విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్‌ ఔటింగ్‌ | Chennai Beach Outing in Turns Fatal for Maharashtra Intern | Sakshi
Sakshi News home page

విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్‌ ఔటింగ్‌

Feb 23 2026 3:06 PM | Updated on Feb 23 2026 4:57 PM

Chennai Beach Outing in Turns Fatal for Maharashtra Intern

స్నేహితులతో బీచ్‌లో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి విధి తీవ్ర విషాదం మిగిల్చింది. శనివారం చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌  ప్రాణాలు కోల్పోయింది. మరొకరు ఆచూకీ ఇంకా దొరకలేదు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. 

మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వారిలో 22 ఏళ్ల మయూరి హరిశ్చంద్ర చౌదరిగా ప్రాణాలు కోల్పోయింది. 24 ఏళ్ల మరొకరు కనిపించకుండా పోయారు.మూడో వ్యక్తిని జాలర్లు రక్షించారు. ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సిరుసేరి క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్  చేస్తున్న ట్రైనీలు  26 మంది  శనివారం సెలవు కావడంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (పుదుచ్చేరి రోడ్) వెంబడి ఉన్న బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. అధిక ఆటుపోట్ల కారణంగా  ప్రశాంతంగా ఉన్న సముద్రంలో దాదాపు 10 -15 అడుగుల ఎత్తులో అలలు రావడంతో  ముగ్గురు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరి ఆచూకీ తెలియరాలేదు. మహారాష్ట్రకు చెందిన పదిహేను మంది ఇంటర్న్‌షిప్ కోసం  చేరిన  వారిలో వీరు ముగ్గురు కూడా ఉన్నారు.

మృతురాలిని భండారా జిల్లాలోని మోహది తాలూకాలోని వర్తి గ్రామానికి చెందిన మయూరి హరిశ్చంద్ర చౌదరిగా గుర్తించారు. జల్గావ్ జిల్లాలోని జామ్నేర్‌కు చెందిన జై పాటిల్ ఆచూకీ కనిపించడం లేదు.  ఒడ్డుకు దూరంగా నిలబడి ఉన్న పూణేకు చెందిన రాజ్ కేదారి చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కసారిగా అల విరుచుకుపడటంతో ముగ్గురం కొట్టుకు పోయామని, ఈత కొడుతూ మయూరిని బయటకు లాగగలిగాను కానీ జైని కనుగొనలేకపోయాను అని కేదారివిచారం వ్యక్తం చేశాడు. మయూరి చౌదరిని ఇంజంబక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని గుర్తుచేసుకున్నాడు.

సంఘటన జరిగిన వెంటనే కనత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది గాలింపు, రక్షణ చర్యను ప్రారంభించారు.జై పాటిల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ప్రకటనలో తెలిపింది. జై పాటిల్ బంధువులు ,మయూరి చౌదరి కుటుంబ సభ్యులు చెన్నై చేరుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement