హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం భాజాపా తరఫున ఎంపీగా ఉన్న కంగనా రనౌత్.. ఈ మధ్య పెద్దగా వార్తల్లో కనిపించట్లేదు. లేదంటే ఎప్పుడో ఏదో విషయమై హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. చాన్నాళ్ల తర్వాత ఈమె గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. దానికి కారణం ఓ పెళ్లిలో ఈమె చేసిన డ్యాన్స్. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)
గత కొన్నాళ్లు నుంచి చూసుకుంటే కంగన పేరు చెప్పగానే ఫైర్ బ్రాండ్ అనే మాటనే గుర్తొస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలు చేసింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపైన విరుచుకుపడింది. అవార్డ్ ఫంక్షన్స్‌లో, డ్యాన్సులు చేయడం లాంటి వాటికి ఈమె పూర్తిగా వ్యతిరేకి. అలాంటిది ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సహచర ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె పెళ్లిలో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
స్టేజీపై ఎంపీ నవీన్ జిందాల్‌తోపాటు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్‌సీపీకి ఎంపీ సుప్రియా సులేతో పాటు వేదికగా కంగన కూడా హుషారుగా స్టెప్పులేసింది. అయితే ఈ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూడు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే చోట కలిసి స్టెప్పులేయడమే దీనికి కారణం.
(ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)
Supriya Sule and Mahua Moitra dancing along with Kangana Ranaut at BJP MP Naveen Jindal’s daughter’s wedding
This video is for all those supporters who risk their careers and lives for such leaders 🙌 pic.twitter.com/JsgnoVhDs2— Veena Jain (@Vtxt21) December 7, 2025


