ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్‌ జర్నీ | Meet Lt Col C Dwarakesh, Indias First Blind Active Duty Army Officer, Know About His Success Story In Telugu | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్‌ జర్నీ

Dec 8 2025 5:31 PM | Updated on Dec 8 2025 6:00 PM

 Meet Lt Col C Dwarakesh Indias first blind active duty army officer and his success

ఒక ప్రమాదంలో కంటి చూపు పూర్తిగా  పోయింది. కానీ మనోధైర్యాన్ని ఏమాత్రం కోల్పో లేదు. విధికెదురొడ్డి తన జీవితాన్ని తానే అత్యంత దృఢంగా నిర్మించుకున్నారో సాహసి. పట్టుదల, దృఢ సంకల్పానికి తోడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో భారతదేశంలోని  తొలి పూర్తి అంధుడైన అధికారిగా నిలిచారు. సైన్యంలో క్రియాశీల విధుల్లో పనిచేస్తున్నలెఫ్టినెంట్ కల్నల్  సి. ద్వారకేశ్ విజయగాథ ఏంటో తెలుసుకుందాం.

లెఫ్టినెంట్ కల్నల్ సి ద్వారకేశ్ ప్రయాణం ప్రతికూలతకు లొంగని అసాధారణ సంకల్పానికి నిదర్శనం. 2014లో పని సంబంధిత ప్రమాదంలో కంటి చూపు కోల్పోయారు.  దీంతో సైనికుడిగా అతడి జీవితం అక్కడితో ముగిసిపోతుందని చాలామంది భావించారు. కానీ అతను మాతరం ఫీనిక్స్‌లా తన చరిత్రను తిరగరాసి  చరిత్ర సృష్టించాడు , పూర్తిగా  కంటి చూపు కోల్పోయినప్పటికీ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నాడు. అత్యాధునిక AI సాధనాలు, ఇతర సాంకేతికత మద్దతుతో, ద్వారకేశ్ తన దృష్టిగల సహచరుల మాదిరిగానే నైపుణ్యంతో తన బాధ్యతలను  విజయవంతంగా నిర్వర్తిస్తారు.

సియాచిన్ హిమానీనదం ఎక్కడం నుండి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడం, ఈత, షూటింగ్ , విద్యావేత్తలలో ఒకడిగా రాణించడం వరకు  ప్రతీ సవాలును విజయంగా మార్చుకున్న వైనం స్ఫూర్తి దాయకం.   న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి  దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వికలాంగుల జాతీయ అవార్డును అందుకున్నారు. దేశానికి ఆయన చేసిన అసమానమైన కృషికి గుర్తింపుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగన్ విభాగంలో బుధవారం (డిసెంబర్ 3, 2025) ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల దినోత్సవం రోజున వికలాంగుల జాతీయ అవార్డు ను లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేశ్‌కు ప్రదానం చేశారు. రుజువు చేస్తుంది.

ద్వారకేశ్‌ ఏమన్నారంటే..    
విద్యా ,సాంకేతికత ద్వారానే  నా  వైకల్యాన్ని అధిగమించగలిగాను. అనేక పోటీ పరీక్షలను విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాను. నేను ఇప్పుడు పారా క్రీడలపై, ముఖ్యంగా అంధ క్రీడలపై పూర్తి పరిశోధన చేయగలనని గర్వంగా చెప్పగలను.  వైకల్యాన్ని  శక్తిగా మార్చుకున్నాను. సాధారణ స్థితికి తిరిగి రావడానికి మార్గాలను కనుగొన్నాను.’’అన్నారు. 2009లో,సైన్యంలో అధికారిని అయ్యాను, భారత రాష్ట్రపతిచే కమిషన్ పొందాను. ఇపుడురాష్ట్రపతి నుండి ఈరోజు అవార్డుతో ధన్యుడినయ్యాను అన్నారు.

ఎవరీ ద్వారకేశ్‌
ద్వారకేశ్‌ తమిళనాడుకు చెందినవారు.  పాఠశాల రోజుల నుండి ఆర్మీలో  చేరాలనేది అతని కల.  అలా NCCలో చేరారు. 2004లో తమిళనాడు NCC డైరెక్టరేట్ ఉత్తమ NCC క్యాడెట్‌గా ఎంపిక చేసింది. UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)కి కూడా అర్హత సాధించారు. 

పట్టుదలే జీవితం
 భారత సైన్యం  సాంకేతిక ప్రవేశం క్యాడెట్ శిక్షణ విభాగం (CTW)లో చేరాడు. ఆ తర్వాత అతను 2009లో ఆర్మీ యొక్క కార్ప్స్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ను ఎంచుకున్నారు. 2014లో పూణేలో జరిగిన ప్రమాదంలో గాయం కారణంగా రెండు కళ్ళలో పూర్తిగా కంటి చూపు కోల్పోయారు. తన కెరీర్ ప్రారంభంలో ప్రమాదం అతని కళ్ళను కోల్పోయిన తర్వాత, 36 ఏళ్ల  ద్వారకేశ్‌ 2023లో జాతీయ షూటింగ్ పోటీలో స్వర్ణ పతకం గెల్చుకున్నారు.   తాను కంటి చూపును కోల్పోయాను, జీవిత దృష్టిని కాదున్న ఆత్మవిశ్వాసం ద్వారకేశ్‌ది. 

క్రీడా ప్రయాణం  ప్రారంభం
2018లో ఖడ్కీలో నియమితులైన ద్వారకేష్‌ బాంబే ఇంజనీరింగ్ గ్రూప్సెంటర్‌లో కొత్తగా స్థాపించబడిన పారాలింపిక్ నోడ్‌లో పారా-స్పోర్ట్స్‌ను అభ్యసించడం ప్రారంభించారు. 2021లో ఉదయపూర్‌లో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలుచు కున్నారు. గాయం తర్వాత అది అతని తొలి పతకం. ఈ గెలుపు  మనోధైర్యాన్ని పెంచే పంచ్ ఇచ్చింది. అప్పటినుంచి పతకాల వేట మొదలైంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాక్టీస్ సెషన్‌లు మరియు పోటీలలో మెరుగైన  నైపుణ్యం ప్రదర్శించారు. అక్టోబర్ 2025లో యుఎఇలో జరిగిన షూటింగ్ ప్రపంచ కప్‌లో ఆయన ఇటీవల సాధించిన 624.6 ప్రపంచ రికార్డు స్కోరు పట్టుదలకు  నిదర్శనం. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) కూడా అర్హత సాధించారు.

ప్రస్తుతం భారత పారా షూటింగ్ జట్టులో భాగం. అలాగే మధ్యప్రదేశ్‌లోని మహౌలోని ఆర్మీ మార్క్స్‌మ్యాన్‌షిప్ యూనిట్‌లో అధునాతన శిక్షణ పొందుతున్నారు. పారాలింపిక్స్‌లో అసాధారణ విజయాన్ని సాధించడం ద్వారా దేశానికి , కార్ప్స్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు అనేక పురస్కారాలను తెచ్చిపెట్టడం విశేషం.

ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement