ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు | Vaibhavam And Maathru Movies OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movies: గతేడాది థియేటర్లలో.. ఇప్పుడు ఓటీటీల్లో

Feb 7 2026 3:32 AM | Updated on Feb 7 2026 3:32 AM

Vaibhavam And Maathru Movies OTT Streaming Now

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.

తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్‌లకి ఓ ప్రొఫెసర్‌కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement