బుజ్జిగాడు సినిమాలో యాక్ట్ చేసిన సంజనా గల్రానీ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. మధ్యలో డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడంతో తన ఇమేజ్ డ్యామేజ్ అయింది. తనకు ఆ కేసులో క్లీన్‌చిట్ వచ్చినప్పటికీ తన ఆత్మగౌరవం దెబ్బతిందని బాధపడింది. ఆ మరకు పోగొట్టుకునేందుకు బిగ్‌బాస్ షోను ఎంచుకుంది. తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌లో అడుగుపెట్టింది.
బిగ్‌బాస్ షోలో..
చిలిపితనం, ముక్కుసూటితనంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుడ్డు దొంగతనంతో సీజన్‌పై బజ్ క్రియేట్ చేసిన ఆమె ఏకంగా ఫైనల్స్‌లో అడుగుపెట్టడం విశేషం. ఈ షో కోసం తన ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసింది. ఆరేండ్ల కుమారుడు అలరిక్‌ను, ఏడాది కూడా నిండని పాపను భర్తకు అప్పజెప్పి బిగ్‌బాస్ షోలో పాల్గొంది. లోలోపల ఎంత కుమిలిపోయినా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేది.
సంజనా కూతురికి భోగి పండ్లు
తాజాగా ఓ సంక్రాంతి ఈవెంట్‌లో సంజనా కూతురికి దువ్వాడ మాధురి, శ్రీముఖి, రోహిణి భోగి పండ్లు పోశారు. అందులో సంజనా పాప ఎంతో క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది. ఆ చిన్నారి ముందు పుస్తకం, స్టెతస్కోప్, మేకప్ వంటి సామాను పెడితే.. మేకప్ సామానునే పట్టుకుంది. అంటే తల్లి దారిలో నడవనున్నట్లు సిగ్నల్స్ ఇచ్చిందన్నమాట! ఈ సందర్భంగా సంజనా భావోద్వేగానికి లోనైంది.
అదే నా సక్సెస్
'చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లు అనిపిస్తోంది. ఇప్పటికీ ఇదంతా కలా? నిజమా? అర్థం కావడం లేదు. ఇంత చిన్న పాపను పెట్టుకుని బిగ్‌బాస్‌కు వెళ్లడమేంటి? ప్రతిరోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తూ నిద్రపోయేదాన్ని. టాప్ 5వరకు వెళ్లాను. ఇప్పుడు మీ అందరితో ఇక్కడున్నాను.. ఇదే నా విజయం' అని సంజనా చెప్పుకొచ్చింది.
చదవండి: ప్రభాస్‌కు కలిసిరాని ఆర్ అక్షరం


