డీఎంకే సర్కార్‌ అవినీతిమయం: ప్రధాని మోదీ | PM Narendra Modi targets DMK over corruption | Sakshi
Sakshi News home page

డీఎంకే సర్కార్‌ అవినీతిమయం: ప్రధాని మోదీ

Mar 2 2026 4:56 AM | Updated on Mar 2 2026 5:57 AM

PM Narendra Modi targets DMK over corruption

పేదలు, రైతులు, యువతను దోచుకుంది: మోదీ

సాక్షి, చెన్నై/పుదుచ్చేరి: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. డీఎంకే మంత్రులు అవినీతిలో పరస్పరం పోటీపడుతున్నారని విమర్శించారు. డీఎంకే సర్కారు అవినీతికి పాల్పడడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలు, రైతులు, యువతను దోచుకుందని ధ్వజమెత్తారు. ఈ అవినీతి ప్రభుత్వానికి ఇకపై అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని తేలి్చచెప్పారు. 

ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం మదురైలో బహిరంగ సభలో ప్రసంగించారు. అవినీతి, అసమర్థ పాలనతో తమిళనాడు ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కచ్చతీవులను శ్రీలంకకు అప్పగించి తమిళనాడుపై కక్ష తీర్చుకుందన్నారు. తమకు అధికారం అప్పగిస్తే తమిళనాడును అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఎంఎంకే వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌ సభలో పాల్గొన్నారు.

పుదుచ్చేరిని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్‌  
పుదుచ్చేరిని గతంలో ఢిల్లీలోని ఒక కుటుంబానికి ఏటీఎంగా కాంగ్రెస్‌ మార్చేసిందని మోదీ నిప్పులు చెరిగారు. ఆదివారం అక్కడ రూ.2,714 కోట్ల ప్రాజెక్టులకు ఆయన ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తర్వాత సభలో మాట్లాడారు. పుదుచ్చేరి అభివృద్ధికి ఆ కాంగ్రెస్, డీఎంకే స్పీడ్‌ బ్రేకర్‌గా మారాన్నారు. బీజేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ డబుల్‌ ఇంజిన్‌ పాలనలో పుదుచ్చేరి ప్రగతి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ ఆదివారం తమిళనాడులో తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ దోతీ, కుర్తా ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణచేశారు. పూజల్లో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement