నూనూగు మీసాల విద్యార్థి దశలోనే ఉండగానే 18 ఏళ్ల వయసులో ఒక సంస్థకు సీఈఓ కాగలనని ఎవరైనా కలగంటారా? కానీ ఒకబ్బాయి కన్నాడు. పెద్ద సాహసమే చేశాడు. అభిరుచి, అభ్యాసం పట్టుదల ఉంటే ఏదైనా సాధించి తీరవచ్చని నిరూపించాడొక యువకుడు. కలలు కంటూ కూర్చోవడం కాదు, వాటిని సాకారం చేసుకోవడంలోనే ఉంటుంది కిక్కు. సూర్య వర్షన్‌ను చూస్తే అచ్చం ఇలాగే అనిపిస్తుంది. పదండి ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
తమిళనాడులోని తూత్తుకుడిలో ఒక చిన్న వంటింటి నుంచి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఆవిస్కృతమైన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. సూర్య వర్షన్ అద్భుతమైన నేకెడ్ నేచర్ (Naked Nature)ను స్థాపించాడు. కంపెనీ సీఈవోగా స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ బ్రాండ్ పరిశ్రమలో విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు.
ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన తూత్తుకుడి పట్టణంలో సూర్యకు చిన్నప్పటి నుంచి ఉప్పును ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. మరీ ముఖ్యంగా గాయాలకు ఉప్పు కాపడం పెట్టడం చూసి ఆశ్చర్యపోయేవాడు. అసలు ఉప్పులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. దానిగురించి స్టడీ చేశాడు. తద్వారా మెగ్నీషియం, కాల్షియం ఉప్పులో ఎక్కువగా ఉంటాయని, అవి కండరాల నొప్పులను తగ్గిస్తాయని లుసుకున్నాడు. అయితే ఉప్పుతో పాటు ఏదైనా పదార్థాన్నికలిపి మెడిసిన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. రసాయనాలు కలపకుండా సహజ ఉత్పత్తులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గతల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ రూ.200 తో,600 చదరపు అడుగుల ఇంటిలో మందారం పువ్వు, బార్లీ, వేపాకుతో కలిపి బాత్ సాల్ట్ ను తయారు చేశాడు. దానికి హైబిస్కస్ బాత్ సాల్ట్ అని పేరుపెట్టాడు. దీని ధర రూ. 320. 12వ తరగతిలో సూర్య వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమై 2019లో ఒక చిన్న ఫ్యాక్టరీ సెటప్‌కు మారింది. దాదాపు అన్ని పనులూ సింగిల్ హ్యాండ్‌తోనే నడిపించాడు. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ అవే ఈరోజు సూర్యను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి.
చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!
సేంద్రీయ, చేతితో తయారు చేసిన ఉత్పత్తులు, పైగా దేశీ-ఆవు నెయ్యిని ఉపయోగించడంతో ముగ్ధుడైన ఆయుర్వేద వైద్యుడు బల్క్ ఆర్డర్ ఇవ్వడంతో సూర్య వ్యాపారం కీలక మలుపు మలుపు తిరిగింది. ఈ విజయంతో సూర్య తన చదువులను మధురైకి మార్చుకుని పూర్తిగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు. యూట్యూబ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. వాటిని ఆన్‌లైన్‌లో బోధించి రూ. 2.2 లక్షలు సంపాదించాడు. దీన్ని తిరిగి నేకెడ్ నేచర్‌లో స్కేల్ ఆపరేషన్‌లకు పెట్టుబడి పెట్టాడు.
ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?
ప్రస్తుతం నేకెడ్ నేచర్ చర్మ ,జుట్టు సంరక్షణ, బాత్ బేబీ కేర్ వర్గాలలో, 70 ఉత్పత్తులనుపైగా సహజ ఉత్పత్తులను అందిస్తుంది. 2021-22 నాటికి రూ. 10 కోట్ల విలువను చేరుకుంది. కంపెనీ ఆఫీసు 4ఏవేల చదరపు అడుగులకు మారింది. ఈ బ్రాండ్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 2023లో గ్లోబల్ స్టూడెంట్ ఆంట్రపెన్యూర్ అవార్డు దక్కించుకున్నాడు.


