కొన్ని పదాలు మింగుతాను.. అవేంటో వాళ్లకు అర్థం కావట్లేదు | Actor Sree Vishnu About His Dubbing Problems In OTT | Sakshi
Sakshi News home page

Sree Vishnu: శ్రీవిష్ణు సినిమాలకు ఓటీటీల్లో ఊహించని ప్రాబ్లమ్

Feb 26 2026 7:34 AM | Updated on Feb 26 2026 8:53 AM

Actor Sree Vishnu About His Dubbing Problems In OTT

తెలుగు మిడ్ రేంజ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు. కామెడీ సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాడు. గతేడాది 'సింగిల్'తో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు వారం గ్యాప్‌లో రెండు చిత్రాలతో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఇందులో తొలుత 'విష్ణువిన్యాసం'.. ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ల సందర్భంగా తన మూవీస్ ఓటీటీల్లో ఎలాంటి ఫన్నీ సమస్యని ఎదుర్కొంటున్నాయో చెప్పి నవ్వించాడు.

(ఇదీ చదవండి: విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే)

'నా సినిమా ఓటీటీలో వేరే భాషల్లో డబ్ చేసేటప్పుడు డబ్బింగ్ చెప్పేవాళ్లకు ఇబ్బంది అవుతోంది. ఎందుకంటే నేను మధ్యమధ్యలో కొన్ని పదాలు మింగుతాను. అవేంటో వాటిని ఎలా మార్చాలో వాళ్లకు అర్థం కావట్లేదు' అని శ్రీ విష్ణు చెప్పాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీ విష్ణు గత కొన్ని చిత్రాలు చూస్తే అతడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. బూతుల్లా అనిపించే కొన్ని పదాలని మధ్యలో ఆపేస్తాడు. యూత్ ఆడియెన్స్‌కి చాలామందికి అర్థం కావొచ్చేమో గానీ మిగతా వాళ్లకు అవేంటనేది తెలియకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే శ్రీవిష్ణు ఇలా డైలాగ్స్‌ చెప్పే సీన్స్ మంచి ఫన్ జనరేట్ కూడా అవుతుంది. అయితే తన వాయిస్, డైలాగ్స్ వల్ల ఓటీటీ డబ్బింగ్‌లోనూ సమస్య వస్తుందని బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: తిరుమల దర్శన వివాదం.. క్లారిటీ ఇచ్చిన తెలుగు హీరోయిన్)

Advertisement
 
Advertisement
Advertisement