ప్రభాస్‌కు అచ్చిరాని R అక్షరం.. మరోసారి రుజువైందా? | Movies Starting with R Letter Not Working For Prabhas | Sakshi
Sakshi News home page

Prabhas: డార్లింగ్‌కు R అక్షరం కలిసిరావట్లేదా?

Jan 11 2026 5:41 PM | Updated on Jan 11 2026 5:48 PM

Movies Starting with R Letter Not Working For Prabhas

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్‌ సినిమాలున్నాయి. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్లకు సైతం కొదవ లేదు. అయితే తన అపజయాల లిస్టు చూస్తే అందులో R అక్షరంతో మొదలైన సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభాస్‌కు R అక్షరం కలిసిరావడం లేదన్న వాదన మొదలైంది. ఈ భయంతోనే కాబోలు రాజాసాబ్‌ సినిమా టైటిల్‌ ముందు The అనేది యాడ్‌ చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్‌ కొనసాగినట్లే కనిపిస్తోంది...

R అక్షరం వల్లే..
ప్రభాస్‌ తొలిసారి హారర్‌ జానర్‌లో నటించిన మూవీ ది రాజాసాబ్‌. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. సినిమా టైటిల్‌ రాజాసాబ్‌ ఆర్‌ అక్షరంతో మొదలుకావడం వల్లే ఇంత వ్యతిరేకత వస్తోందని కొందరంటున్నారు. ఈ సెంటిమెంట్‌ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రాఘవేంద్ర సమయంలో మొదలైంది. 

నెగెటివ్‌ టాక్‌
ప్రభాస్‌ నటించిన సెకండ్‌ మూవీయే రాఘవేంద్ర. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రెబల్‌ సినిమా చేశాడు. రాఘవ లారెన్స్‌తో కలిసి చేసిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2022లో రాధే శ్యామ్‌ అని భారీ బడ్జెట్‌ సినిమా చేశాడు. ఇందులో ప్రభాస్‌ పెదనాన్న కృష్టంరాజు చివరిసారిగా యాక్ట్‌ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.

సాహసం చేస్తాడా?
ఇలా ఆర్‌ లెటర్‌తో చేసిన నాలుగు సినిమాలు తనకస్సలు కలిసిరాలేదు. ఈసారి 'ది రాజాసాబ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆర్‌ సెంటిమెంట్‌ ప్రభాస్‌ను వెంటాడినట్లే కనిపిస్తోంది. మరి మున్ముందు ప్రభాస్‌ R అక్షరంతో సినిమాలు చేస్తాడా? ఈ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటాడా? లేదా లైట్‌ తీసుకుంటాడా? అన్నది చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement