ఆగస్టులో భోగి | Sharwanand first look from Bhogi out | Sakshi
Sakshi News home page

ఆగస్టులో భోగి

Feb 26 2026 12:45 AM | Updated on Feb 26 2026 12:45 AM

Sharwanand first look from Bhogi out

ఆగస్టులో ‘భోగి’ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీ ‘భోగి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960 కాలంలో మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే సినిమా ఇది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్‌లో స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌ నేతృత్వంలో రెండు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. కాగా, బుధవారం ‘భోగి’ సినిమా నుంచి శర్వానంద్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, ఈ సినిమాను ఆగస్టు 28న రిలీజ్‌ చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ సినిమా కోసం శర్వానంద్‌ సరికొత్తగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement