మంత్రి వాసంశెట్టి సుభాష్‌ బహిరంగ డ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు | Vasamsetti Subhash Vulgar Dance At Sankranthi celebrations | Sakshi
Sakshi News home page

మంత్రి వాసంశెట్టి సుభాష్‌ బహిరంగ డ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు

Jan 17 2026 11:48 PM | Updated on Jan 17 2026 11:48 PM

సంక్రాంతి సంబరాల పేరుతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ బహిరంగంగా చేసిన డ్యాన్స్‌లు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏఎస్‌ఎన్‌ కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరిట మ్యూజికల్‌ నైట్‌లు, డ్యాన్స్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా బుల్లితెర నటులు, జబర్దస్త్‌లో మహిళా క్యారెక్టర్లు వేసే నటులతో కలిసి మంత్రి సుభాష్‌ పండగ మూడు రోజులూ పలు పాటలకు బహిరంగంగా చిందులు వేశారు. ఆయనతో పాటు ఆయన తండ్రి వాసంశెట్టి సత్య కూడా డ్యాన్సులు కట్టారు. 

మంత్రిగా బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ ఇలా బహిరంగంగా డ్యాన్సులు చేయడంతో పాటు సినిమాల్లోని వెగటు పాటలకు మంత్రి చిందులు వేయడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటువంటి మంత్రుల వల్ల రాష్ట్రం పరువు పోతోందని తప్పు పడుతున్నారు. ఇది సరిపోదన్నట్టు తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్‌లపై మంత్రి స్పందించిన తీరు మరిన్ని విమర్శలకు దారి తీసింది. ‘నేను మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా నేను నేనుగానే ఉంటాను. ఇలానే ఉంటాను’ అంటూ వింత సమర్థనకు దిగారు

Advertisement
 
Advertisement
Advertisement