ఏపీలో సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
అయితే.. బస్టాండ్‌లలో బస్సుల కోసం ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు.
పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించుకుంది.
కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇలా ఉంది.
బస్సుల సంఖ్య తక్కువగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


