బ్యాక్‌ టు బాలీవుడ్‌? | Priyanka Chopra returns to Bollywood with Krrish 4 after Telugu comeback with Rajamouli | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ టు బాలీవుడ్‌?

Feb 7 2026 12:45 AM | Updated on Feb 7 2026 12:45 AM

Priyanka Chopra returns to Bollywood with Krrish 4 after Telugu comeback with Rajamouli

బ్యాక్‌ టు బాలీవుడ్‌ అంటున్నారట హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా. ‘వైట్‌ టైగర్, లవ్‌ ఎగైన్, హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్, ది బ్లఫ్, జడ్జ్‌మెంట్‌ డే ’వంటి వరుస ఇంగ్లిష్‌ చిత్రాల తర్వాత ఇటీవల తెలుగు మూవీ ‘వారణాసి’ ఒప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. అయితే హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ ‘క్రిష్‌’ నుంచి ‘క్రిష్‌ 4’ చిత్రం రానుంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించనున్నారు హృతిక్‌ రోషన్‌. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందట. ఇందులో భాగంగానే ప్రియాంకా చోప్రాను సంప్రదించగా, ఆమె ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని భోగట్టా. ‘క్రిష్‌ 3, క్రిష్‌ 4’ చిత్రాల్లో ప్రియాంకా చోప్రా నటించారు. దీంతో ‘క్రిష్‌ 4’లో కూడా ఆమె నటిస్తే బాగుంటుందని హృతిక్‌ రోషన్‌ భావిస్తున్నారట. ‘క్రిష్‌ 4’ చిత్రానికి ప్రియాంక గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే, 2019లో వచ్చిన ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రం తర్వాత ప్రియాంకా చోప్రా హిందీలో అంగీకరించే చిత్రం ఇదే అవుతుంది. మరి... ‘క్రిష్‌ 4’తో ప్రియాంక బ్యాక్‌ టు బాలీవుడ్‌ అంటారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement
 
Advertisement
Advertisement