breaking news
bhogi celebrations
-
మంచు మనోజ్ దంపతుల భోగి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పిల్లలతో ఈ పండుగను ఆనందగా జరుపుకున్నారు. ఇంటిముందు భోగి మంటలు వేసి భోగి వైబ్స్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. మంచు మనోజ్ గతేడాది మిరాయ్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా గతేడాది రిలీజైన భైరవం మూవీలోనూ మంచు మనోజ్ కనిపించారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు
-
భోగి మంటల్లో కూటమి మేనిఫెస్టో.. పోలీసుల వాగ్వాదం
-
బొత్స ఇంటి వద్ద భోగి సంబరాలు
-
Guntur: చిన్నారులతో YSRCP నేతల భోగి సంబరాలు
-
ఉష శ్రీ చరణ్ భోగి సంబరాలు
-
CPI leaders: భోగి మంటల్లో సర్కార్ జీవోల దగ్ధం
-
Bhogi : రోజా ఇంట సంక్రాంతి సందడి
-
భోగి సంబరాల్లో విడదల రజిని
-
పేర్ని నాని భోగి సంబరాలు
-
యర్రగొండపాలెంలో కాకాణి సంక్రాంతి సంబరాలు
-
తాడేపల్లి YSRCP కార్యాలయంలో భోగి సంబరాలు
-
YS అవినాష్ రెడ్డి భోగి సంబరాలు
-
నా డ్యాన్స్ క్రేజ్ కు పవనే కారణం.. అంబటి అదిరిపోయే సెటైర్లు
-
Bhogi Celebrations : అంబటి మాస్ డ్యాన్స్
-
అంబటి రాంబాబు భోగి డ్యాన్స్ 2026
-
చెడును దహనం చేసేది భోగి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు.మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026 -
‘ఫ్రీ’ బాబు మాటలు నమ్మొద్దు: ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు: సంక్రాంతి అంటే రైతులు సంతోషంగా జరుపుకునే పండగ అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని నమ్మిన వారు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే నేడు వైఎస్ జగన్ అని అన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలోని తన నివాసం వద్ద భోగి సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. రైతులకు 20వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతులు పండగ జరుపుకునే పరిస్థితి లేదు. చిత్తూరు జిల్లాలో 40 వేల మంది మామిడి రైతులకు 400 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నాళ్లు రైతులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు, రైతులకు ఏం మేలు చేస్తారు?. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని వైఎస్సార్, వైఎస్ జగన్ నమ్మారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినా చంద్రబాబు ఒక్క మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి వారికి మేలు చేస్తున్నారు. చంద్రబాబు ఉచితం అనే మాటలను నమ్మవద్దు అంటూ ప్రజలకు హితవు లిపాకరు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. -
గుంటూరులో అంబరాన్నంటిన భోగి సంబురాలు
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం వేకువ జామున ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన.. తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. నేను ఎక్కడుంటే.. అక్కడే సంబురాలు చేయాలి. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నా. కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నా. సంక్రాంతి సంబురాలు చేస్తాను.. డ్యాన్సులు చేస్తాను కాబట్టి సంబురాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారు. అలా మాట్లాడేవాళ్లు ఆ పని చేయలేరు. ఎందుకంటే నేను పొలిటీషియన్‌ను.. వాళ్లు కాదు కాబట్టి’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అంబటి నేరుగా చురకలంటించారు.మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలి. ఆ జీవోను ఉపసంహరించుకునేంత దాకా మా పోరాటం కొనసాగుతుంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలడం ఖాయం అని అంబటి అన్నారు. -
భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో
సాక్ష, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు వైవిధ్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం ఇచ్చిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి బాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన చెబుతున్నాయి. ఈ నిరసనల్లో అటు వామపక్ష పార్టీలు సైతం పాల్గొన్నాయి.పనికిరాని వస్తువులన్నీ ‘భోగి’ మంటల్లో వేస్తున్నాం. కూటమి ప్రభుత్వ అహం తొలగిపోవాలని కోరుకున్నాం. ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి కాల్చాం. వెంటనే ఆ జీవోను వెనక్కు తీసుకోవాలి. లేదంటే మరింతగా ప్రజా ఉద్యమాలు చేపడతాం అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. వైయస్సార్ జిల్లా కేంద్రంలో.. జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పరిశీలకుడు సురేష్ బాబు, మేయర్ పాకా సురేష్ పాల్గొన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.తెలుగువారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. మెడికల్ కాలేజీల పిపిపిని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం. ఈ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను పక్కనపెట్టేసింది. ప్రతీ అంశంలోనూ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పన్నులు,సెస్ లు వేసి ప్రజల పై భారాలు మోపుతోంది. ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి అర్హత లేదు అని విష్ణు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో.. మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు ,హరిదాసులు గంగిరెద్దులతో ఘనంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారాయన. కూటమి హయాంలో కేవలం చంద్రబాబు కుటుంబం రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని.. కొత్త సంవత్సరంలోనైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా.. మెడికల్ కళాశాలల పిపిపి జీవో ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేశారు.ప్రకాశం జిల్లా భోగి వేడుకల్లో.. చీమకుర్తిలోని తన నివాసం వద్ద నిరవహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేదలకు ఉపయోగ పడే విధంగా ప్రభుత్వమే 17 మెడికల్ కాలేజీ లను నిర్మించడానికి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్‌కు మంచి పేరు వస్తుంది అని ప్రవేటు వారికి దారదత్తం చేయడానికి మెడికల్ కాలేజీ లను పీపీపీ విధానంలో కి మార్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకొని మెడికల్ కాలేజీ లను ప్రభుత్వమే నిర్మించాలి అని డిమాండ్ చేశారు. వైయస్సార్ జిల్లా పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గృహం వద్ద భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో కాపీలను భోగిమంటల్లో వేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. జిల్లా ప్రజలకు భోగి , మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.చిత్తూరు జిల్లా నగరిలో తన నివాసం వద్ద ఆర్కే రోజా భోగి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ‘‘కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు సంతోషం జరుపుకునే పండుగ ఇది, 20 వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని సంతోషంగా నమ్మిన వారు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. నాలుగుసార్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకు రాలేదు. కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ప్రవేట్ మెడికల్ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపిన రోజా.. ఫ్రీ ఫ్రీ అనే ఫ్రీ బాబు మాటలు నమ్మవద్దు అని రాష్ట్ర ప్రజలను కోరారు. సీపీఐ ఆధ్వర్యంలో.. విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం వద్ద భోగి మంట వేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో శ్రేణులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలు మంటల్లో వేశారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి.. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించాలి అంటూ నినాదాలు చేశారు. జీవో 590, 847 రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ.. ఏకంగా కూటమి మేనిఫెస్టోని భోగిమంటల్లో వేసిన ఏఐవైఎఫ్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3,000, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటూ చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
భోగి మంటల్లో ఏం వేయాలి.. ఏం వేయకూడదో తెలుసా?
భోగి మంటలు.. పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించే సంకేతం. కేవలం సంప్రదాయం కాదు, ఆధ్యాత్మిక, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు సంకేతం. కానీ ఈ పవిత్ర ఆచారాన్ని కాలుష్య వేడుకగా మార్చే దృశ్యాలు ఈ ఉదయం కనిపిస్తున్నాయి. నిజానికి.. భోగి మంటల్లో ఏం కాల్చాలి.. ఏం కాల్చకూడదు అనేది మీకు తెలుసా?.. భోగి మంటల్లో వేయవలసినవి.. ఆవు పేడతో చేసిన పిడకలు.. ఇవి కాల్చినప్పుడు గాలి శుద్ధి అవుతుంది, క్రిములు నశిస్తాయి. ఎండిన ఆకులు, చెట్ల నుండి రాలిన కొమ్మలు.. సహజ సిద్ధమైనవి కావడంతో కాలుష్యం తక్కువ. పనికిరాని చెక్క వస్తువులు (పెయింట్ లేనివి).. పాతదాన్ని విడనాడి కొత్తదాన్ని ఆహ్వానించే సంకేతం. పాత నూలు దుస్తులు.. పాత ఆలోచనలను, వస్తువులను విడిచిపెట్టే ఆచారం. కొన్ని ధాన్యాలు, నెయ్యి.. హోమంలా భావించి వేయడం వల్ల గాలి పరిమళభరితం అవుతుంది.భోగి మంటల్లో వేయకూడనివి.. ప్లాస్టిక్ వస్తువులు.. ఇవి విష వాయువులు విడుదలై ఆరోగ్యానికి హాని చేస్తాయి. రబ్బరు, టైర్లు.. కాల్చితే ఊపిరితిత్తుల సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. పెట్రోల్, కెమికల్స్.. అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. పెయింట్ చేసిన చెక్కలు.. విషపూరిత వాయువులు విడుదలవుతాయి.భోగి మంటలు కేవలం సంప్రదాయం కాదు.. ఆధ్యాత్మిక, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు సంకేతం. కాబట్టి సహజ సిద్ధమైన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. పర్యావరణానికి హాని చేయని వస్తువులను మాత్రమే వేయడం మన బాధ్యత. ఇలా చేస్తే భోగి మంటలు నిజమైన శుభాన్ని, ఆరోగ్యాన్ని, పర్యావరణ రక్షణను అందిస్తాయి. -
భోగభాగ్యాల భోగి పండుగలో ఇంత ఆంతర్యం ఉందా..?
మనకు వచ్చే అనేక పండుగలలో ‘భోగిపండుగ’ను చాలా విశేషంగా చేసుకుంటాం. భోగం అనుభవించుట అంటే, సుఖం అనుభవించుట అని అర్థం. ఈ భోగి పండుగ బాహ్యంలో చూస్తే, శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని, చేకూర్చేటటువంటి రోజు గనుక, దానికి భోగిపండుగ అని పేరు. ఈ ‘భోగి పండుగ’ వచ్చే సమయానికి, వ్యవసాయదారులు పంటలు కోతలు కోస్తారు. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన పంట జాగ్రత్తగా ధాన్యాగారంలో నిలవ చేసి, మళ్ళీ పంట వచ్చే పర్యంతము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ, సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించిన కారణం చేత లభించినటువంటి ధనంతో, సుఖాలను అనుభవిస్తారు.భోగిపండుగ అని పిలవడానికి కారణం ఏమిటంటే, మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యం అంతా వచ్చేటటువంటి కాలం.ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా ఉండే భోగి పండుగ, బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి కాలం ప్రారంభం అవడానికి సంకేతం. నిజానికి ఇది బాహ్యమునందు భోగి. ఆంతరముగా విచారణ చేస్తే, భోగి పండుగకు ఉన్న విశేషం చాలా చాలా గొప్పది. దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్టచివరి రోజు ఏదైతే ఉందో, మకర సంక్రాంతికి ముందు ఉండే రోజు, భోగి పండుగ. ఈ తిథినాడు భోగిపండుగ రావాలి అనే నిర్ణయం ఉండదు.మనిషి ఆంతరముగా భోగం అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని పొందుతాడు. విడుదలయే మోక్షము. అటువంటి మోక్షాన్ని పొందడమే, జీవితంలో నిజమైన భోగి. అటు ఆధ్యాత్మికంగా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి, కావలసిన కాలం అయి ఉండడం ఒక ఎత్తు. లౌకికమైన కోరికలకు దూరంగా ఉండి, ఆంతరమునందు భగవంతుడి దగ్గరగా ఈశ్వరకాలం పెంచుకుంటాం అని చెప్పడానికి సూచనగా, భోగిమంటలు వేస్తారు. అందులో కట్టెలు, ఆవుపేడతో చేసిన పిడకలు వేస్తారు. అంటే దాని అర్థం లౌకిక కామాన్ని కాల్చేసి, ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాం అని. బాహ్యంలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సంపత్తిని, పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం. ఆ భోగి లౌకిక కామన కాలిపోయి, ఈశ్వర కామన ఒక్కటే మిగిలిపోతే, ఆ ఈశ్వర కామమే నిరతిశయ భక్తిగా మారితే , ఆ భక్తి వలన చేసిన కర్మాచరణం చేత, చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే, పాత్రత వలన జ్ఞానము కలిగితే, జ్ఞానము వలన భోగి. భోగి అంటే ఈశ్వరునితో భోగించుట. అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది. దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి, సిద్ధిని ప్రకటనం చేసేటటువంటి రోజుగా చెప్పబడే విశేషమైన తిథి గనుక, దానికి ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చేయరు. దక్షిణాయనానికి చిట్టచివరి రోజు ఏది ఉంటుందో, అదే మనకి భోగి పండుగగా నిర్ణయించారు పెద్దలు.ఈ భోగిపండుగ నాటికి అమ్మవారి అనుగ్రహం, రేగు పండులోకి ప్రవేశిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించడానికి, వాళ్ళు కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు నిర్వహించలేరు గనుక, చిల్లర పైసలు, బంతిపూలు, రేగుపండ్లు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు కలిపి పెద్దవాళ్ళు పిల్లలను కూర్చోబెట్టి, వాళ్ళ మీదనుంచి ఈ పదార్థాలను విడిచిపెడతారు.ఈ పదార్థాలు వాళ్ళ తలమీంచి క్రిందకు పడిపోతే, భోగిపీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి, ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చే అవకాశం ఉంటుందో, అటువంటి అవకాశం తొలగిపోయి, వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే భోగిపీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగిపండుగ.తప్పక ఆచారించాల్సినవి..ఉదయం బ్రాహ్మీ ముహర్తంలో (4.00 నుంచి 5.00) భోగిమంటలు వేయాలి.ఇంటికి తూర్పు లేదా ఉత్తరంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముగ్గువేసి వాటిపై కర్రలు పేర్చాలిఇంటిలోని పాతచెక్క ముక్కలను, రావి, మామిడి, మేడి చెట్ల కర్రలను ముఖ్యంగా ఆవు పిడకలు పెట్టి కర్పూరంతో భోగిమంటలు వేయాలి.అగ్నిని ధైవంగా భావిస్తాం కాబట్టి భోగిమంటలలో కొద్దిగా పసుపు, కుంకుమ అక్షతలు వేసి, నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేయాలి. అలాగే భోగిమంట దగ్గర ఒక బిందె నీళ్లు పెట్టాలి. చివరలో మంట తగ్గిన తర్వాత ఆ బిందె నీళ్లను స్నానం చేసే నీళ్లలో కలుపుకుని ఇంటిల్లపాది స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు పోతాయి. హరిదాసు వస్తే ఆయనని కూడా భోగి మంట చుట్టూ తిరిగి మీ ఇంటికి సుఖశాంతులు కలుగచేయమిన కోరండి.చివరగా భోగిమంట అయిపోయిన తర్వాత నీటితో పూర్తిగా ఆర్పి..ఆ మిగిలిన బూడిదను పారబోయకుండా నుదిటన తిలకంగా ధరిస్తే దృష్టి దోషాలు తొలిగిపోతాయి. (చదవండి: హై-రైజ్ పెయింటర్..! ఇది కదా సంపాదన అంటే..) -
కూతురికి తొలి భోగి పండగ.. సంజనా ఎమోషనల్
బుజ్జిగాడు సినిమాలో యాక్ట్ చేసిన సంజనా గల్రానీ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. మధ్యలో డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడంతో తన ఇమేజ్ డ్యామేజ్ అయింది. తనకు ఆ కేసులో క్లీన్చిట్ వచ్చినప్పటికీ తన ఆత్మగౌరవం దెబ్బతిందని బాధపడింది. ఆ మరకు పోగొట్టుకునేందుకు బిగ్‌బాస్ షోను ఎంచుకుంది. తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టింది.బిగ్‌బాస్ షోలో..చిలిపితనం, ముక్కుసూటితనంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుడ్డు దొంగతనంతో సీజన్‌పై బజ్ క్రియేట్ చేసిన ఆమె ఏకంగా ఫైనల్స్‌లో అడుగుపెట్టడం విశేషం. ఈ షో కోసం తన ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసింది. ఆరేండ్ల కుమారుడు అలరిక్‌ను, ఏడాది కూడా నిండని పాపను భర్తకు అప్పజెప్పి బిగ్‌బాస్ షోలో పాల్గొంది. లోలోపల ఎంత కుమిలిపోయినా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేది. సంజనా కూతురికి భోగి పండ్లుతాజాగా ఓ సంక్రాంతి ఈవెంట్లో సంజనా కూతురికి దువ్వాడ మాధురి, శ్రీముఖి, రోహిణి భోగి పండ్లు పోశారు. అందులో సంజనా పాప ఎంతో క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది. ఆ చిన్నారి ముందు పుస్తకం, స్టెతస్కోప్, మేకప్ వంటి సామాను పెడితే.. మేకప్ సామానునే పట్టుకుంది. అంటే తల్లి దారిలో నడవనున్నట్లు సిగ్నల్స్ ఇచ్చిందన్నమాట! ఈ సందర్భంగా సంజనా భావోద్వేగానికి లోనైంది. అదే నా సక్సెస్'చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లు అనిపిస్తోంది. ఇప్పటికీ ఇదంతా కలా? నిజమా? అర్థం కావడం లేదు. ఇంత చిన్న పాపను పెట్టుకుని బిగ్‌బాస్‌కు వెళ్లడమేంటి? ప్రతిరోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తూ నిద్రపోయేదాన్ని. టాప్ 5వరకు వెళ్లాను. ఇప్పుడు మీ అందరితో ఇక్కడున్నాను.. ఇదే నా విజయం' అని సంజనా చెప్పుకొచ్చింది.చదవండి: ప్రభాస్‌కు కలిసిరాని ఆర్ అక్షరం -
శిల్పారామం, కూకట్పల్లి మలేషియా టౌన్షిప్లో భోగి వేడుకలు (ఫోటోలు)
-
కూసుమంచి భోగి వేడుకల్లో పాల్గొన్న పొంగులేటి దంపతులు
-
కడపలో భోగి సందడి.. వేకువజామునే ఆట, పాటలతో చిందులు (ఫోటోలు)
-
పల్లెల్లో భోగి పండగ సందడి
-
ఊరూ వాడా భోగి సంబురం (ఫొటోలు)
-
భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబం
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇవాల్టి నుంచే భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురూ అయింది. నగరాలు బోసివేతున్న వేళ.. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ పొంగల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా సినీ నటుడు మోహన్ బాబు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయాలకు, విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగని మోహన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.భోగి వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ..'సాంప్రదాయాలకు, విలువలకు ప్రతీక సంక్రాంతి. రైతు సుభిక్షంగా ఉంటేనే సంక్రాంతి వేడుకగా జరుపుకుంటా. సంతోషంగా జరుపుకునే ఈ పండుగ వేళ ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి' అని అన్నారు. భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుకు రంగంపేట ఫేమస్.. అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని మంచి విష్ణు సూచించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు..
సాక్షి, హైదరాబాద్/తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండుగ వేడుక సంబరాల్లో ప్రజలు పాల్గొన్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సంబరాలు చేసుకున్నారు. ప్రజలు భోగి శుభాకాంక్షలు తెలిపారు.నగరిలో మాజీ మంత్రి రోజా ఇంటి వద్ద భోగి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ కుటుంబ సభ్యులతో సందడి చేశారు. అటు విశాఖ నగరంలో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకుంటున్నారు.విజయవాడలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. బీసెంట్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తెలుగు వారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు . వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకున్నారు. కానీ, ఈరోజు ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ప్రజలంతా ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతికి ప్రజలకు నిరాశ, నిస్పృహలను మిగిల్చింది. ఎన్నికల ముందు కూటమి అనేక హామీలిచ్చింది. ఇప్పుడు కరెంట్, నిత్యవసర ధరల పెంచేసి ప్రజలపై భారం మోపిందన్నారు. ఇటు తెలంగాణలో సహా భోగి పండుగ వేడుకల్లో ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామునే భోగీ మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు.. నగరవాసులంతా పల్లెలకు తరలి వెళ్లడంతో గ్రామాల్లో వేడుకలు మరింత ఘనంగా జరుగుతున్నాయి. -
జగన్ ముందే జగన్ మిమిక్రీ..
-
ఏలూరులో ఘనంగా భోగి, సంక్రాంతి వేడుకలు
-
Live: సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
-
హైదరాబాద్ లో భోగి సంబరాలు
-
విశాఖలో భోగి సంబరాలు
-
భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రలో ఈ పండుగ హడవిడి మాములుగా ఉండదు. వీధులన్నీ రంగవల్లులతో కొత్త కోడళ్లు, అల్లుళ్లతో సందడిగా ఉంటుంది. ఓ పక్కన కోడి పందేల జోరు, మరోవైపు నోరూరించే రకరకాల పిండి వంటలు రుచులుతో వాతావరణం అంతా ఆహ్లాదభరితంగా మారిపోతుంది. ఎంతెంత దూరాన ఉన్న ఈ పండుగ వస్తే ఊళ్లకే వచ్చేస్తారు అందరూ. అలాంటి ప్రాముఖ్యత గల ఈ పండుగల్లో మొట్టమొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు చలిమంటలు ఎందుకు వేస్తారు?. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం!. భోగి అనే పేరు ఎలా వచ్చిందంటే.. 'భగ' అనే పదం నుంచి 'భోగి' అనే మాట వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి అఖరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఎందుకంటే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. పురాణ ప్రకారం చూస్తే..పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని అందుకు సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ!. భోగిమంటలు ఎందుకంటే.. అందరూ అనుకుంటున్నట్లు చలికాలం కనుక వెచ్చదనం కోసం ఈ చలిమంటలు వేసుకోవడం లేదు. ఆరోగ్యం కోసం అనే చెప్పాలి. ఎందుకంటే..? ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు అధికంగా గాల్లో విడుదలవుతుంది. అది పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అదీగాక ఈ చలికాలంలోనే అనేక వ్యాధులు ప్రబలంగా వస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఈ భోగిమంటలు పెద్దగా వచ్చేలా రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులను వేస్తారు. అవి బాగా కాలేలా ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. అలా అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాములు దేశీ ఆవునెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణ వాయువు విడుదల అవుతుంది. ఈ ఔషధ మూలికలు, ఆవునెయ్యి, ఆవు పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలికి అత్యంత శక్తి ఉంటుంది. ఈ గాలి మన శరీరంలో ఉన్న 72 వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే తగిన ఔషధం ఇవ్వోచ్చు. అదే అందరికీ ఇవ్వడం కాస్త కష్టం, పైగా అసాధ్యం కూడా. వైద్యం చేయించుకోలేని పేదవాళ్లు కూడా ఉండొచ్చు. ఇదంతా ఆలోచించే మన పెద్దలు అందరూ కలిసి భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ పాల్గొనేలా సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచే వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదీగాక కులాలకు అతీతంగా ఈ పండుగ పేరుతో అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి ఐక్యమత్యానికి శ్రీకారం చుడుతుంది. అంత మహిమాన్వితమైన ఈ భోగి పండుగ రోజును మీ లోగిళ్లో భోగిమంటలు వేసుకుని పెద్దచిన్న అంతా పాల్గొని ఆయురారోగ్యాల పొందడమే గాక భోగభాగ్యాలు కలిగేలా ఆనందంగా ఈ పండుగ జరుపుకోండి. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!) -
అంబటి భోగి డ్యాన్స్...
-
మంత్రి రోజా ఇంట్లో సంక్రాంతి సంబరాలు
-
భోగి వేడుకలు.. డ్యాన్సులతో మంత్రి అంబటి సందడి
సాక్షి, గుంటూరు: ఊరూవాడ సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. సత్తెనపల్లిలో భోగి వేడుకలు ఘనంగా జరిపారు. సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. పముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. డ్యాన్సులు వేసి సందడి చేశారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, సంక్రాంతి కోసం ప్రత్యేకంగా తన పేరుతో పాటలు రాయించానని తెలిపారు. ‘‘గతంలో డ్యాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అని విమర్శించారు. అందుకే సంబరాలు రాంబాబు అనే పేరుతో పాట రాయించాను. సంక్రాంతి వస్తే నేను సంబరాలు రాంబాబునే. సంక్రాంతి ముగిసిన తర్వాత అసలైన రాజకీయ నాయకుడిని.. టీడీపీ, జనసేన ఆనైతికంగా పొత్తును కుదుర్చుకున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీలను భోగిమంటల్లో వేసి తగలపెడతారు’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి వేడుకల్లో మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైసీపీ ఇంఛార్జి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) పాల్గొన్నారు. విజయవాడలోని క్రీస్తు రాజపురం 5వ డివిజన్ లో భోగి సంబరాల్లో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, కార్పొరేటర్లు , వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్ లో తెల్లవారుజామున భోగి వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు
-
ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భోగి, ఉత్తరాయణ పర్వదినాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలకు ఉత్తరాయణ, భోగి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజులు అందరికీ సంతోషాన్ని, శుభాలను కలుగజేయాలని, జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను’అని ఆయన ట్వీట్లు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భోగి పండుగను, ఉత్తరాయణం సందర్భంగా గుజరాత్ తదితర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తారు. -
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా కైట్ ఫెస్ట్ వల్
-
విశాఖలో భోగి సంబరాలు (ఫొటోలు)
-
కేబీఆర్ పార్క్ వద్ద భారత జాగృతి భోగి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దుపొద్దున్నే ముగ్గులతో ఆడపడుచులు, భోగి మంటలతో ఆడిపాడుతున్నారు అంతా. ఇక కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు. Telangana | BRS MLC K Kavitha participated in the Bhogi celebrations organised by Bharat Jagruthi at KBR park in Hyderabad. pic.twitter.com/n31mFG4Sxy — ANI (@ANI) January 14, 2023 -
భోగి వేడుకల్లో.. మంత్రి అంబటి హుషారు స్టెప్పులు
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారక ముందు నుంచే భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో సంబరాలు ప్రారంభించుకున్నారు ప్రజలు. ఇక.. జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. తన ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలు చేశారాయన. ఆపై గిరిజనులతో కలిసి స్టెప్పులు వేసి ఆటపాటల్లో పాల్గొన్నారాయన. వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. అక్కడున్న వాళ్లను హుషారెత్తించారు మంత్రి అంబటి. -
సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
-
భోగభాగ్యాల భోగి..
-
భోగి వేడుకల్లో మెగా ఫ్యామిలీ...
-
మలేషియా టౌన్ షిప్లో భోగి సంబరాలు
-
సీఎం వైఎస్ జగన్ భోగి పండగ శుభాకాంక్షలు
-
కళాకారులకు సీఎం జగన్ ఆశీస్సులు
-
సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
-
కుటుంబంతో కలిసి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి భోగి సంబరాలు
-
సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
CM YS Jagan To Attend In Sankranthi Celebrations: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఆయన సతీమణి భారతితో కలిసి ప్రారంభించారు. తెలుగుదనం ఉట్టిపడేలా అచ్చ తెలుగు పంచెకట్టుతో ఆయన గోశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. మేళ తాళాల మధ్య వేద పండితులు పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సీఎం దంపతులు గోపూజ నిర్వహించి, గో సేవ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. దాదాపు గంటన్నర సేపు సీఎం దంపతులు వేడుకలను తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ.. చదవండి: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు? ఆకట్టుకున్న గోశాల ప్రాంగణం: గ్రమీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గోశాలను తీర్చిదిద్దారు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తులసి కోట, ధాన్యపు రాశులు, చెరుకు గడలు, రంగవల్లులు, ముత్యాల ముగ్గులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, డోలు వాద్యాలు, కోలాటాలు, హరిదాసులు, గంగిరెద్దులు, అరిసెల వంటకాలతో ఆ ప్రాంతం పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టింది. కోలాటం, డోలు విన్యాసాలు, గంగిరెద్దుల విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఆలపించిన సంక్రాంతి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరిదాసుకు సీఎం దంపతులు బియ్యం అందజేశారు. గోమాతకు పసుపు కుంకుమ సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు ప్రదర్శన ఇచ్చిన చిన్నారులు, కళాకారులను ఆశీర్వదించి ముఖ్యమంత్రి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అర్చకులు సీఎంకు దేవుడి చిత్రపటాన్ని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరో చిత్ర పటాన్ని అందజేశారు. కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కర్నూలులో ఘనంగా భోగి సంబరాలు
-
విశాఖ శారదాపీఠంలో భోగి వేడుకలు
-
భోగి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు డాన్స్
-
భోగి సంబరాల్లో పాల్గొన్న సినీ నటుడు బాలకృష్ణ
-
కుటుంబ సభ్యులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు
-
భోగి సంబరాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్
-
Sankranti 2022 : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
మంత్రి పేర్ని నాని నివాసంలో భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో పాల్గొన్న విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్
-
విజయవాడలో ఘనంగా భోగి సంబరాలు
-
కాకినాడలో ప్రారంభమైన భోగి సంబరాలు
-
చీపురు, చాట మంటల్లో వేయండి.. 'వాట్స్ దట్ చాట్ తాతా?'
భోగి పండగ రోజు సాధారణంగా అందరూ ఏం చేస్తారు. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి, ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుని, అంతా ఆరుబైటకు చేరి, భక్తితో భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల కోసం దైవ నామస్మరణ చేస్తూ, ఆవుపేడ పిడకలను, సమిధలను పెట్టి, కర్పూరంతో అగ్నిని రగిలిస్తారు. అగ్నిదేవుడిని ప్రార్ధిస్తారు. ఆ మంటలు కాస్త పెరిగాక, ఇంట్లో ఉన్న పాత సామాన్లను, అక్కర్లేని చెక్కముక్కలను అన్నింటినీ ఆ మంటల్లో వేస్తారు. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరటం కనిపిస్తుంది. మంచు ఫ్యామిలీ కూడా భోగి పండగను జరుపుకుంది. మోహన్‌బాబు కుటుంబం అంతా వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. చీపురు, చాటలు, పాత వస్తువులు మంటల్లో వేయండని మోహన్‌బాబు చెప్తుండగా అతడి మనవరాలు వాట్స్ దట్ చాట్? (చాట అంటే ఏంటి?) అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న విని బిత్తరపోయిన ఆయన నీకు చాట అంటే తెలీదా అంటూనే దాని గురించి వివరంగా చెప్పేందుకు ప్రయత్నించాడు. మంచు విష్ణు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు చాట అంటే తెలీకపోవడమేంటో అని కామెంట్లు చేస్తున్నారు. -
ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు
-
భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా
-
విశాఖపట్నంలో ప్రారంభమైన భోగి సంబరాలు
-
కూకట్ పల్లిలో భోగి సంబరాలు
-
Sankranti Festival Celebrations 2022 : సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival 2022 Celebrations: ఊరంతా సంక్రాంతి
-
Sankranti 2022: సంక్రాంతి శోభ
-
Sakshi TV Exclusive :సంక్రాంతి సందడంతా సాక్షిలోనే
-
బంగార్రాజు సంక్రాంతి బరిలోకి దిగితే.. ఖేల్ ఖతం త్వరలో...
-
కనుమ అంటే..‘ముక్క’ పడాల్సిందే..తగ్గెదేలే త్వరలో...
-
చార్మినార్ భోగీ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
-
సింహాచలం ఆలయంలో భోగి వేడుకలు
సాక్షి, సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ నరసింహ దేవస్థానం ప్రాంగణంలో అత్యంత వైభవంగా భోగి పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి శాస్త్రోత్కంగా పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. చెడు గుణాలు ప్రాలదోలి... మంచి గుణాలను పొందాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామిజీ.. వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వాత్మానంద్రేద్ర స్వామికి ఆలయ ఈవో వెంకటేశ్వరరావు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామికి వరాహ నరసింహ స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు పొందారు. -
భక్తి శ్రద్ధలతో భోగి
-
పల్లెల్లో ఆరంభమైన భోగి సందడి
-
అనపర్తిలో వైభవంగా సంక్రాంతి వేడుకలు
-
వైజాగ్‌లో భోగి సంబరాలు
-
పశ్చిమ గోదావరిలో ఘనంగా భోగి సంబరాలు
-
తెలుగు రాష్త్రాల్లో వెల్లి విరిసిన భోగి వెలుగులు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సంబరాలు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి.. తెలుగువారికి ప్రీతికరమైన పండుగ. మూడు రోజుల ఈ పండుగలో మొదటది భోగి. ఈ భోగి పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే తమ ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నారు. పాత చీడలన్నీ పోయి... జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని భగవంతుడిని ప్రార్థించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పోలీస్ గ్రౌండ్లో యువకులు భోగి మంటలు వేసుకుని పండుగ జరుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో భోగభాగ్యాల భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పవిత్రమైన ఉత్తరాయణ ఘడియలను వెంట పెట్టుకుని వస్తున్న భోగిని ఊరువాడా భక్తిశ్రద్ధలతో ఆహ్వానించారు. మంచుతెరల పరదాలను పక్కకు నెడుతూ తెల్లవారుజామునే భోగిమంటలు వేసుకున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలో భోగి పండుగ కనులవిందుగా జరిగింది. అలాగే రాజమండ్రిలో భోగి పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ భోగి... భోగభాగ్యాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకున్నారు. విశాఖలో భోగి సంబరాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఇళ్లముందు భోగి మంటలు వేశారు. పాత వస్తువులను మంటల్లో దహనం చేసి కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా విజయనగరంలో పల్లె వాతావరణం ఉట్టిపడుతోంది. అపార్ట్మెంట్ల కల్చర్‌లోనూ భోగి పండుగను అంతా కలిసి మెలిసి జరుపుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మలేషియన్ టౌన్ షిప్లో భోగి పండుగను జరుపుకున్నారు. భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేశారు. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. నగరంలో ప్రతి ఏరియాలో భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. నగర ప్రజలు భోగి పండుగను భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కేబీఆర్ పార్క్‌లో జరిగిన భోగి మంటల వేడుకలో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. గతాన్ని భోగి మంటల్లో కాల్చేద్దాం.. కొత్త ఆశలు, ఆశయాలను ఆహ్వానిద్దామని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. -
ఊరూరా భోగి సందడి
నేడు సంక్రాంతి పండగ నెల్లూరు(అర్బన్): సంక్రాంతి సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటుతున్నారుు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరూరా భోగి పండగను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భోగి సందడి ప్రారంభమైంది. తాటి ఆకుతో పాటు పాతచీపుర్లు, పాత కాగితాలు, సామగ్రితో భోగి మంటలు వేశారు. ఒకరితో ఒకరు పోటీ పడటంతో మంటలు ఆకాశాన్ని అంటారుు. నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాళెం, వింజమూరుతో పాటు ప్రతి పల్లెలో వేకువ నుంచే భోగి సందడి కనిపించింది. మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నా జనం లెక్కచేయక మంటలు వేసి చలిని తరిమికొట్టారు. దాదాపు ప్రతి చోట యువకులు, పిల్లలు బృందాలుగా ఏర్పడి భారీ ఎత్తున మంటలు వేశారు. పల్లెల్లోని కూడళ్లలో అరుుతే పండగ సందడి మరింత ఎక్కువ కనిపించింది. సంప్రదాయంలో భాగంగా చిన్నారులకు భోగిపండ్లు పోయడంతో పాటు శనగలు, పూలు, చెరకు ముక్కలు, నాణేలతో ఆశీర్వదించి దిష్టి తీశారు. అపార్ట్మెంట్ వాసులు సామూహిక భోగి మంటలను వేసుకుని సందడి చేశారు. గొబ్బిపాటలతో పల్లెలు మార్మోగాయి. నెల్లూరులోని బాలాజీనగర్‌లో చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసులు కీర్తనలు ఆలపించడం పండగకు ప్రత్యేక శోభ తెచ్చాయి. తాటాకు ధరకు రెక్కలు భోగి పండగలో కీలకమైన తాటాకు ధర చుక్కలనంటింది. గతంలో గ్రామాల్లో తాటిచెట్లు భారీగా ఉండేవి. ప్రధానంగా జిల్లాలోని తీరప్రాంతంలో తాటి తోపులు విస్తారంగా కనిపించేవి. ఇటీవల కాలంలో వెనామీ సాగు జోరందుకోవడం, పలు పరిశ్రమలు ఏర్పాటవడంతో తాటిచెట్లు నేలకూలారుు. ఈ క్రమంలో తాటకు ధర భారీగా పెరిగింది. 20 ఆకులు కూడా లేని కట్టను రూ.200 వరకు విక్రరుుంచారు. దీంతో నగర, పట్టణ వాసులకు పండగ ఖర్చు కొంత పెరిగింది. ప్రధాన కూడళ్లలో కనిపించే పెద్దపెద్ద మొద్దుల స్థానంలోనూ టాటాకులే కనిపించారుు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా... తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతి. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. పల్లెల్లో గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నత్యాలు కనులవిందు చేస్తాయి. హరిలో రంగ హరీ అంటూ నెత్తిపై నుంచి నాసిక వరకు తిరుమణి పెట్టుకొని ఘల్లుఘల్లు మంటూ చిందులు వేస్తూ, చిడతలు వాయిస్తూ హరిదాసు ప్రత్యక్షమవుతారు. అయితే ప్రస్తుతం హరిదాసుల సంస్కృతి బాగా తగ్గిపోయి కొన్నిచోట్ల మాత్రమే కనిపిస్తున్నారు. నగరాల్లో కంటే పల్లెల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండగ ఎంతో ప్రత్యేకం. ఎక్కడున్నా తొలి పండగకు భార్యతో అత్తవారింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఇప్పటికే వారు అత్తారింటికి సందడి చేస్తున్నారు. బోడిగాడితోటలో ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని బోడిగాడితోట(హిందూ శ్మశాన వాటిక)లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పితృ దేవతలకు సంతర్పణ చేసే కార్యక్రమం నగరంలో భారీ స్థాయిలో జరగనుంది. ఇప్పటికే నగర వాసులు పలువురు తమ ఆత్మీయుల సమాధులను ప్రత్యేకంగా అలకరించారు. గురువారం ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నారు.


