హైదరాబాద్ : నగరంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి. అందమైన రంగ వల్లులు..అలంకరణలతో లోగిళ్లు కాంతులీనుతున్నాయి.
కుత్బుల్లాపూర్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీలో సోమవారం ‘సాక్షి’, నేతాజీ స్కూల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా అనూహ్య స్పందన లభించింది.
దాదాపు 155 మంది మహిళలు, చిన్నారులు, విద్యారి్థనులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులతో అలరించారు. చివరగా విజేతలకు బహుమతులు అందచేశారు.


