ప్రస్తుత బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ఇకపోతే గత సీజన్‌లో పాల్గొని ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. బిగ్‌బాస్ షోలో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. తల్లయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
గత సీజన్‌లో పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీతో సోనియా వ్యవహరించింది. అయితే చివరివరకు ఉంటుందనుకుంటే మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. బయటకొచ్చిన వెంటనే ఎంటర్‌ప్రెన్యూర్ యష్‌తో నిశ్చితార్థం చేసుకుంది. గతేడాది ఇదే టైంకి పెళ్లి కూడా చేసుకుంది.
(ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)
పెళ్లయిన కొన్ని నెలల తర్వాత సోనియా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఈ రోజు ఈమెకు ఆడపిల్ల పుట్టింది. పాపకు శిఖా అని పేరు కూడా పెట్టినట్లు సోనియా భర్త యష్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు సోనియాకు విషెస్ చెబుతున్నారు.
అయితే యష్‌కి గతంలోనే పెళ్లయింది. విరాట్ అని ఓ బాబు కూడా ఉన్నాడు. కాకపోతే చాన్నాళ్ల క్రితమే భార్యకు విడాకులిచ్చేశాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. టాలీవుడ్‌లో 'జార్జ్ రెడ్డి', 'కరోనా వైరస్', 'ఆశా ఎన్‌కౌంటర్' చిత్రాల్లో నటించింది.
(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)


