భోగి మంటలు.. పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించే సంకేతం. కేవలం సంప్రదాయం కాదు, ఆధ్యాత్మిక, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు సంకేతం. కానీ ఈ పవిత్ర ఆచారాన్ని కాలుష్య వేడుకగా మార్చే దృశ్యాలు ఈ ఉదయం కనిపిస్తున్నాయి. నిజానికి.. భోగి మంటల్లో ఏం కాల్చాలి.. ఏం కాల్చకూడదు అనేది మీకు తెలుసా?..
భోగి మంటల్లో వేయవలసినవి..
ఆవు పేడతో చేసిన పిడకలు.. ఇవి కాల్చినప్పుడు గాలి శుద్ధి అవుతుంది, క్రిములు నశిస్తాయి. ఎండిన ఆకులు, చెట్ల నుండి రాలిన కొమ్మలు.. సహజ సిద్ధమైనవి కావడంతో కాలుష్యం తక్కువ. పనికిరాని చెక్క వస్తువులు (పెయింట్ లేనివి).. పాతదాన్ని విడనాడి కొత్తదాన్ని ఆహ్వానించే సంకేతం. పాత నూలు దుస్తులు.. పాత ఆలోచనలను, వస్తువులను విడిచిపెట్టే ఆచారం. కొన్ని ధాన్యాలు, నెయ్యి.. హోమంలా భావించి వేయడం వల్ల గాలి పరిమళభరితం అవుతుంది.

భోగి మంటల్లో వేయకూడనివి..
ప్లాస్టిక్ వస్తువులు.. ఇవి విష వాయువులు విడుదలై ఆరోగ్యానికి హాని చేస్తాయి. రబ్బరు, టైర్లు.. కాల్చితే ఊపిరితిత్తుల సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. పెట్రోల్, కెమికల్స్.. అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. పెయింట్ చేసిన చెక్కలు.. విషపూరిత వాయువులు విడుదలవుతాయి.
భోగి మంటలు కేవలం సంప్రదాయం కాదు.. ఆధ్యాత్మిక, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు సంకేతం. కాబట్టి సహజ సిద్ధమైన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. పర్యావరణానికి హాని చేయని వస్తువులను మాత్రమే వేయడం మన బాధ్యత. ఇలా చేస్తే భోగి మంటలు నిజమైన శుభాన్ని, ఆరోగ్యాన్ని, పర్యావరణ రక్షణను అందిస్తాయి.


