మరోవారం వచ్చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి హడావుడే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లు థియేటర్లలోకి చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా వచ్చేసింది. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతున్నాయి. వీటితో పాటు పలు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దండోరా, కాలంకావల్, గుర్రం పాపిరెడ్డి, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష‍్మి చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి రేపుతుండగా.. స్ట్రేంజర్ థింగ్స్ 5 మేకింగ్ వీడియో, తస్కరీ సిరీస్‌లు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ అందుబాటులోకి రానున్నాయంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 12 నుంచి 18వ వరకు)
అమెజాన్ ప్రైమ్
బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష‍్మి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 12
దండోరా (తెలుగు మూవీ) - జనవరి 14
నెట్‌ఫ్లిక్స్
స్ట్రేంజర్ థింగ్స్ 5 (మేకింగ్ వీడియో) - జనవరి 12
తస్కరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 14
సెవెన్ డయల్స్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 15
ద రిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16
హాట్‌స్టార్
ఇండస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12
డౌన్ టౌన్ అబ్బే: ద గ్రాండ్ ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 12
సోనీ లివ్
కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16
జీ5
గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16
భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16
ఆపిల్ టీవీ ప్లస్
హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16


