సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందుగానే కర్చీఫ్ వేయాల్సిందే. పొంగల్ బాక్సాఫీస్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే స్టార్స్ అంతా సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల డేట్స్ ఖరారయ్యాయి. వీటిలో ది రాజాసాబ్ జనవరి 9న, మనశంకరవరప్రసాద్ గారు జనవరి 12న, భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నాయి.
వీటికి తోడు కోలీవుడ్ సినిమాలు సైతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన పరాశక్తి కూడా పొంగల్‌కే రానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. జనవరి 14న విడుదల చేస్తామని ఫిక్సయ్యారు. అయితే తాజాగా రిలీజ్ తేదీ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 10న టాలీవుడ్ సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో ఆ రోజే పరాశక్తి విడుదల కానుందని ప్రకటించారు.
దీంతో ది రాజాసాబ్ రిలీజైన మరుసటి రోజే పరాశక్తి థియేటర్లకు రానుంది. విపరీతమైన పోటీ ఉన్న పొంగల్ బాక్సాఫీస్ వద్ద పరాశక్తికి థియేటర్లు ఎంతవరకు దొరుకుతాయో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న దళపతి విజయ్ జన నాయగన్ జనవరి 9న విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.
Coming to you, earlier than expected 🔥#Parasakthi - in theatres worldwide from January 10th, 2026 ✊
Get ready for a ride through history🚂#ParasakthiFromPongal#ParasakthiFromJan10@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @DawnPicturesOff… pic.twitter.com/OAPRBFsluh— Red Giant Movies (@RedGiantMovies_) December 22, 2025


