ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్న 'బిగ్‪‌బాస్ 8' విజేత నిఖిల్ | Bigg Boss 8 Nikhil Maliyakkal New House Warming Ceremony | Sakshi
Sakshi News home page

Nikhil Maliyakkal: సీరియల్ నటుడు కొత్త ఇంట్లోకి.. ఫొటోలు వైరల్

Feb 26 2026 8:02 AM | Updated on Feb 26 2026 8:56 AM

Bigg Boss 8 Nikhil Maliyakkal New House Warming Ceremony

తెలుగులో సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ మళియక్కల్.. బిగ్‌బాస్ 8వ సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. తర్వాత పలు షోల్లో కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్‌గా అయితే లేడు. ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ చెప్పేశాడు. ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్నానని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. చాలా ఫొటోలు షేర్ చేశాడు.

(ఇదీ చదవండి: కొన్ని పదాలు మింగుతాను.. అవేంటో వాళ్లకు అర్థం కావట్లేదు)

కర్ణాటకలోని మైసూర్‌కి చెందిన నిఖిల్ మళియక్కల్.. 'మనయే మంత్రాలయ' అనే కన్నడ సీరియల్‌తో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. గోరింటాకు సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. కలిసివుంటే కలదు సుఖం, స్రవంతి తదితర ధారావాహికలు చేశాడు. ఊర్వశివో రాక్షసివో ధారావాహికతో మరింత పాపులర్ అయ్యాడు. అలానే సీరియల్స్ చేసిన ఛానెల్‌లోనే ప్రసారమైన బిగ్‌బాస్ 8వ సీజన్ విజేతగా నిలిచాడు. అనంతరం పలు గేమ్ షోలు, ఈవెంట్స్‌లో పాల్గొని ఆకట్టుకున్నాడు.

ఇకపోతే 'గోరింటాకు' సీరియల్‌లో తనతో కలిసి నటించిన కావ్యశ్రీతోనే నిఖిల్ ప్రేమలో ఉన్నాడనే రూమర్స్ వినిపించాయి. కలిసి వీడియోలు చేయడంతో ప్రేమ గురించి అందరూ మాట్లాడుకున్నారు. కానీ బిగ్‌బాస్ షోలోకి వచ్చేముందే మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇప్పుడు సొంతిల్లు కట్టుకుని ఓ ఇంటివాడయ్యాడు. 

(ఇదీ చదవండి: విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే)

Advertisement
 
Advertisement
Advertisement