breaking news
Maathru Movie
-
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్‌లకి ఓ ప్రొఫెసర్‌కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ. -
హృదయాన్ని కదిలించేలా ‘చూస్తున్నవేమో’ పాట
తల్లి సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకుని వచ్చిన పాటలన్నీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. అమ్మ ప్రేమను కీర్తించే టాలీవుడ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి మదర్ సెంటిమెంట్‌ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ‘మాతృ’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. ‘రా రాజా’ చిత్రంతో దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటిన బి. శివ ప్రసాద్, ఇప్పుడు ‘మాతృ’ సినిమాతో తన సినీ అభిరుచిని మరోసారి ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. మనసును ఆకట్టుకునే లిరికల్ వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు చిత్ర బృందం. తాజాగా, తల్లి కోసం పడే వేదనను హృదయస్పర్శిగా చూపించే ‘చూస్తున్నవేమో’ అనే ఎమోషనల్ పాటను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర స్వరకల్పన, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, కారుణ్య గాత్రంతో ఈ పాట పదే పదే వినాలనిపించేలా ఉంది. జాతీయ అవార్డు గ్రహీత అయిన సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం గుండెల్ని పిండేసేలా ఉండగా, కారుణ్య గొంతులోని ఆర్ద్రత శ్రోతలను భావోద్వేగంతో నింపుతోంది.ఈ అద్భుతమైన పాటను ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ప్రశంసించారు. హృదయాన్ని తడమగలిగిన ఈ పాటను మెచ్చుకుంటూ, ప్రస్తుత కాలంలో మదర్ సెంటిమెంట్‌పై సినిమాలు లేదా తల్లి ప్రేమను చాటే పాటలు అరుదుగా వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మాతృ’ టీంను అభినందిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.


