
రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతోన్న చిత్రం వైభవం. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాకు సాత్విక్ దర్శకత్వం వహిస్తున్నారు. నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వైభవం మూవీ ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.