జయహో.. బాలికా.. | Rocket design led by Space Kidz India | Sakshi
Sakshi News home page

జయహో.. బాలికా..

Mar 2 2026 2:24 AM | Updated on Mar 2 2026 2:24 AM

Rocket design led by Space Kidz India

స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా నేతృత్వంలో రాకెట్‌ రూపకల్పన 

చెన్నై తీరంలో ప్రయోగం విజయవంతం

సాక్షి, చెన్నై: జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా నేతృత్వంలో చెన్నై తీరంలో బాలికలు రూపకల్పన చేసిన రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. చెన్నైలోని ఉత్తండి బీచ్‌ వేదికగా ఆదివారం ఉదయం బాలికలు సిద్ధం చేసిన ’సాలిడ్‌ రాకెట్‌’, స్వదేశీ సాంకేతికతతో తయారైన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ‘ఎలక్ట్రిక్‌ రాకెట్‌’లను విజయవంతంగా ప్రయోగించారు. పాఠశాల విద్యార్థినులు డిజైన్‌ చేసిన ఈ రాకెట్‌ 2 మీటర్ల ఎత్తు, 110 మిమీ వ్యాసం కలిగి 10 కిలోల బరువుతో ఉంది.  

ఈ రాకెట్‌ ప్రయోగం సుమారు ఒక కిలోమీటరు ఎత్తుకు దూసుకెళ్లింది. ఈ సందర్భంగా స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా వ్యవస్థాపకురాలు డాక్టర్‌  శ్రీమతి కేసన్‌ మాట్లాడుతూ తమ బాలికలు రాకెట్లను నిరి్మస్తూ భారతదేశాన్ని స్వావలంబన వైపు నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ రంగాల్లో మహిళా శక్తిని 
ఈ ప్రయోగం చాటిచెప్పిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement