రామచంద్రపురంలో డ్యాన్స్ చేస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
సంక్రాంతి వేడుకల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ డ్యాన్సులు
మంత్రి పదవికే మచ్చ తెచ్చారని మండిపడుతున్న నెటిజన్లు
నేను ఇలాగే ఉంటానని సమర్థించుకున్న మంత్రి
సాక్షి టాస్క్‌ఫోర్స్: సంక్రాంతి సంబరాల పేరిట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా చేసిన డ్యాన్స్‌లు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏఎస్‌ఎన్ కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరిట మ్యూజికల్ నైట్‌లు, రికారి్డంగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుల్లితెర, జబర్దస్త్‌లో మహిళా క్యారెక్టర్లు వేసే నటులతో కలిసి మంత్రి సుభాష్ పండగ మూడు రోజులూ బహిరంగంగా చిందులు వేశారు.

ఆయనతో పాటు ఆయన తండ్రి వాసంశెట్టి సత్య కూడా డ్యాన్సులు వేయడం కొసమెరుపు. అయితే బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా రికారి్డంగ్ డ్యాన్సులు వేయడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటువంటి మంత్రుల వల్ల రాష్ట్రం పరువు పోతోందని తప్పు పడుతున్నారు. ఇది సరిపోదన్నట్టు తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్‌లపై మంత్రి స్పందించిన తీరు మరిన్ని విమర్శలకు దారి తీసింది. ‘‘నేను మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా నేను నేనుగానే ఉంటాను. ఇలానే ఉంటాను’’ అంటూ వింత ధోరణిలో సమర్థించుకోవడం గమనార్హం.


