కుమారుడితో తొలి సంక్రాంతి.. వరుణ్‌తేజ్ దంపతుల పోస్ట్ వైరల్ | Varun Tej and Lavanya Tripathi Ssankranthi Celebratiions with son vaayu | Sakshi
Sakshi News home page

Varun Tej - Lavanya: వాయుతో తొలి సంక్రాంతి వేడుక.. వరుణ్‌తేజ్ దంపతుల పోస్ట్ వైరల్

Jan 16 2026 12:35 PM | Updated on Jan 16 2026 12:55 PM

Varun Tej and Lavanya Tripathi Ssankranthi Celebratiions with son vaayu

టాలీవుడ్ దంపతులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ముద్దుల కుమారుడితో తొలి సంక్రాంతి వేడుక జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలను షేర్ చేసింది ఈ జంట. వాయుతో ఫస్ట్ పండుగ కావడం మరింత స్పెషల్‌గా ఉందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.  

కాగా.. మెగా హీరో వరుణ్ తేజ్ రెండేళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్‌ 10న ఈ జంటకు బాబు పుట్టాడు. ఆ తర్వాత బారశాల వేడుక కూడా నిర్వహించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడి పేరుని బయటపెట్టారు. హనుమంతుడి  పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.

కాగా.. నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement