శంకరం పుట్టిన నాలుగేళ్ళకు వైధవ్యాన్ని పొందింది. వివాహేతర సంబంధపు ఆరోపణలను ఎదుర్కొన్నది. బంధువులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక శంకరాన్ని తీసుకుని తుమకూరు వచ్చేసింది. మళ్ళీ తన ఊరివైపు చూడలేదు. ఇళ్ళల్లో పనిచేస్తూ కొడుకును చదివించుకోవడంలో నిమగ్నమయ్యింది. అప్పుడప్పుడూ తన ఊరి గురించి సమాచారం తెలిసినా ఎప్పుడూ ఆ ఊరికి వెళ్ళాలని రామవ్వకు మనస్కరించలేదు. ఆమెకు కొడుకే లోకం అయ్యాడు. తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న శంకరం ఆమెకే బాధా కలగకుండా చూసుకుంటున్నాడు. ఆమె ఇష్టప్రకారమే బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాడు. తలచెడి తెలియని ప్రాంతానికి వచ్చిన రామవ్వ ఇప్పుడు పెద్ద ఇంటికి యజమానురాలు. ఈ మధ్యే.. శంకరానికొక జోడీ కుదర్చాలని వధువును వెదికేపనిలో పడింది. ఓటమినీ చవిచూసింది. చివరకు ఆమె వెదికిన, అతడిని ఆకట్టుకున్న అమ్మాయి ఎవరంటే సంక్రాంతి.ఎందుకో ఆ అమ్మాయిని చూడకుండానే అతని మనసు సంక్రాంతిని కోరుకుంటోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఇంక రెండు నెలలలో పెళ్ళి. ఏడాది తిరగకుండానే పిల్లాడు.. తన ఆలోచనలకు తానే నవ్వుకున్నాడు. దారిపొడుగునా సంక్రాంతి ఆలోచనే వెంటాడసాగింది. ఇంకొక కిలోమీటరు దూరం ఉందనగా కారు వేగం తగ్గించి, కిటికీ నుండి బయటకి దృష్టి సారించాడు. చెరువు సౌందర్యానికి ఆకర్షితుడై రోడ్డు పక్కగా కారును ఆపి చెరువుకట్టపైకి చేరుకున్నాడు. గట్టు మీద కూర్చున్న ఒక యువకుడు చెరువు నీటిపై రాళ్ళను రువ్వుతున్నాడు. ఆ రాళ్ళు సృష్టించిన అలల వలయాలను కాసేపు చూసిన శంకరం అతని దృష్టిలో పడటానికి ‘హలో’ అన్నాడు. తిరిగి చూసిన ఆ యువకుడు మళ్ళీ రాళ్ళు విసరడంలో నిమగ్నమయ్యాడు. చూడటానికి స్థితిమంతుడిలానే కనిపిస్తున్నాడు. అయితే అతని ముఖం వాడిపోయి ఉంది. అతడిని మళ్ళీ పలకరించడానికి మనసురాక శంకరం తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఊరి మొదట్లో కారు నిలిపి, కిటికీ నుండి తల బయటకుపెట్టి గడ్డిమోపుతో వెళుతున్న వ్యక్తిని అడిగాడు.‘అన్నా.. సంక్రాంతి ఇల్లెక్కడ?’‘ఓ.. అమ్మాయిని చూడటానికి వచ్చినారా? అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా పారిజాతం, సంపంగి చెట్లు.. ఆ ఇల్లే!’‘సరే’ అని ఆ వ్యక్తి నుండి వీడ్కోలు తీసుకుని సంక్రాంతి ఇంటికి చేరాడు శంకరం. ఆ ఇంటి ముందు కారు ఆపాడు. పారిజాతాల పరిమళం అతని ముక్కుకు తాకి హాయిగా అనిపించింది. శంకరం అరుగు వద్దకు వెళ్లగానే ఒక అవ్వ కళ్ళు విప్పుకుని చూస్తూ ‘ఎవరూ?’ అంది.‘నేను శంకరం. సంక్రాంతిని చూడటానికి వచ్చాను’ చెప్పాడు కాస్త సంకోచంతో.‘మా రామి కొడుకువా?’‘మా అమ్మ తెలుసా మీకు?’‘నా బిడ్డ రత్న స్నేహితురాలే కదా మీ అమ్మ? దాని కూతురే కదయ్యా సంక్రాంతి. ఏం తలరాతో ఇద్దరిదీ!’తన తల్లి ప్రస్తావన రాగానే శంకరం చిన్నగా నవ్వాడు.‘పోయిన వారం నుండి నీకోసం కాచుకున్నాం. రా.. రా..’ అని అతన్ని నట్టింటిలోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. కూర్చోగానే ఇంటిని పరిశీలనగా చూశాడు. పాత ఇల్లే అయినా కంటికి ఇంపుగా కనిపించింది. ఇంటి మధ్యలో వేలాడుతున్న ఉయ్యాల బల్ల అతనికి బాగా నచ్చింది. సూర్యకిరణాలు నేల మీద కట్టిపడేసినట్టున్నాయి. ఏనుగు కళ్ళలా చిన్నగా ఉన్న కిటికీల వైపు నిండిన చెరువులోని చేపపిల్లలా అతని కళ్ళు పారాడటం చూసి ‘సంక్రాంతి ఇంట్లో లేదు బిడ్డా..’ అంది శివజ్జి. ‘ఔనా?’ నిరాశతో అన్నాడు.‘ఆమె మద్దూరులో చదువుకొంటోంది. విషయం తెలిపాను. ఇంకేం వచ్చేస్తూ ఉంటుంది.’శంకరం కోపాన్ని దిగమింగుకుని మౌనంగా ఉన్నాడు.‘నీ కోపం అర్థమవుతోంది నాయనా. ముందు తిండి తిను’ అని శివజ్జి.. తిండి తెచ్చి ముందుపెట్టింది. ‘అది కాదు అవ్వా.. నేను నా పనులన్నీ వదులుకుని వచ్చాను. ఫోను చేసినప్పుడే ఈ రోజు కుదరదని చెప్పివుంటే మరొక రోజు వచ్చేవాణ్ణి కదా’ అనే మాటలు నోటివరకూ వచ్చి ఆగిపోయాయి. మౌనంగా ఫలహారం ముగించిన శంకరం.. సంక్రాంతి కోసం నిరీక్షించసాగాడు. శివజ్జి మాట్లాడుతోనే ఉంది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. చివరకు అక్కడ కూర్చోవడం విసుగనిపించి ‘అవ్వా.. కొంచెంసేపు అలా బయట తిరిగివస్తాను’ అన్నాడు. ‘సరే! నంజన్నను కూడా తీసుకువెళ్ళు. నీకు ఊరు తెలియదు కదా..’ అని, ‘ఏయ్ నంజన్నా’ అంటూ కేకేసింది. ‘వస్తున్నానమ్మా’ పెరటి నుండి పరిగెత్తుకొచ్చాడు నంజన్న. పశువులకు గడ్డి పెడుతున్నాడో ఏమో వాడి తలపై గడ్డిపరకలు చిక్కుకుని ఉన్నాయి. శంకరం వస్తున్న నవ్వును అదిమిపెట్టుకున్నాడు.‘వీరిని తోట దగ్గరికి తీసుకెళ్ళు..’‘అలాగే అమ్మా’ అని చెప్పి, ‘రండి సామీ’ అంటూ శంకరానికి దారి చూపించాడు.ముందు నడుస్తున్న వాడిని అనుసరించాడు శంకరం. పాదాల పరుగులో ఊరు వెనుకపడింది. నంజన్న ఒక్క మాటా పలకలేదు. వాడి ముఖం బిగుసుకున్నట్టు ఉంది. ఇద్దరూ కొబ్బరితోట చేరుకున్నారు. నంజన్న సరసరా చెట్టెక్కి కొబ్బరి బోండాన్ని తెంపాడు. పొదలో దాచిన మచ్చుకత్తిని తీసుకుని అతను వస్తున్న తీరు శంకరాన్ని భయపెట్టింది. కొబ్బరికాయ తలనరికి రంధ్రం చేసి శంకరం చేతిలోపెట్టి తాను దూరంగా కూర్చున్నాడు. తోటను దుక్కి దున్నిన కారణంగా మట్టి పాంటుకు అంటుకుంటుందని శంకరం కింద కూర్చోవడానికి సందేహించాడు. దీనిని గమనించిన నంజన్న లేచి కొబ్బరిమట్టను కత్తిరించి తెచ్చి కిందపరిచాడు. దానిమీద శంకరం నిశ్చింతగా కూర్చున్నాడు.‘నువ్వు కొబ్బరినీళ్ళు తాగవా?’ ‘ఊహూ.. మాకేం కొబ్బరినీళ్ళకు కరువా? మీరు తాగండి సామీ’ జవాబిచ్చాడు నంజన్న.కొబ్బరినీళ్ళు తాగుతూ శంకరం వాడిని గమనించాడు. నంజన్న కాళ్ళు మడుచుకుని తల మోకాళ్ళకు ఆనించుకుని కూర్చున్నాడు. అతని నిక్కరు మోకాళ్ళను పూర్తిగా కప్పివుంది. చూడటానికి కాస్త నలుపుగా ఉన్నా లక్షణంగా ఉన్నాడు. శరీరం దృఢంగా ఉంది. చేతిలోని మచ్చుతో నేలమీద ఉన్న కొబ్బరాకులను గెలుకుతూ కూర్చున్నాడు. ఆమె గురించి తెలుసుకోవడానికి సరైన సమయం ఇదే అని భావించిన శంకరం ‘సంక్రాంతి నీకు తెలుసా?’ అని అడిగాడు.‘తెలియకపోవడం ఏమి?’‘ఏం తెలుసు?’‘అంతా తెలుసు. ఆమెను ఎత్తుకుని ఆడించింది నేనే. చివరకు నాకు చాలా నొప్పి కలిగించింది..’‘ఏం చేసింది?’‘మీరు ఇక్కడే మరిచిపోతాను అంటే మీకొక విషయం చెప్పనా?’‘హూ..’‘సంక్రాంతిని నేను ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకున్నాను. చిన్నప్పుడు నన్నే పెళ్ళి చేసుకుంటాననేది. నన్ను విడిచి ఒక్కరోజూ ఉండేది కాదు. పెద్దయ్యాక అంతా మరిచిపోయింది. పెళ్ళి విషయం ఎత్తితే కయ్యిమనేది. తరువాత ఆమె దక్కదు అని తెలిసి నేనూ మరిచిపోయాను. ఇప్పుడేమీ విచారం లేదు. మా అమ్మ చందుళ్ళిలో ఒక అమ్మాయిని చూసింది. వచ్చే నెలలోనే నా పెళ్ళి’ బాధతో మొదలైన అతని మాటలు దరహాసంతో ముగిశాయి.‘మా సంక్రాంతి పసిపాపలాంటిది. అయినా లోకాన్ని అంతే బాగా తెలుసుకుంది.’‘ఔనా? అయితే నువ్వు పేదవాడివని నిన్ను విడిచిపెట్టి ఉండాలి..’ అన్నాడు శంకరం.‘ఉండాలి కాదు విడిచిపెట్టింది అనండి సామీ..! నిరంజన్ తెలుసా?’‘లేదు.’‘మా ఊరికంతా పెద్ద ధనికుడు. అతనూ ఈమె మీద ప్రేమను పెంచుకున్నాడు. ఇద్దరూ బాగానే ఉండేవారు. తరువాత ఏమయ్యిందో?’‘ఇప్పుడతను ఏం చేస్తున్నాడు?’‘చెరువులో రాళ్ళు విసురుతూ కూర్చున్నాడు.’‘పాపం.. ఆ పిల్లోడినే అనుకుంటా నేనీ రోజు చెరువు దగ్గర చూసింది’ శంకరం తాను చూసిన వ్యక్తిని గుర్తుచేసుకున్నాడు.‘పాపమేమీ కాదు సామీ.. అతనికీ అతడి అత్త కూతురితో పెళ్ళి కుదిరింది. కొద్ది రోజుల్లోనే పెళ్ళి!’ ‘అయితే సంక్రాంతి..’ ఇంకేదో అనబోయాడు.‘ఇంకొక కొబ్బరి బోండాం తాగుతారా?’‘వద్దు.’‘అయితే మీరిక్కడే కూర్చోండి.. నేను పశువులకు పచ్చిగడ్డి కోసుకొస్తాను.’‘లేదు నేను ఇంటికి వెళ్తాను.’‘దారి తెలుస్తుందా?’‘హూ..’శంకరం ఊరి ముఖంగా నడిచాడు. ఎందుకో అతనికి సంక్రాంతి పట్ల మొదట ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉన్నట్లు లేదు. విసుగుతోనే ఇంటికి చేరాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళకుండా క్షణకాలం ఆలోచించి కారును నీడలో నిలపడానికి ముందుకుసాగాడు.‘బిడ్డా.. రా.. రా.. తోట చూశావా? నంజన్న ఎక్కడ?’‘వస్తున్నాడు.’వెళ్ళాలో, వద్దో అని సంశయిస్తూనే అవ్వ వెనుకే వెళ్ళి మళ్ళీ నట్టింట్లోకి వెళ్లి కూర్చున్నాడు. ‘చూడు బిడ్డా.. నా కూతురు రత్నకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేశాను. అల్లుడు ఎవతినో ఉంచుకున్నాడంట. నా కూతురు ఈ పిల్ల పుట్టే వరకూ ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకుని, బావిలో దూకి చచ్చిపోయింది. వాడు పెళ్ళాం చచ్చిన మూడు నెలలు నిండేలోపలే ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. నా కూతురు పోయింది. కనీసం మనవరాలైనా బాగుండాలి! అందుకే అది ఒప్పుకున్న వాడితోనే పెళ్ళిచేస్తాను’ అంటూ శివజ్జి మళ్ళీ కథను మొదలుపెట్టాక శంకరానికి కంపరం అనిపించింది. తానిప్పుడు లేచి వెళ్ళిపోతే జీవితాంతం ఆమె కేవలం ఒక ప్రశ్నలాగే మిగిలిపోతుంది. అలా కావడం ఇష్టంలేక అక్కడే ఆగిపోయాడు.ఇంతలో ఘల్.. ఘల్.. ఘల్.. అంటూ గజ్జెల శబ్దం వినిపించింది. మల్లెపూల ఘుమఘుమలు చుట్టుపక్కల వ్యాపించాయి. సంక్రాంతి నట్టింట్లోకి ప్రవేశించింది. శంకరం కళ్ళు విప్పారాయి. ఆమె విశేషంగా అలంకరించుకుంది. ముదురుగోధుమ వర్ణపు చాయ కలిగిన ఆ పడతిని శంకరం కళ్ళార్పకుండా చూడసాగాడు.‘ఎందుకే ఇంత ఆలస్యం చేశావు?’ శివజ్జి గదిరించింది. బదులివ్వకుండా నవ్వి శంకరం వైపు తిరిగి,‘వేచి ఉండేలా చేసినందుకు కోపంగా ఉందా?’ అంది.ఈ ప్రశ్నను ఊహించని శంకరం తబ్బిబ్బవుతూ ‘ఏం లేదు’ అని బదులిచ్చాడు. ‘అవ్వా.. తాగడానికేమైనా పెట్టావా?’‘హూ..’ వంటగదిలోకి నడిచిన సంక్రాంతి పానకం గ్లాసులతో బయటకు వచ్చింది. ‘వెళదామా?’ ఖాళీ గ్లాసును కిందపెడుతూ ఆమె శంకరాన్ని అడిగినప్పుడు ‘ఎక్కడికి?’ అన్నాడు.‘నా గురించి ఏమీ తెలుసుకోరా?’‘సరే పదండి..’‘మీ కారులోనే వెళదామా?’ అన్నప్పుడు శంకరం అంగీకారంగా తలవూపాడు. కారు ఊరి నుండి ఒక మైలు దూరం సాగాక ఆపమని అడిగింది. కారు నుండి దిగిన ఆమెను అనుసరించాడు శంకరం. కొంతసేపు మౌనం తరువాత ఆమే మాట్లాడటం ప్రారంభించింది. ‘నేను కన్నడ ఎం.ఎ. చేస్తున్నాను. నాకు అమ్మ లేదు. నాన్న ఉన్నా లేనట్లే. అవ్వే నా సర్వస్వం.’‘హూ.. తెలుసు!’‘అయితే తెలియని విషయాన్ని చెబుతాను’ అని కొంత సమయం తీసుకుని మాట్లాడసాగింది. ‘పెళ్ళి విషయంలో నానొక నిర్దిష్టమైన వైఖరి ఉంది. బొమ్మలాడుకొనే వయసులో నంజన్ననే పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంటుంది. ఆ తరువాత నిరంజన్. నాకు జ్ఞానం పెరిగాక అతనూ సరైన ఎంపిక కాదని తెలిసింది!’‘అయితే మీరు వాళ్ళను ప్రేమించింది నిజమేనా?’‘అవును నిజమే. ఎప్పుడో వాళ్ళ మీద ప్రేమ ఉందనే కారణంతో ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం కుదురుతుందా? నేను ఎంత ఎత్తులో నిలబడి చూసినా నాముందు మరుగుజ్జు అనిపించని వ్యక్తినే నేను పెళ్ళి చేసుకునేది’ అంటూ పెద్దగా నవ్వుతున్న ఆమెను చూసి శంకరం లోలోపలే మండిపడ్డాడు.‘హూ.. హిమాలయం ఎక్కి నిలబడ్డా ఎత్తుగా అనిపించే ఒక వ్యక్తి ఉన్నాడు!’‘ఎవరతను?’‘ఆకాశం! మీరు అతడినే పెళ్ళి చేసుకోండి’ అని నవ్వి శంకరం ‘నమస్కారం! నేను ఇక వెళ్ళివస్తాను’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.‘శంకరా.. చూడు సంక్రాంతికి పెళ్ళంట. లగ్నపత్రిక పంపించారు. నేనెంత చెప్పినా వినకపోతివి. వాళ్ళ నాన్నను మనసులో పెట్టుకుని తన జీవితం అమ్మలాగా కాకూడదని కావచ్చు నీకేదో కథ చెప్పి ఉంటుంది. నువ్వు దాన్నే పెద్దగా చూసి వద్దన్నావు. ఆమె అపురూపమైన పిల్ల బిడ్డా. నేను పెళ్ళికైనా వెళ్ళివస్తాను’ అంటూ రామవ్వ లగ్నపత్రికను అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. కుతూహలంతో శంకరం లగ్నపత్రికలో వరుడి పేరు మీద దృష్టి నిలిపాడు. ‘ఆకాశ్’మళ్ళీ మళ్ళీ పేరు చదువుకున్న శంకరం నవ్వలేదు.– కన్నడ మూలం : విద్యా అరమనె– తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్ -
చికాగో ఆంధ్ర అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు
-
న్యూయార్క్ లో సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు
-
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ AAA సంక్రాంతి సంబరాలు
-
చికాగోలో ఘనంగా సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు!
అమెరికాలోని చికాగోలో తెలుగువారు సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్’ స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సంస్థ అధ్యక్షుడు హేమంత్ పప్పు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక అందంగా అలంకరించిన వేదిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత, నాట్య కార్యక్రమాలు అలరించాయి. సంస్థ ప్రతినిధులు, సభ్యులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. ఈ వేడుకల్లో 300 మందికిపైగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ వేడుకలను పురస్కరించుకుని స్థానిక కళాకారులచే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు పలువురు ప్రముఖులు సర్టిఫికెట్లు అందజేసి, ప్రోత్సహించారు. పలు సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నిర్వహించిన ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ సభ్యులను పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు)


