breaking news
Vaibhavam Movie
-
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్‌కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్‌లకి ఓ ప్రొఫెసర్‌కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ. -
టాలీవుడ్ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. సెన్సార్ పూర్తి
రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతోన్న చిత్రం వైభవం. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాకు సాత్విక్ దర్శకత్వం వహిస్తున్నారు. నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్కు క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వైభవం మూవీ ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. -
Vaibhavam Movie: ఆకట్టుకుంటున్న ‘పల్లె వీధుల్లోన’ సాంగ్
రుత్విక్ - ఇక్రా ఇద్రిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైభవం’. సాత్విక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ‘పల్లె వీధుల్లోన’ పాటను విడుదల చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తుచేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్ స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను సమకూర్చగా... రితేష్ జి రావు ఆలపించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.


